Varuntez
-
పాటతో ముగింపు!
జస్ట్... మూడంటే మూడే రోజులు షూటింగ్ జరిపితే వరుణ్ తేజ్ ప్రేమకథ కంప్లీట్ అవుతుందట. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలి ప్రేమ’. ఇందులో రాశీ ఖన్నా కథానాయిక. ‘‘షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. వైజాగ్‌లో జరుపబోయే మూడు రోజుల సాంగ్ షూట్‌తో మూవీ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను సార్ట్ చేశాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో బందేవ్ పాత్రలో రానా నటిస్తున్న సినిమా ‘హాథీ మేరే సాథీ’. ఇందులో వరుణ్ తేజ్ కూడా కీలక పాత్ర చేయనున్నారట. ‘‘హాథీ మేరే సాథీ’లో రానా, వరుణ్ తేజ్ పాత్రలకు ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కోట శ్రీనివాసరావుగారు ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి తమిళ్లో డబ్ చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు సాల్మన్. అంతేకాదు.. ఈ నెల 25 నుంచి మార్చి వరకు ఈ సినిమా షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఆ తర్వాత కేరళలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. -
డే డ్రీమర్... నైట్ థింకర్!
‘‘ఐయామ్ ఏ డే డ్రీమర్ అండ్ నైట్ థింకర్’’ అని సినిమాలో తన క్యారెక్టరైజేషన్ గురించి హింట్ ఇచ్చారు హీరో వరుణ్‌తేజ్. అయితే ఆయన కల కన్నది ఎవరికోసమో? నిద్రపోకుండా అంతలా ఎవరి గురించి థింక్ చేశారన్న సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను మాత్రం స్రీన్పైనే చూడాలంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘తొలిప్రేమ’. రాశీఖన్నా కథానాయిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గత నెల్లో స్టార్ట్ చేసిన లండన్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. లండన్‌లో మైనస్ 12 డిగ్రీల చలిలో కూడా టీమ్ షూటింగ్ చేశారు. ‘‘లండన్‌లో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది. షూట్‌ను బాగా ఎంజాయ్ చేశాం’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. ఒక యాక్టర్‌గా, పర్సనల్‌గా నన్ను ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేస్తున్నా. అమేజింగ్ షూట్ టైమ్’’ అన్నారు రాశీఖన్నా. అన్నట్లు... ఈ సినిమాలో వరుణ్‌తేజ్ సిక్స్‌ప్యాక్‌తో కనిపించబోతున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. -
లండన్‌లో తొలిప్రేమ
పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’లో క్లైమాక్స్ సీన్ గుర్తుందా? హార్వర్డ్ యూనివర్శిటీకి వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కే ముందు హీరోకి ‘ఐ లవ్యూ’ చెప్తుంది హీరోయిన్. అప్పటివరకూ కథంతా ఇండియాలోనే జరుగుతుంది. సిన్మా కూడా! ఇప్పుడు బాబాయ్ టైటిల్‌తో అబ్బాయ్ చేస్తున్న కథ మాత్రం సరిహద్దులు దాటింది. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘తొలిప్రేమ’. ఇందులో సెకండాఫ్‌లో కీలక సన్నివేశాలన్నీ లండన్‌లో జరుగుతాయట. వాటి చిత్రీకరణ కోసం లండన్ వెళ్లడానికి టీమంతా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. సుమారు 30 రోజులు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, వరుణ్, రాశీలపై రెండు పాటలు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి స్వరకర్త. -
ఫిదా’కి అక్కినేని అవార్డు
వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రానికి ఈ ఏడాది ‘అక్కినేని–వంశీ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు’ అందించనున్నారు. వంశీ సంస్థల వ్యవస్థాపకుడు, అవార్డు కమిటీ చైర్మన్ డా. వంశీ రామరాజు మాట్లాడుతూ– ‘‘వంశీ ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతిని పురస్కరించుకుని ఈ అవార్డు ఇస్తున్నాం. ఈ ఏడాది విశేషంగా ప్రేక్షకాదరణ పొంది, విజయవంతంగా ఆడుతున్న ‘ఫిదా’ సినిమాను అవార్డుకు ఎంపిక చేశాం. అలాగే ఉత్తమ దర్శకునిగా ‘ఫిదా’ చిత్రానికి శేఖర్ కమ్ములను, అత్యంత ప్రజాదరణ పొందిన ‘వచ్చిండే’ (ఫిదా) పాటకు ఉత్తమ గేయ రచయితగా సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేశాం. తెలంగాణ టూరిజం సహకారంతో ఈ నెల 19న త్యాగరాయ గానసభలో జరిగే అక్కినేని 94వ జయంతి సభలో ఈ అవార్డులను బహూకరించి, ‘ఫిదా’ యూనిట్‌ని సత్కరిస్తాం’’ అన్నారు. -
బాహుబలి తర్వాత ఫిదాకే అలా జరిగింది
– ‘దిల్’ రాజు ‘‘పంపిణీదారుడిగా ఇరవై ఏళ్లు, నిర్మాతగా పధ్నాలుగేళ్ల నా ప్రయాణంలో ఏడో వారంలోనూ థియేటర్లు హౌస్‌ఫుల్ కావడమనేది ఈ మధ్య కాలంలో ‘బాహుబలి’ తర్వాత మా సినిమా విషయంలోనే అలా జరిగింది’’ అన్నారు ‘దిల్’ రాజు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన సినిమా ‘ఫిదా’. ఈ శుక్రవారానికి (ఈ నెల 8) సినిమా విడుదలై 50 రోజులు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో 50 రోజుల సంబరాలను నిర్వహించారు.‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శేఖర్ కమ్ముల హాలిడేకి, నెక్ట్స్ సినిమా కోసం వరుణ్‌తేజ్ లండన్‌కి వెళ్తున్నారు. అందుకనే, ముందుగా ఈ రోజే 50 రోజుల వేడుక నిర్వహిస్తున్నాం. చిన్న సినిమాగా విడుదలైన ‘ఫిదా’కు ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘ఇటీవల సిన్మాలు మూడు వారాలు ఆడుతున్నాయి. ఈలోపు డబ్బులు వచ్చేస్తుండడంతో థియేటర్లలోంచి తీసేస్తుంటారు. ఈ విషయంలో ‘ఫిదా’ మినహాయింపు సంపాదించుకుంది. ఈ విజయానికి అందరి కృషే కారణం. ఇంతమంచి సినిమాను మాతో చేసినందుకు శేఖర్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘గట్టిగా అనుకుంటే జరుగుతుందని చాలామంది అటుంటారు. ‘ఫిదా’ గురించి మేము అలానే అనుకుని ఉంటాం. ‘హ్యాపీడేస్’ తర్వాత ఆ స్థాయి స్పందన రావడం సంతోషం. ఈ మేజిక్‌ని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడానికి మా వంతుగా ప్రయత్నిస్తాం. నాకు మద్దతిచ్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఇప్పుడు నేనెక్కడికి వెళ్లినా భానుమతి అనే పిలుస్తున్నారు. ఇంత ప్రేమను పంచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు సాయిపల్లవి. చిత్రనిర్మాతల్లో ఒకరైన శిరీష్, నటి గీతా భాస్కర్, నేపథ్య సంగీతం అందించిన జీవన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
నాకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు!
వచ్చింది... మెల్లగా తెలుగు తెరపైకొచ్చింది... ముఖంపై ముత్యమంత మొటిమలతో వచ్చింది...కుర్రాళ్లను గమ్మున కూర్చోనీయడం లేదు.. నిల్చోనీయడం లేదు...ముద్ద నోటికి పోకుండా మస్తుగా డిస్ట్రబ్ చేసింది... అందానికి కొత్త నిర్వచనం ఇచ్చింది...తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన తమిళ సాయిపల్లవితో ఇంటర్వ్యూ... ♦ ‘గట్టిగా అనుకో.. జరుగుద్ది’ అని ‘ఫిదా’లో ఓ డైలాగ్ ఉంది. రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా అలా అనుకున్నారా? మనమా? ఎంబీబీఎస్ అనుకున్నా. చదువుతానా? లేదా? అనే భయం ఉండేది. కానీ, అయ్యింది కదా! మనం మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది. దేవుడిపై మనకు సహనం, నమ్మకం ఉండాలంతే. ‘ఢీ’ షో అప్పుడు ఇద్దరు ముగ్గురు తెలుగు దర్శకులు అడిగారు. అప్పుడు ‘యస్’ చెబితే... ఇప్పుడు ఇంత పేరొస్తుందా? లేదా? తెలీదు. ♦ ఓ చేతిలో ఎంబీబీఎస్ డిగ్రీ... మరో చేతిలో హీరోయిన్గా మంచి పేరు... నెక్ట్స్ స్టెప్ ఏంటి? ఎంబీబీఎస్‌కి, చదువుకి వయసుతో సంబంధం లేదు. కానీ, నటనకు వయసుతో సంబంధం ఉంది. ప్రేక్షకులు నన్ను ఆదరించినంత వరకూ నటిస్తా. తర్వాత చదువు కంటిన్యూ చేస్తా. యాక్చువల్లీ... కార్డియాలజీ చేయాలని నా కోరిక. టైమ్ చూసుకుని చేస్తా. ♦ ఎంబీబీఎస్ చదివేశారు. మరి, మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారా? చేయాలి. కానీ, మెడిసిన్ అంత ఈజీ కాదు. మళ్లీ మళ్లీ చదువుతూనే ఉండాలి. మనిషితో ఆటలు ఆడకూడదు. నాకు డిగ్రీ ఉందని ఏదేదో చేయకూడదు. డాక్టర్ అవ్వాలనుకుంటే మళ్లీ ఓ ఏడాది నటనను పక్కన పెట్టి... పుస్తకాలన్నీ తిరగేస్తా. వేరొకరి ప్రాణంతో ఆటలు ఆడకూడదు కదా. ♦ రియల్ లైఫ్‌లో సాయిపల్లవి ఎలా ఉంటారు? ఇప్పుడు ఎలా ఉన్నానో.. అలాగే ఉంటాను. మేకప్, గట్రా ఏం ఉండవు. నేను మేకప్ వేసుకుంటే వేరే అమ్మాయిలా ఉంటాను. ఐయామ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్... నా దర్శకులందరూ మేకప్ లేకుండా నటించమన్నారు. దీనివల్ల అమ్మాయిలకు ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. మా చెల్లి నాకంటే ఐదేళ్లు చిన్నది. కాలేజ్‌కి వెళ్తుంది. తనే కాదు... అమ్మాయిలందరికీ ఓ కాంప్లెక్స్ ఉంటుంది. అబ్బాయిలు ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్?’ అని చెప్పాలంటే... చక్కగా మేకప్ వేసుకుని, ఐలైనర్స్ పెట్టుకోవాలనుకుంటారు. ‘ప్రేమమ్’ (మలయాళ సినిమా) వచ్చిన తర్వాత పింపుల్స్ (మొటిమలు) ఉన్న అమ్మాయి కూడా చాలా అందంగా, కాన్ఫిడెంట్‌గా ఉంటుందన్నారు. అందరూ అందంగా ఉంటారు. చూసే కళ్లని బట్టి ఉంటుంది. ♦ మీలోనూ ‘ప్రేమమ్’ తర్వాతే ఈ కాన్ఫిడెన్స్ వచ్చిందా? యస్. నేనూ మామూలు అమ్మాయినే కదా! అందరిలానే ఆలోచించా. నేను చూసిన సినిమాలన్నిటిలో హీరోయిన్స్ అందరూ చాలా బాగున్నారు. ముఖంపై ఓ మచ్చ లేదు. దేవతల్లా కనిపించారు. నేను బాగున్నానా? లేదా? అని ఇన్‌సెక్యురిటీ ఉండేది. బట్, క్యారెక్టరే ఇంపార్టెంట్ కదా. రియల్ లైఫ్‌లో అందరూ ప్రెట్టీ. ఆల్ లేడీస్ ఆర్ వెరీ వెరీ ప్రెట్టీ. అందరూ ఈ మాటే చెప్పాలి. మేకప్ వేసుకున్న హీరోయిన్లూ ‘నేను మేకప్ లేకుండానే బాగున్నా’ అని ఫీలవుతారు. ‘ఫిదా’లో మేకప్ లేకుండా ఆ అమ్మాయి బాగుంది.. నేనూ మేకప్ లేకుండా బాగుంటానని ఏ అమ్మాయి అయినా అనుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ♦ ‘ఫిదా’లో ఓ సీన్లో మోడ్రన్ డ్రస్సులో కనిపించారు. రియల్ లైఫ్‌లో? అందులో నేనంత కంఫర్టబుల్‌గా లేను. కానీ, శేఖర్ కమ్ములగారి కోసం చేశా. మోడ్రన్ డ్రస్సుల్లోనే కాదు, సల్వార్స్లోనూ ఓ అమ్మాయిను ఎలా చూపించాలో అలానే చూపించాలి. గ్లామరస్‌గా చూపిస్తే వేరేలా ఆలోచిస్తారు. నాకది వద్దు. ప్రతి రోజూ అమ్మాయిలు కాన్ఫిడెంట్‌గా వేసుకెళ్లే డ్రస్సులనే వేసుకుంటా. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు మోడ్రన్ డ్రస్సులు వేసుకుంటే అబ్బాయిలు అడ్వాంటేజ్ తీసుకో కూడదు. దాన్ని బ్యాడ్‌గా చూడకూడదు. అందరికీ మనమదే నేర్పించాలి. ♦ తెలుగు ‘ప్రేమమ్’ ప్రచార చిత్రాలు చూసి టీచర్ పాత్రకు మీ అంత సూట్ కాలేదని శ్రుతీహాసన్‌ను కొందరు కామెంట్ చేశారు... శ్రుతి ఓ క్యారెక్టర్ చేశారు. ఆమె ఎలా నటించిందో చూడక ముందు, జస్ట్ ట్రైలర్స్ చూసి కామెంట్స్ చేయడం తప్పు. సోషల్ మీడియాలో కామెంట్స్‌ను అందరూ చూస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు. జస్ట్ థింక్... కామెంట్ చేసిన అబ్బాయిని ఓ వంద మంది కామెంట్ చేస్తే ఎంత బాధపడతాడు. మంచి విషయం చెప్పాలనుకుంటే... అందరికీ చెప్పండి. మీకు నచ్చలేదని కామెంట్ చేయడం, అందరికీ చెప్పడం ఎందుకు? ఆమెపై వచ్చిన కామెంట్స్ చూసి నేను చాలా బాధపడ్డా. ‘ఫిదా’కు విడుదలకు ముందు ట్రైలర్ చూసి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు సోషల్ మీడియాలో ‘తెలుగులో ఎంతోమంది అమ్మాయిలుంటే... ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు? మన పక్కింటి అమ్మాయిలానే ఉంది కదా!’ అన్నారు. సినిమా చూసి, నా నటనకు ‘ఫిదా’ అయ్యామన్నారు. ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది. ♦ భానుమతిగారూ... మీ నటనకు ఇంత పేరొస్తుందని ఊహించారా? (నవ్వుతూ). ‘ఫిదా’ విడుదల తర్వాత సాయి పల్లవీ అని కాకుండా నన్ను భానుమతీ అంటుంటే హ్యాపీగా ఉంది. నా బెస్ట్ ఇస్తే, హార్డ్‌వర్క్ చేస్తే మంచి పేరొస్తుందనుకున్నా. కానీ, ఇంత పేరొస్తుందని ఊహించలేదు. ఈ సక్సెస్ నాకింకా సింక్ కాలేదు. ♦ సాయిపల్లవి వల్లే సినిమా హిట్టయ్యిందని కొందరంటున్నారు... వరుణ్‌ది, నాది, రాజు (‘దిల్’ రాజు)గారిది, శేఖర్ కమ్ముల గారిది, ఇంకో రెండుమూడు ముఖాలే ప్రేక్షకులు చూస్తారు. కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు, కాస్ట్యూమర్స్, మిగతా టీమంతా కష్టపడ్డారు. అలాగే, నాకు కాఫీ ఇచ్చిన అబ్బాయి కూడా ఇంపార్టెంటే. నేను స్పెషల్‌గా ఫీలయ్యేలా చేశాడు. నేను వాళ్లందరికీ క్రెడిట్ ఇస్తా. ♦ తెలంగాణ భాష–యాసలపై అంత స్పష్టత ఎలా వచ్చింది? ‘భానుమతి స్లాంగ్ ఇలానే ఉండాలి’ అని శేఖర్ కమ్ముల చెప్పినప్పుడు.. నా బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అవుతుందా? అనే డౌటొచ్చింది. కానీ, కన్విన్స్ చేశారు. ఏదైనా డైలాగును స్పష్టంగా పలకకపోయినా.. లిప్ సింక్ లేకున్నా ముఖంలో తెలుస్తుంది. నాకది ఇష్టం లేదు. అందుకే, ప్రతిరోజూ నా డైలాగులను వంద సార్లు చదువుకునేదాన్ని. ఓ ఏడాది పాటు నేను భానుమతిగా మారా. పాత్రలో జీవించా. ఇప్పుడు నటిస్తున్న ‘ఎం.సి.ఎ.’ షూటింగ్ మొదట్లో తెలంగాణ యాస వచ్చేది. ‘ఇప్పుడు మామూలు మనిషినయ్యా (నవ్వులు). ♦ ‘ఫిదా’లో పవన్‌కల్యాణ్ ఫ్యాన్‌గా నటించారు. ఆయన సినిమాలు ఏవైనా చూశారా? ‘గబ్బర్‌సింగ్’ చూశా. అయితే... థియేటర్లో ‘ఫిదా’ చూస్తున్నప్పుడు ఓ డౌట్ వచ్చింది. నా నటనకు చప్పట్లు కొడుతున్నారా? లేదంటే నేను చెప్పిన పవన్‌గారి డైలాగులకు చప్పట్లు కొడుతున్నారా? అని!! ఒక్కో డైలాగ్ చెబుతుంటే థియేటర్ మొత్తం చప్పట్లు, ఈలలు. నెక్ట్స్ ఇంపార్టెంట్ డైలాగ్ ఉంది. అది వినిపిస్తుందో? లేదోనని భయపడ్డా. కాసేపటికి నాకే చప్పట్లు కొడుతున్నారనుకున్నా. ఆడియో వేడుకలోనూ అంతే. ‘నేను పీకే సార్ ఫ్యాన్’ అని శేఖర్ కమ్ములగారు చెప్పగానే... ఫ్యాన్స్ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆపడం లేదు. అప్పుడు ‘నేను డైలాగ్స్ కరెక్టుగా చెప్పానా? పీకే సార్ యాటిట్యూడ్ సరిగ్గా వచ్చిందా? లేదా’ అని ఆలోచించా. ♦ ఏ సీన్‌కి ఎక్కువ కష్టపడ్డారు? ఎక్కువ టేకులు తీసుకున్నారు? నేను ఉదయం నాలుగున్నరకు నిద్రలేస్తా. రాత్రి పదిన్నర తర్వాత ఆటోమేటిక్‌గా నిద్రొస్తుంది. ఇందులో ఓ సీన్‌ను రాత్రి పదిన్నర తర్వాత ప్లాన్ చేశారు. మామూలుగా రెండుమూడు పేజీల డైలాగులు చెప్పేసే నేను, ఆ రోజు రెండు లైన్ల డైలాగ్‌కి మూడు టేకులు తీసుకున్నా. నా వల్ల ప్రతి ఒక్కరూ రెండు మూడు టేకులు చేస్తున్నారు. అప్పుడు ఏడుపొచ్చేసింది. ♦ మరి, నిజంగా కన్నీళ్లు పెట్టుకోవలసిన సీన్స్ ఎలా చేశారు? నాకొక చెల్లి ఉంది. తనకు పెళ్లై వెళ్తే ఎలా ఉంటుందనేది ఊహించుకుని చేశా. ఇప్పుడు తనకు నిజంగా పెళ్లయితే ఏడుపు వస్తుందా? లేదా? అనేది నాకు తెలీదు. ఎందుకంటే... ఆ ఏడుపు ఆల్రెడీ వచ్చేసింది. ♦ సెట్స్‌లో వరుణ్ ఎలా ఉండేవారు.. తన హైట్‌తో ఇబ్బందిపడ్డారా? సైలెంట్. వెరీ ప్రొఫెషనల్. ఎంత ఎక్స్ప్రెషన్ కావాలంటే... అంతే ఇస్తాడు. ఎంత సెటిల్డ్‌గా, న్యాచురల్‌గా చెయ్యొచ్చో అంత సహజంగా చేస్తాడు. నా హైట్ 5.4. వరుణ్ 6.4. మేమిద్దరం ఒక్క ఫ్రేమ్‌లో వస్తామా? లేదా? అని డౌట్ పడ్డా. క్లోజ్‌గా ఉన్నప్పుడు హీల్స్ వేసుకున్నా. మిగతా సీన్లలో హైట్ డిఫరెన్స్ ఉంటే బాగుంటుందని శేఖర్‌గారు నేచురల్‌గా షూట్ చేశారు. ఇందులో వరుణ్ ప్రపోజ్ చేస్తే చెప్పు చూపించారు. రియల్ లైఫ్‌లో.. ఒక్కరికి కూడా చూపించలేదు. చెబితే నమ్ముతారో? లేదో? రియల్ లైఫ్‌లో ఎవరూ సీరియస్‌గా నాకు ప్రపోజ్ చేయలేదు. ‘ప్రేమమ్’ తర్వాత అందులో నటించిన హీరోయిన్లందరూ తెలుగుకు వచ్చారు. మీరు లేటయ్యారు... అక్కడ వచ్చిన ప్రశంసలు చాలు. రీమేక్ చేస్తే... మళ్లీ సేమ్ రెస్పాన్స్, ఫీల్ వస్తుందా? అనేది నాకు తెలీదు. మీరు తెలుగు ‘ప్రేమమ్’ చేస్తారా? అని ఎవరూ నన్ను అడగలేదు. ఇప్పుడు ‘ఫిదా’ను కూడా వేరొక భాషలో రీమేక్ చేస్తానంటే నేను చేయను. మీరు రీమేక్‌లకు వ్యతిరేకమా? కాదు. ఆల్రెడీ మంచి పేరొచ్చింది. మళ్లీ రీమేక్ చేసి, పేరును పోగొట్టుకోవడం ఎందుకనే భయం. సినిమాల్లో లాంగ్ కెరీర్ ఉండడానికి నేను సూపర్ హీరోను కాదు కదా! ఉన్నన్ని రోజులు మంచి సినిమాలు చేయాలి. మంచి పేరు తెచ్చుకుని వెళ్లిపోవాలి. ‘ప్రేమమ్’ కంటే ముందే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి ఓ పాత్రకు శేఖర్‌గారు మిమ్మల్ని అడిగారట? నేనప్పుడు జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తున్నా. ఇండియాలో ఉంటే ఇటువంటి ఆఫర్స్ వల్ల నేనెక్కడ డిస్ట్రబ్ అవుతానోనని జార్జియా పంపించారు. ఎందుకంటే సినిమా కెరీర్ చిన్నది. ముఖ్యంగా అమ్మాయిలకు. అందువల్ల, నేను కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ చేయాలనుకున్నారు. ఎంబీబీస్ ఫైనల్ ఇయర్లో ఆల్ఫోన్స్ (దర్శకుడు) మలయాళ ‘ప్రేమమ్’ చేయమని అడిగారు. అదీ నా సెలవుల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. అందుకే చేశా. ఫైనల్లీ... ‘ఫిదా’కు మీకొచ్చిన అత్యుత్తమ ప్రశంస ఏది? తెలంగాణ భాషను రౌడీయిజమ్‌కు ఎక్కువగా వాడడం వల్ల ఒక ప్రొజెక్టర్ (థియేటర్లో సినిమా వేసేవ్యక్తి) తన పిల్లలు తెలంగాణ మాట్లాడితే తిట్టేవారట. ‘ఫిదా’ చూసిన తర్వాత వాళ్లమ్మాయితో తెలంగాణలో మాట్లాడమన్నారట. మా అసిస్టెంట్ డైరెక్టర్ సూరి ఈ సంగతి చెప్పారు. ఆ ప్రొజెక్టర్ సెలబ్రిటీ కాకున్నా... నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్‌గా ఫీలవుతున్నా. -
‘దిల్’ రాజు రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడు!
‘‘ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు తీయడమే నా సక్సెస్ సీక్రెట్’’ అన్నారు ‘దిల్’ రాజు. వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన సినిమా ‘ఫిదా’. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన ముచ్చట్లు... ⇒ ఓ పెళ్లిలో కలసిన వరుణ్ (హీరో), భానుమతి (హీరోయిన్) తమ కలలను ఎలా నెరవేర్చుకున్నారనేది చిత్రకథ. తెలంగాణ భాన్సువాడ అమ్మాయి, అమెరికాలో సెటిలైన ఆంధ్రా అబ్బాయి నేపథ్యంలో సినిమా సాగుతుంది. అయితే ప్రాంతాలతో ముడిపడిన ప్రేమకథ కాదిది. వేర్వేరు మనస్తత్వాలున్న వీళ్ల మధ్య జరిగే కథ. హీరో సాఫ్ట్ అయితే... హీరోయిన్ రెబల్. ⇒ పవన్‌కల్యాణ్‌కు ‘తొలిప్రేమ’ 4వ సిన్మా. అప్పుడాయనకు ఎలాంటి ఇమేజ్ లేదు. ‘ఆర్య’ టైమ్‌లో బన్నీకి ఎలాంటి ఇమేజ్ లేదు. ఇప్పుడు వరుణ్ సేమ్ పొజిషన్లో ఉన్నాడు. ఓ నలుగురిని కొట్టాలని, హీరోయిజమ్ చూపించాలని అనుకోవడం లేదు. ‘సీతమ్మ వాటిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం మహేశ్‌బాబు, ‘బృందావనం’ కోసం ఎన్టీఆర్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కోసం ప్రభాస్... ఇలా స్టార్స్ తమ ఇమేజ్ పక్కనపెట్టినప్పుడు మంచి సినిమాలొస్తాయి. వరుణ్‌కి ఈ సిన్మా మంచి కమర్షియల్ హిట్ ఇస్తుంది. ⇒ సాయిపల్లవి సెలక్షన్ శేఖర్ కమ్ములదే. మేం సంప్రదించే టైమ్‌కి ఆమె మెడిసిన్ చదువుతోంది. అది పూర్తయ్యే వరకు సినిమాలు చేయనని చెప్పింది. మాకు స్క్రిప్ట్ డెవలప్మెంట్కు ఆర్నెల్లు టైమ్ పట్టింది. అప్పటివరకు ఆమె కోసం వెయిట్ చేశాం. సాయి పల్లవి బాగా నటించడంతో పాటు తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ⇒ శేఖర్ కమ్ముల కథను గొప్పగా రాయడు. సీన్‌ను గొప్పగా తీస్తాడు. ఎప్పట్నుంచో ఆయనతో సినిమా చేయాలనుకుంటున్నా. కానీ, మాకు సెట్ అవుతుందా? లేదా? అనుకునేవాణ్ణి. ‘హ్యాపీడేస్’ రిలీజ్ టైమ్‌లో మా ఆలోచనలు కలిశాయి. ‘లీడర్’ టైమ్‌లో ఈ కథ చెప్పారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఆయన స్టైల్లోనే సినిమా తీయమన్నా. నాగబాబుగారు సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చిరంజీవిగారికి సినిమాను చూపించాలనుకుంటున్నారు. ⇒ రవితేజతో తీస్తున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రీకరణ 30 శాతం పూర్తయింది. అక్టోబర్ 12న చిత్రాన్ని విడుదల చేస్తాం. నాని ‘ఎంసీఏ’ను డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్‌గారితో కలసి నిర్మించనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవుతుంది. రామ్‌చరణ్‌తో సినిమా డిస్కషన్స్‌లో ఉంది. ⇒ ‘డీజే–దువ్వాడ జగన్నాథమ్’ వసూళ్ల వివాదం గురించి ‘దిల్’ రాజును ప్రశ్నించగా... ‘‘బన్నీ (అల్లు అర్జున్) కెరీర్లోనే బెస్ట్ మూవీ ‘సరైనోడు’ రెవెన్యూను ‘డీజే’ క్రాస్ చేసిందంటే ఆ సినిమా హిట్టా? ఫెయిలా? అనేది ఆలోచించుకోవాలి. సినిమాల విషయంలో నేను నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆలోచిస్తా. నా డిస్ట్రిబ్యూటర్స్ లాభనష్టాల గురించి కూడా ఆలోచిస్తా. ‘డీజే’ విషయంలో నిర్మాతగా హ్యాపీ. నేను సక్సెస్ అయ్యాను కాబట్టే సక్సెస్ మీట్ రోజున హ్యాట్రిక్ మూవీ అని ప్రకటించా. నేనో స్టేట్మెంట్ ఇస్తే వేల్యూ ఉంటుంది. వసూళ్లను ఎక్కువ చేసి చూపించే అలవాటు నా జీవితంలో లేదు. భవిష్యత్తులోనూ చేయను. ‘దిల్’ రాజు ఎప్పుడూ రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడు’’ అన్నారు. ⇒ ‘డీజే’ విడుదల తర్వాత నేను అమెరికా వెళ్లడంతో ఇక్కడ (డ్రగ్స్ వ్యవహారం) ఏం జరిగిందో నాకు తెలియదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంతో పోలిస్తే ‘జీఎస్టీ’ వల్ల నిర్మాతలపై పది శాతం భారం పెరిగింది. షేర్ వసూళ్లపై జీఎస్టీ ప్రభావం ఎక్కువ పడుతోంది. దీనిపై తెలుగు ప్రభుత్వాల స్పందన కోసం ఎదురుచూస్తున్నాం.