Ranji Trophy match
-
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఓపెనర్‌కు గాయం
రంజీట్రోఫీ 2024-25 సీజన్లో విదర్భతో సెమీఫైనల్‌కు ముందు ముంబై క్రికెట్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గాయం కారణంగా సెమీస్‌కు దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. జైశ్వాల్ ఎడమ కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ప్రాక్టీస్ సమయంలో తన కాలి చీలమండలో నొప్పి వచ్చినట్లు జైశ్వాల్ టీమ్ మెనెజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు సమచారం. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు తన గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి జైశ్వాల్‌ను బీసీసీఐ రిలీజ్ చేయడంతో.. అతడిని ముంబై క్రికెట్ అసోషియేషన్ విధర్బతో సెమీస్‌కు ఎంపిక చేసింది. అంతలోనే గాయం కారణంగా జైశూ జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్ బై జాబితాలో మాత్రం జైశ్వాల్ ఉన్నాడు. ఇప్పుడు అతడి స్ధానాన్ని మరోక క్రికెటర్‌తో బీసీసీఐ భర్తీ చేయనుంది. అయితే జైశ్వాల్ గాయపడడంతో ఈ ఐసీసీ ఈవెంట్లో భారత జట్టు బ్యాకప్ ఓపెనర్ లేకుండానే ఆడనుంది. ఒకవేళ రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ గాయపడితే బీసీసీఐ ఎవరిని జట్టులోకి తీసుకుంటుందో చూడాలి.కాగా జైశ్వాల్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇక ముంబై-విదర్భ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. యశస్వీ దూరం కావడంతో ముంబై ఇన్నింగ్స్‌ను ఆయుష్ మాత్రే, ఆకాష్ ఆనంద్ ఆరంభించనున్నారు.జైశ్వాల్‌కు ఫస్ట్ క్లాస్క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఈ ముంబైకర్ 5 సెంచరీలతో సహా 3712 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత జట్టులోకి యశస్వి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు భారత టెస్టు జట్టులో జైశ్వాల్ రెగ్యూలర్ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.చదవండి: WPL 2025: గెలుపు జోష్‌లో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్.. -
అశ్విన్ హెబ్బర్ సెంచరీ.. ఆంధ్ర 415 ఆలౌట్
సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ అశ్విన్ హెబ్బర్ (109; 12 ఫోర్లు, 1) సెంచరీ సాధించాడు. ఓవర్‌నైట్ స్కోరు 256/5తో బుధవారం ఆట ప్రారంభించిన ఆంధ్ర 415 పరుగుల వద్ద ఆలౌటైంది. లలిత్ మోహన్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ రెడ్డి (28; 3 ఫోర్లు) అండతో అశ్విన్ సెంచరీ చేశాడు. సౌరాష్ట్ర బౌలర్లలో యువరాజ్ సింగ్, ధర్మేంద్రసింగ్ జడేజాలు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర ఆట నిలిచే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. షెల్డన్ జాక్సన్ (63 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆంధ్ర బౌలర్ నితీశ్ కుమార్ (2/26)... హర్విక్ (8), చతేశ్వర్ పుజారా (5)లను వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్ శర్మ -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. బుమ్రా కీలక నిర్ణయం!
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులోకి తిరిగి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. కాగా బుమ్రా వెన్ను గాయం నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయి ఫిట్నెస్ అయితే సాధించలేదు. రాబోయో వారంలో బుమ్రా ఫిట్నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నట్లు తెలుస్తోంది. ఫిట్నెస్ టెస్టులో బుమ్రా ఉత్తీర్ణత సాధిస్తే.. అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టుకు ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఆసీస్‌తో మొదటి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో మాత్రం బుమ్రాకు చోటు దక్కలేదు. అయితే ఆఖరి రెండు టెస్టులకు ఈ స్పీడ్‌స్టార్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించేకునేందుకు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బాటలోనే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో బుమ్రా ఆడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా కూడా రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. బుమ్రా తన వెన్ను గాయం నుంచి బాగా కోలుకుంటున్నాడు. కానీ అతడు ఇంకా 100 శాతం ఫిట్నెస్ సాధించలేదు. అతడు మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి మరో 2 వారాల పునరావాసం అవసరం. అతడు ఫిట్నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు తిరిగి జట్టులోకి వస్తాడు. అయితే అతడు జట్టులో వచ్చేముందు దేశవాళీ క్రికెట్లో ఆడే అవకాశం ఉంది. అది సెలక్టర్లు, బమ్రా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా బుమ్రా గాయం కారణంగా ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. చదవండి: IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్ -
సెంచరీతో చెలరేగిన బాబా అపరాజిత్.. ఆధిక్యంలో తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: బౌలర్ల వైఫల్యం కారణంగా తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 203/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన తమిళనాడు 111.5 ఓవర్లలో 4 వికెట్లకు 510 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 115 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ (116; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదే స్కోరు వద్ద కార్తికేయ కక్ బౌలింగ్‌లో అవుటవ్వగా... మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (273 బంతుల్లో 179; 18 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ బాబా అపరాజిత్ (165 బంతుల్లో 115; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. అపరాజిత్ సోదరుడు ఇంద్రజిత్ (52 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు) కూడా రాణించాడు. అపరాజిత్ అవుటైన వెంటనే తమిళనాడు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. హైదరాబాద్ బౌలర్ తనయ్ త్యాగరాజన్‌కు రెండు వికెట్లు దక్కాయి. 115 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. అభిరత్ రెడ్డి (14; 3 ఫోర్లు) రిటైర్డ్ హర్ట్ కాగా... కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (5 బ్యాటింగ్), తనయ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరిరోజు హైదరాబాద్ బ్యాటర్లు పోరాడి ‘డ్రా’ చేసుకుంటారో చేతులెత్తేసి ఓటమిని ఆహ్వానిస్తారో వేచి చూడాలి. చదవండి: Mohammed Rizwan: వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ..! -
టెస్టు క్రికెట్‌పై సూర్య కుమార్ కన్ను.. అందుకోసం మాస్టర్ ప్లాన్!
పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు టెస్టు క్రికెట్‌పై కన్నేశాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ దేశీవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో అద్భుతంగా రాణించి భారత టెస్టు క్రికెట్లోకి సూర ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సూర్య ముంబై తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబరు 13న వైజాగ్ వేదికగా ఆంధ్రాతో జరిగే తొలి మ్యాచ్‌కు సూర్య దూరంగా ఉండనున్నాడు. కాగా డిసెంబర్ 20 నుంచి హైదరాబాద్‌తో జరిగే ముంబై రెండో మ్యాచ్‌కు సూర్య జట్టుతో చేరనున్నట్లు మహారాష్ట్ర క్రికెట్ ఆసోషియన్ సెక్రటరీ అజింక్యా నాయక్ తెలిపారు. "సూర్య గత కొన్ని రోజులుగా టీమిండియా తరపున వైట్‌బాల్ క్రికెట్లో బీజీబీజీగా ఉన్నాడు. అతడు బాగా అలిసిపోయాడు. అందుకే చిన్న విరామం తీసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రాతో జరిగే మా తొలి మ్యాచ్‌కు సూర్య దూరం కానున్నాడు. మళ్లీ అతడు ఫ్రెష్ మైండ్‌తో జట్టులో చేరుతాడు. డిసెంబర్ 20 నుంచి హైదరాబాద్‌తో జరిగే మా రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ భాగం అవుతాడు" అని అజింక్యా నాయక్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 77 మ్యాచ్‌లు ఆడిన సూర్య 5326 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక డబుల్ సెంచరీతో పాటు 14 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: IPL Mini Auction: అతడి కోసం లక్నో పోటీ పడుతుంది! సీఎస్కే కూడా: అశ్విన్ -
చెలరేగిన స్టీఫెన్, ఆశిష్.. ఆంధ్ర ఘన విజయం
తిరువనంతపురం: పేస్ బౌలర్ చీపురపల్లి స్టీఫెన్ (5/27), స్పిన్నర్ ఆశిష్ (4/17) అద్భుత బౌలింగ్‌తో... రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో ఆంధ్ర జట్టు విజయంతో తమ లీగ్ దశను ముగించింది. ఉత్తరాఖండ్‌తో మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 36/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ను స్టీఫెన్, ఆశిష్ దెబ్బ తీశారు. వీరిద్దరి ధాటికి ఉత్తరాఖండ్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 65 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయి 101 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 70 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (42 నాటౌట్; 7 ఫోర్లు), అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన షేక్ రషీద్ (20; 3 ఫోర్లు) రాణించారు. ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో ఆంధ్ర మొత్తం 9 పాయింట్లతో తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
Ranji Trophy 2022: హైదరాబాద్ ఓటమి.. తిలక్ వర్మ తప్ప!
రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా బెంగాల్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ 'బి'మ్యాచ్‌లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమి చెందింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 166 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్ బ్యాటర్లలో తిలక్ వర్మ(90) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో ఆక్ష్‌దీప్ నాలుగు వికెట్లు పడగొట్టగా, షబాజ్ ఆహ్మద్ మూడు వికెట్లు సాధించాడు. ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య మ్యాచ్ ‘డ్రా తిరువనంతపురం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో ఆంధ్ర, సర్వీసెస్ జట్ల మధ్య మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆంధ్రకు 3 పాయింట్లు లభించాయి. ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర జట్టు 4 వికెట్లకు 220 పరుగులు చేసింది. జ్ఞానేశ్వర్ (125; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. -
టీమిండియా ఆల్‌రౌండర్‌కి కరోనా పాజిటివ్..
టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దుబే కరోనా బారిన పడ్డాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టుకు దుబే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించగా దుబేతో పాటు జట్టు వీడియో ఎనలిస్ట్ గణేశ్‌కి పాజటివ్‌గా నిర్ధణైంది. దీంతో త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీకు అతడు దూరమయ్యాడు. అతడి స్ధానంలో సాయిరాజ్ పటేల్‌ని ఎంపికచేశారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ద్రువీకరించింది. అదే విధంగా బెంగాల్ జట్టులో 7గురు ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక రంజీ ట్రోఫీ జనవరి 13నుంచి ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ముంబై జట్టు తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్ర తో తలపడనుంది. చదవండి: Mohammad Hafeez: పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. మహ్మద్ హఫీజ్ సంచలన నిర్ణయం.. -
ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్‌గా కుల్ధీప్ యాదవ్..
రంజీ ట్రోఫీలో పాల్గొనే 24 మంది సభ్యుల ఉత్తర్‌ప్రదేశ్ జట్టును బుధవారం ప్రకటించారు. ఈ జట్టుకు టీమిండియా స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ సారథ్యం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా కరుణ్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రియమ్ గార్గ్, శివమ్ మావి వంటి యువ ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ ట్రోఫిలో ఎలైట్ గ్రూపు-ఈలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, జనవరి 13న ఒడిషాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక రంజీ ట్రోఫీ జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్ జట్టు: కుల్దీప్ యాదవ్ (కెప్టెన్) కరణ్ శర్మ (వైస్-కెప్టెన్) మాధవ్ కౌశిక్, అల్మాస్ షౌకత్, సమర్థ్ సింగ్, హర్దీప్ సింగ్, రింకూ సింగ్, ప్రియాం గార్గ్, అక్ష్దీప్ నాథ్, సమీర్ చౌదరి, కృతగ్య సింగ్, ఆర్యన్ జుయల్, ధ్రువ్ చంద్ర జురెల్, శివమ్ మావి, అంకిత్ రాజ్‌పూత్, యశ్ దయాల్, కునాల్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ బన్సల్, షాను సైనీ, జాస్మర్, జీషన్ అన్సారీ, శివం శర్మ, పార్థ్ మిశ్రా చదవండి: ముంబై జట్టు కెప్టెన్‌గా పృథ్వీ షా! -
ఆంధ్రకు ఆధిక్యం
జైపూర్: ఓపెనర్ జ్ఞానేశ్వర్ (175 బంతుల్లో 73; 10 ఫోర్లు, సిక్స్), వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (100 బంతుల్లో 52; 8 ఫోర్లు, సిక్స్), బౌలర్ శశికాంత్ (97 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో... రాజస్తాన్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు 106 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోర్ 82/2తో రెండో రోజు శనివారం ఆట కొనసాగించిన ఆంధ్ర 91.5 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. రాజస్తాన్ బౌలర్ రితురాజ్ సింగ్ (4/36) రాణించాడు. ఆట ముగిసే సమయానికి రాజస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. శశికాంత్, షోయబ్ చెరో వికెట్ సాధించారు. ప్రస్తుతం యశ్ కోఠారి (11 బ్యాటింగ్; ఫోరు), మహిపాల్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే రాజస్తాన్ మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. సుమంత్ సూపర్ ఇన్నింగ్స్... హైదరాబాద్ వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఆధిక్యంలో నిలిచింది. కొల్లా సుమంత్ (157 బంతుల్లో 91 బ్యాటింగ్; 11 ఫోర్లు) వీరోచిత బ్యాటింగ్ కారణంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. దీంతో 29 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సంపాదించింది. అంతకుముందు కేరళ తమ తొలి ఇన్నింగ్స్‌లో 51.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ (4/59), రవి కిరణ్ (4/39) రాణించారు. -
ఆంధ్ర జట్టుకు ఆధిక్యం
సాక్షి, ఒంగోలు టౌన్: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (70 బ్యాటింగ్; 8 ఫోర్లు)తోపాటు కెప్టెన్ హనుమ విహారి (38; 6 ఫోర్లు), మనీశ్ (42; 7 ఫోర్లు), కరణ్ షిండే (48; 6 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంతో... ఢిల్లీతో ఇక్కడ జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 16/2తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 87 ఓవర్లలో 6 వికెట్లకు 249 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర ఖాతాలో 34 పరుగుల ఆధిక్యం ఉంది. రికీ భుయ్‌కు తోడుగా గిరినాథ్ రెడ్డి (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైని మూడు వికెట్లు, పవన్ రెండు వికెట్లు తీశారు. -
భారత ‘ఎ’ జట్టులో భరత్, రికీ భుయ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే తొలి అనధికారిక టెస్టులో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు కేరళలోని వాయనాడ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. 14 మంది సభ్యుల బృందానికి మహారాష్ట్ర క్రికెటర్ అంకిత్ బావ్నె సారథ్యం వహిస్తాడు. ఆంధ్ర రంజీ ఆటగాళ్లు కోన శ్రీకర్ భరత్, రికీ భుయ్‌లకు ఈ జట్టులో చోటు లభించింది. ప్రస్తుత రంజీ సీజన్లో రికీ భుయ్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగు సెంచరీలతో కలిపి మొత్తం 775 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ అయిన భరత్ హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 178... బెంగాల్‌పై 61... పంజాబ్‌పై 76 పరుగులు చేశాడు. -
రంజీ ఫైనల్లో విదర్భ
వాయనాడ్ (కేరళ): తొలిసారి రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అడుగు పెట్టి మరో అడుగు ముందుకు వెళ్లాలనుకున్న కేరళ ఆశలు ఫలించలేదు. డిఫెండింగ్ చాంపియన్ విదర్భ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా రెండో రోజే మ్యాచ్‌ను ముగించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఉమేశ్ యాదవ్ (5/31) పేస్‌కు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కేరళ 91 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్, 11 పరుగుల తేడాతో విదర్భ ఘన విజయం సాధించింది. ఓపెనర్ అరుణ్ కార్తీక్ (36; 5 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, ఎనిమిది మంది ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. ఉమేశ్‌కు తోడుగా రజనీశ్ గుర్బాని 4 వికెట్లతో చెలరేగాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 171/5తో శుక్రవారం ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటై 102 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కేరళ పేసర్ సందీప్ వారియర్‌కు 5 వికెట్లు దక్కాయి. ఆధిక్యం ఎవరికో... బెంగళూరు: కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఆధిక్యం కోసం ఇరు జట్లు పోరాడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసేసరికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. స్నెల్ పటేల్ (85; 15 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... షెల్డన్ జాక్సన్ (46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పుజారా (45; 3 ఫోర్లు, సిక్స్) ఫర్వాలేదనిపించారు. రోనిత్ మోరె 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/9తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక మరో తొమ్మిది పరుగులు జోడించి 275 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం చేతిలో 3 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర మరో 48 పరుగులు వెనుకబడి ఉంది. సీనియర్ బ్యాట్స్‌మన్ అర్పిత్ (26 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆధిక్యం ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరం. -
సౌరాష్ట్ర సాధించెన్
లక్నో: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర అద్భుతం చేసింది. ఉత్తరప్రదేశ్‌తో ఇక్కడ జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఏకంగా 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్ చేరింది. తద్వారా 2008–09 సీజన్లో సర్వీసెస్‌పై అసోం నెలకొల్పిన అత్యధిక పరుగుల ఛేదన రికార్డు (371 పరుగులు)ను బద్దలు కొట్టింది. బ్యాటింగ్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు వెనుకబడినా... రెండో ఇన్నింగ్స్‌లో తేరుకుని సెమీస్ గడపతొక్కింది. లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 195/2తో శనివారం చివరి రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్రను ఓపెనర్ హార్విక్ దేశాయ్ (259 బంతుల్లో 116; 16 ఫోర్లు) కెరీర్లో తొలి శతకంతో ముందుకు నడిపించాడు. అయితే, అతడితో పాటు మక్వానా (7) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (110 బంతుల్లో 67 నాటౌట్; 9 ఫోర్లు), షెల్డన్ జాక్సన్ (109 బంతుల్లో 73 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సంయమనం చూపారు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న వీరు ఐదో వికెట్‌కు అజేయంగా 136 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. దీంతో ఆరు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విజయం సాధించింది. కనీసం ‘డ్రా’ చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయిన ఉత్తరప్రదేశ్ ఉసూరుమంటూ వెనుదిరిగింది. విదర్భ మరోసారి... సొంతగడ్డ నాగ్‌పూర్‌లో ముగిసిన మరో క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ ఇన్నింగ్స్ 115 పరుగులతో ఉత్తరాఖండ్‌పై గెలుపొంది సెమీస్ చేరింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (274 పరుగులు)తో విదర్భ సెమీస్ బెర్త్ ముందే ఖాయమైంది. నామమాత్రమైన రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 152/5తో శనివారం ఆట కొనసాగించిన ఉత్తరాఖండ్... టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ (5/23), ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆదిత్య సర్వాతె (5/55) ధాటికి ఏడు పరుగులకే మిగతా ఐదు వికెట్లూ కోల్పోయి 159 పరుగులకే ఆలౌటైంది. ఈనెల 24న మొదలయ్యే సెమీఫైనల్స్‌లో కేరళతో విదర్భ; కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడతాయి. -
సెమీస్‌లో కర్ణాటక
బెంగళూరు: కెప్టెన్ మనీశ్ పాండే (75 బంతుల్లో 87 నాటౌట్; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ (129 బంతుల్లో 61 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకాలతో మెరవడంతో మాజీ చాంపియన్ కర్ణాటక రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం ఇక్కడ ముగిసిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ను ఓడించింది. 184 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 45/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక... ఆరంభంలోనే రోనిత్ మోరె (8) వికెట్ కోల్పోయింది. ఈ దశలో మనీశ్, కరుణ్ దూకుడుగా ఆడారు. ఐదో వికెట్‌కు 24.5 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. సంక్షిప్త స్కోర్లు: రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్: 224; కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 263; రాజస్తాన్ రెండో ఇన్నింగ్స్: 222; కర్ణాటక రెండో ఇన్నింగ్స్: 185/4. -
హడలెత్తించిన గిరినాథ్
ఇండోర్: యువ మీడియం పేసర్ పారెడ్డి గిరినాథ్ రెడ్డి హడలెత్తించడంతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. 10.5 ఓవర్లలో నాలుగు మెయిడిన్లు వేసి కేవలం 29 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన గిరినాథ్ రెడ్డి మధ్యప్రదేశ్ జట్టును 91 పరుగులకే కుప్పకూల్చ డంలో కీలకపాత్ర పోషించాడు. నమన్ ఓజా (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రజత్ పాటిదార్ (19; 3 ఫోర్లు), శుభం శర్మ (16; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. విజయ్ కుమార్ రెండు వికెట్లు తీయగా... మనీశ్, శశికాంత్ ఒక్కోవికెట్ పడగొట్టారు. 41 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర ఓవరాల్ ఆధిక్యం 239 పరుగులకు చేరింది. ఓపెనర్లు ప్రశాంత్ (44; 5 ఫోర్లు), జ్ఞానేశ్వర్ (43; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. కరణ్ షిండే (45 బ్యాటింగ్; 8 ఫోర్లు), శశికాంత్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఆంధ్ర 132 ఆలౌట్
ఇండోర్: మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర తడబడింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. క్రీజులో దిగిన వాళ్లెవరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. ఓపెనర్ ప్రశాంత్ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్. కరణ్ శర్మ 23 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ పేసర్లు ఈశ్వర్ పాండే (4/43), గౌరవ్ యాదవ్ (3/21), స్పిన్నర్ కార్తికేయ (3/23) ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఆర్యమాన్ బిర్లా (3), అజయ్ రొహెరా (1)లతో పాటు కార్తికేయ (0) కూడా ఔట్ కావడంతో ఆట నిలిచే సమయానికి 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో విజయ్, గిరినాథ్, మనీశ్ తలా ఒక వికెట్ తీశారు. త్రిపుర 35... రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర పేకమేడలా 35 పరుగులకే కూలింది. ఇందులో ఆరుగురు బ్యాట్స్‌మెన్ కౌశల్ (0), బోస్ (0), మురాసింగ్ (0), రాజిబ్ (0), హర్మీత్ (0), సౌరభ్ (0) డకౌట్ కాగా, నీలంబుజ్‌వత్స్ (11) రెండంకెల స్కోరు చేశాడు. లేదంటే ఇదే రాజస్తాన్ చేతిలో ‘హైదరాబాద్ 21 ఆలౌట్’ చెత్త రికార్డును త్రిపుర చెరిపేసేది. రాజస్తాన్ బౌలర్లలో అనికేత్ చౌదరి 5, తన్వీరుల్ హక్ 1 పరుగుకే 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగుల వద్ద ఆలౌటైంది. మురాసింగ్‌కు 4 వికెట్లు దక్కాయి. మొత్తానికి తొలిరోజే 20 వికెట్లు పడ్డాయి. జాఫర్ రికార్డు... రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా వసీమ్ జాఫర్ (విదర్భ) రికార్డులకెక్కాడు. తాజాగా సౌరాష్ట్ర, విదర్భ మధ్య జరుగుతున్న మ్యాచ్ అతని రంజీ కెరీర్లో 146వ మ్యాచ్. దీంతో గతంలో దేవేంద్ర బుండేలా ఆడిన 145 మ్యాచ్‌ల రికార్డు కనుమరుగైంది. 146 మ్యాచ్‌ల్లో జాఫర్ 11,403 పరుగులు చేశాడు. ఇందులో 39 సెంచరీలు, 84 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ చురుకైన ఫీల్డర్ 191 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. -
ఆంధ్ర ఖాతాలో మరో ‘డ్రా’
సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్ ప్రశాంత్ కుమార్ (81 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా... మిగతా బ్యాట్స్‌మెన్ సహకారం అందించకపోవడంతో బెంగాల్‌తో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు ఆంధ్రకు మూడు పాయింట్లు లభించగా... బెంగాల్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 321/9తో మ్యాచ్ చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు మరో మూడు బంతులు ఆడి అదే స్కోరు వద్ద ఆలౌటైంది. 21 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ జట్టు 40.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 223 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు ధాటిగా ఆడినా... ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో ఏడు వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రశాంత్, జ్యోతి సాయికృష్ణ (45; 5 ఫోర్లు, సిక్స్) రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించడంతో ఒకదశలో ఆంధ్ర జట్టుకు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే సాయికృష్ణ ఔటయ్యాక రికీ భుయ్ (16; 3 ఫోర్లు), భరత్ (0), గిరినాథ్ రెడ్డి (9), శశికాంత్ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. సెంచరీ దిశగా సాగిన ప్రశాంత్ కీలకదశలో నిష్క్రమించడంతో చివరకు ఆంధ్ర మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. 9 జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర రెండింటిలో ఓడి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకుంది. ప్రస్తుతం 8 పాయిం ట్లతో గ్రూప్‌లో చివరి స్థానంలో ఉంది. ఈనెల 30 నుంచి విజయనగరంలో జరిగే తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌తో ఆంధ్ర తలపడుతుంది. శుబ్‌మన్ మెరుపు సెంచరీ సాక్షి, హైదరాబాద్: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన హైదరాబాద్‌కు మూడు పాయింట్లు లభించగా... పంజాబ్‌కు ఒక పాయింట్ దక్కింది. నిర్ణీత 57 ఓవర్లలో 338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లకు 324 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (154 బంతుల్లో 148; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) హడలెత్తించాడు. అయితే 50వ ఓవర్లో జట్టు స్కోరు 290 వద్ద జోరుమీదున్న శుబ్‌మన్ ఐదో వికెట్ రూపంలో వెనుదిరగడం పంజాబ్ విజయావకాశాలపై ప్రభావం చూపింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 155/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 3 వికెట్లకు 323 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (161 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. -
ఆంధ్రకు ఆధిక్యం
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కోన శ్రీకర్ భరత్ (61; 9 ఫోర్లు, సిక్స్), రికీ భుయ్ (52; 5 ఫోర్లు) బాధ్యతాయుత ఆటతీరు కారణంగా... బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రకు 21 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 108/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు 321 పరుగులు సాధించింది. రికీ భుయ్, భరత్ నాలుగో వికెట్‌కు 84 పరుగులు జత చేశారు. 290 పరుగుల స్కోరు వద్ద ఆంధ్ర ఎనిమిదో వికెట్ కోల్పోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తుందా లేదా అనే అనుమానం కలిగింది. అయితే పృథ్వీ రాజ్ (12; 3 ఫోర్లు), శశికాంత్ (10 బ్యాటింగ్) తొమ్మిదో వికెట్‌కు 22 పరుగులు జతచేసి ఆంధ్రకు ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. మరోవైపు పంజాబ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. అంతకుముందు పంజాబ్ 303 పరుగులకు ఆలౌటైంది. దాంతో హైదరాబాద్‌కు 14 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. -
హైదరాబాద్ బోణీ
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ (3/9), రవికిరణ్ (4/32) విజృంభించడంతో పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్ల లో 97 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (48 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), అక్షత్ రెడ్డి (44 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఒక పరుగుతో కలుపుకొని హైదరాబాద్ 28.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసి గెలుపొందింది. మరో మ్యాచ్‌లో 41 సార్లు రంజీ చాంపియన్ ముంబైపై గుజరాత్ తొమ్మిది వికెట్లతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ప్రియాంక్ (109 బంతుల్లో 112 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో 204 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ 41.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. -
ఆంధ్ర 198/8
సాక్షి, ఒంగోలు: సొంతగడ్డపై తమిళనాడుతో మంగళవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. పేసర్ మొహమ్మద్ (4/60) ధాటికి తొలి రోజు ఆంధ్ర 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న పి.గిరినాథ్ రెడ్డి (149 బంతుల్లో 69 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు జ్యోతి సాయికృష్ణ (149 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్ ప్రశాంత్ (4), అశ్విన్ హెబర్ (12), రికీ భుయ్ (22), కెప్టెన్ బోడపాటి సుమంత్ (1) విఫలమయ్యారు. సాయికృష్ణతో ఐదో వికెట్‌కు 73 పరుగులు జోడించిన గిరినాథ్, ఏడో వికెట్‌కు షోయబ్ ఖాన్ (26)తో 53 పరుగులు జత చేశాడు. సాయికిషోర్, నటరాజన్ చెరో 2 వికెట్లు తీశారు. తన్మయ్ శతకం... సాక్షి, హైదరాబాద్: ఢిల్లీతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 232 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (241 బంతుల్లో 112 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించగా, హిమాలయ్ అగర్వాల్ (190 బంతుల్లో 66; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ నమోదు చేశాడు. తన్మయ్, హిమాలయ్ మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించారు. -
4 బంతుల్లో 4 వికెట్లు
జైపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2018–19 సీజన్లో అరుదైన ఘనత నమోదైంది. రాజస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్ పేసర్ ముదస్సిర్ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 99వ ఓవర్ బౌలింగ్ చేసిన ముదస్సిర్ (5/90) మూడో బంతికి చేతన్ బిస్త్ (159; 24 ఫోర్లు)ను ఆ తర్వాత వరుసగా తజిందర్ సింగ్ (0), రాహుల్ చహర్ (0), తన్వీర్ ఉల్ హఖ్ (0)లను ఎల్బీడబ్ల్యూలుగా పెవిలియన్ పంపాడు. రంజీ చరిత్రలో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం ఇది రెండో సారైతే... ఆ నాలుగు ఎల్బీడబ్ల్యూలే కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఢిల్లీ ఆటగాడు శంకర్ సైనీ (1988 హిమాచల్ ప్రదేశ్‌పై) ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూకశ్మీర్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. మరో హ్యాట్రిక్..: మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తమిళనాడు పేసర్ ఎం. మొహమ్మద్ మరో హ్యాట్రిక్ నమోదు చేశాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 142వ ఓవర్ చివరి బంతికి యశ్ దూబే (6)ను ఔట్ చేసిన మొహమ్మద్ (4/98) తన మరుసటి ఓవర్ తొలి రెండు బంతులకు రజత్ పాటిదార్ (196; 17 ఫోర్లు, 1 సిక్స్), మిహిర్ హిర్వాణి (0)లను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు. -
ఆంధ్ర తడబాటు
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సన్వీర్ సింగ్ (110; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి తోడు మయాంక్ మార్కండే (68 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో ఆంధ్రతో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 261/6తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ మరో 153 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. ఆంధ్ర బౌలర్లలో బండారు అయ్యప్ప, కరణ్ శర్మ మూడేసి వికెట్లు పడగొట్టగా... విజయ్ కుమార్, షోయబ్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు తడబడింది. కెప్టెన్ హనుమ విహారి (19), ప్రశాంత్ (1), అశ్విన్ హెబర్ (17) త్వరగా ఔట్ కావడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 26 ఓవర్లలో 3 వికెట్లకు 54 పరుగులు చేసింది. ప్రస్తుతం రికీ భుయ్ (12 బ్యాటింగ్), కేఎస్ భరత్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సచిన్ బేబీ, జగదీశ్ సెంచరీలు... తిరువనంతపురం: పేసర్ సిరాజ్ గైర్హాజరీలో హైదరాబాద్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కేరళ భారీ స్కోరు చేసింది. సచిన్ బేబీ (147; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), జగదీశ్ (113 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగడంతో కేరళ 495/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 231/4తో శుక్రవారం ఇన్నింగ్స్ కొనసాగించిన కేరళ సచిన్, జగదీశ్ సెంచరీలకు తోడు అక్షయ్ చంద్రన్ (48 నాటౌట్; 5 ఫోర్లు) రాణించడంతో భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సాకేత్ సాయిరామ్ 3, మెహదీ హసన్ 2, రవితేజ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 1 పరుగు చేసింది. తన్మయ్ (1 బ్యా టింగ్), అక్షత్‌రెడ్డి (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
రంజీ ట్రోఫీ సెమీస్‌లో ఢిల్లీ
సాక్షి, విజయవాడ: సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (129 బంతుల్లో 95; 9 ఫోర్లు, ఒక సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ జట్టును రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేర్చాడు. మధ్యప్రదేశ్‌తో సోమవారం ముగిసిన ఐదు రోజుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 51.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ కునాల్ చండేలా (57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో గంభీర్ రెండో వికెట్‌కు 98 పరుగులు... ధ్రువ్ (46 నాటౌట్; 6 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు. 2009–2010 సీజన్ తర్వాత ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీలో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. గుజరాత్ ఇంటిముఖం... డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్, బెంగాల్ జట్ల మధ్య జైపూర్‌లో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా బెంగాల్ జట్టు సెమీస్ చేరింది. చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 483/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ మ్యాచ్ ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 695 పరుగులు చేసింది. తొలిసారి విదర్భ... కేరళతో సూరత్‌లో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ జట్టు 412 పరుగుల ఆధిక్యంతో గెలిచి తొలిసారి రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు చేరింది. 578 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య సర్వాతే (6/41) విదర్భ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 431/6తో బ్యాటింగ్ కొనసాగించిన విదర్భ జట్టు తొమ్మిది వికెట్లకు 507 పరుగులవద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈనెల 17న మొదలయ్యే సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో కర్ణాటకతో విదర్భ; బెంగాల్‌తో ఢిల్లీ తలపడతాయి. -
కర్ణాటకకు భారీ ఆధిక్యం
నాగ్‌పూర్: బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ కర్ణాటక భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 115/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక ఆట ముగిసే సమయానికి 122 ఓవర్లలో ఆరు వికెట్లకు 395 పరుగులు సాధించింది. ఇప్పటికే 222 పరుగుల ఆధిక్యం కూడగట్టుకున్న కర్ణాటక మూడో రోజు ఈ ఆధిక్యాన్ని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. అబ్బాస్ (50; 5 ఫోర్లు)తోపాటు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (78; 11 ఫోర్లు, ఒక సిక్స్), సీఎం గౌతమ్ (79; 12 ఫోర్లు, ఒక సిక్స్), శ్రేయస్ గోపాల్ (80 బ్యాటింగ్; 7 ఫోర్లు) ముంబై బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించి అర్ధ సెంచరీలు చేశారు. గోపాల్‌తో పాటు కెప్టెన్ వినయ్ కుమార్ (31 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. కరుణ్ నాయర్ (16), పవన్ దేశ్‌పాండే (8) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. తొలి రంజీ మ్యాచ్ ఆడుతోన్న ముంబై బౌలర్ శివం దూబే 79 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. మ్యాచ్ మరో మూడు రోజులుండటం.. కర్ణాటక భారీ ఆధిక్యం సంపాదించడంతో 41 సార్లు చాంపియన్ ముంబైకి క్లిష్ట పరిస్థితే ఎదురుకానుంది. గుజరాత్ 180/6 జైపూర్: భార్గవ్ మిరాయ్ (67), పార్థివ్ పటేల్ (47) రాణించినా... ఓపెనర్లు ప్రియాంక్ పాంచాల్ (4), సమిత్ గోహిల్ (0), మిడిలార్డర్లో జునేజా (10), చిరాగ్ గాంధీ (4) విఫలమవడంతో బెంగాల్‌తో క్వార్టర్స్‌లో గుజరాత్ తడబడింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు మరో 174 పరుగులు వెనుకబడి ఉంది. రజుల్ భట్ (13), పీయూష్ చావ్లా (22) క్రీజులో ఉన్నారు. బెంగాల్ బౌలర్ అమిత్ (3/46) రాణించాడు. మధ్యప్రదేశ్ 338;ఢిల్లీ 180/2 సాక్షి, విజయవాడ: తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేయగా... ఢిల్లీ దీటైన సమాధానమిచ్చింది. విజయవాడలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 223/6తో ఆట ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ను హర్‌ప్రీత్‌సింగ్ (107) గట్టెక్కించాడు. మనన్‌శర్మ (4/46) రాణించాడు. సీనియర్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ (6) త్వరగా ఔటైనా రూకీ చండేలా (73 బ్యాటింగ్), ధ్రువ్ షరాయ్ (78) భాగస్వామ్యంతో ఢిల్లీ మెరుగైన స్కోరు దిశగా వెళ్తోంది. విదర్భ 246; కేరళ 32/2 సూరత్: కేరళతో మరో క్వార్టర్స్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. అక్షయ్ వాద్కర్ (53) ఒక్కడే అర్ధసెంచరీ సాధించాడు. స్పిన్నర్ కేసీ అక్షయ్ (5/66) రాణించాడు. ఆట ముగిసే సమయానికి కేరళ రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
వినయ్‌కుమార్ హ్యాట్రిక్
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు తడబడింది. కర్ణాటక పేసర్ వినయ్‌కుమార్ ‘హ్యాట్రిక్’ సహా ఆరు వికెట్లతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌటైంది. వినయ్ కుమార్ (6/34) దెబ్బకు 74/7తో కష్టాల్లో పడ్డ ముంబై జట్టును లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ధావల్ కులకర్ణి (132 బంతుల్లో 75; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నాడు. వినయ్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి పృథ్వీ షా (2) స్లిప్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా... మూడో ఓవర్ తొలి బంతికి జయ్ గోకుల్ బిస్తా (1), రెండో బంతికి ఆకాశ్ పర్కర్ (0)లను వెనక్కి పంపడంతో కర్ణాటక కెప్టెన్ హ్యాట్రిక్ పూర్తయింది. సిద్ధేశ్ లాడ్ (8), సూర్యకుమార్ యాదవ్ (14), తారే (4) విఫలమయ్యారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి సమర్థ్ (40) వికెట్ కోల్పోయి 115 పరుగులు చేసింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ (62 బ్యాటింగ్), అబ్బాస్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కర్ణాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 58 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. మధ్యప్రదేశ్ 223/6 సాక్షి, విజయవాడ: ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ మ్యాచ్‌లో తొలి రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఓపెనర్ అంకిత్ దానే (59), సీనియర్ బ్యాట్స్‌మన్ నమన్ ఓజా (49) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ వికాస్ మిశ్రా (3/40) ఆకట్టుకున్నాడు. జైపూర్: బెంగాల్, గుజరాత్ల మధ్య జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (129) సెంచరీతో ఆకట్టుకోగా, అనుస్తుప్ మజుందార్ (94) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. వీరి ఆటతో ఆ జట్టు 6 వికెట్లకు 261 పరుగులు చేసింది. సూరత్: మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ, కేరళ మధ్య మ్యాచ్ తొలి రోజు కేవలం 24 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 45 పరుగులు చేసింది. ముంబై 173 ఆలౌట్ ∙రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ -
ముంబై బ్యాట్స్‌మెన్ విఫలం
ముంబై: భారత రంజీ ట్రోఫీలో 500వ మ్యాచ్ ఆడుతున్న ఘన చరిత్ర ముంబైది. అయితే బరోడాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై తొలిరోజు ఆటలో తడబడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ ఆదిత్య తారే (50; 8 ఫోర్లు) ఒక్కడే రాణించగా... మిగతావారిలో శ్రేయస్ అయ్యర్ 28, సిద్ధేశ్ లాడ్ 21 పరుగులు చేశారు. రహానే, పృథ్వీ షా డకౌటయ్యారు. బరోడా పేసర్లు అజిత్ సేథ్, లుక్మాన్ మెరీవాలా చెరో 5 వికెట్లు పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బరోడా ఆట నిలిచే సమయానికి 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. విష్ణు సోలంకి (32 బ్యాటింగ్), ఆదిత్య వాగ్మోడే (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మురళీ విజయ్ సెంచరీ... ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనర్, తమిళనాడు బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ (273 బంతుల్లో 140; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కాడు. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 292 పరుగులు చేసింది. జగదీశన్ (88; 11 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. బాబా ఇంద్రజిత్ (44 బ్యాటింగ్), విజయ్ శంకర్ (8 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. -
ముంబై రంజీ@ 500
విజయ్ మర్చంట్, సునీల్ గావస్కర్, అజిత్ వాడేకర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండూల్కర్, పాలీ ఉమ్రీగర్, వినూ మన్కడ్, ఫరూఖ్ ఇంజినీర్... ఒకరా, ఇద్దరా భారత్‌కు ముంబై క్రికెట్ అందించిన దిగ్గజాల జాబితాకు ముగింపు లేదు! బాంబే తొలి తరం నుంచి నేటి రహానే, రోహిత్‌ల వరకు భారత క్రికెట్‌తో ఆ జట్టుకు విడదీయరాని బంధం. రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై సాధించిన విజయాలు, ఘనతలు, నెలకొల్పిన రికార్డులు మరే జట్టుకూ సాధ్యం కాలేదు. భారత దేశవాళీ క్రికెట్లో ఆల్‌టైమ్ అత్యుత్తమ టీమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై తమ 500వ రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగనుంది. ముంబై: రంజీ ట్రోఫీని 41 సార్లు సొంతం చేసుకున్న ముంబై జట్టు చారిత్రాత్మక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు ఇక్కడి వాంఖెడే మైదానంలో బరోడాతో జరిగే మ్యాచ్ రంజీల్లో ముంబైకి 500వది. చిన్న స్థాయి లీగ్‌ల నుంచి పటిష్టమైన వ్యవస్థ, పెద్ద సంఖ్యలో టోర్నీలు, ప్రతిభావంతులకు లభించే అవకాశాలు, అత్యుత్తమ కోచింగ్ సౌకర్యాలు... ఇలా అన్నీ వెరసి 83 ఏళ్లుగా రంజీల్లో ముంబైని ‘ది బెస్ట్’గా నిలబెట్టాయి. సన్నీ ఆట నేర్చిన మైదానాలతో, సచిన్ బ్యాట్‌కు పదును పెట్టిన పార్క్‌లతో కుర్రాళ్ల కలల కేంద్రం ముంబై క్రికెట్ దేశవాళీలో అద్భుతాలు చేసింది. ముంబై భాషలో ఆప్యాయంగా చెప్పుకునే ఖడూస్ (మొండి పట్టుదల) శైలి ఆ జట్టును, ఆటగాళ్లను కూడా ప్రత్యేకంగా మార్చింది. అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ ఆటగాళ్లను అందించిన ముంబై, భారత జట్టులో అంతర్భాగంగా మారిపోయింది. తాజా మ్యాచ్ నేపథ్యంలో ముంబై రంజీ జట్టుకు సంబంధించిన కొన్ని విశేషాలు.... అత్యధిక పరుగులు: వసీం జాఫర్ (9759), అత్యధిక వికెట్లు: పద్మాకర్ శివాల్కర్ (361), అత్యుత్తమ బౌలింగ్: అంకిత్ చవాన్ (9/23), సీజన్లో అత్యధిక పరుగులు: శ్రేయస్ అయ్యర్ (1321), అత్యధిక స్కోరు: 855/6 డిక్లేర్డ్ (హైదరాబాద్‌పై). టాప్–5 వ్యక్తిగత స్కోర్లు: సంజయ్ మంజ్రేకర్ (377), విజయ్ మర్చంట్ (359 నాటౌట్), సునీల్ గావస్కర్ (340), అజిత్ వాడేకర్ (323), వసీం జాఫర్ (314 నాటౌట్). ఇతర దేశవాళీ జట్ల అత్యధిక టైటిల్స్: న్యూసౌత్‌వేల్స్ (ఆస్టేలియా–షెఫీల్డ్ షీల్డ్) 46; యార్క్‌షైర్ (ఇంగ్లండ్– 34); హైవెల్డ్ లయన్స్ (దక్షిణాఫ్రికా–29); ఆక్లాండ్ ఏసెస్, (న్యూజిలాండ్ –23). 1934–35లో జరిగిన తొలి రంజీ ట్రోఫీని ముంబై (నాటి బాంబే) గెలుచుకుంది. Üమొత్తం 83 సార్లు రంజీ ట్రోఫీ జరిగితే 41 టైటిల్స్ సాధించిన ముంబై మొత్తంగా 46 సార్లు ఫైనల్ చేరింది. కేవలం 5 ఫైనల్స్‌లో మాత్రమే ఆ జట్టు ఓటమి పాలైంది. Ü1958–59 సీజన్ నుంచి 1972–73 సీజన్ వరకు ముంబై వరుసగా 15 సార్లు విజేతగా నిలిచింది. Üముంబై తమ 100, 200, 300, 400వ రంజీ మ్యాచ్‌లలో విజయాలు అందుకుంది. Üఎనిమిది సార్లు రంజీ విజేతగా నిలిచిన జట్లలో వసీం జాఫర్ సభ్యుడు. ముంబై క్రికెట్లో గట్టి పోటీ ఉండటమే ఆ జట్టు బలం. ఎన్నడూ ఓటమిని అంగీకరించని తత్వం జట్టు సొంతం. విఫలమైతే మరో అవకాశం దక్కడం చాలా కష్టం కాబట్టి ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారు. – గావస్కర్ ముంబై రంజీ జట్టు ఎంతో మంది అత్యుత్తమ ఆటగాళ్లను అందించింది. ఇక్కడే నేను ఎంతో నేర్చుకున్నాను. సింహం బొమ్మ ఉన్న జెర్సీని ధరించడాన్ని ప్రతీ ముంబై క్రికెటర్ గర్వంగా భావిస్తాడు. పాత విజయాలు చూసుకొని సంబరపడిపోకుండా మళ్లీ అంతే పట్టుదలతో ఆడటం వల్లే ముంబై వరుసగా టైటిల్స్ సాధించగలిగింది. – సచిన్ ► మొత్తం 499 మ్యాచ్‌లలో ముంబై 242 గెలిచి 26 ఓడింది. మరో 231 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిశాయి. -
హైదరాబాద్ 474/9 డిక్లేర్డ్
న్యూఢిల్లీ: కెప్టెన్ అంబటి రాయుడు (112; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సందీప్ (82; 10 ఫోర్లు), టి.రవితేజ (70; 9 ఫోర్లు, ఒక సిక్స్) ఆకట్టుకోవడంతో... రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 474 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రైల్వేస్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. పుజారా ‘డబుల్’ రికార్డు... రాజ్‌కోట్‌లో జార్ఖండ్ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (204; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధికంగా 12 డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. విజయ్ మర్చంట్ (11) పేరిట ఉన్న రికార్డును పుజారా తిరగరాశాడు. పుజారా ద్విశతకంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 553 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ 2 వికెట్లకు 52 పరుగులు చేసింది. -
విహారి, ప్రశాంత్ శతకాలు
సాక్షి, విజయనగరం: ఆంధ్ర బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో ఒడిషాతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం లభించింది. కెప్టెన్ హనుమ విహారి (248 బంతుల్లో 143 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్), డీబీ ప్రశాంత్ (270 బంతుల్లో 127; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలు బాదడంతో మంగళవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (3) అవుటైన తర్వాత విహారి, ప్రశాంత్ రెండో వికెట్‌కు 270 పరుగులు జోడించడం విశేషం. బయటి వేదికపై తొలి రెండు మ్యాచ్ లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఆంధ్రకు ఈ సీజన్లో సొంతగడ్డపై ఇదే తొలి మ్యాచ్. -
సిరాజ్‌కు 4 వికెట్లు
షిమోగా: హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (4/42) చెలరేగడంతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది. స్టువర్ట్ బిన్నీ (61) రాణించగా... ప్రధాన బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (4), కరుణ్ నాయర్ (23) ఆకట్టుకోలేకపోయారు. రవికిరణ్ (3/36) కీలక వికెట్లతో కర్ణాటక పని పట్టాడు. అనంతరం హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 51 పరుగులు చేసింది. అంబటి రాయుడు (0), తన్మయ్ (1), అక్షత్ రెడ్డి (13) ఇప్పటికే అవుటవ్వగా... సుమంత్ (34 బ్యాటింగ్), సందీప్ (2 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. -
వావ్..స్లిప్‌లోనే 9 మంది ఫీల్డింగ్..
సాక్షి, హైదరాబాద్: బెంగాల్ - ఛత్తీస్‌ఘడ్ మధ్య రాయిపూర్లో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. బెంగాల్ పేస్ బౌలర్లు మహ్మద్ షమీ, అశోక్ దిండాలు స్లిప్‌లో ఏకంగా తొమ్మిది మందిని ఫీల్డింగ్ పెట్టి బౌలింగ్ చేశారు. 11 మంది సభ్యులే ఉండె క్రికెట్లో 9 మందిని స్లిప్‌లో ఫీల్డింగ్ పెట్టడం అత్యంత అరుదైతే.. బౌలర్, వికెట్ కీపర్‌తో కలిసి జట్టంతా సర్కిల్లోనే ఫీల్డింగ్ చేయడం మరో విశేషం. ఈ ఫోటోను మహ్మద్ షమీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మ్యాచ్‌లో షమీ, దిండాలు రెచ్చిపోవడంతో ఛత్తీస్‌ఘడ్ రెండో ఇన్నింగ్స్ 259 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు 529/7 స్కోరు వద్ద బెంగాల్ డిక్లెర్ చేయగా ఛత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్ 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో బెంగాల్ ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
ఆంధ్ర చేజారిన అవకాశం
వడోదర: రంజీ ట్రోఫీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు ప్రత్యర్థిని పడగొట్టి మ్యాచ్‌ను గెలుచుకోవడంలో విఫలమైంది. బరోడాతో మంగళవారం ముగిసిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌ను ఆంధ్ర ‘డ్రా’తో సరిపెట్టుకుంది. చివరి రోజు ఆట ముగిసే సమయానికి బరోడా తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఆ సమయంలో ఓవరాల్‌గా బరోడా కేవలం 12 పరుగులు మాత్రమే ముందంజలో ఉంది. ఒక దశలో 136 పరుగుల వద్దే బరోడా తమ ఆరో వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో ఆంధ్ర ఒత్తిడి పెంచలేకపోవడంతో బరోడా ఆ తర్వాత మరో 16.2 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్‌ను కాపాడుకుంది. స్వప్నిల్ సింగ్ (50 నాటౌట్), పీనాల్ షా (9 నాటౌట్) ఏడో వికెట్‌కు 59 పరుగులు జత చేశారు. ఇతర బ్యాట్స్‌మెన్‌లో సోలంకి (68), వాఘ్‌మోడ్ (56) రాణించారు. అశ్విన్ హెబర్, అయ్యప్ప చెరో 2 వికెట్లతో బరోడాను దెబ్బ తీశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 505/9తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో మరో 10.1 ఓవర్లు ఆడి 554 పరుగులకు ఆలౌటైంది. బోడపాటి సుమంత్ (144 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఆంధ్రకు 3 పాయింట్లు దక్కగా...హనుమ విహారి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మరోవైపు హైదరాబాద్‌లో వరుసగా నాలుగో రోజు కూడా ఆట సాధ్యం కాక హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ మ్యాచ్ ఒక బంతి కూడా పడకుండానే రద్దయింది. -
బెంగాల్‌ను గెలిపించిన షమీ
రాయ్‌పూర్: పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ (6/61) చెలరేగడంతో బెంగాల్ ఇన్నింగ్స్, 160 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను చిత్తు చేసింది. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఛత్తీస్‌గఢ్ 259 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు చౌహాన్ (115) సెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. తన 100వ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన అశోక్ దిండాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. న్యూఢిల్లీ: రైల్వేస్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్, 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్ ఆడుతూ రైల్వేస్ రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే కుప్పకూలింది. మైసూర్: కర్ణాటక ఇన్నింగ్స్, 121 పరుగుల తేడాతో అస్సాంను చిత్తుగా ఓడించింది. ఫాలోఆన్‌లో అస్సాం తమ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. వినయ్ కుమార్ 4 వికెట్లు... గౌతమ్, మిథున్ చెరో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. నడియాడ్: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ ఉత్కఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో కేరళను ఓడించింది. 105 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని అతి కష్టమ్మీద అందుకుంది. ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. రాజస్థాన్ – జార్ఖండ్... తమిళనాడు – త్రిపుర... హిమాచల్‌ప్రదేశ్ – గోవా... ముంబై – మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. -
సౌరాష్ట్ర భారీ విజయం
రాజ్‌కోట్: లెఫ్టార్మ్ స్పిన్ ‘జడేజా’ ద్వయం చెలరేగడంతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మూడో రోజే సౌరాష్ట్ర ఇన్నింగ్స్, 212 పరుగుల తేడాతో జమ్మూ కశ్మీర్‌పై ఘన విజయం సాధించింది. రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా దెబ్బకు కశ్మీర్ ఒకే రోజు 16 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 103/4తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కశ్మీర్ 156 పరుగులకు ఆలౌటైంది. శుభమ్ ఖజూరియా (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ధర్మేంద్ర జడేజా 6, రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఫాలోఆన్ ఆడిన కశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 256 పరుగులకు ఆలౌటైంది. రామ్ దయాళ్ (56), పునీత్ బిస్త్ (55) అర్ధసెంచరీలు చేశారు. వందిత్ 6 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజాకు 3 వికెట్లు లభించాయి. రవీంద్ర జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చండీగఢ్‌లో మూడో రోజే ముగిసిన మరో మ్యాచ్‌లో విదర్భ ఇన్నింగ్స్, 117 పరుగుల తో పంజాబ్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు వెనుకబడి సోమవారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పంజాబ్ 227 పరుగులకే కుప్పకూలింది. వోహ్రా (51), యువరాజ్ సింగ్ (42) ఫర్వాలేదనిపించారు. అక్షయ్ కర్నెవర్ (6/47), అక్షయ్ వాఖరే (4/83) పంజాబ్‌ను దెబ్బ తీశారు. -
బరోడాను కట్టడి చేసిన ఆంధ్ర
వడోదర: తొలి మ్యాచ్‌లో పటిష్టమైన తమిళనాడును దాదాపు ఓడించినంత పనిచేసిన ఆంధ్ర జట్టు రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్ ‘సి’లో మాజీ చాంపియన్ బరోడాతో శనివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లు రాణించారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి బరోడా జట్టు 90 ఓవర్లలో 7 వికెట్లకు 247 పరుగులు చేసింది. పేస్ బౌలర్ బండారు అయ్యప్ప 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... కార్తీక్ రామన్‌కు రెండు వికెట్లు దక్కాయి. విజయ్ కుమార్, భార్గవ్ భట్ ఒక్కో వికెట్ తీశారు. భారత జట్టు మాజీ సభ్యులు యూసుఫ్ పఠాన్ (1), ఇర్ఫాన్ పఠాన్ (0) విఫలమయ్యారు. ఓపెనర్ కేదార్ దేవ్‌ధర్ (93; 11 ఫోర్లు) త్రుటిలో సెంచరీని కోల్పోగా... విష్ణు సోలంకి (61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం స్వప్నిల్ సింగ్ (30 బ్యాటింగ్), అతీత్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్, యూపీతొలి రోజు ఆట రద్దు మరోవైపు సికింద్రాబాద్ జింఖానా మైదానంలో హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్ల మధ్య గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట రద్దయింది. రాత్రి కురిసిన వర్షం కారణంగా మైదానం అవుట్‌ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. -
శతక్కొట్టిన జడేజా, జాక్సన్
రాజ్‌కోట్: భారత జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో రవీంద్ర జడేజా దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో శనివారం ప్రారంభమైన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో తొలి రోజే జడేజా అజేయ సెంచరీ సాధించాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా (150 బ్యాటింగ్, 18 ఫోర్లు, 2 సిక్సర్లు)తోపాటు షెల్డన్ జాక్సన్ (181; 22 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఆరంభంలో జట్టు స్కోరు 59 పరుగులకే కీలకమైన రాబిన్ ఉతప్ప (37), చతేశ్వర్ పుజారా (13), పర్మర్ (8) వికెట్లను కోల్పోయిన సౌరాష్ట్రను జాక్సన్, జడేజా ఆదుకున్నారు. ఇద్దరు క్రీజులో నిలదొక్కుకున్నాక యథేచ్ఛగా బ్యాట్లను ఝుళిపించారు. ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్‌కు 281 పరుగులు జోడించిన అనంతరం జాక్సన్ నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన స్నేల్ పటేల్ (31 బ్యాటింగ్)తో కలిసిన జడేజా అబేధ్యమైన ఐదో వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. రసూల్, వసీమ్ రజా, దయాళ్, ముదాసిర్ తలా ఒక వికెట్ తీశారు. తొలిరోజు అశ్విన్ విఫలం త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడుకు చెందిన భారత అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి రోజు 24 ఓవర్లు వేసి ఒక వికెటే తీయగలిగాడు. ఆట నిలిచే సమయానికి త్రిపుర 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. స్మిత్ పటేల్ (99), యశ్పాల్ సింగ్ (96) సెంచరీలను చేజార్చుకున్నారు. కౌషిక్ ఘోష్ సెంచరీ: చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఓపెన ర్ కౌషిక్ ఘోష్ (114; 11 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రామన్ (94), ఛటర్జీ (58 బ్యాటింగ్) రాణించడంతో బెంగాల్ 2 వికెట్లకు 283 పరుగులు చేసింది. -
విజయాన్ని చేజార్చుకున్న ఆంధ్ర
చెన్నై: రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న బ్యాట్స్‌మన్ రెండో ఇన్నింగ్స్‌లో రాణించకపోవడంతో కేవలం 21 పరుగుల తేడాతో గెలుపును వదులుకుని మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 218 పరుగుల లక్ష్యఛేదనకు ఆట చివరిరోజు సోమవారం రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 41.4 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కేఎస్ భరత్ (86 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా, ప్రశాంత్ కుమార్ (33), రికీ భుయ్ (40) రాణించారు. చివర్లో కెప్టెన్ హనుమ విహారి (13), అశ్విన్ హెబర్ (20) ఒత్తిడిలో వికెట్లు కోల్పోయారు. తమిళనాడు బౌలర్లలో విఘ్నేశ్ 3 వికెట్లు దక్కించుకోగా, రవిచంద్రన్ అశ్విన్, రాహిల్ షా చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు 112/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తమిళనాడు జట్టుకు బాబా అపరాజిత్ (212 బంతుల్లో 108;10 ఫోర్లు), కెప్టెన్ అభినవ్ ముకుంద్ (200 బంతుల్లో 95; 7 ఫోర్లు), మురళీ విజయ్ (55) భారీ స్కోరును అందించారు. దీంతో తమిళనాడు 105 ఓవర్లలో 6 వికెట్లకు 350 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి 218 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్రకు నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగుల ఆధిక్యం సాధించిన ఆంధ్ర ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. తమిళనాడుకు ఒక పాయింట్ దక్కింది. మరోవైపు వర్షం కారణంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. -
ప్రశాంత్ చోప్రా ‘ట్రిపుల్’ సెంచరీ
ధర్మశాల: పంజాబ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బ్యాట్స్‌మన్ ప్రశాంత్ చోప్రా (363 బంతుల్లో 338; 44 ఫోర్లు, 2 సిక్స్‌లు) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆట రెండో రోజు హిమాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 148 ఓవర్లలో 8 వికెట్లకు 729 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తన ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 271తో బ్యాటింగ్ కొనసాగించిన ప్రశాంత్ 318 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పారస్ డోగ్రా (99) ఒక పరుగు తేడాతో సెంచరీని కోల్పోగా... అంకుశ్ బైన్స్ (80; 12 ఫోర్లు), రిషి ధావన్ (49; 7 ఫోర్లు) ప్రశాంత్‌కు సహకరించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. శనివారం తన పుట్టిన రోజు జరుపుకున్న 25 ఏళ్ల ప్రశాంత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో పుట్టిన రోజున ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. గతంలో ఎంసీసీ బ్యాట్స్‌మన్ కొలిన్ కౌడ్రీ (1962లో సౌత్ ఆస్ట్రేలియాపై 307), ఢిల్లీ క్రికెటర్ రమణ్ లాంబా (1995లో హిమాచల్‌ప్రదేశ్‌పై 312) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా రంజీ ట్రోఫీ చరిత్రలో ప్రశాంత్‌ది పదో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాకుండా ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి హిమాచల్‌ప్రదేశ్ బ్యాట్స్‌మన్‌గా అతను గుర్తింపు పొందాడు. గంభీర్, రాణా సెంచరీలు అస్సాంతో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (136 బ్యాటింగ్; 21 ఫోర్లు), ఐపీఎల్ స్టార్ నితీశ్ రాణా (110; 18 ఫోర్లు) సెంచరీలు చేశారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 269 పరుగులు చేసింది. అంతకుముందు ఇషాంత్ శర్మ (5/38) ధాటికి అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది. -
తమిళనాడును కట్టడి చేసిన ఆంధ్ర
చెన్నై: కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన ఆంధ్ర బౌలర్లు రంజీ ట్రోఫీ సీజన్లో తొలి రోజే ఆకట్టుకున్నారు. పటిష్టమైన తమిళనాడు జట్టుతో శుక్రవారం మొదలైన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది. మీడియం పేసర్లు యెర్రా పృథ్వీరాజ్ (3/39), బండారు అయ్యప్ప (2/31)లకు తోడుగా ఎడంచేతి వాటం స్పిన్నర్ భార్గవ్ భట్ (4/52) మాయాజాలంతో తమిళనాడు ఇన్నింగ్స్ తడబడింది. చెపాక్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు తరఫున భారత క్రికెటర్లు మురళీ విజయ్, అభినవ్ ముకుంద్, అశ్విన్ బరిలోకి దిగారు. 15 పరుగులకే ఓపెనర్లు మురళీ విజయ్, ముకుంద్‌లను కోల్పోయిన తమిళనాడు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మిడిల్ఆర్డర్లో బాబా అపరాజిత్ (51; 4 ఫోర్లు) కాస్త నిలదొక్కుకొని అర్ధసెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో మూడు ఓవర్లు ఆడి వికెట్ నష్టపోకుండా ఎనిమిది పరుగులు చేసింది. మరోవైపు వర్షం కారణంగా హైదరాబాద్, మహారాష్ట్ర జట్ల మధ్య తొలి రోజు ఆట రద్దయింది. ప్రశాంత్ చోప్రా డబుల్ సెంచరీ ధర్మశాలలో పంజాబ్ జట్టుతో మొదలైన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ జట్టు తొలి రోజే పరుగుల వర్షం కురిపించింది. ఓపెనర్ ప్రశాంత్ చోప్రా (289 బంతుల్లో 271 బ్యాటింగ్; 37 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ డబుల్ సెంచరీ చేయడంతో హిమాచల్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 459 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ప్రశాంత్‌కు జతగా పారస్ డోగ్రా (124 బంతుల్లో 99 బ్యాటింగ్; 11 ఫోర్లు, ఒక సిక్స్) క్రీజ్‌లో ఉన్నాడు. ►2 రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రశాంత్ చోప్రా (271) రెండో స్థానంలో నిలవడం విశేషం. 1948–49 సీజన్లో మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ బీబీ నింబాల్కర్ ఒకే రోజు 277 పరుగులు సాధించారు. చతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర–261) మూడో స్థానంలో ఉన్నాడు. -
చివరి రంజీలో నిరాశపరిచిన సచిన్
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ మ్యాచ్‌లో అభిమానుల్ని నిరాశపరిచాడు. తాజా రంజీ సీజన్లో హర్యానాతో ఆదివారం ఆరంభమైన మ్యాచ్‌లో ముంబయికి సచిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హర్యానాను ముంబై బౌలర్లు 134 పరుగులకు కుప్పకూల్చారు. అనంతరం ముంబై బ్యాటింగ్‌కు దిగడంతో సచిన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ముంబై ఓపెనర్లు ఇద్దరూ తొందరగా అవుటయ్యారు. ముంబై స్కోరు 32/2 వద్ద మాస్టర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. మాస్టర్ బ్యాటింగ్ చూసే సమయం ఆసన్నమైనందుకు అభిమానులు సంబరపడిపోయారు. సచిన్ వచ్చీరావడంతోనే ఓ ఫోర్ బాదాడు. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఏడో బంతికే పెవిలియన్ చేరాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో బౌల్డవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. త్వరలో వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ అనంతరం క్రికెట్ నుంచి వైదొలగనున్నట్టు సచిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్టర్ కెరీర్లో ఇదే చివరి రంజీ మ్యాచ్. రెండో ఇన్నింగ్స్‌లోనైనా సచిన్ అభిమానులను అలరిస్తాడేమో చూడాలి.