అశ్విన్‌ హెబ్బర్‌ సెంచరీ.. ఆంధ్ర 415 ఆలౌట్‌ | Ashwin Hebbar hundred Andhra team all out 415 | Sakshi
Sakshi News home page

Ranji Trophy: అశ్విన్‌ హెబ్బర్‌ సెంచరీ.. ఆంధ్ర 415 ఆలౌట్‌

Published Thu, Jan 19 2023 9:23 AM | Last Updated on Thu, Jan 19 2023 9:24 AM

Ashwin Hebbar hundred Andhra team all out 415 - Sakshi

సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు చేసింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ అశ్విన్‌ హెబ్బర్‌ (109; 12 ఫోర్లు, 1) సెంచరీ సాధించాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 256/5తో బుధవారం ఆట ప్రారంభించిన ఆంధ్ర 415 పరుగుల వద్ద ఆలౌటైంది. లలిత్‌ మోహన్‌ (32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (28; 3 ఫోర్లు) అండతో అశ్విన్‌ సెంచరీ చేశాడు.

సౌరాష్ట్ర బౌలర్లలో యువరాజ్‌ సింగ్, ధర్మేంద్రసింగ్‌ జడేజాలు చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సౌరాష్ట్ర ఆట నిలిచే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. షెల్డన్‌ జాక్సన్‌ (63 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఆంధ్ర బౌలర్‌ నితీశ్‌ కుమార్‌ (2/26)... హర్విక్‌ (8), చతేశ్వర్‌ పుజారా (5)లను వరుస ఓవర్లలో అవుట్‌ చేశాడు.
చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement