ఉత్తరాఖండ్ : ఘోర రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పిల్లలు ప్రాణాలు పోయినా కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం హృదయ విదారకరంగా మారింది.
మంగళవారం ఉదయం 1.30 గంటల సమయంలో డెహ్రడూన్‌లోని ఓఎన్‌జీసీ చౌక్ సమీపంలో యువతి యువకులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు భారీ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 25ఏళ్ల సిద్ధేష్ అగర్వాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సిద్దేష్‌ను స్థానిక సినర్జీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.
అయితే రోడ్డు ప్రమాదంపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదు చేయలేదు. పైగా ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తప్పేమి లేదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కాంట్ పోలీస్ స్టేషన్ ఎస్సై కేసీ భట్ మాట్లాడుతూ.. ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే మేం కేసు ఎలా ఫైల్ చేస్తాం. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు.
వాహనం నడుపుతున్న కారు యజమాని ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుత చట్టం ప్రకారం ఈ కేసులో అతను బాధ్యత వహించలేడు. కాబట్టే ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎస్సై కేసీ భట్ వెల్లడించారు.
కాగా, మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారు కాగా, ఒకరు చంబాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు యువతి యువకులు అర్థరాత్రి డ్రైవ్‌కు వెళ్లినట్లు సమాచారం.
👉 చదవండి : చికెన్ బిర్యానీలో నిద్ర మాత్రలు..భర్తకు తినిపించిన భార్య.. ఆపై
Comments
Please login to add a commentAdd a comment