మెగాస్టార్‌కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.. అందజేసిన అమితాబ్ | Megastar Chiranjeevi Honoured With Akkineni National Award given By Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

Akkineni National Award: మెగాస్టార్‌కు అక్కినేని జాతీయ పురస్కారం.. అమితాబ్ చేతుల మీదుగా ప్రదానం

Published Mon, Oct 28 2024 7:22 PM | Last Updated on Mon, Oct 28 2024 7:40 PM

Megastar Chiranjeevi Honoured With Akkineni National Award given By Amitabh Bachchan

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ అగ్రతారలు, దర్శక నిర్మాతలు, నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పాల్గొన్నారు. 

తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నాని, బ్రహ్మనందంతో పాటు పలువురు సినీతారలు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement