అతడి కోసమే మ్యాచ్‌లు చూస్తా : హీరోయిన్‌ | Jasprit Bumrah’s bowling steals the heart of Raashi Khanna | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 8 2018 4:06 PM | Last Updated on Thu, Feb 8 2018 4:08 PM

Bumrah - Sakshi

బుమ్రా

భారత్‌ లో క్రికెట్‌, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్‌ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్‌. అయితే లవ్‌ కాకపోయినా ఓ దక్షిణాది భామ యువ క్రికెటర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర‍్భంగా మీడియాతో మాట్లాడిన ఈ భామ క్రికెటర్‌ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పింది.

క్రికెట్‌ అంటే తనకు ఇష్టమని చెప్పిన రాశీఖన్నా, బుమ్రా బౌలింగ్ కోసమే మ్యాచ్‌లు చూస్తుంటానని తెలిపింది. బుమ్రా మ్యాచ్‌ లో ఉంటే రాత్రులు మేలుకొని మరి మ్యాచ్ చూస్తుందట ఈ భామ. గతంలోనూ బుమ్రా బౌలింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించింది.  వరుణ్ తేజ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన తొలి ప్రేమ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement