
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనాదేవి అస్వస్థత చెందినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం. రెగ్యూలర్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు వారి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. కానీ, సోషల్ మీడియాలో ఈ విషయం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారంటూ నెట్టింట పలు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఆమె హెల్త్ చెకప్ కోసం మాత్రమే వెళ్లారని కొందరు చెబుతున్నా.. వారి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, దీంతో చిరంజీవి అభిమానులు మాత్రం అంజనాదేవి క్షేమంగా ఉన్నారంటూ.. కేవలం హెల్త్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వెళ్లారని తెలుపుతున్నారు.
చిరంజీవి ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. తన సతీమణి సురేఖతో కలిసి పెళ్లిరోజు జరుపుకున్నారు. ఫ్టైట్‌లో దుబాయ్ వెళ్తూ.. ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. వారితో పాటు అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment