
సాక్షి, తెలంగాణ : తనపై మహాదేవ్ పూర్ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మేడిగడ్డ సందర్శనలో భాగంగా బీఆర్‌ఎస్ నేతలు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారు. అనుమతి లేకుండా సందర్శించడంతోపాటు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారంటూ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజినీర్ ఫిర్యాదుతో మహాదేవపూర్ పోలీసులు కేటీఆర్‌తో పాటు, గండ్ర వెంకటరామిరెడ్డి, బాల్కా సుమన్‌పై కేసు నమోదు చేశారు.
తాజాగా, తమపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ (ఆగస్ట్12)న విచారణ చేపట్టింది. కోర్టు హాజరుకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment