Tholi prema
-
అందుకే గాండీవధారి అర్జున చేశాను – వరుణ్ తేజ్
‘‘ప్రవీణ్ సత్తారు ‘గాండీవధారి అర్జున’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. ఓ సమస్య గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యత అనిపించింది.. అందుకే ఈ మూవీ చేశాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బాపినీడు .బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోవద్దు.. మంచి ఎమోషన్స్ ఉంటాయి. దేశానికి వచ్చే సమస్య ఏంటి? అనేది చూపించాం’’ అన్నారు. ‘‘వరుణ్ తేజ్‌తో మేం చేసిన మొదటి సినిమా ‘తొలి ప్రేమ’, సాయితేజ్‌తో చేసిన ‘విరూ పాక్ష’ హిట్ అయ్యాయి. ఇప్పడు ‘గాండీవధారి అర్జున’ కూడా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘భూమిపై ఉన్న వనరులను ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి ఆలోచించటం లేదు. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సినిమా తీశాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
హీరో పవన్ కల్యాణ్ కెరీర్లో మైలురాయిగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి. తొంభై దశకంలో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. పవన్ కల్యాణ్‌ను యూత్‌కి బాగా కనెక్ట్ చేసింది ఈ చిత్రం. అమాయకమైన ప్రేమికుడిగా, ప్రియురాలికి తన ప్రేమ విషయం చెప్పేందుకు తాపత్రయపడే యువకుడి పాత్రలో పవన్ నటన అందరినీ కట్టిపడేసింది. హీరోయిన్గా కీర్తి రెడ్డి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్న కీర్తి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది. నటిగా రాణిస్తున్న క్రమంలో సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనేది పెద్దగా ఎవరికి తెలియదు. అయితే తొలిప్రేమ సినిమా వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా కీర్తి రెడ్డి గురించి సినీ ప్రియులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు, ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తొలిప్రేమ తర్వాత తెలుగు, హిందీ, తమిళ్లో పలు చిత్రాలు చేసిన కీర్తి అక్కినేని హీరో సుమంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారి దాంపత్య జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి చేసుకున్న ఏడాదికే విడాకులు తీసుకుని సుమంత్‌తో విడిపోయింది. ఆ తర్వాత కీర్తి సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పింది. అనంతరం ఓ ఎన్ఆర్ఐని రెండో పెళ్లి చేసుకున్న కీర్తి ప్రస్తుతం భర్తతో కలిసి ఆమెరికాలో స్థిరపడింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం హౌజ్ వైఫ్‌గా లైఫ్ లీడ్ చేస్తున్న కీర్తి ఇటీవల ఇండియాలో జరిగిన బంధువుల ఫంక్షన్లో మెరిసింది. ఈ వేడుకలో సమంత స్నేహితురాలు, ఫిట్నెస్ ట్రైనర్ శిల్పారెడ్డితో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో కీర్తిరెడ్డి లేటెస్ట్ ఫొటో బయటకు వచ్చింది. ఇప్పటికే కీర్తి అలాగే ఉందని, పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన కీర్తి అందం ఏమాత్రం తరగలేదంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మళ్లి సినిమాల్లో నటించొచ్చు కదా అంటూ అభిమానులు తమ కోరిక బయటపెడుతున్నారు. View this post on Instagram A post shared by Keerthi Reddy (@actorkeerthireddy) చదవండి: పెళ్లి చేసుకున్న ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే! ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తున్నారు: కిరాక్ ఆర్పీ -
డ్యాన్స్ మజ్ను డ్యాన్స్
పెళ్లికి ముందు సంగీత్‌లో సూపర్‌గా డ్యాన్స్ చేస్తున్నారు అఖిల్. మరి.. ఎవరి పెళ్లి అనేది ఈ నెల 25న థియేటర్స్‌లో తెలుస్తుంది. అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ విదేశాల్లో జరుగుతోందని సమాచారం. ‘‘సంగీత్ సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ మొదలైంది. ఇంకా రెండు రోజులు సాగుతుందీ డ్యాన్స్’’ అని పేర్కొన్నారు అఖిల్. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. -
మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ప్లాన్స్.. !
ఐదు రోజుల ముందే బర్త్‌డే (నవంబర్, 30) విషెస్ చెప్పేస్తున్నాం.. ఇంతకీ బర్త్‌డే ప్లాన్స్ ఏంటి? రాశీ ఖన్నా: ముందుగా విషెస్‌కి థ్యాంక్స్. బర్త్‌డేకి పెద్ద ప్లాన్ ఉంది. ఢిల్లీ, ముంబై, చెన్నై నుంచి ఫ్రెండ్స్ వస్తున్నారు. హైదరాబాద్‌లోనే పార్టీ కాబట్టి ఇక్కడి ఫ్రెండ్స్ ఎలాగూ వస్తారు. సూపర్ ఫన్‌గా ఉండబోతోంది. ‘థీమ్ పార్టీ’ ప్లాన్ చేçస్తున్నాను. అంతకుముందేమో రెడ్ అండ్ వైట్, గతేడాది గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఈసారి... ఇప్పుడే చెప్పను. సర్ప్రైజ్. ఏ కలర్ థీమ్ అనుకుంటే ఆ కలర్ డ్రెస్సులు వేసుకుంటాం. డెకరేషన్ అంతా కూడా ఆ కలర్ థీమ్‌లోనే ఉంటుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై... త్రీ స్టేట్స్లో ఫ్రెండ్స్‌ని కవర్ చేశారా? (నవ్వేస్తూ).. ఢిల్లీ నేను పుట్టి, పెరిగిన ఊరు కాబట్టి అక్కడ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముంబైలో మోడలింగ్ చేశాను. అందుకని అక్కడ కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. తమిళ సినిమాలు చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుగు సినిమాలు చేస్తూ హైదరాబాద్‌లో సెటిల్ అయ్యాను కాబట్టి ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను పార్టీలకు దూరంగా ఉంటాను. సంవత్సరానికి నా అంతట నేను ఇచ్చే పార్టీ అంటే అది నా బర్త్‌డేకే. అందుకే వీలైనంత గ్రాండ్‌గానే పార్టీ చేసుకుంటాను. చిన్నప్పటి బర్త్‌డేస్ గురించి? మా పేరెంట్స్ గ్రాండ్‌గా చేసేవాళ్లు. స్కూల్లో స్వీట్స్ ఇవ్వడం, ఇంటి దగ్గర ఫ్రెండ్స్‌కి పార్టీ ఎరేంజ్ చేయడం.. అన్నీ మంచి జ్ఞాపకాలే. చిన్నప్పుడు అమ్మానాన్న అంత గ్రాండ్‌గా చేసేవాళ్లు కాబట్టే నాకు బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే ఇంట్రస్ట్ పెరిగిందేమో. హీరోయిన్గా ఇది మీకు ఐదో బర్త్‌డే అనుకుంటా. అంతకుముందు చిన్ని ప్రపంచం. ఇప్పుడు పెద్ద ప్రపంచం. ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేయడం ఎలా అనిపిస్తోంది? జీవితంలో ఆనందపడటానికి చాలా విషయాలుంటాయి. వాటిలో ఫ్యాన్స్ ప్రేమ ఒకటి. కొందరు ఫ్యాన్స్ నా బొమ్మలు గీసి పంపిస్తుంటారు. జనరల్‌గా నాకు గ్రీటింగ్ కార్డ్స్ ఇష్టం. ఫ్యాన్స్ నాకోçసం బొమ్మలు గీసి ఇచ్చే ఆ గ్రీటింగ్ కార్డ్స్‌ని నేను పెద్ద బహుమతిలా భావిస్తాను. ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనిది. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ అయి నాలుగేళ్లయింది. అప్పటికీ ఇప్పటికీ మీ లైఫ్‌లో వచ్చిన మార్పేంటి? నటిగా, మనిషిగా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. యాక్చువల్‌గా నేను ‘కామ్’ పర్సన్. ఇక్కడికొచ్చాక ఇంకా కామ్ పర్సన్ అయ్యాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సక్సెస్, ఫెయిల్యూర్.. రెండూ చూస్తున్నాను. ఏదీ తలకి ఎక్కించుకోవడంలేదు. ఏది జరిగితే అది జరిగిందిలే అని లైఫ్‌ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నాను. ప్రతీ మూమెంట్‌ని సెలబ్రేట్ చేçస్తున్నాను. ప్రతీ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేస్తాను. కార్తీక పౌర్ణమిలాంటివి కూడా చేస్తారా.. ఉపవాసం ఉంటారా? మొన్న కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించాను. ఈసారి ఉపవాసం చేయలేదు. అయితే మా ఇంట్లో వాళ్లు మాత్రం ఉపవాసం చేస్తుంటారు. యాక్చువల్లీ పండగలు చేసుకోవడం అంటే.. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే. ఆధ్యాత్మికతలో ఆహ్లాదం ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడుతూ జనరల్‌గా నేను ‘కామ్ పర్సన్’ని అన్నారు. ‘నాలాంటివాళ్లకు ఇండస్ట్రీ సూట్ అవుతుందా’ అని సినిమాల్లోకి వచ్చే ముందు ఏమైనా భయపడ్డారా? ఆ భయం ఉండేది కాదు. మన పని మనం చేసుకుంటూ అనవసరంగా ఇతరుల జోలికి వెళ్లకుండా ఉంటే హ్యాపీగా ఉండగలుగుతాం అనుకున్నాను. బేసిక్‌గా నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ని. చాలా సెక్యూర్డ్ పర్సన్‌ని. నా పనేదో నేను చూసుకుంటాను. పక్కనోళ్ళ జోలికి పోను. తర్వాత ఏం జరగబోతోంది అని ఆలోచించను. సినిమాలు చేయడం, వాటిని ప్రమోట్ చేయడం. ఇంటికెళ్లి హ్యాపీగా అమ్మానాన్నలతో గడపడం.. అంతే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ‘మీటూ’ అంటూ చాలా మంది ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీకేమైనా చెప్పడానికి ఉన్నాయా? చాలా ఏళ్లుగా ఫేస్ చేస్తున్న చేదు అనుభవాలను బయటకు వచ్చి నిర్భయంగా చెప్పగలగడం గ్రేట్. వాళ్ల ధైర్యం నిజంగా అభినందనీయం. ‘మీటూ’ అంటూ నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘ఊహలు గుసగుసలాడె’ సినిమాతో ఇక్కడికి వచ్చాను. అప్పటినుంచి ఇప్పటివరకూ అన్నీ మంచి అనుభవాలే. ‘టాలీవుడ్ ఈజ్ వన్నాఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీస్’. ఇక్కడ చాలా గౌరవిస్తారు. ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా కామ్‌గా అయ్యానన్నారు. ఏం చేస్తే అలా అవ్వడానికి కుదురుతుంది? మెడిటేషన్. రోజూ ఓ పదిహేను నిమిషాలైనా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం అంటే కళ్లు మూసుకోవడం అని చాలామంది అనుకుంటారు. అయితే పరిసర ప్రాంతాలను మరచిపోయి, ఎలాంటి ఆలోచనలు లేకుండా కాసేపు ఉండటమే ధ్యానం. ప్రాక్టీస్ మీద అది కుదురుతుంది. ఆల్రెడీ నేను చాలా కామ్. ధ్యానం నన్నింకా కామ్ పర్సన్‌ని చేసింది. తొలి ప్రేమ, శ్రీనివాస కల్యాణం చిత్రాల్లో చాలా స్లిమ్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపించారు. మెంటల్ పీస్ కోసం ధ్యానం. మరి.. ఫిజికల్ ఫిట్నెస్ కోసం? నిజం చెప్పాలంటే నేనసలు డైటింగ్ చేయను. నచ్చింది తింటా. చాక్లెట్స్, పరాటా.. అన్నీ తింటాను. వారంలో ఆరు రోజులు కనీసం గంట అయినా జిమ్‌లో గడుపుతాను. ఇంటి దగ్గర చేసిన వంటను ఎక్కువగా ఇష్టపడతాను. డైట్ అని తినకపోతే అది మన ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఫ్రెష్‌గా కనిపించం. నచ్చినవి తినడం, ఎక్స్ట్రా కేలరీస్ని జిమ్‌లో కరిగించడం (నవ్వేస్తూ). హిట్, ఫ్లాప్.. ఈ రెండు రిజల్ట్స్‌తో మీ ట్రావెల్ ఎన్ని రోజులు ఉంటుంది.. నటిగా అభద్రతాభావం ఏమైనా? యాక్చువల్లీ ఏ రిజల్ట్తోనూ నేను ఎక్కువ సేపు ట్రావెల్ చేయలేను. దాన్నుంచి ఈజీగా మూవ్ ఆన్ అయిపోతాను. ఇక ఇన్సెక్యూరిటీ అంటారా? అస్సలు లేదు. నిన్ను నువ్వు నమ్మితే ఎటువంటి అభద్రతాభావానికి లోను కావనేది నా ఫిలాసఫి. అంతా నమ్మకమే. నమ్మకం ఉంటే ఏదీ మనల్ని భయపెట్టదు. రీసెంట్గా తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. నాలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ‘అడంగామారు’ సినిమా చేయడం గురించి? నేను చేసిన ఫస్ట్ తమిళ సినిమా ‘ఇమైక్క నొడిగళ్’ చిత్రం ఆగస్ట్‌లో రిలీజైంది. అందులో స్పెషల్ రోల్ అయినప్పటికీ మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ‘జయం’ రవితో ‘అడంగామారు’ (తెలుగులో ‘సుభాష్’) చేస్తున్నాను. నాలుగు భాషల్లో ఈ సినిమా చేయడం నటిగా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది కాకుండా విశాల్‌తో ‘అయోగ్య’ చేస్తున్నాను. ఇది ‘టెంపర్’ సినిమాకి రీమేక్. తెలుగు ‘టెంపర్’ చూశాను. ఆ సినిమా పాయింట్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా క్లైమాక్స్. సాధారణంగా మీ రోజు ఎలా మొదలవుతుంది? నిద్రపోయే ముందు.. ఉదయం లేచాక దేవుణ్ణి ప్రార్థిస్తాను. అలా చేయడం వల్ల మనలో పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతాయని నా నమ్మకం. మీకేదైనా కష్టం వస్తే ఎవరి మీద ఆధారపడతారు? దేవుడు, అమ్మ, నాన్న? దేవుడు. మీ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది? దేవుడా... నాకు ఇది కావాలి.. అది కావాలి అన్నట్టుగా ఏం పూజ చేయను. సర్వం తెలిసిన దేవుడి దగ్గరికి వెళ్లి ‘ఇది కావాలి’ అని అడగకూడదనుకుంటాను. మనకేం ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకే కోరికల లిస్ట్ చదవను. కొన్ని సినిమాల్లో సింగర్‌గా గొంతు వినిపించారు. మళ్లీ ఎప్పుడు? ట్రై చేస్తున్నాను. వీలున్నప్పుడల్లా పాడుతూనే ఉంటాను. హీరోయిన్ అయ్యాక ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు? ప్రయాణాలు ఇష్టమేనా? పదిహేడేళ్ల వయసులో కెరీర్ కోసం ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కాను. ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇప్పుడూ ట్రావెలింగ్ అంటే అంతే ఎగై్జటింగ్‌గా ఉంటుంది. అయితే మరీ వారంలో రెండు మూడు సార్లు వేరే స్టేట్, వేరే కంట్రీ అంటే .. ‘అరే.. ఎంత తిరగాలిరా బాబూ’ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ కాసేపే. పర్టిక్యులర్‌గా ఏదైనా కంట్రీని విజిట్ చేయాలని ఉందా? సినిమా షూటింగ్స్ వల్ల ఆల్మోస్ట్ అన్ని దేశాలు చూసేశాను. అలాగే బెల్జియం మిగిలింది. ఆ ప్లేస్ విజిట్ చేయాలనుంది. మీరు చేసిన పాత్రల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినది ఏదైనా ఉందా? ప్రతీ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాను. ‘శ్రీనివాస కల్యాణం’ నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా తెలుగు సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు. ‘తొలిప్రేమ’ సినిమాలో పోషించిన వర్ష పాత్రకు, నాకు ఎటువంటి పోలికా లేదు. తనకంటే నేను చాలా మెచ్యూర్డ్. కానీ ఆ సినిమాలో సెకండ్ హాఫ్‌లో వర్ష చూపించే ఓర్పును (పేషెన్స్) ఎక్కువ నేర్చుకున్నాను. ఇటీవల ‘శ్రీనివాస కల్యాణం’లో మిమ్మల్ని పెళ్లి పీటల మీద చూశాం.. రియల్ లైఫ్‌లో ఎప్పుడు చూడొచ్చు? ఇప్పటికైతే ఆ ప్లాన్స్ లేవు. సినిమాలు.. సినిమాలు.. అంతే. అమ్మానాన్న మరో రెండేళ్ల తర్వాత పెళ్లి ప్లాన్స్ మొదలుపెట్టేట్లు ఉన్నారు (నవ్వుతూ). మరి.. కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్‌ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా ఇద్దరికీ వేవ్‌లెంగ్త్ బాగా కుదరాలి. అతను ‘కైండ్ హార్టెడ్’ అయ్యుండాలి. కైండ్ అని ఎందుకు అన్నానంటే ఎక్కడ ‘దయ’ ఉంటుందో అక్కడ బాగా చూసుకునే మనసు ఉంటుంది. జనరల్‌గా ఏ అమ్మాయిని అడిగినా ‘మంచి మనిషి అయ్యుండాలి’ అంటారు. పెళ్లి చూపుల్లో ఒక్కసారి చూసి, పెళ్లి చేసుకుంటారు. ఒక్క చూపులో జడ్జ్ చేయగలిగే ‘సూపర్ పవర్’ ఏదైనా మీకుందా? (నవ్వేస్తూ). అలాంటి అతీత శక్తులేవీ నాకు లేవు. అయితే ఒక మనిషి లుక్ అతను ఎలాంటివాడో కొంతవరకూ చెప్పేస్తుంది. మాట్లాడే విధానం ద్వారా కూడా కొంత తెలుసుకోవచ్చు. పెళ్లి చేసుకునే అబ్బాయిని అయినా, ఫ్రెండ్‌ని అయినా.. ఎవరినైనా కొన్ని రోజుల్లోనో, నెలల్లోనో తెలుసుకోవడం కష్టం. వాళ్లతో ట్రావెల్ చేస్తేనే మనసు అర్థమవుతుంది. ఖాళీ సమయాల్లో బుక్స్ బాగా చదువుతారని విన్నాం. మీరు చదివినవాటిలో బాగా ప్రభావితం చేసిన బుక్ గురించి? నాకు బుక్స్ చదవడం ఇష్టం. వాటికోసం స్పెషల్‌గా షాపింగ్ చేస్తాను. ఈ మధ్యకాలంలో చదివిన ‘ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్’ బుక్ నన్ను చాలా ప్రభావితం చేసింది. ద్రౌపది కోణం నుంచి మహాభారతం చెప్పే పుస్తకం అది. ఎవరో ఫ్రెండ్ ఇస్తే చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం నాలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందంటే... ‘వీళ్లు ఇలాంటివాళ్లు’ అని మనుషుల మీద ఓ నిర్ణయానికి రావడం మానేశాను. సంఘటనలను బట్టి మనుషుల ప్రవర్తన మారుతుంటుంది. అందుకని ఏదో ఒక ఇన్సిడెంట్ చూసి, ‘వీరి మనస్తత్వం ఇలాంటిది’ అని జడ్జ్ చేయడం తప్పని తెలుసుకున్నాను. బుక్స్ ఇచ్చే నాలెడ్జ్ అంతా ఇంతా కాదు. అందుకే ఖాళీ దొరికితే చదవాలి. నేను ఖాళీ సమయాల్లో బుక్స్‌తో బిజీ అయిపోతా. ఫైనల్లీ.. ఒక సందర్భంలో ‘దేవుడు నాకు కావల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు’ అని అన్నారు. మరి ఆ ఎక్కువని తిరిగి ఎలా దేవుడికి ఇస్తారు? దేవుడికి మనం ఏదైనా ఇవ్వడమంటే అది సేవ రూపంలోనే అనుకుంటాను. మా అమ్మ ఏం చెబుతారంటే కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదంటారు. అందుకే బయటకు చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడను. మీరు, వాణీకపూర్ (‘ఆహా కల్యాణం’ ఫేమ్) అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్స్‌కి వెళుతున్నారు. అసలు మీ ఇద్దరికీ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? మేం ఇద్దరం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లమే. మోడలింగ్ టైమ్ నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. మా ఫ్రెండ్షిప్ పదేళ్లుగా కొనసాగుతోంది. తను నా సిస్టర్‌లాగా. ప్రొఫెషనల్‌గా తను మీ అంత ఫాస్ట్‌గా లేరు. ఏమైనా సలహాలిస్తారా? వాణీ కపూర్ మంచి నటి. కెరీర్ కొంచెం స్లోగా ఉంది. రీసెంట్గా ఓ పెద్ద ప్రాజెక్ట్ ఓకే చేసింది. రణ్‌బీర్‌తో ఓ పీరియాడికల్ మూవీ చేస్తోంది. ఐదేళ్ల తర్వాత రాశీ ఖన్నా ఎలా ఉండబోతున్నారు? నిజం చెప్పాలంటే అంత ప్లానింగ్ ఉండదు. అనుకోకుండా అనూహ్యంగా జరిగేదే జీవితం. సో... ప్లాన్ చేసుకుని ఏం ఉపయోగం? లైఫ్ ఎలా వెళితే అలా వెళ్లిపోవడమే. మీరేమో అందంగా ఉంటారు. ఒకవేళ డీ–గ్లామరస్ రోల్ వస్తే? డీ–గ్లామరస్ మేకప్ వేసుకోవడానికి రెడీ. ఓన్లీ మేకప్ మాత్రమే కాదు.. హెయిర్ సై్టల్ ఏదైనా ఎలా అయినా చేసుకోవడానికి రెడీ. ఎందుకంటే చాలెంజెస్ ఎప్పుడో కానీ రావు కదా. మీ మనస్తత్వానికి విరుద్ధంగా ఉన్న పాత్ర చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏ పాత్ర చేసినా అందులో సెన్స్ ఉందా? లేదా? అని ఆలోచిస్తాను. అలా ఉంటే బావుంటుంది అని నమ్ముతాను. ఒకవేళ కొంచెం అటూ ఇటూగా ఉంటే నా అభిప్రాయాన్ని చెబుతాను. – డి.జి. భవాని -
పే...ద్ద..చిన్న సినిమాలు
సినిమాల్లో పెద్దా చిన్న ఉండదు. కానీ చిన్న సినిమా ఒక్కోసారి పెద్దగా కనబడుతుంది.కథా వస్తువు గొప్పదనమే అనలేం! ఇవ్వాళ చిన్న సినిమా పెద్దగా కనబడటానికి కారణం కథ కంటే పెద్ద కథనమే! నిజానికి చిన్న సినిమాలకు పెద్ద సినిమాల మధ్య వెంట్రుక వాసంత సందు కూడా దొరికేది కాదు.ఊపిరాడక డబ్బాల్లోనే చచ్చిపోయేవి. కానీ టైమ్ మారింది. కాదు.. కాదు.. సినిమా మారింది. కాదు.. కాదు.. కాదు.. ఆడియన్స్ మారారు. సినిమాను మారుస్తున్నారు. 2018లో వచ్చిన ఆరు పే...ద్ద.. చిన్న సినిమాల దర్శకులతో మీకోసం ‘సాక్షి ఫన్డే’ స్పెషల్..! ఛలో విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018 దర్శకుడు: వెంకీ కుడుముల నటీనటులు: నాగశౌర్య, రష్మిక మందన్న నిర్మాత: ఉష ముల్పురి సంగీతం: మహతి స్వరసాగర్ ‘ఛలో’.. ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్‌బస్టర్. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు వెంకీ కుడుముల. ‘ఛలో’తో పాపులర్ అయిన ఈ దర్శకుడి ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే... ∙ ఇంట్లో వాళ్లను ముందే ప్రిపేర్ చేశా! మాది భద్రాద్రి జిల్లా. హైదరాబాద్‌లో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను. చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్ చేసుకోబోతున్నట్లు ఇంట్లో నేరుగా చెప్పకుండా ముందు అమ్మానాన్నల్ను ప్రిపేర్ చేశా. చదువు కొనసాగిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెప్పా. ఆ తర్వాత ‘పై చదువులు చదువుతావా?’ అని అడిగారు. లేదన్నాను. సినిమా ఫీల్డ్‌లోనే కెరీర్ అని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వడంతో వాళ్లూ నో చెప్పలేదు. ∙ సోషల్ మీడియా పరిచయాలతో ఇండస్ట్రీలోకి..! కాలేజీ డేస్‌లోనే సినిమా ఫీల్డ్‌లో ఉన్న వాళ్లకు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టేవాడ్ని. డైలాగ్స్‌ను స్టేటస్‌లుగా పెడుతుండేవాడ్ని. హీరో శివబాలాజీ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి, ‘అదుర్స్’ రవి వీరందరూ నాకు ఇలానే పరిచయం. అలా ‘ఇంకోసారి’ సినిమా దర్శకుడు సుమన్ పాతూరి పరిచయం అయ్యారు. ఆయన దగ్గర నాకు రైటర్ బలభద్రపాత్రుని రమణిగారు పరిచయం అయ్యారు. ఆవిడ నన్ను దర్శకుడు తేజగారికి పరిచయం చేశారు. నిజానికి నేను యాక్టర్ అవుదామని వెళ్లాను. కానీ తేజగారు నాలో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఆ దిశగా ప్రోత్సహించారు. ఆ టైమ్‌లో డైరెక్షన్‌పై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. ఆ తర్వాత డైరెక్టర్ యోగిగారి దగ్గర, నాగశౌర్య ‘జాదుగాడు’ సినిమాకు పనిచేశా. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి దగ్గర కూడా వర్క్ చేశా. ∙ ‘ఛలో’ అలా మొదలైంది! ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నప్పుడు, ఈ సినిమా తర్వాత డైరెక్షన్ ప్రయత్నాలు స్టార్ట్ చేయమన్నారు త్రివిక్రమ్‌గారు. ‘జాదుగాడు’ సినిమా టైమ్‌లో హీరో నాగశౌర్య పరిచయం అయ్యారు. ‘మనం సినిమా చేద్దాం కథ రెడీ చేయ్!’ అన్నారు. నేను చెప్పిన కథ ఆయనకు నచ్చింది. ఓ నిర్మాతకు కథ చెప్పాం. ‘కథ కమర్షియల్‌గా ఉంది. వేరే హీరోకి వెళ్దామా?’ అన్నారు. శౌర్యతో ఇంకో లవ్‌స్టోరీ చేయవచ్చు కదా అని ఆయన అభిప్రాయం. ‘నేను శౌర్యతోనే చేస్తాను’ అని చెప్పా. ఆ సమయంలోనే శౌర్య తన పేరెంట్స్‌కు నేను చెప్పిన కథ చెప్పాడు. వాళ్లు ఎగై్జట్ అయ్యారు. అలా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్లో నా తొలి సినిమా ‘ఛలో’ మొదలైంది. ∙ ‘ఛలో’ కథ అప్పుడే పుట్టింది! ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా మా ఊరు అశ్వరావుపేట తెలంగాణ బోర్డర్లోకి వచ్చింది. అంటే మా ఇంటి దగ్గర్నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఇప్పుడు ఆంధ్ర వస్తుంది. ఓకే.. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ కాకుండా.. ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ అయితే ఎలా ఉంటుంది? హీరో తమిళనాడు అమ్మాయిని లవ్ చేస్తే? ఈ బ్యాక్‌డ్రాప్‌లో స్క్రీన్‌ప్లే వర్కౌట్ అవుతుంది కదా అనిపించింది. అలా ‘ఛలో’ సబ్జెక్ట్‌ను టేకప్ చేశాను. ∙ నితిన్‌తో చేస్తున్నా! నితిన్‌తో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. తొలిప్రేమ విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2018 దర్శకుడు: వెంకీ అట్లూరి నటీనటులు: వరుణ్‌తేజ్, రాశిఖన్నా నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్ సంగీతం: ఎస్. థమన్ వరుణ్‌తేజ్‌కు హీరోగా ఫస్ట్ మేజర్ బాక్సాఫీస్ హిట్ ‘ఫిదా’ తర్వాత వచ్చిన ‘తొలిప్రేమ’ కూడా అంతే పెద్ద హిట్. వెంకీ అట్లూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఒక సింపుల్ ప్రేమకథనే రిఫ్రెషింగ్ కథనంతో నడిపించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారాయన. నటుడిగా కెరీర్ మొదలుపెట్టి దర్శకుడిగా మారిన వెంకీ అట్లూరి తన కెరీర్ గురించి చెప్పిన విశేషాలు... ∙ యాక్టింగ్ నుంచి డైరెక్షన్‌కి! నాది హైదరాబాద్. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో కెరీర్‌ను బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు రైటింగ్‌పై ఆసక్తి కలిగింది. ముందు ‘స్నేహగీతం’ సినిమాలో నటించాను. ఆ తర్వాత నాకు యాక్టింగ్ కన్నా, రైటింగ్ అండ్ డైరెక్షన్ అంటేనే మక్కువ ఏర్పడింది. అందుకే ‘స్నేహగీతం’ సినిమా చేసిన తర్వాత రైటింగ్ అండ్ డైరెక్షన్‌పై ఫోకస్ పెట్టాను. దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. ఫైనల్లీ ‘తొలిప్రేమ’తో డైరెక్టర్ అయ్యాను. నిజానికి ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్.. టీమ్ వర్క్ అని చెబుతా. ∙ ‘తొలిప్రేమ’కు నో చెప్పారు! మొదట్లో ‘తొలిప్రేమ’ కథకు చాలా మంది ఓకే చెప్పలేదు. ఆ తర్వాతే అది దాని దారి వెతుక్కొని ఇలా వచ్చింది. మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఎవరి పని వాళ్లని చేయనిస్తే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది 95 పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒక ఫైవ్ ఫర్సెంట్ లక్ ఉండాలి. ‘తొలిప్రేమ’ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. ∙ పొలిటికల్ డ్రామా చేస్తా! లవ్‌స్టోరీస్‌తో పాటు నాకు ఫ్యామిలీ డ్రామాలంటే ఆసక్తి ఎక్కువ. పొలిటికల్ డ్రామాలన్నా ఇష్టమే. భవిష్యత్‌లో నానుంచి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాను ఆశించవచ్చు. ∙ అఖిల్‌తో సినిమా చేస్తున్నా! ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు దృష్టంతా ఈ సినిమాపైనే. ఒక సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు మరో సినిమా గురించి ఆలోచించను. ఎఫర్ట్ అంతా సినిమా మీదనే పెడతా. ప్యారలల్‌గా మరో సినిమా చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించదు. ఏకాగ్రత తగ్గుతుందేమోనని నా భయం. మణిరత్నం, త్రివిక్రమ్ నా ఫేవరైట్ డైరెక్టర్స్. వాళ్ల నుంచి ఎక్కువ ఇన్‌స్పయిర్ అయ్యాననే చెప్తా. అ! విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2018 దర్శకుడు: ప్రశాంత్ వర్మ నటీనటులు: కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, నిత్యామీనన్ నిర్మాతలు: నాని, ప్రశాంతి త్రిపురనేని సంగీతం: మార్క్ కె. రాబిన్ హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన సినిమా ‘అ!’తో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. ఒక మంచి ప్రయోగంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు అర్బన్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కథల్ని తెరకెక్కించాలన్న డ్రీమ్‌తో ముందుకెళ్తానంటున్న ప్రశాంత్ వర్మ తన గురించి చెప్పిన కొన్ని విశేషాలు.... ∙ సినిమాలను పిచ్చిగా చూసేవాడ్ని! మాది భీమవరం దగ్గర పాలకొల్లు. సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. స్కూల్లో మంచి స్టూడెంట్‌ని. చిన్నప్పుడు ప్రతి సినిమా చూసేవాణ్ని. అయితే డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అవి కూడా బాగా వైరల్ అయ్యాయి. తర్వాత ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సినిమా గురించి తెలుసుకోవడం, చదవడం మొదలెట్టాను. ఆ తర్వాత యాడ్స్ చేశాను. ∙ ‘అ!’ నా 33వ కథ... ‘అ!’.. ఫ్రస్ట్రేషన్‌తో రాసిన కథ. 2017 న్యూ ఇయర్‌కు నా కొత్త సినిమా స్టార్ట్ కావల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. అప్పుడు ఈ కథ రాశాను. ఆడియన్స్ ఎప్పుడూ చూడని ఒక కొత్త కథ చెబుదాం అన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ పిక్ చేసుకున్నాను. ఇది నేను రాసిన 33వ కథ. అలా అని ముందు 32 కథలు రిజెక్ట్ అయ్యాయని అనను. ఏవేవో కారణాలతో సినిమా ఫైనలైజ్ కాలేదు. ‘అ!’ సినిమా నా సొంత ప్రొడక్షన్లోనే చిన్న సినిమాలా కొత్త వాళ్లతో చేద్దాం అనుకున్నాను. మెల్లిగా కాజల్, నాని వచ్చి పెద్ద ప్రాజెక్ట్ అయింది. ∙ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు! మన దగ్గర మాత్రమే ‘నా కథతో నేనే సినిమా తీస్తాను’ అనుకుంటాం. హాలీవుడ్లో ఒకరు కథ రాస్తారు. మరొకరు స్క్రీన్‌ప్లే. ఆ తర్వాత ఆ ప్రొడక్షన్ కంపెనీ ఒక డైరెక్టర్ని నియమించుకుంటుంది. ఇలాగే బాలీవుడ్ ‘క్వీన్’ రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మి’ నా దగ్గరికొచ్చింది. ‘అ!’ పనుల్లో బిజీగా ఉండి చేయడం కుదర్లేదు. ఆ సినిమా మధ్యలో ఆగిపోతే, మిగతా భాగమంతా వెళ్లి పూర్తి చేసి వచ్చాను. డైరెక్షన్ అనేది ఒక జాబ్ అని అనుకుంటాను నేను. అలానే వెళ్లి ఆ సినిమా చేసి వచ్చాను. నా తర్వాతి సినిమా వేరే అతని కథతో చేస్తున్నాను. ‘కథ’ అని అతనికి టైటిల్ వేస్తాను. నాకెలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేవు. ∙ ఆ బ్రాండ్ నా డ్రీమ్! ‘స్క్రిప్ట్ విల్లా’ అనే కంపెనీ ద్వారా మంచి కథల కోసం వెతికే ప్రొడక్షన్ హౌస్‌లకు, యాక్టర్స్‌కు మా సంస్థ నుంచి కథలను అందించే ప్రయత్నం మొదలుపెడుతున్నా. వీలైనన్ని కొత్త కథలు ఆడియన్స్‌కు చెప్పడమే నా డ్రీమ్. ‘వీడు ఇప్పటివరకూ మనం అనుకున్నట్టుగా కాకుండా, కొత్తగా కథలు చెబుతాడ్రా!’ అనే బ్రాండ్‌ని క్రియేట్ చేసుకుంటే చాలు. ఆర్ఎక్స్ 100 విడుదల తేదీ: జూలై 12, 2018 దర్శకుడు: అజయ్ భూపతి నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ నిర్మాత: అశోక్‌రెడ్డి సంగీతం: చైతన్ భరద్వాజ్ 2018లో చిన్న సినిమాల్లో అతిపెద్ద సెన్సేషన్ ‘ఆర్ఎక్స్100’. కొత్త దర్శకుడు అజయ్ భూపతి కొత్త నటీనటులతో చేసిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి. ఫ్యూచర్లో ఎంత పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశం వచ్చినా వాళ్లను తన స్టైల్లోకి తీసుకొచ్చుకొని సినిమా చేస్తానంటున్న అజయ్ ఫ్యూచర్ ప్లాన్ గురించి.. ఆయన మాటల్లోనే.. ∙ సినిమాలో మా ఊరే! మాది ఆత్రేయపురం. సినిమాలో మీరు చూసిందే. నా ఆరో తరగతి నుంచి డిగ్రీ దాకా మా ఊర్లోనే చదువుకున్నాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సినిమాల్లోకి వెళ్తా అన్నప్పుడు మా నాన్న గారు ‘నీకు నేనేం ఆస్తులు ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే నువ్విలా ఉండు. అలా ఉండు అని చెప్పొచ్చు. నీకు నచ్చింది నువ్వు చెయ్’ అన్నారు. ∙ అప్పుడే ఫిక్స్ అయ్యా! నా పదో తరగతిలోనే ఫిక్స్ అయ్యా, సినిమా డైరెక్టర్ అవ్వాలని. ఆ తర్వాత చదువుకోవడం కూడా టైమ్ వేస్ట్‌లా ఫీల్ అయ్యాను. ఎవ్వరైనా సరే వాళ్లేమవ్వాలనుకుంటున్నారు అనే చిన్న క్లారిటీ ఉంటే చాలు.. అది ఎంత కష్టమైనా చేసేయొచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాని ‘రైడ్’, రవితేజ ‘వీర’ సినిమాలకు పని చేశాను. ఆ తర్వాత మా బాస్ రామ్‌గోపాల్ వర్మ ‘అటాక్’, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ సినిమాలకు వర్క్ చేశాను. ∙ ఎన్నో అవమానాలు.. చీదరింపులు... సినిమాల్లోకి రావాలనుకున్నాక అవమానాలు, చీదరింపులు, పస్తులు ఉండటాలు... అన్నీ ఉన్నాయి. కానీ ‘ఆర్ఎక్స్ 100’ కథను చాలామందికి చెప్పా. ఎవ్వరూ రిజెక్ట్ చేయలేదు కానీ, వాళ్ల వాళ్ల కారణాల వల్ల సినిమా చేయడం కుదర్లేదు. కార్తికేయకి బాగా నచ్చేసింది. తర్వాత నిర్మాత అశోక్ వచ్చారు. నాకు రియలిస్టిక్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ పాయింట్ బావుంటుందని గట్టి నమ్మకం ఉండేది. నేను తప్ప ఎవ్వరూ పెద్దగా నమ్మలేదు ఈ సబ్జెక్ట్‌ని. ‘ఆర్ఎక్స్ 100’లో మీరు చూసిన హీరో క్యారెక్టర్ మన ఊర్లో కనబడే రెబల్ కుర్రాడిలానే ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్, రాంకీగారి పాత్ర.. ఇలా ప్రతీ పాత్రను ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా డిజైన్ చే శాను. ∙ నెక్ట్స్ మల్టీస్టారర్... ‘ఆర్ఎక్స్100’ సక్సెస్ తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటివరకైతే ఏదీ ఫైనల్ చేయలేదు. కానీ నెక్ట్స్ సినిమా మాత్రం మల్టీస్టారర్ ఉంటుంది. రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి వ్యక్తుల కథ. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. రెండు నెలల్లో ఫుల్ డీటైల్స్ అనౌన్స్ చేస్తాను. ఏ కథ చెప్పినా రియలిస్టిక్ అప్రోచ్‌తో చెప్పడమే నా లక్ష్యం. అలాగే ప్రభాస్, రామ్ చరణ్‌తో సినిమా చేయడం నా డ్రీమ్. ఒకవేళ మా స్టైల్లో సినిమా కావాలని వాళ్లు అడిగినా స్టోరీ సిట్టింగ్స్‌లో వాళ్లను నా దారిలోకి తెచ్చేసి నా స్టైల్లో సినిమా తీసేస్తా! చి.ల.సౌ విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: రాహుల్ రవీంద్రన్ నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ నిర్మాతలు: నాగార్జున, జశ్వంత్ నడిపల్లి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’. జనరల్‌గా చాలా మంది నటీనటులు చెప్పే మాట ఇది. అయితే రాహుల్ రవీంద్రన్ మాత్రం ‘డైరెక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా’ అంటున్నారు. హీరోగా సినిమాలతో మెప్పిస్తూనే ఉన్న రాహుల్, దర్శకుడిగా మారి తెరకెక్కించిన ‘చి.ల.సౌ.’ సినిమా ఈ నెల్లోనే విడుదలై సూపర్ హిట్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. డైరెక్టర్‌గా మారిన ఈ యాక్టర్ సినిమా గురించి, తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పిన విశేషాలు... ∙ చిన్నప్పట్నుంచీ కథలంటే ఇష్టం! నేను పుట్టి, పెరిగిందంతా చెన్నైలోనే! నాన్న ఎన్.రవీంద్రన్, అమ్మ వసుమతి. నాన్న బిజినెస్‌మేన్. చిన్నప్పట్నుంచీ అమ్మ రామాయణం, మహాభారతం కథలు చెబుతూ, యాక్టింగ్ చేసి చూపించేది. అప్పుడే నాకు కథలంటే ఇష్టం పెరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నంగారి ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) సినిమాను టీవీలో చూశా. చాలా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపించింది. ఓ సినిమాని ఇలా కూడా తీయొచ్చా? అనిపించింది. అప్పట్నుంచి సినిమా, డైరెక్షన్ సైడ్ ఇష్టం పుట్టింది. ఇంటర్‌కి వచ్చాక ఫిల్మ్‌మేకర్ అవ్వాలనుకుని డిసైడ్ అయ్యా. నటుడవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ∙ అసిస్టెంట్‌గా చాన్స్ దొరకలేదు.. హీరో అయ్యా! మా ఫ్యామిలీలో ఎవరూ సినిమా ఇండస్ట్రీలో లేరు. మాది ఆ నేపథ్యం కాదు. అందుకే ఫస్ట్ చదువు పూర్తి చేసి తర్వాత ప్రయత్నిద్దామనుకుని అహ్మదాబాద్‌లో ‘మైకా’ కళాశాలలో ఎంబీఏ మార్కెటింగ్ చేశా. తర్వాత బాంబేలో ఏడాదిన్నర పాటు రేడియో సిటీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా చేశా. 2007లో చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వాలనుకున్నా. కానీ, ఎవరి వద్దా అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఓ రోజు ఆడిషన్స్‌కి రమ్మని కాల్ వచ్చింది. వెళ్లగానే యాక్టింగ్ రోల్ అన్నారు. ఏ పాత్ర అంటే.. హీరో అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాన్స్ రాలేదు. హీరోగా వచ్చింది. చేస్తే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు. డబ్బులు కూడా వస్తాయని చేశా. రవివర్మన్ డైరెక్షన్లో ‘మాస్కోవిన్ కావేరి’ చిత్రం చేశా. ∙ ‘అందాల రాక్షసి’ మొత్తం మార్చేసింది! ‘అందాల రాక్షసి’ చిత్రా నికి ఇద్దరు హీరోలు కావాలి. నవీన్ చంద్ర ఓ హీరోగా ఓకే. రెండో హీరో సెట్ అవడం లేదు. మీకు తెలిసినవారు ఎవరైనా ఉన్నారా? అని పాటల రచయిత లక్ష్మీ భూపాల్‌గారు అహ్మదాబాద్‌లో నాతోపాటు చదువుకున్న ఫ్రెండ్ దీప్తిని అడిగారు. తను నా గురించి చెప్పింది. తెలుగు రాదు అంది. పర్లేదు ఫొటోలు పంపమన్నారు. దీప్తికి పంపా. హను రాఘవపూడిగారు ఆడిషన్స్ చేసి ఓకే చేశారు. ఆ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యా. సాయి కొర్రపాటిగారు బాగా ప్రమోషన్ చేశారు. నాకు, నవీన్ చంద్ర, లావణ్యా త్రిపాఠికి మంచి లైఫ్ వచ్చింది. ఆ సినిమా విడుదలై ఆరేళ్లయింది. ∙ డైరెక్షన్ ట్రయల్స్.. హీరో అయినా, ఆ వెంటనే దర్శకుడిగానూ ప్రయత్నాలు మొదలుపెట్టా. నాలుగున్నరేళ్ల క్రితం ఓ హీరోకి ‘చిలసౌ’ కథ చెప్పా. అప్పుడది వర్కవుట్ అవ్వలేదు. ఈలోగా మళ్లీ హీరోగా బిజీ. తర్వాత సుశాంత్‌కి చెప్పా. ఓకే. నచ్చింది అన్నాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్‌కి చెప్పాడు. ఆయన నిర్మాతలు భరత్, జశ్వంత్‌లకు చెప్పారు. వారు కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై ఇంత పెద్ద హిట్ అయిందంటే చాలా హ్యాపీగా ఉంది. ∙ చిన్మయి హ్యాపీ! ‘అందాల రాక్షసి’ టైమ్‌లో పరిచయమైన సింగర్ చిన్మయి కొద్దిరోజుల్లోనే మంచి ఫ్రెండయింది. తను నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందని నేనే ప్రపోజ్ చేశా. తను కొద్దికాలం ఆలోచించి ఓకే చెప్పింది. తను నాకు, నేను తనకు బలం. ‘చి.ల.సౌ.’ రిలీజయ్యాక, నేను నా కలను సాధించినందుకు తను ఎంతో హ్యాపీ! ∙ యాక్టింగ్, డైరెక్షన్ రెండూ చేస్తా! తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను నిర్మాతలు బాగా ఎంకరేజ్ చేస్తారు. ‘చిలసౌ’ రిలీజ్‌కి ముందే చాలామంది కలిసి సినిమాలు చేయమన్నారు. అయితే రెండో సినిమా అన్నపూర్ణ బ్యానర్లో చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నా. ఇకపై డైరెక్షన్‌కే నా మొదటి ప్రాధాన్యత. మంచి సినిమాలు తీస్తా. అయితే యాక్టింగ్ వదులుకోను. ప్రస్తుతం ‘యూ టర్న్’, ‘దృష్టి’ సినిమాలు చేశా. త్వరలో రిలీజ్ కానున్నాయి. గూఢచారి విడుదల తేదీ: ఆగస్టు 3, 2018 దర్శకుడు: శశికిరణ్ తిక్క నటీనటులు: అడివిశేష్, శోభిత దూళిపాల, మధుశాలిని నిర్మాతలు: అభిషేక్ నామ, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంగీతం: శ్రీచరణ్ పాకాల హీరో అడివి శేష్ ‘క్షణం’ సినిమాతో రెండేళ్ల క్రితం న్యూ వేవ్ సినిమా అంటూ రవికాంత్ పేరు అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. మళ్లీ రెండేళ్లకు అదే న్యూ వేవ్ అంటూ ‘గూఢచారి’తో మరో కొత్త దర్శకుడు శశికిరణ్ తిక్కను పరిచయం చేశారు. ఆగస్టు 3న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రిఫ్రెషింగ్ స్పై థ్రిల్లర్‌గా, లో బడ్జెట్లో తెరకెక్కిన బెస్ట్ విజువల్స్‌తో మెప్పిస్తోన్న ఈ సినిమా గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి శశికిరణ్ మాటల్లో.... ∙ కేరాఫ్ అమలాపురం నేను పుట్టింది అమలాపురంలో. అమ్మానాన్న రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. నాన్న గతంలో కొబ్బరి, కన్స్ట్రక్షన్ బిజినెస్‌లు చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయ్యారు. అన్నయ్య రాజమండ్రిలో బిజినెస్ చూసుకుంటున్నారు. ∙ 15 మంది నిర్మాతలకు కథ చెప్పా! నాకు మొదట్నుంచీ డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. డైరెక్టర్ కావాలనే అమెరికాలో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డైరెక్షన్, రైటింగ్‌లో రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నా. ఇండియాకొచ్చి శేఖర్ కమ్ములగారి దగ్గర ‘లీడర్’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశా. ‘లీడర్’కు పనిచేసిన తర్వాత కొన్ని కథలు రాసుకొని దాదాపు 15మంది నిర్మాతలకి చెప్పా. కొందరు చేద్దామన్నా రకరకాల కారణాల వల్ల కుదర్లేదు. ఓ సినిమా అయితే రేపు లాంచ్ అనగా ఆగిపోయింది. ఈ గ్యాప్‌లో ఫ్రెండ్స్‌కి రైటింగ్ సైడ్ హెల్ప్ చేశా. అడివి శేష్ ‘కర్మ’ సినిమాకి ప్రమోషన్స్ విషయంలో హెల్ప్ చేశా. ∙ ‘గూఢచారి’ అలా పుట్టిందే! ‘కర్మ’ సినిమా అప్పుడే అడివి శేష్‌తో మంచి స్నేహం కుదిరింది. శేష్ రాసిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’ కథను ఆయనతో కలిసి నేను, రాహుల్ పాకాల (రైటర్) ఎనిమిది నెలలు కష్టపడి పూర్తి స్క్రిప్ట్‌గా రెడీ చేశాం. కథని అబ్బూరి రవిగారికి వినిపించాం. ఆయన సలహాలు మాకు బాగా ఉపయోగపడ్డాయి. ∙ ఇంత పెద్ద సక్సెస్ ఊహించలేదు! ‘గూఢచారి’ హిట్ అవుతుందనుకున్నా. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందనుకోలేదు. ఈ సినిమా సక్సెస్ కాగానే చాలా మంది నిర్మాతలు అడిగారు. ఇంకా ఎవరి వద్దా అడ్వాన్సులు తీసుకోలేదు. ఎవరితో చేయాలన్నది నిర్ణయించుకోలేదు. నాకు డబ్బు ముఖ్యం కాదు, పని సంతృప్తినివ్వడమే ముఖ్యం. నావల్ల నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. ∙ అన్ని జానర్స్ చెయ్యాలి! స్పై థ్రిల్లర్‌తో డెబ్యూట్ ఇచ్చినా నాకు కామెడీ అంటే ఇష్టం. ఫ్యూచర్లో అన్ని జానర్స్‌లో సినిమాలు చేయాలనుంది. నాకిష్టమైన దర్శకుల నుంచి ఇన్స్పైరై ఇంకా బాగా పని చేయాలనుకుంటా. – సాక్షి సినిమా డెస్క్ -
ప్రేమలో పడిపోయా
‘‘తొలిప్రేమ’ తర్వాత ఓ మంచి సినిమా చేయాలనుకుంటున్న టైమ్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ కథ విని ఓకే చేశా. కథ చెప్పిన దాని కంటే విజువల్‌గా గ్రాండ్‌గా ఉంది. ఉత్తరాది నుంచి వచ్చిన నాకు తెలుగు సంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు. సెకండాఫ్ షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. అంత అందంగా తీశారు. ప్రస్తుత జనరేషన్‌కి ఇలాంటి సినిమా కావాలి’’ అని హీరోయిన్ రాశీఖన్నా అన్నారు. నితిన్, రాశీఖన్నా జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘దిల్’ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు... ►అందమైన కుటుంబ కథా చిత్రమిది. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెస్తుంది. సినిమా చూసి ఎమోషనల్ అయ్యాను. నాకు డబ్బింగ్ చెప్పిన ప్రియాంక ఫోన్ చేసి ఏడుస్తూ.. చాలా మంచి సినిమా చేశావని అభినందించింది. క్లయిమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌గారు, నితిన్‌ల నటన అద్భుతం. ►ఈ సినిమాలో ఎక్కువ మంది నటీనటులున్నారు. అందరిలో ఓ మూడ్ క్రియేట్ చేసి దాన్ని క్యారీ చేయడం కోసం ఎవరూ ఫోన్స్ వాడొద్దని రాజుగారు చెప్పారు. జయసుధ, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, సితార, నరేశ్‌గారి వంటి సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా యూనిట్‌తో ప్రేమలో పడిపోయా. షూటింగ్ ముగిశాక వారిని వదిలి పెట్టడానికి మనసే రాలేదు. ►ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేనూ అందరిలానే. అయితే.. ఈ మధ్య విడాకులు ఎక్కువ కావడం వల్ల పెళ్లి పట్ల నమ్మకం తగ్గిపోతుంది. అయితే పెళ్లి అనేది గొప్పది. సినిమా రషెస్ చూశాక డైరెక్టర్ సతీశ్‌గారి పాదాలను తాకాను. మా సినిమా అందరి హృదయాలను తాకుతుంది. ఈ చిత్రంలో నా పేరు సిరి. సంప్రదాయాలకు విలువ ఇచ్చే పాత్రలో కనిపిస్తా. ►ఉత్తరాది, దక్షిణాది పెళ్లి సంప్రదాయాలకు చాలా తేడా ఉంది. అయితే అందులో ఫీల్ ఒకటే. ఈ సినిమా టైమ్‌లో నేను తెలుగు అమ్మాయిలా ఫీలై నటించా. మా సినిమా చూసిన తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్ వద్దు.. స్వంత గ్రామాలకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎమోషనల్ సీన్స్‌కు అమ్మాయిలు కనెక్ట్ అయి ఏడుస్తుంటారు. మా సినిమా చూస్తూ అబ్బాయిలు ఏడవడం చూశాను. ►తొలిప్రేమ’కు చాన్స్ రావడానికి కారణం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం. ‘తొలిప్రేమ’ సినిమా చూసిన రాజుగారు ‘శ్రీనివాస కళ్యాణం’ లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా సైన్ చేశాను. తమిళంలో నేను చేసిన మూడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. కంటిన్యూస్‌గా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తున్నాను. ముందు ముందు కూడా క్యారెక్టర్స్ సెలక్షన్ విషయంలో ఇంతే జాగ్రత్తగా ఉంటా. ప్రేక్షకుల మనసుల్లో నా పాత్రలు నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం. -
అఖిల్ కొత్త సినిమాకు యంగ్ డైరెక్టర్..?
‘అఖిల్’ సినిమాతో గ్రాండ్‌గా లాంచ్ అయిన అక్కినేని యువ కథానాయకుడు తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో రెండో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల హలో అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, మంచి మార్కులు సాధించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో మూడో సినిమా కోసం మరోసారి గట్టి కసరత్తులు చేస్తున్నాడు. ఇటీవల అఖిల్.. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్ కూడా జరిగిందన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్లో వినిపిస్తోంది. ఇటీవల తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ సాధించిన వెంకీ అట్లూరి, అఖిల్ మూడో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాను బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఏప్రిల్‌లోనే సినిమా ప్రారంభం కానుందన్న ప్రచారం జరుగుతోంది. -
పాటల్లేని సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..!
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్ త్వరలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నాడు. ఇప్పటికే ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు వరుణ్. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. ఈ సినిమాలో పాటలు మాత్రం ఉండవని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తొలి షెడ్యూల్ షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభం కానుంది. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
వరుణ్.. వరుసగా రెండోసారి..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ భారీ వసూళ్లు సాదిస్తోంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఒక్క అ! తప్ప ఓవర్ సీస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రాలేవి రిలీజ్ కాకపోవటంతో ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్లో స్థానం దక్కించుకుంది. ఫిదా సినిమాతో ఓవర్సీస్లో తొలిసారిగా మిలియన్ డాలర్ క్లబ్లో జాయిన్ అయిన వరుణ్ తేజ్, తొలిప్రేమతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. వరుణ్ ప్రస్తుతం ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నాడట. -
వరుణ్ సినిమాకు ఆసక్తికర టైటిల్
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్, తన తదుపరి చిత్రం పనులు మొదలుపెట్టాడు. ఇటీవల ప్రయోగాలను పక్కన పెట్టి విజయాలు సాధించిన ఈ మెగా హీరో మరోసారి ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. భారతీయ సినీచరిత్రలో తొలి అండర్ వాటర్ వార్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ఘాజీ. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ నటించనున్నాడు. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో గ్రహాంతరవాసుల ప్రస్థావన కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమా తన కెరీర్లోనే స్పెషల్ మూవీగా పేరు తెచ్చుకుంటుందన్న నమ్మకంగా ఉన్నాడు వరుణ్. త్వరలోనే చిత్రయూనిట్ పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
‘తొలిప్రేమ’కు భారీ కలెక్షన్లు
సాక్షి, హైదరాబాద్: వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘తొలిప్రేమ’ భారీ కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొమ్మిది రోజుల్లో రూ. 38 కోట్ల గ్రాస్, రూ. 20.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అమెరికాలో ఇప్పటివరకు రూ. 6.09 కోట్లు రాబట్టింది. కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి.. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. -
మా ఫ్యామిలీ గర్వపడేలా వరుణ్ నటించాడు
-
మా ఫ్యామిలీ గర్వపడేలా వరుణ్ నటించాడు
‘‘తమ్ముడు పవన్‌కల్యాణ్ నటించిన హిట్ చిత్రం ‘తొలిప్రేమ’. ఆ టైటిల్‌తో వరుణ్ చేసిన సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తితో ‘తొలిప్రేమ’ చూశా. పూర్తిగా సంతృప్తి చెందా. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. డైరెక్టర్ వెంకీకి ఇది ఓ ఛాలెంజ్’’ అని నటుడు చిరంజీవి అన్నారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రబృందాన్ని చిరంజీవి తన స్వగృహంలో అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘లవ్‌స్టోరీని ఓ కొత్త కోణంలో చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా, ఫ్రెష్‌గా ఉంది. ఇందుకోసం డైరెక్టర్ ఎంతో హార్డ్‌వర్క్ చేశారు. వెంకీ లాంటి దర్శకులు ఇండస్ట్రీకి రావాలి. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు తెలుగులో వస్తున్నాయి కాబట్టే పొరుగు ఇండస్ట్రీలు మన గురించి మాట్లాడుకుంటున్నాయి. తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా ‘తొలిప్రేమ’. గత సినిమాలకంటే ఈ సినిమాలో నటన పరంగా వరుణ్‌లో చాలా పరిణ తి కనిపించింది. తన హైట్‌కి డ్యాన్సులు కుదురుతాయా? అనుకున్నాం. కానీ, ఈ చిత్రంలో డ్యాన్సులు, ఫైట్స్ చాలా బాగా చేశాడు. మా ఫ్యామిలీ అంతా గర్వపడేలా తన నటన ఉంది. రాశీఖన్నా ఈ సినిమాలో చక్కగా నటించారు. నాగబాబు గర్వపడే రోజు ఇది. ‘తొలిప్రేమ’ వంటి హిట్‌ని వరుణ్ ఇచ్చాడు. తమన్ అందించిన పాటలు డ్యాన్స్ చేయాలనిపించేలా ఉన్నాయి. ప్రసాద్‌గారు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా తీశారు. 65రోజుల్లో షూటింగ్ పూర్తి చేయడం గ్రేట్. పక్కా స్క్రిప్ట్‌తో సెట్స్‌పైకి వెళ్లినప్పుడే ఇది సాధ్యం. ఇండస్ట్రీ వారంతా ఇది తెలుసుకోవాలి. షూటింగ్ ఎక్కువ రోజులు కాకుండా తక్కువ టైమ్‌లో తీస్తే డబ్బు వృథా కాదు’’ అన్నారు. ‘‘సినిమాలు చేద్దామని 33ఏళ్ల కిందట చెన్నై వెళ్లాను. ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావుగారు చిరంజీవిగారి ఇంటికి తీసుకెళ్లారు. ఆయనతో నా పరిచయం నిర్మాత కంటే ఓ అభిమానిగానే జరిగింది. చిరంజీవిగారితో సినిమా చేయకున్నా మెగా ఫ్యామిలీలో పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్‌లతో మంచి హిట్ సినిమాలు చేసినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’ షూటింగ్లో చిరంజీవిగారిని చూశా. ఇన్నేళ్లకు ఆయన పక్కన కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చినా.. మాటలు రావడం లేదు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మా ‘తొలిప్రేమ’ సినిమా చిరంజీవిగారికి నచ్చడం, ఆయన మమ్మల్ని పిలిచి అభినందించడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘సినిమాల్లో నటించాలనే ఆలోచన చిరంజీవిగారిని చూశాక వచ్చింది. మా సినిమా డాడీ (చిరంజీవి)కి నచ్చడం, ఆయన పిలిచి మరీ మా యూనిట్‌ని అభినందించడం సో హ్యాపీ. ఆయన పక్కన కూర్చొని మాట్లాడలేను. ‘తొలిప్రేమ’ సినిమాని బాబాయ్ పవన్ కల్యాణ్ ఇంకా చూడలేదు’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘ఓ మ్యూజిక్ డైరెక్టర్‌గా చిరంజీవిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఓ మంచి సినిమాని ఆయన హార్ట్‌ఫుల్‌గా అభినందించడం గ్రేట్’’ అన్నారు సంగీత దర్శకుడు తమన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ తనయుడు బాపినీడు పాల్గొన్నారు. -
తొలిప్రేమ షాకింగ్ కలెక్షన్లు
సాక్షి, సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీఖన్నా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. ప్రేమకథా చిత్రం కావడంతో అన్నీ వర్గాల ప్రేక్షకుల మనసులను దోచింది. ముఖ్యంగా ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరికి యువతలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా నడుస్తోంది. నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం మొదటి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.25.8 కోట్ల గ్రాస్, రూ.14.6 కోట్ల షేర్ ను రాట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 10.77 కోట్ల షేర్ ను వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లాభాల దిశగా అడుగులు వేస్తున్నారట. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మంచారు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. -
‘కొత్త డైరెక్టర్ చేశాడా అని పెదనాన్న షాక్ అయ్యారు’
‘‘లవ్ స్టోరీకు కావల్సింది కెమిస్ట్రీ అని అప్పుడు ఆ ‘తొలిప్రేమ’, ఇప్పుడు ఈ ‘తొలిప్రేమ’ ప్రూవ్ చేశాయి. వరుణ్, రాశీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ సినిమా సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ఫిదా’ స్టార్ట్ అయ్యే టైమ్‌లో వెంకీ నా దగ్గరకు వచ్చి ‘సార్ నేనీ సినిమా బయటవాళ్లతో చేసుకుంటాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను. సినిమా అయిపోయాక బాపినీడు సినిమాను తీసుకొచ్చి మళ్లీ నా చేతుల్లో పెట్టాడు. వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి. ‘ఫిదా, తొలిప్రేమ’ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. నెక్ట్స్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలి. రాశీ బాగా చేసింది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘ఈ కథను నమ్మిన ‘దిల్’ రాజు గారికి థ్యాంక్స్. మీరు లేకపోతే సినిమా స్టార్ట్ అవ్వకపోయేది. నా మీద, వెంకీ మీద నమ్మకం ఉంచారు. వెంకీకి సినిమా మీద ఉన్న ప్రేమ, మేకింగ్‌లో ఉన్న కన్విక్షన్ సూపర్బ్. పెదనాన్న (చిరంజీవి) ఈ సినిమాను చూసి, డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమా తీశాడా అని షాక్ అయ్యారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో నాకు ఫీమేల్ ఫ్యాన్స్ పెరుగుతారు అనుకుంటున్నాను. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన వెంకీకి థ్యాంక్స్’’ అన్నారు రాశీ ఖన్నా. వెంకీ మాట్లాడుతూ – ‘‘రాశీని అనుకున్నప్పుడు భయం ఉండేది కానీ చాలా బాగా చేసింది. ఈ కథను వరుణ్ బిలీవ్ చేయటం వల్లే ఈ సినిమా ప్రాణం పోసుకుంది. ఈ సినిమాకు రెండు పిల్లర్స్ జార్జ్, తమన్. లిరిక్స్ రాసిన శ్రీ మణిగారికి థ్యాంక్స్. ప్రసాద్‌గారిని సార్ అని పిలుస్తాను కానీ నాకు ఫ్రెండ్ లాంటి వారు. బాపినీడు మంచి ఫ్రెండ్’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా వరుణ్ తేజ్‌కు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాను నమ్మి చేశాడు. టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారు’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘నేను ఫస్ట్ టైమ్ వర్క్ చేసిన హీరోస్ అందరితో బ్లాక్‌బాస్టర్స్ కొట్టాను ‘బృందావనం, కిక్, దూకుడు’.. ఈ సినిమా స్టార్ట్ అప్పుడు ఇదే అనుకున్నాను. అలాగే సూపర్ హిట్ అయింది’’ అన్నారు తమన్. -
క్రేజీ కాంబినేషన్ ఉన్నా కథే ముఖ్యం
‘‘తొలిప్రేమ’ కథ సెకండాఫ్ సరిగ్గా కుదరలేదని ‘దిల్’ రాజు తప్పుకున్నారు. ఆ కథ నాకన్నా ముందు మా అబ్బాయి బాపినీడు విన్నాడు. తర్వాత వరుణ్ తేజ్‌కి వినిపించారు. కథను, డైరెక్టర్ని వరుణ్ నమ్మారు. ‘ఫిదా’ వంటి లవ్ ఎంటర్టైనర్ తర్వాత మళ్లీ లవ్‌స్టోరీ ఒప్పుకోవడం సాహసమే. అందుకే.. ఈ సక్సెస్ క్రెడిట్ వరుణ్‌కే దక్కుతుంది’’ అని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘తొలిప్రేమ’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నా తొలిప్రేమ నా వైఫే. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘కొత్త డైరెక్టర్‌తో నేను సినిమా చేయను. బాపినీడు వల్లే అది కుదిరింది. మళ్లీ మా బ్యానర్లో కొత్త డైరెక్టర్ సినిమా అంటే బాపినీడు చూసుకుంటాడు. ‘తొలిప్రేమ’ విషయంలో నేను మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చున్నానంతే. మార్పులు చేశాక సెకండాఫ్ విని ‘దిల్’ రాజు ఇంప్రెస్ అయి, డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. ఇప్పుడు పెద్ద స్టార్స్ అంతా బిజీగానే ఉన్నారు. వారితో సినిమా అంటే టైమ్ పడుతుంది.మల్టీస్టారర్ సినిమా తీయగలిగే సత్తా డైరెక్టర్‌కి ఉండాలి. రాజమౌళికి ఆ కెపాసిటీ ఉంది. ‘తొలిప్రేమ’తో 24 సినిమాలు పూర్తయ్యాయి. 25వ సినిమా కోసం స్పెషల్‌గా ప్లాన్ చేయడంలేదు. ఎంత క్రేజీ కాంబినేషన్ ఉన్నా కథ ఉండాల్సిందే. నిర్మాత కూడా కథలో ఇన్వాల్వ్ అయినప్పుడే బడ్జెట్‌పై క్లారిటీ ఉంటుంది. ఇండస్ట్రీలో అందరు పెద్ద డైరెక్టర్స్, స్టార్స్‌తో సినిమాలు చేశా. ఒక్క మహేశ్‌బాబుతో తప్ప. ఆయనతో కూడా త్వరలో ప్లాన్ చేస్తా’’ అన్నారు. -
కోన ట్వీట్‌పై కేటీఆర్ స్పందన ఏది?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్వీటర్ ద్వారా తన దృష్టికి వచ్చిన అంశాలపై వెంటనే స్పందిస్తూ సదరు శాఖలను అప్రమత్తం చేస్తుంటారు. సినీరంగంతోనూ కేటీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమా వేడుకలకు అతిథిగా హాజరవ్వటమే కాదు, తనకు నచ్చిన సినిమాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు కేటీఆర్. అయితే సినీరంగంతో ఇంత సన్నిహితంగా ఉండే కేటీఆర్.. సినీ రచయిత కోన వెంకట్ చేసిన ఓ ట్వీట్‌పై స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. తెలుగు సినిమాకు ప్రమాదకరంగా మారిన మూవీ రూల్స్ (movierulz) వెబ్‌సైట్‌పై తక్షణమే చర్చలు తీసుకోవాల్సిందిగా కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ ను కోరారు. తన మెసేజ్‌తోపాటు గత వారం విడుదలైన గాయత్రి, ఇంటిలిజెంట్, తొలిప్రేమ సినిమాలు మూవీరూల్స్ సైట్లో ఉన్న స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. కానీ ఈ విషయంపై కేటీఆర్ ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. ఈ సైట్లో తెలుగు సినిమాలతో పాటు తమిళ, హిందీ సినిమాల పైరసీ లింక్‌లు కూడా రిలీజ్ అయిన 24 గంటలలోపే దర్శనమిస్తున్నాయి. @KTRTRS .. we request ur immediate intervention in taking severe action against this particular website called “movierulz” which is a major threat to TFI.. Please instruct concerned authorities to lock these people up for good and save us 🙏 Here’s is the evidence sir.. pic.twitter.com/r1tG5rDPKd — kona venkat (@konavenkat99) 12 February 2018 -
తొలిప్రేమపై రాజమౌళి కామెంట్
సాక్షి, హైదరాబాద్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశిఖన్నా నటించిన తొలిప్రేమ చిత్రం సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు చాలా బాగుందంటూ కితాబిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విలక్షణ నటుడు ఆర్. నారాయణమూర్తిలు ఈసినిమా బాగుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్త పరచగా తాజాగా ఈ జాబితాలోకి దర్శక ధీరుడు రాజమౌళి సైతం చేరారు. సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'నేను సాధారంగా ప్రేమకథ చిత్రాల అభిమానిని కాదు. కానీ ‘తొలిప్రేమ’ సినిమాను మాత్రం ఎంజాయ్ చేశాను. దర్శకుడు వెంకీ తన తొలి చిత్రాన్ని బాగానే హ్యాండిల్ చేశారు. వరుణ్ తేజ్ రోజు రోజుకి మంచి నటుడిగా ఎదుగుతున్నాడు. రాశీఖన్నా అందంగా కనిపించడమే కాదు, అంతకంటే బాగా నటించింది. ప్రసాద్, బాపినీడు గారికి శుభాకాంక్షలు. సినిమా నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. మంచి విజయాన్ని అందుకున్నారు' అంటూ ప్రశంసించారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - తొలిపేమ
-
టైటిల్ పెట్టావ్ సరే... జాగ్రత్తగా తియ్ అన్నారు
‘‘జ్ఞాపకం, స్నేహగీతం చిత్రాల్లో నటించాను. రైటర్‌గా ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ, స్నేహగీతం, కేరింత’ చేశాను. రాయటం స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి యాక్టింగ్‌వైపు ఇంట్రెస్ట్ తగ్గింది. యాక్టింగా? రైటింగా? అని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు రైటింగ్ టు డైరెక్షన్ అని డిసైడ్ అయ్యాను’’ అన్నారు వెంకీ అట్లూరి. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ శనివారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకీ చెప్పిన విశేషాలు... ► దర్శకులు రాఘవేంద్రరావుగారు ఆదివారం మార్నింగ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ షో మ్యాన్. అలాంటి ఆయన దగ్గర్నుంచి కాంప్లిమెంట్ రావడం ఫుల్ హ్యాపీ. ఆర్.నారాయణమూర్తిగారు కాంప్లి్లమెంట్ ఇచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌గారు సినిమా చూసి, ట్విట్టర్లో రియాక్ట్ అవ్వడం చాలా సంతోషాన్నిచ్చింది. ► ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశా. పవన్ కల్యాణ్‌గారి ‘తొలిప్రేమ’ సినిమా అంత కాకపోయినా ఆ సినిమా గౌరవాన్ని కాపాడేలా మా ‘తొలిప్రేమ’ చిత్రం ఉంటుందని. కాపాడాననే అనుకుంటున్నాను. ‘తొలిప్రేమ’ టైటిల్ పెట్టినప్పుడు ఫ్యాన్స్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయేమో అనుకున్నాను. కానీ లేదు. ‘టైటిల్ పెట్టావ్ సరే .. జాగ్రత్తగా తియ్’ అని కొందరు ఫ్యాన్స్ అన్నారు. టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేసినప్పుడు వాళ్లు బాగా వెల్కమ్ చేశారు. ఎందుకు పెట్టావ్? అని ఏ సైడ్ నుంచి రాలేదు. ► నిజానికి ఈ సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద’ కూడా రిలీజ్ కాలేదు. టీజర్ రిలీజైంది. అప్పుడు ఇలాంటి హీరో మన సినిమాలో ఉంటే బాగుంటుందనిపించింది. వరుణ్ ‘కంచె’ చూసినప్పుడు ఏ రోల్ అయినా చేయగలడనిపించింది. ‘లోఫర్’ సినిమా టైమ్‌లో తనకు కథ చెప్పా. ఓకే అన్నారు. ఈ కథను ముందు ‘దిల్’ రాజుగారికి చెప్పాను. ఆయన చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో ప్రసాద్‌గారిని కలిశాను. ప్రసాద్ తనయుడు బాపీనీడు నాకు బెస్ట్ ఫ్రెండ్. అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ► త్రీ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ కోసం వరుణ్, రాశీఖన్నా లుక్స్ పరంగా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇద్దరూ సూపర్‌గా నటించారు. తమన్ సొంత కథలా ఫీలయ్యి మంచి సంగీతం ఇచ్చాడు. ► సినిమా కాస్త లేట్ అయ్యింది. అది మంచికే జరిగిందనుకుంటున్నాను. స్క్రిప్ట్‌ను మరింత బాగా రెడీ చేసుకున్నా. డిస్కషన్స్ బాగా జరిగాయి. కానీ ‘ఫిదా’ రిలీజ్ తర్వాత ‘తొలిప్రేమలో’ ఏ మార్పూ చేయలేదు. ‘ఫిదా’ సినిమా రిలీజైన 10 డేస్ తర్వాత ‘తొలిప్రేమ’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. ► లవ్‌స్టోరీ, డ్రామా, కాస్త పొలిటికల్ ఇంపాక్ట్ ఉన్న సినిమాలు, బయోపిక్ జోనర్లు అంటే ఇష్టం. పొలిటికల్ ఇంపాక్ట్ అంటే.. సోషల్ మేసేజ్ రిలవెంట్ ఉన్నవి. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రసాద్‌గారి బ్యానర్లో ఓ సినిమా చేయాలి. ‘దిల్’ రాజుగారి నిర్మాణంలో సినిమా ఉంటుంది. -
‘తొలిప్రేమ’ కలెక్షన్లు ఫస్ట్‌క్లాస్
సాక్షి, హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం తొలిప్రేమ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా బాగుందన్న టాక్ రావడంతో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.13 కోట్ల షేర్, రూ. 9.6 కోట్ల గ్రాస్ సాధించినట్టు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో గురు, శుక్రవారాల్లో రూ. 3.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కలెక్షన్లు స్థిరంగా ఉండటంతో వరుణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా తొలిప్రేమ నిలిచే అవకాశముందని విమర్శకులు భావిస్తున్నారు. యువతను ఆకట్టుకునే ప్రేమకథ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటించింది. సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషించారు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచమయ్యాడు. బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. -
మొత్తానికి కేటీఆర్ ఫిదా అయ్యాడు
సాక్షి, సినిమా : తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సినిమాల పట్ల ఆసక్తికనబరుస్తారన్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలతో స్నేహపూర్వకంగా ఉండే ఆయన.. తరచూ సినిమాలు చూస్తూ తన అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తుంటారు. తాజాగా ఆయన తొలిప్రేమ చిత్రాన్ని చూసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన ప్రేమకథను చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి బాగా తెరకెక్కించాడు. రాశీ ఖన్నా, వరుణ్ తేజ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా మంచి సాహిత్యం.. దానికి థమన్ టెర్రిఫిక్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి’’ అని కేటీఆర్ గత రాత్రి ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన థమన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రీట్వీట్ చేయగా.. గ్రేట్ జాబ్ అంటూ కేటీఆర్ మరో ట్వీట్‌తో అభినందన తెలియజేశారు. Saturday night well spent. Watched a sensitive love story in Telugu after a while ‘Tholi Prema’ is well directed by @dirvenky_atluri terrific music, lyrics & background score, fabulous cinematography & absolutely brilliant performances by @IAmVarunTej & @RaashiKhanna 👍👏 — KTR (@KTRTRS) 10 February 2018 Great Job Thaman 👍 BG & Music was outstanding and so were lyrics. My compliments https://t.co/q7tk5BmbSj — KTR (@KTRTRS) 11 February 2018 -
‘తొలిప్రేమ’ మూవీ రివ్యూ
టైటిల్ : తొలిప్రేమ జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : వరుణ్ తేజ్, రాశీఖన్నా, సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది సంగీతం : తమన్.ఎస్ దర్శకత్వం : వెంకీ అట్లూరి నిర్మాత : బీవీయస్ఎన్ ప్రసాద్ ఫిదా సినిమాతో ఘనవిజయం సాధించిన మెగా హీరో వరుణ్ తేజ్ లీడ్రోల్లో తెరకెక్కిన మరో ఫీల్ గుడ్ లవ్ స్టోరి తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ హీరోగా చరిత్ర సృష్టించిన తొలిప్రేమ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో వరుణ్ మరోసారి అదేఫీట్ రిపీట్ చేయాలని ప్రయత్నించాడు. వెంకీ అట్లూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా.. వరుణ్‌కు మరో బిగ్ హిట్ అందించిందా..? తొలి ప్రయత్నంలో వెంకీ అట్లూరి సక్సెస్ సాధించాడా..? కథ : ఆదిత్య (వరుణ్ తేజ్) తను అనుకున్నది ముక్కుసూటిగా చేసే మనస్థత్వం ఉన్న వ్యక్తి. ఎవరైన ఇది నీవల్ల కాదు అంటే ఎలాగైన ఆ పని చేసి చూపించటం ఆదికి అలవాటు. కోపం కూడా ఎక్కువే. అలాంటి ఆది ఓ రైలు ప్రయాణంలో పరిచయం అయిన వర్ష (రాశీఖన్నా) అనే అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. వర్షకు కూడా ఆదిత్య అంటే ఇష్టం ఏర్పడుతుంది. కానీ రైలు దిగేసరికి వర్ష కనిపించదు ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికినా దొరకదు. (సాక్షి రివ్యూస్) మూడు నెలల తరువాత ఆది జాయిన్ అయిన కాలేజ్ లోనే ఇంజనీరింగ్ చదవటానికి జాయిన్ అవుతుంది వర్ష. ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ కాలేజ్ లో జరిగి ఓ గొడవ మూలంగా ఆది, వర్షకు దూరంగా వెళ్లిపోతాడు. తరువాత ఆరేళ్లకి మరోసారి ఆదిత్య జీవితంలోకి వర్ష వస్తుంది. లండన్ లో ఆదిత్య పనిచేసే కంపెనీలో సైట్ మేనేజర్‌గా వర్ష జాయిన్ అవుతుంది. అప్పటికీ వర్షను ద్వేషిస్తునే ఉంటాడు ఆది. ఆదికి వర్షమీద కోపం ఎలా తగ్గింది..? తిరిగి ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా కథ. నటీనటులు : వరుణ్ తేజ్.. ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. ఫిదా సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న వరుణ్ ఈ సినిమాలో ఆ ఇమేజ్ను కంటిన్యూ చేశాడు. స్టైలిష్ గా కనిపించాడు. అయితే కొన్ని సీన్స్‌లో వరుణ్ కాస్త బొద్దుగా కనిపించి ఇబ్బంది పెట్టాడు. గత సినిమాలతో పోలిస్తే నటన పరంగానే కాదు డ్యాన్స్‌లపరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చూపించాడు వరుణ్. (సాక్షి రివ్యూస్)వర్ష పాత్రకు రాశీఖన్నా పూర్తి న్యాయం చేసింది. పరిస్థితులను బట్టి సర్దుకుపోయే అమ్మాయిగా అద్భుతంగా నటించింది. రాశీ కెరీర్ లోనే వర్ష బెస్ట్ క్యారెక్టర్ అనటంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు. రాశీ కూడా అదే స్థాయి పర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రాశీఖన్నా నటనకు యూత్ ఆడియన్స్ ఫిదా అవుతారు. హీరో ఫ్రెండ్‌గా ప్రియదర్శి ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపించాడు. గత సినిమాలతో పోలిస్తే కామెడీ కాస్త తగ్గినా. మంచి నటన కనబరిచాడు. బెట్టింగ్ రాజు గారు పాత్రలో హైపర్ ఆది తన మార్క్ పంచ్ డైలాగ్‌లతో అలరించే ప్రయత్నం చేశాడు. సీనియర్ నటులు నరేష్, సుహాసినిలవి దాదాపు అతిథి పాత్రలే అయినా ఉన్నంతలో తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : దర్శకుడు వెంకీ అట్లూరి తొలి ప్రయత్నంగా పెద్దగా ప్రయోగాలు చేయకుండా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్నే ఎంచుకున్నాడు. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం తరువాత విడిపోవటం తిరిగి కలుసుకోవటం అన్నది గతంలో చాలా సినిమాల్లో చూసిన కథే అయినా.. తనదైన కథనంతో తొలిప్రేమను ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించి సక్సెస్ సాధించాడు. తొలి భాగాన్ని యూత్ మెచ్చే ఎంటర్టైనింగ్ అంశాలతో తెరకెక్కించాడు వెంకీ. సెకండ్ హాఫ్‌ను ఎమోషనల్ డ్రామాగా చూపించే ప్రయత్నంలో కాస్త సాగదీశాడు.(సాక్షి రివ్యూస్) సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి. కాలేజ్ సీన్స్, సాంగ్స్‌తో పాటు లండన్ లో జరిగే ఎపిసోడ్స్‌ను చాలా అందంగా తెరకెక్కించాడు. తమన్ అందించిన ఆల్బమ్‌లో మూడు పాటలు గుర్తుండిపోయేవిగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ డైలాగ్స్ సినిమాటోగ్రఫి మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
నేను ప్రేమికుణ్ణి... కానీ లవర్ లేదు!
‘‘బాబాయ్ (పవన్ కల్యాణ్) ‘తొలిప్రేమ’ టైమ్కీ ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మార్పులొచ్చాయి. అప్పట్లో సెల్ఫోన్లు ఉండేవి కావు. అందుకే.. ఆ సినిమాలో హీరోయిన్‌కి ప్రేమలేఖ రాస్తాడు హీరో. కానీ.. ఇప్పుడలా కాదు. సెల్ఫోన్లు, సోషల్ మీడియా బాగా విస్తరించింది. నా ‘తొలిప్రేమ’ చిత్రంలో తొలి షాట్‌లోనే హీరోయిన్‌కి ప్రేమ విషయం చెప్పేస్తా’’ అని వరుణ్‌తేజ్ అన్నారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ ఈరోజు విడుదలవుతోంది. వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► వెంకీ నాకు ఐదారేళ్లుగా తెలుసు. నిహారిక షార్ట్ ఫిల్మ్స్‌కి రచనలో సహాయం చేశాడు. ఏ సినిమాకైనా కథే హీరో. తను చెప్పిన కథ నచ్చడం, ‘దిల్’ రాజుగారు వెంకీ గురించి చెప్పడంతో ఈ మూవీ చేశా. ఫస్ట్ సినిమా అయినా బాగా తీశాడు. ► ‘ఫిదా’ కంటే ముందే ‘తొలిప్రేమ’ సైన్ చేశా. అయితే ముందు ‘ఫిదా’ వస్తే బాగుంటుందనుకున్నాం. ఆ సినిమా తర్వాత వస్తున్న ‘తొలిప్రేమ’ పై మంచి అంచనాలున్నాయి. ఇదొక ప్యూర్ లవ్‌స్టోరీ. నేను అనుకుంటే ఏదైనా చేయగలను.. నేను చేసేదే కరెక్ట్ అనుకునే పాత్ర నాది. ఏదైనా చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నది హీరోయిన్ పాత్ర. విభిన్న మనస్తత్వాలున్న మేం ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. కల్యాణ్ బాబాయ్ ‘తొలిప్రేమ’తో మా సినిమాని పోల్చలేం. మా సినిమా ఈ జనరేషన్‌కి నచ్చుతుంది. ► కాలే జీ పార్ట్ షూటింగ్ చేసేటప్పుడు నా కాలేజీ డేస్ గుర్తొచ్చాయి. నిజజీవితంలో నేను టాపర్ కాదు కానీ సినిమాలో ఎకనామిక్స్‌లో టాపర్‌గా కనిపిస్తా. ఈ సినిమా చూశాక ఎక్కడో ఒక్క చోటైనా ప్రేక్షకులు ఇది మా లైఫ్‌లో జరిగిందనుకుంటారు. ► చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ప్రేమ. కాలేజ్ బంక్ కొట్టి మరీ సినిమాలు చూసేవాణ్ణి. హాలీవుడ్ లాంటి వైవిధ్యమైన చిత్రాలు తెలుగులో ఎందుకు తీయడం లేదనుకునేవాణ్ణి. కొత్త తరహా కథలకి మనమే శ్రీకారం చుడదామనుకుని వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నా. ► మెగా ఫ్యామిలీలోని హీరోల్లో ఎవరికి నచ్చిన తరహా కథలు వారు ఎంచుకుంటున్నారు. నాకు ప్రయోగాలతో కూడిన వైవిధ్యమైన కథలంటే ఇష్టం. కథల ఎంపికలో ‘ఫిదా’ నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కథ నాన్నగారికి (నాగబాబు) చెప్పలేదు. ‘తొలిప్రేమ’ కథ చెప్పా. బాగుందన్నారు. పైగా.. నువ్వు చేయాలనుకుని మైండ్‌లో ఫిక్స్ అయితే చేస్తావుగా.. ఏదో మాట వరసకి నన్ను అడుగుతున్నావ్ అంటారు (నవ్వుతూ). ► హిట్ అవుతుందని చేసిన సినిమా ఫ్లాప్ అయినప్పుడు బాధగా ఉంటుంది. తప్పు ఎక్కడ జరిగిందా అని మళ్లీ జరగకుండా చూసుకుంటా. ‘కంచె’ లాంటి సినిమాలు ఇండస్ట్రీకి రావాలి. నిర్మాతలకు డబ్బులొస్తేనే అటువంటి సినిమాలు మరిన్ని చేస్తారు. మా అంజనా ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తా. టైమ్ పడుతుంది. ► ఇంత స్టార్డమ్, స్టేటస్ వదులుకుని బాబాయ్ (కల్యాణ్) సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లారంటే అందుకు గట్స్ కావాలి. నేనైతే వెళ్లను. ► రెండు నెలల గ్యాప్ తర్వాత ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్‌రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నా. అంతరిక్షం నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది. నా కెరీర్లో అది ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. అనిల్ రావిపూడి ఓ పాయింట్ చెప్పాడు. కథ డెవలప్ చేయమన్నాం. ► సినిమాల్లో ప్రేమించడం తప్ప రియల్ లైఫ్‌లో లవ్‌లో పడలేదు. ‘వేలంటైన్స్ డే’కి ఏమీ లేదు. కాకపోతే ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోడానికి నా ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేషన్స్ జరిగే ప్లేసెస్‌కి వెళ్లేవాణ్ణి. స్కూల్‌డేస్‌లో చిన్న క్రష్ తప్ప వేరే ఏం లేదు. -
అతడి కోసమే మ్యాచ్‌లు చూస్తా : హీరోయిన్
భారత్ లో క్రికెట్, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్. అయితే లవ్ కాకపోయినా ఓ దక్షిణాది భామ యువ క్రికెటర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ భామ క్రికెటర్ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పింది. క్రికెట్ అంటే తనకు ఇష్టమని చెప్పిన రాశీఖన్నా, బుమ్రా బౌలింగ్ కోసమే మ్యాచ్‌లు చూస్తుంటానని తెలిపింది. బుమ్రా మ్యాచ్ లో ఉంటే రాత్రులు మేలుకొని మరి మ్యాచ్ చూస్తుందట ఈ భామ. గతంలోనూ బుమ్రా బౌలింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించింది. వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా తెరకెక్కిన తొలి ప్రేమ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నా ఫస్ట్ లవ్ అదే
‘తొలిప్రేమ’... జీవితంలో ఫస్ట్ లవ్ లేనివాళ్లు ఉండరు. అది ఫెయిలైనా జీవితాంతం గుర్తుంటుంది. ఫస్ట్ లవ్ ఇంపాక్ట్ అలాంటిది. ఈ నెల 10న వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన ‘తొలిప్రేమ’ రిలీజవుతుంది. ఈ చిత్రం అందరి మనసులపై మంచి ప్రభావం చూపిస్తుందంటున్నారు రాశీ ఖన్నా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ సందర్భంగా రాశీఖన్నా పలు విశేషాలు పంచుకున్నారు. ► ఈ సినిమా ఒప్పుకున్నాక నేను పవన్ కల్యాణ్ గారి తొలిప్రేమ (1998) సినిమాను కావాలనే చూశాను. అందులో హీరోయిన్ కీర్తీరెడ్డి ఇంట్రడక్షన్ హైౖలట్గా ఉంటుంది. నా ఇంట్రడక్షన్‌కి దానికి సంబంధం లేదు. నా సినిమాల్లో నా బెస్ట్ ఇంట్రడక్షన్ అంటే ‘జిల్’లో బావుంటుంది. ► నా తొలి ప్రేమ విషయానికొస్తే నా కాలేజీలో సీనియర్‌తో 17 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్ క్రష్ జరిగింది. అతనే ప్రపోజ్ చేశాడు (నవ్వుతూ). ► ఈ సినిమాలో నా పేరు వర్ష. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తా. ఒకటి∙19 ఏళ్ల కాలేజీ యువతిలా. మరోటి లండన్ గర్ల్. ఇంకో పాత్ర నా ఏజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. మూడు పాత్రలను చాలా ఎంజాయ్ చేశాను. ► కాలేజి గర్ల్ పాత్ర కోసం రెండు నెలలు వర్కవుట్ చేసి ఐదు కిలోలు తగ్గాను. తగ్గటం కోసం తిండి మానేయలేదు. ఫుల్‌గా తిని, జిమ్‌లో వర్కవుట్ చేశాను. రోజూ కనీసం రెండు గంటలైనా జిమ్‌లో గడిపాను. ఇప్పుడు అందరూ తగ్గావంటే చాలా ఆనందంగా ఉంది. ► వరుణ్ తేజ్ మంచి కోస్టార్. ఈ సినిమాలోని పాత్ర కోసం చాలా ఎక్సర్సైజ్ చేశాడు. జనరల్‌గా రోజుకి ఒక్కసారి జిమ్‌కి వెళ్లడం చాలా కష్టం. అటువంటిది రోజు మూడు సార్లు జిమ్ చేసేవాడు. ఈ సినిమాలో కారులో రొమాన్స్ జరిగే సీన్ బెస్ట్ సీన్. ► వెంకీకి ఈ కథ తయారుచేసుకోవటానికి రెండున్నరేళ్లు పట్టింది. కథను ఎంత బాగా రాశాడో అంతకంటే బాగా తీశాడు. ► ఈ ఏడాది తమిళంలో నావి మూడు సినిమాలు రిలీజవుతాయి. ఒకటి అథర్వ, ఇంకోటి ‘జయం’ రవి, మరోటి సిద్ధార్ధ్ పక్కన చేస్తున్న సినిమాలు. వీటిలో ఓ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీ రోల్ చేస్తున్నారు. ఆయ వెరీ డౌన్ టు ఎర్త్. ప్రస్తుతం సౌత్‌లో హ్యాపీగా ఉన్నాను. హిందీకి వెళ్లే ఐడియా లేదు. ఒకవేళ మంచి చాన్స్ వస్తే.. అప్పుడు ఆలోచిస్తా. -
బొమ్మలాట
సినిమా అంటే బొమ్మ. బొమ్మ ఎప్పుడు థియేటర్లో పడుతుందా అని ఎదురు చూస్తారు. అయితే ఎదురు చూసే బొమ్మ ఒకటి.. వచ్చే బొమ్మ ఇంకోటి! ఒకరి బొమ్మ వస్తుందని ఇంకొకరు ఈ మధ్య తమ బొమ్మలను వాయిదా వేస్తున్నారు. ఈ బొమ్మలాట కుర్చీలాటలా మారింది. ఒకరు కూర్చునే లోపు ఇంకొకరు... మ్యూజికల్ చైర్లో కుర్చీ కోసం పరిగెడతారు. కుర్చీలో కూర్చునే బొమ్మ ఏదో తెర మీద పడేవరకూ కన్ఫ్యూజనే. ఈ బొమ్మలాట కహానీపై ఓ కన్నేద్దాం. జనవరి 26... దేశ ప్రజలందరూ పండగ చేసుకునే రోజు. ఈసారి సినిమా లవర్స్కీ పండగ రోజే. ఎందుకంటే రిపబ్లిక్ డే సరిగ్గా శుక్రవారం వచ్చింది. సెలవు రోజు. కొత్త బొమ్మ పడుతుంది. థియేటర్ నిండుతుంది. క్యాష్ చేసుకోవడానికి ఇది సరైన టైమ్. అయితే ఇదే రోజు రిలీజ్ కావాల్సిన కొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘మనసుకు నచ్చింది’ సినిమాలు వాయిదా పడ్డాయి. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఆచారి ఆమెరికా యాత్ర’. కృష్ణమాచారి (మంచు విష్ణు) తప్పులు, అప్పలాచారి తిప్పలతో సాగే ఈ నవ్వుల యాత్రను జనవరి 26న చూపిద్దామనుకు న్నారు. అయితే యాత్రను పోస్ట్‌పోన్ చేసి, తర్వాత చూపించాలనుకుంటున్నారు. ఇక, ‘మనసుకు నచ్చింది’ విషయానికొస్తే.. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ఇది. పెళ్లికూతురో లేదా పెళ్లి కొడుకో పెళ్లి టైమ్‌కి పారిపోవడం వింటుంటాం. అలాంటిది పెళ్లికొడుకే పెళ్లికూతుర్ని లేపుకుపోతే కాస్త డిఫరెంట్ కదా! ఈ కాన్సెప్ట్‌తోనే ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టాలని డిసైడయ్యారు మంజుల. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని గత నెల 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఫిబ్రవరి 16కి వాయిదా వేశారు. ఈ రెండు సినిమాలూ ఎందుకు వాయిదా పడ్డాయి? అంటే ప్రధానంగా చెబుతున్న కారణం ‘భాగమతి’, హిందీ ‘పద్మావత్’. ఈ రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. మరోవైపు ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘మనసుకు నచ్చింది’ కూడా ఆల్రెడీ పోస్టర్లు, టీజర్ల ద్వారా ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఒకేసారి నాలుగు సినిమాలు విడుదలైతే కలెక్షన్స్ డివైడ్ అవ్వడంతో పాటు, థియేటర్లు తక్కువగా దొరుకుతాయి. అందుకే ఈ రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి. చెన్నై పోలామ్ వాంగ అటు చెన్నై పోలామ్ (వెళదాం) వాంగ (రండి). జనవరి 26న విడుదల కావాల్సిన విశాల్ ‘ఇరంబుదురై’ వరలే (రాలేదు). ఆడ విడుదల కావాల్సిన ‘ఇరుంబుదురై’ ఈడ ‘అభిమన్యుడు’గా రిపబ్లిక్‌డేకి రావాల్సింది. కానీ రాలేదు. మరి.. ఎప్పుడు ఆగుమ్ (అవుతుంది) అనేది ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు. ఇంకో సినిమా ‘జయం’ రవి నటించిన ‘టిక్. టిక్. టిక్’. ఇండియన్ స్క్రీన్‌పై ప్రేక్షకులు చూడబోతున్న ఫస్ట్ స్పేస్ మూవీ ఇది. ముందు అనుకున్నట్లుగా విడుదల చేసి ఉంటే జనవరి 26న తమిళ ప్రేక్షకులు చూసేవాళ్లు. అయితే వాయిదా పడింది. రిలీజ్ చేసేద్దామనుకుని ప్రమోషన్ కూడా భారీగా చేశారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ చేయలేదు. న్యూ రిలీజ్ డేట్‌ను ఇంకా ఎనౌన్స్ చేయలేదు. ఇలాగే మమ్ముట్టీ మలయాళ సినిమా ‘స్ట్రీట్‌లైట్స్’ విషయంలోనూ జరిగింది. జనవరి 26న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా వాయిదా పడి, ఈ నెల 2న రిలీజైంది. సీన్ రిపీటైంది! ఒకేరోజు రెండుకి మించి సినిమాలు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి కాబట్టి, జనవరి 26కి విడుదల కావాల్సిన రెండు మూడు సినిమాలు వెనక్కి తగ్గాయి. సేమ్ సీన్ ఫిబ్రవరి 9న కూడా రిపీట్ అయ్యింది. మోహన్‌బాబు ‘గాయత్రి’, వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’, నిఖిల్ ‘కిరాక్ పార్టీ’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’, నాగశౌర్య ‘కణం’ సినిమాల రిలీజ్ డేట్‌ను ముందుగా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. ఒకే రోజు ఐదు సినిమాల రిలీజ్ అయితే లెక్కల్లో తేడాలు వస్తాయి. కనీసం రెండు సినిమాలన్నా వాయిదా పడతాయనుకున్నారు. అనుకున్నట్లే ‘కణం’ సినిమా ఫిబ్రవరి 23కు వాయిదా పడింది. అనుకున్నట్లుగానే ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్’ 9కి వస్తున్నాయి. ‘తొలిప్రేమ’ ఒక్క రోజు వాయిదా పడి ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ‘కిరాక్ పార్టీ’ చేసుకోవడానికి ఇంకాస్త టైముంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చిత్రనిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర పేర్కొన్నారు. వార్ వేడి తగ్గేలా లేదు! ఏప్రిల్ వార్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. ఈ సినిమాతో ఏప్రిల్ వార్కి నాని సై అంటున్నారు. నితిన్ కూడా తన సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నాడు. ఆల్రెడీ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో నాగార్జున, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్ అనే నేను’ చిత్రంతో మహేశ్ బాబు, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అంటూ అల్లు అర్జున్ ఏప్రిల్ వార్కి కర్చీఫ్ వేశారు. యాక్చువల్లీ సినిమాల రిలీజ్‌కి బెస్ట్ సీజన్స్‌లో ఏప్రిల్ ఒకటి. సెలవులను క్యాష్ చేసుకోవచ్చు. ఎన్ని సినిమాలు విడుదలైనా ఫర్వాలేదు. అయితే ఒకేరోజు ఎక్కువ సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ డివైడ్ అవుతాయి. మరి.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా తమ సినిమాను వాయిదా వేసుకుంటారా? చూడాలి. చిట్టికి ఫ్రీడమ్ ఆ రోజేనా? గతేడాది దీపావళికి రిలీజ్ అన్నారు. థియేటర్లో బొమ్మపడలేదు. మళ్లీ జనవరి 25 అని మనసు మార్చుకున్నారు. ఇదంతా ‘2.0’ సినిమా రిలీజ్ గురించే. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్యతారలుగా రూపొందిన సినిమా ‘2.0’. ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందింది. జనవరిలో చిట్టి మిస్సయ్యాడు. ఏప్రిల్‌లో చూపిస్తామని చిత్రబృందం ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు సమ్మర్‌కి కూడా రోబో సందడి లేదట. సినిమా వచ్చేది ఆగస్టు 15నే అని ట్రేడ్ విశ్లేషకులు తాజాగా మంగళవారం న్యూ డేట్‌ని తెర మీదకు తీసుకొచ్చారు. అదే నిజమైతే అప్పుడు అక్షయ్‌కుమార్ ‘గోల్డ్’ ఇరుకుల్లో పడ్డట్లే. అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15కి రావాలి. మరి.. చిట్టికి ఫ్రీడమ్ ఆ రోజేనా? అంటే... థియేటర్లోకి వచ్చేది ఆ రోజేనా? మరి.. చిట్టి అదే రోజున వస్తే.. హిందీలోనూ బొమ్మ పడుతుంది కాబట్టి.. ‘గోల్డ్’ డేట్ మారుతుందా? వెయిట్ అండ్ సీ. సౌత్‌లో థియేటర్స్క్లోజ్! రిలీజ్ కావడానికి ఇన్ని సినిమాలు పోటీ పడుతుంటే మార్చి 1నుంచి థియేటర్స్ మూతపడనున్నాయన్న వార్తలు వస్తున్నాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల ఛార్జీల వైఖరికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అభ్యంతరం తెలిపింది. ముందుగా సూచించిన సమయానికి కల్లా డిజిల్ సర్వీస్ ప్రొవైడర్లు చర్చలకు రాకపోతే మార్చి1 నుంచి రెండు రాష్ట్రాల్లోని థియేటర్స్‌ను మూసివేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు పి.కిరణ్ తెలిపారు. ఇది మాత్రమే కాదు.. తమిళ, మలయాళం, కన్నడ పరిశ్రమల్లో కూడా ఇదే పరిస్థితి. ఒకవేళ ఈ ఇష్యూ ఒక కొలిక్కి రాక.. సౌత్‌లో థియేటర్స్ షట్ డౌన్ అయితే అసలుకే ఎసరు వస్తుందేమో! బాలీవుడ్ సినిమాలూ కుర్చీలాట ఆడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడి ‘పద్మావత్’ తెరకొచ్చింది. ‘బజార్’, ‘సూర్మ’, ‘సోనూ కే టిట్టు కీ స్వీటీ’ వంటి సినిమాలూ వాయిదా పడ్డాయి. పోస్ట్‌పోన్ అయిన మరికొన్ని సినిమాలు.. - ముసిమి శివాంజనేయులు -
ఇక్కడి నీటిలోనే ఏదో ఉంది – ‘దిల్’ రాజు
‘‘భీమవరం ఊర్లో ఏముందో తెలియదు కానీ ఇక్కడి నుంచి త్రివిక్రమ్, సునీల్ వంటివారు.. పక్కనున్న పాలకొల్లు నుంచి చిరంజీవిగారు, కృష్ణంరాజుగారు, ప్రభాస్ వంటి ఎందరో తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చారు. ఇక్కడి నీటిలోనే ఏదో ఉంది. సినిమాకు కావాల్సిన కళ ఇక్కడ ఉంది. అదే మిమ్మల్ని, మమ్మల్ని ఇక్కడివరకు తీసుకొచ్చింది’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు. వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘తొలిప్రేమ’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా భీమవరంలో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘1998లో వచ్చిన ‘తొలిప్రేమ’కు, 2018లో రానున్న ‘తొలిప్రేమ’కు నేనే డిస్ట్రిబ్యూటర్‌ని. ఆ ‘తొలిప్రేమ’ లా ఈ చిత్రం కూడా 100 శాతం యూత్‌దే. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. ‘ఫిదా’ తర్వాత ఈ సినిమా రావడం వరుణ్‌కి ప్లస్ అవుతుంది’’ అన్నారు. ‘‘తొలిప్రేమ’ టైటిల్ పెట్టినప్పుడు కాస్త భయపడ్డాం. వరుణ్ ఏమో ‘పర్వాలేదు కదా’ అన్నాడు. ఆ సినిమాతో పోలిక పెట్టను కానీ.. దాని గౌరవాన్ని కాపాడతాను’’ అన్నారు వెంకీ అట్లూరి. ‘‘చిరంజీవితో సినిమా తీయాలని 33ఏళ్ల కిందట తణుకు నుండి మద్రాస్ వెళ్లాను. బన్నీతో ‘ఆర్య 2’, రామ్‌చరణ్‌తో ‘మగధీర’, పవన్‌కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ తీశా. వరుణ్‌తో తీసిన ‘తొలిప్రేమ’ గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘వెంకీకి తొలి చిత్రమే అయినా బాగా తీశాడు. భవిష్యత్‌లో పెద్ద దర్శకుడవుతాడు. ఈ సినిమాను అందరి కంటే ఎక్కువగా నమ్మింది ‘దిల్’రాజుగారే. బాపినీడు, ప్రసాద్‌గారు అద్భుతంగా నిర్మించారు. సినిమాటోగ్రాఫర్ జార్జ్ విలియమ్స్ ప్రతి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. కథకు తగ్గ టైటిల్ అనిపించే ‘తొలిప్రేమ’ పెట్టాం. బాబాయ్ టైటిల్‌ని పాడు చేసేలా ఉండదు ఈ సినిమా’’ అన్నారు వరుణ్ తేజ్. ఎమ్మెల్యే రాధాకృష్ణ, రాశీఖన్నా, నటుడు ‘హైపర్’ ఆది, ఎస్.ఆర్.కె.ఆర్.కాలేజ్ ప్రిన్సిపాల్ పార్థసారథి పాల్గొన్నారు. -
‘తొలి ప్రేమ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
‘తొలిప్రేమ’తో ‘ఇంటిలిజెంట్’గా..!
ఫిబ్రవరి రెండో వారంలో వెండితెరపై ఆసక్తికరమైన పోటి నెలకొంది. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ఒక్క రోజు తేడాతో థియేటర్లలోకి వస్తున్నారు. తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాలు ఈ నెల 9, 10 తేదిల్లో రిలీజ్ కానున్నాయి. 9వ తారీఖున మోహన్‌బాబు లీడ్ రోల్లో నటిస్తున్న గాయత్రి సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూడు చిత్రాలకు సంగీత దర్శకుడు ఒకరే. తొలిప్రేమ, ఇంటిలిజెంట్, గాయత్రి చిత్రాలకు యువ సంగీత దర్శకుడు తమన్ సంగీత మందిస్తున్నారు. గాయత్రి సినిమా పనులు ఇప్పటికే పూర్తి కాగా తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాలు ప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో ఉన్నాయి. రెండు సినిమాలకు ఒకేసారి పని చేస్తున్న తమన్, ఆ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘తొలిప్రేమతో ఇంటిలిజెంట్‌గా పని జరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశాడు తమన్. తొలి ప్రేమతో క్లాస్, ఇంటిలిజెంట్ తో మాస్ ఆడియన్స్ ని ఒకేసారి అలరిస్తున్నాడు ఈ యువ కళాకారుడు. #tholiprema tho #intelligent ga pannijaruguthondhiiiii ♥️💯 🎹🎧 pic.twitter.com/iOnto9qHs1 — thaman S (@MusicThaman) 31 January 2018 -
‘తొలిప్రేమ’ ట్రైలర్ రిలీజ్ వాయిదా..!
ఫిదా సినిమాతో ఘనవిజయం సాదించిన మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తొలిప్రేమ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న తొలిప్రేమ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ రోజు (గురువారం) ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్ రిలీజ్ వాయిదా పడింది. ట్రైలర్ వాయిదా పడిన విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. త్వరలోనే కొత్త రిలీజ్ టైంను ప్రకటిస్తామని, మీ నిరీక్షణకు తగ్గ స్థాయిలో ట్రైలర్ ఉంటుంది అంటూ ట్వీట్ చేశాడు తమన్. The new time of #tholiprematrailer will be announced soon !! Delay due to technical issues It’s worth a wait for sure !! Thanks for the love ♥️ pic.twitter.com/0vFX8Lrzbq — thaman S (@MusicThaman) 1 February 2018 -
కన్ఫ్యూజన్ వద్దని..
వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవియస్‌యన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తొలి ప్రేమ’. సాయిధరమ్ తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ రెండు సినిమాలను ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకున్నారు. దాంతో రెండు చిత్రాల నిర్మాతలు డిస్కస్ చేసుకొని ‘తొలిప్రేమ’ సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా బీవియస్‌యన్ ప్రసాద్, ‘దిల్’ రాజు విలేకరులతో మాట్లాడారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘కష్టపడి సినిమా చేశాక రెవెన్యూ తెచ్చుకోవడం ముఖ్యం. అందుకని ప్రసాద్‌గారు ‘తొలిప్రేమ’ సినిమాను 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య హీరోలు సినిమాలు వేగంగా చేస్తున్నారు. దాంతో ప్రతి శుక్రవారం నాలుగైదు సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకని క్లాష్ ఏర్పడుతోంది. నేను ‘తొలి ప్రేమ’ చూశాను. ప్రసాద్‌గారి బ్యానర్లో వచ్చిన ‘డార్లింగ్, అత్తారింటికి దారేది’లాగా మంచి సక్సెస్ సాధిస్తుంది. డిస్ట్రిబ్యూటర్‌గా లాస్ట్ ఇయర్ ఫెయిలయ్యాను. ఈ ఇయర్ ‘భాగమతి’తో హిట్ సాధించాను. ‘తొలిప్రేమ’ కూడా సక్సెస్ అవుతుందనుకుంటున్నా’’ అన్నారు. ‘‘తొలిప్రేమ’ను ఫిబ్రవరి 9న విడుదల చేద్దామనుకున్నాం. అదే రోజు ‘ఇంటిలిజెంట్’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వరుణ్, ధరమ్‌తేజ్ ఫ్యాన్స్ మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడకూడదని ‘దిల్ ’ రాజుగారితో మాట్లాడి ఫిబ్రవరి 10న విడుదలను ప్లాన్ చేశాం’’ అని బీవియస్‌యన్ ప్రసాద్ అన్నారు. -
వరుణ్ ‘తొలిప్రేమ’ స్టిల్స్
-
తొలిప్రేమ టైటిల్ అనగానే భయపడ్డా– వరుణ్ తేజ్
‘‘ప్రసాద్‌గారికి, నాకు మంచి అనుబంధం ఉంది. ‘మగధీర’ సినిమాకు ఆయన కో–ప్రొడ్యూసర్. పవన్‌కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ సినిమా తీసిన ప్రసాద్‌గారు ఇప్పుడు పవన్ టైటిల్ ‘తొలి ప్రేమ’తో వరుణ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆ ‘తొలిప్రేమ’తో పవన్‌కి ఎంత పేరొచ్చిందో.. ఈ ‘తొలిప్రేమ’ పెద్ద హిట్ అయి వరుణ్‌కి అంతే మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలిప్రేమ’. ఎస్.ఎస్.తమన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఫిదా’ సినిమాకి ముందు ‘తొలిప్రేమ’ చిత్రాన్ని వెంకీ మా బ్యానర్లో చేయాల్సింది. కానీ, ‘ఫిదా’ కారణంగా తను బాపినీడుకి కథ వినిపించడం, ఆయనకు నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది. మా బ్యానర్లో చేయాల్సిన సినిమా వారి బ్యానర్లో చేశారనే కారణంతో బాపినీడు ఈ సినిమా టోటల్ రైట్స్‌ను నాకు ఇచ్చేశాడు. ఇలాంటి విషయాలు అరుదుగా జరుగుతుంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆరు నెలల వరకు ఏ టైటిల్ పెడదామని ఆలోచించాం. ‘తొలిప్రేమ’ టైటిల్ పెడదామని వెంకీ అన్నారు. నాకు ఇష్టమున్నా కాస్త భయపడ్డాను. ఆ టైటిల్ పెట్టుకుని ఏమైనా తేడా వస్తే మనకు పగిలిపోద్ది అన్నాను. ఎందుకంటే అది బాబాయ్‌కి ఐకానిక్ మూవీ. మా పెదనాన్న, బాబాయ్ వేసిన ఈ ఫౌండేషన్‌ను పాడు చేయకుండా మంచి సినిమాలు చేస్తాం’’ అన్నారు వరుణ్‌తేజ్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నన్ను నమ్మిన వ్యక్తి, ఇండస్ట్రీని నన్ను నమ్మేలా చేసిన వ్యక్తి ‘దిల్’ రాజుగారు. ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న నాకు ఆరు అడుగుల నాలుగు అంగుళాల ధైర్యాన్నిచ్చాడు వరుణ్. నా నమ్మకానికి ఊపిరి పోసిన వ్యక్తి బాపినీడు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వెంకీ అట్లూరి. రాశీఖన్నా, తమన్ పాల్గొన్నారు. -
‘తొలి ప్రేమ’ ఆడియో రిలీజ్
-
నేనే చెబుతా
... అప్పటి వరకు వెయిట్ చేయండి. నా నెక్ట్స్ సినిమా గురించి ఊహాగానాలను, గాసిప్లను నమ్మొద్దు అంటున్నారు హీరో వరుణ్‌తేజ్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందుతున్న ‘తొలిప్రేమ’ సినిమా పూర్తి కావచ్చింది. ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. దీంతో వరుణ్‌తేజ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఊహగానాలు మొదలయ్యాయి. ‘‘నా కొత్త ప్రాజెక్ట్ ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. ఓకే అయితే నేనే చెబుతాను’’ అని సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు వరుణ్. -
పాటతో ముగింపు!
జస్ట్... మూడంటే మూడే రోజులు షూటింగ్ జరిపితే వరుణ్ తేజ్ ప్రేమకథ కంప్లీట్ అవుతుందట. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలి ప్రేమ’. ఇందులో రాశీ ఖన్నా కథానాయిక. ‘‘షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. వైజాగ్‌లో జరుపబోయే మూడు రోజుల సాంగ్ షూట్‌తో మూవీ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను సార్ట్ చేశాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో బందేవ్ పాత్రలో రానా నటిస్తున్న సినిమా ‘హాథీ మేరే సాథీ’. ఇందులో వరుణ్ తేజ్ కూడా కీలక పాత్ర చేయనున్నారట. ‘‘హాథీ మేరే సాథీ’లో రానా, వరుణ్ తేజ్ పాత్రలకు ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కోట శ్రీనివాసరావుగారు ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి తమిళ్లో డబ్ చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు సాల్మన్. అంతేకాదు.. ఈ నెల 25 నుంచి మార్చి వరకు ఈ సినిమా షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఆ తర్వాత కేరళలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. -
కుమ్మేస్తున్నాడు
అకౌంట్స్ మేటర్‌లో ఏదైనా తేడా వస్తే ఎవరైనా ఊరుకుంటారా? లెక్కలు సరి చేస్తారు. అవసరమైతే తేడా చేసినవాళ్ల తాట తీస్తారు. ప్రజెంట్ హీరో వరుణ్ తేజ్ అదే పనిలో ఉన్నారు. తన లవ్ అకౌంట్‌ను ఇబ్బందిపెట్టిన కొందరి పోరగాళ్లను కుమ్మేస్తున్నాడు. మరి... ఈ లవ్ అకౌంట్ ఫుల్ డీటెల్స్ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందేనని అంటున్నారు ‘తొలిప్రేమ’ చిత్రబృందం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలిప్రేమ’. రాశీఖన్నా కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాలోని ఫైట్ సీన్స్‌ను హైదరాబాద్‌లోని ఓ కాలేజ్ క్యాంపస్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి అలా ఉంచితే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మల్టీస్టారర్ మూవీలో వెంకటేశ్‌తో కలిసి వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని ఫిల్మ్‌నగర్ తాజా సమాచారం. గతంలో ఈ సినిమాకు ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనే టైటిల్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. -
తొలి ప్రేమని మరచిపోలేం
‘మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరచిపోలేం’ అంటున్నారు వరుణ్ తేజ్. సో.. వరుణ్ ఒకప్పుడు లవ్‌లో పడ్డారన్న మాట అని ఫిక్స్ అవ్వకండి. ఇది సినిమాలో చెప్పిన డైలాగ్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ’. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. అందులో ఉన్న డైలాగ్ ఇది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
‘తొలిప్రేమ’ టీజర్ విడుదల
-
‘తొలిప్రేమ’ను ఎప్పటికీ మరిచిపోలేం..!
ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ తొలిప్రేమ. బాబాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణపనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. వరుణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈసినిమా టీజర్ ను బుధవారం రిలీజ్ చేశారు. తమన్నా స్వరాలందిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరి 9న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘తొలిప్రేమ’ను ఎప్పటికీ మరిచిపోలేం..!