Actress Sri Reddy Sorry To Chiranjeevi Mother Anjana Devi, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sri Reddy: 'తప్పు చేశాను.. పెద్ద మనసుతో క్షమించండి'.. శ్రీరెడ్డి పశ్చాత్తాపం!

Published Sat, Jan 22 2022 4:33 PM | Last Updated on Sat, Jan 22 2022 5:23 PM

Actress Sri Reddy Sorry To Chiranjeevi Mother Anjana Devi, Video Goes Viral - Sakshi

Sri Reddy Apologies To chiranjeevi Mother Anjanamma: టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో చిరంజీవి తల్లిని దూషిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. బుద్ది గడ్డి తిని తాను చేసిన తప్పును పెద్ద మనసు చేసుకొని క్షమించాలని కోరింది. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో రిలీజ్‌ చేసింది.

'ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను.. సోషల్‌ మీడియాలో కూడా చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నా.

అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నా. నేను తప్పుచేశాను.. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి' అంటూ శ్రీరెడ్డి పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement