ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సొంత మైదానమైన వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆర్సీబీని మట్టికరిపించింది.
తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు.
సరదాసరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు తారసపడ్డాయి. అభిమానులు హార్దిక్‌ను గేలి చేస్తుంటే విరాట్ అడ్డు చెప్పడం.. దిగ్గజ క్రికెటర్లు విరాట్, రోహిత్ మధ్య సరదా సంభాషణ.. రోహిత్ దినేశ్ కార్తీక్‌ను ఆట పట్టించడం (మరో వరల్డ్‌కప్ ఆడాలని ఉందా అని).. ఇలా మ్యాచ్ మొత్తం సరదాసరదాగా సాగింది. మ్యాచ్ పూర్తయ్యాక ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు విష్ చేసుకోవడం చూపరులను ఆకట్టుకుంది.
- Rohit and Bumrah handshake. 🤝
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024
- Virat Kohli hugging Hardik. 🫂
- Siraj bowed down to Bumrah. 🙇♂️
MI DEFEATED RCB IN MUMBAI. 💥 pic.twitter.com/UCAMxQRjaS
సిరాజ్ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగినందుకు గాను సిరాజ్ బుమ్రాకు సలాం కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఫ్యాన్స్ ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు. హార్దిక్‌ను కోహ్లి వెనకేసుకురావడాన్ని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (61), రజత్ పాటిదార్ (50), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు.
అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్, రోహిత్, స్కై, హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచి అవకాశలున్న మ్యాచ్‌ను ప్రత్యర్దికి పూలల్లో పెట్టి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment