Akkineni Award
-
అక్కినేనికి డై హార్డ్ ఫ్యాన్ ఆమెనే: మెగాస్టార్ చిరంజీవి
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నాపు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మెగాస్టార్ మాట్లాడుతూ..'మా అమ్మ అంజనాదేవిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణముంది. ఏఎన్ఆర్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్‌లో అమ్మ కూడా ఒకరు. మొగల్తూరులో నిండు గర్భంతో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏఎన్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లారు. అప్పట్లో సినిమా చూసేందుకు నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్లి చూడాలి. ఆ సినిమా పేరు 'రోజులు మారాయి'.. అప్పట్లో సూపర్ హిట్ సినిమా. దీంతో జట్కా బండిలో సినిమాకు బయలుదేరారు. కానీ అప్పుడే ఓ బస్సు వీరి బండికి ఎదురొచ్చింది. ఆ బస్సుకు దారి ఇచ్చే సమయంలో వీరి ప్రయాణిస్తున్న జట్కా బండి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. అందరూ కిందపడ్డారు. నాన్న ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా సినిమా చూడాల్సిందేనని అమ్మ పట్టుబట్టి మరి వెళ్లింది. ఎలాగైనా సరే ఆ మూవీ చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది' అని అన్నారు. నాకు డ్యాన్స్‌లో అక్కినేని నాగేశ్వరరావు ఆదర్శమని చిరంజీవి కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి వల్లే మనందరం ఇక్కడ ఉన్నామని తెలిపారు. అక్కినేని కుటుంబంతో నాకున్న అనుబంధం చాలా గొప్పదని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడమనేది నా పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందం కలిగించిందని మెగాస్టార్ అన్నారు. -
మెగాస్టార్‌కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.. అందజేసిన అమితాబ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ అగ్రతారలు, దర్శక నిర్మాతలు, నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పాల్గొన్నారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నాని, బ్రహ్మనందంతో పాటు పలువురు సినీతారలు హాజరయ్యారు. -
అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని
పాన్ ఇండియా నటుడు అక్కినేని నటనలో శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని అల నాడే పాన్ ఇండియా నటుడు అయ్యారు అన్నారు పూర్వ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ ఉప కులపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య కొలకలూరి ఇనాక్.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్టొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో అమెరికా లోని డల్లాస్ నగరం లోని ప్రిస్కో లో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా,నటసమ్రాట్ ఆక్కి నేని - ఆకృతి జాతీయ పురస్కారం, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాదుకు ప్రదానం చేశారు..ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ దుశ్హాలువాతో, పుష్పగుచ్ఛంతో, ఘనంగా సత్కరించి అక్కినేని ఆకృతి జాతీయ పురస్కారాన్ని తోటకూర ప్రసాద్ కు అందించారు.. చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు మరువలేనివి ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రసంగిస్తూ, అక్కినేని తన పాత్రల ఎంపిక లో ఎంతో పరిణతి చూపెవారన్నారు.. స్వయం కృషి తో ఉన్నత శిఖరాలు చేరుకున్న మహానటుడు ఆయన అన్నారు.. అంతేకాదు చలన చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రలలో పరిధవిల్లడానికి ఆయన చేసిన కృషి గణనీయమైనదని అన్నారు.. అక్కినేని పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలు అందిస్తూ అమెరికా లోని తెలుగు సమాజానికి అండగా వుంటు అక్కినేని పేరిట అనేక కార్య క్రమాలు చేస్తున్న డా. తోటకూర ప్రసాద్ కు అందించడం ఎంతో సముచిత నిర్ణయం అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పురస్కార గ్రహీత పురస్కార గ్రహీత తోటకూర ప్రసాద్ తనకు లభించిన ఈ పురస్కారం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. తన బలం ఏమిటో, తన బలహీనతలు ఏమిటో నిర్మొహమాటంగా చెప్పేవారని అన్నారు.. ఆయన పాత్రల ఔచిత్యాన్ని సోదాహరణంగా వివరించారు.. విశిష్ట అతిథిగా డా.ఆళ్ళ శ్రీనివాసరెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్న అమెరికా లోని ప్రముఖ కార్డియాజిస్ట్ డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని ఆకృతి అమెరికా లో నిర్వహించడం ఎంతో విశేషం అన్నారు.. అక్కినేని ఫౌండేషన్ బోర్డు సభ్యులు రావు కలవల అక్కినేని తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు.. వి. రాంభూపాల్ రావు, ఇంద్ర కరణ్, డా. వర్ష, మోహన్, రవీందర్, మున్నగు వారు ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలు గా వ్యవహరించారు.. ఈ సందర్భంగా అమెరికా లో తెలుగు గాయకులు చంద్రహాస్, ప్రభాకర్ కోట, లక్ష్మీ భారతి అక్కినేనీ చిత్ర గీతాల విభావరి జనరంజకంగా నిర్వహించారు.. -
గిరిబాబుకు అక్కినేని పురస్కారం ప్రదానం
హైదరాబాద్ : అట్టడుగు స్థాయి నుంచి అత్యన్నత స్థానానికి చేరుకున్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఆదర్శప్రాయమైందని వక్తలు కొనియాడారు. యువ కళావాహిని, గురుప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీ త్యాగరాయ గానసభలో గురుప్రసాద్ కల్చరల్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఫెస్టివల్లో తొలిరోజు సభకు ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ డా.కె.రోశయ్య మాట్లాడారు. అలనాటి మహోన్నత నటులను స్మరించుకోవటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబును అక్కినేని పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభకు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించగా దర్శకుడు రేలంగి నరసింహారావు, రచయిత్రి డా.కె.వి.కృష్ణకుమారి, నిర్మాత ఎన్.ఆర్.అనూరాధాదేవి, వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గాయనీ గాయకులు ఆమని, కె.వెంకట్రావు, వి.కె.దుర్గ, సుభాష్, మురళీధర్, పవన్‌కుమార్, కె.దుర్గాప్రసాద్ సినీ గీతాలు మధురంగా ఆలపించారు. -
అక్కినేని జాతీయ పురస్కార వేడుక
-
తెలుగు వస్తేనే ఉద్యోగంలోకి రావాలి!
-
చావుకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఆయన
-
చావుకు వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఆయన: రాజమౌళి
సాక్షి, హైదరాబాద్: అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందని, ఈ అవార్డు అందుకోవడం తన బాధ్యత మరింత పెంచిందని ప్రఖ్యాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ఆదివారం హైదరాబాద్ శిల్ప కళావేదికలో అక్కినేని జాతీయ పురస్కార వేడుక జరిగింది. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కినేని కుమారులు వెంకట్, నాగార్జున తదితరులు హాజరైన వేడుకలో అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి ప్రసంగించారు. '2002 వరకూ నా జోలికి రావద్దు’ అని చావుకు వార్నింగ్ ఇచ్చి మరీ అక్కినేని నాగేశ్వరరావు బతికారని గుర్తుచేశారు. ఆయన మనో బలంతో చావును దూరంగా ఉంచారని అన్నారు. చివరకు దేవుడు వచ్చి కేవలం శారీరకంగానే ఆయనను మన నుంచి దూరం చేశారు, కానీ, అక్కినేని కుటుంబం ఆయన ఆత్మను మనతోనే ఉండేలా చేసిందని అన్నారు. 'నేను రమ్మన్నప్పుడే నా దగ్గరకు రా'అని చావుతో మాట్లాడిన వ్యక్తులు మహాభారతంలో భీష్మాచార్యులు, ఈ కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు మాత్రమేనని కొనియాడారు. అంతటి మహానుభావుడి పేరుమీదున్న అవార్డును ఈ రోజు తనకు ఇస్తున్నారని, ఈ అవార్డుతో తన భుజ స్కందాలపై పెద్ద భారాన్ని పెట్టారని, ఆ అవార్డుకు మరింత గౌరవం తెచ్చేందుకు తన శాయశక్తులా కష్టపడతానని అన్నారు. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఆదర్శప్రాయమని, ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచారని అన్నారు. -
తెలుగు వస్తేనే ఉద్యోగంలోకి రావాలి!
కేసీఆర్ భాషాభిమాని తెలుగు భాష తప్పనిసరి అభినందనీయం అక్కినేని పురస్కారం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: అక్కినేని పురస్కారం రాజమౌళికి బరువు కాదు బాధ్యత అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అక్కినేని జాతీయ పురస్కారం ఆలోచన మరింత మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. సినీ దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని ఏడు అద్భుతాలను మహాద్భుతంగా చూపించేది సినిమా అని, అక్కినేని జాతీయ పురస్కారం రాజమౌళికి ఇవ్వడం సముచితమని అన్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఈరోజు అపూర్వమైన రోజు అని కొనియాడారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోందని, నాటి రాజా హరిశ్చంద్ర నుంచి నేటి బాహుబలి వరకు ఎంతో గుణాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పారు. గతానికి, వర్తమానానికి వారధిగా నిలుస్తున్న భారతీయ సినిమా ఘనత మాటల్లో చెప్పలేనిదన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషను తప్పనిసరి చేయడం అభినందనీయమని అన్నారు. తెలుగు భాషకు ప్రాణం పోసేది సాహిత్యం, సంగీతం, సినిమా అని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సహం లేకపోతే భాష బతకదన్నారు. రాష్ట్రాలు మాతృభాషను ప్రోత్సహించాలని సూచించారు. తెలుగు వస్తేనే ఉద్యోగంలోకి రావాలనే నిబంధన పెట్టాలని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ భాషాభిమాని అని వెంకయ్యనాయుడు కొనియాడారు. మాతృభాష కళ్లలాంటిదదని, పరాయి భాష కళ్లద్దాల్లాంటిదని చమత్కరించారు. భారతీయ సినిమాలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అనుమతులిచ్చామని, మల్టీఫ్లెక్స్ సంస్కృతి సినిమా తీరు తెన్నులను మారుస్తోందని చెప్పారు. సినిమా నిత్య జీవితంలో భాగమైపోయిందన్నారు. ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టేలా ఉన్నాయని, సినిమాటోగ్రఫి చట్టానికి విరుద్ధంగా సినిమాల రూపకల్పన జరుగుతోందని, ప్రస్తుతం కొన్ని సినిమాల్లోని కథ, కథనాలు ప్రశ్నార్థకరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంపై పెనుప్రభావం చూపే సినిమా ప్రజాహితంగా ఉండాలని, సినిమాలు వినోదం కోసమే కాదు చైతన్యం కోసం నిర్మించాలని వెంకయ్య దర్శకనిర్మాతలకు సూచించారు. -
ఫిదా’కి అక్కినేని అవార్డు
వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రానికి ఈ ఏడాది ‘అక్కినేని–వంశీ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు’ అందించనున్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకుడు, అవార్డు కమిటీ చైర్మన్ డా. వంశీ రామరాజు మాట్లాడుతూ– ‘‘వంశీ ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డు ఇస్తున్నాం. ఈ ఏడాది విశేషంగా ప్రేక్షకాదరణ పొంది, విజయవంతంగా ఆడుతున్న ‘ఫిదా’ సినిమాను అవార్డుకు ఎంపిక చేశాం. అలాగే ఉత్తమ దర్శకునిగా ‘ఫిదా’ చిత్రానికి శేఖర్ కమ్ములను, అత్యంత ప్రజాదరణ పొందిన ‘వచ్చిండే’ (ఫిదా) పాటకు ఉత్తమ గేయ రచయితగా సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేశాం. తెలంగాణ టూరిజం సహకారంతో ఈ నెల 19న త్యాగరాయ గానసభలో జరిగే అక్కినేని 94వ జయంతి సభలో ఈ అవార్డులను బహూకరించి, ‘ఫిదా’ యూనిట్‌ని సత్కరిస్తాం’’ అన్నారు. -
నటుడు చలపతిరావుకు అక్కినేని అవార్డు
వివేక్‌నగర్: తెలుగు చలనచిత్ర రంగంలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక శైలిని చాటుకున్న చలపతిరావు స్వయం కృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన మనసున్న మంచి మనిషి అని రచయిత్రి డా.నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం త్యాగరాయ గానసభలో జరిగిన అక్కినేని గీతామృత వర్షిణి, అక్కినేని విశిష్ఠ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాలుగు తరాల నటులతో నటించే అరుదైన అవకాశం చలపతి రావుకు దక్కిందన్నారు. ఆయన క్రమశిక్షణ నేటి యువ నటులకు ఆదర్శమన్నారు. డా.ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ స్వర్గీయ ఎన్.టి.ఆర్కు అత్యంత సన్నిహితులైన చలపతిరావు విలన్‌గా, కారెక్టర్ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. అనంతరం చలపతిరావును అక్కినేని విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డా.కె.వి.కృష్ణకుమారి, జె.నారాయణ రావు, డా.విజయలక్ష్మి, రవికుమార్, యస్.యన్.సుధారాణి, పురస్కార గ్రహీత చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
అమితాబ్‌కు అక్కినేని పురస్కారం అందజేసిన కేసీఆర్
హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డు నగదు అయిదు లక్షల రూపాయలతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సినీపరిశ్రమకు కావలసినవన్నీ సమకూరుస్తామని చెప్పారు. సినీపరిశ్రమకు సంబంధించి సినీప్రముఖులతో త్వరలో చర్చిస్తానన్నారు. సినీపరిశ్రమ ఇక్కడ నుంచి ఎక్కడికీ తరలిపోదని చెప్పారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితోపాటు పలువురు రాజకీయ, సినిమారంగ ప్రముఖులు హాజరయ్యారు. భారత చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు 2005 నుంచి అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రస్తుతం టి. సుబ్బరామిరెడ్డి ఈ పౌండేషన్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రారంభించినప్పటి నుంచి ఈ అవార్డును అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగానే అందజేశారు. అక్కినేని మరణానంతరం తొలిసారిగా ఈ రోజు ఈ పురస్కారం అందజేశారు. -
రంగస్థల దర్శకుడు గంటాకు అక్కినేని అవార్డు
పాలకొల్లు, న్యూస్‌లైన్ : ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో అక్కినేని నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో క్రియేటర్స్ పాలకొల్లు వారు ప్రదర్శించిన ‘తప్పుటడుగులు’ నాటికకు దర్శకత్వం వహించి న గంటా రామమోహనరావు అవార్డు అందుకున్నారు. ఉత్తమ సాంకేతిక దర్శకుడు అవార్డును ఆయన అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం గంటా రామమోహనరావు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం 90వ పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కినేనికి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొల్లులో వేసిన నాటకాలు, అక్కడి కళాపోషకుల దాతృత్వం ఎప్పటికీ మరువలేనని అక్కినేని తన వద్ద ప్రస్తావించారని చెప్పారు. ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్, ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) తదితరులు గంటాను అభినందించారు.