శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలనుకున్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కల ఎట్టకేలకు నేరవేరింది. కొలంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీలంక తుది జట్టులో సిరాజ్‌కు చోటు దక్కడంతో తన సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
కాగా భారత్‌తో వన్డేలకు తొలుత ప్రకటించిన లంక ప్రధాన జట్టులో సిరాజ్‌కు ఛాన్స్ లభించలేదు. అయితే తొలి వన్డేకు ముందు గాయపడిన యువ పేసర్ మతీషా పతిరాన స్ధానంలో షిరాజ్ లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో షిరాజ్ గరుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఎవరీ మహ్మద్ సిరాజ్?
29 ఏళ్ల షిరాజ్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. కోల్ట్స్ క్రికెట్ క్లబ్(కొలంబో) తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం కాండీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా లిస్ట్-ఎ క్రికెట్‌లో మాత్రం కురునెగల జట్టు తరపున షిరాజ్ ఆడుతున్నాడు.
ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 7.52 సగటుతో 80 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో సిరాజ్ 49 మ్యాచ్‌లలో 125 వికెట్లు సాధించాడు. అతడి ఎకానమీ రేటు కూడా 3.65గా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండడంతో సెలక్టర్ల దృష్టిలో షిరాజ్ పడ్డాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వన్డే సిరీస్‌కు అతడికి లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు. షిరాజ్‌కు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment