
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఆంధ్ర ఆఫ్‌స్పిన్నర్ త్రిపురణ విజయ్ (5/62) విజృంభించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజస్తాన్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజీత్ తోమర్ (188 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకం చేజార్చుకోగా... మానవ్ సుతార్ (104 బంతుల్లో 54; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకున్నాడు.
కెప్టెన్ మహిపాల్ లోమ్రర్ (2)తో పాటు కార్తీక్ శర (13), సమర్పత్ జోషి (8) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ 5 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు రెండు వికెట్లు తీశాడు. పృథ్వీ రాజ్, శశికాంత్, వినయ్ కుమార్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. ఓపెనర్లు వంశీకృష్ణ (23 బంతుల్లో 18 బ్యాటింగ్; 3 ఫోర్లు), శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 26 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది.
ఢిల్లీకి ఆడనన్న విజయ్..
కాగా శ్రీకాకుళంకు చెందిన త్రిపురణ విజయ్(Tripurana Vijay) తొలిసారి ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో విజయ్‌ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగొలు చేసింది. విజయ్, 9 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 23 వికెట్లు తీసి, 166 పరుగులు సాధించాడు. రంజీ, కూచ్‌బెహర్ ట్రోఫీల్లోనూ రాణించాడు. ప్రస్తుతం ముస్తాక్ అలీ టోర్నీలోనూ మంచిగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ అతడిని తమ జట్టులోకి తీసుకుంది.
చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Comments
Please login to add a commentAdd a comment