rangarajan
-
విద్వేషం చేసిన దాడి
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో గల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్‌పై ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం కొందరు వ్యక్తులు ఆయన ఇంట్లోకి జొరబడి దాడి చేశారు. తమని తాము శ్రీరాముని వంశానికి చెందినవారమని చెప్పుకొన్న ఆ గుంపు, రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థికంగా సహాయం చేయాలని, తాము ఏర్పాటు చేసుకున్న ‘శ్రీరామ సైన్యం’లోకి ఇక్ష్వాకు వంశస్తులను ఎంపిక చేయించాలని రంగరాజన్‌ను డిమాండ్ చేశారు. దానికి ఆయన నిరాకరించినందుకు ఆయనపై భౌతిక దాడి చేశారు. హిందూత్వ భావ జాలానికి ప్రతినిధులుగా వ్యవహరించే వారంతా ఇలాంటి దాడులే గతంలో చేస్తే ఎవరూ నోరు మెదపలేదు. కానీ ఈరోజు రంగరాజన్ పైన జరిగిన దాడిని మాత్రం మూకుమ్మడిగా ఖండిస్తూ వస్తున్నారు.నిజానికి ఇది మొదటి దాడి కాదు, ఇలా విద్వేషంతో జరుగుతున్న దాడుల పరంపరలో చివరిది కూడా కాకపోవచ్చు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ రాష్ట్ర స్థాపన కోసం తాము చేసే ప్రయత్నానికి సహకరించమని పలువురు హిందువులు గౌరవంగా చూసే, పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తిపై దాడి చేయడం ఈ సంఘటనలో గల కొత్త అంశం. ఎవరైనా హిందూ మతాన్ని అగౌరవ పరుస్తున్నారని, మతానికి నష్టం కలిగిస్తున్నారని ఆరో పించి, అలా నష్టం కలిగించిన వారిని శిక్షించే పని కూడా తామే చేయడం ఇప్పటివరకు మనం చూశాం. ఇటీవల తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై జరిగిన దాడి కూడా మత విశ్వాసాలను ఆయన గౌరవించలేదన్న ఆరోపణ మీదనే! ఇప్పుడు మాత్రం మత విశ్వాసాలను గౌరవించి సనాతన ధర్మాన్ని పాటించి, దాని ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించే అర్చకుని పైన దాడి జరిగింది.ఇది అత్యంత హేయమైన చర్య. బహుశా వారికి రంగరాజన్, అతను ఆలయాన్ని నడిపే పద్ధతి, ఆయనకి ఈ వ్యవస్థ పట్ల గల గౌరవం కూడా నచ్చలేదని తెలుస్తోంది. అంటే వచ్చిన వారికి భారత రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం లేదన్నది స్పష్టం. వారు తమ సొంత ఊహా ప్రపంచంలో, తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం ఒక ఉన్మాద స్థితిలో ఉన్న మూక. ఇది సాధా రణ హిందూ మతస్థులపైన అదుపుతప్పిన హిందూత్వ విద్వేషం చేసిన దాడి!ఎదుటి వ్యక్తుల విశ్వాసాలు మన విశ్వాసాలకు భిన్నమైనవి అయినందువల్ల మాత్రమే ద్వేషించాలి అన్న అభిప్రాయం సాధారణ హిందూ జన సామాన్యానికి ఎప్పుడూ లేదు. ఇప్పుడు యువతలోకి క్రమంగా వచ్చి చేరుతున్న అసహన వాతావరణం రంగరాజన్ పైన జరిగిన దాడి ద్వారా మనకు తెలుస్తుంది. దాడికి వచ్చిన శ్రీరామసేన ఏర్పాటు చేసిన వీర రాఘవరెడ్డి అనే యువకుడు తన యూట్యూబ్ ఛానల్లో చిత్రవిచిత్రమైన వీడియోలు పెట్టాడు. వాటిని చూసినప్పుడు అతను ఎలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి ఆ సేన ఏర్పాటు చేశాడో మనకు అర్థం అవుతుంది. మన దేశానికి రాజ్యాంగం 1950 జనవరి 26న అమలైన నాటికంటే ముందే ఈ దేశంలో మనుస్మృతి అనే రాజ్యాంగం ఉన్నదని, అది అసలు ఈ దేశపు రాజ్యాంగం అని, ఇప్పుడు అమలవుతున్న రాజ్యాంగం మన భారత దేశపు విలువలకు సరిపోదని అతని ప్రగాఢ విశ్వాసం. నిజానికి ఈ విశ్వాసం అతనికి మాత్రమే లేదు ఈ దేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్న పార్టీ సైద్ధాంతిక భావజాలానికి కారణమైన సంస్థ కూడా నమ్ముతున్నట్లుంది. సమానత్వ, సౌభ్రాతృత్వ, లౌకిక విలువలకు వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తే కలిగే విపరిణామాలు ఇలాగే ఉంటాయి. దాన్ని ఒంట పట్టించుకున్నటువంటి యువత దారి తప్పుతుంది. అలాంటి వారే ఈరోజు ఈ రకంగా దాడులకు పాల్పడు తోందని అర్థం చేసుకోవాలి. విద్వేషాలకు స్వస్తి పలికితేనే సమాజానికి శ్రేయస్కరం.– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక. -
రంగరాజన్‌పై దాడి..పోలీసుల కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం(ఫిబ్రవరి10) కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ వెల్లడించారు.పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో సోమవారం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. దాడి చేసిన వారు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందినవారని చెప్పారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని,రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని నిందితులు రంగరాజన్‌ను డిమాండ్ చేసినట్లు తెలిపారు.ఇందుకు నిరాకరించడంతో రంగరాజన్‌పై వారు దాడి చేసినట్లు వెల్లడించారు.2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ స్థాపించాడు: డీసీపీవీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యం అనే సంస్థను స్థాపించాడని,సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ రామరాజ్యంపై ప్రచారం చేశాడని డీసీపీ తెలిపారు. రామరాజ్యంలో చేరితే రూ.20వేలు జీతం ఇస్తానని చెప్పాడన్నారు. తణుకు,కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించాడని,రామరాజ్యంలో చేరిన వారిని యూనిఫామ్ కుట్టించుకోమన్నాడన్నారు. ఈ నెల 6న అందరూ యాప్రాల్‌లో కలిశారన్నారు. రామరాజ్యం బ్యానర్‌తో ఫొటోలు,వీడియోలు తీసుకున్నారని తెలిపారు. వాటితో సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు. ఈ నెల 7న మూడు వాహనాల్లో వీరరాఘవరెడ్డి అనుచరులు 25మంది నల్ల దుస్తుల్లో చిలుకూరు వచ్చి రంగరాజన్‌పై దాడి చేసినట్లు తేలిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మణికొండలో ఉంటున్న వీరరాఘవరెడ్డి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం అని డీసీపీ తెలిపారు. -
ఈ అమానుష దాడి దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
ఢిల్లీ: చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు. ‘చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగ రాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి.ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న శ్రీ రంగరాజన్.. దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందువరసలో ఉన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీజేపీ శ్రీ రంగరాజన్ గారికి అన్నిరకాలుగా అండగా నిలబడుతుంది మనవిచేస్తున్నాను’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.దాడి ఇలా.. సీఐ పవన్‌కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.🚨Great job, Telangana law and order—thriving for all the wrong reasons!What a proud moment for our society—when even a deeply respected figure like Sri Rangarajan garu, the chief priest of Chilkur Balaji Temple and a staunch advocate for Dharma, isn’t spared from goons.… pic.twitter.com/sVeNmCiXus— VoiceofValor (@VoiceofValr) February 10, 2025 -
చిలుకూరు పూజారి రంగరాజన్‌కు కేటీఆర్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి నేపథ్యంలో ఆయనను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో దాడి ఎవరు చేసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై గత శుక్రవారం దాడి జరిగింది. ఈ నేపథ్యంలో రంగరాజన్‌ను కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పరామర్శించారు. దాడి జరిగిన అంశంపై ఆయనతో మాట్లాడారు.అనంతరం, కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆలయంలో సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయి. ఇది అత్యంత దుర్మార్గమైన నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా.. ఏ పేరిట చేసినా.. ఏ ఎజెండాతో చేసినా ఉపేక్షించకూడదు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్, సౌందర్య రాజ్యం కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి ఎవరు చేశారో వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, మాజీ మంత్రులు @BrsSabithaIndra, @VSrinivasGoud, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే @KaushikReddyBRS, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, @balkasumantrs, బీఆర్ఎస్ నాయకులు… pic.twitter.com/cec0V2h5zC— BRS Party (@BRSparty) February 10, 2025అంతకుముందు.. ఈ దాడి ఘటనపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్.. ధర్మ రక్షకులు దాడులు చేస్తారు, రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారని మండిపడ్డారు. రంగరాజన్‌పై దాడిపై హిందూ ధర్మ పరిరక్షకులు ఇప్పటివరకు ఒక్కమాటా మాట్లాడలేదని విమర్శించారు. దాడి ఘటనపై వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ధర్మరక్షకులు దాడులు చేస్తారు…రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు 👏🏼Chilkur temple chief priest and a great scholar Shri Rangarajan garu was attacked two days ago by fringe elements.Not a word from the protectors of Hinduism on this act of cowardiceThere are videos of the…— KTR (@KTRBRS) February 10, 2025దాడి ఇలా.. సీఐ పవన్‌కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని వెల్లడించారు.🚨Great job, Telangana law and order—thriving for all the wrong reasons!What a proud moment for our society—when even a deeply respected figure like Sri Rangarajan garu, the chief priest of Chilkur Balaji Temple and a staunch advocate for Dharma, isn’t spared from goons.… pic.twitter.com/sVeNmCiXus— VoiceofValor (@VoiceofValr) February 10, 2025 -
భారత్ వృద్ధి చెందాలంటే?.. రంగరాజన్ సూచన
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని పలువురు ఆర్థిక వేత్తలు కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ 'రంగరాజన్' కీలక వ్యాఖ్యలు చేయారు.ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ 14వ స్నాతకోత్సవంలో రంగరాజన్ ప్రసంగిస్తూ.. ఉద్యోగాలు లేకుండా సాధించే వృద్ధి వ్యర్థం. కాబట్టి పెట్టుబడి రేటును పెంచడం, వ్యవసాయం, తయారీ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం.. ఉపాధికి అనుకూలమైన రంగాలను ప్రోత్సహించడం ద్వారా వృద్ధిని సాధ్యమవుతుందని అన్నారు.ఏదైనా దిగుమతి ఖరీదైనదైతే దాని వల్ల ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయాలను ఎన్నుకోవాలి. ఇది దేశానికి మంచిదని రంగరాజన్ అన్నారు. భారత్ ద్రవ్యోల్బణం.. రూపాయి - డాలర్ రేటు వంటి సమస్యతో సతమతమవుతోంది. అలాగే 6-7 శాతం వృద్ధి సాధిస్తే.. 2024 చివరి నాటికి 13000 డాలర్ల స్థాయికి చేరుకోవడం సులభమవుతుంది.ఉద్యోగాల కల్పన అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన సవాలుగా మారనుంది. భారతదేశం సాధించిన దాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు. నాణ్యత, ప్రభావ పరంగా ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య సంస్కరణ అంటే యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. -
కృష్ణబిలాల అన్వేషణలో
‘టైమ్’ మేగజీన్ 2024 సంవత్సరానికి గాను ‘100 మంది ప్రభావపూరిత వ్యక్తుల’ జాబితా ప్రకటించింది. ప్రపంచవ్యాప్త ఉద్దండులతో పాటు భారతీయులు కూడా ఈ ఎంపికైన వారిలో ఉన్నారు. వారిలో ఒకరు ఆస్ట్రోఫిజిసిస్ట్ ప్రియంవద రంగరాజన్. కృష్ణబిలాలను లోతుగా అధ్యయనం చేయడం ద్వారా సృష్టి పుట్టుకను విశదం చేయగల మర్మాన్ని ఈమె విప్పుతున్న తీరు అసామాన్యమని ‘టైమ్’ భావించింది. కోయంబత్తూరులో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ ప్రియంవద పరిచయం. మన పాలపుంతలో ఎన్ని కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉంటాయో తెలుసా? కనీసం కోటి నుంచి నూరు కోట్ల వరకు. అంతరిక్షంలో కృష్ణ బిలాలు ఒక నిగూఢ రహస్యం. ఐన్‌స్టీన్ వీటిని ఊహించాడుగాని ఆయన జీవించి ఉన్నంత కాలం వాటి ఉనికిపై వాస్తవిక ఆధారాలు వెల్లడి కాలేదు. 1967లో జాన్ వీలర్ అనే ఫిజిసిస్ట్ ‘బ్లాక్ హోల్’ పదం వాడినప్పటి నుంచి వీటిపై చర్చలు కొనసాగాయి. ఆ తర్వాతి కాలంలో ఉనికి గురించిన ఆధారాలు దొరికాయి. కృష్ణ బిలాలు కాంతిని కూడా మింగేసేంత శక్తిమంతమైనవి. చిన్న చిన్న బ్లాక్‌హోల్స్ నుంచి అతి భారీ (సూపర్ మాస్) బ్లాక్ హోల్స్ వరకూ మన పాలపుంతలో ఉన్నాయి. ఒక తార తన గురుత్వాకర్షణలో తానే పతనం అయినప్పుడు బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనేది ఒక సిద్ధాంతమైతే ఇవి విశ్వం ఏర్పడే సమయంలోనే అంతరిక్ష ధూళిమేఘాలు తమపై తాము పతనవడం వల్ల ఏర్పడ్డాయని మరో సిద్ధాంతం. ఈ మరో సిద్ధాంతానికి ఊతం ఇస్తూ ప్రియంవద రంగరాజన్ సాగిస్తున్న పరిశోధనల వల్లే ఆమె తాజాగా ‘టైమ్’ మేగజీన్‌లో ‘హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షల్ పీపుల్’లో ఒకరుగా నిలిచారు. ఆమె పరిశోధన ప్రియంవద కృష్ణబిలాల పరిశోధనలో ప్రత్యేక కృషి చేశారు. గురుత్వాకర్షణ లెన్సింగ్ పద్ధతి ద్వారా నక్షత్ర మండలాల ఆవిర్భావాన్ని, వాటి పరిణామాలను, అనేక నక్షత్ర మండలాల మధ్య అంతర్గత సంబంధాలపై అధ్యయనం చేశారు. నక్షత్ర మండల సమూహాల గతిశీలతను అధ్యయనం చేయడానికి లెన్సింగ్, ఎక్స్–రే, సున్యావ్–జెల్డోవిక్ డేటాను ఉపయోగించారు. అంతే కాదు ఒక నక్షత్రం, కృష్ణబిలం కలయిక ద్వారా ఏర్పడే విద్యుదయస్కాంత, గురుత్వాకర్షణ తరంగాలపై కూడా అధ్యయనం చేశారు. ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ప్రతిష్టాత్మక లిబర్టీ సైన్స్ సెంటర్ వారి ‘జీనియస్ అవార్డు’ కూడా దక్కింది. ఈ విశ్వం ఎలా పరిణామం చెందిందో తెలుసుకోవడానికి ప్రియంవద సాగిస్తున్న కృష్ణబిలాల అన్వేషణ చాలా కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కోయంబత్తూరులో జన్మించి... ప్రియంవద రంజరాజన్ కోయంబత్తూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగం రీత్యా ఇంటర్ వరకూ ఢిల్లీలో చదువుకున్నారు. ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ ‘మసాచుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో జరిగింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ నుంచి పిహెచ్డి చేశారు. ప్రస్తుతం అమెరికాలోని యేల్ యూనివర్సిటీలోప్రోఫెసర్గా పని చేస్తున్నారు. ‘మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్‘ అనే ముఖ్యమైన గ్రంథాన్ని రచించారు. -
flash back: పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు !
డాక్టర్ సి.రంగరాజన్ 1997 నుంచి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. 2003లో రాజన్ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా ఢిల్లీ వెళ్లి, అదే ఏడాది ఆగస్టులో తన టీమ్‌తో కలిసి హైదరాబాద్ వచ్చారు. ‘‘చేసిన అప్పులు చాలు. ఇక చెయ్యకండి’’ అని చంద్రబాబు ప్రభుత్వానికి చెప్పడానికే ఆయన బృందం పని కట్టుకుని హైదరాబాద్ వచ్చింది! ఇక్కడ బాబు 2004 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ‘‘ఎలాగైనా చేసి ఓ 650 కోట్ల రూపాయలు ఇద్దురూ, పొయ్యిలో పిల్లి లేవడం లేదు’’ అని రాజన్ని మొహమాటం లేకుండా అడిగేశారు చంద్రబాబు. రాజన్ ఆశ్చర్యపోయారు. ‘‘ఎలాగైనా?’’ అంటే అన్నారు. మనసుంటే మార్గం ఉండదా అన్నట్లు రాజన్ వైపు చూసి, ‘‘మీ చేతుల్లో పనే కనుక, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రద్దు చేసి, ఆ పథకాల మీద కేంద్రం ఖర్చు చేస్తున్న నిధులకు సమానమైన మొత్తాన్ని రాష్ట్రాలకు సమానంగా పంచండి’’ అన్నారు! పనిలో పనిగా చంద్రబాబు రాజన్‌కు ఇంకో సలహా కూడా ఇచ్చారు. ‘‘కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయం నుంచి కూడా 50 శాతం తీసి రాష్ట్రాలకు ఇవ్వండి. ముందైతే మాకు 650 కోట్లు ఇవ్వండి’’ అన్నారు! చంద్రబాబును అలా చూస్తూ రాజన్ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. ఏపీకి రాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఎ.ఎం. ఖుస్రో ఉన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది జాగ్రత్త అని చంద్రబాబును ఖుస్రో ఎన్నోసార్లు హెచ్చరించడం రాజన్ కళ్ల ముందు కదలాడింది. ‘‘నాయుడు గారూ.. మీ దగ్గర్నుంచి కేంద్రానికి వచ్చేది లేకపోగా, కేంద్రం నుంచే మీరు నిధులు అడుగుతున్నారు.. అదెలా సాధ్యం అవుతుంది? గొంతెమ్మ కోరిక కాకపోతే..’’ అన్నారు రాజన్. 2004 ఎన్నికల ముందు నాటికి ఏపీ ప్రభుత్వం పూర్తిగా దివాళా తీసింది. రాష్ట్రానికి డబ్బులు తెచ్చిపెట్టే నీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యుత్ రంగాలు నిర్లక్ష్యానికి గురై కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చడంతో వడ్డీతో కలిపి తడిసి మోపెడయింది. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా వచ్చాక కానీ రాష్ట్రం కొంచెం తేరుకోలేదు. అదే చంద్రబాబు ఇప్పుడు.. ముఖ్యమంత్రి YS జగన్ మోహన్‌రరెడ్డి ప్రభుత్వ అప్పులపై గగ్గోలు పెడుతున్నారు. తను చేస్తే అప్పు.. జగన్ చేస్తే తప్పా.? ప్రపంచ విజనరీ అని డప్పు కొట్టే వారు కాస్తా సెలవివ్వాలి.! -
ఆలస్యమే అయినా... మేల్కొన్నట్లేనా?
సుమారుగా నాలుగు దశాబ్దాల నుంచి ప్రపంచ దేశాలను శాసిస్తోన్న ‘నయా ఉదార వాద’ ఆర్థిక విధానాలు నేడు ప్రశ్నించబడుతు న్నాయి. నిన్నటి వరకూ ఈ విధానాలకు ప్రతి నిధులుగా ఉన్న ఆర్థికరంగ మేధావులు కూడా నేడు భిన్నమైన గొంతుకలను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో, ఈ మధ్యకాలంలో మన దేశంలోని ఇరువురు ప్రముఖుల ప్రకటనలు లేదా ఇంటర్వ్యూలు మనదేశంలో కూడా నయా ఉదారవాద విధానాలను అనివార్యంగా విడనాడవలసిన అవసరాన్ని చెబుతున్నాయి. వీరిలో ఒకరు రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రంగ రాజన్. రెండవవారు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ కె. బెరి. రంగ రాజన్ మాటలు నేడు వ్యవస్థలో మౌలికంగానే తలెత్తుతోన్న ప్రశ్నలకు అద్దం పడుతున్నాయి. ఆయన లేవనెత్తిన ప్రశ్న ఉపాధి అవకాశాలను సరిపడా సృష్టించలేని అభివృద్ధి దేనికి అనేది. అలాగే ఆయన తలసరి ఆదాయం పెరిగితేనే అది అసలైన దేశాభివృద్ధి అన్నారు. దానితో పాటుగా నిరుపేదలకు రాయితీలు అవసరమేనని స్పష్టీకరించారు. గతంలో దేశంలో పెట్రోలియం ధరలకు సంబంధించి సబ్సిడీల రద్దులను ప్రతిపాదించిన కమిటీలలో ఒకదానికి నాయకత్వం వహించిన రంగరాజన్ నోట వెలువడిన ఈ మాటలు చాలా కీలకమైనవి. వ్యవస్థలో నేడు మారుతోన్న ఆలోచనలకూ... నయా ఉదారవాద సంస్కరణల వైఫల్యానికీ ఈ మాటలు అద్దంపడుతున్నాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) విధానాలనే సూక్ష్మంగా ‘నయా ఉదారవాదం’ అంటున్నాం. ప్రపంచంలో 1980ల నుంచీ... మనదేశంలో 1991 అనంతరం మొదలైన ఈ విధానాలు కార్పొరేట్లకు మరింతగా రాయితీలు ఇవ్వడాన్ని ప్రతిపాదించాయి. అలాగే, జన సామాన్యానికి ఇచ్చే సబ్సిడీలు, సంక్షేమ పథకాలపై కోతలను ప్రతిపాదించాయి. ఈ విధానాల అమలు క్రమంలోనే నేడు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య, అలాగే విడివిడిగా వివిధ దేశాలలో అంతర్గతంగా కూడా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి. ధనికులు మరింత ధనికులూ, పేదలు మరింత పేదలూ అవుతున్నారు. నేడు పరాకాష్ఠకు చేరుకుంటున్న ఈ పరిస్థితి ఈ విధానాలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ క్రమంలోనే రంగరాజన్ వంటివారు కూడా తమ పాత ఆలోచనలను పరిత్యజించవలసి వస్తోంది. మరో పక్కన నీతి ఆయోగ్ సుమన్ బెరి 1950ల నుంచి బలమైన నమూనాగా ఉన్న మొత్తం ఆర్థిక నమూనానే ప్రశ్నిస్తున్నారు. ఈ నమూనా ప్రకారంగా ఒక దేశ ఆర్థిక అభివృద్ధి క్రమం: తొలుత వ్యవసాయక ప్రాధాన్యత గలదిగా ఉండి, తరువాత సరుకు ఉత్పత్తి పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఉన్నదిగానూ... అనంతరం (చివరగా) సేవా రంగం ప్రాధాన్యత దిశగా సాగాలి. అయితే, ప్రస్తుతం ప్రపంచంలో నెలకొని ఉన్న ఆర్థిక పరిస్థితులూ, అలాగే భారీగా ఆటోమేషన్ దిశగా అభివృద్ధి చెందిన సాంకేతిక రంగం వంటి వాటి దృష్ట్యా నేడు మనదేశానికి ఈ పాత దశల అభివృద్ధి నమూనా పనికి రాదనేది సుమన్ బెరి ప్రతిపాదన. ఈ సందర్భంగా ఆయన ‘భూగోళం మరో చైనాను భరించలేదు’ అని పేర్కొన్నారు. అంటే, నేడు భూగోళంపై జరుగుతోన్న పర్యావరణ మార్పులూ... వినాశనం దృష్ట్యా చైనా స్థాయిలో పారిశ్రామిక సరుకు ఉత్పత్తి చేయగల మరో దేశం అవసరం లేదన్నమాట. అటువంటిదే జరిగితే ప్రపంచంలో కాలుష్యం మరింత వేగంగానూ, తీవ్రంగానూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఆయన భారతదేశం సరుకు ఉత్పత్తి రంగంలో చైనాతో పాటుగా ఎదిగే ప్రయత్నాన్ని ప్రశ్నించారు. దీనిలో భాగంగానే ఆయన ఏది ఏమైనా సరే భారీ వృద్ధిరేట్లను సాధించాలనే దృక్పథాన్ని విమర్శిస్తూ... దాని స్థానే నేడు భారత్‌కు కావాలిసింది హేతుబద్ధమైన, పర్యావరణం పట్ల చైతన్యం గల వినియోగం, ఉత్పత్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే, 2014లో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని మోదీ ఆరంభించిన నేపథ్యంలో మాజీ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ మాటలను కూడా గుర్తుచేసుకోవచ్చు. ఆయన ప్రకారంగా ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం పేరిట ప్రపంచానికి మరో చైనా అవసరం లేదు. నిజానికి మనం కొద్ది దశాబ్దాల క్రితమే పారిశ్రామిక సరుకు ఉత్పత్తి దిగ్గజంగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయాం... బస్సు మిస్సయ్యాం! సరుకు ఉత్పత్తి రంగంలో ముందుగానే 1980లలో ప్రయాణం ప్రారంభించిన చైనా నేడు శాచ్యురేషన్ స్థాయిని సాధించి ఉంది. అదీ విషయం. అంటే, రఘురామ్ రాజన్ ఈ మాటలను అంతర్జాతీయ మార్కెట్ తాలూకు అవసరాలు, డిమాండ్ స్థాయుల గురించి వివరిస్తూ చెప్పారు. అయితే, గత పది సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం తన దృష్టినంతా సరుకు ఉత్పత్తిరంగం పైననే పెట్టింది. దీనిలో భాగంగానే 2014లో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ముందుకు వచ్చింది. అనంతరం 2019లో భారీస్థాయిలో కార్పొరేట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం తగ్గించింది. ఇక తరువాత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పేరిట లక్షల కోట్ల రూపాయల రాయితీలతో దేశంలో భారీ పారిశ్రామికీకరణను తలపెట్టింది. కానీ, ఈ ప్రయత్నాలు ఏవీ ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. ఈ కారణం చేతనే కోవిడ్ అనంతర కాలంలో అంతర్జాతీయంగా ముందుకు వచ్చిన ‘చైనా+1’ ఆలోచన కూడా మనదేశానికి సంబంధించినంత వరకూ పెద్దగా ఫలితాలను సాధించలేదు. మరో పక్కన దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతోంది. అనేక ఇతరేతర ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి. కాబట్టి నేడు మనం పాత దశలవారి సిద్ధాంతం అయిన వ్యవసాయరంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం, అనంతరం సేవారంగంలోకి ప్రయాణం అనే దానికి ఇక ఎంత మాత్రమూ అంటిపెట్టుకోలేము. సరికొత్త మార్గాన్ని అన్వేషించుకోవాలి. ప్రధాని మోదీ కూడా ‘ఏదేమైనా వృద్ధిని సాధించడమే ఏకైక లక్ష్యమ’ని ఇక ఎంతమాత్రమూ అనలేము అంటూ ఈమధ్య పేర్కొనటాన్ని గమనించవచ్చు. ఈ నేప«థ్యంలో ముందుకు వచ్చినవే సుమన్ బెరి ఆలోచనలు. వాస్తవానికి నేడు ప్రపంచమంతటా పెరిగిపోతున్న సాంకేతికత దృష్ట్యా సరుకు ఉత్పత్తిరంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఇదీ సమస్య తాలూకు మరో కోణం. అంటే, మనం సరుకు ఉత్పత్తిరంగంపై దృష్టిపెట్టి, దానిలో ఒకవేళ బాగా ముందుకు వెళ్ళగలిగినా అది మన ప్రధాన సమస్య అయిన నిరుద్యోగాన్ని పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో మనకు ఉన్న మెరుగైన మార్గాంతరంగా వ్యవసాయరంగంపై దృష్టిపెట్టడం అనేది ఉంది. దీనినే సుమన్ బెరి ప్రతిపాదిస్తున్నారు. ఆయన ప్రకారం మనం పర్యావరణ కాలుష్యం, నిరుద్యోగం వంటి సమస్యలు పరిష్కరించలేకపోవడం దృష్ట్యా, సరుకు ఉత్పత్తిరంగాన్ని మన ప్రాధా న్యతగా చేసుకోరాదు. మనం చేయవలసింది, వ్యవసాయ రంగంలో సూపర్ పవర్‌గా ఎదగగలగడం. నేడు మన దేశ జనాభాలో 55–60 శాతం మేరకు వ్యవసాయరంగంలోనే ఉన్న నేపథ్యంలో, వారి ఉత్పాదకతతోపాటు, వారి ఆదాయాలను కూడా పెంచేదిశగా చర్యలు తీసుకుంటే అవి దేశీయంగానే డిమాండ్ కల్పనకూ... వ్యవసాయరంగాన్ని ఒక మెరుగైన ఉపాధి రంగంగా యువకుల ముందు ఉంచగలిగేటందుకూ ఉపయోగపడతాయి. అటు వంటి విధానాలు, దేశంలోని నగర ప్రాంతాలలో కూడా ఆర్థిక కార్య కలాపాల వృద్ధికి ఉపయోగపడతాయి. ఒక రచయితగా నేను 2014లో ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం ఆరంభం అయిన నాటి నుంచి పదే పదే వ్యాసాలలో, ఉపన్యాసాలలో వివరించినది ఇదే! స్థూలంగా నేడు మనదేశంలో కూడా సరికొత్త ఆలోచనల పవనాలు వీస్తున్నాయి. కానీ, పుణ్యకాలం కాస్త అయిపోయిన తరువాత అన్నట్టుగా పది సంవత్సరాల విలువైన కాలాన్ని వృ«థా చేసుకుని నేడు మనం మరలా బండి చక్రాన్ని కనుగొంటున్నట్లుగా ఇది ఉంది. ఏదేమైనా, నేటికైనా మన దేశ ఆర్థిక నమూనా పాత సైద్ధాంతిక చట్రాలను బద్దలు కొట్టుకొని సరైన దారిలోకి ప్రయాణిస్తుందని ఆశిద్దాం. డి. పాపారావు వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
కొన్ని సలహాలూ, సంఘటనలూ!
చాలామంది రాయరు గానీ, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ అనుభవాలను పుస్తకాలుగా తెస్తే, అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తాయి. అవి విలువైన పాఠాలు కూడా అవుతాయి. తాజాగా తన పదవీకాలపు జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చిన జాబితాలోకి భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సి.రంగరాజన్ కూడా చేరారు. 1990లో దేశం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం గురించీ, చివరకు బంగారాన్ని తాకట్టుపెట్టి దానిలోంచి బయటపడిన ఘటన గురించీ ఆయన రాశారు. అప్పటి రాజకీయ వైఫల్యాన్ని కూడా బయటపెట్టారు. రూపాయి విలువను తగ్గించాల్సి వచ్చిన సందర్భాన్ని కూడా వివరించారు. గవర్నర్‌గా పనిచేసినప్పుడు రాజకీయ నాయకుల ముహూర్తాల సెంటిమెంట్లను ఆయన గమనించారు. వీటన్నింటికంటే ముఖ్యంగా, గవర్నర్లకు తమ అధికారాలు, పరిమితుల మీద ఉండవలసిన గ్రహింపు గురించి కూడా ఆయన విడమరిచారు. గవర్నర్లు తరచూ వార్తల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇది గమనార్హమైనది. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించారో ప్రకటించుకునే తరహా సంప్రదాయం మన దగ్గర పెద్దగా లేదు. మాంటెక్‌సింగ్ అహ్లూ్లవాలియా దీనికి ఒక మినహా యింపు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా తన దశాబ్ద కాలపు అనుభవాలను గురించి ఆయన రాశారు. భారత ఉపరాష్ట్రపతిగా తన పదేళ్ల కాలం గురించి హమీద్ అన్సారీ సమగ్రమైన ఇంట ర్వ్యూను ఇవ్వడాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు సి. రంగరాజన్... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా, ఒరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్వల్పకాలం పాటు గవర్నర్ బాధ్య తలు నిర్వహించిన తన పదవీ కాలాల గురించిన రచనను(ఫోర్క్స్ ఇన్ ద రోడ్: మై డేస్ ఎట్ ఆర్బీఐ అండ్ బియాండ్) ప్రచురించారు. అది ఎన్నో చక్కటి వివరాలతో, సంతోషకరమైన ఉపాఖ్యానాలతో కూడి ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్‌గా ఉన్నప్పుడు, 1990 నాటి ఆర్థిక సంక్షోభం గురించి ఆయన ఎంతో వివరంగా రాశారు. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ రాస్తూ, ‘‘ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను సంప్రదించక తప్పని పరిస్థితి గురించి’’ పేర్కొంది. కానీ ‘‘ప్రభుత్వం తక్షణ చర్య ఏదీ తీసుకోలేదు.’’ ఇది ‘‘రాజకీయ నాయకత్వ వైఫల్యమే’’ అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆనాటి ‘‘పరిస్థితిలోని తీవ్రతను నాటి ప్రభుత్వం గుర్తించకపోవడం, లేదా ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) వద్దకు వెళ్లడానికి సైద్ధాం తికంగా విముఖత ప్రదర్శించడం’’ వల్ల చర్య తీసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరించిందని రంగరాజన్ రాశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ‘‘వేగంగా దిగజారిపోయింది’’ అంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. నాలుగు నెలల తర్వాత, ‘‘మన నిల్వలు... కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సమా నంగా ఉన్నాయి,’’ అని చెబుతూ ఆయన ఇలా కొనసాగిస్తారు: ‘‘పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందంటే, విదేశాల్లో ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను అమ్మివేయాలని కూడా కొంత ఆలోచన సాగింది.’’ అలా అమ్మేయడానికి పరిగణించిన ఆస్తుల్లో జపాన్ రాజధాని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం కూడా ఒకటి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ‘‘డిఫాల్టర్‌గా ఉండటానికి కూడా సిద్ధమైంది... దీన్ని తప్పించుకోవడానికి చివరికి అదీ, ఇదీ అనకుండా ప్రతి విషయం గురించి కూడా ఆలోచించాం’’ అని రంగరాజన్ నాతో చెప్పారు. ఆ సమయంలో వారు ఎంపిక చేసు కున్న నిర్ణయాల్లో ఒకటి: 405 మిలియన్ డాలర్ల రుణం పొందడానికి గానూ, భారతదేశ బంగారు నిల్వల్లో 15 శాతం (ఇది 46.91 టన్నులకు సమానం) తనఖా పెట్టాలనుకోవడం! ఈ రోజు చూస్తే అది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ సమ యంలో ‘‘ఆ సొమ్ము చాలా కీలక మైంది... ఎగవేతను అడ్డుకోవ డానికి.’’ 1991 జూలై నాటి మరొక అద్భుతమైన కథ ఈ పుస్తకంలో ఉంది. అది – పీవీ నరసింహారావు ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించడం గురిం చినది. అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అది రెండు దఫాలుగా జరిగింది. సి.రంగరాజన్ ఈ రెండో దఫా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఇక్కడ ఒక చిన్న నేపథ్యం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తొలి విడత రూపాయి విలువను తగ్గించిన తర్వాత, దానిపై వచ్చిన తీవ్రమైన రాజకీయ ప్రతిస్పందన చూసి ప్రధాని నరసింహారావు విశ్వాసం సన్నగిల్లింది. దీంతో రెండో దఫా రూపాయి విలువ తగ్గింపును వాయిదా వేయాలని మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఆ సందర్భంలో రంగరాజన్ చెప్పిన విషయానికి చాలా ప్రాముఖ్యం ఉంది. రూపాయి విలువను రెండో దఫా తగ్గించిన రోజున (1991 జూలై 3) ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి ఉదయం 9.30 గంట లకు రంగరాజన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ‘‘పరిస్థితి ఎలా ఉంది?’’ అని మన్మోహన్ అడిగితే, ‘‘నేను జంప్ చేశాను’’అని రంగరాజన్ సింపుల్‌గా చెప్పేశారు. దాంతో మన్మోహన్ ‘‘అయితే సరే’’ అని చెప్పి సంభాషణను ముగించారు. ఆనాటి తన సమాధానం గురించి రంగరాజన్ నాకు చెబుతూ, రూపాయి విలువను తగ్గించడానికి ఆర్బీఐ కోడ్ భాష వాడిందని వివరించారు. ఆ కోడ్ ఏమిటంటే ‘హాప్, స్కిప్, అండ్ జంప్’. ‘నేను జంప్ చేశాను’ అనే సమాధానానికి ‘‘రెండో దశ రూపాయి విలువ తగ్గింపు ప్రక్రియ పూర్తయిందనీ, దాన్ని ఇక ఆపలేమనీ’’ అర్థం. రంగరాజన్ రాసిన పుస్తకం అయిదేళ్లు ఆయన గవర్నర్ పదవిలో ఉన్న రోజుల్లో చేసిన కొన్ని మంచి విషయాలను కూడా పొందుపర్చింది. ఈనాటి గవర్నర్లకు కొన్ని మంచి సలహాలను కూడా ఇది సూచించింది. ఒరిస్సాలో గవర్నర్‌గా ఉన్నప్పుడు భారత రాజకీయ నాయకులపై జ్యోతిష్యం ఎంత బలంగా ప్రభావం వేస్తోందో రంగరాజన్ కనుగొన్నారు. ఆనాడు ఒరిస్సా ముఖ్య మంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగ్ కేవలం శుభ ముహూర్తాల్లో మాత్రమే గవర్నర్‌ని కలిసేవారట. ‘‘ఉదయం 11.13కు నేను మిమ్మల్ని కలుస్తాను’’ అని గమాంగ్ అనేవారని ఈ పుస్తకం చెబుతోంది. ఇక నేటి గవర్నర్లకు ఈ పుస్తకం ఇస్తున్న సలహా నిజంగానే ఉపయోగకరంగా ఉంది. ముఖ్యమంత్రి చేస్తున్న పనులు గవర్నర్‌కి నచ్చకపోయిట్లయితే, ఆయన లేదా ఆమె ముఖ్య మంత్రితో నేరుగా చర్చించాలనీ, లేదా రాష్ట్రపతికి ఈ వ్యవహారంపై లేఖ రాయవచ్చనీ రంగరాజన్ తన పుస్తకంలో రాశారు. అంతకు మించి తన అసమ్మతిని, వ్యతిరేకతను గవర్నర్ బయటకు వెల్ల డించకూడదనీ, ప్రజా ప్రదర్శన చేయకూడదనీ సలహా ఇచ్చారు. ఈ మాటలు మమతా బెనర్జీ గానీ విన్నట్లయితే ఎంతో సంతోష పడతారు! గతంలో ప్రముఖ రాజకీయ నేతలుగా ఉన్న వ్యక్తులను గవ ర్నర్లుగా నియమించినప్పుడు ‘‘కార్యాచరణలోకి దిగాలన్న దురద వారిలో కొన్నిసార్లు స్పష్టంగా కనిపిస్తుంది’’ అని రంగరాజన్ అంటారు. ఆయన సలహా ఒకటే! అది ఏమిటంటే – ‘‘వారు తమ అత్యుత్సాహాన్ని అదుపులో పెట్టుకోవడం తప్పక నేర్చుకోవలసి ఉంది... గవర్నర్లు తమకు గల అధికారాలను మాత్రమే కాకుండా తమ పరిమితులను కూడా అర్థం చేసుకోవలిసి ఉంటుంది.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
బొమ్మల కథావాహిని
బొమ్మతో అనుబంధం... బొమ్మతో ఆడుకోవడం మన బాల్య జ్ఞాపకం. బొమ్మను నేస్తంలా, బిడ్డలా హత్తుకునే చిట్టి మనసులకు ఆ బొమ్మతోనే పదేళ్లుగా పిల్లల్లోనూ, పెద్దల్లోనూ సామాజిక సమస్యలపై అవగాహన కలిగిస్తూ ఉన్నారు పప్పెట్రీ కథకురాలు పద్మినీ రంగరాజన్. హైదరాబాద్‌లో ఇరవై ఏళ్లుగా బొమ్మలతో దోస్తీ చేసిన ఈ కథల నేస్తం గురించి... ‘పిల్లలూ.. ఇప్పుడు ఈ మల్లూ మీతో మాట్లాడతాడు..’ అని ఆసక్తిగా బొమ్మలతో కథలు చెప్పడమే కాదు, జానపద సాహిత్యాన్ని మన కళ్లకు కడతారు. సోషియాలజీలో పరిశోధకురాలుగా ఉన్నారు. పదేళ్ల పాటు అధ్యాపకురాలిగా పనిచేశారు. స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పేరుతో సంస్థను నెలకొల్పిన పద్మిని రంగరాజన్‌ని కలిస్తే మనకు ఆసక్తికరమైన ఎన్నో విషయాలు పరిచయం అవుతాయి. పిల్లలకు తోలుబొమ్మల ద్వారా కష్టమైన గణితాన్ని, ఆంగ్లవ్యాకరణాన్ని సులువుగా నేర్పించవచ్చని తెలుస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు, సామాజిక సమస్యలపై అవగాహన ఆసక్తి కలిగేలా చెప్పవచ్చనే విషయం స్పష్టం అవుతుంది. అనుకోకుండా మొదలైన పప్పెట్రీ తన జీవిత విధానంలో తీసుకువచ్చిన మార్పుల గురించి ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు పద్మినీ రంగరాజన్. ‘‘మల్లు అనేది నా మొదటి గ్లౌజ్ కోతి తోలుబొమ్మ. నేరుగా నేను కాకుండా బొమ్మ మాట్లాడుతుంటే పిల్లలు ఒళ్లంతా కళ్లు, చెవులు చేసుకుని వింటుంటారు. ఆ సమయంలో ఎంత ఉత్సాహంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇరవై ఏళ్ల క్రితం.. నా కొడుకు ఆసక్తి గా కథ వినడం కోసం ఈ బొమ్మల కళను ఎంచుకున్నాను. అలా మొదటిసారి తోలుబొమ్మతో మా అబ్బాయికి పురాణకథను చెప్పాను. ఆ తర్వాత్తర్వాత పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో తోలుబొమ్మతో కథలు చెప్పడం మొదలయ్యింది. స్నేహితుల సంఖ్య పెరిగింది. బొమ్మలతో పిల్లలకు లెక్కలు చెప్పడం, ఇంగ్లిష్ గ్రామర్ చెప్పడం సులువయ్యింది. ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ పప్పెట్రీ నా జీవితంలో భాగమైపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే మా అబ్బాయితోపాటు నాలోనూ ఈ కళ పట్ల ఇష్టం బాగా పెరిగిపోయింది. ఇంటినుంచి మొదలైన ఈ బొమ్మల కథ బయటి నా ప్రపంచాన్ని విస్తృతం చేసింది. స్ఫూర్తి థియేటర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌ను ఏర్పాటు చేసేలా చేసింది. పిల్లలే అభిమానులు తోలుబొమ్మలాట కళ అంతరించిపోతుందునుకున్న నాకు కథల ద్వారా ఈ కళను కాపాడవచ్చని, ఇంకా ఇష్టంతో కష్టపడేలా చేసింది. అందులో భాగంగానే వరంగల్ జిల్లాల్లోని అమ్మాపురంలో తీగతోలుబొమ్మలాట పునరుద్ధరణ గుర్తించిన వాటిలో ఒకటి. స్కూళ్లలోనూ పప్పెట్రీ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. పిల్లలకోసమే వర్క్‌షాప్స్ నిర్వహించాను. ముందుకన్నా పిల్లలంతా ఈ కార్యక్రమాల్లో చాలా చురుకుగా మారడం గమనించాను. దీనివల్ల పిల్లల తల్లిదండ్రులకూ దగ్గరయ్యాను. నాన్న మార్గనిర్దేశం.. ఇంట్లో పురాణాలు, ఇతిహాసాలు కథలుగా మా పెద్దలు చెబుతుండేవారు. నేనూ నా తర్వాతి తరానికి అందించడానికి అదే ప్రయత్నం చేశాను. అయితే, తోలుబొమ్మలతో కథలు చెప్పడం మాత్రం మా నాన్న మార్గనిర్దేశం చేశారు. రామాయణ, మహాభారతం, పురాణాల నుండి మాత్రమే కాకుండా సమకాలీన ఇతివృత్తాల మిశ్రమంతో కథలు చెప్పడం ప్రారంభించాను. తోలుబొమ్మలాట శతాబ్దాలుగా మన జీవనంలో ఇమిడి ఉంది. ఇది వినోదం మాత్రమే కాదు అవగాహన నింపే విద్య కూడా. ఈ కళను జనంలోకి తీసుకెళ్లడానికి ప్రస్తుత కాలానికి తగినట్టు ఎన్నో ప్రయోగాలు చేయడం వల్ల పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తిగా వింటున్నారు. కథే స్ఫూర్తి స్ఫూర్తి థియేటర్ ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ 2005లో ప్రారంభించినప్పటి నుంచి గిరిజన విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చాను. ఉట్నూర్‌లో ఆరోగ్య సమస్యల గురించి గోండు భాషలో వివరించిన కార్యక్రమం చాలా ప్రశంసలు పొందింది. టైప్ 1 డయాబెటిస్ పిల్లల ఆరోగ్య స్థితిపైనా పప్పెట్రీ వర్క్ చేస్తున్నాను. పుతాలికా మాస పత్రిక కరోనా సమయంలో పుతాలిక పేరుతో నెలవారీగా ఇ–మ్యాగజైన్ తీసుకువస్తున్నాను. ఇది ప్రపంచంలో ఉన్న తోలుబొమ్మల కళాకారులందరినీ పరిచయం చేస్తుంది. దీంతోపాటు పప్పెట్రీ గురించి ఆన్లైన్ తరగతులు కూడా నిర్వహిస్తున్నాను. కిందటేడాది స్వచ్ఛతా సారథి ఫెలోషిప్ లభించింది. దీంట్లో భాగంగా వ్యర్థాలతో ముఖ్యంగా ప్లాసిక్, ఖాళీ అట్టపెట్టెలు, థర్మాకోల్, పాత కుషన్లలోని దూది, కొబ్బరి చిప్పలు, పాత బట్టలు, పాత టీ స్ట్రెయినర్లు, వార్తాపత్రికలతో బొమ్మలను తయారు చేయిస్తుంటాను. దీనివల్ల వ్యర్థాలను అర్థాలుగా మార్చడం ఎలాగో పిల్లలకు తెలుస్తుంది. మనుగడకు పోరాటం మనదేశంలో తోలుబొమ్మలాట అనేది కుటుంబ సంప్రదాయం. దీనికి తగినంత ప్రోత్సాహం లేకపోవడంతో ఈ సంప్రదాయం అంతరించిపోయే అవకాశాలున్నాయి. ఈ రంగంలో ఉన్నవాళ్లు తమ మనుగడ కోసం వేరే దారులను వెతుకుతున్నారు. అయినప్పటికీ ఇతర దేశాలలో తోలుబొమ్మలాటలో చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కళను బతికించడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నాను. ఇందుకోసం నా జీవితాంతం కృషి చేస్తూనే ఉంటాను’ అని వివరించారు పద్మినీ రంగరాజన్. తోలుబొమ్మల ద్వారా పురాణ కథలను ఆసక్తిగా చెప్పడమే కాదు బాల్యవివాహాలను అరికట్టడం, పరిశుభ్రత కోసం ఏం చేయాలి, కుటుంబ నియంత్రణ.. వంటి సామాజిక సమస్యలపై సమర్థంగా పనిచేసే మాధ్యమం తోలుబొమ్మలు అని తెలిపే పద్మినీ రంగరాజన్ ‘తోలుబొమ్మ కఠినంగా మాట్లాడినా ఎవరూ అంతగా బాధపడరు’ అని నవ్వుతూ వివరిస్తారు. – నిర్మలారెడ్డి -
వాస్తవ ఘటన ఆధారంగా ‘కంపెనీ’
వాస్తవ ఘటన ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం కంపెనీ. గోలిసోడా చిత్రం ఫేమ్ పాండీ, మురుగేశన్, నవ నటుడు టిరీష్ కుమార్, పృథ్వీ కథానాయకులుగాను, నటి వలిన, గాయత్రి నాయికలుగా నటిస్తున్నారు. ఎస్.రంగరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ మహానంద సినిమాస్ పతాకంపై ఆర్.మురుగేశన్ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కరూర్ జిల్లాలోని బస్సుల తయారీ కర్మాగారంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిందన్నారు. అందులో పని చేసే నలుగురు యువకులు తమ లక్ష్యం కోసం పాటుబడ్డారన్నారు. ఆ సమయంలో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? వంటి పలు ఆసక్తికరమైన విషయాలతో యాక్షన్ డ్రామా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ కరూర్ జిల్లాలోని బస్సుల తయారీ కర్మాగారంలోనే చేపట్టినట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. దీనికి సెంథిల్‌కుమార్ ఛాయాగ్రహణం, జుపిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: రంగరాజన్
సాక్షి, తిరుపతి : వంశపారంపర్య హక్కు అనేది ఒక్క అర్చకులకే కాదని, ఎన్నో కుల వృత్తుల వారు తరతరాలుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో ఉన్నారని చిలుకూరు బాలాజీ టెంపులు ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. కుల వృత్తుల ప్రభావం తెలియకుండా 1987లో అప్పటి ప్రభుత్వం తీసేసిందన్నారు. ఏపీ అసెంబ్లిలో సన్నిధి గొల్లల వంశపారంపర్య హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని రంగరాజన్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అన్నమయ్య వంశస్తులు, నాయీ బ్రాహ్మణులకు త్వరలో వంశపారంపర్య హక్కులు కల్పిస్తారని ఆశిస్తున్నా. లిక్విడ్ ఓజోన్ను చిలుకూరులో ఏర్పాటు చేశాం. కరోనాతో కలిసి సంసారం చేయాలి కాబట్డి ఇది రక్షగా ఉంటుంది. ప్రతి సారీ శానిటైజ్ చేయడం కుదరదు. దీన్ని పీల్చుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. భక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా ఆలయాలలో వీటిని ఉపయోగిస్తే బాగుంటుంది. -
‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పది’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్ సమర్ధించారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తిరుమలతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. ఇక శ్రీరామ నవమికి ఈ ఏడాది భక్తులు తమ గుండెళ్లో కొలుచుకోవాలన్నారు. వచ్చే ఏడాది శ్రీరామనవమి నాడు రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహించుకుందామని ఆయన భక్తులకు సూచించారు. అదేవిధంగా చిలుకూరు ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేయడం తనకు బాధగానే ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాన అర్చకులు రంగారాజన్ తెలిపారు. -
ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ ఒక్కటే కట్టడి చేయలేదు: రంగరాజన్
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) సమస్యను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక్కటే కట్టడి చేయలేదని మాజీ గవర్నర్ సీ రంగరాజన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడిలో కీలకమైన సరఫరాలో సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ‘నూతన ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్ – దాని అర్థం’’ అన్న చర్చాపత్రంపై ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్బీఐ ద్రవ్య విధాన పరిమితుల గురించి మాట్లాడారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యో ల్బణం ఒక్కసారిగా 7.5 శాతాన్ని జనవరి (7.59 శాతం) దాటింది. ద్రవ్యోల్బణం కట్టడితోపాటు, వృద్ధి, ఫైనాన్షియల్ రంగం సుస్థిరత వంటి ఎన్నో బాధ్యతలను ఆర్బీఐ నెరవేర్చాల్సి ఉంటుందని రంగరాజన్ అభిప్రాయపడ్డం గమనార్హం. -
అర్చకుల పరంపరకు నీరాజనం
వంశపారంపర్య అర్చకత్వాన్ని, అన్ని రకాల మిరాసీ హక్కుల్ని రద్దుచేస్తూ ఎన్టీఆర్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని సవరించింది. ఒక్క డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమే అర్చకుల ఆక్రందనకి స్పందించారు. 2004 ఎన్నికల ప్రణాళికలో ఈ వాగ్దానాన్ని చేర్చారు. ఇరవయ్యేళ్ల క్రితం నాటి దేవాదాయ చట్ట సవరణని రద్దుచేస్తూ, అర్చకుల ప్రయోజనాలు కాపాడేలా కొత్త సవరణ తీసుకువచ్చి తీరాలని సంకల్పించారు. 1987 నాటి చట్టాన్ని సవరిస్తూ 2007లో శాసనసభ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. కానీ చట్టాన్ని సవరించినా అది గత 10 ఏళ్ళుగా అమలుకు నోచుకోలేదు. 2019లో నాన్నగారి నెరవేరని ఆశయాన్ని నెరవేర్చినందుకు అర్చకుల పరంపరను రక్షించే జీవో 439 వెలువరించినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి భక్తులు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కృతజ్ఞతాభివందనం చేస్తున్నది. భయంకరమైన దట్టమైన అరణ్యం. మధ్యలో ఓ చిన్నగుడి. అందులో ఓ దైవం. అట్నుంచి ఇటూ, ఇట్నుంచీ అటూ చెదురుమదురుగా వెళ్తుండే బాటసారులు ఆగి, ఆ దైవాన్ని దర్శించుకొని, ప్రశాంత చిత్తంతో ప్రార్థన చేసి, అంతా మంచి జరగాలని భక్తితో వేడుకోవడం... ఒక పెద్ద కొండ.... కొండ శిఖరం పైన ఓ ఆలయం. వందల కొద్దీ మైళ్ళ దూరం నుంచి జనం ఆర్తితో నడిచి, కాళ్ళు పడిపోతున్నా ఆ దైవాన్ని స్మరించుకుంటూ కొండెక్కి, భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించుకోవటం.. అది అడవికానీ, కొండకానీ, కుగ్రామం కానీ ఎక్కడ దేవాలయం వున్నా, భక్తుల ప్రార్థనలనీ, పూజలనీ వేదోక్తంగా దైవానికి నివేదించే సంధాత అర్చకుడు. ఆలయాలకి ఆదాయాలు ఏవిూ లేని రోజుల్లో, రోడ్లు, లైట్లు కూడా లేని కాలంలో సయితం ‘‘సమాజం పట్ల ఇది మన కర్తవ్యం’’ అని భావిస్తూ నిలువునా మంచు కురుస్తున్నా, ఆకాశం కుండపోతగా వర్షిస్తున్నా నిర్దిష్ట విధి విధానంలో కచ్చితంగా నిర్ణీత సమయాల్లో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలను అతను నిరాటంకంగా సాగిస్తూ వచ్చాడు. ఆలయాలు వుంటేనే అర్చకుడికి పాత్ర వుంది. అలా ఆలయాలని నెలకొల్పి, ఆ ఆలయాల ద్వారా భక్తి పరిమళాలు సమాజంలో వ్యాపించాలని ఆకాంక్షించిన చక్రవర్తులు, రాజులు, జమీందారులు, శక్తి కలిగిన దాతలు కొండల్లో, కోనల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా దేవాలయాలను నిర్మింపజేశారు. ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా, నిరంతరం కొనసాగాలన్న లక్ష్యంతో ఆయా దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు నిరంతరం జరిగేలా తగిన మాన్యాల్ని కూడా ఆ స్థాపక ధర్మకర్తలు ఏర్పాటు చేశారు. అలా దేవాలయాల ఉనికి, అర్చకుల ధర్మకర్తల మనుగడ అనాదిగా ఒకదానికొకటి పెనవేసుకుపోయాయి. తరాల తరబడి ఆ స్థాపక ధర్మకర్తల వారసులు, వంశపారంపర్యంగా ఈ అర్చకులూ ధర్మప్రచారానికి ఆలంబనగా ఈ దేవాలయ సంస్కృతిని కాపాడుతూ వస్తున్నారు. కానీ....1987లో ఎన్.టి.రామారావు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలలో వంశపారంపర్య అర్చకత్వాన్ని, అన్ని రకాల మిరాసీ హక్కుల్ని రద్దుచేస్తూ దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని సవరించింది. అందుకు తగిన కారణంగా–తిరుమల తిరుపతి దేవస్థానాల్లోని మిరాసీ వ్యవస్థను ప్రభుత్వం చూపించింది. అలా నేరుగా చెప్పకుండా, ముందు మిరాసీ వ్యవస్థ మీద చల్లా కొండయ్య కమిషన్ వేసింది. కమిషన్ లక్ష్యానికి అనుగుణంగా ఒక పత్రికలో ‘కలియుగ వైకుంఠపాళి’ అనే పేరుతో వ్యాసాలు వరుసగా ప్రచురితమయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చల్లా కొండయ్య కమిషన్ ముందు ప్రజల అభిప్రాయాలు ప్రశ్నావళికి వారు ఇచ్చిన సమాధానాలు ఈ దినపత్రిక ఆఫీసుకు ఎలా చేరాయి? ఇది ప్రజలను ఒక పథకం ప్రకారం మిరాసీ వ్యవస్థపై బురద జల్లే కుట్ర కాదా? కమిషన్ నివేదిక ఇచ్చే ముందే మాయచేసే కుట్ర కాదా? చివరికి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఎన్.టి.రామారావు ప్రభుత్వం ముందస్తు ఎజెండా ప్రకారం మిరాసీ వ్యవస్థని రద్దు చేసింది. రాష్ట్రంలో 30 వేలకు పైగా దేవాలయాలున్నాయి. అన్ని దేవాలయాలకూ తిరుమల దేవాలయంలా కోట్లలో ఆదాయాలున్నాయా? అలాంటి చోట వంశపారంపర్య హక్కుదారులు కోట్లకు కోట్లు సంపాదిస్తారా? అయినా, వంశపారంపర్య అర్చక వ్యవస్థని ఒక్క తిరుమల సాకుగా అన్ని దేవాలయాల్లో ఎలా రద్దు చేస్తారు?.... ఈ అంశం మీద అర్చకులందరికీ కడుపు మండిపోయింది. చిలుకూరులోని బాలాజీ ఆలయానికి చెందిన (ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రారు) ప్రొఫెసర్ సౌందరరాజన్ ఆధ్వర్యంలో అర్చకులు ఉద్యమించారు. ఆ ఒక్క ప్రొఫెసర్–ఏ అర్చక సంఘం కలిసి వచ్చినా, రాకపోయినా సుప్రీంకోర్టు దాకా పోరాడారు. ‘చట్టం కోరల్లో దేవాలయాలు’ అని పుస్తకాలు రాసి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రచారం చేశారు. ప్రతి పార్టీ నాయకుణ్ణి కలిసి–మీ ఎన్నికల ప్రణాళికలో ‘‘ఈ క్రూరమైన చట్ట సవరణని రద్దు చేస్తాం’’ అని ప్రకటించండి–అని బతిమాలారు, అర్థించారు, ఆక్రోశించారు. ఒక్క డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాత్రమే అర్చకుల ఆక్రందనకి స్పందించారు. 2004 ఎన్నికల ప్రణాళికలో ఈ వాగ్దానాన్ని చేర్చారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. 2006లో ముఖ్యమంత్రి వైఎస్సార్ అప్పటి రెవెన్యూ (ఎండోమెంట్) కార్యదర్శి డాక్టర్ ఐ.వి. సుబ్బారావు గారిని పిలిచి చెప్పారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం నాటి దేవాదాయ చట్ట సవరణని రద్దుచేస్తూ, అర్చకుల ప్రయోజనాలు కాపాడేలా కొత్త సవరణ తీసుకువచ్చి తీరాలి... నేను వాళ్లకి వాగ్దానం చేశాను. మాట తప్పానని నాకు మాట రాకూడదు...’’ చివరికి 2007లో 1987 నాటి చట్టాన్ని సవరిస్తూ, శాసనసభ ఒక కొత్త చట్టాన్ని తెచ్చింది. దాని ప్రకారం వంశపారంపర్య అర్చకత్వం అర్చకులకు ఒక బాధ్యత. వాళ్లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనీ, పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలనీ, అర్చక శ్రేయోనిధి ఏర్పాటు చేయాలనీ... ఇలాంటి అనేక కొత్త అంశాలతో ఆ చట్టం వచ్చింది. ఇరవయ్యేళ్లుగా పోరాడి అలసిపోయిన అర్చకులంతా డాక్టర్ రాజశేఖరరెడ్డిని హైదరాబాద్‌లోని తిరునిలయంలో 2007 డిసెంబర్ 15వ తేదీనాడు అత్యంత ఘనంగా సత్కరించి, తమ కృతజ్ఞత చాటుకున్నారు..’’. ఇటీవల వెలువడిన ‘‘వైఎస్ఆర్ ఛాయలో’’ అనే పుస్తకంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని జి. వల్లీశ్వర్, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం చేసిన కృషిని ఉటంకిస్తూ మహానేత అర్చకులపట్ల సానుభూతితో వ్యవహరించిన తీరును ఉటంకించారు. ఈ సమస్యకు సుప్రీంకోర్టు తీర్పే ముగింపు అని ఎండోమెంట్ శాఖాధికారులు భావిస్తున్నారు. కానీ, మన ఆలయ సంస్కృతిని ధ్వంసం చేయగల ఈ మహమ్మారి నుంచి విముక్తి లభించటానికి ‘30/87 చట్టాన్ని ప్రభుత్వం సవరించటం’ ఒక్కటే పరిష్కారం. కానీ చట్టాన్ని సవరించినా అది గత 10 ఏళ్ళుగా అమలుకు నోచుకోలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉద్యమాలు చేసినా విఫలమయ్యాం. ఆశ్చర్యం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉంది. దేవాలయాల ఆదాయంలోంచి 21.5%ను ప్రభుత్వం దాని బొక్కసంలోకి గుంజుకుంటున్నది. ఔరంగజేబ్ కాలంనాటి జిజియా పన్నుకు (మతావలంబనకు విధించే పన్ను), దీనికీ తేడా ఏమీలేదు. ఈ విషయాన్ని 2009లో ఏర్పాటయిన అర్చకుల వేతన స్కేళ్ల కమిటీ కూడా వేలెత్తి చూపింది. గత ప్రభుత్వం అయితే మోసాలలోకే పెద్ద మోసపూరిత పని చేసింది. అర్చకుల సంక్షేమం, వేతన స్కేళ్ల కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ జి.ఓ.ఎంఎస్ నం.76ను ఫిబ్రవరి 16, 2017న విడుదల చేసింది. దీన్ని చూసి మురిసిపోయిన అర్చకస్వాములు ఈ చరిత్రాత్మక జీ.ఓ.ను తీసినందుకు అప్పటి ముఖ్యమంత్రి (చంద్రబాబుని) ఆకాశానికెత్తేసి అభినందన మాలలతో ముంచెత్తారు. ఆ పొగడ్తల మత్తులో ఆ జీఓ అమలు నిలిచిపోయింది.. తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. సవరించిన చట్టానికి వ్యతిరేకంగా తిరుమల మరియు తిరుచానూరు అర్చకులను చంద్రబాబు పదవీ విరమణ చేయించారు కూడా. కానీ వైఎస్సార్ చట్టంలో వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ లేదు. 2019లో చారిత్రాత్మకమైన ప్రజా మద్దతుతో ఎంపికైన వైఎస్సార్ తనయుడుగా నాన్నగారి నెరవేరని ఆశయాన్ని నెరవేర్చినందుకు అర్చకుల పరంపరను రక్షించే జీవో 439 వెలువరించినందుకు ధన్యవాదాలు. దేవాలయాలపై మేనిఫెస్టోలో చేర్చిన అంశం ఇది... మేనిఫెస్టోయే తనకి పవిత్ర గ్రంథం అని చెప్పే ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు. హామీలు గుప్పించడం, ఆకాంక్షలు చొప్పిం చడం, అమలు దగ్గరకొచ్చేసరికి బెల్లం కొట్టిన రాయిలాగా పోజి వ్వడం–ఈ లక్షణాలు ప్రభుత్వాల విశ్వసనీయతను పెంచవని రాజ్యాంగం కూడా మొత్తుకుంటున్నది. అర్చకుల విషయంలో ఇదేకదా ఇప్పటి వరకు జరుగుతున్నది. హిందువులు అన్ని విషయాల్లో సహకరిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16.2.2017 నాటి జీ.ఓ.76ను జీ.ఓ.ఎం.ఎస్. నెం. 439 ద్వారా అమలుపరచడం ద్వారా శుభారంభం పలికింది. అర్చకులను ఆదుకోవడంలో తద్వారా దేవాలయాలను కాపాడుకోవడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్Sమోహన్‌రెడ్డి తమ తండ్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నారు. వారికి భక్తుల, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కృతజ్ఞతాభివందనం చేస్తున్నది. సి.ఎస్. రంగరాజన్ వ్యాసకర్త దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త ఈ–మెయిల్ : csranga@gmail.com -
చిలుకూరు బాలాజీ సేవలో దళిత భక్తుడు
మొయినాబాద్(చేవెళ్ల) : చిలుకూరు బాలాజీ దేవాల య అర్చకుడు రంగరాజన్ భుజస్కందాలపై కూర్చొని మునివాహన సేవతో ఆలయ ప్రవేశం పొం దిన దళిత భక్తుడు ఆదిత్య పరాశ్రీ సోమవారం చి లుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ఏప్రిల్ 16 న ఆదిత్య పరాశ్రీని అర్చకుడు రంగరాజన్ తన భుజస్కందాలపై ఎత్తుకుని నగరంలోని జియాగూడ లో ఉన్న రంగనాథస్వామి ఆలయంలోకి మునివాహన సేవతో ఆలయ ప్రవేశం చేయించారు. ఆ భక్తుడు మొదటి సారిగా సోమవారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించడంతో అర్చకుడు రంగరాజన్ ఆ భక్తుడిని గర్భగుడిలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. అదే విధంగా మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల సోమవారం బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. వీరితోపాటు టీయూఎఫ్ఫౌండర్ కుమారస్వామి స్వామివారిని దర్శించుకున్నారు. -
ఆలయాలపై రాజకీయ పెత్తనం తగ్గాలి
-
‘ఆలయాలపై రాజకీయ పెత్తనం తగ్గాలి’
సాక్షి, కడప : ఆలయాలపై రాజకీయ పెత్తనం తగ్గాలని ఆలయాల సంరక్షణ సంధాన కర్త రంగరాజన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవుని కడపలోని వెంకటేశ్వరస్వామి ఆలయంపై టీటీడీ అధికారులు చిన్న చూపు మానుకోవాలన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అర్చకులకు జీత భత్యాలు తక్కువగా ఇవ్వడం అన్యాయం అన్నారు. సంభావన తక్కువ ఉన్న వారికి జీతం కూడా తక్కువ ఇవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. టీటీడీలో ఈఓల పెత్తనం తగ్గాలని గతంలో సుప్రీం కోర్టు పేర్కొందని గుర్తు చేశారు. వారసత్వంగా వస్తున్న సంప్రదాయాలని కొనసాగించాలని కోరారు. -
‘లోకేశ్‌ను ఎలా మంత్రిని చేశారు’
మొయినాబాద్(చేవెళ్ల): ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు ఏ అర్హత ఉందని మంత్రిని చేశారని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. టీటీడీ పాలకమండలికి చట్టాలపై అవగాహన లేదన్నారు. తిరుమలపై ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం చిన్న ఆలయాలపై పడుతుందన్న విషయాన్ని టీటీడీ గుర్తించాలన్నారు. ఎండోమెంట్ యాక్ట్‌ని సవరించ కుండా రిటైర్మెంట్ చేయడానికి వీలులేదని, ధార్మిక పరిషత్ ఇచ్చిన రిజల్యూషన్ ను ట్రస్టు బోర్డు కొట్టేయడానికి వీలులేదన్నారు. వంశ పారంపర్యంగా తండ్రి తరువాత కొడుకు అర్చకత్వం నిర్వహించవద్దని చెబుతున్న చంద్రబాబు ఆయన కుమారుడిని మాత్రం వారసత్వంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారని మండి పడ్డారు. ‘అర్చక వ్యవహారాల్లో మీరు వేలు పెట్టారు కాబట్టి మేం మిమ్మల్ని ప్రశ్నలడుగుతాం. మీకు రాజకీయమెందుకని అడుగుతాం.. రాజకీయ నాయకుడు మా దగ్గరకొస్తే మేం రాజకీయ నాయకుడి దగ్గరకొస్తాం’ అని బాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. -
వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం
-
బాబు ప్రభుత్వం పోవాలని ప్రదక్షిణలు చేశారు
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్చకత్వం ప్రాథమిక హక్కు అని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. ఆలయాలకు ఉన్న ఈవోలు మారొచ్చు కానీ అర్చకుడు మారడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆగమం ప్రకారం ఆలయ ప్రతిష్ట జరిగినప్పుడు అర్చకుడిని నియమించుకుంటారని తెలిపారు. 1996లో చంద్రాబాబు సీఎంగా ఉన్న సమయంలో అర్చకులపై సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయలేదని అన్నారు. కానీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1987 పద్దతిని సవరించి అర్చకులను ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆ మహానేతకు తాము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలిపారు. 2003లో చిలకూరులో ప్రతి ఒక్క భక్తుడు చంద్రబాబు ప్రభుత్వం పోవాలని, వైఎస్సార్ రావాలని ఒక ప్రదక్షిణ అదనంగా చేశారని రంగ రాజన్ పేర్కొన్నారు. వారి పరిస్థితి దయనీయం : టీటీడీ తీసుకున్న నిర్ణయం కారణంగా చిన్న ఆలయాల అర్చకుల పరిస్థితి దయనీయమౌతుందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక పరిషత్ ఆమోదం లేనిదే అర్చకులను మార్చకూడదని అన్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటులో రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తోందని ప్రశ్నించారు. కనీసం చర్చించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. -
ఆలయాల సంరక్షణ ఎలా?
ఆ భగవంతునికి అర్చకుడు భగవత్ కైంకర్యంలో తన సర్వస్వాన్ని అర్పిస్తాడు. తనను, తన అధీనంలోని చేతన అచేతన సంపదను నిశ్శేషంగా సమర్పిస్తాడు. ఈ సమర్పణలో అర్చకుని భార్య, పిల్లలు, చుట్టాలు, ధన, కనక వస్తు వాహనాలు మొదలైనవి అతీ తం కావు, అన్నీ స్వామికి సమర్పించి, ఆయన ప్రసాదంగా స్వీకరిస్తాడు. అర్చకుడు ఆలయంలో సేవ చేసినపుడు అతనితోపాటుగా అతని కుటుంబం కూడా శారీరకంగా, మానసికంగా పాలుపంచుకుంటుంది. అర్చకత్వం అనేది ఒక బృహత్తర బాధ్యత. సమాజం సుఖశాంతులతో, సహ భావనలతో వర్ధిల్లాలని భగవంతుని అనునిత్యం ప్రార్థించే అర్చకుడు తిరిగి తనకు అదే సమాజం వస్తు రూపకంగా ఏదైనా తిరిగి ఇవ్వాలని కోరుకోడు. నిస్వార్థంగానే సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తాడు. అటువంటి అమాయక అర్చకుని బాగోగుల గురించి సమాజం ఆలోచించాలి. అవును. తప్పకుండా ఆలోచించాలి. అర్చకుని గురించిన ఈ ఉపోద్ఘాతానికి కారణం ఉంది. ప్రస్తుత సమాజంలో క్షీణించిపోతున్న అర్చక వర్గ సంఖ్య గురించి వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి. యువతరంలో అర్చకత్వంపట్ల సన్నగిల్లుతున్న సుముఖత, అర్చకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేని ఆడపిల్లలు వగైరా. అర్చక కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు సైతం, అర్చకుని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ పరిణామం అత్యంత భయావహం. ఇప్పుడు బరువెక్కిన హృదయంతో ఇటువంటి నాజూకు విష యం గురించి పాఠకులతో తన భావాలను పంచుకోవాలనుకుంటున్నాము. మా ఉద్దేశం సమాజం ఈ సమస్యవైపు తన దృష్టి సారించలేదని కాదు. అర్చకులు ఆలయాలను విడిచిపెట్టి వెళ్లడానికి ప్రేరేపిస్తున్న కారణాల చిక్కుముడులను విప్పడానికి సమాజం కృషి చేస్తూనే ఉన్నది. 1987లో, నాటి ప్రభుత్వం ఆలోచనా రహితంగా చేసిన చట్టంతో వంశపారంపర్య అర్చకత్వం రద్దు అయింది. ఇది సరైన నిర్ణయం కాదని ఎలుగెత్తి చాటిన దేవాలయాల పరిరక్షణ ఉద్యమం, వంశపారంపర్య అర్చకత్వం మళ్లీ పునః అర్చకులకు ఇవ్వాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నది. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం స్ఫూర్తితో భక్తులను ఈ దిశలో ఆలోచించేలా చేసింది. తాము అర్చకత్వ బాధ్యతల నుండి తప్పుకోవడానికి వంశపారంపర్య అర్చకత్వ రద్దే ప్రముఖ కారణంగా పలు వంశపారంపర్య అర్చక కుటుంబాలు పేర్కొన్నాయి. జీవనోపాధికై ఇతర ఉద్యోగాలను చూసుకోవాల్సి వచ్చిందని వారు వాపోయారు. ‘‘అర్చకుని కొడుకు తండ్రికి వారసుడుగా పనికిరాడని ప్రభుత్వమే చట్టం చేస్తే మేమేమి చెయ్యాలి’’ అని ప్రభుత్వంపై నింద మోపారు. తమ బాధ్యతల నుండి తప్పించుకున్నారు. గ్రామీణ దేవాలయాలను మూతపెట్టి వలసలు వెళ్లిపోయారు. 1996లో అమలు చెయ్యడానికి సాధ్యపడని తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు, ఒక అద్భుతమైన తీర్పును చెప్పినట్లుగా తమను తామే అభినందించుకుంది. ఎట్టకేలకు 2007లో వైఎస్ఆర్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనా రహిత చట్టాన్ని సవరించి వంశపారంపర్య అర్చకత్వానికి పునః అవకాశం కల్పించింది. ‘ధార్మిక పరిషత్’ను ప్రవేశపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు దేవాదాయ శాఖలోని కొద్దిమంది స్వార్థపరులైన అధికారులు తమ ధోరణిని మార్చుకోని కారణంగా ఆ చట్టం కూడా అమలుకు నోచుకోలేదు. అర్చకులు వీధినపడ్డారు. దేవాలయాలు మూతపడ్డాయి. దేవాదాయ చట్టంలో సూచించినట్లుగా భక్త సమాజాల స్థాపనే ఇక మనకు మిగిలిన ఏకైక ఆశ. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య ఉంది. ఈ ధోరణి ఇంకా భయపెట్టేదిగా ఉంది. గ్రామీణ ఆలయాలన్నీ మూతపడ్డాయి. అక్కడ పూజలు చెయ్యడానికి అర్చక కుటుంబాలు లేవు. స్థానికులు ఆలయాలను పూర్వస్థితికి తీసుకురావాలని ముందుకు వస్తున్నా కూడా, అర్చకులు తిరిగి తమ పూర్వ బాధ్యతలు స్వీకరిస్తారా అనేది ప్రశ్నార్థకం. దీనికి పరిష్కారం ఏమిటి? మనం, అవును. భక్తులమైన మనమే దీనికి తగిన పరిష్కారం ఆలోచించాలి. అర్చకులు గ్రామీణ ఆలయాలను వదిలి వెళ్లకుండా ఆపాలి. వారి కుటుంబ బాధ్యత మనం స్వీకరించాలి. ఈ పని ప్రభుత్వం ఏవో కొన్ని స్కీములు ప్రవేశపెట్టడం ద్వారా చెయ్యలేదు. దీనికి ఒకే మార్గం. భక్త సమాజాల స్థాపన. ఆలయాల నిత్య విధులకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ భక్త సమాజాలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వగలవు. ప్రతి గ్రామంలోనూ, అక్కడి స్థానికులైనా, లేకపోతే అక్కడి మూలాలు ఉన్నవారైనా కనీసం 15 కుటుంబాలు కలిసి సంవత్సరానికి కనీసం కొంత ధనాన్ని సేకరించగలిగితే, గ్రామంలోని ఆలయంలో నిత్య విధులు, ఉత్సవాలు సక్రమంగా జరిపించవచ్చు. నిజంగానే ఇది సాధ్యం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. ఈ లక్ష్య సాధనకై అందరం పాటుపడదాం. సి.ఎస్. రంగరాజన్ వ్యాసకర్త ఆలయాల సంరక్షణ ఉద్యమ కన్వీనర్ మొబైల్ : 98851 00614 -
డిసెంబర్లో ద్రవ్యోల్బణం దిగొస్తుంది
హైదరాబాద్: ద్రవ్యోల్బణం డిసెంబర్ నాటికి చల్లబడుతుందని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ సి.రంగరాజన్ చెప్పారు. అక్టోబర్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం 3.58 శాతానికి చేరటం తెలిసిందే. డిసెంబర్ నాటికి ఇది నెమ్మదిస్తుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4 శాతం లోపే ఉంటుందని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలకు ప్రస్తుత సీజన్ ముగింపు అని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే నెల నాటికి సీజన్ వారీగా ధరలు తగ్గుతాయన్నారు. ‘‘వర్షాలు బాగానే ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు ఇంకా పెరగడానికి బదులు తగ్గుముఖం పడతాయి’’ అని రంగరాజన్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రంగరాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణ లక్ష్యమైన 4 శాతం లేదంటే ఆ లోపునకే పరిమితమవుతుందన్నారు. అక్టోబర్‌లో ఆహారోత్పత్తుల ధరల పెరుగుదలతో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల గరిష్టానికి చేరిన విషయం తెలిసిందే. -
డిసెంబర్లో తీపికబురు
సాక్షి,న్యూఢిల్లీ: ధరల భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సగటు భారతీయుడికి మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ తీపికబురు చెప్పారు. ధరాఘాతం నుంచి డిసెంబర్లో ఉపశమనం లభించవచ్చని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతం నాటికి ద్రవ్యోల్బణం నాలుగు శాతం దిగువకు రావచ్చని ఆయన అంచనా వేశారు. ఆహార వస్తువులకు సంబంధించి డిసెంబర్ వరకూ ధరల పెరుగుదల కొనసాగినా ఆ తర్వాత ద్రవ్బోల్బణం దిగివస్తుందని చెప్పారు. ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉండటంతో ఆహారోత్పత్తుల ధరలు పెరిగే అవకాశం లేదని, అవి మరింత దిగివస్తాయని పేర్కొన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే వాహన, గృహ, వ్యక్తిగత రుణాల వినియోగదారుల నెలవాయిదాలు(ఈఏంఐ) కొంతమేర దిగివస్తాయి. -
‘ఆ బాధ్యత నుంచి బ్యాంకులు తప్పించుకోజాలవు’
హైదరాబాద్: నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకులు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోజాలవని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నారు. 2017 యూనియన్ బడ్జెట్‌పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన గందరగోళం ప్రస్తుతం సమసిపోయినప్పటికీ రియల్ఎస్టేట్ వంటి రంగాలపై కొన్ని దుష్ఫలితాలు ఇంకా అలాగే ఉన్నాయని అన్నారు. బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయన్నది నిర్వివాదాంశమని అభిప్రాయపడ్డారు. దీనిని క్యాపిటలైజేషన్ ద్వారా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. -
ఆర్థిక సంస్కరణలతో దేశాన్నికాపాడింది పీవీయే!
-
ఆర్థిక సంస్కరణలతో దేశాన్నికాపాడింది పీవీయే!
సాక్షి, హైదరాబాద్: నూతన సంస్కరణలను ప్రవేశపెట్టి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన హీరో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని మాజీ గవర్నర్ రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆయన తన విధానాలతో దేశాన్ని అనేక సమస్యల నుంచి బయటపడవేయగలిగారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ స్టడీస్‌లో జరిగిన కార్యక్రమంలో సంజయ్ బారు రచించిన ‘1991 హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ’ అనే పుస్తకాన్ని రంగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. సంజయ్‌బారు తన పుస్తకంలో పీవీ కన్నా ముందు ప్రధానులుగా ఉన్న వీపీ సింగ్, చంద్రశేఖర్లకు ఈ దేశ పరిస్థితులపై ఎటువంటి అవగాహన ఉన్నదన్న సంశయాన్ని లేవనెత్తారని రంగరాజన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని పొందడంపై కూడా ఆనాటి రాజకీయనేతల్లో అవసరమైన చొరవ కొరవడిందని వ్యాఖ్యానించారు. అయితే 1991 నాటి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు పీవీ నరసింహారావుకు సంస్కరణల అవకాశం కల్పించాయని చెప్పారు. ఒకవేళ అప్పుడు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్నా ఆర్థిక సంస్కరణలను ఆహ్వానించక తప్పేది కాదన్నారు. ఈ పుస్తకం ఆద్యంత ఆసక్తిదాయకంగా ఉందని చెప్పారు. అయితే 1992లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ప్రస్తావన కూడా పుస్తకంలో ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అద్భుత పథకాల రూపశిల్పి ఆర్థిక సంస్కరణల సృష్టికర్త మాత్రమే కాదని.. సోషలిజాన్ని కాంక్షించిన నెహ్రూ అనుయాయుడు పీవీ అని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సీహెచ్ హనుమంతరావు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల ద్వారానే సామాజిక న్యాయం చేకూర్చగలమని ఆయన నమ్మి, ఆచరించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అట్టడుగు బలహీన వర్గాలకు పథకాలు చేరకపోతే నష్టం జరుగుతుందని భావించి.. నేరుగా కేంద్రం నుంచి పేద, దళిత, బలహీనవర్గాలకు అందేలా అద్భుతమైన పథకాలను రూపొందించారని ప్రశంసించారు. ఆనాడు పీవీ వద్ద పనిచేసిన ఎస్.ఆర్.శంకరన్, కె.ఆర్.వేణుగోపాల్‌లు రూపొం దించిన అనేక పథకాల ఫలితాలను ప్రజలు ఇప్పటికీ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు చేరువైన మానవతా మూర్తి పీవీ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆర్థిక సౌలభ్యాలన్నీ ఆయన సంస్కరణల ఫలితమేనని చెప్పారు. పుస్తక రచయిత సంజయ్ బారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు చరిత్రను పూర్తిగా చెరిపేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్కీవ్స్లోగానీ, లైబ్రరీలోగానీ పీవీ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేకుండా చేశారన్నారు. కానీ పీవీ లేని కాంగ్రెస్ చరిత్ర ప్రజలు అంగీకరించరని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి సంధానకర్తగా శ్రీరాం వ్యవహరించగా.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీఆర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా శ్రీరామనవమి తరువాత దశమి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సాయంత్రం సెల్వర్ కూత్తుతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అదనపు బస్సులు నడపనుంది. బ్రహ్మోత్సవాలపై కరువు ఎఫెక్ట్ కరువు ప్రభావం చిలుకూరు బాలాజీపై పడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రతీర్థం రోజు 23న స్వామివారి అభిషేకం చేసేందుకు నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. బాలాజీ ఆలయం ముందు ఉన్న కోనేరులో బ్రహ్మోత్సవాల ముగింపు రోజు చక్రతీర్థం కార్యక్రమం చేపడతారు. ఆరోజు స్వామివారికి కోనేరులో అభిషేకం చేస్తారు. అందుకోసం కోనేరులో నీళ్లులేకపోతే బోరుబావుల నుంచి, ట్యాంకర్ల ద్వారా తెచ్చి కోనేరును నింపేవారు. అయితే ఈ సారి పరిస్థితి మారింది. ప్రస్తుతం కరువు పరిస్థితులతో నీళ్లు దొరకడంలేదు. ఆలయ సమీపంలో ఉన్న గండిపేట జలాశయం పూర్తిగా ఎండిపోయింది. గ్రామాల్లో ప్రజలు తాగేందుకే నీళ్లు దొరకని ఈ పరిస్థితుల్లో స్వామివారి అభిషేకం కోసం సుమారు 150 ట్యాంకర్ల నీటితో కోనేటిని నింపి ఆ తరువాత ఆ నీటిని వృధా చేయడం సరికాదని ఆలయ అర్చకులు భావిస్తున్నారు. కోనేటికి బదులు ప్రత్యేకంగా ఓ తొట్టిని ఏర్పాటు చేసి అందులో స్వామివారి అభిషేకం చేస్తామని ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు, ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. -
మాయదారి లెక్కలు!
పేదరికం గురించి లెక్కలేయడం మన దేశంలో చీకట్లో తడుములా టలా తయారవుతున్నదని అప్పుడప్పుడు విడుదలచేసే అధికారిక నివే దికలను చూస్తే అర్ధమవుతుంది. ఈ తొట్రుపాటు పేదలను లెక్కేయడా నికి ఎలాంటి ఉపకరణాలను వాడాలో తెలియక పోవడంవల్లనా లేక పాలకుల అభీష్టానికి అనుగుణంగా కుదించడానికి చేసే విన్యాసంలో విఫలం కావడంవల్లనా అనేది ఎవరికీ అర్ధంకాని విషయం. ప్రధాని ఆర్ధిక సలహా మండలి మాజీ చైర్మన్ రంగరాజన్ ఆధ్వర్యంలోని కమిటీ తాజాగా విడుదల చేసిన నివేదికను గమనిస్తే నిపుణుల్లో సైతం వాస్తవ పరిస్థితులపై అవగాహనాలోపం ఎంతగా ఉన్నదో తెలుస్తుంది. ఆ కమిటీ చెప్పిన ప్రకారం దేశంలో 36కోట్ల 30 లక్షలమంది పేదలు న్నారు. అంటే దేశ జనాభా 120 కోట్లలో పేదలు 29.6శాతం అన్న మాట. అంటే ప్రతి పదిమందిలోనూ ముగ్గురు పేదలు. గతంలోని గణాంకాలను ఒకసారి నెమరేసుకుంటే దారిద్య్రరేఖ చుట్టూ నిపుణులు గిరికీలు కొడుతున్న తీరు కళ్లకు కడుతుంది. నిరుడు ప్రణాళికా సంఘం పేదల లెక్కలు విడుదల చేసింది. 2004-05తో పోలిస్తే 2011-12 నాటికి పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్పింది. యూపీఏ ప్రభుత్వ తొలినాళ్లతో పోలిస్తే పేదరికం 15 శాతానికిపైగా తగ్గిందని వివరిం చింది. ఈ పేదరికం కొలమానానికి తీసుకునే ప్రాతిపదికలు చిత్రంగా ఉంటాయి. పేదరికాన్ని ఎలా లెక్కేస్తున్నారని 2010లో సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు ప్రణాళికా సంఘం ఇచ్చిన జవాబు న్యాయమూర్తు లనే ఆశ్చర్యపరిచింది. 2004-05 ధరల సూచీ ఆధారంగా లెక్కేసి పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 20(నెలకు రూ. 578), గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 15(నెలకు రూ. 450) మాత్రమే ఖర్చుచేసే వారు పేదలని చెప్పింది. ఈ లెక్కలకు న్యాయమూర్తులు తెల్లబో యారు. ఇంత స్వల్ప మొత్తంతో ఏ వ్యక్తయినా బతకగలరా అని ప్రశ్నిం చారు. ఈ లెక్కలను కట్టిబెట్టి తాజా ధరల సూచీ ఆధారంగా కొత్త గణాంకాలు రూపొందించాలని సూచించారు. ఆ తర్వాతనైనా వారేమీ మెరుగైన లెక్కలు తీసుకురాలేదు. ఈసారి పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 33.30 (నెలకు రూ. 1,000), పల్లెసీమల్లో రోజుకు రూ. 27.20(నెలకు రూ. 816) ఖర్చుచేసేవారే పేదలని ఇంకో అంచ నాను సర్వోన్నత న్యాయస్థానానికి అందించారు. దాని ప్రకారం ప్రతి పదిమంది భారతీయుల్లో ఇద్దరు నిరుపేదలు. ఒక మనిషి బతకడం అంటే ఏమిటో అర్ధం చేసుకుంటే ఈ లెక్కల్లోని గారడీ ఏమిటో తెలు స్తుంది. అవసరమైన తిండి, బట్ట, గూడు, విద్య, ఆరోగ్యంవంటివన్నీ దీనితోనే సమకూరాలి. అది ఎక్కడైనా సాధ్యమయ్యే పనేనా?! రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 32 కన్నా తక్కువ, పట్టణ ప్రాంతాల్లో రోజుకు రూ. 47కన్నా తక్కువ మొత్తంతో రోజు గడిపేవారంతా పేదలకింద లెక్క. ఇంతక్రితం ప్రణాళికా సంఘం చెప్పిన లెక్కకూ, రంగరాజన్ కమిటీ ఇచ్చిన లెక్కకూ కాస్త వ్యత్యాసమున్నమాట వాస్తవమే. కానీ, ఈ కమిటీ చెప్పిన లెక్కలు కూడా గతంలోని గణాంకాలవలే తప్పుల తడకేనని అర్ధం చేసుకోవడానికి మేధావిత్వ ప్రకర్ష ఏమీ అవసరం లేదు. నిత్యావసరాల ధరలు చుక్కలనంటిన వర్తమాన పరిస్థితుల్లో ఆ డబ్బుతో బతకడం అసాధ్యమని ఎవరికైనా తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో తానున్న చోటు నుంచి పనిచేసే ప్రాంతానికి, అటునుంచి తిరిగిరావడానికి అయ్యే మొత్తమే రూ. 30 దాటుతుంది. అదిపోగా మిగిలేది కేవలం రూ. 17 మాత్రమే అయినప్పుడు మనిషి ఇక ఏం తిని బతకాలి? ఎక్కడ బత కాలి? నిరుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆదాయంతోపాటు పోషకా హారం, చదువు, పారిశుద్ధ్యంవంటి ఇతరేతర అంశాలను కూడా కొల మానంగా తీసుకుని ఒక నివేదిక రూపొందించింది. దాని ప్రకారం పేద రిక నిర్మూలనలో మన దేశం చాలా వర్ధమాన దేశాలకంటే వెనకబడి ఉంది. అసలు దారిద్య్ర రేఖను నిర్ధారించడంలో నిపుణులు ఇన్ని పిల్లి మొగ్గలు వేయడానికి కారణమేమిటి? పేదరికాన్ని అంచనావేయడానికి తీసుకునే ప్రాతిపదికలేమిటి? కేవలం ఆదాయాన్ని మాత్రమే లెక్కేసి, దాన్ని ధరలసూచీతో పోల్చిచూసే విధానం ఒకటైతే...పోషకాహార లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అంచనావేసే విధా నం మరోటి. బ్రిటన్‌లో ఒక కుటుంబ ఆదాయం జాతీయ సగటులో 60 శాతంకన్నా తక్కువగా ఉంటే పేదలుగా లెక్కేస్తారు. అమెరికాలో ఒక కుటుంబానికయ్యే ఆహార వ్యయాన్ని లెక్కేసి దాన్ని మూడుతో హెచ్చిస్తారు. మన దేశంలో ఏవో కాకిలెక్కలే తప్ప నిర్దిష్టమైన విధానం ఉన్నట్టు తోచదు. ఉదాహరణకు జాతీయ పోషకాహార సంస్థ సూచన ప్రకారం ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే రోజుకు 400 గ్రాముల తృణధాన్యాలు, 300 గ్రాముల కాయగూరలు, 80 గ్రాముల కాయధా న్యాలు, 100 గ్రాముల తాజా పండ్లు అవసరం. రంగరాజన్ సూచించే 47 రూపాయలతో ఒక మనిషి ఇన్నిటిని కొనుక్కోగలుగుతాడా? ఒక వేళ అవన్నీ లభిస్తాయనుకున్నా ఉండటానికి, కట్టుకోవడానికి, విద్యకు డబ్బులు ఎక్కడ పుట్టిస్తాడు? తాము అమలు చేస్తున్న పేదరిక నిర్మూ లనా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పుకోవడానికో, అలాంటి పథకాలకు మరింతగా ఖర్చుపెట్టే బాదరబందీనుంచి తప్పిం చుకోవడానికో మాత్రమే ప్రభుత్వాలు ఇలాంటి విచిత్ర గణాంకాలను తీసుకొస్తున్నాయి. సుప్రసిద్ధులైన ఆర్ధికవేత్తలు ప్రభుత్వాల అభీష్టానికి అనుగుణంగా ఈ మాయా గణాంకాలను పరిచి దారిద్య్రం పరారవుతు న్నదని నమ్మించాలని చూడటం దురదృష్టకరం. కనీసం ఎన్డీయే ప్రభుత్వమైనా ప్రతిష్టకు పోకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రాతిప దికలను నిర్ణయించి, వాటి ఆధారంగా పేదల సంఖ్యను లెక్కేస్తే, దాని ఆధారంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తే ప్రజలు సంతోషిస్తారు -
ఉత్తమ కార్పొరేట్ నిర్వహణ... ప్రైవేటు బ్యాంకుల బలం
* తక్కువ మొండిబకాయిలపై కేసీ చక్రవర్తి కామెంట్ * ప్రభుత్వ బ్యాంకులకన్నా మెరుగ్గా ఉన్నాయని విశ్లేషణ ముంబై: బ్యాంకింగ్ రంగానికి పెద్ద సమస్యగా ఉన్న మొండిబకాయిల (ఎన్పీఏ) విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు రంగ బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ రంగరాజన్ పేర్కొన్నారు. కార్పొరేట్ గవర్నెర్స్తో పాటు ఎన్పీఏల అత్యుత్తమ నిర్వహణ, జవాబుదారీతనం, కష్టించి పనిచేసే తత్వం వంటి అంశాలు ఎన్పీఏలను కట్టడి చేయడంలో ప్రైవేటు బ్యాంకులకు కలిసి వస్తున్న అంశాలని శుక్రవారం ఆయన విలేకరులతో అన్నారు. పదవీవిరమణ సమయానికి రెండు నెలల ముందుగానే ఏప్రిల్ చివరివారంలో రాజీనామా చేసిన చక్రవర్తి నిర్మొహమాటంగా మాట్లాడతారనే పేరుంది. గణాంకాలను చూస్తే... గత డిసెంబర్లో ఆర్బీఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ నివేదిక ప్రకారం, 2015 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు మొత్తం రుణాల్లో 4.9 శాతానికి పెరుగుతున్నాయి. ప్రైవేటు రంగం విషయంలో ఈ రేటు 2.7 శాతంగా ఉండనుంది. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో 2015 మార్చి నాటికి స్థూల మొండి బకాయిలు 4.4 శాతానికి చేరనున్నాయి. 2013 సెప్టెంబర్‌లో ఈ రేటు 4.2 శాతం. పాత తరం ప్రైవేటు రంగ బ్యాంకుల సంగతి పక్కనబెడితే, కొత్త తరం ప్రైవేటు బ్యాంకులు కేవలం 1 శాతం వద్ద ఎన్పీఏలను కట్టడి చేయగలుగున్నాయి. నిర్వహణ లోపమే మొండిబకాయిల సమస్యకు ప్రధాన కారణమని చక్రవర్తి పేర్కొన్నారు. ఒకవైపు ఆర్థికపరమైన, మరోవైపు నియంత్రణ పరమైన రెండు సమస్యలూ ఇందులో ఇమిడి ఉన్నాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఒక విస్పష్ట విధానం అవసరమని పేర్కొన్నారు. -
వారం రోజుల గరిష్టం
మరో 63 పాయింట్లు ప్లస్ ఇంట్రాడేలో 22,600ను దాటిన సెన్సెక్స్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మార్కెట్లు మరోసారి స్వల్ప స్థాయి కదలికలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 22,508 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, ఒక దశలో 22,602ను అధిగమించింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లు లాభపడి 6,715 వద్ద నిలిచింది. పసిడి దిగుమతులు తగ్గడం, ద్రవ్యోల్బణం ఉపశమించడం కారణంగా కరెంట్ ఖాతా లోటు కట్టడికానుందన్న ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ రంగరాజన్ వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను బలపరిచినట్లు నిపుణులు తెలిపారు. వినియోగ వస్తు రంగం జోష్ మంగళవారం ట్రేడింగ్‌లో వినియోగ వస్తు ఇండెక్స్ 3% పుంజుకోవడం విశేషం. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, వీఐపీ, బజాజ్ ఎలక్ట్రికల్స్, టైటన్ 12-4% మధ్య జంప్‌చేయడం ఇందుకు దోహదపడింది. ఇక సెన్సెక్స్ దిగ్గజాల లో ఆర్ఐఎల్, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, ఐటీసీ 2-1% మధ్య లాభపడగా, భారతీ, హీరోమోటో, టాటా పవర్, విప్రో, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ 2-1% మధ్య నష్టపోయాయి. కాగా,చిన్న షేర్లకు మళ్లీ డిమాండ్ కనిపించింది. అతుల్, జస్ట్‌డయల్, ఎన్సీసీ, టొరంట్ ఫార్మా, షషున్ ఫార్మా, కార్బొరేండమ్, సిటీ యూనియన్, టొరంట్ పవర్, టిమ్కెన్ 13-6% మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు రెయిన్, కెనరా, గ్రీన్ప్లై, ఫ్యూచర్ రిటైల్, ఆప్టో, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ 10-5% మధ్య తిరోగమించాయి. -
కుంభకోణం నిజమే
కొల్చారం, న్యూస్‌లైన్: రంగంపేట ఎస్బీహెచ్లో కుంభకోణం జరిగిన మాట వాస్తవమేనని తేలింది. ఈ విషయాన్ని ఎస్బీహెచ్ సంస్థ ఇన్విస్టిగేషన్ ఏజీఎం రంగరాజన్ ధ్రువీకరించారు. మంగళవారం సాక్షి దినపత్రికలో వచ్చిన ‘రంగంపేట ఎస్బీహెచ్లో కుంభకోణం’ అనే కథనానికి ఆ సంస్థ యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు ఏజీఎం రంగరాజన్ బృందం రంగంపేట బ్యాంకుకు చేరుకుని రికార్డులు పరిశీలించారు. అవినీతికి పాల్పడిన బ్యాంకు మేనేజర్ ఏఎక్స్ ఎడ్విన్ గత మంగళవారం నుంచి బ్యాంకుకు రాకపోవడంతోపాటు అతనికి సంబంధించిన సెల్‌ఫోన్ సైతం స్విచ్చాఫ్‌లో ఉంది. దీంతో అనుమానించిన అధికారులు అయన నివాసానికి వెళ్లి పరిశీలించగా అందుబాటులో లేరు. కాగా ఆడిట్ అధికారులు ఖాతాలు పరిశీలించగా బినామీ అకౌంట్లతో డబ్బులు స్వాహా అయినట్లు గుర్తించారు. 31 ఖాతాల్లో సుమారు రూ. 96.13 లక్షల మేర స్వాహా అయినట్టు ధ్రువీకరించారు. మేనేజర్ ఎడ్విన్ బినామీ అకౌంట్లు సృష్టించి మరో ప్రైవేట్ బ్యాంకులో ఉన్న అతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులతో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సంస్థయే పూర్తిగా బాధ్యత వహిస్తుందన్నారు. గతంలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన నికోలస్ హైదరాబాద్‌కు బదిలీ కావడంతో తర్వాత వచ్చిన ఎడ్విన్ ఈ కుంభకోణానికి సూత్రధారి అని అధికారులు తేల్చారు. బ్యాంకులో అవినీతి జరగడం, మేనేజర్ ఎడ్విన్ కనిపించకుండా పోవడంపై సంస్థకు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమేష్‌బాబు మంగళవారం కొల్చారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున కుంభకోణం జరగడంతో దానికి మేనేజర్‌కు సంబంధం ఉండటంతోనే ఆయన కనిపించకుండా పోయారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొల్చారం ఎస్ఐ ప్రభాకర్‌ను వివరణ కోరగా రంగంపేట ఎస్బీహెచ్ బ్యాంకులో కుంభకోణం జరిగిన విషయమై తమకు ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. ఉలిక్కిపడ్డ రైతాంగం రంగంపేట ఎస్బీహెచ్ బ్యాంకులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు దినపత్రికలో చూసిన పలు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఖాతాదారులు బ్యాంకుకు చేరుకుని తమ తమ ఖాతాలను పరిశీలించుకున్నారు. -
వృద్ధి రేటు కట్
2013-14లో ఆర్థిక వ్యవస్థపై నివేదిక... జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించిన ప్రధాని ఆర్థిక సలహా మండలి 6.4 శాతం నుంచి 5.3 శాతానికి కట్... అధిక ద్రవ్య, కరెంట్ అకౌంట్ లోటులు సవాలే... పెట్రో సబ్సిడీలు తగ్గిస్తేనే వ్యయాల అదుపు సాధ్యం ఎఫ్‌డీఐ నిబంధనల్లో మరింత సరళీకరణ అవసరం వృద్ధికి ఊతమివ్వాలంటే బొగ్గు ఉత్పత్తి పెంపు, స్థిరమైన పన్నుల విధానం కూడా ముఖ్యమే... నివేదికలో ప్రభుత్వానికి సూచించిన పీఎంఈఏసీ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే సంకేతాలు బలపడుతున్నాయి. దీనికి నిదర్శనంగా ఈ ఏడాది(2013-14) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) అంచనాల్లో ఎడాపెడా కోత ప్రకటనలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ కోవలోకి ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) నివేదిక కూడా చేరింది. అధిక ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)లు ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా పరిణమిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత పెట్టింది. ఏప్రిల్‌లో సమీక్ష సందర్భంగా 6.4 శాతంగా వృద్ధిని అంచనా వేయగా.. ఇప్పుడు దీన్ని ఏకంగా 5.3 శాతానికి తగ్గించేసింది. శుక్రవారం ఇక్కడ పీఎంఈఏసీ చైర్మన్ సి. రంగరాజన్ విడుదల చేసిన 2013-14 ఆర్థిక ముఖచిత్ర నివేదికలో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీలను భారీగా తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వ వ్యయాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని రంగరాజన్ స్పష్టం చేశారు. మధ్య, దీర్ఘకాలంలో వృద్ధిరేటుకు చేయూతనందించాలంటే... విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకరించడం, బొగ్గు ఉత్పత్తి పెంపు, స్థిరమైన పన్ను విధానాలు వంటివి కూడా ముఖ్యమేనని సూచించారు. గత ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా...ద్వితీయార్ధంలో వృద్ధి కాస్త పుంజుకోవచ్చని రంగరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరెన్సీ ఒడిదుడుకుల ఎఫెక్ట్... దేశంలో ఆర్థిక వ్యవస్థ రికవరీకి గత కొద్ది నెలలుగా నెలకొన్న కరెన్సీ ఒడిదుడుకులు కూడా దెబ్బకొట్టాయని నివేదిక తెలిపింది. అయితే, క్యాడ్ ఈ ఏడాది 3.8 శాతానికి(70 బిలియన్ డాలర్లు) దిగిరావచ్చని పేర్కొంది. క్రితం ఏడాది ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో(4.8%-88.2 బిలియన్ డాలర్లు) క్యాడ్ ఎగబాకిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్యాడ్ అవసరాల కోసం ఫారెక్స్ నిల్వల నుంచి 9 బిలియన్ డాలర్లను ఖర్చుచేయాల్సి రావచ్చనేది పీఎంఈఏసీ అంచనా. మరోపక్క, ద్రవ్యలోటును ఈ ఏడాది 4.8 శాతానికి కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని రంగరాజన్ పేర్కొన్నారు. ఆర్బీఐ కూడా ఈ ఏడాది వృద్ధి అంచనాలను 5.7 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించడం తెలిసిందే. గతేడాది వృద్ధి రేటు దశాబ్దపు కనిష్టానికి(5%) పడిపోగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1)లో నాలుగేళ్ల కనిష్టానికి(4.4%) పడిపోయింది. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... మార్చి నాటికి టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉండొచ్చు. ఈ ఏడాది జూలైలో టోకు ధరల ద్రవ్యోల్బణం 5.79 శాతంగా నమోదుకాగా, ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 9.52%. వాణిజ్య లోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఏడాది కాస్త తగ్గి 185 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చు. గతేడాది(2012-13)లో ఇది రికార్డు స్థాయిలో(195.7 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. ఈ ఏడాదిలో బంగారం దిగుమతుల విలువ భారీగా తగ్గి 38 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చు. క్రితం ఏడాది ఇది 53.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రభుత్వం చేయూతనివ్వాలి: కార్పొరేట్లు జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో కోత విధిస్తూ పీఎంఈఏసీ విడుదల చేసిన నివేదిక వాస్తవ మందగమన పరిస్థితులను ప్రతిబింభిస్తోందని భారత కార్పొరేట్ వర్గాలు పేర్కొన్నాయి. పెట్టుబడులను ప్రోత్సహించి, వృద్ధికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం, విధానకర్తలు మరిన్ని చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక చాంబర్లు డిమాండ్ చేశాయి. కాగా, ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను చూస్తుంటే ద్వితీయార్ధంలో ఎలాంటి రికవరీ సంకేతాలూ కనబడటడం లేదని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలో రాజీవ్ కుమార్ చెప్పారు. పీఎంఈఏసీ అంచనాలకంటే చాలా తక్కువగా 4.3 శాతానికే ఈ ఏడాది వృద్ధి రేటు పరిమితం కావచ్చన్నారు. పెట్రో ధరలను ఒకేసారి పెంచేయాలి... ప్రభుత్వ వ్యయాల అదుపునకు ముఖ్యంగా డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల రేట్లను అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెంచకతప్పదని రంగరాజన్ స్పష్టం చేశారు. నెలవారీగా పెంపునకు తోడు ఒకేసారి పెట్రో రేట్లను పెంచేయడం ద్వారా తక్షణం ఈ సబ్సిడీలను తగ్గించుకోవాలని సూచించారు. డీజిల్‌పై ప్రభుత్వ నియంత్రణను పాక్షికంగా తొలగించిన నేపథ్యంలో నెలకు అర్ధరూపాయి చొప్పున ధర పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్రోలుపై పూర్తిగా నియంత్రణ ఎత్తివేయడంతో ధర చుక్కలనంటుతోంది. వ్యవ‘సాయం’... మెరుగైన రుతుపవన వర్షపాతం నేపథ్యంలో ఈ ఏడాది వ్యవసాయ రంగం సానుకూల వృద్ధిని నమోదుచేయనుందని నివేదిక పేర్కొంది. 4.8 శాతం వృద్ధిరేటు ఉండొచ్చని(గతేడాది 1.9 శాతమే) అంచనావేసింది. అదేవిధంగా పారిశ్రామిక వృద్ధిరేటు కూడా 2.7 శాతం ఉంటుందని అభిప్రాయపడింది. అయితే,సేవల రంగం వృద్ధి మాత్రం 6.6 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. రూపాయి స్థిరపడ్డాకే పాలసీ సడలింపు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగానే క్షీణించిందని, అయితే, త్వరలోనే కరెన్సీకి స్థిరత్వం వచ్చే అవకాశాలున్నాయని రంగరాజన్ పేర్కొన్నారు. ఆర్బీఐ, ప్రభుత్వ చర్యల ప్రభావంతో విదేశీ నిధుల ప్రవాహం పెరగడం, క్యాడ్ తగ్గుదల వంటివి కరెన్సీ విలువ బలపడేందుకు దోహదం చేయొచ్చన్నారు. అయితే, రూపాయి విలువ ఇంకా తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూస్తున్న నేపథ్యంలో ఇది స్థిరపడేదాకా ఆర్బీఐ ప్రస్తుతం అనుసరిస్తున్న పాలసీ విధానాన్నే కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా ఈ నెల 20న చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు తక్కువేనన్న సంకేతాలిచ్చారు. ఏప్రిల్ నుంచి చూస్తే రూపాయి విలువ 20 శాతం పైగానే కుప్పకూలి.. తాజాగా ఆల్‌టైమ్ కనిషాన్ని(68.80)ని తాకడం తెలిసిందే. -
5.5 శాతం వృద్ధి ఖాయం: రంగరాజన్
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5.5 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) సలహాదారు సీ రంగరాజన్ మంగళవారం స్పష్టం చేశారు. స్కోచ్ 33వ సదస్సులో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 4-5 శాతం శ్రేణిలో నమోదవుతుందని, మొత్తం వృద్ధి రేటు పెరగడానికి ఇది దోహదపడే అంశమని ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు. వృద్ధికి ఎజెండాను సంస్కరణల ఎజెండా అని కూడా పేర్కొనవచ్చని ఆయన అన్నారు. రూపాయి క్షీణత, ద్రవ్యలోటు తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో డీజిల్ ధర పెంపును ఆయన సమర్థించారు. ఫారెక్స్ మార్కెట్లో స్థిరీకరణ నెలకొన్న తరువాత వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందని విశ్లేషించారు. -
70 బిలియన్ డాలర్లకు క్యాడ్ పరిమితం
న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) 70 బిలియన్ డాలర్లకు (జీడీపీలో 3.7 శాతం) పరిమితం అవుతుందన్న ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ సోమవారం ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వ చర్యలు క్యాడ్ కట్టడికి దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. 2012-13లో ఈ లోటు 88 బిలియన్ డాలర్లు. సంబంధిత ఆర్థిక సంవత్సరం జీడీపీలో ఇది 4.8 శాతానికి సమానం. బంగారం దిగుమతుల విలువ 10 నుంచి 12 బిలియన్ల వరకూ తగ్గడం కూడా క్యాడ్ కట్టడికి సంబంధించి సానుకూల అంశమని అన్నారు. 2013-14లో జీడీపీ వృద్ధి రేటు 5.5 శాతం స్థాయిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని సైతం ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.