IPL 2024: చిత్ర విచిత్రమైన షాట్లతో చెడుగుడు ఆడుకున్న దినేశ్‌ కార్తీక్‌ | IPL 2024 MI VS RCB: Dinesh Karthik Playing Unique Shots For Boundaries | Sakshi
Sakshi News home page

IPL 2024 MI VS RCB: చిత్ర విచిత్రమైన షాట్లతో చెడుగుడు ఆడుకున్న దినేశ్‌ కార్తీక్‌

Published Fri, Apr 12 2024 10:49 AM | Last Updated on Fri, Apr 12 2024 11:46 AM

IPL 2024 MI VS RCB: Dinesh Karthik Playing Unique Shots For Boundaries - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 11) జరిగిన మ్యాచ​్‌లో ఆర్సీబీ వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ చెలరేగిపోయాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా ఆకాశ్‌ మధ్వాల్‌ బౌలింగ్‌లో (ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌) డీకే ఆడిన షాట్లు మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి.

ఈ ఓవర్‌లో డీకే చిత్రవిచిత్రమైన షాట్లు ఆడి నాలుగు బౌండరీలు రాబట్టాడు. వినూత్న షాట్లతో డీకే ఆకాశ్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. డీకే ఈ ఓవర్‌లో కొట్టిన నాలుగు బౌండరీలు ఒకే దిశలో వెళ్లడం విశేషం. డీకే ఉద్దేశపూర్వకంగా ఈ షాట్లు ఆడి సక్సెస్‌ అయ్యాడు. డీకే పవర్‌ హిట్టింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.  ఈ వీడియో చూస్తే రీప్లే చూసినట్లుంటుంది. అన్ని షాట్లు ఒకేలా ఉన్నాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్‌ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్‌ పాటిదార్‌ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌ (53 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు.
 
అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను చేజార్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement