![Hyderabad Police Statement On Chilukuru Temple Rangarajan Issue](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/Chilukur.jpg.webp?itok=qF8tJpIG)
సాక్షి,హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం(ఫిబ్రవరి10) కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ వెల్లడించారు.
పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో సోమవారం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. దాడి చేసిన వారు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందినవారని చెప్పారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని,రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని నిందితులు రంగరాజన్‌ను డిమాండ్ చేసినట్లు తెలిపారు.ఇందుకు నిరాకరించడంతో రంగరాజన్‌పై వారు దాడి చేసినట్లు వెల్లడించారు.
2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ స్థాపించాడు: డీసీపీ
వీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యం అనే సంస్థను స్థాపించాడని,సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ రామరాజ్యంపై ప్రచారం చేశాడని డీసీపీ తెలిపారు. రామరాజ్యంలో చేరితే రూ.20వేలు జీతం ఇస్తానని చెప్పాడన్నారు. తణుకు,కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించాడని,రామరాజ్యంలో చేరిన వారిని యూనిఫామ్ కుట్టించుకోమన్నాడన్నారు.
ఈ నెల 6న అందరూ యాప్రాల్‌లో కలిశారన్నారు. రామరాజ్యం బ్యానర్‌తో ఫొటోలు,వీడియోలు తీసుకున్నారని తెలిపారు. వాటితో సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు. ఈ నెల 7న మూడు వాహనాల్లో వీరరాఘవరెడ్డి అనుచరులు 25మంది నల్ల దుస్తుల్లో చిలుకూరు వచ్చి రంగరాజన్‌పై దాడి చేసినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటున్న వీరరాఘవరెడ్డి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం అని డీసీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment