రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (PC: BCCI)
టీమిండియా బ్యాటర్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్బుతమైన ఆట తీరుతోనే కాదు.. తనదైన దూకుడు శైలి, హావభావాలతో అభిమానులను మెప్పించడం ఈ రన్‌మెషీన్‌కు అలవాటు.
ఇక ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. మ్యాచ్ ఆసాంతం తన ఎక్స్‌ప్రెషన్స్‌తో హైలైట్‌గా నిలిచిన ఈ ఆర్సీబీ ఓపెనర్.. ముంబై బ్యాటర్ రోహిత్ శర్మతో వ్యవహరించిన తీరు ఇరువురి అభిమానులను ఆకట్టుకుంది.
వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ చేయగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకి ఓపెనర్లు ఇషాన్ కిషన్(69), రోహిత్ శర్మ(38) శుభారంభం అందించారు.
అనంతరం సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 52) సుడిగాలి ఇన్నింగ్స్‌కు తోడు హార్దిక్ పాండ్యా(6 బంతుల్లో 21) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టడంతో ముంబై జయభేరి మోగించింది.
ఇదిలా ఉంటే.. రోహిత్ నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సమయంలో కోహ్లి చిలిపి చేష్టలతో అభిమానులకు నవ్వులు తెప్పించాడు. రోహిత్ వెనక నుంచి అతడిని తడుతూ ఏమీ ఎరుగనట్టు ముందుకు వెళ్లి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి ఓ లుక్ ఇచ్చాడు.
ఇక తొలుత విషయమేంటో అర్థం కాని రోహిత్.. కోహ్లి అలా నవ్వగానే థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ తానూ నవ్వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో విరాట్- రోహిత్ మధ్య విభేదాలంటూ వార్తలు వ్యాప్తి చేసేవారికి ఈ దృశ్యాలు చూపించండని ‘విరాహిత్’ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య సహోదర భావం ఉందని.. అనవసరంగా వారి పేరు చెప్పి గొడవలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆర్సీబీతో మ్యాచ్‌లో గెలుపుతో ముంబై రెండో విజయం సాధించగా.. ఆర్సీబీ ఖాతాలో ఐదో పరాజయం చేరింది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం మూడు పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.
Not a Rohirat ship fan but Video mast hei ye🤣#ViratKohli #RohitSharma pic.twitter.com/QinqmaoRAK
— Aayu sha #Ro45 (@45_ayusha) April 11, 2024
Comments
Please login to add a commentAdd a comment