![Megastar Chiranjeevi Special Wishes To Her Mother Goes Viral - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/01/29/megastar.jpg.webp?itok=ELo4M_Ly)
ఇటీవలే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఆయనను వరించింది. ఈ అవార్డ్‌తో ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అందుకున్న మెగాస్టార్ కీర్తి మరింత పెరిగింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత దక్కించుకున్న నటుడిగా నిలిచారు.
అయితే తాజాగా మెగాస్టార్ మాతృమూర్తి అంజనాదేవి జన్మదినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం అంజనాదేవికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. మెగాస్టార్ నటిస్తోన్న ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారు.
కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.💐💐 pic.twitter.com/MFOttIdoPj
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2024
Comments
Please login to add a commentAdd a comment