uttara khand
-
ఘోర రోడ్డు ప్రమాదంలో యువతీ యువకులు మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్ : ఘోర రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పిల్లలు ప్రాణాలు పోయినా కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం హృదయ విదారకరంగా మారింది.మంగళవారం ఉదయం 1.30 గంటల సమయంలో డెహ్రడూన్‌లోని ఓఎన్జీసీ చౌక్ సమీపంలో యువతి యువకులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు భారీ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 25ఏళ్ల సిద్ధేష్ అగర్వాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సిద్దేష్ను స్థానిక సినర్జీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.అయితే రోడ్డు ప్రమాదంపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదు చేయలేదు. పైగా ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తప్పేమి లేదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కాంట్ పోలీస్ స్టేషన్ ఎస్సై కేసీ భట్ మాట్లాడుతూ.. ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే మేం కేసు ఎలా ఫైల్ చేస్తాం. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. వాహనం నడుపుతున్న కారు యజమాని ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుత చట్టం ప్రకారం ఈ కేసులో అతను బాధ్యత వహించలేడు. కాబట్టే ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎస్సై కేసీ భట్ వెల్లడించారు.కాగా, మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారు కాగా, ఒకరు చంబాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు యువతి యువకులు అర్థరాత్రి డ్రైవ్‌కు వెళ్లినట్లు సమాచారం.👉 చదవండి : చికెన్ బిర్యానీలో నిద్ర మాత్రలు..భర్తకు తినిపించిన భార్య.. ఆపై -
మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర.. ఇంతలోనే భారీ వర్షాలు!
ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరికొద్ది గంటల్లో చార్ధామ్ యాత్ర ప్రారంభం కానున్న నేపధ్యంలో ఈ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు. చార్ధామ్ యాత్ర మే 10 నుండి ప్రారంభంకానుంది. ఈ యాత్ర చేసేందుకు లక్షలాది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలకు తోడు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అల్మోరా-సోమేశ్వర్ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి. అల్మోరా-కౌసాని హైవేపై కొండచరియలు విరిగిపడటంతో గత 12 గంటలుగా ఈ రహదారిని మూసివేశారు. మారుతున్న వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఉత్తరాఖండ్‌లోని అల్మోరాతో పాటు, బాగేశ్వర్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఉత్తరకాశీలోని పురోలాలో భారీ వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వరద ముప్పు ఏర్పడింది. మే 13 వరకు ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇటువంటి వర్షాల సమయంలో ట్రెక్కింగ్ చేయవద్దని టూరిస్టులకు వాతావరణశాఖ తెలిపింది. తాజాగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రుతుపవన విపత్తుల నివారణ, చార్ధామ్ యాత్ర నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. -
‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం?
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. అంటే ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బిల్లుకు స్వాగతం పలికారు. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఇంకా చర్చల దశలోనే ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ ఏ మతంపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు ఉత్తరాఖండ్‌లో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలైన పక్షంలో హిందూ వివాహ చట్టం (1955), హిందూ వారసత్వ చట్టం (1956) తదితర ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)పై కూడా దీని ప్రభావం పడనుంది. ముస్లింలు ప్రస్తుతం ముస్లిం పర్సనల్ (షరియత్) అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలువుతోంది. దీనిలో వివాహం, విడాకులు తదితర నియమాలు ఉన్నాయి. అయితే యూసీసీ అమలైతే బహుభార్యత్వం, హలాలా తదితర పద్ధతులకు ఆటకం ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 13.95 శాతం ఉంది. సిక్కు కమ్యూనిటీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో సిక్కు జనాభా 2.34%. ఆనంద్ వివాహ చట్టం 1909 సిక్కుల వివాహాలకు వర్తిస్తుంది. అయితే ఇందులో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో విడాకుల కోసం సిక్కులకు హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది. అయితే యూసీసీ అమలులోకి వచ్చిన పక్షంలో అన్ని వర్గాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు కావచ్చు. క్రైస్తవులు క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు కూడా ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా 1925 వారసత్వ చట్టం ప్రకారం క్రైస్తవ మతంలోని తల్లులకు వారి మరణించిన పిల్లల ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అయితే యూసీసీ రాకలో ఈ నిబంధన ముగిసే అవకాశం ఉంది. ఆదివాసీ సముదాయం ఉత్తరాఖండ్‌లోని గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదు. ఉత్తరాఖండ్‌లో అమలు కాబోయే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఇందులోని నిబంధనల నుండి గిరిజన జనాభాకు మినహాయింపు ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో గిరిజనుల జనాభా 2.9 శాతంగా ఉంది. -
UCC Bill: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. యూసీసీపై బిల్లును తీసుకురావడానికి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ రోజు (మంగళవారం) రెండవ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పోర్చుగీస్ పాలనా కాలం నుండి గోవాలో యూసీసీ అమలులో ఉంది. యూసీసీ కింద వివాహం, విడాకులు, భరణం, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన చట్టాలు రాష్ట్రంలోని పౌరులందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తాయి. మంగళవారం సభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు. యూసీసీ గురించి ఇటీవల మాట్లాడిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దీనివలన అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. బిల్లుపై సభలో సానుకూలంగా చర్చించాలని ఇతర పార్టీల సభ్యులను అభ్యర్థించారు. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ ముసాయిదాను ఆమోదించి, ఫిబ్రవరి 6న బిల్లుగా సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. నాలుగు సంపుటాలలో 740 పేజీలతో కూడిన ఈ ముసాయిదాను సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రికి సమర్పించింది. 2022లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూసీసీపై చట్టం చేసి, రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. 2000లో ఏర్పడిన ఉత్తరాఖంఢ్‌లో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. 2022 మార్చిలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో యూసీసీ అమలుపై హామీనిచ్చింది. కాగా మంగళవారం అసెంబ్లీలో యూసీసీపై చర్చ జరగనున్న సందర్భంగా అవాంఛనీయ పరిస్థితులు చోటు చేసుకుంటే, వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం. -
2023లో విపత్తులకు నిలయమైన రాష్ట్రం ఏది?
2023 ఉత్తరాఖండ్‌కు ప్రమాదాల సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో పలు భారీ ప్రమాదాలు జరిగాయి. 2023 ప్రారంభం నుండి చివరి వరకు ఏదో ఒక విపత్తు చోటుచేసుకుంటూనే ఉంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌కు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. ఏడాది ప్రారంభంలోనే జోషిమఠ్‌లో భూమి కుంగిపోయిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. 2023 జనవరిలో చమోలి జిల్లా జోషిమఠ్‌లోని ఇళ్లు, రోడ్లకు అకస్మాత్తుగా భారీ పగుళ్లు కనిపించాయి. కుంగిపోతున్న జోషిమఠ్ అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ వార్త దేశ విదేశాల్లో కూడా పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లోని చమోలీలో నమామి గంగే ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా విద్యుదాఘాతానికి గురై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి హైవేపై నుంచి బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. దీపావళి రోజున ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు వారిని 17 రోజుల తరువాత ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం చూతము రారండి! -
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. పాఠశాలలోనే అరుదైన ఘనత!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లికి ముందు జరిగిన కాక్టైల్, మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మొత్తానికి మెగా కోడలిగా హైదరాబాద్‌లో అడుగు పెట్టబోతోంది. (ఇది చదవండి: లావణ్య అక్కా.. నీ పెళ్లికి చిరంజీవి వస్తాడా?.. ఇప్పుడదే నిజమైంది!) ఈ నేపథ్యంలో లావణ్య గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990లో ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని ఫైజాబాద్‌లో జన్మించింది. యూపీలో పుట్టినప్పటికీ ఆమె విద్యాభ్యాసం అంతా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం ముంబయి చేరుకున్న లావణ్య రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం మోడలింగ్‌లో అడుగుపెట్టిన లావణ్య.. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. అయితే ముంబైకి వెళ్లే ముందే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని మార్షల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె పాఠశాలలో ఉన్నప్పుడే 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌ను గెలుచుకుంది. లావణ్య తండ్రి న్యాయవాది కాగా.. ఆమె తల్లి రిటైర్డ్ టీచర్. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక సోదరి కూడా ఉన్నారు. ఒకప్పుడు మిస్ ఉత్తరాఖండ్.. ఇప్పుడు మెగా కోడలిగా తెలుగువారికి మరింత దగ్గరైంది. వరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమర్‌పై మళ్లీ విషం కక్కిన శివాజీ) -
రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని..
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తన ముక్కుపచ్చలారని ఇద్దరు కుమార్తెల ప్రాణం తీశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన డెహ్రాడూన్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని డోయీవాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ పిల్లల అమ్మమ్మ అల్లుని ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేశవ్పురి డోయివాలా నివాసి ఆశుదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన చిన్న కుమార్తె రీనాకు ఐదేళ్ల క్రితం జితేంద్రతో వివాహమయ్యిందని పేర్కొంది. తరువాత వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారని, వారు ప్రస్తుతం పాలు తాగే వయసులో ఉన్నారని తెలిపింది. జితేంద్ర తన భార్య రీనాను తరచూ కొడుతుండేవాడు. కొన్నాళ్ల పాటు ఆమె భర్త పెట్టే బాధలను భర్తిస్తూ వచ్చింది. కొంతకాలం తరువాత పిల్లలను తండ్రి వద్దనే వదిలేసి, రీనా హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో జితేంద్ర మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి పిల్లలు అడ్డు వస్తున్నారని భావించాడు. పిల్లలను అంతమెందించి మరో వివాహం చేసుకోవాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలకు అన్నం తినిపించి పడుకోబెట్టాడు. అర్థరాత్రి ఆ చిన్నారుల గొంతు నులిమి హత్య చేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారులు మృతి చెందివుండటాన్ని గుర్తించిన వారి అమ్మమ్మ డోయీవాలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు గురించి ఎస్ఎస్ఐ రితేష్ షా మాట్లాడుతూ మృతిచెందిన చిన్నారుల అమ్మమ్మ తన అల్లుడే ఈ హత్య చేశాడని ఆరోపిస్తున్నదని తెలిపారు. కాగా చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. నిందుతుని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతనిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: ఛాతీలో చాకు దిగబడి లివ్ ఇన్ పార్ట్నర్ మృతి.. -
ఆర్మీ పరికరాలు , అస్త్రాలకు ఆయుధ పూజ చేసిన రాజ్ నాథ్ సింగ్
-
4 క్షేత్రాలు.. 40 కష్టాలు
చార్ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు దర్శనాలు రద్దు కావడంతో ఇప్పుడు పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. కొండదారుల్లో అత్యంత క్లిషమైన ప్రయాణం సాగించడమే కాకుండా మంచు, చలి, ప్రకృతి పరంగా అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం పూట కేవలం 5 డిగ్రీల ఉష్ఞొగ్రత, రాత్రిపూట మైనస్ డిగ్రీల ఉష్ఞొగ్రతలు నమోదు కావడంతో భక్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గత రెండు రోజులుగా 39 భక్తులు మృతి చెందడమే ఇందుకు ఉదాహరణ. ఈ పుణ్యక్షేత్రాల ప్రయాణంలో వసతి సౌకర్యాలు లేకపోతే ఆ కష్టాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల కంటే ఎత్తున క్షేత్రాలు ఉండటంతో తక్కువ స్థాయిలో ఆక్సిజన్ లభ్యమవుతుంది. దాంతో గతంలో కోవిడ్ వచ్చిన భక్తులు ఆకస్మికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యాత్రలకు రోజూ 20వేల మంది పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లకు క్లిష్టంగా మారింది. కొండలపై సౌకర్యం ఉన్నది కేవలం 5వేల మందికే కావడంతో భారీ సంఖ్యలో వస్తున్న భక్తులకు ఏర్పాట్లు చేయలేమంటున్నారు అధికారులు. అత్యంత క్లిషమైన ప్రయాణం కేదార్నాథ్ ఈ యాత్రల్లో కేదార్నాథ్ అత్యంత క్లిషమైంది. గౌరీఖుండ్ నుంచి కేదార్ నాథ్‌కు 18 కి.మీ ట్రెక్కింగ్ సౌకర్యం ఉన్నా, ట్రెక్కింగ్ సమయంలో హైబీపీ, గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. పరిస్థితి తీవ్రం కావడంతో 132 మంది డాక్టర్లను ఉత్తరాఖాండ్ ప్రభుత్వం రంగంలోకి దించింది. అదే సమయంలో ముందస్తు ఏర్పాట్లు లేనిదే చార్ధామ్ యాత్రకు రావద్దని ప్రభుత్వం అంటోంది. సరిపడా అందుబాటులో లేని రవాణా సౌకర్యాలతో పాటు, హరిద్వార్-రుషికేష్ మధ్య వాహనాలు భారీగా నిలిచిపోవడం అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారింది. రుద్ర ప్రయాగ నుంచి అన్ని రూట్లలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటంతో అధికారులకు తలనొప్పిగా మారింది. -
చెలరేగిన స్టీఫెన్, ఆశిష్.. ఆంధ్ర ఘన విజయం
తిరువనంతపురం: పేస్ బౌలర్ చీపురపల్లి స్టీఫెన్ (5/27), స్పిన్నర్ ఆశిష్ (4/17) అద్భుత బౌలింగ్‌తో... రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఇ’లో ఆంధ్ర జట్టు విజయంతో తమ లీగ్ దశను ముగించింది. ఉత్తరాఖండ్‌తో మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 36/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఉత్తరాఖండ్‌ను స్టీఫెన్, ఆశిష్ దెబ్బ తీశారు. వీరిద్దరి ధాటికి ఉత్తరాఖండ్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 65 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయి 101 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 70 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (42 నాటౌట్; 7 ఫోర్లు), అండర్–19 ప్రపంచకప్‌లో భారత్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన షేక్ రషీద్ (20; 3 ఫోర్లు) రాణించారు. ఒక విజయం, ఒక ‘డ్రా’, ఒక ఓటమితో ఆంధ్ర మొత్తం 9 పాయింట్లతో తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. చదవండి: Pak vs Aus: ఒకవైపు వార్న్ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్ ? -
సీఎం కోడ్ ఉల్లంఘన? ఆయన భార్య ఏమన్నారంటే..
పోలింగ్ సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలు తెరపైకి వచ్చే సంగతి తెలిసిందే. సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే ఇప్పుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆయన భార్య వెనకేసుకొచ్చిన తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి తన నియోజకవర్గం ఖతిమాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వేయడానికి వెళ్లిన టైంలో.. బీజేపీ కాషాయపు కండువాలు మెడలో ధరించి ఉన్నారు. అంతేకాదు దుస్తులపై కమలం గుర్తులు కూడా ఉన్నాయి. అనంతరం ఓటు వేశాక.. వాళ్లు గుర్తులను ప్రదర్శించడం ద్వారా ప్రచారం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం.. మాన్యువల్ పోస్టర్లు, జెండాలు, చిహ్నాలు, మరేదైనా ప్రచార సామగ్రిని పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రదర్శించకూడదు. కానీ, పుష్కర్, ఆయన భార్య పార్టీ కండువాలు, గుర్తులు ధరించడమే కాదూ.. కార్యకర్తలతో పోలింగ్ టైంలోనూ ప్రచారం నిర్వహించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఆరోపణలపై పుష్కర్ భార్య గీతను ఓ జాతీయ మీడియా ప్రశ్నించగా.. ‘ఇది ప్రచారం అని ఎవరన్నారు?. ప్రతీ ఎన్నికల్లోలాగే.. ఈసారి ఎంత ఓటింగ్ నమోదు అవుతుందో చూడడానికే వచ్చాం. ప్రతీ పార్టీకి చెందిన వాళ్లూ ఇలా పార్టీ సింబల్స్‌ను ధరించే ఉన్నారు. అయినా ప్రజలు ఆల్రెడీ ఓటేయడానికి సిద్ధమై వస్తారు. ఇలాంటివి వాళ్లను ఎందుకు ప్రభావితం చేస్తాయి? అని బదులిచ్చారు ఆమె. మరోవైపు ఆ సమయంలో బీజేపీ హడావిడి తప్ప అక్కడేం కనిపించలేదు. అయినా పోలింగ్ సిబ్బంది, ఎన్నికల బందోబస్తుకు వచ్చిన పోలీసులు వాళ్లను అడ్డుకోలేదన్న పలువురు ఓట్లర్లు చెప్పడం గమనార్హం. खटीमा में ये क्या हो रहा है?@pushkardhami चुनाव प्रचार खत्म होने के बाद खुलेआम पैसे बाँट रहे हैं। खटीमा से आम आदमी पार्टी के प्रत्याशी @sskaleraap ने खुद धामी को रंगे हाथों पकड़ा तो धामी ने कैमेरा बंद कराने की कोशिश की।@ECISVEEP व @UttarakhandCEO जल्द इसका संज्ञान लें। pic.twitter.com/oLpuKV7UkX — Aam Aadmi Party Uttarakhand (@AAPUttarakhand) February 13, 2022 ఇదిలా ఉండగా.. మరోవైపు ఎన్నికల ప్రచారం పేరిట డబ్బులు పంచారంటూ ఆప్ ఏకంగా ఉత్తరాఖండ్ సీఎంపైనే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉత్తరాఖండ్ ఆప్ యూనిట్ ట్విటర్లో ఓ వీడియోను సైతం పోస్ట్ చేయగా...ఈసీ చర్యలేవంటూ? పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ సమయం గంట పొడిగింపు! దేశంలోనే తొలిసారిగా..
ఉత్తరాఖండ్: వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌కు గంటపాటు ఆదనంగా సమయాన్ని కేటాయిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుషీల్ చంద్ర శుక్రవారం ప్రకటించారు. కరోనా ఉధృతి కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం కష్టతరంగా మారిందని, అందుకే దేశంలోనే తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో అసెంట్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఐతే ఓటింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తున్నట్లు ఈ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుషీల్ చంద్ర మీడియాకు తెలిపారు. దీనితో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. చంద్ర వెంట ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఉన్నారు. ఐతే రాష్ట్రవ్యాప్తంగా 601 మైదానాలు, 277 భవనాలను గుర్తించామని, వీటిల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎన్నికల సమావేశాలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు వాటిని బుక్ చేసుకునేందుకు వీలుగా, వీటికి సంబంధించిన వివరాలు త్వరలో ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ బుకింగ్‌లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన మాత్రమే చేయబడతామని సుషీల్ చంద్ర సూచించారు. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ?
పుణ్య క్షేత్రాలకు, పురాతన దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. ఐతే మన దేశ అగ్రభాగంలో ఉన్న ఓ నది మాత్రం పుణ్యక్షేత్రం కానప్పటికీ దానిని చూసేందుకు వేలల్లో జనాలు వెళ్తుంటారు. కాకపోతే ఆ నదిలో నీళ్లతోపాటు, పైన తేలే అస్థిపంజరాలు కూడా ఉంటాయి. దీని వెనుక దాగి ఉన్న మిస్టరీ ఎంటో తెలుసుకుందాం.. ఏడాదంతా మంచులోనే.. అదికరిగిందంటే మాత్రం.. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోనే ఉందీ నది. రూప్‌ఖండ్ నది అని దీనికి పేరు. ఇది సముద్ర మట్టానికి 5029 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏడాదిలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుందీ నది. కానీ మంచు కరిగిపోగానే అక్కడి వాతావరణం అంతా కూడా భయానకంగా మారిపోతుంది. వందలాది అస్థిపంజరాలతో చూసేందుకు అత్యంత భీభత్సంగా ఉంటుంది. ఈ అస్థిపంజరాలను మొదటిసారిగా 1942లో బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ గుర్తించారు. ఐతే ఎన్నో యేళ్లుగా ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు సాగాయి. ఎవరెవరేం చేప్పారంటే.. జనరల్ జోరావర్ సింగ్ సైన్యమేనా.. ఈ అస్థిపంజరాలు కాశ్మీర్‌కు చెందిన జనరల్ జోరావర్ సింగ్ సైన్యానికి సంబంధించినవని అక్కడి స్థానికులు నమ్ముతారు. 1841లో టిబెట్ యుద్ధం నుండి తిరిగి వస్తుండగా, మంచు తుఫానులో చిక్కుకుని హిమాలయ ప్రాంతం మధ్యలో తప్పిపోయి మరణించారనే కథనం ప్రచారంలో ఉంది. చదవండి: Interesting Facts About Death: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. మంచు తుఫానే కారణమా.. కనౌజ్ రాజా జస్ధావల్, అతని భార్య బలంప, అతని సేవకులు, నృత్య బృందంతో కలిసి నందా దేవి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు పెద్ద మంచు తుఫాను కారణంగా పూర్తి సమూహం మరణించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవం ఏమిటీ? ఐతే 2014 శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ఫ్రోజెన్ లేక్‌లో ఉన్న మొత్తం 200 అస్థిపంజరాలు 9వ శతాబ్ధానికి చెందినవ భారత తెగకు చెందినవని, భారీ వడగండ్లవానలో వీరంతా మరణించారని తేల్చింది. దీనితో దీనివెనుక దాగిన మిస్టరీ వీడింది. పాపం.. అంత పెద్ద వడగండ్లు తగిలి.. మృతుల తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగలడం మూలంగా వీరంతా మరణించారని, బహుశా క్రికెట్ బాల్ సైజు వడగళ్ళు కురిసి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఐతే వారి శరీర ఇతర భాగాలపై ఎటువంటి గాయాలు కనుబడలేదట. దీంతో ఎటువంటి యుద్ధం గానీ, ఆయుధాల ప్రమేయంగానీ లేకుండా జరిగిన ప్రమాదమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ప్రతీయేట ఈ మిస్టీరియస్ రూప్‌ఖండ్ నదిని చూసేందుకు వేలాదిమంది పర్యాటకులు, సాహసికులు వస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, చూపరులకు అందమైన అనుభూతిని కలిగించినప్పటికీ, నదిలో తేలుతున్న అస్థిపంజరాల భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు మాత్రం వారి వెన్నులో వణుకు ప్రారంభమౌతుంది..!! చదవండి: Coffee and Alzheimer's Disease: మతిమరుపుతో బాధపడుతున్నారా? కాఫీతో మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి.. -
ఉత్తరాఖండ్ లో కూలిన బిల్డింగ్
-
మహిళపై అత్యాచారం.. ఆపై వివాహం.. కొండపై తీసుకెళ్లి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహల కారణంగా కట్టుకున్న భార్యను హింసించి.. కొండపై నుంచి తోసేసి హత్యచేశాడో ప్రబుద్ధుడు. ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన ఉధామ్‌సింగ్ నగర్ జిల్లాలో జరిగింది. కాగా, 24 ఏళ్ల రాజేష్‌రాయ్ అనే యువకుడు సెల్స్‌మెన్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో అతడు, గతేడాది 29 ఏళ్ల బబిట అనే మహిళను అత్యాచారం చేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే, బబిటా తనను వివాహం చేసుకుంటే.. ఫిర్యాదు వెనక్కు తీసుకుంటానని చెప్పింది. దీంతో, రాజేష్ రాయ్, బబిటను గతేడాది పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులపాటు వీరి వివాహబంధం సాఫీగానే కొనసాగింది. కాగా, గత కొంత కాలంగా రాజేష్ రాయ్, బబిటను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు. భార్యభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. ఈక్రమంలో, భర్త పోరు పడలేక బబిట ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో గత నెల జూన్ 11న రాయ్ పుట్టింటికి వెళ్లి తన భార్యను తెచ్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బబిట ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. రాజేష్‌రాయ్‌ను బబిట గురించి ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి బంధువులు రాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. రాజేష్ రాయ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. దీంతో బబిటను నైనిటల్ కొండపై తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసినట్లు.. రాయ్ పోలీసుల విచారణంలో అంగీకరించాడు. కాగా, కొండ ప్రాంతంలో బాధిత మహిళ మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నామని ఉత్తరాఖండ్ పోలీసులు తెలిపారు. -
నాన్న వస్తాడని ఎదురుచూస్తోంది.. బతికిలేరన్న నిజం తెలిస్తే!
హరిద్వార్: కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను తలకిందులు చేసింది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మనిషిని మాయదారి రోగానికి కోల్పోతే ఆ బాధను వర్ణించడం కష్టం. అలాంటి వారిలో కెప్టెన్ హరీష్ తివారి ఒకరు.. కరోనాతో పోరాడుతూ ఇటీవలే ప్రాణాలు కోల్పోయారు. నాన్నపై పంచ ప్రాణాలు పెట్టుకున్న ఆ కూతురు.. నాన్న వస్తాడనే ఆశతో ఎదురుచూస్తుంది.. కానీ నాన్న రాడన్న విషయం తెలిస్తే ఆ చిన్ని గుండె ఏమవుతుందో తలుచుకుంటేనే భయమేస్తుంది. హరిద్వార్‌కు చెందిన హరీష్ తివారికి పైలట్ అవ్వాలని కోరిక బలంగా ఉండేది. చిన్నప్పటి నుంచి విమానాలను నడపాలనే ఆకాంక్షతో ఏవియేషన్ ఇంజనీరింగ్ కోర్సు కంప్లీట్ చేసి పైలట్ అయి కోరికను నెరవేర్చుకున్నారు. అలా 2016లో ఎయిర్ ఇండియాలో పైలట్‌గా జాయిన్ అయ్యారు. కొద్దిరోజుల్లోనే మంచి పేరు తెచ్చుకొని కెప్టెన్ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత మృదుస్మిత దాస్ అనే యువతితో వివాహం జరిగింది. మరుసటి సంవత్సరమే వారి జీవితంలో మహాలక్ష్మి అడుగుపెట్టింది. అలా జీవితం హాయిగా సాగిపోతున్న దశలో కరోనా ఆ కుటుంబాన్ని చిదిమేసింది. హరీష్ కుటుంబం మొత్తం కరోనా బారీన పడింది.. వారి కూతురు తప్ప. అయితే కుటుంబం కోలుకున్నా.. హరీష్ మాత్రం ఆ మహమ్మారితో పోరాడుతూ పది రోజుల క్రితం కన్నుమూశారు. ఆయన కరోనాతో మృతి చెందడం.. హరీష్ తల్లిదండ్రులు వృద్దులు కావడంతో అతని భార్య మృదుస్మిత అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఐదేళ్ల కూతురికి నాన్న చనిపోయిన విషయం తెలియకపోవడంతో ఆసుపత్రిలో ఉన్న నాన్న ఏ రోజైనా ఇంటికి వస్తాడని ఆశగా ఎదురుచూస్తుంది. ఇదే విషయమై మృదుస్మిత దాస్ మాట్లాడుతూ.. '' పది రోజుల క్రితం నా భర్త కరోనాతో కన్నుమూశారు.. ఆయనకు జరగాల్సిన అంత్యక్రియలు నేనే దగ్గరుండి పూర్తి చేశాను. నా ఐదేళ్ల కూతురికి ఆయన కరోనా బారీన పడ్డారన్న విషయం తెలుసు.. ఆసుపత్రిలో ఇంకా ఎన్నిరోజులు ఉంటారమ్మ అని అడుగుతుంది.ఆయన లేరన్న విషయం తెలిస్తే నా కూతురి పరిస్థితి ఏమవుతుందో.. హరీష్ తల్లిదండ్రులు రిటైర్డ్ ఉద్యోగులు.. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది..'' అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే హరీష్ తివారి ఒక్కరే కాదు.. ఇప్పటివరకు ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 17 మంది పైలట్లు ఏడాది వ్యవధిలోనే కరోనాతో కన్నుమూశారు. అందులో 13 మంది ఫిబ్రవరి 2021 నుంచి మహమ్మారికి బలవ్వడం దురదృష్టకరం. చదవండి: అయ్యో.. మళ్లీ రోడ్డు పక్కకే... ‘బాబా కా దాబా’ కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు -
హృదయవిదారకం: కరోనా మృతదేహాలను పీక్కుతింటున్నాయి
డెహ్రాడూన్: కరోనా వైరస్ మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధి కావడంతో ప్రతీ ఇంట్లోనూ కరోనా వచ్చిన వారిని దూరంగా ఉంచుతున్నారు. అలా కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంగతి వర్ణనాతీతం. కరోనాతో ఒక వ్యక్తి చనిపోతే.. ఆ ఇంటి కుటుంబసభ్యులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి కూడా భయపడుతున్నారు. వారికి ఎక్కడ సోకుతుందో అని భయపడి దూరంగా ఉండే వారికి అంతిమ సంస్కారాలు కానిస్తున్నారు. తాజాగా కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసి అక్కడి స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర కాశీలోని భాగీరథీ నదీ తీర ప్రాంతంలోని కేదార్ ఘాట్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. కరోనాతో మృతి చెందినవారికి భాగీరథీ నదీ తీరంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం కొన్ని మృతదేహాలను ఖననం చేస్తుండగా.. మరికొన్నింటిని చితి పేర్చి కాలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని మృతదేహాలు సగం మాత్రమే కాలినా వాటిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. దీంతో వీధి కుక్కుల అక్కడికి చేరుకొని సగం కాలిన శవాల శరీర బాగాలను పీక్కు తింటున్నాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా ఒక వ్యక్తి ఈ ఘటనపై స్పందిస్తూ.. ''ఇది చాలా హృదయవిదారకం.. భాగీరథి నదీ తీరానా సగం కాలిన శవాలను కుక్కుల పీక్కు తింటుంటే నా మనసు చెమ్మగిల్లింది. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీటిమట్టం పెరిగింది. దీంతో మృతదేహాల ఒడ్డుకు కొట్టుక వస్తున్నాయి. వీధి కుక్కలు ఆ శవాలను పీక్కుతింటున్నాయి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆ మృతదేహాలు కరోనా సోకినవారివైతే వ్యాధి మరింత వ్యాపించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: 'నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం' Uttarakhand | Residents claim that dogs are eating half-burnt COVID bodies at Kedar Ghat, Uttarkashi. After receiving complaints from locals, we have assigned a person at Kedar Ghat for cremation of half-burnt bodies: Municipality president Ramesh Semwal pic.twitter.com/9IvC9ysC6O — ANI (@ANI) June 1, 2021 -
కరోనా పరీక్షలు చేస్తామన్నారు.. అడవిలోకి పారిపోయారు
డెహ్రడూన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పుటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని ఒక గిరిజన గ్రామ నివాసితులకు కోవిడ్-19 పరీక్షలను నిర్వహించడానికి జిల్లా ఆరోగ్య కార్యకర్తల బృందం వెళ్లినప్పుడు సమీపంలోని అడవికి పరిగెత్తారు. కరోనా పరీక్ష చేయించుకుంటే తమకు సోకుతుందని గ్రామస్తులు భయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ గ్రామంలో బన్రావాట్స్ నివసిస్తున్నారని, వీరు ఆదిమ తెగ వాసులని అధికారులు పేర్కొన్నారు. ఇక దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,73,790 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కి చేరింది. ఇందులో 22,28,724 యాక్టివ్ కేసులు ఉండగా, 2,51,78,011 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 3617 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,22,512కి చేరుకుంది. నిన్న కొత్తగా 2,84,601 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా? -
Kumbh Mela IG: ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనడం సరికాదు
డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో మహా కుంభమేళా స్నానాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై శనివారం కుంభమేళా నిర్వహణ అధికారి సంజయ్ గుంజ్వాల్ వివరణ ఇచ్చారు. గంగానదిలో స్నానాలు చేసిన వారిని కోవిడ్-19 "సూపర్-స్ప్రెడర్" అని పిలవడం సరికాదన్నారు. హరిద్వార్‌లో జనవరి 1 నుంచి నిర్వహించిన 8.91 లక్షల ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో కేవలం 1,954 (0.2 శాతం) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కుంభమేళా డ్యూటీలో పాల్గొన్న 16,000 మంది పోలీసు సిబ్బందిలో కేవలం 88 (0.5శాతం) మంది కరోనా బారిన పడినట్టు ఆయన తెలిపారు. కుంభమేళా ప్రారంభం నుంచి ముగిసే వరకు హరిద్వార్ వ్యాప్తంగా కోవిడ్ డేటాను శాస్త్రీయంగా విశ్లేషిస్తే ఈ విషయాలు తెలిసినట్టు పేర్కొన్నారు. ‘సూపర్ స్ప్రెడర్’’ కుట్ర కుంభమేళాపై ‘‘సూపర్ స్ప్రెడర్’’ అనే అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం జరిగినట్టు గుంజ్వాల్ మీడియాకు తెలిపారు. ఇక ఏప్రిల్ 1 నాటికి హరిద్వార్‌లో 144 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. కుంభమేళా నిర్వహణ కాలం ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 55.55 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా..అందులో 17,333 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి మార్చి నుంచే భక్తుల తాకిడి మొదలైందని, మహాశివరాత్రికి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని మేళా ఐజీ సంజయ్ గుంజ్యాల్ అన్నారు. ఈ సంవత్సరం కుంభంమేళా నిర్వహణ కాలంలో భక్తులు మూడు సార్లు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సమయంలో 34.76 లక్షల మంది భక్తులు గంగానదిలో స్నానాలు చేశారు. ఏప్రిల్ 12 (సోమావతి అమావాస్య)రోజున 21 లక్షల మంది, ఏప్రిల్ 14 (మేష్ సంక్రాంతి)నాడు 13.51 లక్షల మంది, ఏప్రిల్ 27( చైత్ర పూర్ణిమ) రోజున 25,104 మంది గంగానదిలో పవిత్ర స్నానాలు చేసినట్టు ఆయన తెలిపారు. (చదవండి: సెకండ్ వేవ్: దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు) -
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్; నేలమీద హరివిల్లు
రోజెస్ ఆర్ రెడ్... వయొలెట్స్ ఆర్ బ్లూ... పిల్లలకు రంగులను పరిచయం చేసే ఈ గేయానికి రూపం వస్తే ఎలా ఉంటుంది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లా ఉంటుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దాదాపుగా 90 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉంది. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే జూలై –ఆగస్టు నెలల్లో వెళ్లాలి. జూన్ నుంచి అక్కడక్కడా పూలు కనిపిస్తాయి. కానీ లోయ మొత్తం పూల తివాచీలా కనిపించేది జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు మాత్రమే. ఇది అద్భుతమైన టెక్కింగ్ జోన్. గోవింద్ ఘాట్ నుంచి సుమారు 15 కిలోమీటర్లు నడిస్తే కానీ చేరుకోలేం. అందుకే రెండు రోజుల ట్రెకింగ్ ప్లాన్ చేసుకోవాలి. మొదటి రోజు ట్రెక్‌లో హిమాలయాల సౌందర్య వీక్షణంలోనే సాగుతుంది. ఇక్కడ మంచు మెల్లగా మబ్బు తునకలుగా ప్రయాణించదు. తెరలు తెరలుగా గాలి దుమారంలాగ వేగంగా కదులుతుంటుంది. మాట్లాడడానికి నోరు తెరిస్తే నోట్లో నుంచి ఆవిరి వస్తుంది. సుమఘుమలు రెండవ రోజు ట్రెకింగ్‌లో పూల ఆనవాళ్లు మొదలవుతాయి. ముందుకు వెళ్లే కొద్దీ పుష్పావతి లోయ రంగురంగుల హరివిల్లును తలపిస్తుంది. ఈ లోయను పూర్వకాలంలో పుష్పావతి లోయగా పిలిచేవారు. ఇక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయంటే లెక్క చెప్పడం కష్టమే. కేవలం ఈ లోయలో మాత్రమే ఉండే పూల రకాలు ఐదు వందలకు పైగా ఉన్నట్లు ఇక్కడ రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్ చంద్ర ప్రకాశ్ ‘ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్: మిత్స్ అండ్ రియాలిటీ’లో రాశారు. ఇక్కడ పుష్పావతి నది ప్రత్యేక ఆకర్షణ. తిప్రా గ్లేసియర్ కరిగి గౌరీ పర్బత్ మీదుగా జాలువారి నది రూపం సంతరించుకుంటుంది. పుష్పావతిలోయలో ప్రవహిస్తుండడంతో దీనికి పుష్పావతి నది అనే పేరు స్థిరపడిపోయింది. ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని నేషనల్ పార్కుగా ప్రకటించి పరరక్షిస్తోంది. యునెస్కో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చింది. మృగాల్లేవు... మునుల్లేరు! ఇక్కడ హిమాలయ పర్వతాలు 3350 మీటర్ల నుంచి 3650 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఎలుగుబంటి, నక్క, మంచులో తిరిగే చిరుత వంటి కొన్ని అరుదైన జంతువులుంటాయి. కానీ పర్యాటకుల తాకిడితో అవి ట్రెక్కింగ్ జోన్ దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. మునులు ఈ ప్రశాంత వాతావరణంలో తపస్సు చేసుకునే వారని, ఇప్పుడు మునులు కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతారు. పర్వత ప్రదేశాల్లో కనిపించే అరుదైన పక్షులు మాత్రం ఇప్పటికీ స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఈ టూర్లో పూలతోపాటు ఆకాశంలో ఎగిరే పక్షులను చూడడం మర్చిపోవద్దు. -
ఉత్తరఖండ్ లో వరదలు బీభత్సం
-
ఇద్దర్నే ఎందుకు కన్నారు మరి: మరో వివాదంలో సీఎం
సాక్షి, డెహ్రాడూన్: ఇటీవల సీఎం పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ నేత, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. 'రిప్డ్ జీన్స్' అంటూ మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న తీరత్ సింగ్, అమెరికా, మన దేశాన్ని 200 ఏళ్లు పాలించిందంటూ వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. వీటిన్నింటికి మించి తాజాగా మరో వివాదానికి తెరతీశారు. కోవిడ్ మహమ్మారి మధ్య తమను తాము పోషించుకోవడానికి కష్టపడుతున్న పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు పంపిణీ చేసే కేంద్ర ప్రభుత్వ పథకం నుండి ఎక్కువ లబ్ది పొందాలంటే 20 మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాదు ఇద్దరు పిల్లలున్న మీరెందుకు అసూయపడతారు.. ఇరవైమందిని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. అటవీ దినోత్సవం సందర్బంగా రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంతో ఉత్తరాఖండ్ సీఎం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (ఉత్తరాఖండ్ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు..!) కరోనా వైరస్, లాక్డౌన్ వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా నాణ్యమైన రేషన్ సరుకులను పేదవారికి కేంద్రం అందిస్తోంది మనిషికి ఐదు కేజీల చొప్పున సరుకులు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో, నలుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీల సరుకులు దక్కుతుండగా, 20 మంది సభ్యులున్న కుటుంబానికి ఏకంగా క్వింటా సరుకులు లభిస్తున్నాయన్నారు. దీంతో ఎక్కువ సరుకులు పొందుతోన్న వారిపై చిన్నకుటుంబాల వాళ్లు అసూయతో రగిలిపోతున్నారంటూ విచక్షణా రహిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మీకు అసూయ..ఇద్దరు పిల్లల్నే కని ఆపేయడం ఎందుకు, 20 మంది పిల్లల్ని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. నేడు హస్తినకు తీరత్ మరోవైపు తీరత్ సింగ్ రావత్ ఈ రోజు (సోమవారం) ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన నాలుగు రోజులు ఇక్కడే ఉండి ప్రధాని మోదీని హోంమంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులను కలువనున్నారు. #WATCH हर घर में पर यूनिट 5 किलो राशन दिया गया।10 थे तो 50 किलो, 20 थे तो क्विंटल राशन दिया। फिर भी जलन होने लगी कि 2 वालों को 10 किलो और 20 वालों को क्विंटल मिला। इसमें जलन कैसी? जब समय था तो आपने 2 ही पैदा किए 20 क्यों नहीं पैदा किए: उत्तराखंड CM मुख्यमंत्री तीरथ सिंह रावत pic.twitter.com/cjh2hH5VKh — ANI_HindiNews (@AHindinews) March 21, 2021 -
మతపరమైన అంశాలను ముడిపెట్టడం దారుణం
ముంబై: ఉత్తరాఖండ్ కోచ్‌గా ఉన్నప్పుడు మతం ప్రాతిపాదికన ఆటగాళ్లకు అవకాశమిచ్చినట్లు వస్తున్న ఆరోపణలను టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఖండించాడు. కాగా ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్, సెలక్టర్లు, సంఘం కార్యదర్శి తనపై చూపించిన పక్షపాతం కారణంగా వసీం జాఫర్ మంగళవారం ఉత్తరాఖండ్ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'మతపరమైన అంశాలను క్రికెట్లోకి తేవడం చాలా బాధ కలిగించింది. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నిజానికి జై బిస్టాను కెప్టెన్‌ను చేయాలని భావించా. కానీ రిజ్వాన్ సహా ఇతర సెలక్టర్లంతా ఇక్బాల్‌ను కెప్టెన్‌ను చేయమని సూచించారు. ఇక్బాల్‌కు ఐపీఎల్లో కూడా అనుభవం ఉండడంతో వారి నిర్ణయంతో ఏకీభవించాల్సి వచ్చింది. అలాగే బయోబబుల్‌లోకి మత గురువులను తీసుకొచ్చానని.. అక్కడ మేం అందరం కలిసి నమాజ్ చేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు.. ఆయన్ని రావాలంటూ నేను ఎప్పుడు కోరలేదు. కేవలం శుక్రవారం ప్రార్థనల కోసమే ఇక్బాల్ అబ్దుల్లాతో నాతో పాటు మేనేజర్ అనుమతి కోరాడు. ప్రాక్టీస్ పూర్తయ్యాకే మేము ప్రార్థనలు చేశాము. కానీ ఈ విషయాన్ని అధికారులు ఎందుకంత సీరియస్ చేస్తున్నారో అర్థం కావడం లేదు' అంటూ తెలిపారు. కాగా వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. చదవండి: 'ముందు మీ కమిట్మెంట్ చూపించండి' రెండో టెస్టుకు ఇంగ్లండ్ కీలక బౌలర్ దూరం -
చార్‌ధామ్‌కు అనంత్ అంబానీ భారీ విరాళం
డెహ్రాడూన్: ఆసియా అపర కుబేరుడు, పారిశ్రామిక దిగ్గజం, ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దాతృత్వాన్ని చాటుకున్నారు. రిలయన్స్ అధినేత కుమారుడు, జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు అదనపు డైరెక్టర్ అనంత్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని చార్ధామ్ దేవస్థానం బోర్డుకు రూ .5 కోట్లు విరాళంగా ఇచ్చారు. గత సంవత్సరం కూడా రిలయన్స్ కుటుంబం రూ .2 కోట్లు విరాళంగా ఇచ్చింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నచార్‌ధామ్ దేవస్థానానికి అంబానీ కుటుంబం ఈ భారీ విరాళాన్ని అందించింది. ఉద్యోగుల జీతాలు చెల్లించడం, మౌలిక సదుపాయాలు పెంపు, యాత్రికులకు సౌకర్యాలు కోసం దీన్ని వినియోగించనున్నారు. కరోనా మహమ్మారి పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ప్రధానంగా లాక్డౌన్ ప్రభావంతో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు సాయపడాలని దేవస్థాన బోర్డు అదనపు సీఈవో బీడీ సింగ్ అంబానీ కుటుంబానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అనంత్ అంబానీ ఈ విరాళం ప్రకటించారు. ఈ మహమ్మారి కారణంగా సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని సింగ్ పేర్కొన్నారు. బోర్డు సీఈఓ రవీనాథ్ రామన్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం విన్నపం మేరకు 2019 మార్చిలో అనంత్ శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీలో భాగమయ్యారు. చార్ధామ్ దేవస్థానం బోర్డు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి నాలుగు పుణ్యక్షేత్రాలతోపాటు, ఇతర 51 దేవాలయాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే కమిటీలో చేరకముందే, అంబానీ 2018లో ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించారు.అలాగే కుమార్తె ఇషా అంబానీ వెడ్డింగ్ కార్డును ఇక్కడ అందించారు. ఆ సమయంలో రూ .51 లక్షల రూపాయలను ఆలయం నిధులకు అందించినట్లు సమాచారం. -
ఉత్తరాఖాండ్‌లో ట్రాఫిక్ ఇక్కట్లు
డెహ్రాడూన్: దేశంలో అధికంగా హిల్ స్టేషన్లు ఉండి వేసవి కాలంలో నిత్యం సందర్శకులతో కళకళలాడే సందర్శన ప్రాంతాలను కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరఖండ్. భారీ సంఖ్యలో వస్తున్న సందర్శకులతో రోడ్లు కిక్కిరిసిపోతూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో హరిద్వార్ నుంచి చార్ధామ్ వెళ్లాలంటే సమయం రెండితలు అవుతోంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్ చేరుకోవాలంటే సుమారు 18 గంటల సమయం పడుతోందని ట్రాఫిక్ నియంత్రణ అధికారి తెలిపారు. 80 వేల పైగా మంది తమ వాహనాలలో ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారని హరిద్వార్ ఎస్ఎస్పీ జన్మేజయ్ కందూరి తెలిపారు. అదనపు అధికార బలగాలు ట్రాఫిక్ని తగ్గించే చర్యలు తీసుకున్నా భారీ సంఖ్యలో సందర్శకుల ప్రయాణించడం వల్ల నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అవుతోంది. రిషికేశ్, ముస్సోరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్, గంగోత్రి, యమునోత్రి, నైనిటాల్ ప్రాంతాల్లో కూడా యాత్రికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిషీకేశ్ రోడ్లను విస్తరించే క్రమంలో వెలువడ్డ శిథిలాలు వల్ల అధికంగా ట్రాఫిక్ జామ్ అవుతోందని జస్మిత్ బ్లాక్ ప్రముఖ్ ప్రకాశ్ రావత్ తెలిపారు. ఈ పరిస్థితి నుంచి బయపడాలంటే వెంటనే రోడ్ల మీద పేరుకుపోయిన శిథిలాలను తోలగించాలన్నారు. వాహనాల పార్కింగ్ స్థలం లేకపోవడం, చిన్న వాహనాలు ఎక్కువగా రోడ్ల మీదకు రావడం ట్రాఫిక్ స్తంభనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.