bumrah
-
ఐసీసీ టెస్టు జట్టులో బుమ్రా, జడేజా, జైస్వాల్
దుబాయ్: గతేడాది సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్–2024’ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. 11 మందితో కూడిన ఈ జట్టుకు ఆ్రస్టేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సారథిగా ఎంపిక చేయగా... జట్టులో బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ రూపంలో నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్, మ్యాట్ హెన్రీ ఎంపిక కాగా... శ్రీలంక నుంచి కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నాడు. 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బుమ్రా... టెస్టుల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. కెరీర్లో 20కి లోపు సగటుతో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన బుమ్రా... ఇటీవల‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో 32 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. జడేజా గతేడాది 527 పరుగులు చేయడంతో పాటు... 48 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఇక ఆసీస్‌తో సిరీస్‌లో ప్రధాన ప్లేయర్లంతా విఫలమైన చోట చక్కటి ప్రదర్శన కనబర్చిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్... గతేడాది 54.74 సగటుతో 1478 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (1556) అగ్రస్థానంలో ఉండగా... జైస్వాల్ రెండో ‘ప్లేస్’లో నిలిచాడు. 23 ఏళ్ల జైస్వాల్ దక్షిణాఫ్రికా పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శన చేశాడు. గతేడాది విలియమ్సన్ 1013 పరుగులు చేయగా... శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ 1049 పరుగులు చేశాడు. ఇక పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోపీ’అందించిన ఆసీస్ సారథి కమిన్స్ 2024లో 37 వికెట్లు పడగొట్టడంతో పాటు 306 పరుగులు చేశాడు. మరోవైపు ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’లో టీమిండియా నుంచి ఒక్క ప్లేయర్‌కూ చోటు దక్కలేదు. గతేడాది భారత జట్టు కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడటంతో మన ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించలేదు. వన్డే జట్టుకు శ్రీలంక ప్లేయర్ చరిత అసలంక కెపె్టన్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024: కమిన్స్ (కెప్టెన్ ; ఆ్రస్టేలియా) యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, బుమ్రా (భారత్), డకెట్, రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (ఇంగ్లండ్), విలియమ్సన్, హెన్రీ (న్యూజిలాండ్), కమిందు మెండిస్ (శ్రీలంక). -
మాటల్లో వర్ణించలేను: బుమ్రా భావోద్వేగం.. రోహిత్ శర్మ భార్య రితికా రిప్లై వైరల్(ఫొటోలు)
-
పిచ్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం: గంభీర్
బెంగళూరు: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగి మంచి ఫలితాలు సాధించింది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా తమ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని న్యూజిలాండ్‌పై కూడా టీమిండియా అమలు చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా పేసర్లకు ఇది సన్నాహకంగా పనికొస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ‘పరిస్థితులు, పిచ్, ప్రత్యర్థిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. మా డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండటం సానుకూలాంశం. వారిలోంచి ఎవరినైనా ఎంచుకోవచ్చు. అందరూ జట్టును గెలిపించగల సమర్థులే అని మా నమ్మకం. చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ను చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవల శ్రీలంక చేతిలో 0–2తో టెస్టు సిరీస్‌లో ఓడిన కివీస్... 37 వికెట్లను స్పిన్నర్లను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్, అక్షర్‌లకు కూడా తొలి టెస్టులో చోటు ఇస్తారా అనేది ఆసక్తికరం. ‘వారిద్దరూ ప్రతిభావంతులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరినీ మేం పక్కన పెట్టడం లేదు. అయితే జట్టును గెలిపించగల 11 మందిని ఎంపిక చేయడమే అన్నింటికంటే ముఖ్యం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. -
T20 World Cup 2024: కసితీరా కప్ కొట్టారు.. టి20 విశ్వ విజేత భారత్
ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... టైటిల్ వేటలో దక్షిణాఫ్రికా వేగంగా దూసుకుపోతోంది... 30 బంతుల్లో 30 పరుగులు, చేతిలో 6 వికెట్లతో సునాయాసంగా గెలిచే స్థితిలో నిలిచింది. తర్వాత ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇవ్వగా సమీకరణం 24 బంతుల్లో 26 పరుగులుగా మారింది. క్లాసెన్, మిల్లర్‌లాంటి హిట్టర్లు ఉండటంతో భారత్ ఆశలు కోల్పోయింది. కానీ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో మ్యాజిక్ మొదలైంది. తొలి బంతికే క్లాసెన్ వెనుదిరగ్గా... 18 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. కథ క్లైమాక్స్‌కు చేరింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. మిల్లర్ ఉండటంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. కానీ పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ వద్ద సూర్యకుమార్ అత్యద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అంతే... తర్వాతి ఐదు బంతులు లాంఛనమే అయ్యాయి... భారత్ప్రపంచ విజేతగా హోరెత్తే సంబరాల్లో మునిగిపోయింది. ఎన్నాళ్లయింది భారత క్రికెటర్లలో ఈ ఆనందాన్ని చూసి... ఎన్నేళ్లయింది భారత క్రికెట్ అభిమానులు ఇలాంటి గెలుపు సంబరాలు చేసుకొని... అందినట్లే అంది చేజారిపోతున్న ఐసీసీ ట్రోఫీ విజయాలు... ఆఖరి మెట్టుపై తడబడిన ప్రపంచ కప్ సమరాలు... అన్నీ దాటి ఇప్పుడు ఆహా అనిపించే ప్రదర్శనతో భారత జట్టు సగర్వంగా నిలిచింది. ఏడు నెలల క్రితం రాల్చిన కన్నీటి చుక్కల స్థానే ఇప్పుడు ఆనంద బాష్పాలు... నియంత్రించలేని భావోద్వేగాలు... ఎన్నోసార్లు చేరువగా వచ్చిన ట్రోఫీని దూరమైన బాధను పూర్తిగా మరిచేలా ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌గా చేతిలో వాలిన కప్... సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ చేజారిన తర్వాత ఈ సారైనా టి20 ప్రపంచకప్ ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా అజేయంగా అద్భుతాన్ని చేసి చూపించింది. రెండోసారి విశ్వ విజేతగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 2007లో తొలి టైటిల్ నెగ్గిన తర్వాత ఆరు ప్రయత్నాల్లో విఫలమైన టీమిండియా ఇప్పుడు మళ్లీ ట్రోఫీని అందుకుంది.అప్పుడెప్పుడో కపిల్ వన్డే కప్ (1983) తెచ్చినపుడు మనలో చాలామందికి తెలీదు. అదొక వార్తగానే తెలుసుకున్నాం. కానీ ధోని తొలి టి20 ప్రపంచకప్‌ను టీవీల్లో చూశాం. తెగ సంబరపడ్డాం. సొంతగడ్డపై మళ్లీ అదే అదే ధోని (2011) వన్డే విశ్వవిజేతను చేస్తే పెద్ద పండగ చేసుకున్నాం. మళ్లీ... మళ్లీ మళ్లీ ఎంత ప్రయత్నించినా సెమీస్ లేదంటే ఫైనల్స్‌తోనే సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టి20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కరీబియన్ గడ్డపై సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. రెండోసారి టి20 ప్రపంచకప్‌ను అందుకుంది. రోహిత్ బృందం జగజ్జేతగా అవతరించడంతో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది. బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): భారత జట్టు టి20 వరల్డ్ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... డికాక్ (31 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టబ్స్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. హార్దిక్ పాండ్యా (3/20) మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా... బుమ్రా, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించగా... బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. తదుపరి టి20 ప్రపంచకప్‌కు 2026లో భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి. కీలక భాగస్వామ్యాలు... టోర్నీలో వరుసగా విఫలమైన కోహ్లి తుది పోరులో మాత్రం తన స్థాయి ఆటను ప్రదర్శించాడు. జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌ను కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. అతను 3 ఫోర్లు బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్లో అనూహ్యంగా దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కేశవ్ మహరాజ్ వేసిన ఈ ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలచినా... నాలుగో బంతికి రోహిత్ శర్మ (9) వెనుదిరిగాడు. చివరి బంతికి రిషభ్ పంత్ (0) కూడా అవుట్ కాగా, సూర్యకుమార్ (3) కూడా విఫలం కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఐదో స్థానంలో వచ్చిన అక్షర్ చక్కటి బ్యాటింగ్‌తో నిలిచాడు. మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కోహ్లి మరో ఎండ్‌లో నెమ్మదించాల్సి వచ్చింది. పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు చేసింది. నలుగురు వేర్వేరు బౌలర్లు మార్క్రమ్, మహరాజ్, షమ్సీ, రబాడ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టిన అక్షర్ పటేల్ ధాటిగా ఆడి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. 13.1 ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే అదే ఓవర్లో అక్షర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి, అక్షర్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించారు. ఆ తర్వాత కోహ్లి, శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 57 పరుగుల భాగస్వామ్యం (33 బంతుల్లో) స్కోరు వేగాన్ని తగ్గకుండా చేసింది. కోహ్లి 48 బంతుల్లో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 134/4. చివరి 3 ఓవర్లలో భారత్ 42 పరుగులు (వరుసగా 16, 17, 9) పరుగులు రాబట్టింది. తొలి 13 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసి కోహ్లి తర్వాతి 35 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా 29 పరుగులే చేశాడు. అయితే తన ఆఖరి 11 బంతుల్లో 26 పరుగులు సాధించి మెరుగైన స్ట్రయిక్ రేట్‌తో ముగించాడు. చివరి 8 బంతుల్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. క్లాసెన్ మెరిసినా... ఛేదనలో దక్షిణాఫ్రికా 12 పరుగులకే హెన్డ్రిక్స్ (4), మార్క్రమ్ (4) వికెట్లు కోల్పోయింది. అయితే డికాక్, స్టబ్స్ ధాటిగా ఆడుతూ స్కోరును నడిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 38 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. 10 ఓవర్లలో స్కోరు 81 పరుగులకు చేరింది. ఒకవైపు డికాక్ చక్కటి బ్యాటింగ్‌తో నిలబడగా... మరోవైపు క్లాసెన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.తర్వాతి 6 ఓవర్లలో దక్షిణాఫ్రికా 51 పరుగులు చేసింది. ఇందులో క్లాసెన్ ఒక్కడే 44 పరుగులు సాధించాడు. మధ్యలో డికాక్ వెనుదిరిగినా క్లాసెన్ తగ్గలేదు. ముఖ్యంగా అర్షద్ వేసిన 15వ ఓవర్లో క్లాసెన్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి. ఈ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) మహరాజ్ 9; కోహ్లి (సి) రబడ (బి) జాన్సెన్ 76; పంత్ (సి) డికాక్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) క్లాసెన్ (బి) రబడ 3; అక్షర్ పటేల్ (రనౌట్) 47; శివమ్ దూబే (సి) మిల్లర్ (బి) నోర్జే 27; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 5; జడేజా (సి) మహరాజ్ (బి) నోర్జే 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–34, 4–106, 5–163, 6–174, 7–176. బౌలింగ్: జాన్సెన్ 4–0–49–1, మహరాజ్ 3–0–23–2, రబడ 4–0–36–1, మార్క్రమ్ 2–0–16–0, నోర్జే 4–0–26–2, షమ్సీ 3–0–26–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (బి) బుమ్రా 4; డికాక్ (సి) కుల్దీప్ (బి) అర్ష్ దీప్ 39; మార్క్రమ్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 4; స్టబ్స్ (బి) అక్షర్ 31; క్లాసెన్ (సి) పంత్ (బి) పాండ్యా 52; మిల్లర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 21; జాన్సెన్ (బి) బుమ్రా 2; కేశవ్ మహరాజ్ (నాటౌట్) 2; రబడ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 4; నోర్జే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–7, 2–12, 3–70, 4–106, 5–151, 6–156, 7–161, 8–168. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–20–2, బుమ్రా 4–0–18–2, అక్షర్ 4–0–49–1, కుల్దీప్ 4–0–45–0, పాండ్యా 3–0–20–3, జడేజా 1–0–12–0. ఆటగాడిగా... కెప్టెన్‌గా...ఐపీఎల్లో నాయకుడిగా ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన ఘనత ఉన్నా అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు నాయకత్వం అంత సులువు కాదని రోహిత్‌పై చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లలో ఓడిన తర్వాత అతని కెపె్టన్సీపై సందేహాలు కూడా వచ్చాయి. కానీ బీసీసీఐ మరోసారి రోహిత్‌నే నమ్మింది. వరల్డ్ కప్‌లో జట్టును గెలిపించగలిగిన సామర్థ్యం ఉందంటూ అప్పజెప్పింది. ఈ అవకాశాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. 2007లో తొలి టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ 17 ఏళ్ల తర్వాత సారథిగా మరో వరల్డ్ కప్ గెలిపించాడు. 2007 నుంచి 2024 వరకు వరుసగా 9 వరల్డ్ కప్‌లలోనూ ఆడిన రోహిత్ రెండు సార్లు విజేతగా నిలిచాడు. అధికారికంగా ప్రకటించకపోయినా రోహిత్‌కు కూడా ఇదే ఆఖరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ కావచ్చు. మరో వైపు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో ఉన్న కోహ్లి టి20 వరల్డ్ కప్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూశాడు. అద్భుత ప్రదర్శనలతో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినా...ట్రోఫీ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఈ గెలుపుతో ఆ ఆనందం దక్కింది. పైగా మూడు పరిమిత ఓవర్ల ఐసీసీ ట్రోఫీలు గెలిచినవాడిగా కెరీర్‌ను సంపూర్ణం చేసుకున్న అతను అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ పలికాడు. వీరిద్దరు మినహా 15 మంది సభ్యుల జట్టులో మిగతా 13 మందికి ఇదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషం. హైదరాబాద్ పేసర్ సిరాజ్ కూడా అరుదైన జాబితాలో భాగమయ్యాడు. గతంలో అజహర్ సహా హైదరాబాద్ నుంచి భారత్‌కు వరల్డ్ కప్ ఆడినవారెవరూ విజేత జట్టులో లేరు. ఇప్పుడు సిరాజ్ ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు. కల నిజమాయెగా... ఫైనల్లో తీవ్ర ఒత్తిడి మధ్య బౌండరీ సూర్యకుమార్ పట్టిన క్యాచ్‌కు వెలకట్టగలమా? అతడిని ఏ అవార్డుతో సన్మానించినా తక్కువే? బుమ్రా తన చివరి 2 ఓవర్లలో చేసిన అద్భుత బౌలింగ్‌కు సలామ్ చేయకుండా ఉండగలమా? టోరీ్నలో కేవలం 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీసిన బుమ్రా తన స్థాయి ఏమిటో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. క్లాసెన్‌ను అవుట్ చేసి ఆటను భారత్ వైపు తిప్పిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత కన్నీళ్లపర్యంతం కావడం మరచిపోగలమా? ఐపీఎల్ సమయంలో ఎంతో వేదన అనుభవించిన తర్వాత భారత్ తరఫున తన విలువేంటో చూపించిన పాండ్యాను రోహిత్ ముద్దాడిన దృశ్యం ఎప్పటికీ హైలైట్స్‌గా ఉండిపోదా! బ్యాటింగ్‌లోనూ తన సత్తా ఏమిటో చూపించిన గుజరాతీ ‘బాపు’ అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ విలువ అమూల్యం కాదా...! చావును దగ్గరగా చూసి ఇక ఆడలేనేమో అనుకున్న క్షణం నుంచి కప్‌ను ఎత్తుకోవడం వరకు రిషభ్ పంత్ సాగిన ప్రస్థానం అసాధారణం కాదా...! అనుభవం లేకపోయినా అర్ష్ దీప్ పదునైన బంతులతో గెలిపించి చూపించిన భాంగ్రాకు బల్లే బల్లే అనకుండా ఉండగలమా? కుల్దీప్, శివమ్ దూబే కీలక దశలో జట్టు విజయాల్లో ఇరుసుగా నిలిచినవారే... ఇక కోహ్లి గురించి చెప్పడం అంటే కొత్త పుస్తకం రాయడమే. ఫైనల్‌కు ముందు మొత్తం 75 పరుగులు మాత్రమే చేసిన అతను అసలు పోరు కోసం తన ఆటను దాచి ఉంచాడు. 76 పరుగుల ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు బాటలు వేసి విజయగర్వంతో అంతర్జాతీయ టి20 కెరీర్‌ను ముగించాడు. బ్యాటింగ్‌లో రోహిత్ దూకుడు మంత్రం భారత్ విజయాలకు పునాది వేసింది. తనదైన శైలిలో నాయకుడిగా జట్టును నడిపించిన అతను భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. కపిల్, ధోనిల తర్వాత వరల్డ్ కప్ గెలిపించిన సారథిగా శిఖరాన నిలిచాడు. కొన్నాళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది... అందరిలోనూ వేదన, తీవ్రమైన బాధ... గెలుపు కోసం ఇంకా ఏం చేయాలనే నైరాశ్యం... కెప్టెన్ రోహిత్ సహా ఇతర సభ్యులందరికీ కూడా ఆ బాధనుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. కాలం గిర్రున తిరిగింది... చూస్తుండగానే టి20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఒక ఫార్మాట్లో చేజారినా... మరో ఫార్మాట్లోనైనా తమ స్థాయిని ప్రదర్శించే విజేతగా నిలిచే అవకాశం వచ్చింది. ఎలాగైనా ఈ సారి పట్టు వదలరాదని గట్టిగా నిశ్చయించుకొని మరో సారి తమ వేటను మొదలు పెట్టింది. లీగ్ దశలో వరుసగా మూడు విజయాలు, ఆ తర్వాత సూపర్–8లో కూడా మూడు విజయాలు. ఆస్ట్రేలియాలాంటి గట్టి ప్రత్యర్థి ని కుప్పకూల్చిన ఉత్సాహంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కూడా ఘన విజయం. తుది పోరుకు ముందు అజేయంగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇలాగే వరుసగా పది విజయాల తర్వాత అజేయంగా ఫైనల్ చేరిన టీమ్ నిరాశచెందాల్సి వచ్చింది. అద్భుతంగా సాగిపోతున్న ఆటలో ఎక్కడైనా ఒక బ్రేక్ వస్తే... అదీ ఫైనల్లో అయితే ఎంతటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సారీ అలాంటిదే జరిగితే అనే ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ భారత్ అలాంటి స్థితిని అధిగమించింది...ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధగమించింది. కెపె్టన్‌గా 2007 వన్డే వరల్డ్కప్నాటి బాధను కోచ్‌గా రూపంలో మర్చిపోయే ప్రయత్నం చేసిన దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. గెలుపు ఖాయమైన క్షణాన గాల్లో ఎగురుతూ అతను విసిరిన పంచ్ ఈ విజయం విలువేమిటో చూపించింది. –సాక్షి క్రీడా విభాగం గడిచిన మూడు, నాలుగేళ్లు ఎంతో కష్టపడ్డాం. కానీ ఆఖరి ఫలితాలే అందుకోలేకపోయాం. ఈసారి మాత్రం ఏ అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాం. జట్టుగా సమష్టిగా రాణించి ప్రపంచకప్‌ను అందుకున్నాం. నాకే కాదు విరాట్ కోహ్లి ఫామ్‌పై మాలో ఎవరిరికి ఏ సందేహం లేదు. అతను ఆడాల్సిన సమయం వస్తే కచ్చితంగా నిలబడతాడు. జట్టును నిలబెడతాడు. వికెట్ అంత సులువుగాలేని చోట కోహ్తి చేసిన 76 పరుగులు, అక్షర్ మెరుపులు చాలా కీలకమయ్యాయి. బుమ్రా గురించి చెప్పాల్సిన పనిలేదు. హార్దిక్ పాండ్యా తీసిన వికెట్లు, సూర్య క్యాచ్ అన్ని కుదిరాయి కాబట్టే విజేతలమయ్యాం. - రోహిత్ శర్మ, భారత్ కెప్టెన్ భారత జట్టుకు రూ. 20 కోట్ల 42 లక్షల ప్రైజ్‌మనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తొమ్మిదో టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఒక కోటీ 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 93 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీని కేటాయించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 24 లక్షల 50 వేల డాలర్లు (రూ. 20 కోట్ల 42 లక్షలు) లభించాయి. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 12 లక్షల 80 వేల డాలర్లు (రూ. 10 కోట్ల 67 లక్షలు) దక్కాయి.సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఖాతాలో 7,87,000 డాలర్ల చొప్పున (రూ. 6 కోట్ల 56 లక్షల చొప్పున) చేరాయి. ‘సూపర్–8’ నుంచి సెమీఫైనల్ చేరుకోలేకపోయిన నాలుగు జట్లకు 3,82,500 డాలర్ల చొప్పున (రూ. 3 కోట్ల 18 లక్షల చొప్పున) లభించాయి. 9 నుంచి 12 స్థానాల్లోపు నిలిచిన నాలుగు జట్లకు 2,47,500 డాలర్ల చొప్పున (రూ. 2 కోట్ల 6 లక్షల చొప్పున) దక్కాయి. 13 నుంచి 20వ స్థానాల్లోపు నిలిచిన ఎనిమిది జట్లకు 2,25,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 87 లక్షల చొప్పున) అందజేశారు. సెమీఫైనల్స్, ఫైనల్ మినహా సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 31,154 డాలర్ల చొప్పున (రూ. 25 లక్షల 97 వేలు) లభించాయి. 2022 టి20 ప్రపంచకప్‌ను 56 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించగా, విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు 16 లక్షల డాలర్లు లభించాయి. -
న్యూయార్క్‌లో నమో భారత్
పాకిస్తాన్‌తో ప్రపంచకప్ పోరు... భారత్ చేసింది 119 పరుగులే... బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్ అయినా సరే ఈ మాత్రం స్కోరును కాపాడుకోవడం కష్టంగానే అనిపించింది... లక్ష్యం ఎదురుగా కనిపిస్తుండగా... పాక్ నెమ్మదిగా అడుగులు వేసింది. 12 ఓవర్లు ముగిసేసరికి బంతికో పరుగు చొప్పున 72 పరుగులు వచ్చేశాయి.మిగిలిన 48 బంతుల్లో చేయాల్సింది 48 పరుగులే... చేతిలో 8 వికెట్లున్నాయి. కానీ అప్పుడు ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది. పాండ్యా, బుమ్రా బౌలింగ్ దెబ్బకు పాక్ పరుగు తీయడమే గగనంగా మారిపోయింది. ఒక్కో పరుగు కోసం శ్రమించి ఆ జట్టు వరుసగా వికెట్లూ కోల్పోయింది. అద్భుతమైన ఆటతో ఒత్తిడి పెంచిన భారత్ చివరి వరకు దానిని కొనసాగించింది. ఫలితంగా వరల్డ్ కప్‌లో మరో విజయం మన ఖాతాలో చేరింది. పాక్‌పై మనదే పైచేయి అని నిరూపితమైంది. బ్యాటింగ్‌లో కఠిన పరిస్థితుల్లో కీలక పరుగులు చేసిన పంత్, కీపింగ్‌లో చక్కటి క్యాచ్‌లతో గెలిపించాడు. మ్యాచ్ ఏకపక్షంగా సాగకపోయినా... ఉత్కంఠకు లోటు లేకపోయింది. వరల్డ్ కప్ మెల్బోర్న్ నుంచి న్యూయార్క్‌కు చేరినా... అక్కడా మన గెలుపు పిలుపు వినిపించింది. న్యూయార్క్: టి20 ప్రపంచకప్‌లో ఆసక్తి రేపిన మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేయగలిగింది. రిజ్వాన్ (44 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) ప్రత్యర్థిని పడగొట్టారు. పంత్ మినహా... అనూహ్యంగా దూసుకొస్తున్న బంతులు, బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్, నెమ్మదైన అవుట్‌ఫీల్డ్... అన్నీ వెరసి భారత ఆటగాళ్లు ప్రతీ పరుగు కోసం ఇబ్బంది పడ్డారు. పాక్ బౌలర్లంతా కట్టుదిట్టమైన బంతులతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్లు కోహ్లి (4), రోహిత్ శర్మ (13) ఏడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... నాలుగో స్థానంలో వచ్చిన అక్షర్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో పంత్ బాధ్యత తీసుకున్నాడు. సాధారణ షాట్లకు పరుగులు రాలేని స్థితిలో తనదైన శైలిలో భిన్నమైన షాట్లతో స్కోరును నడిపించాడు. ఈ క్రమంలో అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. తన తొలి 14 బంతుల్లో 4 సార్లు పంత్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాక్ వదిలిన క్యాచ్‌లు సుయాయాసమైనవి కాకపోయినా అసాధ్యమైనవి కూడా కాదు! రవూఫ్ ఓవర్లో అతను వరుసగా 3 ఫోర్లతో ధాటిని ప్రదర్శించగా, 89/3 వద్ద భారత్ కాస్త మెరుగైన స్థితిలో కనిపించింది. అయితే ఇక్కడి నుంచి జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. సూర్యకుమార్ (7) ప్రభావం చూపలేకపోగా, దూబే (3) విఫలమయ్యాడు. పంత్, జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరగ్గా... పాండ్యా (7), బుమ్రా (0) కూడా వరుస బంతుల్లో అవుటయ్యారు. అర్‡్షదీప్ (9) రనౌట్‌తో మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టపటపా... స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయింది. తడబడుతూనే ఆడిన బాబర్ ఆజమ్ (13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... ఉస్మాన్ ఖాన్ (13), ఫఖర్ జమాన్ (13) కూడా విఫలమయ్యారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన రిజ్వాన్‌ను కీలక సమయంలో బుమ్రా బౌల్డ్ చేయడంలో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. షాదాబ్ (4), ఇఫ్తికార్ (5) ప్రభావం చూపలేకపోగా, ఇమాద్ వసీమ్ (23 బంతుల్లో 15; 1 ఫోర్) బంతులు వృథా చేసి జట్టు ఓటమిని ఆహ్వానించాడు. వర్షంతో అంతరాయం మ్యాచ్‌కు అనూహ్యంగా వర్షం దెబ్బ పడింది. చిరు జల్లులు కురవడంతో టాస్ ఆలస్యం కాగా, నిర్ణీత సమయంకంటే 50 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. అయితే భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ పూర్తి కాగానే మళ్లీ వాన రావడంతో ఆటను నిలిపివేశారు. మరో 35 నిమిషాల తర్వాత ఇన్నింగ్స్ కొనసాగింది. విరామం తర్వాత నసీమ్ వేసిన తొలి ఓవర్లోనే కోహ్లి వెనుదిరగడంతో భారత్‌కు నిరాశాజనక ఆరంభం లభించింది. 12 భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన 12వ దేశంగా అమెరికా గుర్తింపు పొందింది. 1952లో భారత్‌లో తొలిసారి పాక్ జట్టు ఆడగా... 1955లో పాకిస్తాన్లో భారత జట్టు ఆడింది. ఆ తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లకు యూఏఈ (1984లో), ఆ్రస్టేలియా (1985లో), బంగ్లాదేశ్ (1988లో), సింగపూర్ (1996లో), కెనడా (1996లో), శ్రీలంక (1997లో), ఇంగ్లండ్ (1999లో), దక్షిణాఫ్రికా (2003లో), నెదర్లాండ్స్ (2004లో), అమెరికా (2024లో) ఆతిథ్యమిచ్చాయి.1 విరాట్ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశాక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో టాప్ స్కోరర్‌గా నిలవకపోవడం ఇదే తొలిసారి. గతంలో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో కోహ్లి (2012లో; 78 నాటౌట్), (2014లో 36 నాటౌట్), (2016లో 55 నాటౌట్), (2021లో 57), (2022లో 82 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 1 టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు ప్లేయర్లు ‘గోల్డెన్ డక్’ (ఆడిన తొలి బంతికే అవుటవ్వడం) కావడం ఇదే తొలిసారి. 1 టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగాక ఆలౌట్ కావడం భారత జట్టుకిదే తొలిసారి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రవూఫ్ (బి) అఫ్రిది 13; కోహ్లి (సి) ఉస్మాన్ (బి) నసీమ్ 4; పంత్ (సి) బాబర్ (బి) ఆమిర్ 42; అక్షర్ (బి) నసీమ్ 20; సూర్యకుమార్ (సి) ఆమిర్ (బి) రవూఫ్ 7; దూబే (సి అండ్ బి) నసీమ్ 3; పాండ్యా (సి) ఇఫ్తికార్ (బి) రవూఫ్ 7; జడేజా (సి) ఇమాద్ (బి) ఆమిర్ 0; అర్ష్ దీప్ (రనౌట్) 9; బుమ్రా (సి) ఇమాద్ (బి) రవూఫ్ 0; సిరాజ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 119. వికెట్ల పతనం: 1–12, 2–19, 3–58, 4–89, 5–95, 6–96, 7–96, 8–112, 9–112, 10–119. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–29–1, నసీమ్ షా 4–0–21–3, ఆమిర్ 4–0–23–2, ఇఫ్తికార్ 1–0–7–0, ఇమాద్ 3–0–17–0, రవూఫ్ 3–0–21–3. పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (బి) బుమ్రా 31; బాబర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 13; ఉస్మాన్ (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఫఖర్ (సి) పంత్ (బి) పాండ్యా 13; ఇమాద్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 15; షాదాబ్ (సి) పంత్ (బి) పాండ్యా 4; ఇఫ్తికార్ (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 5; అఫ్రిది (నాటౌట్) 0; నసీమ్ షా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–26, 2–57, 3–73, 4–80, 5–88, 6–102, 7–102. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–31–1, సిరాజ్ 4–0–19–0, బుమ్రా 4–0–14–3, పాండ్యా 4–0–24–2 జడేజా 2–0–10–0, అక్షర్ పటేల్ 2–0–11–1. -
T20 World Cup 2024: నిప్పులు చెరిగిన భారత పేసర్లు.. 96 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా ఐర్లాండ్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. హార్దిక్ పాండ్యా (4-1-27-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-35-2), సిరాజ్ (3-0-13-1), బుమ్రా (3-1-6-2), అక్షర్ పటేల్ (1-0-3-1) ధాటికి ఐర్లాండ్ 96 పరుగులకే (16 ఓవర్లలో) కుప్పకూలింది.ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో లోర్గాన్ టక్కర్ (10), కర్టిస్ క్యాంపర్ (12), గెరాత్ డెలానీ (26), జాషువ లిటిల్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డెలానీ మెరుపులు మెరిపించడంతో ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆండ్రూ బల్బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), హ్యారీ టెక్టార్ (4), జార్జ్ డాక్రెల్ (3), మార్క్ అదైర్ (3), బ్యారీ మెక్ కార్తీ (0) దారుణంగా విఫలమయ్యారు. -
టీ20 వరల్డ్‌కప్-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్ కపుల్(ఫొటోలు)
-
IPL 2024 RCB Vs MI: బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టిన సిరాజ్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సొంత మైదానమైన వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆర్సీబీని మట్టికరిపించింది. తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు. సరదాసరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు తారసపడ్డాయి. అభిమానులు హార్దిక్‌ను గేలి చేస్తుంటే విరాట్ అడ్డు చెప్పడం.. దిగ్గజ క్రికెటర్లు విరాట్, రోహిత్ మధ్య సరదా సంభాషణ.. రోహిత్ దినేశ్ కార్తీక్‌ను ఆట పట్టించడం (మరో వరల్డ్‌కప్ ఆడాలని ఉందా అని).. ఇలా మ్యాచ్ మొత్తం సరదాసరదాగా సాగింది. మ్యాచ్ పూర్తయ్యాక ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు విష్ చేసుకోవడం చూపరులను ఆకట్టుకుంది. - Rohit and Bumrah handshake. 🤝 - Virat Kohli hugging Hardik. 🫂 - Siraj bowed down to Bumrah. 🙇♂️ MI DEFEATED RCB IN MUMBAI. 💥 pic.twitter.com/UCAMxQRjaS — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 సిరాజ్ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగినందుకు గాను సిరాజ్ బుమ్రాకు సలాం కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఫ్యాన్స్ ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు. హార్దిక్‌ను కోహ్లి వెనకేసుకురావడాన్ని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (61), రజత్ పాటిదార్ (50), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్, రోహిత్, స్కై, హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచి అవకాశలున్న మ్యాచ్‌ను ప్రత్యర్దికి పూలల్లో పెట్టి ఇచ్చారు. -
చివరి టెస్టుకూ కేఎల్ రాహుల్ దూరం
ధర్మశాల: తొడ కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టుకూ దూరమయ్యాడు. మొదటి నుంచీ అతను ఈ మ్యాచ్‌లో ఆడటంపై సందేహాలు ఉన్నాయి. అందుకే జట్టును ఎంపిక చేసిన సమయంలో ‘ఫిట్‌నెస్‌కు లోబడి’ అంటూ బీసీసీఐ స్పష్టంగా పేర్కొంది. అతను 90 శాతం వరకు కోలుకున్నా... ఇంకా పూర్తి ఫిట్ కాకపోవడంతో మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో మాత్రమే రాహుల్ బరిలోకి దిగాడు. ‘రాహుల్ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. అతని పరిస్థితిని బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షిస్తోంది. ఈ విషయంలో తదుపరి చికిత్సకు సంబంధించి లండన్‌లో ఉన్న వైద్యులతో వారు సంప్రదిస్తున్నారు’ అని బోర్డు పేర్కొంది. రాంచీ టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న ప్రధాన పేసర్ బుమ్రా మార్చి 7 నుంచి జరిగే చివరి టెస్టులో బరిలోకి దిగుతాడని బోర్డు ప్రకటించింది. రాహుల్ గైర్హాజరులో రజత్ పటిదార్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో కలిపి 63 పరుగులే చేసిన పటిదార్‌కు తుది జట్టులో చోటు దక్కేది సందేహమే. పటిదార్ స్థానంలో కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ అరంగేట్రం చేసే అవకాశముంది. టీమ్‌తో ఉన్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ విడుదల చేసింది. రేపటి నుంచి ముంబైతో జరిగే రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడు తరఫున అతను బరిలోకి దిగుతాడు. లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్న పేసర్ షమీ కోలుకుంటున్నాడని... త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీలో అతని రీహాబిలిటేషన్ మొదలవుతుందని బోర్డు వెల్లడించింది. -
బుమ్రాకు విశ్రాంతి!
రాజ్‌కోట్: భారత ప్రధాన పేపర్ జస్ప్రీత్ బుమ్రాకు నాలుగో టెస్టులో విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో సీనియర్ సీమర్ బుమ్రా రెండో టెస్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మూడు మ్యాచ్‌లు ముగిసిన ఈ సిరీస్‌లో అతను 17 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో 80.5 ఓవర్లు వేశాడు. ఈ నేపథ్యంలో అతనికి రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. బోర్డుకు ఇది కొత్తేం కాదు. ఆటగాళ్లపై పనిఒత్తిడి తగ్గేంచేందుకు బోర్డు కొంతకాలంగా ఇలాంటి వైఖరి అవలంభిస్తోంది. వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి తిరిగి మూడో టెస్టు ఆడించింది. ‘టీమిండియా మంగళవారం రాంచీకి బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ నుంచి బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని వందశాతం ఫిట్నెస్తో ఉన్న కేఎల్ రాహుల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు చెప్పారు. ధర్మశాలలో మార్చి 7 నుంచి జరిగే ఆఖరి టెస్టులో బుమ్రా తాజాగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ప్రత్యర్థి స్పిన్ ఉచ్చుతో భారత్ ఓడిపోయింది. పాతగాయం తిరగబెట్టడంతో రెండో టెస్టు నుంచి తప్పించారు. మూడో మ్యాచ్‌కు ఎంపిక చేసినప్పటికీ ఫిట్నెస్ సంతరించుకోకపోవడంతో మళ్లీ జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది. -
బుమ్రా కూల్చేశాడు
విశాఖ స్పోర్ట్స్: హైదరాబాద్‌లో మన స్పిన్ కుదర్లేదు. మ్యాచ్ చేతికందలేదు. కానీ వైజాగ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. మ్యాచ్‌లో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (290 బంతుల్లో 209; 19 ఫోర్లు, 7 సిక్సర్లు) కెరీర్లో తొలి ద్విశతకం సాధించడంతో... ఓవర్‌నైట్ స్కోరు 336/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 112 ఓవర్లలో 396 పరుగుల వద్ద ఆలౌటైంది. అశ్విన్ (20; 4 ఫోర్లు) ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, డబుల్ సెంచరీ పూర్తయ్యాక జైస్వాల్ నిష్క్రమించాడు. కాసేపటికే బుమ్రా (6), ముకేశ్ (0)లు నిష్క్రమించడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అనంతరం ఇంగ్లండ్‌ను బుమ్రా పేస్ (15.5–5–45–6) రెండు సెషన్లలో కూల్చేసింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌటైంది. జాక్ క్రాలీ (76; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ స్టోక్స్ (47; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేయడంతో టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 171కి చేరింది. బ్యాట్ వదిలేసి... చేతులెత్తేశాడు! తొలి సెషన్లో ఇంగ్లండ్ కేవలం 6 ఓవర్లే ఆడింది. కానీ ఓపెనర్లు క్రాలీ, డకెట్ ఎదురుదాడికి దిగడంతో చకచకా 32/0 స్కోరు చేసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికి డకెట్ (21)ను కుల్దీప్ అవుట్ చేయడంతో 59 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యం ముగిసింది. జట్టు స్కోరు వంద దాటేవరకు క్రాలీ, ఒలీ పోప్ (23; 2 ఫోర్లు) చక్కగా బ్యాటింగ్ చేశారు. బుమ్రా పేస్‌కు ఎదురునిలిచి వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడిన క్రాలీని అక్షర్ బోల్తా కొట్టించాడు. అక్కడి నుంచి బుమ్రా పేస్ ఆటను మలుపు తిప్పింది. రివర్స్‌స్వింగ్‌తో రూట్ (5), బుల్లెట్లా దూసుకెళ్లిన యార్కర్‌తో ఒలీ పోప్లను బుమ్రా అవుట్ చేయడంతో ఒకదశలో 114/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ టీ బ్రేక్‌కు 155/4తో ఆత్మరక్షణలో పడింది. ఆఖరి సెషన్లో కుల్దీప్ స్పిన్ జత కలవడంతో ఇంగ్లండ్ కుదేలైంది. బుమ్రా ఇన్‌స్వింగర్‌కు బెయిర్‌స్టో (25; 4 ఫోర్లు) వికెట్ సమర్పించుకోగా... ఫోక్స్ (6), రేహన్ (6) కుల్దీప్ ఉచ్చులో పడ్డారు. చివరి సెషన్లో కెప్టెన్ స్టోక్స్ వికెట్ హైలైట్‌గా నిలిచింది. బుమ్రా ఆఫ్‌స్టంప్ దిశగా వేసిన కట్టర్‌ను స్టోక్స్ డిఫెన్స్ ఆడలేక క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ క్షణంలో బ్యాట్ వదిలేసి చేతులెత్తేయడం చూస్తే ఆ బంతినెదుర్కోవడం స్టోక్స్ వల్ల కాలేదని స్పష్టమవుతుంది. ఈ వికెట్ల పరంపరలో బుమ్రా... హార్ట్లీ (21), అండర్సన్ (6)లను పడేశాడు. యశస్వి గ్రే ‘టెస్ట్’ ఇన్నింగ్స్.... తొలిరోజు కెప్టెన్ రోహిత్‌తో భారత ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసిన 22 ఏళ్ల యశస్వి రెండో రోజు డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ చేసిన స్కోరు 396 అయితే... అతనిదొక్కడిదే 209! అంటే సగానికిపైగా పరుగులు జైస్వాలే చేశాడు. ఇంకా చెప్పాలంటే మిగతా పది మందిలో ఏ ఒక్కరు కనీసం అర్ధసెంచరీ అయినా చేయలేదు. అయినాసరే తనతో జోడీకట్టిన బ్యాటర్‌తో తన డబుల్ సెంచరీని సాకారం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లోకి వచ్చిన ఏడు నెలల్లోనే ద్విశతకాన్ని ఓ పటిష్టమైన ప్రత్యర్థిపై సాధించడం విశేషం. వినోద్ కాంబ్లీ (21 ఏళ్లు), సునీల్ గావస్కర్ (21 ఏళ్లు) తర్వాత పిన్న వయసులోనే ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్ జైస్వాల్. తక్కువ ఇన్నింగ్స్ (10వ)ల్లో డబుల్ సెంచరీ బాదిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కరుణ్ నాయర్ (3), కాంబ్లీ (4), మయాంక్ (8), పుజారా (9) ముందున్నారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) అయ్యర్ (బి) అక్షర్ 76; డకెట్ (సి) రజత్ (బి) కుల్దీప్ 21; పోప్ (బి) బుమ్రా 23; రూట్ (సి) గిల్ (బి) బుమ్రా 5; బెయిర్‌స్టో (సి) గిల్ (బి) బుమ్రా 25; స్టోక్స్ (బి) బుమ్రా 47; ఫోక్స్ (బి) కుల్దీప్ 6; రేహన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 6; హార్ట్లీ (సి) గిల్ (బి) బుమ్రా 21; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 6; బషీర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (55.5 ఓవర్లలో ఆలౌట్) 253. వికెట్ల పతనం: 1–59, 2–114, 3–123, 4–136, 5–159, 6–172, 7–182, 8–229, 9–234, 10–253. బౌలింగ్: బుమ్రా 15.5–5–45–6, ముకేశ్ కుమార్ 7–1–44–0, కుల్దీప్ 17–1– 71–3, అశ్విన్ 12–0–61–0, అక్షర్ పటేల్ 4–0–24–1. భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (బ్యాటింగ్) 15; రోహిత్ శర్మ (బ్యాటింగ్) 13; మొత్తం (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28. బౌలింగ్: అండర్సన్ 2–0–6–0, బషీర్ 2–0–17–0, రేహన్ 1–0–5–0. -
బుమ్రా బిహేవియర్ పై ఐసీసీ వార్నింగ్
-
IND VS ENG 1st Test: నిర్జీవమైన పిచ్‌పై నిప్పులు చెరిగిన బుమ్రా
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు. బ్యాటింగ్‌కు, స్పిన్నర్లకు అనుకూలిస్తూ నిర్జీవంగా ఉన్న పిచ్‌పై నిప్పులు చెరిగే బంతులు సంధించి ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌ల్లో (2/28, 4/41) కలిపి మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మినహా ఈ మ్యాచ్‌లో మరే ఇతర పేసర్ వికెట్లు పడగొట్టలేకపోయాడు. సహచరుడు సిరాజ్, ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేని పిచ్‌పై బుమ్రా బుల్లెట్ లాంటి బంతులు సంధించి వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగగా.. భారత్ బుమ్రాతో పాటు సిరాజ్‌ను కూడా బరిలోకి దించింది. అయితే సిరాజ్ ఆశించినంతగా రాణించలేకపోయాడు. సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు ఓవర్లు మాత్రమే వేశాడు. మరోవైపు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లు వేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా చెలరేగడంతో ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (196) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. బుమ్రాతో పాటు అశ్విన్ (3/126), జడేజా (2/131), అక్షర్ పటేల్ (1/74) రాణించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు 230 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (70) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో 3 వికెట్లు.. అక్షర్, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసి ఆలౌటైంది. జడేజా (87), కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 4, రెహాన్ అహ్మద్, హార్ట్లీ తలో 2 వికెట్లు, లీచ్ ఓ వికెట్ పడగొట్టారు. -
బుమ్రా బౌలింగ్ కి ఖంగుతిన్న బెన్ స్టోక్స్..
-
IND VS IRE 3rd T20: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు
భారత్-ఐర్లాండ్ మధ్య ఇవాళ (ఆగస్ట్ 23) జరగాల్సిన నామమాత్రపు మూడో టీ20 వర్షం కారణంగా రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో తొలి టీ20లో 2 పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రెండో టీ20లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. టాప్ స్కోరర్‌గా రుతురాజ్.. కాగా, ఈ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (2 మ్యాచ్‌ల్లో 77 పరుగులు) టాప్ స్కోరర్‌గా ఉండగా, ఐరిష్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ (2 మ్యాచ్‌ల్లో 76) సెకెండ్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లు, ఓ టీమిండియా బ్యాటర్ హాఫ్ సెంచరీలు చేశారు. ఐర్లాండ్ తరఫున ఆండ్రూ బల్బిర్నీ (72), బ్యారీ మెక్‌కర్తీ (51) అర్ధశతకం చేయగా.. టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా టీమిండియా బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్, ప్రసిద్ధ్ నిలిచారు. ఈ ముగ్గురు మ్యాచ్‌కు రెండు చొప్పున తలో 4 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్ బౌలర్ క్రెయిగ్ యంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. -
వరల్డ్ కప్ కి బుమ్రా రెడీ...ఆ ముగ్గురు కూడా...
-
బుమ్రా రీ ఎంట్రీ కన్ఫర్మ్
-
ఐపీఎల్-2023కు దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు వీరే..!
మార్చి 31 నుంచి 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఫోర్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో రాత్రి 7:30 గంటకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా, ప్రతి సీజన్లో దేశ, విదేశీ స్టార్లతో కలకలలాడే క్రికెట్ పండుగ ఈసారి కాస్త కలావిహానంగా మారనుంది. గాయాల కారణంగా చాలామంది స్టార్లు సీజన్ మొత్తానికే దూరం కానున్నారు. కొందరేమో లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. గాయాల కారణంగా ఐపీఎల్ 16వ ఎడిషన్ మొత్తానికే దూరం కానున్న స్టార్ ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది... జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్) రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్) కైల్ జేమీసన్ (చెన్నై సూపర్ కింగ్స్) విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జై రిచర్డ్సన్ (ముంబై ఇండియన్స్) అన్రిచ్ నోర్జే (ఢిల్లీ క్యాపిటల్స్) ప్రిసిద్ధ్ కృష్ణ (రాజస్తాన్ రాయల్స్) జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్) సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ముకేశ్ చౌదరీ (చెన్నై సూపర్ కింగ్స్), మొహిసిన్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్), జోష్ హాజిల్‌వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఐపీఎల్-2023లో పాల్గొనేది లేనిది తెలియాల్సి ఉంది. -
సిరాజ్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ బుమ్రా స్థానంలో షమీ
-
బుమ్రా స్థానంలో మొహమ్మద్ సిరాజ్‌కు చోటు
-
IND vs ENG: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా?
ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం... ఒకదశలో స్కోరు 107/0... ఇంగ్లండ్‌దే పైచేయిగా అనిపించింది. ఇంతలో బుమ్రా బౌలింగ్, బ్యాటర్ల స్వయంకృతం కలిపి 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... 109/3... భారత్‌కు పట్టు చిక్కినట్లే కనిపించింది. కానీ రూట్, బెయిర్‌స్టో అనూహ్యంగా ఎదురు దాడికి దిగారు. నాలుగో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ ఇంత సులువా అన్నట్లుగా పరుగులు సాధిస్తూ దూసుకుపోయారు. వీరిద్దరి 150 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో ఇంగ్లండ్ జట్టు విజయంపై కన్నేసింది. చేతిలో 7 వికెట్లతో చివరి రోజు ఆ జట్టు మరో 119 పరుగులు చేస్తే చాలు... ఇలాంటి స్థితిలో చివరి రోజు భారత్ ఏదైనా అద్భుతం చేయగలదా...ప్రత్యర్థిని కుప్పకూల్చగలదా! బర్మింగ్‌హామ్: భారత్‌తో ఐదో టెస్టులో ఇంగ్లండ్ గెలుపు బాటలో పయనిస్తోంది. 378 పరుగులను ఛేదించే క్రమంలో ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. జో రూట్ (112 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు), బెయిర్‌స్టో (87 బంతుల్లో 72 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 125/3తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరుగులకు ఆలౌటైంది. పంత్ (86 బంతుల్లో 57; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. పంత్ అర్ధసెంచరీ... నాలుగో రోజు ఆటను పుజారా (168 బంతుల్లో 66; 8 ఫోర్లు), పంత్ కొన్ని చక్కటి షాట్లతో ఆరంభించడంతో తొలి 7 ఓవర్లలో 27 పరుగులు వచ్చాయి. అయితే స్టువర్ట్ బ్రాడ్ తన తొలి ఓవర్లోనే పుజారాను అవుట్ చేసి 78 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర దించాడు. భారత్ ఆధిక్యం 300 పరుగులు దాటిన తర్వాత 76 బంతుల్లో పంత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అనంతరం ఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, శ్రేయస్ అయ్యర్ (19) అవుట్ కావడంతో భారత్ కాస్త నెమ్మదించింది. రవీంద్ర జడేజా (23) కొద్ది సేపు గట్టిగా నిలబడినా, శార్దుల్ ఠాకూర్ (4) విఫలమయ్యాడు. చివరి వరుస వికెట్లను పెద్దగా ఇబ్బంది పడకుండా వెంటవెంటనే పడగొట్టిన ఇంగ్లండ్ బౌలర్లు భారత్ ఇన్నింగ్స్‌ను తొందరగా ముగించారు. సోమవారం 36.5 ఓవర్లు ఆడిన టీమిండియా మిగిలిన 7 వికెట్లతో 120 పరుగులు సాధించింది. అదిరే భాగస్వామ్యం... భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఓపెనర్లు లీస్, క్రాలీ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు ఆకట్టుకునే షాట్లతో పరుగులు రాబట్టారు. ధాటిగా ఆడిన లీస్ 44 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే భాగస్వామ్యం 100 పరుగులు దాటడంతో భారత బృందంలో ఆందోళన మొదలైంది. అయితే బంతి ఆకారం దెబ్బ తినడంతో మరో బంతిని తీసుకున్న భారత్ అదృష్టం కూడా మారింది. బుమ్రా బంతిని అంచనా వేయడంలో పొరపడిన క్రాలీ క్లీన్‌బౌల్డయ్యాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు 21.4 ఓవర్లలోనే 107 పరుగులు జోడించారు. టీ విరామం తర్వాత భారత్ మళ్లీ ఆధిక్యం ప్రదర్శించింది. తొలి బంతికే పోప్ (0) అవుట్ కాగా, రూట్ పొరపాటుతో లీస్ రనౌటయ్యాడు. ఈ దశలో పరిస్థితి చూస్తే ప్రత్యర్థిని కూల్చడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే రూట్, బెయిర్‌స్టో భాగస్వామ్యం టీమిండియా ఆశలపై నీళ్లు చల్లింది. ఆరంభంలో రూట్ చక్కటి షాట్లు ఆడగా, కుదురుకున్న తర్వాత బెయిర్‌స్టో దూకుడు పెంచాడు. మన బౌలర్లు పూర్తిగా పట్టు కోల్పోవడంతో ఒకరితో మరొకరు పోటీ పడి పరుగులు చేసిన రూట్, బెయిర్‌స్టో విజయానికి బాటలు వేస్తూ పటిష్ట స్థితిలో రోజును ముగించారు. 14 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో విహారి వదిలేశాడు. అది పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో! స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 416; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 284; భారత్ రెండో ఇన్నింగ్స్: గిల్ (సి) క్రాలీ (బి) అండర్సన్ 4; పుజారా (సి) లీస్ (బి) బ్రాడ్ 66; విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్ 11; కోహ్లి (సి) రూట్ (బి) స్టోక్స్ 20; పంత్ (సి) రూట్ (బి) లీచ్ 57; శ్రేయస్ (సి) అండర్సన్ (బి) పాట్స్ 19; జడేజా (బి) స్టోక్స్ 23; శార్దుల్ (సి) క్రాలీ (బి) పాట్స్ 4; షమీ (సి) లీస్ (బి) స్టోక్స్ 13; బుమ్రా (సి) క్రాలీ (బి) స్టోక్స్ 7; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (81.5 ఓవర్లలో ఆలౌట్) 245. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–75, 4–153, 5–190, 6–198, 7–207, 8–230, 9–236, 10–245. బౌలింగ్: అండర్సన్ 19–5–46–1, బ్రాడ్ 16–1– 58–2, పాట్స్ 17–3–50–2, లీచ్ 12–1–28–1, స్టోక్స్ 11.5–0–33–4, రూట్ 6–1–17–0. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: లీస్ (రనౌట్) 56; క్రాలీ (బి) బుమ్రా 46; పోప్ (సి) పంత్ (బి) బుమ్రా 0; రూట్ (బ్యాటింగ్) 76; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 72; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (57 ఓవర్లలో 3 వికెట్లకు) 259. వికెట్ల పతనం: 1–107, 2–107, 3–109. బౌలింగ్: బుమ్రా 13–0–53–2, షమీ 12–2–49–0, రవీంద్ర జడేజా 15–2–53–0, సిరాజ్ 10–0–64–0, శార్దుల్ ఠాకూర్ 7–0–33–0. -
IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (పింక్ బాల్ టెస్ట్) శ్రీలంక జట్టు ఓటమి దిశగా సాగుతుంది. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (5/24) ఐదేయడంతో లంకేయులు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలారు. ఓవర్ నైట్ స్కోరు 86/6 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్ ప్రారంభమైన ఐదంటే ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. బుమ్రాకు జతగా అశ్విన్ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21)లు రాణించడంతో లంక తొలి రోజు స్కోర్‌కు మరో 23 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లు కోల్పోయింది. ఫలితంగా టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెరీర్లో 29వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బుమ్రా 8వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, లంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్ (43), డిక్వెల్లా (21), ధనంజయ డిసిల్వా (10)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే మయాంక్ అగర్వాల్ (22) వికెట్‌ను కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 43 పరుగులు చేసి, ఓవరాల్‌గా 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రోహిత్ శర్మ (20), హనుమ విహారి క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ.. ఆస్పత్రిలో చేరిక! -
స్థిరంగా రోహిత్.. దూసుకెళ్తున్న కోహ్లి
దుబాయ్: ఇటీవలే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లి తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పూర్వ వైభవం దిశగా దూసుకెళ్తున్నాడు. తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ 8 రేటింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ.. ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో అద్భుత శతకంతో చెలరేగిన రిషబ్ పంత్ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 🔹 Travis Head continues his rise 🔥 🔹 Big gains for Kagiso Rabada ↗️ 🔹 Virat Kohli soars 🏏 🔹 Andy McBrine shoots up ☘️ Some big movements in the @MRFWorldwide ICC Player Rankings for the week 📈 Details 👉 https://t.co/gIWAqcmxeT pic.twitter.com/sJqByzFZgM — ICC (@ICC) January 19, 2022 మరోవైపు యాషెస్‌లో వరుస సెంచరీలతో సత్తా చాటిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ 7 స్థానాలు ఎగబాకి రోహిత్‌తో పాటు సంయుక్తంగా ఐదో స్థానంలో నిలువగా, లబూషేన్ టాప్‌లో, రూట్, విలియమ్సన్, స్టీవ్ స్మిత్‌లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. అశ్విన్(839 రేటింగ్ పాయింట్లు) తన రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, బుమ్రా 763 పాయింట్లు సాధించి టాప్-10లోకి చేరాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పర్వాలేదనిపించిన బుమ్రా.. 3 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ జాబితాలో పాట్ కమిన్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇండియాతో సిరీస్‌లో రాణించిన రబాడ 2 స్థానాలు ఎగబాకి మూడో ప్లేస్‌కు చేరుకున్నాడు. చదవండి: అతనో చేత కాని బౌలర్.. నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడు..! -
దేశం కోసం ఆడేటప్పుడు తగ్గేదేలే.. బుమ్రాతో వాగ్వాదంపై సఫారీ బౌలర్ స్పందన
Jansen On Altercation With Bumrah: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను 1-2తేడాతో కోల్పోయిన టీమిండియా రేపటి(జనవరి 19) నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతుంది. మ్యాచ్ వేదిక అయిన బోలాండ్ పార్క్‌లో ఇదివరకే ప్రాక్టీస్ షురూ చేసిన భారత జట్టు.. కెప్టెన్ కేఎల్ రాహుల్, కోచ్ ద్రవిడ్‌ల ఆధ్వర్యంలో కఠోరంగా శ్రమిస్తుంది. మరోవైపు దక్షిణాఫ్రికా సైతం ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది. టెస్ట్ సిరీస్ గెలిచిన ఊపులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. టెస్ట్ సిరీస్‌లో 19 వికెట్లతో చెలరేగిన సఫారీ లెఫ్ట్ ఆర్ పేసర్ మార్కో జన్సెన్ వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు చమటోడుస్తున్నాడు. నిన్నటి ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా జన్సెన్ మీడియాతో మాట్లాడుతూ.. రెండో టెస్ట్‌లో బుమ్రాతో జరిగిన వాగ్వాదంపై స్పందించాడు. బుమ్రా, నేను మంచి స్నేహితులమంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు బుమ్రా తనకు బాగా సహకరించాడని గుర్తు చేసుకున్నాడు. తామిద్దరం మంచి స్నేహితులమే అయినప్పటికీ మైదానంలో ఎదురెదురు పడ్డప్పుడు, దేశం కోసం ఆడుతున్నప్పుడు మాత్రం తగ్గేదే ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంలో బుమ్రా సైతం ఇలానే వ్యవహరిస్తాడని అన్నాడు. జొహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో వాగ్వాదం వేడి మీద జరిగిందని, ఆ విషయాన్ని తామిద్దరం అప్పుడే వదిలేశామని, మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని వివరించాడు. ఇక, వన్డే సిరీస్ గురించి మాట్లాడుతూ.. టెస్ట్ సిరీస్ నెగ్గామని తాము రీలాక్స్ కావడం లేదని, టీమిండియా ప్రపంచంలో మేటి జట్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదని, ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా, 21 ఏళ్ల జన్సెన్ టీమిండియాతో వన్డే సిరీస్ ద్వారా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నాడు. చదవండి: కెప్టెన్సీపై బుమ్రా ఆసక్తికర కామెంట్! -
టెంపర్ కోల్పోయిన బుమ్రా.. ఆరున్నర అడుగుల బౌలర్‌పైకి దూసుకెళ్లాడు..!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా పేసర్ బుమ్రా.. ఆరున్నర అడుగుల దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జన్సెన్పైకి దూసుకెళ్లాడు. భారత రెండో ఇన్నింగ్స్ 54వ ఓవర్లో చోటు చేసుకున్న ఘటనలో ఈ ఇద్దరు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు బాహాబాహికి దిగినంత పని చేశారు. అయితే అంపైర్ జోక్యంతో ఇద్దరు సర్దుకుపోయారు. pic.twitter.com/g3g0gjZnHo — Addicric (@addicric) January 5, 2022 వివరాల్లోకి వెళితే.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 230/8 వద్ద ఉండగా జన్సెన్.. బుమ్రాను టార్గెట్ చేస్తూ వరుస బౌన్సర్లను సంధించాడు. ఈ క్రమంలో వరుసగా కొన్ని బంతులు బుమ్రా శరీరాన్ని బలంగా తాకాయి. దీంతో చిర్రెతిపోయిన భారత పేసు గుర్రం.. జన్సెన్ వైపు దూసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఇరువురు మాటామాటా అనుకున్నారు. అయితే అంపైర్ సర్ధిచెప్పడంతో ఇద్దరు మిన్నకుండిపోయారు. ఈ కోపంతో రబాడ వేసిన మరుసటి ఓవర్లో బుమ్రా సిక్సర్ బాదాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. కాగా, ఇంగ్లండ్ సిరీస్‌లోనూ బుమ్రా- ఆండర్సన్‌ల మధ్య ఇలాంటి బాహాబాహి సన్నివేశాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, మూడో రోజు ఆటలో టీమిండియా నిర్ధేశించని 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ జట్టు.. ఆఖరి సెషన్ ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. చదవండి: Ind vs Sa: కేఎల్ రాహుల్ అవుటైన తీరుపై వివాదం... కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్! -
ఎగబాకిన రాహుల్.. దిగజారిన కోహ్లి..!
ICC Test Rankings: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్భుతమైన శతకం(123)తో అదరగొట్టి, టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కేఎల్ రాహుల్.. ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సైతం సత్తా చాటాడు. ఈ వారపు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు మెరుగుపర్చుకుని 31వ స్పాట్‌కు ఎగబాకాడు. ఇదే టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 11వ ప్లేస్‌కు, రెండు స్థానాలు మెరుగుపర్చుకున్న రహానే 25వ స్పాట్‌కు చేరుకోగా, టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి రెండు ర్యాంకులు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు. Latest ICC Test Rankings for Batting!#Cricket #ICCRankings pic.twitter.com/fl10mW6QV5 — InsideSport (@InsideSportIND) January 5, 2022 pic.twitter.com/L5F5cKWGER — Krikut Expert Rohit (@_rohitjangra_) January 5, 2022 ఈ జాబితాలో భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ స్పాట్‌ను నిలబెట్టుకోగా, ఆసీస్ ఆటగాడు లబూషేన్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే.. ఈ జాబితాలో సైతం టీమిండియా బౌలర్లు తమ తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బుమ్రా టాప్-10(9వ స్థానం)లోకి చేరుకోగా, ఇదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ఘనతతో పాటు ఎనిమిది వికెట్లతో సత్తా చాటిన షమీ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 17వ స్థానానికి ఎగబాకాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రెండో స్పాట్‌ను కాపాడుకోగా.. ఆసీస్ పేసర్ కమిన్స్ టాప్‌లో కొనసాగుతున్నాడు. చదవండి: Sourav Ganguly: గంగూలీ కుమార్తెకు కరోనా.. మరో ముగ్గురికి కూడా -
ఆ ముగ్గురు భారత పేసర్లు పాక్ దిగ్గజాలతో సమానం..
Sanjay Manjrekar: ఇటీవలి కాలంలో టీమిండియా విదేశాల్లో అద్భుతంగా రాణించడానికి బుమ్రా, షమీ, సిరాజ్‌లే ప్రధాన కారణమని మాజీ ఆటగాడు, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. గత రెండు, మూడేళ్లలో ఓవర్సీస్లో టీమిండియా ప్రదర్శన చూస్తే అది ఇట్టే స్పష్టమవుతుందన్న ఆయన.. గతేడాది ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించడాన్ని, ఇటీవల ఇంగ్లండ్‌కు వారి అడ్డాలోనే షాకివ్వడాన్ని ఉదహరించాడు. అలాగే, దక్షిణాఫ్రికాను ఇటీవల జరిగిన టెస్ట్‌లో రఫ్ఫాడించడంలో కూడా ఆ ముగ్గురు సీమర్లదే కీలకపాత్ర అని మంజ్రేకర్ కొనియాడాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా మాధ్యమంతో ఆయన మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్ త్రయాన్ని పాక్ దిగ్గజ బౌలర్లతో పోల్చాడు. బుమ్రా, షమీ, సిరాజ్‌లను చూస్తే 90లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన పాక్ దిగ్గజ బౌలర్లు గుర్తుకొస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో విదేశీ పిచ్‌లపై పాక్ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ అరివీర భయంకరంగా చెలరేగేవారని, ప్రస్తుతం టీమిండియా పేస్ త్రయం కూడా వారిలాగే విజృంభిస్తుందని వ్యాఖ్యానించాడు. కాగా, సఫారీలతో ముగిసిన తొలి టెస్ట్‌లో ఈ టీమిండియా బౌలింగ్ త్రయం ఏకంగా 16 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: నా వల్ల కాదు బాబోయ్..! పాక్ హెడ్ కోచ్ పదవికి సక్లయిన్ గుడ్‌బై -
కెప్టెన్‌గా రోహిత్ సరే.. వైస్ కెప్టెన్‌గా రాహుల్, పంత్‌ల కంటే అతనైతేనే బెటర్..!
Virender Sehwag Picks Jasprit Bumrah As Team India Vice Captain: టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా ఎవరుంటారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు, విశ్లేషకులేమో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల పేర్లు ప్రతిపాధిస్తుండగా.. టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరును తెరపైకి తెస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పరిమిత ఓవర్ల జట్టు ఉప సారధిగా రాహుల్, పంత్‌ల కంటే బుమ్రానే బెటర్ ఛాయిస్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు బుమ్రా ఏ టీ20 జట్టుకు నాయకత్వం వహించకపోయినా బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడని, మూడు ఫార్మాట్లలో నిలకగా ఆడే వారినే కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా నియమిస్తారు కాబట్టి బుమ్రా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా ఇప్పటివరకూ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని టీమిండియా వైస్ కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేయాలని డిమాండ్ చేశాడు. కాగా, ఇటీవలే భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా సైతం ఇంచుమించు ఇలాంటి ప్రతిపాదననే చేయగా, సెహ్వాగ్.. నెహ్రా ఛాయిస్‌ను సమర్ధిస్తూ బుమ్రాకు మద్దతు పలికాడు. టీమిండియా కెప్టెన్‌గా బౌలర్ ఉండకూడదని ఏ రూల్ బుక్లోనైనా రాసుందా అంటూ ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లి స్థానాన్ని ఫాస్ట్ బౌలర్‌తో భర్తీ చేయాలని నెహ్రా డిమాండ్ చేశాడు. చదవండి: పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్ -
చరిత్ర తిరగరాసిన ఆర్సీబీ బౌలర్.. బుమ్రా రికార్డు బద్దలు
Harshal Patel Breaks Bumrah IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ చరిత్రను తిరగరాసాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు(27 వికెట్లు)ను బద్దలు కొట్టి.. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. బుధవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన హర్షల్.. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కనీసం మరో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండడంతో అతను ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా, లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు -
స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఫొటోలు
-
కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..
ఓవల్: ఇంగ్లండ్‌తో రసవత్తరంగా సాగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్‌ల్లో వేగంగా 100 వికెట్లు సాధించిన భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఓలీ పోప్ వికెట్ పడగొట్టడంతో బుమ్రా వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్ల క్లబ్లో చేరాడు. గతంలో ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉంది. కపిల్.. ఈ మైలురాయిని 25 మ్యాచ్‌ల్లో చేరుకోగా, బుమ్రా తన 24వ టెస్ట్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా.. జడేజాతో కలిసి సంయుక్తంగా ఎనిమిదవ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అశ్విన్ కేవలం 18 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇక క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ ల్యాండ్ మార్క్‌ను చేరుకున్న బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ లోమాన్(16) తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా చార్లీ టర్నర్(17), ఇంగ్లండ్ సిడ్నీ బార్న్స్(17), ఆస్ట్రేలియా చార్లీ గ్రిమ్మెట్(17), పాక్ యాసిర్ షా(17)లు సంయుక్తంగా రెండో ప్లేస్‌లో నిలిచారు. వీరి తర్వాత అశ్విన్(18) మూడో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్ ఆఖరి రోజు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. టీమిండియా బౌలర్ల ధాటికి 177 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. భారత బౌలర్లు బుమ్రా(2), జడేజా(2), శార్దూల్(1) ఇంగ్లండ్ విజయావకాశాలపై నీళ్లు చల్లారు. క్రీజ్‌లో రూట్(32), వోక్స్(12) ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 191 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. చదవండి: పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఇద్దరు దిగ్గజాల రాజీనామా -
ఈ టీమిండియా క్రికెటర్లు ఫ్యాట్‌గా ఉంటే ఎలా ఉండేవారో ఓ లుక్కేయండి..!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన ఓ ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ పోస్ట్‌లో ఉన్న భారత ఆటగాళ్ల ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఆ ఇన్‌స్టా పోస్ట్‌పై ఓ లుక్కేయండి. టీమిండియా క్రికెటర్లు ఫిట్నెస్ కోల్పోయి ఫ్యాట్‌గా మారితే ఎలా ఉంటారో ఊహించుకుని ఓ అభిమాని సరదాగా ఫొటో షాప్ ఫిల్టర్ సాయంతో వారి ముఖ కవళికలను మార్చాడు. View this post on Instagram A post shared by OFFICIAL BCCI 🔵 (@_official_bcci_) దీంతో ఫిట్‌గా ఉండే మన క్రికెటర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత సాధారణ ప్రజలు పొట్టలేసుకుని, ఎలా అన్‌ఫిట్‌గా ఉంటారో అలా కనిపించారు. ముఖాలు వాచి పోయి అంకుల్స్‌ను తలపిస్తున్నారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే మన క్రికెటర్లకు ఏంటీ దుస్థితి అని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏదో ఒక రోజు మనోళ్లు ఇలానే తయారవుతారని గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య దేశంతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే టీమిండియా రెండో టెస్ట్‌లో చిరస్మరణీయవిజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కోసం ఇరు జట్లు సమాయత్తం అవుతున్నాయి. హెడింగ్లే స్టేడియంలో మనోళ్లు ఆదివారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో చమటోడ్చారు. చదవండి: మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా -
Anderson-Bumrah: అతనే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడు..
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో అండర్సన్, బుమ్రాల మధ్య జరిగిన ఆసక్తికర ఎపిసోడ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో బుమ్రా పాత్ర నామమాత్రమేనని, అతను చాలా అమాయకుడని, అసలు ఈ వివాదానికి తెరలేపింది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినేనని మంజ్రేకర్ ఆరోపించాడు. ఇంగ్లండ్ పేసర్ అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది కోహ్లి ప్రణాళికలో భాగం అయ్యుండొచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ఆటగాడిని కవ్వించాలన్నది కోహ్లి ఉద్దేశం అయ్యుండొచ్చని, అందులో భాగంగానే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడని పేర్కొన్నాడు. According to few reports, Anderson asked Bumrah to bowl slow during this (watch video) famous 15-minute long over 😂 What we heard via stump mic- Bumrah to Buttler: I wasn't the one who asked to bowl slow. This means we're in for some aggressive cricket.#ENGvsIND pic.twitter.com/8F4TaKDRUK — Rushil Patale (@rushilpatale) August 18, 2021 లార్డ్స్ టెస్ట్‌లో అండర్సన్, బుమ్రాల ఎపిసోడ్‌పై మంజ్రేకర్ స్పందిస్తూ.. అండర్సన్‌కు బుమ్రా 90 మైళ్ల వేగంతో బంతులు వేశాడని.. పుల్ లెంగ్త్, షార్ట్ పిచ్ బంతులతో అతని దేహాన్ని టర్గెట్ చేశాడని, అప్పటివరకు 80-85 మైళ్ల వేగంతో బంతులు సంధించిన భారత పేసు గుర్రం ఒక్కసారిగా వేగం పెంచాడని పేర్కొన్నాడు. సాధారణంగా ఇది బుమ్రా స్వభావం కాదని, అతడు వేగంగా బంతులేస్తూ వికెట్లకు గురిపెడతాడని అన్నాడు. షార్ట్ పిచ్ బంతులు వేయాలన్నది బహుశా టీమిండియా కెప్టెన్ ప్రణాళిక అయ్యుంటుందని, దానిని బుమ్రా అమలు చేశాడని వ్యాఖ్యానించాడు. కాగా, లార్డ్స్ టెస్టులో భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ అండర్సన్‌కు బుమ్రా షార్ట్ పిచ్ బంతులు వేయడంతో వివాదం మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడంతో అండర్సన్ ఆవేశపడ్డాడు. అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేసి బూతులు తిట్టాడు. ఇది చీటింగ్ అని, ఉద్దేశపూర్వకంగా బంతితో భౌతిక దాడికి దిగావని ఆరోపించాడు. ఆ తర్వాతి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు కూడా అదే తరహాలో షార్ట్ పిచ్ బంతులను విసిరి గాయపర్చాలని భావించారు. కానీ అది కాస్తా బెడిసికొట్టింది. బుమ్రా, షమీ జోడీ తొమ్మిదో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు కూడా చెలరేగడంతో లార్డ్స్ టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య లీడ్స్ వేదికగా మూడో టెస్ట్ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం -
బుమ్రా నువ్వు చీట్ చేశావు.. ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఏంటి..?
లండన్: ఆతిధ్య ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత పేసు గుర్రం బుమ్రా, ఇంగ్లండ్ వెటరన్ పేసర్ ఆండర్సన్‌ల మధ్య జరిగిన మాటల యుద్ధం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచి, ఆతర్వాత పలు వివాదాలకు కూడా దారి తీసింది. అయితే, వారిద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందన్న విషయాన్ని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీధర్ మాట్లాడుతూ.. లార్డ్స్ టెస్ట్ మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా బుమ్రా ప్రమాదక వేగంతో బౌలింగ్ చేశాడని, దీంతో బెంబేలెత్తిపోయిన ఆండర్సన్.. బుమ్రా నువ్వు చీటింగ్ చేస్తున్నావు.. ఎప్పుడూ లేనిది ఇంత ఫాస్ట్ బౌలింగ్ ఏంటని ప్రశ్నించాడని, అక్కడి నుంచే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైందని అసలు విషయాన్ని రివీల్ చేశాడు. బుమ్రా కెరీర్ ఆరంభం నుంచి 80 నుంచి 85 మైళ్ల వేగంతో బౌలింగ్ చేశాడని, అయితే ఆ మ్యాచ్‌లో ఆండర్సన్‌కు బౌలింగ్ చేసేటప్పుడు బుమ్రా ఏకంగా 90 మైళ్ల వేగంతో బంతులను సంధించడంతో ఆండర్సన్ దడుసుకున్నాడని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఆ మ్యాచ్‌లో బుమ్రా భీకరమైన వేగంతో సంధించిన బంతుల ధాటికి ఆండర్సన్ పలు మార్లు గాయపడ్డాడు. ఆతర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ కూడా బుమ్రాను భౌతికంగా టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేసినప్పటికీ అతని పాచిక పారలేదు. ఫలితంగా షమీ సహకారంతో బుమ్రా 9వ వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. చదవండి: అఫ్గాన్లు ప్రపంచకప్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. -
39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా టెయిలెండర్లు..
లండన్: భారత టెయిలండర్లు మహమ్మద్ షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), జస్ప్రీత్ బుమ్రా(64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు పేసర్లు చెలరేగి బ్యాటింగ్ చేశారు. 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను అద్భుత పోరాట పటిమతో విన్నింగ్ ట్రాక్‌పై నిలబెట్టారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున 9వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్రకెక్కారు. 39 ఏళ్ల కిందట 1982లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత దిగ్గజాలు కపిల్ దేవ్-మదన్ లాల్ 9వ వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై భారత్ తరఫున తొమ్మిదో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యంగా ఉండింది. 39 ఏళ్ల తర్వాత ఈ రికార్డును షమీ, బుమ్రా జోడి అధిగమించడం విశేషం. ఇదిలా ఉంటే, టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు కేవలం 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్ రోరి బర్న్స్ ను డకౌట్ చేయగా, రెండో ఓవర్లో షమీ మరో ఓపెనర్ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం ఇషాంత్ హసీబ్ హమీద్(9), బెయిర్‌స్టో(2)ను పెవిలియన్‌కు పంపి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం కెప్టెన్ జో రూట్(33) క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 205 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. చదవండి: షమీ, బుమ్రాలకు లభించిన ఘన స్వాగతం చూస్తే ఔరా అనాల్సిందే..! -
షమీ, బుమ్రాలకు లభించిన ఘన స్వాగతం చూస్తే ఔరా అనాల్సిందే..!
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టెయిలెండర్లు మహమ్మద్ షమీ(70 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్), జస్ప్రీత్ బుమ్రా(64 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) అద్భుత ప్రదర్శన కనబర్చారు. 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను అద్భుత పోరాట పటిమతో ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. ముఖ్యంగా షమీ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కెరీర్లో రెండో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టీమిండియాకు 271 పరుగుల ఆధిక్యం లభించాక.. 298 పరగుల వద్ద కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. A rousing reception for Mohammed Shami and Jasprit Bumrah from India's dressing room at Lord's 👏 (via @BCCI) pic.twitter.com/gvJduOK9oX — ESPNcricinfo (@ESPNcricinfo) August 16, 2021 అయితే, లంచ్ విరామ సమయంలో షమీ, బుమ్రాలు డ్రెసింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టాక.. సహచర క్రికెటర్లు వారికి ఘన స్వాగతం పలికారు. చప్పట్లు, ఈలలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సభ్యులంతా లేచి నిలబడి అద్భుత ఇన్నింగ్స్ అడిన షమీ, బుమ్రాలను కరతాళధ్వనులతో ఘనమైన రీతిలో ఆహ్వానించారు. ఆ అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఇదిలా ఉంటే, టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్ రోరి బర్న్స్ ను డకౌట్ చేయగా, రెండో ఓవర్లో షమీ మరో ఓపెనర్ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో కెప్టెన్ జో రూట్, హసీబ్ హమీద్ ఉన్నారు. చదవండి: రషీద్ ఖాన్, నబీ ఇద్దరూ అందుబాటులో ఉంటారు: సన్‌రైజర్స్ -
గాఢంగా ప్రేమించాను.. కానీ బ్రేకప్ అయ్యింది : అనుపమ
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఇక మీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా అంటూ ఓ నెటిజన్ అడగ్గా అనుపమ ఓపెన్ అయ్యింది. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని, అయితే అతనితో బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. గతంలో క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమాయణంలో ఉందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బుమ్రా వివాహానికి కొద్ది రోజుల ముందే ఇది హాట్‌టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యాంగా బుమ్రా టీవీ యాంకర్ సంజనను పెళ్లాడటం, ఆ తర్వాత అనుపమ స్యాడ్ సాంగ్స్‌తో వీడియోలు చేయడం అప్పట్లో నెట్టింట హల్చల్ చేశాయి. ఇప్పుడు అనుపమ బ్రేకప్ విషయం బయటపెట్టడంతో మరోసారి బుమ్రా పేరు తెరపైకి వచ్చింది. ఇక సినీ హీరోల్లో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పిన అనుపమ..తన తల్లి చేసే అన్ని వంటలు చాలా ఇష్టమని పేర్కొంది. పెయింటిగ్స్ వేస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని, ఈ మధ్యే పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
ICC RANKINGS: రెండో ర్యాంక్ నిలబెట్టుకున్న కోహ్లీ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 857 రేటింగ్ పాయింట్లు ఉండగా, రోహిత్ ఖాతాలో 825 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ 865 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ 739 రేటింగ్ పాయింట్లు సాధించి 14వ స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (690 పాయింట్లు) ఒక స్థానాన్ని కోల్పోయి ఐదో ప్లేస్‌కు దిగజారాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా, బంగ్లా బౌలర్ మెహదీ హసన్ (725 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి రెండో ప్లేస్‌కు, మరో బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (652) తొమ్మిదో స్థానానికి ఎగబాకారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్‌లో బంగ్లా సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ 387 పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్(121), ఆస్ట్రేలియా(118), భారత్(115), ఇంగ్లండ్(115) వరుసగా ఒకటి నుంచి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: ధోనీ కోసం గంగూలీని పది రోజులు బతిమాలాను.. -
టాప్‌లో కొనసాగుతున్న కోహ్లి..
దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీలతో(56, 66) అలరించిన ఛేజింగ్ కింగ్.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్.. 870 రేటింగ్ పాయింట్లు సాధించి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకులో కొనసాగుతుండగా.. వరుసగా హాఫ్ సెంచరీ, సెంచరీ బాదిన కేఎల్ రాహుల్ 31 స్థానం నుంచి 27వ స్థానానికి ఎగబాకాడు. ఆఖరి వన్డేలో సూపర్ ఫిఫ్టీ సాధించిన హార్దిక్ 42వ ర్యాంకు దక్కించుకోగా, వరుస అర్ధసెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్(77, 78) టాప్-100లో అడుగుపెట్టాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి నాలుగో స్థానంలో నిలువగా, భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత బెస్ట్ ర్యాంక్(11వ ర్యాంక్) అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 7 వికెట్లు తీసిన పేసర్ శార్దూల్ ఠాకూర్ 93 నుంచి 80వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో, ఆఫ్ఘన్ బౌలర్ ముజీబుర్ రెహ్మాన్ రెండులో, న్యూజిలాండ్ మ్యాట్ హెన్రీ మూడో స్థానంలో నిలిచారు. చదవండి: సన్‌రైజర్స్‌కు ఊహించని షాక్..లీగ్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్ -
నీ భార్య విధుల్లో ఉంటే.. ఒంటరిగా ఏం చేస్తున్నావ్ బుమ్రా!
న్యూఢిల్లీ: టీమిండియా స్పీడ్‌గన్ జస్ప్రీత్ బుమ్రా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్‌ను అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మార్చి 15న గోవాలో పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం జరిగి నెల రోజులు కూడా గడవక ముందే ఆయన సతీమణి సంజన, విధులకు హాజరుకావడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా ప్రముఖ క్రీడా ఛానెల్ (స్టార్ స్పోర్ట్స్) స్టూడియోలో సంజన ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. వృత్తి పట్ల సంజనకు ఉన్న నిబద్దతను కొనియాడుతూనే, బూమ్రాకు కౌంటర్లు ఇస్తున్నారు. "భార్య విధులకు హాజరైతే, నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావంటూ.." కొందరు, "బుమ్రా ఇంకా అదే(హాలిడే) మూడ్‌లో ఉన్నట్టున్నావ్.. నీ భార్య డ్యూటీ ఎక్కేసిందంటూ.." మరికొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తర్వాత బుమ్రా.. బ్రేక్ తీసుకుని, భాగస్వామితో సరదాగా గడుపుతున్నాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్లో అతను తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. And the best is back in the business! . The best anchor of @StarSportsIndia - @SanjanaGanesan ma'am hosting Byju's #CricketLive. 😍😍😘 .#INDvENG #2ndODI #Pune pic.twitter.com/IyQvt6ZBaO — Nirmal Kumar 🇮🇳 (@nirmal_indian) March 26, 2021 Sanjana Ganesan back to Studio... Bumrah still roaming around 😁#INDvsENG #INDvENG #INDvsENG_2021 — Thε Wαrrιοr's Wαγ (@tww1or) March 26, 2021 -
బుమ్రా 'ప్యా'ర్కర్కు సంజన క్లీన్ బౌల్డ్..
ముంబై: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. ప్రేయసి సంజన గణేశన్ సంధించిన 'ప్యా'యార్కర్‌కు క్లీన్ బౌల్డయ్యాడంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బుమ్రా.. తన ప్రేయసి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను ఇవాళ గోవాలో వివాహం చేసుకున్న నేపథ్యంలో సన్నిహితుల శుభాకాంక్షలతో ఈ జంట తడిసి ముద్దవుతోంది. వీరి జంట వివాహం చేసుకోబోతున్నారనే వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట హల్చల్ చేసిన నేపథ్యంలో ఇవాళ ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. అభిమానుల కోసం బుమ్రా సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలను షేర్ చేయడంతో అతని సన్నిహితులు, పలువురు క్రికెటర్లు, సినీ, రాజకీయ ప్రముఖులు వీరికి విషెస్ చెబుతున్నారు. Many congratulations on the start of this beautiful journey. Wishing you both a lifetime of happiness.❤️ https://t.co/MdkdKbwFjj — BCCI (@BCCI) March 15, 2021 Bumrah bowled over by Sanjana 💥 Here's wishing love, laughter and a happily ever after for @Jaspritbumrah93 and @SanjanaGanesan 👩❤️👨 #OneFamily #MumbaiIndians pic.twitter.com/tbJ3YXhN2I — Mumbai Indians (@mipaltan) March 15, 2021 Congratulations @Jaspritbumrah93 and @SanjanaGanesan 💐 Best wishes for a wonderful life together! https://t.co/go7ELMkPJM — ICC (@ICC) March 15, 2021 -
బుమ్రా రికార్డ్‌ను బద్దలు కొట్టిన చాహల్
అహ్మదాబాద్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భారత్ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో చాహల్ ఈ ఘనతను సాధించాడు. పొట్టి ఫార్మాట్లో పేసు గుర్రం జస్ప్రిత్ బుమ్రా(50 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును చాహల్ ఈ మ్యాచ్‌లో అధిగమించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో జోస్ బట్లర్‌ను ఔట్ చేసిన చాహల్.. పొట్టి ఫార్మాట్లో 60వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చాహల్ ఈ ఘనతను కేవలం 46వ మ్యాచ్‌లోనే సాధించాడు. ఓవరాల్‌గా చాహల్‌కు ఇది భారత్ తరఫున వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా చాహల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. -
దిగజారిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్..
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజా టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాలు చెరో స్థానం కోల్పోయి ఐదు, ఏడు ర్యాంకులకు పడిపోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు చెరో అర్ధ శతకం సాధించినప్పటికీ తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కో స్థానం కోల్పోయారు. మరోవైపు ఇదే మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ఇంగ్లాండ్ సారథి జో రూట్(218) రెండు స్థానాలను మెరుగుపరచుకొని మూడో ర్యాంక్‌కు చేరుకోగా, న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్, ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుత్నున్నారు. మరో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్, కివీస్ ఆటగాడు హెన్రీ నికోల్స్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, ఆసీస్ ఓపెనర్ వార్నర్‌లు తలో స్థానాన్ని మెరుగుపరచుకొని ఆరు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేయడంతో తొలిసారిగా 700 రేటింగ్ పాయింట్లు సాధించి 13వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ తొలి రెండు స్థానాలను నిలబెట్టుకోగా, మరో ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, బూమ్రాలు చెరో స్థానాన్ని మెరుగుపరచుకొని ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
‘36’ పీడ కల.. మనసు కుదుటపడింది!
ఎంత వద్దనుకున్నా ‘36’ జ్ఞాపకాలు ఒకవైపు వెంటాడుతూనే ఉంటాయి... అటు ఆటతో, ఇటు మాటతో కూడా జట్టును నడిపించే నాయకుడు వెళ్లిపోయాడు... మ్యాచ్‌కు ముందు ప్రధాన పేసర్ దూరమైతే, మ్యాచ్ మధ్యలో మరో పేసర్ బంతి వేయలేని పరిస్థితి... బరిలో ఇద్దరు కొత్త ఆటగాళ్లు... ఆపై టాస్ కూడా ముఖం చాటేసింది... ఇలాంటి ప్రతికూలతలకు ఎదురీది భారత జట్టు మెల్బోర్న్లో మరపురాని విజయాన్ని అందుకుంది. గత 20 ఏళ్లలో విదేశీ గడ్డపై భారత్ పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. పెర్త్ (2007), జొహన్నెస్‌బర్గ్ (2006), హెడింగ్లీ (2002), డర్బన్ (2010), అడిలైడ్ (2018), ట్రెంట్‌బ్రిడ్జ్ (2007)... వాటిలో కొన్ని. వాటితో పోలిస్తే తాజా విజయం ఏ స్థానంలో నిలుస్తుంది, దీని ప్రత్యేకత ఏమిటి? గత ఘనతలతో సరిగ్గా పోల్చి చూడటం సరైంది కాకపోవచ్చు. ఏ మ్యాచ్ గొప్పతనం దానిదే. కానీ ప్రస్తుతం జట్టు ఉన్న స్థితిని చూస్తే ఇది చెప్పుకోదగ్గ ఘనతగానే కనిపిస్తుంది. గత మ్యాచ్ పరాభవాన్ని మరచి ఇలాంటి గెలుపు సాధించడం అంటే ఆట మాత్రమే ఉంటే సరిపోదు. అంతకుముందు మానసిక దృఢత్వం, పోరాటతత్వం కూడా ఉండాలి. రహానే సేన దానిని ఇప్పుడు సరిగ్గా ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌కు ముందు గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై ఒక విదేశీ జట్టు 0–1తో వెనుకబడి తర్వాతి మ్యాచ్‌లో నెగ్గడం రెండుసార్లు మాత్రమే జరిగింది. ఇప్పుడు టీమిండియా దానిని చేసి చూపించింది. ప్రత్యర్థి స్కోరును రెండుసార్లు కూడా 200 దాటకుండా కట్టడి చేయడంలోనే మన బౌలింగ్ సత్తా కనిపించింది. బుమ్రా ఎప్పటిలాగే శుభారంభం అందిస్తే విదేశీ గడ్డపై మనకు కొత్త అశ్విన్ కనిపించాడు. అనుభవంకొద్దీ రాటుదేలిన ఈ స్పిన్నర్ కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. విదేశీ గడ్డపై గత 14 టెస్టుల్లో కేవలం 25.8 సగటుతో అశ్విన్ 54 వికెట్లు తీయడం అతని బౌలింగ్ పదునెక్కిన తీరు ఏమిటో చెబుతుంది. ఇక అశ్విన్‌కు సరి జోడీగా జడేజా చూపించిన ఆట కూడా ఆసీస్‌ను దెబ్బ కొట్టింది. విదేశాల్లో మూడేళ్ల తర్వాత వీరిద్దరు ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడి జట్టును గెలిపించారు. ఇక బ్యాటిం గ్లో జడేజా ఇచ్చే అదనపు విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుజారా రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైనా... రహానే మొత్తం భారాన్ని మోసి శతకం సాధించడంతో పాటు ఫీల్డింగ్ వ్యూహాల్లో కెప్టెన్ జట్టును నడిపించిన తీరుపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. ఎవరి గురించి ఎంత చెప్పినా మెల్బోర్న్ టెస్టు గిల్, సిరాజ్‌లకు అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరిద్దరి ఆట చూస్తే తొలి టెస్టు ఆడుతున్నట్లుగా ఏమాత్రం కనిపించలేదు. మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా... ఆసాం తం అదే జోష్‌ను ప్రదర్శించిన హైదరాబాదీ సిరాజ్ అందరి మనసులు గెలుచుకు న్నాడు. ఇక గిల్ ఆడిన క్లాసికల్ షాట్లు అతనికి మంచి భవిష్యత్తు ఉందని చూపించాయి. సిరీస్ తుది ఫలితం ఎలాగైనా ఉండ వచ్చు కానీ తాజా ప్రదర్శన మాత్రం భారత అభిమానుల్లో సంతోషం నింపిందనేది వాస్తవం. కొసమెరుపు... మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు ఏమైనా సంబరాలు చేసుకున్నట్లు కనిపించిందా... గాల్లోకి పంచ్‌లు విసురుతూ డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా ఉత్సాహం ప్రదర్శించడం చూశామా... అసలు ఏమీ జరగనట్లు, ఏదో ఒక రొటీన్ మ్యాచ్ ఆడినట్లు, ఇలా గెలవడం తమకు కొత్త కాదన్నట్లు, ఇకపై ఆస్ట్రేలియాలో గెలవడం అద్భుతంగా భావించరాదని, మున్ముందు చాలా వస్తాయన్నట్లుగా మనోళ్ల స్పందన కనిపించింది. సిరీస్‌కు ముందు కోహ్లి చెప్పినట్లుగా ‘న్యూ ఇండియా’ అంటే ఇదే కావచ్చేమో! (చదవండి: రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి) -
క్యాపిటల్స్‌కు వరుసగా నాలుగో ఓటమి
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతోంది...ప్లే ఆఫ్స్ స్థానం ఖరారైన తర్వాత కూడా ఏమాత్రం తీవ్రత తగ్గించని ఆ జట్టు ఢిల్లీని సునాయాసంగా ఓడించి తమ స్థాయిని ప్రదర్శించింది. భారీ రన్‌రేట్ కారణంగా ఆ జట్టు టాప్–2లో నిలవడం కూడా దాదాపుగా ఖాయమైంది. మరో వైపు పేలవ ప్రదర్శనతో క్యాపిటల్స్ మరింత దిగజారింది. బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన ఆ టీమ్ రన్‌రేట్ కూడా మైనస్‌లోకి పడిపోయింది. ముందంజ వేసే అవకాశాలు ఇంకా ఉన్నా... పరిస్థితిని మాత్రం క్లిష్టంగా మార్చుకుంది. దుబాయ్: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పెద్ద విజయం చేరింది. పేస్ ద్వయం బుమ్రా (3/17), బౌల్ట్ (3/21) అద్భుత ప్రదర్శన చేయడంతో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను 9 వికెట్లతో ముంబై చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ధావన్ మళ్లీ సున్నా... భారీ స్కోరు సాధించాలనే లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ ధాటికి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శిఖర్ ధావన్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే రెండు ఫోర్లతో జోరు కనబరిచిన పృథ్వీ (10) కూడా పెవిలియన్ చేరాడు. పరుగులు చేసేందుకు శ్రమించిన ఢిల్లీ పవర్‌ప్లేలో కేవలం 22 పరుగులు చేసింది. ఈ సీజన్లో పవర్‌ప్లేలో నమోదైన రెండో అత్యల్ప స్కోరు ఇదే. పంత్ (24 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో కలిసి అయ్యర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే 12 పరుగుల వ్యవధిలో అయ్యర్, స్టొయినిస్ (2), పంత్ వికెట్లను కోల్పోయి 62/5తో కష్టాల్లో పడింది. మరోసారి చెలరేగిన బుమ్రా... హర్షల్‌పటేల్ (5)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, హెట్‌మైర్ (11) విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ తడాఖా... భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇషాన్ కిషన్ నాలుగు బౌండరీలతో రాణించడంతో వికెట్ కోల్పోకుండా పవర్‌ప్లేలో 41 పరుగులు సాధించింది. ఇషాన్‌కు సహకరించిన డికాక్ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు)... నోర్జే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సూర్యకుమార్ (12) అండతో ఇషాన్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత చెలరేగిన ఇషాన్ సిక్సర్‌తో మరో 34 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డికాక్ (బి) బౌల్ట్ 10; ధావన్ (సి) సూర్యకుమార్ (బి) బౌల్ట్ 0; శ్రేయస్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 25; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 21; స్టొయినిస్ (సి) డికాక్ (బి) బుమ్రా 2; హెట్‌మైర్ (సి) కృనాల్ (బి) కూల్టర్ నీల్ 11; హర్షల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 5; అశ్విన్ (సి) కృనాల్ (బి) బౌల్ట్ 12; ప్రవీణ్ దూబే (నాటౌట్) 7; రబడ (రనౌట్) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–50, 4–57, 5–62, 6–73, 7–78, 8–96, 9–110. బౌలింగ్: బౌల్ట్ 4–0–21–3, కృనాల్ 3–0–13–0, జయంత్ యాదవ్ 3–0–18–0, బుమ్రా 4–0–17–3, కూల్టర్‌నీల్ 2–0–14–1, రాహుల్ చహర్ 4–0–24–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (నాటౌట్) 72; డికాక్ (బి) నోర్జే 26; సూర్యకుమార్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 111. వికెట్ల పతనం: 1–68. బౌలింగ్: రవిచంద్రన్ అశ్విన్ 4–0–18–0, రబడ 3–0–27–0, నోర్జే 2.2–0–25–1, స్టొయినిస్ 1–0–4–0, ప్రవీణ్ 3–0–29–0, హర్షల్ పటేల్ 1–0–8–0. -
సూపర్ షమీ... భళా బుమ్రా...
ప్రాక్టీస్ పోరులో మన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారని ఆందోళన చెందిన చోట మన పేస్ బౌలర్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటారు. ఎర్ర బంతితో ఎప్పటిలాగే షమీ చెలరేగిపోగా, పరిమిత ఓవర్ల సిరీస్‌లో పదును చూపించలేకపోయిన బుమ్రా కూడా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పడగొట్టాడు. టెస్టు తుది జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్న ఉమేశ్, సైనీలకు కూడా వికెట్లు దక్కాయి. మొత్తంగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో మన పేసర్లకు సరైన సాధన లభించింది. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకొన్న మన ఓపెనర్లు రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి బ్యాటింగ్ చూపించడం కూడా ఊరటే. హామిల్టన్: ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు బ్యాటింగ్‌లో విఫలమైన భారత జట్టు రెండో రోజు బౌలింగ్‌లో సత్తా చాటింది. ఫలితంగా న్యూజిలాండ్ ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 74.2 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. భారత్‌కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ తరఫున హెన్రీ కూపర్ (68 బంతుల్లో 40; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (67 బంతుల్లో 34; 7 ఫోర్లు), డరైల్ మిషెల్ (65 బంతుల్లో 32; 5 ఫోర్లు), టామ్ బ్రూస్ (34 బంతుల్లో 31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమీ 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, ఉమేశ్, సైనీ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 ఓవర్లలో 59 పరుగులు చేసింది. పృథ్వీ షా (25 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (17 బంతుల్లో 23 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా భారత్ ఆధిక్యం 87 పరుగులకు చేరింది. కూపర్ మినహా... న్యూజిలాండ్ ఎలెవన్ తరఫున ఒక్క అర్ధ సెంచరీ కూడా నమోదు కాలేదు. రెండో రోజు కూడా బౌన్స్, స్వింగ్‌కు అనుకూలించిన పిచ్‌ను భారత బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. బుమ్రా తన రెండో ఓవర్లోనే యంగ్ (2)ను అవుట్ చేసి శుభారంభం అందించగా, సీఫెర్ట్ (9)ను షమీ వెనక్కి పంపించాడు. ఈ దశలో రవీంద్ర, అలెన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాగలేదు. మరో ఎండ్‌లో కూపర్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఐదో వికెట్‌కు కూపర్, బ్రూస్ కలిసి 51 పరుగులు జోడించడమే కివీస్ జట్టులో పెద్ద భాగస్వామ్యం. వీరిద్దరు 20 పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... సీనియర్ ఆటగాడు నీషమ్ (1)ను చక్కటి బంతితో షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ మొత్తం కలిసి 74 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఓపెనర్ల జోరు... తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత ఓపెనర్లు ఈసారి ఎలాంటి తప్పూ చేయలేదు. దూకుడైన షాట్లతో పృథ్వీ షా, మయాంక్ వేగంగా పరుగులు రాబట్టారు. రెండో రోజు చివరకు వచ్చేసరికి పిచ్ కాస్త నెమ్మదించి బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడం కూడా వీరికి కలిసొచ్చింది. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో తామిద్దరిని అవుట్ చేసిన కుగ్లీన్ బౌలింగ్‌లో విరుచుకుపడిన వీరిద్దరు 3 ఓవర్లలోనే 34 పరుగులు బాదారు. భారత్ ఇన్నింగ్స్ 8.42 రన్‌రేట్‌తో సాగడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లాగే మరో సారి ఓపెనర్లుగా పృథ్వీ, మయాంక్‌లనే పంపడం చూస్తే తొలి టెస్టులో వీరిద్దరినే ఆడించే ఆలోచనతో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే టెస్టు అరంగేట్రం కోసం శుబ్‌మన్ గిల్ మరికొంత కాలం వేచి చూడక తప్పదు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 263; న్యూజిలాండ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: యంగ్ (సి) పంత్ (బి) బుమ్రా 2; రవీంద్ర (సి) పంత్ (బి) ఉమేశ్ 34; సీఫెర్ట్ (సి) పంత్ (బి) షమీ 9; అలెన్ (బి) బుమ్రా 20; కూపర్ (సి) మయాంక్ (బి) షమీ 40; బ్రూస్ (బి) సైనీ 31; మిషెల్ (సి) పృథ్వీ షా (బి) ఉమేశ్ 32; నీషమ్ (బి) షమీ 1; క్లీవర్ (బి) సైనీ 13; కుగ్లీన్ (నాటౌట్) 11; సోధి (సి) పుజారా (బి) అశ్విన్ 14; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (74.2 ఓవర్లలో ఆలౌట్) 235. వికెట్ల పతనం: 1–11; 2–36; 3–70; 4–82; 5–133; 6–155; 7–161; 8–204; 9–213; 10–235. బౌలింగ్: బుమ్రా 11–3–18–2; ఉమేశ్ 13–1–49–2; షమీ 10–5–17–3; సైనీ 15–2–58–2; అశ్విన్ 15.2–2–46–1; జడేజా 10–4–25–0. భారత్ రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా (బ్యాటింగ్) 35; మయాంక్ అగర్వాల్ (బ్యాటింగ్) 23; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 59 బౌలింగ్: టిక్నెర్ 3–0–19–0; కుగ్లీన్ 3–0–34–0; జాన్స్టన్ 1–0–6–0. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో బుమ్రా
దుబాయ్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అత్యద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తొమ్మిది స్థానాలు పురోగతి సాధించి తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చాడు. 774 రేటింగ్ పాయింట్లతో బుమ్రా ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇప్పటివరకు బుమ్రా అత్యుత్తమ ర్యాంక్ 15గా ఉండేది. 908 రేటింగ్ పాయింట్లతో కమిన్స్ (ఆస్ట్రేలియా), రబడ (దక్షిణాఫ్రికా–851 పాయింట్లు), అండర్సన్ (ఇంగ్లండ్–814 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్‌కే చెందిన రవీంద్ర జడేజా పదో స్థానంలో నిలిచాడు. కోహ్లి ‘టాప్’లోనే... టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి 910 ర్యాంకింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్టుకు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 904 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) మూడో ర్యాంక్‌లో, చతేశ్వర్ పుజారా (భారత్) నాలుగో ర్యాంక్‌లో ఉన్నారు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన అజింక్య రహానే 10 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరాడు. అజేయ సెంచరీతో యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్ స్టోక్స్ ఆల్‌రౌండర్ల జాబితాలో కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకున్నాడు. -
ప్రాక్టీస్‌లో ‘జూనియర్ బుమ్రా’
నేడు బెంగళూరుతో జరిగే మ్యాచ్ సన్నాహల్లో భాగంగా ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా బుధవారం జట్టుతో పాటు చిన్నస్వామి స్టేడియానికి వచ్చాడు. అయితే గాయం నుంచి కోలుకుంటున్న అతను బౌలింగ్ మాత్రం చేయలేదు. కానీ మైదానంలో మరో బుమ్రా అందరినీ ఆకర్షించాడు. సరిగ్గా అచ్చుగుద్దినట్లు అతనిలాగే రనప్, బౌలింగ్ యాక్షన్‌తో అతను బెంగళూరు టీమ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడి పేరు మహేశ్ కుమార్. బెంగళూరులో లీగ్ స్థాయి క్రికెట్ ఆడుతూ రాష్ట్ర అండర్–23 జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నాడు. అసలు మ్యాచ్‌లో బుమ్రా తరహా బౌలింగ్‌కు కాస్త అలవాటు పడాలని ఆర్సీబీ ఏరికోరి ఈ బౌలర్‌ను తెచ్చుకుంది. ఆర్సీబీ బౌలింగ్ కోచ్ నెహ్రా అతడిని పదేపదే ప్రోత్సహిస్తూ బౌలింగ్ చేయించాడు. మహేశ్ వేసిన ఒక చక్కటి బంతి హెట్‌మైర్ స్టంప్స్‌ను పడగొట్టింది. అతని బౌలింగ్‌ను దూరం నుంచి గమనిస్తున్న బుమ్రానే స్వయంగా ‘థమ్స్ అప్’ అంటూ ప్రోత్సహించడం మహేశ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కొద్దిసేపటి తర్వాత నెహ్రా సంతకం చేసి ఒక జత షూస్ బహుమతిగా ఇవ్వగా... కోహ్లి ఫోటో దిగి ఆటోగ్రాఫ్ ఇవ్వడం, వెల్ బౌల్డ్ అంటూ డివిలియర్స్ ప్రశంసలు కలగలిసి మహేశ్‌కు అంతులేని ఆనందాన్ని పంచాయి! -
బుమ్రా గాయంపై ఆందోళన అనవసరం: బీసీసీఐ
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన భారత పేసర్ బుమ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఫీల్డింగ్ చేస్తూ కిందపడటంతో బుమ్రా ఎడమ భుజానికి గాయమైంది. సోమవారం నిర్వహించిన వైద్య పరీక్షల అనంతరం బుమ్రా గాయం చిన్నదేనని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. స్కానింగ్ రిపోర్ట్ కూడా మామూలుగానే ఉందని పేర్కొన్నారు. తదుపరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కోసం ముంబై జట్టు ఇప్పటికే బెంగళూరు చేరగా... బుమ్రా కూడా జట్టుతో కలుస్తాడని వెల్లడించారు. -
నైకీ ఎక్కడ...?
సాక్షి, విశాఖపట్నం: ఆస్ట్రేలియాతో తొలి టి20లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా జెర్సీని గమనించారా? వెనక వైపు అతని పేరు ఉండాల్సిన చోట స్టిక్కర్ అంటించి ఉంది. దాని నంబర్ కూడా 59... రెగ్యులర్‌గా బుమ్రా జెర్సీ నంబర్ 93. ఆదివారం మీడియాకు ఇచ్చిన టీమ్ జాబితాలో కూడా నంబర్ 93 అనే రాసి ఉంది. కానీ మైదానంలో బుమ్రా మాత్రం అది వేసుకోలేదు. ఆ టీ షర్ట్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ది. అతను తన తొలి మ్యాచ్ నుంచి 59 నంబర్‌నే వాడుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే న్యూజిలాండ్‌లో జరిగిన టి20ల్లో కూడా రోహిత్ శర్మ విజయ్ శంకర్ జెర్సీ 59తో ...ఆ తర్వాత హార్దిక్ పాండ్యా జెర్సీ 33తో బరిలోకి దిగాడు. అంటే భారత కెప్టెన్ కూడా తన పేరు లేకుండానే ఆడాడు. కొత్త ఆటగాళ్లంటే ఏమో స్టార్ ప్లేయర్ల కోసం కూడా ఇలా టీ షర్ట్లు సిద్ధం కాకపోవడం చిత్రంగా ఉంది. భారత జట్టు వన్డేలు, టి20ల్లో వేర్వేరు జెర్సీలతో ఆడుతుందనేది అందరికీ తెలిసిందే. టీమ్ అపెరల్ పార్ట్నర్ నైకీ వీటిని అందజేయాల్సి ఉంటుంది. అయితే మరి నిర్లక్ష్యమో, మరే కారణమో కానీ టి20 టీమ్‌కు అవసరమైన జెర్సీలు సిద్ధం కానట్లుంది. ఏదో ఒకటిలే పని కానిచ్చేద్దాం అన్నట్లు మన ఆటగాళ్లు కూడా ఈ విషయాన్ని గానీ, టి20 మ్యాచ్‌లను గానీ సీరియస్‌గా తీసుకోలేదేమో. న్యూజిలాండ్ టి20ల్లోనైతే జట్టులో సగం మంది ఇలా స్టిక్కర్లు అంటించి లేదా వన్డే డ్రెస్‌తోనే ఆడేశారు. ఒక దశలో కామెంటేటర్లు కూడా దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ విషయంలో ఎంతో కచ్చితంగా వ్యవహరించే బీసీసీఐ ఈ అంశంపై మాత్రం దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యకరం. -
సిరాజ్‌కు పిలుపు
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి భారత జట్టు టెస్టు సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఈనెల 12 నుంచి ఆస్ట్రేలియాతో... అనంతరం 23 నుంచి న్యూజిలాండ్‌తో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌లలో బుమ్రా బరిలోకి దిగడం లేదని బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా స్థానంలో హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను తొలిసారి వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. ‘ఫిబ్రవరిలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో బుమ్రాకు తగిన విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. అతని స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేశాం. న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు పంజాబ్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్‌ను కూడా జట్టులోకి తీసుకున్నాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది క్రితమే టెస్టుల్లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల బుమ్రా 10 టెస్టులు ఆడి 49 వికెట్లు తీశాడు. మరోవైపు 24 ఏళ్ల సిరాజ్ 2017 నవంబర్‌లో రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. మూడు టి20 మ్యాచ్‌లు ఆడిన అతను మూడు వికెట్లు తీశాడు. -
ఆదిలోనే విండీస్‌కు షాక్
తిరువనంతపురు: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది విండీస్. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్‌గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలి ఓవర్లోనే పావెల్ వికెట్ చేజార్చుకుంది. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ నాల్గో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చిన పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్‌ను ఔట్ చేశాడు. బూమ్రా బౌలింగ్‌లో హోప్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రెండు పరుగులకే రెండు ప్రధాన వికెట్లను విండీస్ కోల్పోయింది. అదే జట్టుతో టీమిండియా.. -
బుమ్రా, భువీ విశ్రాంతి అడిగారా?
నిరాశాజనకమైన ఇంగ్లండ్ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ టెస్టుల్లో విజయాల బాట పట్టాలని భావిస్తోంది. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ ఆ అవకాశం కల్పిస్తోంది. ఐదు టెస్టుల సిరీస్ తర్వాత రెండు మ్యాచ్‌ల సిరీస్ అంటే అర్థం లేనట్లుగా అనిపిస్తోంది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో బిజీ షెడ్యూల్ కారణంగా అభిమానుల ఆశలకు అనుగుణంగా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించడం కష్టసాధ్యంగా మారిపోయింది. అయితే ఐదు టెస్టులు సాధ్యం కాకపోతే కనీసం మూడు టెస్టులన్నా నిర్వహించాల్సింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఐదేళ్ల క్రితం సచిన్ వీడ్కోలు సిరీస్‌కు వచ్చిన వెస్టిండీస్ జట్టుకంటే ప్రస్తుత టీమ్ చాలా పటిష్టంగా ఉంది. కొంత మంది టి20 స్టార్లు లేకపోయినా వెస్టిండీస్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తోంది. ఊహించినట్లుగానే భారత్ ఓపెనర్ల జోడీని మార్చబోతోంది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలలో ఎవరు అరంగేట్రం చేస్తారనేది రాజ్‌కోట్‌లోనే తేలుతుంది. సొంతగడ్డపై భారీ స్కోరు చేసేందుకు పుజారాకు ఇది మరో అవకాశం కాగా, ఇంగ్లండ్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి అక్కడ చేజార్చుకున్న కొన్ని శతకాలను ఇక్కడ అందుకోవాలని భావిస్తుండవచ్చు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినివ్వడం చాలా ఆశ్చర్యం కలిగించింది. తమ దృష్టిలో టెస్టు మ్యాచ్‌లకు ప్రాధాన్యత లేదని దీని ద్వారా సెలక్టర్లు చాటుకున్నారు. ఈ ఇద్దరు బౌలర్లూ తమకు విరామం కావాలని అడిగారా? నిజంగా విశ్రాంతి ఇవ్వాలనుకుంటే పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నుంచి దూరంగా ఉంచాల్సింది తప్ప టెస్టుల నుంచి కాదు. టెస్టు క్రికెట్ మనుగడ సాగించాలంటే అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లు కచ్చితంగా బరిలోకి దిగాలి. వారిద్దరి గైర్హాజరు వల్ల శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్‌లాంటి ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. తమ సత్తా ఏమిటో ప్రదర్శించి ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా చోటు ఖాయం చేసుకునేందుకు ఈ యువ పేసర్లకు ఇది మంచి అవకాశం. ఇంగ్లండ్‌తో తొలి నాలుగు టెస్టుల్లో ఐదుగురు బ్యాట్స్‌మెన్, ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగి భారత్ ఆ తర్వాత ఈ లెక్కను పక్కన పెట్టి చివరి టెస్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌తో ఆడింది. ఆఖరి టెస్టులో మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ రిషభ్ పంత్ అద్భుతంగా ఆడిన తీరు చూస్తే... అశ్విన్ నాలుగు సెంచరీలు కూడా వెస్టిండీస్‌పైనే చేశాడనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటే మరోసారి భారత్ ఐదుగురు బౌలర్ల పాత వ్యూహాన్ని అమలు చేయవచ్చు. విండీస్‌తో 2013 టెస్టు సిరీస్ భారత్ దృష్టిలో మంచినీళ్ల ప్రాయంలా సాగింది. ఈ సిరీస్‌ను చాలా మంది ఆస్ట్రేలియా పర్యటనకు ముందు సన్నాహకంగా భావిస్తున్నా... మరీ అంత సులువుగా ఏమీ జరగదనేది నా అభిప్రాయం. -
బుమ్రాను చూసి నేర్చుకోవాలి
క్రికెట్ అభిమానుల్లో ఎక్కువ మంది ఆశించిన లేదా ఊహించిన ఫైనల్ కాదిది. అయితే ఫైనల్ చేరేందుకు బంగ్లాదేశ్‌కు అన్ని విధాలా అర్హత ఉంది. భారత్ గనక ఆ జట్టును తేలిగ్గా తీసుకుంటే ఇక్కడ కూడా ఆశ్చర్యకర ఫలితం రావచ్చు. అఫ్గానిస్తాన్ చేతిలో ఓటమి తర్వాత మళ్లీ కోలుకొని పట్టుదలతో బంగ్లాదేశ్ ఆడిన తీరు ప్రశంసనీయం. సమష్టితత్వంతో పాటు సానుకూల దృక్పథంతో వారు పాకిస్తాన్‌తో ఆడారు. ఫలితంగా సెమీఫైనల్‌లాంటి మ్యాచ్‌లో చాంపియన్స్ ట్రోఫీ విజేతలకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. మష్రఫ్ మొర్తజా తన ఫీల్డింగ్ ఏర్పాట్లు, బౌలింగ్ మార్పులతో సమర్థంగా జట్టును నడిపించాడు. సహచరులు కూడా దానికి తగిన రీతిలో స్పందించారు. ముష్ఫికర్ అద్భుతంగా ఆడుతుండగా మిథున్ కూడా ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో వీరిద్దరి భాగస్వామ్యం చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదనే తత్వం కనిపించింది. దురదృష్టవశాత్తూ ముష్ఫికర్ సెంచరీ కోల్పోయాడు. ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్‌తో బౌలింగ్ ప్రారంభించి మష్రఫ్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వేగంగా ప్రత్యర్థినుంచి మ్యాచ్‌ను లాక్కునే సత్తా ఉన్న ఫఖర్‌ను ఔట్ చేసి మెహదీ తన కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆసి యా కప్‌లో ఫఖర్ ఫామ్ పేలవంగా ఉండటం వల్ల పాక్‌కు సరైన ఆరంభాలు లభించలేదు. సరిగ్గా ఇదే విషయంలో భారత్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభిస్తూ తొలి పది ఓవర్లలోనే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బ తీస్తున్నారు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ వీరిద్దరు కొడుతున్న షాట్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ప్రత్యర్థి బౌలర్లను ఒక వైపు జాగ్రత్తగా ఎదుర్కొంటూనే మరో వైపు మెరుపు షాట్లతో చెలరేగుతున్న తీరును చూసి తీరాల్సిందే. ఇక్కడి స్పిన్ పిచ్‌లను భారత స్పిన్నర్లు సమర్థంగా ఉపయోగించుకొని ప్రత్యర్థి మిడిలార్డర్లో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా కట్టి పడేశారు. జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా బాగా ఆడుతున్నాడు. ఫ్రంట్ ఫుట్ నోబాల్ వేయకుండా ఉండే విధంగా అతను తన రనప్‌ను మార్చుకున్న తీరు చూస్తే తప్పులు సరి దిద్దుకునేందుకు అతను ఎంత శ్రమిస్తాడో అర్థమవుతుంది. నోబాల్ వేయకుండా ఉండే విషయంలో జడేజా, చహల్ కూడా బుమ్రాను చూసి నేర్చుకోవాలి. చురుకైన ఫీల్డింగ్ కూడా భారత జట్టు ఫైనల్ చేరడానికి ఒక కారణం. ఇప్పుడు కావాల్సిందల్లా ఇదే జోరును మరొక రోజు కొనసాగించి ఆసియా కప్‌ను మన ఖాతాలో వేసుకోవడమే. -
గెలుపు అంచున భారత్
భారత్ అద్భుత విజయం కోసం మరో రోజు నిరీక్షణ తప్పదు. అసాధారణ పోరాట పటిమ కనబర్చిన ఇంగ్లండ్... ఓటమికి చేరువై కూడా పట్టుదలగా నిలబడింది. ఫలితంగా 9 వికెట్ల వద్ద ఆ జట్టు నాలుగో రోజు ఆట ముగించింది. మూడు అదనపు ఓవర్ల సమయంలో టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఆఖరి వికెట్ దక్కలేదు. బుధవారం వాతావరణం కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నా ఒక చక్కటి బంతి మ్యాచ్ చివరి రోజు భారత్‌కు గెలుపు అందించవచ్చు. తొలి సెషన్లోనే నాలుగు వికెట్లు... ఇక మన విజయానికి ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే బట్లర్, స్టోక్స్ అద్భుత భాగస్వామ్యం ఇంగ్లండ్‌ను నడిపించింది. వీరిద్దరు ఏకంగా 57.2 ఓవర్ల పాటు ఆడటంతో భారత శిబిరంలో ఆందోళన పెరిగింది. అయితే అప్పుడొచ్చాడు జస్ప్రీత్ బుమ్రా... కెరీర్లో తొలి సెంచరీ సాధించి ఊపు మీదున్న బట్లర్‌ను ఔట్ చేసి గెలుపు గేట్లు తెరిచాడు. అదే జోరులో అతను మరో మూడు వికెట్లు తీయడంతో మ్యాచ్ సీన్ మారిపోయింది. నాటింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు ఆసక్తికర ముగింపునకు చేరింది. నాలుగో రోజే భారత్ గెలిచేందుకు బాగా చేరువైనా... ఆదిల్ రషీద్ (55 బంతుల్లో 30 బ్యాటింగ్; 5 ఫోర్లు, ఒక సిక్స్) పట్టుదలగా ఆడటంతో మరో రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (176 బంతుల్లో 106; 21 ఫోర్లు) శతకంతో చెలరేగగా... బెన్ స్టోక్స్ (187 బంతుల్లో 62; 6 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. జస్ప్రీత్ బుమ్రా (5/85) కెరీర్ నాలుగో టెస్టులోనే రెండో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో లోకేశ్ రాహుల్ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. ఐదు పరుగుల... ఐదు బంతుల తేడాతో... ఓవర్‌నైట్ స్కోరు 23/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరిగారు. మంగళవారం మొదటి ఓవర్లోనే జెన్నింగ్స్‌ను (13) ఔట్ చేసిన ఇషాంత్, తన తర్వాతి ఓవర్లో మరో చక్కటి బంతితో కుక్ (17)ను పెవిలియన్‌కు పంపించాడు. జట్టును ఆదుకోవడంలో కెప్టెన్ రూట్ (13), ఒలివర్ పోప్ (16) విఫలమయ్యారు. ఐదు బంతుల తేడాలో ముందుగా రూట్‌ను బుమ్రా ఔట్ చేయగా, షమీ బౌలింగ్‌లో మూడో స్లిప్‌లో కోహ్లి అద్భుత క్యాచ్‌కు పోప్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ వెంటనే వ్యక్తిగత స్కోరు 1 వద్ద బుమ్రా బౌలింగ్‌లో బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ వదిలేయడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. కీలక భాగస్వామ్యం... తొలి సెషన్లో దాదాపు 10 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అడ్డుకున్న స్టోక్స్, బట్లర్ లంచ్ తర్వాత కూడా అదే పట్టుదల కనబర్చారు. పరిస్థితికి తగినట్లుగా జాగ్రత్తగా ఆడుతూ, ఎలాంటి తప్పుడు షాట్లకు ప్రయత్నించకుండా సంయమనంతో క్రీజ్‌లో నిలిచారు. భారత పేసర్లు చక్కగా బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం దక్కలేదు. కొన్నిసార్లు ఇంగ్లండ్‌కు అదృష్టం కూడా కలిసొచ్చింది. అశ్విన్ బౌలింగ్‌లో ఒకసారి, షమీ బౌలింగ్‌లో మరోసారి ఎల్బీడబ్ల్యూ అప్పీల్లు బలంగా కనిపించినా... రివ్యూలలో స్టోక్స్ బతికిపోయాడు. మరోవైపు 93 బంతుల్లో బట్లర్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇంగ్లండ్ రెండో సెషన్‌ను విజయవంతంగా ముగించగలిగింది. టీ తర్వాత కూడా వీరిద్దరూ తమ జోరు కొనసాగిస్తూ మరింత స్వేచ్ఛగా ఆడారు. షమీ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన బట్లర్... ఈ క్రమంలో 152 బంతుల్లోనే కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొత్త బంతితో... భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత మూడో ఓవర్లోనే వికెట్ లభించింది. వికెట్ కోసం సుదీర్ఘ సమయం సాగిన నిరీక్షణకు బుమ్రా తెరదించాడు. అతడి బంతిని ఆడకుండా బట్లర్ చేతులెత్తేయగా అది నేరుగా ప్యాడ్లను తాకింది. అంపైర్ ఔట్‌గా ప్రకటించినా బట్లర్ రివ్యూ కోరాడు. అయితే లాభం లేకపోయింది. అద్భుతంగా వేసిన తర్వాతి బంతితో బెయిర్‌స్టో (0)ను క్లీన్‌బౌల్డ్ చేసిన బుమ్రా... తర్వాతి ఓవర్లోనే వోక్స్ (4)ను పెవిలియన్ పంపించాడు. కొద్ది సేపటికి రషీద్‌ను కూడా బుమ్రా ఔట్ చేసినా అది ‘నోబాల్’గా తేలింది. ఈ దశలో దూకుడుగా ఆడిన రషీద్, బ్రాడ్ జోడీ తొమ్మిదో వికెట్‌కు 50 పరుగులు జోడించింది. ఎట్టకేలకు బ్రాడ్‌ను ఔట్ చేసి బుమ్రా ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రషీద్ బలంగా నిలబడటంతో భారత్ నిరాశగా పెవిలియన్ చేరింది. -
బుమ్రా బౌలింగ్... ఉమేశ్ ఔట్... నో బాల్
ముంబై: ముంబై ఇండియన్స్–రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఘటన అంపైరింగ్ ప్రమాణాలను వేలెత్తి చూపింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా వేసిన 18వ ఓవర్ చివరి బంతికి బెంగళూరు బ్యాట్స్‌మన్ ఉమేశ్ యాదవ్ రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. కానీ, ‘ఓవర్ స్టెప్పింగ్ నోబాల్స్’ వేసే అలవాటున్న బుమ్రాపై అనుమానంతోనే ఏమో ఫీల్డ్ అంపైర్లు మూడో అంపైర్ అనంత పద్మనాభన్‌ను సంప్రదించారు. ఈ సందర్భంగా రీప్లేలు పరిశీలించిన అతడు ఔట్ ప్రకటించడంతో ఉమేశ్ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. అప్పటికీ ఫీల్డ్ అంపైర్లు దీనిని ఆశ్చర్యకరంగానే చూశారు. అయితే, ఓ అభిమాని పరిశీలనలో ఆసక్తి కర సంగతులు బయటపడ్డాయి. అవేంటంటే... మూడో అంపైర్ పరిశీలించిన రీప్లే, ఉమేశ్ ఔటైన రీప్లే ఒకటి కాదు. అతడు చూసిన దాంట్లో ఉమేశ్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోనే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇంకోటి ఉమేశ్ క్యాచ్ అవుటైన బంతిని బుమ్రా నో బాల్‌గా వేశాడు. అంటే అతడు నాటౌట్. దీనిపై ఆ అభిమాని వీడియో క్లిప్పింగ్‌లను క్రిక్ఇన్ఫోకు పోస్ట్ చేశాడు. అయితే... ఇలాంటివి గతంలోనూ రెండుసార్లు వెలుగులోకి వచ్చాయి. 2011 ఐపీఎల్లో అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సచిన్‌ను, అదే ఏడాది బార్బడోస్ టెస్టు సందర్భంగా ఫిడేల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లో ధోనిని అచ్చం ఇలాగే ఔట్‌గా ప్రకటించారు. రీప్లే ఆపరేటర్ రెండుసార్లు క్లిక్ చేయడం వలన అసలు దాని బదులు అంతకుముందటి రీప్లే వీడియో థర్డ్ అంపైర్ ముందుకొస్తుంది. దాని ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుండటంతో తప్పులు దొర్లుతున్నాయి. కొసమెరుపు... నో బాల్స్ విషయంలో బుమ్రాను పదేపదే విమర్శించే సునీల్ గావస్కర్ ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాత. ఆయన సైతం థర్డ్ అంపైర్ చూసిన రీప్లేనే చూసి పొరపడి, ఉమేశ్ ఔటైనట్లు నిర్ధారణకు వచ్చారు. -
బుమ్రా తప్పు సరిదిద్దుకోవాలి
తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి ముంబై ఇండియన్స్‌ను ఆలోచనలో పడేసి ఉంటుంది. మ్యాచ్ అంత పోటాపోటీగా సాగకపోయి ఉంటే దాన్నుంచి తెలుసుకోవాల్సింది ఏమీ ఉండకపోయేది. డ్వేన్ బ్రేవో ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ లేదా ఒక బౌలర్ అద్భుత బౌలింగ్ ఫలితాన్ని మార్చేయడం తరచూ జరిగేదే. తమ బ్యాటింగ్ లైనప్‌తో ముంబై కనీసం 200 పరుగులైనా చేయాలి. తర్వాత బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించాలి. కానీ మొదటి మ్యాచ్‌లో బ్రేవో దెబ్బకు వారి ప్రధాన బౌలర్ బుమ్రా భారీగా పరుగులిచ్చుకున్నాడు. మంచి బౌలర్లకూ ఇలాంటిది సాధారణమే. అయినా అతడు ఓవర్ స్టెప్పింగ్ నో బాల్స్ నిరోధంపై దృష్టిపెట్టాలి. టెస్టుల్లో వికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు కాబట్టి నో బాల్స్ వేశారంటే అర్థం చేసుకోవచ్చు. బ్యాట్స్‌మన్‌ను హడలెత్తించేందుకు ఫ్లాట్ పిచ్‌లపైనా పేసర్లు కొన్నిసార్లు క్రీజు దాటుతుంటారు. పరుగులు నిరోధించడమే లక్ష్యమైన పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఇలా కాకుండా చూసుకోవడం పేసర్లకు అతి ముఖ్యం. నో బాల్ అదనపు పరుగు మాత్రమే ఇవ్వదు. దానితో వచ్చే ఫ్రీ హిట్ ఫలితాన్నే మార్చేస్తుంది. బుమ్రా తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే ఆటగాడు. పరిమిత ఓవర్ల నుంచి టెస్టు క్రికెట్‌కు అతడి పయనం అసాధారణం. ఇదే విధంగా ‘నో బాల్’ సమస్యను ఎందుకు సరిచేసుకోలేకపోతున్నాడో అర్థం కావడం లేదు. రనప్ మార్కింగ్‌కు టేపుల వంటి చిట్కాలు ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో ఓవర్ ఫుట్ నోబాల్‌కు మినహాయింపుల్లేవు. ప్రారంభ మ్యాచ్‌లో రాజస్తాన్‌ను కట్టడి చేసిన తమ బౌలర్లు మళ్లీ రాణించాలని సన్‌రైజర్స్ భావిస్తుండవచ్చు. అయితే, ఐపీఎల్లో నెమ్మదిగా ఊపందుకునే స్వభావమున్న ముంబై పరిస్థితులను చక్కగా తమవైపు తిప్పుకోగలదు. -
అతనెవరో కూడా నాకు తెలీదు
వరుస సక్సెస్‌లు అందుకుంటున్న హీరోయిన్లు రిలేషన్షిప్లో లేకుండా సింగిల్‌గా ఉంటే తట్టుకోలేరు గాసిప్‌రాయుళ్లు. ఏదో ఒక బిజినెస్మేన్తోనో, క్రికెటర్తోనో లవ్‌లో ఉన్నటు వదంతులు సృష్టిస్తారు. అలాగే యంగ్ క్రికెటర్ బూమ్రాతో రాశీఖన్నా లవ్‌లో ఉన్నట్టు పుకార్లు సృష్టించారు. ‘అబ్బే అలాంటిదేం లేదు’ అని రాశీ ఖన్నా చెబుతూ –‘‘అతను క్రికెటర్ అన్న విషయం వరకూ తెలుసు. అంతకు మించి అతనెవరో కూడా నాకు తెలీయదు. నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్షిప్లో లేను. సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక అమ్మాయిని ఇలా లింకప్ చేస్తూ రాయడం చాలా బాధాకరం’’ అని పేర్కొన్నారు. ఇటీవల ‘తొలిప్రేమ’ సక్సెస్‌తో జోరులో ఉన్న రాశీ ప్రస్తుతం నితిన్ సరసన ‘శ్రీనివాస కళ్యాణం’, తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. -
బుమ్రాతో పెళ్లి : స్పందించిన రాశీఖన్నా
సాక్షి, హైదరాబాద్ : భారత్‌లో క్రికెట్, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్. అయితే ప్రస్తుతం క్రికెటర్ బుమ్రా, సినీ నటి రాశీఖన్నా పెళ్లి చేసుకుంటారన్న పుకార్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, ఇటీవల తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. గతంలో తొలిప్రేమ సినిమా ప్రమోషన్ సందర్భంగా రాశీ మీడియాతో మాట్లాడుతూ క్రికెటర్ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పిందనే వార్తలు వచ్చాయి. దీంతో నెటిజన్లు ‘బుమ్రాకు రాశీ ఖన్నా బౌల్డ్’ అంటూ.. వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్త రాశీ వరకు చేరడంతో దీనిపై ఓ టీవీ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చింది. బూమ్రా తనకు ఒక క్రికెటర్‌గా మాత్రమే తెలుసని, వ్యక్తిగతంగా తెలియదని చెప్పింది. అసలు బూమ్రా ఆడిన మ్యాచ్‌లు కూడా తాను చూడలేదని, ఇలాంటి రూమర్లు ఎలా పుట్టుకొస్తాయోనని అసహనం వ్యక్తం చేసింది. -
బౌండరీ లైన్‌పై బూమ్రా వాట్ ఎ ఫీల్డింగ్
-
బౌండరీ లైన్‌పై బూమ్రా వాట్ ఎ ఫీట్!
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాడు జస్ర్పిత్ బూమ్రా తన ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. సఫారీ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్‌ను ఆపే యత్నంలో బూమ్రా బౌండరీ లైన్‌పై చేసిన ఫీట్ అబ్బురపరిచింది. దక్షిణాఫ్రికా లక్ష్య ఛేదనలో భాగంగా భారత బౌలర్ హార్దిక్ పాండ్యా వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని మిల్లర్ మిడిల్ అండ్ లెగ్ మీదుగా షాట్ కొట్టాడు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బూమ్రా గాల్లోకి ఎగురుతూ బంతిని పట్టుకున్నాడు. కాగా, బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో బంతిని విసిరేసి బౌండరీ లైన్‌పై పడ్డాడు. కానీ అది సిక్సర్‌గా థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఇటీవల క్రికెట్లో సరళీకరించిన నిబంధనల ప్రకారం తొలుత ఒకసారి బౌండరీ లైన్ తాకి ఆపై గాల్లో క్యాచ్ పట్టి విసిరేసినా అది సిక్సర్‌గానే పరిగణిస్తారు. దాంతో ఒకింత నిరాశ అనిపించనప్పటికీ, బూమ్రా అసాధారణ రీతిలో బంతిని అందుకోవడం క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయ డంకా మోగించింది. -
'నన్ను కోహ్లి ఆశ్చర్యానికి గురిచేశాడు'
జోహన్నెస్‌బర్గ్: భారత క్రికెట్ జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్న పేసర్లు భువనేశ్వర్ కుమార్, బూమ్రాలకు సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఇవ్వకపోవడంపై దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తమ జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్లాగ్ ఓవర్లలో బూమ్రా, భువీలకు భారత కెప్టెన్ కోహ్లి బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదో తనకు అర్ధం కాలేదన్నాడు. వీరిని పక్కకు పెట్టి స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లు చేత డెత్ ఓవర్లు వేయించడంతో ఆశ్చర్యపోయానన్నాడు. 'నన్ను కోహ్లి కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేశాడు. భారత జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్టులుగా బూమ్రా, భువనేశ్వర్‌లు అందుబాటులో ఉన్నారు. మరి అటువంటప్పుడు చివరి ఓవర్లలో వారిని దూరంగా పెట్టి స్పిన్ ద్వయం చేత ఎందుకు బౌలింగ్ చేయించినట్లు. భారత పేసర్లతో ఆఖర్లో కనీసం రెండేసి ఓవర్లు వేయిస్తారని మిల్లర్-నేను అనుకున్నాం. కానీ అందుకు భిన్నంగా స్పిన్నర్ల చేత కోహ్లి బౌలింగ్ చేయించి ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ స్పిన్నర్లని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాం. కానీ సిరీస్ ఆరంభంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. మేము పూర్తిగా స్పిన్ ఎదుర్కొనడానికి కసరత్తులు చేశామని చెప్పను. గత మూడు రోజుల నుంచి కుల్దీప్ బౌలింగ్‌పై బాగా హోమ్‌వర్క్ చేశాం. చైనామన్ బౌలర్(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్) కుల్దీప్ను ఆడటానికే ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. దాంతో అతన్ని తిప్పికొట్టడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేశాం' అని క్లాసెన్ పేర్కొన్నాడు. డీకాక్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కాస్లెన్ 27 బంతుల్లో 47 పరుగులు చేసి సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాల్గో వన్డేలో కుల్దీప్-చాహల్‌లు 11.3 ఓవర్లు బౌలింగ్ వేసి 119 పరుగులిచ్చారు. అదే సమయంలో మూడు వికెట్లను మాత్రమే సాధించారు. -
బుమ్రాను కౌంటీల్లో ఆడించాలి: అక్రమ్
సెయింట్ మోరిట్జ్ (స్విట్జర్లాండ్): భారత పేస్ బౌలర్ల ఇటీవలి ప్రదర్శన పాకిస్తాన్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్‌ను కూడా ఆకట్టుకుంది. గతంతో పోలిస్తే ఈ తరం భారత పేస్ విభాగం చాలా బాగుందని అతను కొనియాడాడు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే రాబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో టీమిండియా బౌలర్లు విజృంభిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. ‘బుమ్రా కౌంటీ క్రికెట్ ఆడితే మరింత మెరుగవుతాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై అనుభవం ఉంటేనే కచ్చితత్వంతో బంతులు వేయగలడు. ఐపీఎల్ సమయంలో కనీసం ఒక నెలపాటు అతడిని కౌంటీ క్రికెట్ ఆడేలా బీసీసీఐ అనుమతిస్తే బుమ్రా మరింత రాటుదేలుతాడు. టీ20 స్పెషలిస్టుగా క్రికెట్లో అడుగుపెట్టి టెస్టు ఫార్మాట్లో రాణించాలంటే కాస్త సమయం పడుతుంది. నా దృష్టిలో భువనేశ్వర్ అత్యుత్తమ బౌలర్. దక్షిణాఫ్రికాలో అతడి ప్రదర్శన అసాధారణం. ప్రస్తుత పేస్ దళం ఇంగ్లండ్‌లో రాణించగలదు’ అని అక్రమ్ తెలిపాడు. -
అతడి కోసమే మ్యాచ్‌లు చూస్తా : హీరోయిన్
భారత్ లో క్రికెట్, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్. అయితే లవ్ కాకపోయినా ఓ దక్షిణాది భామ యువ క్రికెటర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ భామ క్రికెటర్ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పింది. క్రికెట్ అంటే తనకు ఇష్టమని చెప్పిన రాశీఖన్నా, బుమ్రా బౌలింగ్ కోసమే మ్యాచ్‌లు చూస్తుంటానని తెలిపింది. బుమ్రా మ్యాచ్ లో ఉంటే రాత్రులు మేలుకొని మరి మ్యాచ్ చూస్తుందట ఈ భామ. గతంలోనూ బుమ్రా బౌలింగ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించింది. వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా తెరకెక్కిన తొలి ప్రేమ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన
-
పట్టు చిక్కింది!
బంతితో బల ప్రదర్శనలో సై అంటే సై! టపటపా వికెట్లు తీయడంలో మీలాగే మేమూ! పోటాపోటీలో ఆధిక్యం నీదా? నాదా? అన్నట్లు సాగుతోంది వాండరర్స్ టెస్టు. ఒకరిద్దరు మినహా రెండు జట్ల ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైన ఈ పిచ్‌పై బౌలర్లు ‘చేసిన పరుగులే’ అత్యంత విలువైనవిగా మారనున్నాయి. పేస్ విశ్వరూపం కనిపిస్తున్నచోట అతి స్వల్పమే అయినా తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలదే పైచేయి అయింది. ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లిసేన రెండో ఇన్నింగ్స్‌లో చూపే పోరాటమే గెలుపు బాట చూపనుంది. జొహన్నెస్‌బర్గ్: పదునైన బంతులతో భారత పేసర్లు ప్రతాపం చూపడంతో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా క్లిష్ట పరిస్థితుల్లో పడింది. బుమ్రా (5/54), భువనేశ్వర్ (3/44) అరివీర విజృంభణకు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 194 పరుగులకే పరిమితమైంది. బౌలర్ వదలడమే ఆలస్యం... బంతి రాకెట్లా దూసుకెళ్తున్న వాండరర్స్ వికెట్‌పై ఆ జట్టు అతికష్టమ్మీద 7 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. అది కూడా ఆపద్బాంధవుడు ఆమ్లా (121 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ శతకానికి బౌలింగ్ ఆల్ రౌండర్లు రబడ (84 బంతుల్లో 30; 6 ఫోర్లు), ఫిలాండర్ (55 బంతుల్లో 35; 5 ఫోర్లు) తోడుగా నిలవడంతోనే సాధ్యమైంది. వీరు ముగ్గురు తప్ప జట్టులో మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసేసరికి పార్థివ్ పటేల్ (16) వికెట్ కోల్పోయి 49 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (13 బ్యాటింగ్), వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికి టీమిండియా 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్ బహు కష్టంగా ఉన్న నేపథ్యంలో నిఖార్సైన పేస్‌ను ఎదుర్కొంటూ నాలుగో ఇన్నింగ్స్‌లో ప్రొటీస్‌కు ఛేదన దుర్లభమే. కాబట్టి... మూడో రోజు భారత్ ఎన్ని ఎక్కువ పరుగులు జోడిస్తే విజయానికి అంత చేరువవుతుంది. ఆపద్బాంధవుడు నిలిచాడు... 6/1తో గురువారం ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. భువీ, ఇషాంత్ పకడ్బందీ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఏడో ఓవర్లోనే ఎల్గర్ (4)ను భువీ అవుట్ స్వింగర్‌తో వెనుక్కు పంపాడు. దీంతో నైట్‌వాచ్‌మన్ రబడకు ఆమ్లా జత కలిశాడు. వీరిద్దరూ భారత బౌలర్లను పరీక్షించారు. మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ముఖ్యంగా రబడ ఏ ఇబ్బంది లేకుండా ఆడాడు. అయితే... లంచ్‌కు కొద్దిగా ముందు ఇషాంత్ బౌలింగ్‌లో గల్లీలో రహానే చురుకైన క్యాచ్ పట్టడంతో రబడ పెవిలియన్ చేరాడు. దీంతో డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడు. అంతముందుకు ఇషాంత్ బౌలింగ్‌లోనే ఆమ్లా ఎల్బీ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించాడు. భారత్ డీఆర్ఎస్ కోరినా... అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడటంతో వికెట్ దక్కలేదు. లంచ్ తర్వాత బూమ్ బూమ్ బుమ్రా... 81/3తో లంచ్‌కు వెళ్లి వచ్చిన దక్షిణాఫ్రికాకు తర్వాత చుక్కలు కనిపించాయి. భువీ, బుమ్రా అద్భుతమైన ఇన్స్వింగర్లతో డివిలియర్స్ (5), కెప్టెన్ డుప్లెసిస్ (8)లను బౌల్డ్ చేశారు. ఈ బంతులకు మేటి బ్యాట్స్‌మెన్ అయిన వీరిద్దరి వద్ద సమాధానమే లేకపోయింది. ప్రమాదకారి అయిన డికాక్ (8)నూ మరో మంచి బంతితో బుమ్రానే బలిగొన్నాడు. అప్పటికి జట్టు స్కోరు 125/6. దీంతో భారత్‌కు ఆధిక్యం దక్కేలా కనిపించింది. కానీ... ఫిలాండర్ తోడుగా ఆమ్లా అడ్డుగోడలా నిలిచాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరు మరో వికెట్ పడకుండా టీ విరామానికి వెళ్లారు. అనంతరం ఫిలాండర్ దూకుడుగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచాడు. ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించాక ఆమ్లా... బుమ్రా బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి క్యాచ్ అవుటయ్యాడు. కొద్దిసేపటికే ఫిలాండర్ షమీకి చిక్కాడు. ఫెలుక్వాయో (9), మోర్కెల్ (9 నాటౌట్) రెండేసి బౌండరీలతో సఫారీలకు ఆధిక్యం దక్కించారు. ఇన్నింగ్స్ 66వ ఓవర్లో రెండు బంతుల వ్యవధిలో ఫెలుక్వాయో, ఇన్‌గిడి (0)లను వెనక్కు పంపిన బుమ్రా ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికి... కెరీర్లో తొలిసారి అయిదు వికెట్ల ఘనత సాధించాడు. లంచ్ తర్వాత పడ్డ ఏడు వికెట్లలో బుమ్రాకే ఐదు దక్కాయి. పార్థివ్ ఓపెనింగ్... అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్... అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. కీపర్ పార్థివ్‌ను ఓపెనింగ్‌కు పంపింది. అయితే మూడు ఫోర్లు కొట్టినా తడబడుతూనే ఆడిన అతడు... మార్క్రమ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు అవుటయ్యాడు. ఈ వికెట్ ఫిలాండర్‌కు దక్కింది. తర్వాత వన్‌డౌన్‌లో పుజారా కాకుండా రాహుల్ వచ్చాడు. కొన్ని ఉత్కంఠ పరిస్థితులు ఎదుర్కొన్నా... విజయ్, రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మ్యాచ్‌కు కీలకం కానుంది. సఫారీ పేసర్లను కాచుకుంటూ కెప్టెన్ కోహ్లి, పుజారా, రహానేలతో పాటు పాండ్యా ఓ చేయి వేసి జట్టు మెరుగైన స్కోరుకు దోహదపడితే ఈ టెస్టులో భారత్ విజయాన్ని ఆశించవచ్చు. రెండో రోజు 76.5 ఓవర్లే... రెండు జట్లలో ఒక్క స్పిన్నరూ లేని పరిస్థితుల్లో వాండరర్స్ పిచ్‌పై తొలి రోజు 83 ఓవర్లు పడ్డాయి. రెండో రోజు 76.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. విశేషమేమంటే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లకు ఆలౌట్ కాగా... సొంతగడ్డపై దక్షిణాఫ్రికా 65.5 ఓవర్లే ఆడగలిగింది. ఇందులో తొలి రోజు ఎదుర్కొన్న 6 ఓవర్లు మినహాయిస్తే గురువారం ఆ జట్టు ఆడినవి 59.5 ఓవర్లే కావడం గమనార్హం. అంతేకాక ఇరు జట్లలోనూ సరిగ్గా ముగ్గురు బ్యాట్స్‌మెనే రెండంకెల స్కోరు చేయగలిగారు. వీరి తర్వాత ఎక్స్‌ట్రాలదే (భారత్‌కు 26), (దక్షిణాఫ్రికాకు 23) అత్యధిక స్కోరు కావడం ఆశ్చర్యకరం. -
వారెవ్వా..వాటే ఎ డెలివరీ బూమ్రా!
-
కేప్‌టౌన్‌లో బుమ్రాను ఆడించాలి: నెహ్రా
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో జరిగే తొలి టెస్టులో యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నారు. ‘టీమ్ మేనేజ్మెంట్ మదిలో ఏముందో నాకైతే తెలీదు... కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వికెట్ బుమ్రాకు సరిగ్గా నప్పుతుంది. రంజీల్లో గుజరాత్ తరఫున అద్భుతమైన యార్కర్లతో చెలరేగాడు. అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా సుదీర్ఘమైన స్పెల్స్ వేయగలడు. ఇవన్నీ సఫారీ గడ్డపై అతనికి కలిసొస్తాయి’ అని నెహ్రా విశ్లేషించారు. ఈ జనవరిలో కేప్‌టౌన్ వాతావరణం ఎండవేడిమితో ఉంటుందని, సీమర్లకు ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, ఇషాంత్‌ల తర్వాతే మూడో సీమర్ ఎవరనే చర్చ ఉంటుందని చెప్పారు. ఇషాంత్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అదేపనిగా అసహనానికి గురి చేస్తాడని, దీనివల్ల మరో ఎండ్‌లో బౌలర్‌కు దొరికిపోతారన్నారు. -
టెస్టుల్లోకి బుమ్రా
న్యూఢిల్లీ: అంచనాలకు తగ్గట్లుగానే పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వన్డే, టి20 ప్రదర్శనల నేపథ్యంలో 23 ఏళ్ల బుమ్రాకు దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌కు పిలుపొచ్చింది. జనవరి 5 నుంచి మొదలయ్యే సఫారీ పర్యటనతో పాటు లంకతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్‌కు సోమవారం ఢిల్లీలో సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్ కోహ్లితోపాటు ధావన్, భువనేశ్వర్‌లకు విశ్రాంతినిచ్చారు. ఊహించినట్లే... పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న బుమ్రాను టెస్టు జట్టుకు ఎంపిక చేయాలన్న వ్యాఖ్యలు ఇటీవల బాగా వినిపించాయి. దీనికితగ్గట్లే అయిదుగురు పేసర్ల బృందంలో అతడికి చోటు లభించింది. బుమ్రా 28 వన్డేల్లో 52 వికెట్లు, 30 టి20ల్లో 40 వికెట్లు తీశాడు. అదనపు కీపర్‌గా పార్థివ్ పటేల్‌కు స్థానం దక్కగా... ఏకైక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రస్తుత లంక సిరీస్‌కు జట్టులో ఉన్న చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయలేదు. కోహ్లి నేతృత్వంలోని 17 మంది సభ్యుల టెస్టు జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్, ఏడుగురు బౌలర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, ఒక ఆల్‌రౌండర్ ఉన్నారు. అజింక్య రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), ధావన్, మురళీ విజయ్, రాహుల్, పుజారా, రోహిత్ శర్మ, సాహా, పార్థివ్ పటేల్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, భువ నేశ్వర్, షమీ, ఇషాంత్, ఉమేశ్, జస్ప్రీత్ బుమ్రా. -
క్రికెటర్ బూమ్రా తాత దీనగాథ
అహ్మదాబాద్:జస్ప్రిత్ బూమ్రా.. టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో రెగ్యులర్ బౌలర్. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బూమ్రా.. ఆపై అంచెలంచెలుగా ఎదిగి జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరొకవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బూమ్రాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల ఐపీఎల్-10 టైటిల్ ను ముంబై ఇండియన్స్ సాధించడంలో బూమ్రాది క్రియాశీలక పాత్ర. ప్రస్తుతం అటు క్రికెట్ జీవితాన్ని మంచి లగ్జరీ లైఫ్‌ను బూమ్రా బాగానే ఆస్వాదిస్తున్నాడు కూడా. అయితే బూమ్రా తాత దీనగాథను చూస్తే మాత్రం మనం చలించాల్సిందే. అంతటి స్థాయిలో ఉన్న క్రికెటర్ తాత దీనగాథ ఎంటా అని అనుకుంటున్నారా. ఇది నిజం. ఉత్తరాఖండ్‌లో ఉద్దమ్ సింగ్ నగర్లో నివసిస్తున్న సంతోక్ సింగ్ బుమ్రానే మన క్రికెటర్ జస్ఫ్రిత్ బూమ్రాకు స్వయానా తాత. దాదాపు 10 ఏళ్ల నుంచి ఉత్తరాఖండ్ లోనే ఉంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనిది స్వతహాగా అహ్మదాబాద్ అయినప్పటికీ, బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాడు. తన చేసే వ్యాపారంలో నష్టం రావడంతో 2006లో ఉద్దమ్ నగర్ కు మారిపోయాడు సంతోక్ సింగ్. తనకున్న మూడు ఫ్యాక్టరీలను అమ్మేసి వలస వెళ్లిపోయాడు. ఇప్పుడు 84 ఏళ్ల వయసులో పడరాని కష్టాలు పడుతున్నాడు. ఒక రూమ్ లో ఒంటరిగా ఉంటూ బతుకు బండిని లాగుతున్నాడు. ముఖ్యంగా 2001లో బూమ్రా తండ్రి జస్విర్ సింగ్ మరణించిన తరువాత ఆ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. దాంతోనే వారి మధ్య సంబంధం తెగిపోయి చెప్పుకునే బంధం మాత్రమే మిగిలందట. ఆ కారణంగానే స్టార్ క్రికెటర్ అయిన బూమ్రా తాత సంతోక్ కు ఇంత కష్టం వచ్చిందని స్థానికులు అంటున్నారు. కాగా, బూమ్రా ఎదుగుదలను చూసి మురిసిపోతున్న సంతోక్.. మనవడు ఆడే మ్యాచ్ ల్ని క్రమం తప్పకుండా టీవీల్లో చూస్తూ ఉంటానని తెలిపాడు. తాను మరణించే లోపు మనవడ్ని ఒకసారి కలవాలని ఆశపడుతున్నాడు సంతోక్. -
పాక్‌లో బుమ్రా ఫ్లెక్సీలు..
ఇస్లామాబాద్: కొన్ని సందర్భాల్లో చిన్న తప్పిదాలకి కూడా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనల విషయంలో చిన్న చిన్న తప్పిదాలు భారీ ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. భారత్, పాక్ మ్యాచ్‌లో బుమ్రా చేసిన ఓ చిన్న తప్పిదాన్ని ఊటంకిస్తూ.. ట్రాఫిక్ నిబంధనలు సామాన్యులకు చేరడానికి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బూమ్రా వేసిన నోబాల్ ఏకంగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టే సువర్ణావకాశం ఆరంభంలోనే చేజారింది. పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ మూడు పరుగుల వద్ద ఉండగా బుమ్రా బౌలింగ్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను కీపర్ ధోనీ ఒడిసి పట్టినా అది నోబాల్ కావడంతో జమాన్‌కు లైఫ్ లభించింది. 3 పరుగుల వద్ద అవుట్ కావాల్సిన ఆటగాడు 114 పరుగులతో సెంచరీ చేశాడు. బుమ్రా వేసిన ఒక్క నోబాల్ టీమిండియా పాలిట శాపమైంది. చిన్న తప్పిదం ఎంతటి ప్రభావం చూపుతుందో అనే హెచ్చరికతో .. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కూడా అంతే ప్రమాదం జరుగుతుందన్న అర్థంలో పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుమ్రా నోబాల్ వేసిన చిత్రాన్ని ఆ పట్టణ కూడళ్లలో ఏర్పాటు చేశారు. మరోవైపు జైపూర్ పోలీసులు కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఎంత ప్రమాదంతో కూడుకున్నదో తెలియజేస్తూ.. బుమ్రా నోబాల్ చిత్రంతో పాటు జీబ్రాలైన్ వద్ద కార్లు ఆగి ఉన్న ఫోటోను కలిపి ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జీబ్రాలైన్ వద్ద ఆగితే క్షేమమని.. చిన్న తప్పిదాలు కూడా భారీ ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందన్న హెచ్చరికతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, జైపూర్ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బుమ్రా స్పందిచాడు. వెల్ డన్ జైపూర్ పోలీస్.. దేశం కోసం పోరాడే వారికి మీరిచ్చే గౌరవమిదేనా అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు. తప్పులు చేయడం మావన సహజం. పనిలో మీరు కూడా చేసే పొరపాట్లను నేనేం అపహాస్యం చేయను. ఆందోళన చెందకండి అంటూ జైపుర్ ట్రాఫిక్ పోలీసు శాఖకు బుమ్రా ట్వీట్ చేశాడు. @traffic_jpr well done Jaipur traffic police this shows how much respect you get after giving your best for the country. pic.twitter.com/y0PU6v9uEc — Jasprit bumrah (@Jaspritbumrah93) 23 June 2017 -
భారీగా దెబ్బతీసింది ఆ ఇద్దరి బౌలింగే!
లండన్: భారత బౌలర్లపై ఎంతో నమ్మకంతో కెప్టెన్ విరాట్ కోహ్లి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. బౌలర్లు మాత్రం చేతులెత్తేశారు. ఒక్క భువనేశ్వర్ తప్ప ఎవరూ అంచనాల తగ్గట్టు రాణించలేదు. మొదటినుంచి దూకుడుగా ఆడిన పాకిస్థాన్ జట్టు టీమిండియా శిబిరాన్ని ఆరంభంలోనే ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఫకర్ జమాన్ సెంచరీకితోడు.. చివర్లో దూకుడుగా హఫీజ్ అర్ధసెంచరీ చేయడంతో పాకిస్థాన్ 339 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. స్పిన్ బౌలింగ్‌లో 137 పరుగులు.. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ దూకుడును కట్టడి చేయడంలోనూ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడంలోనూ భారత స్పిన్ బౌలర్లు విఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో పరుగులు అడ్డుకుంటారనుకున్న స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడ్డేజా.. ఇద్దరూ చేతులెత్తేశారు. అశ్విన్, జడ్డేజా కలిసి వేసిన 18 ఓవర్లో పాక్ బ్యాట్స్‌మెన్ 137 పరుగులు పిండుకోవడం.. పాక్‌ను పరిమిత లక్ష్యానికి నిలువరించాలన్న టీమిండియా ఆలోచనను భారీగా దెబ్బతీసింది. డేత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా పేరొందిన బుమ్రా సైతం ఒత్తిడిని తట్టుకొని నిలబడలేకపోయాడు. తొమ్మిది ఓవర్లు వేసిన అతను ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో మూడు నోబాల్స్, ఐదు వైడ్లు ఉన్నాయి. 10 ఓవర్లలో భువీ ఓ వికెట్ తీసుకొని.. 44 పరుగులు ఇచ్చి.. పాక్ ఎదురుదాడిలోనూ తట్టుకొని నిలబడ్డాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. భువీకి కాస్తో-కూస్తో తోడుగా నిలిచింది హార్దిక్ పాండ్యా మాత్రమే. పాండ్యా 10 ఓవర్లలో ఓ వికెట్ తీసుకొని 53 పరుగులు ఇచ్చాడు. -
స్పిన్నర్లు తేలిపోయారు..!
కీలకమైన ఫైనల్ పోరులో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ జోరు కొనసాగిస్తున్నారు. ఓవల్‌లోని ఫ్లాట్ పిచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు తీసుకొని కెప్టెన్ కోహ్లి బరిలోకి దిగడం అస్సలు ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, కోహ్లికి ఇంతకుమించి పెద్ద ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతను స్పిన్నర్ల మీద ఎక్కువ ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉమేశ్ యాదవ్ అందుబాటులో ఉండి ఉంటే పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉండేదని నిపుణుల అభిప్రాయం. కోహ్లి ప్రయోగించిన స్పిన్నర్లు తేలిపోయారు. బుమ్రా కూడా భారీగా పరుగులు సమర్పించకున్నాడు. భువనేశ్వర్, హార్ధిక్ పాండ్యా మాత్రమే పర్వాలేదనిపించారు. 40 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసిన పాక్ ఓ దశలో 350 పరుగులను చేరుకుంటుందా? అనిపించింది. అయితే, కానీ చివరకు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. పటిష్టంగా ఉన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ జోరు ప్రదర్శిస్తే.. ఈ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. -
అప్పుడు కూడా బూమ్రా నో బాల్ వల్లే..
లండన్:భారత బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల మూల్యం చెల్లించుకున్న సందర్భాల్లో అనేకం. ప్రధానంగా నో బాల్స్ వల్ల భారత్ అనేక కీలక మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో జరుగుతున్న తుది పోరులో సైతం భారత్ జట్టు నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల భారీ మూల్యం చెల్లించుకుంది. భారత ప్రధాన పేసర్ బూమ్రా వేసిన నాల్గో ఓవర్ తొలి బంతి పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ బ్యాట్ ను తాకి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. అయితే అది నో బాల్ కావడంతో జమాన్ బతికిపోయాడు. అప్పుడు ఫకార్ జమాన్ వ్యక్తిగత స్కోరు 3. కాగా, ఆపై రెచ్చిపోయిన జమాన్ ఏకంగా సెంచరీ సాధించి పాక్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఇదిలా ఉంచితే, 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గుర్తుంది కదా. వెస్టిండీస్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అప్పుడు బూమ్రా వేసిన నో బాల్ వల్లే విండీస్ సునాయాసంగా గెలిచి ఫైనల్ కు చేరింది. లెండిల్ సిమన్స్ ను ముందులోనే బూమ్రా అవుట్ చేసినప్పటికీ, అది నో బాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఆపై మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్ ను ఫైనల్ కు చేర్చాడు. ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ లో జమాన్ శతకంతో మెరవడం ఆ ఘటనను గుర్తుకు తెస్తుంది. ఈ రోజు మ్యాచ్ లో బూమ్రా వేసిన నో బాల్ తో లైఫ్ వచ్చిన ఫకార్ దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు. 92 బంతుల్లో శతకం చేసి పాకిస్తాన్ ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఒకవేళ మ్యాచ్ లో ఫలితం పాకిసాన్ కు అనుకూలంగా ఉంటే మాత్రం అందుకు బూమ్రా నో బాలే కారణం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. -
పాక్ ఫైనల్‌కు రావడంలో ఆశ్చర్యం లేదు
బర్మింగ్‌హోమ్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు పాకిస్థాన్ రావడం తనకు ఆశ్చర్యం కలగించలేదని భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేమని.. క్రికెట్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చోటు లేకపోవడంపై బుమ్రా స్పందించాడు. వంద శాతం ఫిట్‌గా ఉన్నానని కానీ విశ్రాంతి అవసరమని సెలెక్టర్లు భావించడంతో వెస్టీండిస్ పర్యటనకు ఎంపిక చేయలేదని ఈ స్పీడ్‌స్టార్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో ఈ నెల 23 నుంచి జరిగే 5 వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్‌లకు ఓపెనర్ రోహిత్ శర్మ, బుమ్రాకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని, కానీ సెలక్టర్లు, టీం మెనెజ్‌మెంట్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారని బుమ్రా పేర్కొన్నాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని స్పష్టం చేశాడు. ఎంపిక చేయకపోవడం పట్ల నిరాశచెందలేదని చెప్పుకొచ్చాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి ఏకంగా 41 డాట్ బంతులు వేశాడు. డాట్ బంతుల వల్ల బ్యాట్స్‌మెన్ కు ఒత్తిడి పెరిగి ఇతర బౌలర్లకు వికెట్లు దక్కుతాయని బుమ్రా అభిప్రాయపడ్డాడు. యార్కర్లు వేయడం కష్టమని దీనికోసం నెట్స్‌లో తీవ్రంగా కృషి చేశానని బుమ్రా పేర్కొన్నాడు. ఇక ఈ గుజరాతీ చాంపియన్స్ ట్రోఫీలో రివర్స్ స్వింగ్ బంతులతో డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించాడు. -
కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో భారత గెలుపుకు బౌలర్ల అద్వితీయ ప్రదర్శనే కారణమని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ నెం 1 జట్టు అయిన దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకు కట్టడి చేయడం బౌలర్ల ప్రతిభకు నిదర్శనమని కొనియాడాడు. పేస్ బౌలర్లలో తొలి 10 ఓవర్లలో ఎక్కువ డాట్ బాల్స్ రాబట్టారిని దీంతో సఫారీలు ఒత్తిడి గురయ్యారని భజ్జీ ఐసీసీకి రాసిన కాలమ్‌లో వివరించాడు. ఈ క్రెడిట్ యువ బౌలర్ బూమ్రాకేనని, ఫీల్డింగ్, బౌలింగ్‌తో అద్భుతంగా రాణించాడని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక మరో పేసర్ భువనేశ్వర్, స్పిన్నర్లు కూడా తమ వంతు రాణించారన్నాడు. భజ్జీ భారత బ్యాటింగ్‌కు 10/10 రేటింగ్ ఇచ్చాడు. దావన్, కోహ్లీల బ్యాటింగ్ అద్భతమన్నాడు. చేజింగ్‌లో కోహ్లి రాణిస్తాడనే విషయం మరోసారి నిరూపించాడని భజ్జీ పేర్కొన్నాడు. కోహ్లి, డివిలియర్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు చెందినవారని, కానీ వారి ఆటలోని దృక్పథం వేర్వేరని భజ్జీఅభిప్రాయపడ్డాడు. మైదానంలో కోహ్లీ సానుకూల దృక్పథంతో కనిపిస్తాడని, డివిలియర్స్‌లో అది కనిపించదని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇది భారత్ గెలుపుకు ఒక కారణమని తెలిపాడు. దక్షిణాఫ్రికా చిన్న చిన్న తప్పిదాలు చేసిందని అదే వారి కొంపముంచిందన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో మూడు రనౌట్లు కావడం చాల అరుదని అలాంటిది డివిలియర్స్, మిల్లర్ రనౌట్లు టీం ఇండియాకు బూస్ట్‌నిచ్చిందని భజ్జీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా ఓడిపోతుందని ఊహించలేదని.. కానీ నా అంచనాలు తప్పని రుజువయ్యాయని బజ్జీ తెలిపాడు.