తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్‌ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నాపు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మెగాస్టార్ మాట్లాడుతూ..'మా అమ్మ అంజనాదేవిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణముంది. ఏఎన్‌ఆర్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్‌లో అమ్మ కూడా ఒకరు. మొగల్తూరులో నిండు గర్భంతో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏఎన్‌ఆర్ సినిమా చూసేందుకు వెళ్లారు. అప్పట్లో సినిమా చూసేందుకు నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్లి చూడాలి. ఆ సినిమా పేరు 'రోజులు మారాయి'.. అప్పట్లో సూపర్ హిట్ సినిమా. దీంతో జట్కా బండిలో సినిమాకు బయలుదేరారు. కానీ అప్పుడే ఓ బస్సు వీరి బండికి ఎదురొచ్చింది. ఆ బస్సుకు దారి ఇచ్చే సమయంలో వీరి ప్రయాణిస్తున్న జట్కా బండి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. అందరూ కిందపడ్డారు. నాన్న ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా సినిమా చూడాల్సిందేనని అమ్మ పట్టుబట్టి మరి వెళ్లింది. ఎలాగైనా సరే ఆ మూవీ చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది' అని అన్నారు.
నాకు డ్యాన్స్‌లో అక్కినేని నాగేశ్వరరావు ఆదర్శమని చిరంజీవి కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి వల్లే మనందరం ఇక్కడ ఉన్నామని తెలిపారు. అక్కినేని కుటుంబంతో నాకున్న అనుబంధం చాలా గొప్పదని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడమనేది నా పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందం కలిగించిందని మెగాస్టార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment