anjanamma
-
కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మ ఇంటికి రావొద్దంది: చిరంజీవి సోదరి
పిల్లలు ఇబ్బందుల్లో ఉంటే ఆ తల్లి అల్లాడిపోతుంది. అదే సమయంలో ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పుతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన కూతుర్లకు విలువైన సలహాలు ఇచ్చి వారిని బలంగా నిలబెట్టింది. ఏ కష్టం వచ్చినా సరే ఎవరి మీదా ఆధారపడకూడని, ఆధారపడితే నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్లేనని చెప్పేదట. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela), నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. ఈ సందర్భంగా ఎన్నో విషయాల్ని పంచుకున్నారు.కష్టాల్లో ఉన్నా ఒంటరిగా పోరాడాలందివిజయదుర్గ (Vijaya Durga) మాట్లాడుతూ .. ‘మా అమ్మ ఎప్పుడూ కూడా మమ్మల్ని స్వతంత్ర భావాలతోనే పెంచారు. ఎప్పుడూ ఎవరి మీదా ఆధారపడకూడదు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి.. సొంతంగా ఎదగాలి.. సొంతంగా నిలబడాలి అని చెబుతూ ఉండేవారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఒక్కదానివే పోరాడాలి. ఎవరి దగ్గరా ఉండకూడదు, మా దగ్గర కూడా ఉండొద్దు. నీ ఇద్దరు పిల్లలతో నువ్వే ఉండు అని చెప్పారు. ఎవరి దగ్గరైనా ఉంటే నీ గౌరవం తగ్గిపోతుందనేవారు.అమ్మ ఇచ్చిన ధైర్యం వల్లే..ఇప్పటికీ నాకు మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు ప్రయత్నిస్తాను. ఈ ధైర్యాన్ని నాకు మా అమ్మే ఇచ్చారు’ అని అన్నారు. మాధవి (Madhavi) మాట్లాడుతూ.. ‘నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మా అమ్మ నాకు అండగా నిలబడింది. కొన్ని సందర్భాల్లో నేను ఒంటరిని అయిపోయానే అని బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో మా అమ్మ నా వద్దకు వచ్చి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఎవ్వరు ఏమన్నా.. ఏం జరిగినా.. ఈ అమ్మ నీ వెంటే ఉంటుంది.. నీకు సపోర్ట్‌గా నిలుస్తుంది అని చేయి పట్టుకుని ధైర్యాన్ని ఇచ్చారు’ అని అన్నారు.శ్రీజ విషయంలో ఆమె వల్లే..చిరంజీవి మాట్లాడుతూ.. నా కూతురు శ్రీజ (వైవాహిక) జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు శ్రీజ (Sreeja Konidela) ఏమందంటే.. నేను నానమ్మ దగ్గరకు వెళ్లాను. తనిచ్చిన భరోసాతో నాలో ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. నానమ్మతో ఎప్పుడు కూర్చున్నా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అని నాతో షేర్ చేసుకుంది. అప్పుడు నేను శ్రీజతో ఒకటే చెప్పా.. ఏం పర్లేదమ్మా.. జీవితమంటే ఒక్కరితోనే అయిపోదు. ఆ ఒక్కరు మనల్ని నియంత్రించలేరు. నీ గురించి నువ్వు ఆలోచించుకో.. నీ మనసులో ఏదనిపిస్తే అది చేయు అని సూచించాను అని పేర్కొన్నారు. కాగా శ్రీజ.. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులిచ్చింది.చదవండి: కట్నంగా 40 గోల్డ్ బ్యాంగిల్స్ దానం.. నాకు 3 కిలోల బంగారం..: సింగర్ కల్పననా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి -
అంజనమ్మ బర్త్ డే వేడుక.. మెగాస్టార్ ఎమోషనల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.చిరు తన ఇన్‌స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్‌స్టా వేదికగా విషెస్ తెలిపింది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
చిరంజీవి తల్లికి శ్రీరెడ్డి క్షమాపణలు.. 'బుద్ది గడ్డి తిని అలా తిట్టాను'
Sri Reddy Apologies To chiranjeevi Mother Anjanamma: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో చిరంజీవి తల్లిని దూషిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. బుద్ది గడ్డి తిని తాను చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేసింది. 'ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నా. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నా. అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నా. నేను తప్పుచేశాను.. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి' అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. నన్ను క్షమించండి "అంజనమ్మ" 🙏🙏🙏😭😭 pic.twitter.com/fnBvee9qRt — Sri Reddy (@MsSriReddy) January 22, 2022 -
తాగిన మత్తులో భార్యను కత్తితో పొడిచాడు
తుగ్గలి: తాగిన మత్తులో భార్యను హత్యచేశాడో వ్యక్తి. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన గురుమూర్తి తాగిన మత్తులో భార్య అంజనమ్మ(50)ను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. మద్యానికి బానిసైన గురుమూర్తి తరుచూ భార్యతో గొడవపడేవాడు. బుధవారం పీకలదాకా తాగివచ్చిన అతన్ని భార్య అంజనమ్మ నిలదీసింది. దాంతో కోపోద్రిక్తుడైన గురుమూర్తి కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.