
జస్ట్... మూడంటే మూడే రోజులు షూటింగ్ జరిపితే వరుణ్ తేజ్ ప్రేమకథ కంప్లీట్ అవుతుందట. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలి ప్రేమ’. ఇందులో రాశీ ఖన్నా కథానాయిక. ‘‘షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. వైజాగ్‌లో జరుపబోయే మూడు రోజుల సాంగ్ షూట్‌తో మూవీ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను సార్ట్ చేశాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో బందేవ్ పాత్రలో రానా నటిస్తున్న సినిమా ‘హాథీ మేరే సాథీ’. ఇందులో వరుణ్ తేజ్ కూడా కీలక పాత్ర చేయనున్నారట. ‘‘హాథీ మేరే సాథీ’లో రానా, వరుణ్ తేజ్ పాత్రలకు ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కోట శ్రీనివాసరావుగారు ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి తమిళ్‌లో డబ్ చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు సాల్మన్. అంతేకాదు.. ఈ నెల 25 నుంచి మార్చి వరకు ఈ సినిమా షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఆ తర్వాత కేరళలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment