వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తోన్న 'రావెన్'! | Ajay Karthik, Anchana To Star In Raven Movie, Shooting Starts In Chennai - Sakshi
Sakshi News home page

Raven Movie: నేటి యువ తరానికి చెందిన కథా చిత్రంగా 'రావెన్'!

Published Wed, Aug 23 2023 4:22 PM | Last Updated on Wed, Aug 23 2023 5:22 PM

Revan Movie Shooting Starts In Chennai With Ajay Karthik and anjana - Sakshi

అజయ్‌ కార్తీక్‌, అంజనా జంటగా నటిస్తోన్న చిత్రం 'రావెన్'. ఈ చిత్రం ద్వారా దర్శకుడు గణేష్‌ కె బాబు శిష్యుడు కళ్యాణ్‌ కె జగన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీని ఎంజీ స్టూడియోస్‌ అధినేత ఏపీవీ.మారన్‌తో కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్‌ ధాను ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. 
 
వినూత్న కథాంశంతో కొత్త తరానికి చెందిన కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్త షూటింగ్‌ చైన్నె పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.  ఈ చిత్రంలో దర్శకుడు భాగ్యరాజ్‌, ఈటీవీ గణేష్‌, వీర, హిందూమతి, పి.అరుణాచలేశ్వరన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి శక్తి చాయాగ్రహణం, మనం రమీశన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

కాగా.. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌, ఫైవ్‌ స్టార్‌ కదిరేసన్‌, ఫైవ్‌ స్టార్‌ సెంథిల్‌, రాక్‌ ఫోర్ట్‌ ఎంటర్‌టైన్మెంట్‌ మురుగానందం, అరుణ్‌ విశ్వ, డిస్ట్రిబ్యూటర్‌ కోవై అరవింద్‌, పోర్‌ తొళిల్‌ చిత్ర దర్శకుడు విగ్నేష్‌ రాజా, యాత్తిశై చిత్ర దర్శకుడు ధరణి రాజేంద్రన్‌, గుడ్‌ నైట్‌ చిత్ర దర్శకుడు వినాయక్‌ చంద్రశేఖరన్‌ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement