జపాన్‌లో అడ్రస్ మిస్సయ్యా | Anjana Address missed in Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌లో అడ్రస్ మిస్సయ్యా

Published Tue, Jan 13 2015 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

జపాన్‌లో అడ్రస్ మిస్సయ్యా

జపాన్‌లో అడ్రస్ మిస్సయ్యా

 జపాన్‌లో షాపింగ్‌కు వెళ్లి అడ్రస్ పేపర్‌ను మిస్సయ్యానని చెప్పింది అంజనా. ఈమె జుంబో -3డి చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇం తకుముందు అంబులి -3డి, ఆ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక ద్వయం హరి - హరీష్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం జుంబో-3డి, జి.హరి, జపాన్‌కుచెందిన ఎంఎస్‌జి మూవీస్ సంస్థ అధినేత బకిడ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోకుల్ హీరోగా నటిస్తున్నారు. అంజనా మాట్లాడుతూ, 3డి ఫార్మెట్‌లో తెరకెక్కుతున్న జుంబో చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం అంది.
 
 చిత్ర షూటింగ్ 90శాతం జపాన్‌లో సాగిందని చెప్పింది. డైలాగ్‌లేని ఒక సన్నివేశంలో ఎలాంటి కదలికలు లేకుండా నటించానని అది చాలా ఆసక్తిగా ఉంటుందని తెలిపింది. బేబి హన్సిక చాలా ముఖ్య పాత్రలో నటించిందని చెప్పిం ది. టోక్యో, టోయామలాంటి అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికి అదనపు ఆకర్షణగా ఉంటాయని అంది. ఒకరోజు షాపింగ్‌కు వెళుతూ తాము బస చేస్తున్న హోటల్ అడ్రస్‌ను కాగితంపై రాసుకున్నానని అది ఎక్కడో పడిపోవడంతో కంగారు పడ్డానని చెప్పింది.
 
 అప్పుడు ఒక ఆటో డ్రైవర్  తాను గమ్యం చేరడానికి చాలా సాయం చేశారని చెప్పింది. తాను తమిళ అమ్మాయినని తెలియగానే రజనీకాంత్ గురించి అడిగాడని, అలా అతనితో చాలా విషయాలు మాట్లాడానని చెప్పింది. అదే విధంగా ఈ చిత్రం కోసం కొందరు జపాన్ నటీనటులతో కలసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొంది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా జుంబో-3డి చిత్రం అందరినీ అలరిస్తోందని అంజనా అంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement