ఐపీఎల్-2024లో టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్ మొదటిలో పర్వాలేదన్పించిన గిల్.. సెకెండ్ హాఫ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గిల్ తీవ్ర నిరాశపరిచాడు. స్లో వికెట్‌పై ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోవడానికి గిల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్‌లో 7 బంతులు ఆడిన గిల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గిల్.. విజయ్‌కుమార్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గిల్ ఔట్ కాగానే ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇండియన్ క్రికెట్ ప్రిన్స్‌కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 32.22 సగటుతో 322 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టులో శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. స్టాండ్‌బై జాబితాలో గిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
— Rajgeeta Yadav (@rajgeetacricket) May 4, 2024
Comments
Please login to add a commentAdd a comment