తిరువనంతపురం: పేస్ బౌలర్ చీపురపల్లి స్టీఫెన్ (5/27), స్పిన్నర్ ఆశిష్ (4/17) అద్భుత బౌలింగ్‌తో... రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో ఆంధ్ర జట్టు విజయంతో తమ లీగ్ దశను ముగించింది. ఉత్తరాఖండ్‌తో మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 36/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ను స్టీఫెన్, ఆశిష్ దెబ్బ తీశారు. వీరిద్దరి ధాటికి ఉత్తరాఖండ్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 65 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయి 101 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం 70 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (42 నాటౌట్; 7 ఫోర్లు), అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన షేక్ రషీద్ (20; 3 ఫోర్లు) రాణించారు. ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో ఆంధ్ర మొత్తం 9 పాయింట్లతో తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది.
చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ?
Comments
Please login to add a commentAdd a comment