
‘‘ఐయామ్ ఏ డే డ్రీమర్ అండ్ నైట్ థింకర్’’ అని సినిమాలో తన క్యారెక్టరైజేషన్ గురించి హింట్ ఇచ్చారు హీరో వరుణ్‌తేజ్. అయితే ఆయన కల కన్నది ఎవరికోసమో? నిద్రపోకుండా అంతలా ఎవరి గురించి థింక్ చేశారన్న సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను మాత్రం స్రీన్‌పైనే చూడాలంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరణ్‌తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘తొలిప్రేమ’. రాశీఖన్నా కథానాయిక. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గత నెల్లో స్టార్ట్ చేసిన లండన్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు.
అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. లండన్‌లో మైనస్ 12 డిగ్రీల చలిలో కూడా టీమ్ షూటింగ్ చేశారు. ‘‘లండన్‌లో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది. షూట్‌ను బాగా ఎంజాయ్ చేశాం’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. ఒక యాక్టర్‌గా, పర్సనల్‌గా నన్ను ఇన్‌స్పైర్ చేసిన క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేస్తున్నా. అమేజింగ్ షూట్ టైమ్’’ అన్నారు రాశీఖన్నా. అన్నట్లు... ఈ సినిమాలో వరుణ్‌తేజ్ సిక్స్‌ప్యాక్‌తో కనిపించబోతున్నారన్నది ఫిల్మ్‌నగర్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment