ఫిదా’కి అక్కినేని అవార్డు | 'Akkineni-Vamsi International Film Award' was selected for 'Fida' | Sakshi
Sakshi News home page

ఫిదా’కి అక్కినేని అవార్డు

Published Thu, Sep 7 2017 12:05 AM | Last Updated on Sun, Sep 17 2017 6:29 PM

ఫిదా’కి అక్కినేని అవార్డు

ఫిదా’కి అక్కినేని అవార్డు

వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రానికి ఈ ఏడాది ‘అక్కినేని–వంశీ ఇంటర్నేషనల్‌ ఫిలిం అవార్డు’ అందించనున్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకుడు, అవార్డు కమిటీ చైర్మన్‌ డా. వంశీ రామరాజు మాట్లాడుతూ– ‘‘వంశీ ఆర్ట్‌ థియేటర్స్‌ 45వ వార్షికోత్సవం సందర్భంగా నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డు ఇస్తున్నాం.

ఈ ఏడాది విశేషంగా ప్రేక్షకాదరణ పొంది, విజయవంతంగా ఆడుతున్న ‘ఫిదా’ సినిమాను అవార్డుకు ఎంపిక చేశాం. అలాగే ఉత్తమ దర్శకునిగా ‘ఫిదా’ చిత్రానికి శేఖర్‌ కమ్ములను, అత్యంత ప్రజాదరణ పొందిన ‘వచ్చిండే’ (ఫిదా) పాటకు ఉత్తమ గేయ రచయితగా సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేశాం. తెలంగాణ టూరిజం సహకారంతో ఈ నెల 19న త్యాగరాయ గానసభలో జరిగే అక్కినేని 94వ జయంతి సభలో ఈ అవార్డులను బహూకరించి, ‘ఫిదా’ యూనిట్‌ని సత్కరిస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement