70 బిలియన్ డాలర్లకు క్యాడ్ పరిమితం | Farm sector can lift growth to 5.5%: Rangarajan | Sakshi
Sakshi News home page

70 బిలియన్ డాలర్లకు క్యాడ్ పరిమితం

Published Tue, Aug 27 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

70 బిలియన్ డాలర్లకు  క్యాడ్ పరిమితం

70 బిలియన్ డాలర్లకు క్యాడ్ పరిమితం

న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) 70 బిలియన్ డాలర్లకు (జీడీపీలో 3.7 శాతం) పరిమితం అవుతుందన్న ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ సోమవారం ఈ అంశంపై మాట్లాడారు.
 
 ప్రభుత్వ చర్యలు క్యాడ్ కట్టడికి దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. 2012-13లో ఈ లోటు 88 బిలియన్ డాలర్లు. సంబంధిత ఆర్థిక సంవత్సరం జీడీపీలో ఇది 4.8 శాతానికి సమానం.  బంగారం దిగుమతుల విలువ 10 నుంచి 12 బిలియన్‌ల వరకూ తగ్గడం కూడా క్యాడ్ కట్టడికి సంబంధించి సానుకూల అంశమని అన్నారు. 2013-14లో జీడీపీ వృద్ధి రేటు 5.5 శాతం స్థాయిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని సైతం ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement