
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి 22 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు అధికారులు పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 15వ తేదీన జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్.. జపాన్‌లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. అలాగే, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరే అవకాశం ఉంది.