
షిమోగా: హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (4/42) చెలరేగడంతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది. స్టువర్ట్ బిన్నీ (61) రాణించగా... ప్రధాన బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (4), కరుణ్ నాయర్ (23) ఆకట్టుకోలేకపోయారు.
రవికిరణ్ (3/36) కీలక వికెట్లతో కర్ణాటక పని పట్టాడు. అనంతరం హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 51 పరుగులు చేసింది. అంబటి రాయుడు (0), తన్మయ్ (1), అక్షత్ రెడ్డి (13) ఇప్పటికే అవుటవ్వగా... సుమంత్ (34 బ్యాటింగ్), సందీప్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment