
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.
చిరు తన ఇన్‌స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్‌స్టా వేదికగా విషెస్ తెలిపింది.
ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment