RCB Vs MI: అది కదా కింగ్‌ కోహ్లి అంటే.. హార్దిక్‌ను హేళన చేయద్దంటూ! వీడియో వైరల్‌ | IPL 2024 RCB Vs MI: Virat Kohli Urges Crowd To Not Boo MI Captain Hardik Pandya, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs MI: అది కదా కింగ్‌ కోహ్లి అంటే.. హార్దిక్‌ను హేళన చేయద్దంటూ! వీడియో వైరల్‌

Published Fri, Apr 12 2024 6:20 AM | Last Updated on Fri, Apr 12 2024 9:49 AM

Virat Kohli Urges Crowd To Not Boo MI Captain Hardik Pandya - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తన మంచి మనసును చాటుకున్నాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు కోహ్లి సపోర్ట్‌గా నిలిచాడు. రోహిత్‌ శర్మ ఔట్‌ కాగానే హార్దిక్‌ క్రీజులోకి వచ్చినప్పడు అభిమానులు స్టాండ్స్‌ నుంచి గట్టిగా అరుస్తూ బూయింగ్‌(హేళన) చేశారు.

వెంటనే కోహ్లి ప్రేక్షుకుల వైపు చూస్తూ హేళన చేయవద్దని కోరాడు. దయచేసి ఆపండి అన్నట్లు కోహ్లి సైగలు చేశాడు. స్టాండ్స్‌ వైపు కింగ్‌ కోహ్లి చూస్తూ ఏంటి ఇది అన్నట్లు రియాక్షన్‌ ఇచ్చాడు. వెంటనే అభిమానులు హార్దిక్‌ హార్దిర్‌ అంటూ చీర్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి హార్దిక్‌కు అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదురువుతూనే ఉంది.

అంతకు తొడు తొలి మూడు మ్యాచ్‌ల్లో ముంబై ఓడిపోవడంతో ఆ వ్యతిరేకత మరింత తీవ్రమైంది. హార్దిక్‌ మైదానంలో కన్పించడం చాలు అతడిని అభి​మానులు టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. అయితే ముంబై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో ముంబై ఫ్యాన్స్‌ కాస్త శాంతించే ఛాన్స్‌ ఉంది. ఇకనైన హార్దిక్‌ను ముంబై ఫ్యాన్స్‌ ఇష్టపడతారా లేదా మళ్లీ ట్రోలు చేస్తారా? అన్నది వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement