Address missed
-
GO 317 : మా గోడు వినండి.. మమ్మల్ని బదిలీ చేయండి!
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రజావాణిలో భాగంగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు కలిసారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సర్వీసు కోల్పోవడంతో పాటు 300 కిలోమీటర్లకు పైగా దూరానికి బదిలీ చేయబడ్డామని తెలిపారు. కార్యదర్శులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల కింద ఏం జరిగింది? గత ప్రభుత్వం రెండేళ్ల కింద జీవో 317 తీసుకొచ్చింది. దీని వల్ల పల్లెల్లో విధులు నిర్వర్తిస్తోన్న గ్రామస్థాయి ఉద్యోగులైన పంచాయతీ కార్యదర్శులను ఏకాఏకీన దూరతీరాలకు బదిలీ చేశారు. ట్రాన్స్ఫర్లలో సుమారుగా 250 మంది పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. చట్టం ఏం చెబుతోంది? కొత్త గ్రామపంచాయతీలు.. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఏర్పడ్డాయి. చట్ట ప్రకారం గ్రామాలకు ఎలాంటి గ్రేడ్లు లేవు. అయినా నిబంధనలకు విరుద్ధంగా, చట్టంలోని అసలు ఉద్దేశ్యానికి భిన్నంగా బదిలీలకు గత ప్రభుత్వం దిగిందన్నది కార్యదర్శుల ఆవేదన. పంచాయతీరాజ్ శాఖ ఏం చేసింది? అప్పటి పంచాయతీరాజ్ కమిషనర్ రెండేళ్ల కింద ఒక ప్రోసిడింగ్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15, 2023న వచ్చిన ప్రోసిడింగ్ 2560/CRR&RE/B2/2017 ప్రకారం గ్రేడ్లు లేవని చెప్పారు. కానీ 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీ చేసిన GO 81,84 ప్రకారం క్యాడర్ స్ట్రెంత్‌ను పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరిపారు. గత ప్రభుత్వం పాత నిబంధనలను పట్టించుకోకుండా కేటాయింపు జరపడం వల్ల కార్యదర్శులు స్థానికతను శాశ్వతంగా కోల్పోవలసి వచ్చింది. దీనివల్ల పంచాయతీరాజ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని కార్యదర్శులు తెలిపారు. ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిలో ఏముందంటే? • గద్వాల జోగులాంబ జోన్ , చార్మినార్ జోన్ గ్రేడ్-1 కార్యదర్శులను మల్టీ జోన్ రెండు నుంచి మల్టీ జోన్-1 లోని బాసర జోన్, రాజన్న సిరిసిల్ల జోన్లకు కేటాయించారు. • దీనివల్ల సుమారు 125 మంది పంచాయతీ కార్యదర్శులు ఏకంగా 300 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు బదిలీ అయ్యారు. • రాజన్న సిరిసిల్ల జోన్, కాళేశ్వరం జోన్, బాసర జోన్ లోని గ్రేడ్-1, గ్రేడ్- 2 కార్యదర్శులను భద్రాద్రి జోన్‌కు బదిలీ చేశారు. • కాళేశ్వరం జోన్ లోని గ్రేడ్-2, అలాడే గ్రేడ్-3 కార్యదర్శులు సిరిసిల్ల జోన్ కి బదిలీ అయ్యారు. • దీనివల్ల 125 మంది కుటుంబాలు రెండు మూడు వందల కిలోమీటర్ల దూరంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. • బదిలీ అయిన కొత్త ప్రాంతం సుదూరంలో ఉండడం వల్ల తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందని కార్యదర్శులు వాపోతున్నారు. గత రెండేళ్లుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని ఇబ్బందులకు గురయ్యామని ముఖ్యమంత్రికి తెలిపారు. పంచాయితీ కార్యదర్శి పోస్టు అనేది గ్రామస్థాయి పోస్టు కాబట్టి తమ పట్ల మానవతా దృక్పథంతో సొంత జోనులకు లేదా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఇవి చదవండి: TS: నేటినుంచి జీరో టికెట్ -
తప్పులమయం
ఎల్.రమణ (పేరు మార్పు) నెల్లూరులోని జెడ్పీ కాలనీలో నివాసముంటున్నాడు. ఈ విద్యార్థి దర్గామిట్టలోని రత్నం హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్ వచ్చింది. అందులో నారాయణ హైస్కూల్ నెల్లూరు అని మాత్రమే ఉంది. అడ్రస్ పూర్తిగా లేకపోవడంతో నాలుగు రోజులుగా నగరంలో ఉన్న నారాయణ హైస్కూల్స్ మొత్తం తిరుగుతున్నాడు. ఈ సమస్య కేవలం రమణకే పరిమితం కాలేదు. చాలామంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది. నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పంపిణీ చేసిన హాల్టికెట్లలో తప్పులు దొర్లాయి. ఎస్ఎస్సీ బోర్డు ఇష్టారీతిగా ముద్రించి పంపింది. గురువారం నుంచి పరీక్షలు జరుగనున్నాయి. గతంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పదిరోజుల ముందే హాల్‌టికెట్లు పంపేది. వాటిలో ఏవైనా తప్పిదాలు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం ఉండేది. ఈ ఏడాది విద్యార్థులకు ఆ అవకాశం లేకుండా పో యి ందని ఉపాధ్యాయులు వాపోతున్నా రు. తక్కువ వ్యవధిలో పరిశీలించి సవరించుకోవడం ఏవిధంగా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. హాల్‌టికెట్ల లో తప్పులుంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో అటెస్టేషన్ చేయిస్తే సరిపోతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ విషయం విద్యార్థులకు తెలియకపోవడంతో రోజుల తరబడి విద్యాశా ఖ కా ర్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అధికారులు అందుబాటులో లే క వారు ఇబ్బందులు పడుతున్నారు. అడ్రస్ లేదు జిల్లాలో 33,100 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలామంది హాల్‌టికెట్లపై పరీక్ష కేంద్రం పేరు మాత్రమే ఉంది. ఆ పాఠశాల ఏ ప్రాంతంలో ఉందో అడ్రస్ లేదు. పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థుల చేతిలోపెట్టి మీరే అడ్రస్ వెతుక్కోండని చేతులు దులుపుకున్నాయి. ఫీజు కడితేనే.. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలో ఫీజు బకాయిలున్న విద్యార్థులను యా జమాన్యాలు తీవ్ర ఇబ్బంది పెట్టాయి. బుధవారం పొదలకూరురోడ్డులో ఉన్న ఓ పాఠశాల యాజమాన్యం ఫీజు చెల్లి స్తేనే హాల్‌టికెట్ ఇస్తామని చెబుతోందని డీ ఈఓ కె.శామ్యూల్‌కు ఫిర్యాదు అం దిం ది. దీంతో సంబంధిత పాఠశాలకు ఫోన్ చేసి విద్యార్థులకు వెంటనే హాల్‌టికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. కొందరు తల్లి దండ్రులు చేసేదేమీ లేక అప్పు చేసి ఫీజు చెల్లించి హాల్‌టికెట్లను తీసుకుంటున్నా రు. పాఠశాలల యా జమన్యానికి జి ల్లా విద్యాశాఖలోని పలువురు అధికారుల కు సత్సంబంధాలు ఉండటంతోనే వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధి కారులు మాత్రం హాల్‌టికెట్ ఇవ్వకుంటే విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు. యాప్ ద్వారా తెలుసుకోవచ్చు విద్యార్థులకు ఇచ్చిన హాల్టికెట్లలో ఉండే కోడ్‌ను పరీక్షల యాప్‌లో టైప్ చేస్తే కేంద్రం అడ్రస్ తెలుస్తుంది. హాల్‌టికెట్లు ఇవ్వని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల విషయం మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. – కె.శామ్యూల్,జిల్లా విద్యాశాఖాధికారి -
జపాన్‌లో అడ్రస్ మిస్సయ్యా
జపాన్‌లో షాపింగ్‌కు వెళ్లి అడ్రస్ పేపర్‌ను మిస్సయ్యానని చెప్పింది అంజనా. ఈమె జుంబో -3డి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఇం తకుముందు అంబులి -3డి, ఆ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక ద్వయం హరి - హరీష్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం జుంబో-3డి, జి.హరి, జపాన్‌కుచెందిన ఎంఎస్‌జి మూవీస్ సంస్థ అధినేత బకిడ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోకుల్ హీరోగా నటిస్తున్నారు. అంజనా మాట్లాడుతూ, 3డి ఫార్మెట్లో తెరకెక్కుతున్న జుంబో చిత్రంలో నటించడం సరికొత్త అనుభవం అంది. చిత్ర షూటింగ్ 90శాతం జపాన్‌లో సాగిందని చెప్పింది. డైలాగ్‌లేని ఒక సన్నివేశంలో ఎలాంటి కదలికలు లేకుండా నటించానని అది చాలా ఆసక్తిగా ఉంటుందని తెలిపింది. బేబి హన్సిక చాలా ముఖ్య పాత్రలో నటించిందని చెప్పిం ది. టోక్యో, టోయామలాంటి అందమైన ప్రాంతాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికి అదనపు ఆకర్షణగా ఉంటాయని అంది. ఒకరోజు షాపింగ్‌కు వెళుతూ తాము బస చేస్తున్న హోటల్ అడ్రస్‌ను కాగితంపై రాసుకున్నానని అది ఎక్కడో పడిపోవడంతో కంగారు పడ్డానని చెప్పింది. అప్పుడు ఒక ఆటో డ్రైవర్ తాను గమ్యం చేరడానికి చాలా సాయం చేశారని చెప్పింది. తాను తమిళ అమ్మాయినని తెలియగానే రజనీకాంత్ గురించి అడిగాడని, అలా అతనితో చాలా విషయాలు మాట్లాడానని చెప్పింది. అదే విధంగా ఈ చిత్రం కోసం కొందరు జపాన్ నటీనటులతో కలసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొంది. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా జుంబో-3డి చిత్రం అందరినీ అలరిస్తోందని అంజనా అంటోంది.