siraj
-
పిచ్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం: గంభీర్
బెంగళూరు: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగి మంచి ఫలితాలు సాధించింది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ కూడా తమ బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని న్యూజిలాండ్‌పై కూడా టీమిండియా అమలు చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనకు కూడా పేసర్లకు ఇది సన్నాహకంగా పనికొస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. రేపటి నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జట్టు ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ‘పరిస్థితులు, పిచ్, ప్రత్యర్థిని బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. మా డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్ద సంఖ్యలో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండటం సానుకూలాంశం. వారిలోంచి ఎవరినైనా ఎంచుకోవచ్చు. అందరూ జట్టును గెలిపించగల సమర్థులే అని మా నమ్మకం. చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ను చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవల శ్రీలంక చేతిలో 0–2తో టెస్టు సిరీస్‌లో ఓడిన కివీస్... 37 వికెట్లను స్పిన్నర్లను సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో కుల్దీప్, అక్షర్‌లకు కూడా తొలి టెస్టులో చోటు ఇస్తారా అనేది ఆసక్తికరం. ‘వారిద్దరూ ప్రతిభావంతులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరినీ మేం పక్కన పెట్టడం లేదు. అయితే జట్టును గెలిపించగల 11 మందిని ఎంపిక చేయడమే అన్నింటికంటే ముఖ్యం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. -
శ్రీలంక తరపున అరంగేట్రం.. ఎవరీ మహ్మద్ సిరాజ్?
శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కల ఎట్టకేలకు నేరవేరింది. కొలంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీలంక తుది జట్టులో సిరాజ్‌కు చోటు దక్కడంతో తన సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.కాగా భారత్‌తో వన్డేలకు తొలుత ప్రకటించిన లంక ప్రధాన జట్టులో సిరాజ్‌కు ఛాన్స్ లభించలేదు. అయితే తొలి వన్డేకు ముందు గాయపడిన యువ పేసర్ మతీషా పతిరాన స్ధానంలో షిరాజ్ లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షిరాజ్ గరుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ మహ్మద్ సిరాజ్?29 ఏళ్ల షిరాజ్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కోల్ట్స్ క్రికెట్ క్లబ్(కొలంబో) తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం కాండీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం కురునెగల జట్టు తరపున షిరాజ్ ఆడుతున్నాడు. ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 7.52 సగటుతో 80 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సిరాజ్ 49 మ్యాచ్‌లలో 125 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ రేటు కూడా 3.65గా ఉంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండడంతో సెలక్టర్ల దృష్టిలో షిరాజ్ పడ్డాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వన్డే సిరీస్‌కు అతడికి లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు. షిరాజ్‌కు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. -
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్ మొదటిలో పర్వాలేదన్పించిన గిల్.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ తీవ్ర నిరాశపరిచాడు. స్లో వికెట్‌పై ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడానికి గిల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఆడిన గిల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్.. విజయ్‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ ఔట్ కాగానే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియన్ క్రికెట్ ప్రిన్స్‌కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 32.22 సగటుతో 322 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. స్టాండ్‌బై జాబితాలో గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. pic.twitter.com/tjQXP5LDRS— Rajgeeta Yadav (@rajgeetacricket) May 4, 2024 -
IPL 2024 RCB Vs MI: బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టిన సిరాజ్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సొంత మైదానమైన వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆర్సీబీని మట్టికరిపించింది. తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు. సరదాసరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు తారసపడ్డాయి. అభిమానులు హార్దిక్‌ను గేలి చేస్తుంటే విరాట్ అడ్డు చెప్పడం.. దిగ్గజ క్రికెటర్లు విరాట్, రోహిత్ మధ్య సరదా సంభాషణ.. రోహిత్ దినేశ్ కార్తీక్‌ను ఆట పట్టించడం (మరో వరల్డ్‌కప్ ఆడాలని ఉందా అని).. ఇలా మ్యాచ్ మొత్తం సరదాసరదాగా సాగింది. మ్యాచ్ పూర్తయ్యాక ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు విష్ చేసుకోవడం చూపరులను ఆకట్టుకుంది. - Rohit and Bumrah handshake. 🤝 - Virat Kohli hugging Hardik. 🫂 - Siraj bowed down to Bumrah. 🙇♂️ MI DEFEATED RCB IN MUMBAI. 💥 pic.twitter.com/UCAMxQRjaS — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 సిరాజ్ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగినందుకు గాను సిరాజ్ బుమ్రాకు సలాం కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఫ్యాన్స్ ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు. హార్దిక్‌ను కోహ్లి వెనకేసుకురావడాన్ని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (61), రజత్ పాటిదార్ (50), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్, రోహిత్, స్కై, హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచి అవకాశలున్న మ్యాచ్‌ను ప్రత్యర్దికి పూలల్లో పెట్టి ఇచ్చారు. -
బ్యాటర్ టూ బౌలర్.. తండ్రి మరణాన్ని సైతం తట్టుకుని! ఎంతో మందికి
మహ్మద్ సిరాజ్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అతడిని అభిమానులు ముద్దుగా సిరాజ్ 'మియా' అని పిలుచుకుంటారు. సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు స్ధాయి నుంచి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా ఎదిగిన సిరాజ్ ప్రయాణం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకం. గల్లీ క్రికెటర్ నుంచి టీమిండియా ముఖచిత్రంగా మారిన సిరాజ్ పుట్టిన రోజు నేడు. మార్చి 13న సిరాజ్ మియా తన 30వ పుట్టి నరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మన హైదరాబాదీ కోసం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.. హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఓ ఆటో డ్రైవర్ తన కుటుంబంతో కలిసి జీవించే వాడు. అతడికి ఇద్దరు కొడుకులు. అందులో చిన్నవాడు మహ్మద్ సిరాజ్. సిరాజ్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. కానీ అతడి కుటంబ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే. ఏదైమైనప్పటకి తను క్రికెటర్ కావాలని మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఆ చిన్నోడ. ఈ క్రమంలో సిరాజ్ చదువుపై దృష్టి పెట్టుకుండా క్లాస్‌లు డుమ్మా కొట్టి క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు వెళ్లిపోయేవాడు. అతడి సొదురుడు మంచిగా చదుకుని ఉన్నత స్దాయికి చేరుకునే ప్రయత్నంలో వుంటే.. సిరాజ్ మాత్రం క్రికెట్ అంటూ గ్రౌండ్లు వెంట తిరిగేవాడు. ఈ క్రమంలో సిరాజ్ భవిష్యత్తుపై అతడి తల్లిదండ్రులకు బెంగ నెలకొంది. అన్నయ్య ఇంజినీరింగ్ చదువుతుంటే నువ్వు ఆటలతో కాలక్షేపం చేస్తున్నావు అంటూ అతడి తల్లి సిరాజ్‌పై కోపమయ్యేది. ఈ విషయాన్ని సిరాజ్ చాలా సందర్బాల్లో తెలిపాడు. కానీ సిరాజ్ మాత్రం తన ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన తన గమ్యానికి చేరుకోవడంలో వెనుక అడుగువేయలేదు. రంజీల్లో అదరగొట్టి.. సిరాజ్తన ఆరంభంలో టెన్నిస్‌బాల్ క్రికెట్ ఆడేవాడు. అతడికి కోచ్ కూడా లేడు. తనకు తానే ఆటలో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్తోనే తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. పూర్తిస్థాయిలో మెళకువలు నేర్వకముందే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో సిరాజ్ బౌలింగ్ చేసేవాడు. లీగ్ స్థాయి క్రికెట్లో సత్తా చాటిన సిరాజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలో అతడిని అండర్-23 జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ కూడా సత్తాచాటడంతో దేశీవాళీ క్రికెట్లో సిరాజ్ అరంగేట్రం చేశాడు. 2015-16 సీజన్లో రంజీల్లో సిరాజ్ డెబ్యూ చేశాడు. తన అరంగేట్ర సీజన్లోనే హైదరాబాద్ జట్టు తరఫున 41 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టడంతో సిరాజ్‌కు ఐపీఎల్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. 2017 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 2.6 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సిరాజ్ మారాడు. అనంతరం 2017లో న్యూజిలాండ్‌తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అతడిది కీలక పాత్ర.. టీమిండియాకు సిరాజ్ ఎంపిక కావడంలో భారత మాజీ బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్‌ది కీలక పాత్ర. 2016లో హైదరాబాద్ రంజీ జట్టుకు అరుణ్ భరత్ కోచ్‌గా వ్యవహరించాడు. అప్పడే.. సిరాజ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు. కివీస్‌తో తొలి టీ20 తర్వాత ఆశిష్ నెహ్రా రిటైరవనున్న నేపథ్యంలో చివరి 2 మ్యాచ్‌లకు జయదేవ్ ఉనద్కత్ లేదా బాసిల్ థంపిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని అంతా భావించారు. కానీ అనుహ్యంగా సిరాజ్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఎవరూ ఊహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం వెనుక భరత్ పాత్ర ఉంది. బ్యాటర్ టూ బౌలర్ కాగా సిరాజ్ తొలుత బ్యాటర్ కావాలనకున్నాడు. చార్మినార్ క్రికెట్ తరపున బ్యాటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఏడో తరగతి నుంచి పదో క్లాస్‌కు వరకు బ్యాటర్‌గానే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఆ తర్వాత బౌలింగ్ పై శ్రద్ధ పెట్టి టాప్ క్లాస్ బౌలర్ గా ఎదిగాడు. తండ్రి మరణాన్ని తట్టుకుని.. కాగా 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ సిరీస్‌తో సిరాజ్ భారత తరపున టెస్టుల్లో అడుగుపెట్టాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన కొన్ని రోజులకే అతడి జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ కన్నముశారు. ఆ సమయంలో సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ క్షణంలో మరో ఆటగాడైతే జట్టును వీడి తండ్రిని కడసారి చూసేందుకు వచ్చేవాడు. కానీ సిరాజ్ మాత్రం తన తండ్రి మాటలను తలుచుకుని జాతీయ విధే ముఖ్యమని అక్కడే ఉండిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినప్పటికీ.. జట్టుతోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ సిరీస్‌లో ఫైనల్ టెస్టులో ఐదు వికెట్లతో సిరాజ్ చెలరేగాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 27 టెస్టులు, 41 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 👉: మహమ్మద్ సిరాజ్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) -
Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు...
యూట్యూబ్ ‘సిల్వర్ ప్లే బటన్’ను సొంతం చేసుకోవడం అనేది అంత వీజీ కాదు. లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ప్రతిష్ఠాత్మకమైన సిల్వర్ ప్లే బటన్ సొంతం అవుతుంది. అయితే పాకిస్థాన్‌లోని గిల్గిత్–బల్టిస్థాన్ ప్రాంతంలోని ఖప్లూ నగరానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే పిల్లాడు మాత్రం తన యూట్యూబ్ చానల్ ‘సిరాజీ విలేజ్ వ్లోగ్స్’తో ‘సిల్వర్ ప్లే బటన్’ను అవలీలగా సాధించాడు. సిరాజ్ చానల్‌కు లక్షమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. చెల్లి ముస్కాన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సిరాజ్ చేసిన వీడియోలు పాపులర్ అయ్యాయి. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్‌ను సిరాజ్ అన్బాక్సింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయింది. -
యశస్వికి ‘డబుల్’...శ్రేయస్, కిషన్ అవుట్
ప్రతిభకు, మైదానంలో ప్రదర్శనకు బీసీసీఐ పట్టం కట్టింది...టెస్టుల్లో వరుస డబుల్ సెంచరీలతో చెలరేగిన యశస్వి జైస్వాల్‌ను ‘డబుల్ ప్రమోషన్’తో గుర్తించిన బోర్డు నిలకడైన ఆటతో సత్తా చాటిన హైదరాబాదీ పేసర్ సిరాజ్‌ను ఒక మెట్టు పైకి ఎక్కించింది. అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ స్థాయిని నిలబెట్టుకోగా...క్రమశిక్షణ తప్పితే శిక్ష తప్పదంటూ శ్రేయస్, కిషన్‌లను పక్కన పెట్టింది. 30 మందితో కూడిన బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ జాబితాలో విశేషాలివి. న్యూఢిల్లీ: 2023–24కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా బీసీసీఐ కాంట్రాక్ట్‌ల జాబితాలో తమ ‘ఎ ప్లస్’ గ్రేడ్లను నిలబెట్టుకున్నారు. ఈ కేటగిరీలో గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి మార్పూ జరగలేదు. గ్రేడ్ ‘ఎ’లో ఇప్పటికే ఉన్న అశ్విన్, షమీ, హార్దిక్ పాండ్యాలతో పాటు కొత్తగా సిరాజ్, రాహుల్, గిల్ చేరారు. గత ఏడాది కాలంగా వన్డే వరల్డ్ కప్ సహా పలు సిరీస్‌లలో కీలక ప్రదర్శనలతో టీమ్ మేనేజ్మెంట్ అంచనాలను అందుకోవడమే ఈ ముగ్గురి ప్రమోషన్‌కు కారణం. టి20ల్లో అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతూ వన్డే జట్టులోనూ ఉన్న సూర్యకుమార్ యాదవ్ గ్రేడ్ ‘బి’లో తన స్థానం నిలబెట్టుకోగా ఇందులో యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కడం పెద్ద విశేషం. సాధారణంగా తొలి సారి కాంట్రాక్ట్ ఇస్తూ ఆటగాళ్లను ‘సి’లో చేర్చి ఆపై ప్రదర్శనతో ప్రమోషన్లు ఇచ్చే బోర్డు యశస్వి అసాధారణ ఆటకు నేరుగా ‘బి’లో అవకాశం కల్పించింది. ‘సి’ జాబితాలో ఉన్నవారిలో కొందరు అప్పుడప్పుడు వన్డేల్లో మెరిసినా...దాదాపు అందరూ టి20 స్పెషలిస్ట్‌లే కావడం విశేషం. క్రమశిక్షణారాహిత్యంతో... ‘వార్షిక కాంట్రాక్ట్‌లలో ఈ సారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు’ అని బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి పరిణామాలే అందుకు కారణం. వీరిద్దరు భారత్‌కు ఆడని సమయంలో రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగాలని బీసీసీఐ సూచించినా...దానిని పట్టించుకోలేదు. మానసిక ఆందోళన కారణంగా చూపి దక్షిణాఫ్రికా టూర్ మధ్యలోనే స్వదేశం వచ్చేసిన కిషన్ ఆ తర్వాత దుబాయ్‌లో పార్టీలో పాల్గొంటూ కనిపించాడు. తమ జట్టు జార్ఖండ్ ఒక వైపు రంజీ ఆడుతుంటే అతను నేరుగా ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ శిక్షణా శిబిరానికి హాజరయ్యాడు. మరో వైపు ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో చోటు కోల్పోయిన తర్వాత శ్రేయస్ వెన్ను గాయంతో ముంబై తరఫున రంజీ క్వార్టర్ ఫైనల్ ఆడలేనని చెప్పాడు. అతని గాయంలో నిజం లేదని ఎన్సీఏ డాక్టర్లు ధ్రువీకరించినట్లుగా బోర్డు అంతర్గత సమాచారం. ఈ విషయంలో కోచ్ ద్రవిడ్ నివేదిక ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వరల్డ్ కప్‌లో 530 పరుగులతో కీలక పాత్ర పోషించిన అయ్యర్ పట్ల తీవ్రంగా వ్యవహరించి...గాయం తర్వాత అక్టోబర్నుంచి ఇప్పటి వరకు అధికారిక టోర్నీ ఆడని హార్దిక్‌కు మాత్రం ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ కొనసాగించడం ఆసక్తికరం. జాతీయ జట్టుకు ఆడని సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ బీసీసీఐ ఇప్పుడు స్పష్టంగా పేర్కొనడం విశేషం. కొత్తగా పేసర్లకు... కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న రిషభ్ పంత్ గత ఏడాది కాలంలో ఎలాంటి క్రికెట్ ఆడకపోయినా...పూర్తిగా పక్కన పెట్టకుండా ఒక గ్రేడ్ తగ్గించి అతడిని కొనసాగించగా...పేలవ ప్రదర్శనతో అక్షర్ స్థాయి కూడా తగ్గింది. భారత్‌లో ఫాస్ట్ బౌలర్లను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహించే క్రమంలో ఐదుగురు బౌలర్లకు కొత్తగా ‘ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్’లు ఇవ్వడం విశేషం. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కాలాన్ని కాంట్రాక్ట్ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం కనీసం 3 టెస్టులు లేదా 8 వన్డేలు, లేదా 10 టి20లు ఆడాలి. ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ తర్వాతి మ్యాచ్ ఆడితే వారు నేరుగా ‘సి’ గ్రేడ్‌లోకి వచ్చేస్తారు. జట్టులో స్థానం కోల్పోయిన పుజారా, ఉమేశ్, శిఖర్, చహల్, హుడా సహజంగానే జాబితానుంచి దూరమయ్యారు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితా (2023–24) గ్రేడ్ ‘ఎ’ ప్లస్ (రూ.7 కోట్లు): రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘ఎ’ (రూ. 5 కోట్లు): అశ్విన్, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా గ్రేడ్ ‘బి’ (రూ. 3 కోట్లు): సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ గ్రేడ్ ‘సి’(రూ.1 కోటి): రింకూసింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దుల్ ఠాకూర్, శివమ్ దూ బే, రవి బిష్ణోయ్, జితేశ్ శర్మ, సుందర్, ముకేశ్ కుమార్, సంజు సామ్సన్, అర్ష్ దీప్, కేఎస్ భరత్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పటిదార్ (వీరందరికీ మొదటిసారి కాంట్రాక్ట్ దక్కింది). కాంట్రాక్ట్‌లు కోల్పోయినవారు: అయ్యర్, ఇషాన్ కిషన్, పుజారా, ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్. సిరాజ్, రాహుల్, గిల్ (‘బి’ నుంచి ‘ఎ’కి) కుల్దీప్ ‘సి’ నుంచి ‘బి’కి పంత్, అక్షర్ (‘ఎ’ నుంచి ‘బి’ కి) యశస్వికి నేరుగా ‘బి’ గ్రేడ్ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లు: ఆకాశ్ దీప్ (బెంగాల్), ఉమ్రాన్ మలిక్ (జమ్మూ కశ్మీర్), యశ్ దయాళ్ (యూపీ), విద్వత్ కావేరప్ప, విజయ్‌కుమార్ వైశాక్ (కర్నాటక). -
సందేశ్‌ఖాలీలో పెల్లుబికిన నిరసనలు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, సోదరుడు సిరాజ్, వారి అనుచరులు తమపై లైంగిక దాడులకు పాల్పడి భూములను లాక్కున్నారంటూ పశి్చమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో కొద్దిరోజులుగా మహిళలు చేస్తున్న నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. సందేశ్‌ఖాలీలోని ఝుప్‌ఖాలీ ప్రాంతంలోకి పోలీసులు రాకుండా ఆందోళనకారులు రోడ్లుపై దుంగలతో నిప్పుపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల ఆస్తులను తగలబెట్టారు. ఇన్నిరోజులైనా షాజహాన్, అతని అనుచరులను అరెస్ట్‌చేయకపోవడంపై పోలీసుల నిర్లిప్త వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. బెల్మాజూర్ దగ్గరి ఫిషింగ్‌యార్డ్ నిర్మాణాలను తగలబెట్టారు. పోగొట్టుకున్న భూములు, గౌరవాన్ని తిరిగి పొందేందుకు, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టామని స్థానికులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్‌చేసి తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచగా మహిళలు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ‘షాజహాన్‌ను అరెస్ట్‌చేసే దమ్ములేని మీరు మా వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మా మనుషుల అండలేకుండా మాకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ఒక మహిళ పోలీసులను నిలదీసింది. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. -
వార్నర్‌పై రెచ్చిపోయిన సిరాజ్.. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన సాల్ట్
-
సిరాజ్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ బుమ్రా స్థానంలో షమీ
-
గంటల్లోనే తారుమారు.. భారత్ దెబ్బకు కివీస్ విలవిల..
ఎజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శన సంబరాలు న్యూజిలాండ్ శిబిరంలో కొన్ని గంటలు కూడా సాగలేదు. ఈ చారిత్రక ఘట్టాన్ని ఆస్వాదించేలోపే జట్టు ఆనందం చెల్లాచెదురైంది. పదునైన భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక న్యూజిలాండ్ బ్యాటింగ్ కుప్పకూలింది. భారత గడ్డపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అవాంఛనీయ రికార్డును నెలకొల్పుతూ రెండో టెస్టులో రెండో రోజే కివీస్ చేతులెత్తేసింది. 263 పరుగుల ఆధిక్యం దక్కిన తర్వాత కూడా ఫాలోఆన్ ఆడించకుండా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆట ముగిసేసరికి తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకొని విజయంపై గురి పెట్టింది. ముంబై: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ గెలుపు ఇక లాంఛనమే కావచ్చు. శనివారం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 28.1 ఓవర్లలో 62 పరుగులకే కుప్పకూలింది. జేమీసన్ (17)దే అత్యధిక స్కోరు. దాంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేయడంతో ఓవరాల్ ఆధిక్యం 332 పరుగులకు చేరింది. ఫీల్డింగ్‌లో గాయపడిన శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయకపోగా... మయాంక్ అగర్వాల్ (38 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా (29 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఉదయం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 109.5 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (311 బంతుల్లో 150; 17 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరికొన్ని పరుగులు జోడించగా, అక్షర్ పటేల్ (128 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టాడు. మరో 39.5 ఓవర్లు... ఓవర్‌నైట్ స్కోరు 221/4తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌కు రెండో ఓవర్లోనే దెబ్బ పడింది. ఎజాజ్ వరుస బంతుల్లో సాహా (27), అశ్విన్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో మయాంక్‌కు అక్షర్ అండగా నిలిచాడు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ ఏడో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే 150 పరుగుల మార్క్‌ను అందుకున్న తర్వాతి బంతికే మయాంక్ వెనుదిరిగాడు. అనంతరం 113 బంతుల్లో అక్షర్ టెస్టుల్లో తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. అక్షర్‌ను కూడా వెనక్కి పంపిన అనంతరం ఎజాజ్... తన తర్వాతి ఓవర్లో జయంత్ (12), సిరాజ్ (4)ల పని పట్టి చరిత్ర సృష్టించాడు. శనివారం ఆడిన 39.5 ఓవర్లలో మరో 104 పరుగులు జోడించిన టీమిండియా చివరి 6 వికెట్లు కోల్పోయింది. చెలరేగిన సిరాజ్... భారత్‌ను మరీ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్న ఆనందం న్యూజిలాండ్‌కు ఎంతోసేపు నిలవలేదు. మన బౌలర్ల పదునైన బంతులను ఒక్క బ్యాటర్ కూడా సరిగా ఎదుర్కోలేకపోవడంతో కివీస్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో మొదటి మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి పతనానికి శ్రీకారం చుట్టాడు. తన రెండో ఓవర్లోనే యంగ్ (4), కెప్టెన్ లాథమ్ (10)లను సిరాజ్ వెనక్కి పంపించాడు. ఆపై మరో అద్భుత బంతితో రాస్ టేలర్ (1)ను అతను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. టీ సమయానికే కివీస్ స్కోరు 38/6కు చేరింది. విరామం తర్వాత జట్టు ఆట ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ సెషన్లో అశ్విన్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసి ప్రత్యర్థిని పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్: 325; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (సి) అయ్యర్ (బి) సిరాజ్ 10; యంగ్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 4; మిచెల్ (ఎల్బీ) (బి) అక్షర్ 8; రాస్ టేలర్ (బి) సిరాజ్ 1; నికోల్స్ (బి) అశ్విన్ 7; బ్లన్‌డెల్ (సి) పుజారా (బి) అశ్విన్ 8; రచిన్ రవీంద్ర (సి) కోహ్లి (బి) జయంత్ 4; జేమీసన్ (సి) అయ్యర్ (బి) అక్షర్ 17; సౌతీ (సి) (సబ్) సూర్యకుమార్ (బి) అశ్విన్ 0; సోమర్‌విలే (సి) సిరాజ్ (బి) అశ్విన్ 0; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (28.1 ఓవర్లలో ఆలౌట్) 62. వికెట్ల పతనం: 1–10, 2–15, 3–17, 4–27, 5–31, 6–38, 7–53, 8–53, 9–62, 10–62. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 5–2–7–0, సిరాజ్ 4–0–19–3, అక్షర్ పటేల్ 9.1–3–14–2, అశ్విన్ 8–2–8–4, జయంత్ యాదవ్ 2–0–13–1. భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (బ్యాటింగ్) 38; పుజారా (బ్యాటింగ్) 29; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (21 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 69. బౌలింగ్: సౌతీ 5–0–14–0, ఎజాజ్ 9–1–35–0, జేమీసన్ 4–2–5–0, సోమర్‌విలే 2–0–9–0, రచిన్ 1–0–4–0. -
సిరాజ్.. తలకు తగిలేలా బౌన్సర్లు వెయ్, వీడియో వైరల్
లండన్: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం ముగిసిన ఈ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం జరిగింది. ఆట చివరి రోజు జస్ప్రీత్ బుమ్రాపై బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులు సంధించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. మాటలతోనూ అతనిపై దాడికి దిగారు. అయినా బుమ్రా- షమీ జోడీ పట్టుదలతో బ్యాటింగ్ చేసి 9వ వికెట్‌కి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చదవండి:Suryakumar Yadav: 65 రోజుల తర్వాత భార్యని కలిసిన సూర్య.. ఏం చేశాడంటే? అనంతరం 272 పరుగుల ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్‌ని విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌తో ఆడుకున్నాడు. మరీ ముఖ్యంగా.. బుమ్రాపై మాటల యుద్ధానికి దిగిన ఆటగాళ్లని టార్గెట్‌గా చేసుకున్న కోహ్లీ.. మైదానంలో కవ్వింపులతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్కోరు 120 పరుగుల వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చివరి వికెట్‌గా జేమ్స్ అండర్సన్ క్రీజులోకి వచ్చిన సమయంలో కూడా విరాట్ కోహ్లీ, హెల్మెన్‌ను టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేయాలని సూచించడం... దానికి సిరాజ్ కూడా తలకు వేస్తానంటూ సైగలు చేయడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియో లో వైరల్ అవుతోంది. Siraj and Kohli 🤪 pic.twitter.com/BmRUcw95aV — Simran (@CowCorner9) August 20, 2021 -
Ind Vs Eng: రెండో రోజు బౌలర్లదే...
లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆటను భారత్, ఇంగ్లండ్ బౌలర్లు పది వికెట్లతో శాసించారు. పటిష్ట స్థితిలో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్, ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి మరో వంద పరుగులు కూడా జోడించలేకపోయింది. టీమిండియా పేసర్లకు తలవంచిన ఇంగ్లండ్ 108 పరుగుల వద్దే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ తరఫున అండర్సన్, భారత ఆటగాళ్లలో సిరాజ్ శుక్రవారం హీరోలుగా నిలిచారు. ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా... రూట్ నేతృత్వంలో ఇంగ్లండ్ మూడో రోజు ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శించి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం కోసం ప్రయత్నిస్తుందో చూడాలి. లండన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. జో రూట్ (75 బంతుల్లో 48 బ్యాటింగ్; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్ 2 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులవద్ద ఆలౌటైంది. తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 2 పరుగులే జోడించిన కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, 1 సిక్స్) టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 86 పరుగుల వ్యవధిలో భారత్ తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగడం విశేషం. 36.1 ఓవర్లలో 88 పరుగులు... తొలి రోజు ప్రదర్శించిన ఆట, చేతిలో ఉన్న వికెట్లను చూస్తే భారత్ స్కోరు కనీసం 500 పరుగుల వరకు చేరగలదనిపించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియాను కట్టడి చేశారు. శుక్రవారం తొలి ఓవర్ రెండో బంతికే రాహుల్‌ను రాబిన్సన్ అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ అజింక్య రహానే (1) తర్వాతి ఓవర్ తొలి బంతికే వెనుదిరిగాడు. ఈ స్థితిలో రవీంద్ర జడేజా (120 బంతుల్లో 40; 3 ఫోర్లు), రిషభ్ పంత్ (58 బంతుల్లో 37; 5 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించగా... తనదైన శైలిలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన పంత్, పేలవ షాట్ ఆడి నిష్క్రమించాడు. ఆ తర్వాత ముగ్గురు బౌలర్లు షమీ (0), ఇషాంత్ (8), బుమ్రా (0) వికెట్లను తీసేందుకు ఇంగ్లండ్‌కు ఎంతోసేపు పట్టలేదు. సిరాజ్ జోరు... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను రోరీ బర్న్స్ (136 బంతుల్లో 49; 7 ఫోర్లు), డామ్ సిబ్లీ జాగ్రత్తగా ప్రారంభించారు. టీ సమయానికి 14 ఓవర్లలో 23 పరుగులు జత చేశారు. అయితే విరామం తర్వాత హైదరాబాదీ పేసర్ సిరాజ్ చెలరేగిపోవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. వరుస బంతుల్లో సిబ్లీ, హసీబ్ హమీద్ (0)లను సిరాజ్ పెవిలియన్ పంపించాడు. 2016 నవంబర్‌లో తన చివరి టెస్టు ఆడిన హమీద్... 1717 రోజుల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ జట్టులో స్థానం సంపాదించి తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో బర్న్స్, రూట్లపై జట్టును ఆదుకునే భారం పడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించి అంతా సాఫీగా సాగుతున్న సమయంలో షమీ.. బర్న్స్‌ను అవుట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. మరో వికెట్ పడకుండా రూట్, బెయిర్‌స్టో రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1; పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40; షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0; ఇషాంత్ (ఎల్బీ) (బి) అండర్సన్ 8; బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (126.1 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267, 4–278, 5–282, 6–331, 7–336, 8–362, 9–364, 10–364. బౌలింగ్: అండర్సన్ 29–7–62–5, రాబిన్సన్ 33–10–73–2, స్యామ్ కరన్ 22–2–72–0, మార్క్ వుడ్ 24.1–2–91–2, మొయిన్ అలీ 18–1–53–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హమీద్ (బి) సిరాజ్ 0; రూట్ (బ్యాటింగ్) 48; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108. బౌలింగ్: ఇషాంత్ శర్మ 11–2–32–0, బుమ్రా 9–3–23–0, షమీ 8–2–22–1, సిరాజ్ 13–4–34–2, జడేజా 4–1–6–0. -
ఆసీస్ ‘ఎ’కు ఆధిక్యం
సిడ్నీ: టెస్టు సిరీస్ సన్నాహాల కోసం జరుగుతోన్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ‘ఎ’ జట్టు పేసర్లు ఉమేశ్ యాదవ్ (3/44), సిరాజ్ (2/71) టచ్‌లోకి వచ్చినప్పటికీ ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఆధిక్యం లభించింది. ముందుగా సోమవారం 237/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ మరో 10 పరుగులే చేసి 247/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ‘ఎ’ రెండో రోజు ఆట నిలిచే సమయానికి 85 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గ్రీన్ (114 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. టిమ్ పైన్ (44; 4 ఫోర్లు) కూడా రాణించాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఆసీస్ ‘ఎ’ జట్టు 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. మంగళవారం ఆటకు ఆఖరి రోజు. మిగిలిన 2 వికెట్లను పడగొట్టాక... భారత ఆటగాళ్లు రోజంతా బ్యాటింగ్ చేసే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమైంది. -
ఐపీఎల్లో సి‘రాజ్’
మొహమ్మద్ సిరాజ్... కోల్‌కతాతో మ్యాచ్‌కు ముందు ఐపీఎల్లో అతి చెత్త బౌలర్లలో ఒకడిగా గుర్తింపు... కనీసం 100కు పైగా ఓవర్లు వేసిన 92 మంది బౌలర్లలో అందరికంటే ఎక్కువగా 9.29 ఎకానమీతో అతను పరుగులిచ్చాడు... సోషల్ మీడియాలో అతనిపై లెక్కలేనన్ని ట్రోలింగ్లు... కానీ ఒక అద్భుత స్పెల్ అతడిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. తన తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అతను తీసిన 3 వికెట్లు బెంగళూరు విజయానికి పునాది వేశాయి. సిరాజ్‌తో పాటు ఇతర బెంగళూరు బౌలర్లు కూడా చెలరేగడంతో నైట్‌రైడర్స్ కుప్పకూలింది. చెత్త బ్యాటింగ్‌తో 84 పరుగులకే పరిమితమై ఓటమికి ఆహ్వానం పలికింది. ఆ తర్వాత సునాయాస విజయాన్ని అందుకున్న కోహ్లి సేన అదనంగా రన్‌రేట్‌ను కూడా మెరుగుపర్చుకొని రెండో స్థానానికి దూసుకుపోయింది. అబుదాబి: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆట మరింత పదునెక్కింది. గొప్ప బ్యాటింగ్ వనరులున్నా పేలవ బౌలింగ్‌తో పలు మ్యాచ్‌లు చేజార్చుకున్న ఆ జట్టు ఈసారి కేవలం బౌలింగ్ ప్రదర్శనతోనే భారీ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన పోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సిరాజ్ (3/8) చెలరేగగా, చహల్ (2/15) ఆకట్టుకున్నాడు. అనంతరం బెంగళూరు 13.3 ఓవర్లలో 2 వికెట్లకు 85 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మోర్గాన్ మినహా... కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బ్యాటింగ్ తీరు చూస్తే ఐపీఎల్లో అన్ని చెత్త రికార్డులు ఆ జట్టు తమ పేరిట లిఖించుకునేలా కనిపించింది. సిరాజ్ దెబ్బకు రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0), బాంటన్ (10) వెనుదిరగ్గా... సైనీ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ (1) చెత్త షాట్ ఆడి నిష్క్రమించాడు. దినేశ్ కార్తీక్ (4) కూడా చేతులెత్తేయడంతో ఆదుకునే భారం మోర్గాన్‌పై పడింది. నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న కేకేఆర్ కెప్టెన్ కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి సుందర్ బౌలింగ్‌లో మోర్గాన్ అవుట్ కావడంతో కనీస స్కోరు సాధించాలన్న కోల్‌కతా ఆశలు సన్నగిల్లాయి. చివర్లో ఫెర్గూసన్ (19 నాటౌట్), కుల్దీప్ (12) నిలబడటంతో జట్టు ఆలౌట్ కాకుండా ఉండిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్లో ఆలౌట్ కాకుండా అతి తక్కువ స్కోరు (గతంలో పంజాబ్ 92/8) చేసిన జట్టుగా నిలిచింది. మొత్తంగా కోల్‌కతా ఐపీఎల్లో తమ అత్యల్ప స్కోరు (67)ను దాటగలిగింది. చకచకా... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పడిక్కల్, ఫించ్ తొలి వికెట్‌కు 38 బంతుల్లో 46 పరుగులు జోడించారు. వీరిద్దరు ఒకే స్కోరు వద్ద అవుటైనా... గుర్కీరత్ (26 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు), కోహ్లి (17 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు. ఈ జంట 31 బంతుల్లో 39 పరుగులు జత చేయడంతో మరో 39 బంతులు మిగిలి ఉండగానే బెంగళూరు గెలిచింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ (సి) మోరిస్ (బి) సైనీ 1; త్రిపాఠి (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 1; రాణా (బి) సిరాజ్ 0; బాంటన్ (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 10; కార్తీక్ (ఎల్బీ) (బి) చహల్ 4; మోర్గాన్ (సి) గుర్కీరత్ (బి) సుందర్ 30; కమిన్స్ (సి) పడిక్కల్ (బి) చహల్ 4; కుల్దీప్ (రనౌట్) 12; ఫెర్గూసన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 84. వికెట్ల పతనం: 1–3; 2–3; 3–3; 4–14; 5–32; 6–40; 7–57; 8–84. బౌలింగ్: మోరిస్ 4–1–16–0; సిరాజ్ 4–2–8–3; సైనీ 3–0–23–1; ఉదాన 1–0–6–0; చహల్ 4–0–15–2; సుందర్ 4–1–14–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: పడిక్కల్ (రనౌట్) 25; ఫించ్ (సి) కార్తీక్ (బి) ఫెర్గూసన్ 16; గుర్కీరత్ (నాటౌట్) 21; కోహ్లి (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (13.3 ఓవర్లలో 2 వికెట్లకు) 85. వికెట్ల పతనం: 1–46; 2–46. బౌలింగ్: కమిన్స్ 3–0–18–0; ప్రసిధ్ కృష్ణ 2.3–0–20–0; వరుణ్ చక్రవర్తి 4–0–28–0; ఫెర్గూసన్ 4–0–17–1. కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చిన కోహ్లికి కృతజ్ఞతలు. మేం మైదానంలోకి వెళ్లినప్పుడు ముందుగా దాని గురించి అనుకోలేదు. కానీ సిద్ధంగా ఉండు అని విరాట్ చెప్పాడు. కొత్త బంతితో నేను చాలా సాధన చేస్తున్నాను. అది ఇక్కడ పని చేసింది. రాణాను అవుట్ చేసిన బంతి చాలా బాగా పడింది. –సిరాజ్ కొత్త బంతిని మోరిస్, సుందర్ పంచుకోవాలనేది మొదటి ఆలోచన. కానీ దానిని మార్చి సిరాజ్‌ను ముందుకు తెచ్చాం. ప్రతీది మా ప్రణాళిక ప్రకారమే చేశాం. గత ఏడాది సిరాజ్ అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. దాని ఫలితాలు ఇప్పుడు కనిపించాయి. –కోహ్లి సూపర్ స్పెల్... 0,0,0,0,0,0... 0,0,0,0,0,0... 1,0,0,0,1,0... 1,1,1,1,1,1... నాలుగు ఓవర్లలో సిరాజ్ బౌలింగ్ ప్రదర్శన ఇది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అతను చెలరేగాడు. సిరాజ్ బౌలింగ్ చూస్తుంటే ప్రతీ బంతికి వికెట్ తీస్తాడేమో అనిపించింది. తాను ఆడిన గత మ్యాచ్‌లో గేల్ చితక్కొట్టడంతో 3 ఓవర్లలోనే 0/44 గణాంకాలు నమోదు చేసిన అతడిపై కెప్టెన్ కోహ్లి మళ్లీ నమ్మకముంచాడు. దానిని నిలబెట్టుకుంటూ ఈ హైదరాబాదీ చెలరేగాడు. ఒక్క బౌండరీ కూడా కొట్టే చాన్స్ ఇవ్వకుండా అతను ఆధిక్యం ప్రదర్శించడం విశేషం. భారీగా పరుగులిస్తాడంటూ తనపై ఉన్న విమర్శలకు అతను ఈ మ్యాచ్‌తో తగిన సమాధానమిచ్చాడు. ఆర్సీబీ తరఫున మూడో ఏడాది ఆడుతున్న అతను ఎట్టకేలకు తన పదునేమిటో చూపించాడు. ఈ సీజన్లో సిరాజ్‌కు ఇప్పటి వరకు కొత్త బంతిని పంచుకునే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో కూడా రెండో ఓవర్ వేసేందుకు సుందర్ సన్నద్ధమవుతుండగా... అతడిని ఆపి సిరాజ్‌కు కోహ్లి బంతిని అప్పగించాడు. చక్కటి స్వింగ్‌తో త్రిపాఠిని దెబ్బ తీసిన అతను తర్వాతి బంతికే రాణాకు క్లీన్‌బౌల్డ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. మరుసటి ఓవర్లో బాంటన్ కూడా సిరాజ్ స్వింగ్‌కు తలవంచాడు. ఈ స్పెల్ తర్వాత విరామం తీసుకున్న అతను మళ్లీ 19వ ఓవర్లో తిరిగొచ్చి అన్నీ సింగిల్స్ ఇచ్చాడు. ఒక దశలో ఐపీఎల్లో అత్యంత పొదుపైన బౌలింగ్ ప్రదర్శన (ఫిడేల్ ఎడ్వర్డ్స్–4 ఓవర్లలో 6 పరుగులు) నమోదు చేసేలా కనిపించినా చివరి ఓవర్‌తో గణాంకాలు కాస్త మారాయి. అయితే లీగ్ చరిత్రలో తొలిసారి రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా అతను గుర్తింపు పొందాడు. ఈ బౌలింగ్ జోరు చూస్తే లీగ్‌లో అతను మరింతగా చెలరేగేందుకు కావాల్సిన జోష్‌ను ఇచ్చిందనడంలో సందేహం లేదు. ► ఐపీఎల్లో ఒక బౌలర్ 2 మెయిడిన్లు వేయడం ఇదే తొలిసారి (సిరాజ్) ► ఐపీఎల్లో ఒక టీమ్ 4 మెయిడిన్లు వేయడం ఇదే తొలిసారి (సిరాజ్ 2, మోరిస్ 1, సుందర్ 1). గతంలో ఏ జట్టూ 2 ఓవర్లకు మించి మెయిడిన్లు వేయలేదు. ► లీగ్‌లో పూర్తి ఓవర్లు ఆడి ఆలౌట్ కాకుండా ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు ఇదే (84/8) -
కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్
తిరువనంతపురం: మద్యాన్ని సేవించి, అతివేగంతో కారు నడిపిన ఓ ఐఏఎస్ అధికారి, జర్నలిస్టు మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన కేరళలో శనివారం జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడైన ఐఏఎస్ శ్రీరామ్ వెంకటరమణ్ (33)ను ఇటీవలే రాష్ట్రప్రభుత్వం సర్వే డైరెక్టర్‌గా నియమించింది. పోలీసుల కథనం ప్రకారం.. వెంకటరమణ్ తన మిత్రురాలు, మోడల్ వాఫా ఫిరోజ్‌కు చెందిన లగ్జరీ కారును వేగంగా నడిపిస్తూ మ్యూజియం రోడ్డు వద్ద మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. దీంతో దానిపై ప్రయాణిస్తున్న ‘సిరాజ్’ వార్తాపత్రిక యువ జర్నలిస్టు కే ముహమ్మద్ బషీర్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం ధాటికి వాహనాల విడి భాగాలు, ఇతర వస్తువులు ఘటనా స్థలానికి దూరంగా ఎగిరిపడ్డాయి. ఐఏఎస్‌పై కేసు నమోదు చేశామని ఐజీపీ, పోలీస్ కమిషనర్ ధినేంధ్ర కశ్యప్ అన్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మద్యంసేవించి ఐఏఎస్ డ్రైవింగ్.. జర్నలిస్ట్ మృతి
తిరువనంతపురం: మద్యం సేవించే కారు ప్రమాదం చేసిన ఐఏఎస్ అధికారి ఓ జర్నలిస్ట్ మృతికి కారణమయ్యాడు. మితిమీరిన వేగంతో కారును నడిపి ఓ జర్నలిస్ట్ ప్రాణాన్ని బలిగొన్నాడు. కేరళకు చెందిన శ్రీరామ్ వెంకటరామన్ అనే ఐఏఎస్ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్’ బ్యూరో ఛీఫ్ మహమ్మద్ బషీర్(35) మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో అఫ్జా అనే మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో బైక్‌పై ఉన్న బషీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటరామన్ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అయితే తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడున్న స్థానికలు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన కారు ఆ మహిళ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే బషీర్ మృతిపై సరైన విధంగా విచారణలో జరపాలని కేరళ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బషీర్ మృతిపట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. -
సిరాజ్‌కు పిలుపు
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి భారత జట్టు టెస్టు సిరీస్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. ఈనెల 12 నుంచి ఆస్ట్రేలియాతో... అనంతరం 23 నుంచి న్యూజిలాండ్‌తో మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌లలో బుమ్రా బరిలోకి దిగడం లేదని బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా స్థానంలో హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను తొలిసారి వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. ‘ఫిబ్రవరిలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో బుమ్రాకు తగిన విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. అతని స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేశాం. న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్‌కు పంజాబ్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్‌ను కూడా జట్టులోకి తీసుకున్నాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది క్రితమే టెస్టుల్లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల బుమ్రా 10 టెస్టులు ఆడి 49 వికెట్లు తీశాడు. మరోవైపు 24 ఏళ్ల సిరాజ్ 2017 నవంబర్‌లో రాజ్‌కోట్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాడు. మూడు టి20 మ్యాచ్‌లు ఆడిన అతను మూడు వికెట్లు తీశాడు. -
సెమీఫైనల్లో హైదరాబాద్
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్... 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర స్కోరు 36.3 ఓవర్లు ముగిసేసరికి 198/2... అప్పటికే హనుమ విహారి (99 బంతుల్లో 95; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రికీ భుయ్ (71 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించి జోరు మీదుండటంతో ఆంధ్ర గెలుపు దిశగా సాగుతోంది. ఈ స్థితిలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (3/50) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. తన వరుస ఓవర్లలో భుయ్, విహారిలను ఔట్ చేసి ఆంధ్ర ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు 14 పరుగుల తేడాతో గెలిచిన హైదరాబాద్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా, ఆంధ్ర నిష్క్రమించింది. ముందుగా హైదరాబాద్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బావనక సందీప్ (97 బంతుల్లో 96; 7 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, తన్మయ్ అగర్వాల్ (31; 2 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ అంబటి రాయుడు (28; ఫోర్, సిక్స్), సుమంత్ (27; 2 ఫోర్లు, సిక్స్), సీవీ మిలింద్ (7 బంతుల్లో 15; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో అయ్యప్ప, గిరినాథ్ రెడ్డి, పృథ్వీరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ హనుమ విహారి శతకం కోల్పోగా, అశ్విన్ హెబర్ (38) రాణించాడు. రేపు జరిగే తొలి సెమీఫైనల్లో ముంబైతో హైదరాబాద్, గురువారం జరిగే రెండో సెమీస్‌లో ఢిల్లీతో జార్ఖండ్ ఆడతాయి. -
సిరాజ్ త్వరగా నేర్చుకుంటాడు
సాక్షి, హైదరాబాద్: పేసర్ మొహమ్మద్ సిరాజ్‌పై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించారు. సొంతగడ్డపై శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరుగనున్న రెండో టెస్టులో అతడిని ఆడించే విషయమై స్పష్టత ఇవ్వకున్నా... ఈ హైదరాబాదీ బౌలర్ ఏ విషయాన్నైనా వెంటనే నేర్చుకునే రకమని కొనియాడారు. ‘గతంలో హైదరాబాద్ రంజీ కోచ్‌గా పనిచేసిన నా అనుభవంతో, భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇటీవలి సిరాజ్ ప్రదర్శన చూసి చెబుతున్నా. అతడు చాలాచాలా త్వరగా నేర్చుకునే క్రికెటర్’ అని భరత్ అరుణ్ అన్నారు. బుధవారం టీమిండియా ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆటతీరు, జట్టులో పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంపైనా స్పందించారు. రాహుల్ గొప్ప ప్రతిభావంతుడని భవిష్యత్‌లో మనకు అద్భుత బ్యాట్స్‌మన్ అవుతాడని పేర్కొన్నారు. సాంకేతిక లోపాలపై కోచ్‌లు రవిశాస్త్రి, సంజయ్ బంగర్లు రాహుల్‌తో మాట్లాడుతున్నట్లు తెలిపారు.‘రొటేషన్ విధానం, మిగతా బౌలర్లు రాణిస్తుండటంతోనే ఉమేశ్ యాదవ్‌ను తప్పించాల్సి వస్తోంది. అతడి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని వివరించారు. కూర్పులో ప్రయోగాల గురించి పెద్దగా ఆలోచించడం లేదని... అందరికీ అవకాశాలిస్తూ, మంచి బృందాన్ని మైదానంలో దింపడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జట్టులోని 16 మందిలో ఎవరైనా ఆడగలరని అన్నారు. గత మ్యాచ్‌లో పృథ్వీ షాకు అవకాశం ఇచ్చినట్లు ప్రతి టెస్టుకు కొత్త ఆటగాళ్లను దింపగల వనరులు మనకు ఉన్నాయని అన్నారు. -
ఈ నలు‘గురి’...
ఓపెనింగ్‌లో ఏర్పడిన అనూహ్య ఖాళీలు... ఆరో స్థానంలో నిఖార్సైన బ్యాట్స్‌మన్‌ను ఆడించే ఆలోచన... పేస్ వనరులను మరింత పదునెక్కించే ఉద్దేశం...! సమీకరణాలు ఏమైతేనేమి? వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఒక్కసారిగా నలుగురు యువ ఆటగాళ్లకు మహదవకాశంగా మారింది. టెస్టు జట్టులో తొలిసారి ఎంపికైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్, పేసర్ మొహమ్మద్ సిరాజ్‌లతో పాటు ఇప్పటికే జట్టుతో ఉన్న హనుమ విహారి, పృథ్వీ షాలలో కనీసం ఇద్దరు, లేదంటే ముగ్గురు ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున మైదానంలోకి దిగడం ఖాయం. జట్టుకు అత్యవసరమైన ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటే వీరి భవిష్యత్‌కు భరోసా లభించడమే కాకుండా జట్టులో స్థానాలు సుస్థిరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి క్రీడా విభాగం : ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా రెండు సిరీస్‌ల వ్యవధిలో టీమిండియా టెస్టు జట్టులోకి ఐదుగురు కొత్త ఆటగాళ్లు వచ్చి చేరారు. ఇందుకు రెగ్యులర్ ఆటగాళ్ల ఫామ్ లేమి వంటి పరిస్థితులు కొంత కారణం కాగా... తప్పక పరీక్షించి చూడాలనేంతగా యువతరం సత్తా చాటడం మరో కారణం. వీరిలో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఇప్పటికే తన ఎంపికకు కొంత న్యాయం చేశాడు. మిగిలింది మయాంక్, పృథ్వీ షా, హనుమ విహారి, సిరాజ్. తాజా పరిణామాల మధ్య వీరి ముందున్నది చక్కటి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకుంటే జట్టు అవసరాలు తీరి మరింత పటిష్టం అయ్యేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి ముందున్న సవాళ్లు ఎలాంటివి? వాటిని అందుకునే మార్గాలేమిటి? అనేది పరిశీలిస్తే... ఓపెనింగ్ సమస్య తీర్చేనా! సంప్రదాయ క్రికెట్లో గత పదేళ్లుగా భారత్ తరఫున ఓపెనర్లుగా అరంగేట్రం చేసింది నలుగురే (విజయ్, ధావన్, అభినవ్ ముకుంద్, కేఎల్ రాహుల్) ఆటగాళ్లు. సెహ్వాగ్–గంభీర్ స్థాయిలో వీరిలో ఏ జోడీ కూడా స్థిరంగా రాణించలేదు. మిడిలార్డర్లో లెక్కకు మిక్కిలి ప్రత్యామ్నాయాలున్నా, ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసే ఆటగాడి కోసం అన్వేషణ సాగుతూనే ఉంది. ఇప్పుడు ధావన్, విజయ్‌లపై వేటుతో ఒక స్థానం ఖాళీ అయింది. వయసురీత్యా చూసినా, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్నా అద్భుతం అనదగ్గ స్థాయిలో రాణిస్తే తప్ప వీరు మళ్లీ టెస్టులకు ఎంపికవడం కష్టమే. ఒక ఓపెనర్‌గా రాహుల్ స్థిరపడ్డాడని అనుకున్నా, మరో స్థానం మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా కోసం ఎదురుచూస్తోంది. వీరిలో ఒకరు విండీస్ సిరీస్‌లో అరంగేట్రం చేయడం పక్కా. అనుభవరీత్యా చూస్తే టీం మేనేజ్మెంట్ మయాంక్ వైపే మొగ్గు చూపొచ్చని అంచనా. అయితే, పృథ్వీని ఆడించినా ఆశ్చర్యం లేదు. ఎలాగూ ప్రత్యర్థి బలహీనమైనదే కాబట్టి చెరొక టెస్టు చాన్సిచ్చినా ఇవ్వొచ్చు. ఇప్పటికైతే అవకాశాలు సమంగా ఉన్నాయి. ఇక ప్రతిభ పరంగా ఇద్దరూ సమఉజ్జీలే. ఈ కాలపు టెస్టులకు తగిన స్ట్రయిక్ రేట్ (పృథ్వీ–76.69; మయాంక్ 60.93) ఉన్నవారే. సాధికారిక డిఫెన్స్‌తో పాటు దూకుడుగానూ ఆడగలరు. టెక్నిక్ పరంగానూ లోపాలు లేవు. బలహీనమైన విండీస్ బౌలింగ్‌లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటే... తదుపరి ఆస్ట్రేలియా పర్యటనకూ వీరినే పరిగణించే అవకాశం ఉంటుంది. మరోవైపు దేశవాళీల్లో కనుచూపు మేరలో మరే ఓపెనింగ్ ఆటగాడూ వీరి స్థాయిలో రాణించడం లేదు. దీన్నిబట్టి... తొలుత విఫలమైనా కుదురుకునే వరకు ఈ ఇద్దరికి అవకాశాలిస్తారని చెప్పొచ్చు. వీరు చేయాల్సిందల్లా... తమ సామర్థ్యానికి తగినట్లుగా ఆడటమే. అదే జరిగితే టీమిండియాను వేధిస్తున్న ‘ఓపెనింగ్’ ఇబ్బంది తీరినట్లే. విహారి ‘ఆరో’హణం... కోహ్లి సేన విదేశీ పరాజయాలకు ప్రధాన కారణం... ఆరో స్థానంలో సమర్థుడైన బ్యాట్స్‌మన్ లేకపోవడం. వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఈ స్థానాన్ని భర్తీ చేయదగ్గ ఆటగాడు దొరకలేదు. లోయరార్డర్‌తో సమన్వయం చేసుకుంటూ జట్టుకు అవసరమైన పరుగులు జోడించడం నంబర్ 6 బ్యాట్స్‌మన్ కర్తవ్యం. ఈ బాధ్యతను నిర్వర్తించేవారు లేకే ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఆ సిరీస్‌లో ఐదో టెస్టు ఆడిన హనుమ విహారి ఆరో నంబరుకు తగినవాడిగా ఆశలు రేపాడు. బ్యాటింగ్‌లో అర్ధ శతకంతో పాటు ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్‌తో మూడు వికెట్లు పడగొట్టాడు. జట్టుకు సరిగ్గా అవసరమైన ప్రదర్శన ఇది. ఓ విధంగా చెప్పాలంటే స్పిన్ వేయగలగడమే... కరుణ్ నాయర్‌ను కాదని విహారిని ఆడించేలా చేసింది. విండీస్ సిరీస్‌లోనూ సత్తా చాటితే మున్ముందు హార్దిక్ పాండ్యా బదులుగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా విహారినే టీం మేనేజ్మెంట్ నమ్ముకోవచ్చు. పేస్ ‘సిరాజసం’ చాటితే... పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రతిభ చాటుకున్నా సిరాజ్ టెస్టు స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ, ఏడాది వ్యవధిలోనే అతడు అద్భుతంగా రూపాంతరం చెందాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ‘ఎ’ జట్లపై గణాంకాలు చూస్తే అతడి పేస్ ఎంత పదునెక్కిందో తెలుస్తోంది. నిలకడైన వేగంతో పాటు స్వింగ్, బౌన్స్ సిరాజ్ బౌలింగ్ ప్రత్యేకతలు. ఇషాంత్, షమీ, భువనేశ్వర్, బుమ్రా, ఉమేశ్ యాదవ్ తర్వాత ఇప్పుడు దేశంలో టాప్ పేసర్ సిరాజే అనడంలో సందేహం లేదు. పేస్ పిచ్‌లు తయారు చేయనున్నారన్న ఊహాగానాల మధ్య... భీకర ఫామ్‌లో ఉన్నందున విండీస్ సిరీస్‌లో ఓ టెస్టులో అతడిని బరిలో దింపినా దింపొచ్చు. ఇది ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఎంపికయ్యేందుకు సిరాజ్‌కు సరైన మార్గం. తన శైలి బౌలింగ్‌కు ఆసీస్ పిచ్‌లు నప్పుతాయి కూడా. ఇన్ని అంచనాల మధ్య ఈ హైదరాబాదీ ఏం చేస్తాడో మరి? -
భారత్ ‘ఎ’దే టెస్టు సిరీస్
బెంగళూరు: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టును భారత్ ‘డ్రా’గా ముగించింది. తొలి టెస్టులో గెలిచిన భారత్ ‘ఎ’ 1–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆట చివరి రోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 294/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 25 పరుగులు జోడించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ (4/72) మరోసారి రాణించాడు. 26 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 181 పరుగులు సాధించింది. ఈ దశలో వర్షం రావడం... మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం కూడా లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. సంక్షిప్త స్కోర్లు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 345; దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 319 (హమ్జా 93, ఇర్వీ 58; సిరాజ్ 4/72, అంకిత్ రాజ్‌పుత్ 3/52, చహల్ 2/84); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 181/4 (51 ఓవర్లలో) (శ్రేయస్ అయ్యర్ 65, అంకిత్ బావ్నే 65 నాటౌట్; ఒలివియర్ 2/24, ముత్తుస్వామి 2/45). -
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ విజయం
బెంగళూరు: రోజంతా ఆడి ‘డ్రా’తో గట్టెక్కాలని భావించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. భారత ‘ఎ’ బౌలర్ల ధాటికి సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (5/56, 5/73) రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టడంతో... ఈ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ 30 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి రోజు ఆటలో భారత బౌలర్లు చాలా శ్రమించారు. మిగిలిన 6 వికెట్లు తీసేందుకు 88.5 ఓవర్ల పాటు కష్టపడ్డారు. మంగళవారం 99/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభిన దక్షిణాఫ్రికా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌లో 128.5 ఓవర్లలో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. రూడి సెకండ్ (94; 15 ఫోర్లు), షాన్ వోన్ బెర్గ్ (50; 6 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. పేసర్ రజనీశ్ గుర్బాని (2/45) ఎట్టకేలకు ఈ జోడిని విడగొట్టడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ 584/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఈనెల 10 నుంచి రెండో అనధికారిక టెస్టు కూడా ఇక్కడే జరగనుంది. -
హడలెత్తించిన సిరాజ్
బెంగళూరు: అన్ని రంగాల్లో ఆధిపత్యం చాటిన భారత్ ‘ఎ’ జట్టు దక్షిణాఫ్రికా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోరు చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఆధీనంలోకి తెచ్చుకుంది. 338 పరుగులు వెనుకబడి సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ను హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (4/18) హడలెత్తించాడు. అతడి ధాటికి దక్షిణాఫ్రికా 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆటకు మంగళవారం చివరి రోజు. ఓవర్‌నైట్ స్కోరు 411/2తో సోమవారం బరిలో దిగిన భారత్ ‘ఎ’... 584/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (220) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరిగాడు.ఆంధ్ర బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (54; 3 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ సిరాజ్ ప్రతాపంతో ఆరు పరుగులకే ఎర్వీ (3), మలాన్ (0), జొండొ (0)ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో హమ్జా (46 బ్యాటింగ్), ముత్తుస్వామి (41) నాలుగో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆట ముగిసే సమయంలో సిరాజ్... ముత్తుస్వామిని ఔట్ చేసి మరోసారి దెబ్బకొట్టాడు. -
భారత ‘ఎ’ జట్టులో విహారి, సిరాజ్, భరత్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగనున్న రెండు అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును జాతీయ సెలెక్టర్లు సోమవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి బెల్గామ్, 10 నుంచి బెంగళూరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్న ‘ఎ’ జట్టులో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాళ్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ కోహ్లి సూచన మేరకు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేశారు. ఆగస్టు 17 నుంచి విజయవాడ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’లతో జరిగే నాలుగు జట్ల వన్డే టోర్నీలో తలపడే భారత్ ‘ఎ’ జట్టుకు అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే సారథ్యం వహిస్తారు. ఇక దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్... ‘రెడ్’కు అభిమన్యు మిథున్... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘రెడ్’ జట్టులో ఆంధ్ర పేసర్ ఎర్రా పృథ్వీరాజ్‌కు స్థానం దక్కింది. అయితే, డోపింగ్‌లో పట్టుబడి సెప్టెంబరు 14 వరకు నిషేధంలో ఉన్న పంజాబ్ కీపర్ అభిషేక్ గుప్తాను కూడా ‘రెడ్’కు ఎంపిక చేయడం ఆశ్చర్యపరుస్తోంది.