CAD
-
మెరుగుపడిన కరెంట్ అకౌంట్ లోటు
దేశ కరెంట్ అకౌంట్ లోటు (CAD) పరిస్థితి కొంత మెరుగుపడింది. 2024–25 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) 11.2 బిలియన్ (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ 1.2 శాతం) డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో క్యాడ్ 11.3 బిలియన్ (జీడీపీ 1.3 శాతం) డాలర్లు. దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ముఖ్యాంశాలు ఇవీ... 2024–25 క్యూ2లో: 11.2 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు. 2023–24 క్యూ2లో: 11.3 బిలియన్ (జీడీపీలో 1.3 శాతం) డాలర్లు. 2024–25 తొలి భాగం (ఏప్రిల్–సెప్టెంబర్ ): 21.4 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు. 2023–24 తొలి భాగం (ఏప్రిల్–సెప్టెంబర్): 20.2 బిలియన్ (జీడీపీలో 1.2 శాతం) డాలర్లు.వాణిజ్య లోటు ఇలా... 2024–25 రెండో త్రైమాసికంలో ఎగుమతి–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 75.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2023–24 ఇదే కాలంలో ఈ లోటు 64.5 బిలియన్ డాలర్లుగా ఉంది.నికర సేవల ఆదాయం 2024–25 రెండో త్రైమాసికంలో నికర సేవల ఆదాయం 44.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 39.9 బిలియన్ డాలర్లుగా ఉంది. సమీక్షా కాలంలో కంప్యూటర్, వ్యాపార, ప్రయాణ, రవాణా సేవల వంటి రంగాలలో సేవల ఎగుమతులు అధికంగా నమోదయ్యాయి. -
భారీగా తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు
ముంబై: నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చి–పోయే విదేశీ మారక ద్రవ్యం నికర వ్యత్యాలను ప్రతిబింబించే భారత్ కరెంట్ అకౌంట్.. తాజా అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతికి అద్దం పడుతోంది. భారత్ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ కాలంలో భారీగా ఒక శాతానికి (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ విలువలతో పోల్చి) పరిమితమైంది. విలువల్లో ఇది 8.3 బిలియన్ డాలర్లు. సమీక్షా కాలంలో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు తగ్గడం, సేవల రంగం ఎగుమతుల్లో పెరుగుదల దీనికి కారణం. 2022 ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ లోటు 3.8 శాతంగా (విలువలో 30.9 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది. ఆర్బీఐ తాజా ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. తాజా ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే.. ► 2022–23 జూలై–సెపె్టంబర్ నెలల్లో వస్తు ఎగుమతుల విలువ 78.3 బిలియన్ డాలర్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ 61.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. ► సేవల ఎగుమతులు 4 శాతం ఎగశాయి. సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరగడం, వ్యాపార, పర్యాటక సేవలు మెరుగుపడ్డాయి. ఎగుమతుల ఒడిదుడుకులు... అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెల– నవంబర్లోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఇక దిగుమతుల విషయానికి వస్తే.. 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఎకానమీకి కరెంట్ అకౌంట్ సవాళ్లు!
ముంబై: భారత్ ఎకానమీకి కరెంట్ అకౌంట్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనావేస్తోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్లో తీవ్ర లోటు (క్యాడ్) నమోదుకావచ్చని, ఇది ఏకంగా 36 నెలల గరిష్ట స్థాయిలో 3.4 శాతంగా (స్థూల దేశీయోత్పత్తి-జీడీపీ విలువలో) ఉండే వీలుందని తన తాజా నివేదికలో అంచనావేసింది. విలువలో ఇది 28.4 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో కరెంట్ అకౌంట్లో లోటులేకపోగా 0.9 శాతం మిగులు (6.6 బిలియన్ డాలర్లు) నెలకొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి మార్చి త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ లోటు 1.5 శాతం (13.4 బిలియన్ డాలర్లు). అయితే తదుపరి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఇది ఏకంగా 3.4 శాతానికి చేరుతుందన్న అంచనాలు నెలకొనడం గమనార్హం. ఇప్పటికే ఇక్రా హెచ్చరికలు... భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) సీఏడీ– క్యాడ్ సవాళ్లు తప్పవని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఇప్పటికే వెలువరించిన నివేదికలో అంచనావేసింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022-23లో 3.5 శాతంగా (120 బిలియన్ డాలర్లు) ఉండే వీలుందని అంచనావేసింది. దేశంనుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశంలోకి భారీ దిగుమతులు జరగ్గా, ఎగుమతులు నామమాత్రపు వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు భారీగా పెరిగిపోతోంది. ఫారెక్స్ దన్ను... అయితే దేశానికి ప్రస్తుతం ఫారెక్స్ విలువ దన్ను పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. కరెంట్ అకౌంట్... అంటే! ఒక నిర్దిష్ట కాలంల ఒక దేశంలోకి వచ్చీ-దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
దేశానికి కరెంట్ అకౌంట్ లోటు కష్టాలు
ముంబై: భారత్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని దేశీయ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తోంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ లోటు అదే కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 5 శాతానికి చేరే వీలుందని ఇక్రా అభిప్రాయపడింది. అదే విధంగా 2022–23లో 3.5 శాతంగా ఉండే వీలుందని అంచనావేసింది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతుండడం, దిగుమతుల పెరుగుదల, దీనితో భారీగా పెరగనున్న వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) వంటి అంశాలు క్యాడ్ ఆందోళనకు కారణమని ఇక్రా విశ్లేషించింది. నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు... ►ఒక్క ఆగస్టును తీసుకుంటే వాణిజ్య లోటు రెట్టింపై 28.7 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ ఎగుమతులు 20 నెల్లో మొదటిసారి ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 1.15 శాతం మేర క్షీణించడం, (విలువలో 33 బిలియన్ డాలర్లు) దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్ డాలర్లుగా నమోదవడం దీనికి కారణం. ఎగుమతుల ద్వారా ఆదాయం తగ్గడం క్యాడ్‌పై ప్రభావం చూపింది. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో క్యాడ్ విలువ ఆల్‌టైమ్ హై 41 బిలియన్ డాలర్ల నుంచి 43 బిలియన్ డాలర్ల శ్రేణిలో (జీడీపీ విలువ అంచనాలో దాదాపు 5 శాతం) నమోదుకావచ్చు. 2022–23 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఈ విలువ 30 బిలియన్ డాలర్లుగా ఉంది. ►అయితే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో (అక్టోబర్–మార్చి) క్యాడ్ 2.7 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక సంవత్సరం మొత్తంలో క్యాడ్ 3.5 శాతానికి పరిమితం కావచ్చు. కమోడిటీల బిల్లు తగ్గే అవకాశాలు, సీజనల్‌గా ఎగుమతులు కొంచెం మెరుగుపడే పరిస్థితులు దీనికి కారణం. అయితే దిగ్గజ ఎకనామీల్లో మాంద్యం పరిస్థితుల వల్ల దేశం వస్తు, సేవల ఎగుమతులు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ►ఆర్థిక సంవత్సరం (2022–23)లో క్యాడ్ 120 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.5 శాతం)గా ఉండే వీలుంది. 2021–22లో ఈ విలువ కేవలం 38.7 బిలియన్ డాలర్లు. అంటే జీడీపీలో 1.2%. ►ఇక రూపాయి విషయానికి వస్తే, 2022 రానున్న కాలంలో డాలర్ మారకంలో రూపాయి విలువ 78.5–81 శ్రేణిలో తిరిగే వీలుంది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ పెరగవచ్చు. ►2021 సెప్టెంబర్ 3తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక రికార్డు 642 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత నిల్వలు భారత్ దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. భారత్ వద్ద ప్రస్తుతం (26 ఆగస్టు నాటికి 561 బిలియన్ డాలర్లు) విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఒత్తిడులను తట్టుకోడానికి దోహదపడతాయి. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను నివారిస్తాయి. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
60 బిలియన్ డాలర్లకు క్యాడ్ లోటు
ముంబై: భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 60 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని బ్రిటన్ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– బార్క్లేస్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత 45 బిలియన్ డాలర్ల అంచనాలను ఎగువముఖంగా సవరించింది. బార్క్లేస్ తాజా అంచనాలు నిజమైతే, క్యాడ్ పరిమాణం 2021–22 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 2 శాతంగా ఉంటుంది. కరెంట్ అకౌంట్ అంటే... ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించేదే కరెంట్ అకౌంట్. వచ్చినదానికన్నా ఇతర దేశాలకు చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్ అకౌంట్ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్ అకౌంట్ మిగులు. 2020–21లో మిగులే కరోనా సవాళ్లు, దిగుమతులు భారీగా పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే (2020 ఏప్రిల్–2021 మార్చి) కరెంట్ అకౌంట్ మిగుల్లోనే ఉంది. విలువలో 102.2 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.9 శాతం) నమోదయ్యింది. 2021–22 మొదటి త్రైమాసికంలోనూ తిరిగి మిగులును నమోదుచేయడం గమనార్హం. 2021–22 క్యూ1 (ఏప్రిల్–జూన్)లో కరెంట్ అకౌంట్ 6.5 బిలియన్ డాలర్ల మిగులు (జీడీపీలో 0.9 శాతం) ఉంది. 2021–22 మొత్తంగా కూడా కరెంట్ అకౌంట్ మిగులే నమోదవుతుందని తొలుత అంచనాలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి గణనీయంగా మారుతూ వచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు, బొగ్గు, మెటల్ వంటి కీలక దిగుమతి ఉత్పత్తుల ధరలు తీవ్రంకావడం వల్ల కరెంట్ అకౌంట్‌ను లోటు దిశగా నడిపిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మారకద్రవ్య నిల్వల బలం కాగా భారత్ వద్ద ఉన్న 600 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయంగా ఒడిదుడుకుల నుంచి దేశ ప్రయోజనాలు కాపాడ్డానికి దోహదపడతాయని అంచనా. దాదాపు 15 నెలల దిగుమతులకు సరిపడా నిల్వలు భారత్ వద్ద ఉండడం గమనార్హం. 2013లో జీడీపీలో 15 శాతం ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఇప్పుడు ఈ నిష్పత్తి దాదాపు 22 శాతానికి పెరిగింది. -
కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు
ముంబై: దేశం కరోనా సవాళ్లను ఎదుర్కొన్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ 0.9 శాతం (స్థూల దేశీయోత్పత్తి విలువలో) కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేసుకుందని ఆర్బీఐ బుధవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. విలువలో ఇది 102.2 బిలియన్ డాలర్లు(7,62,616.4 కోట్లు). గత 17 ఏళ్లలో మొదటిసారి ఎఫ్వై 21లో కరెంట్ అకౌంట్ మిగులు సాధించింది. ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. వచ్చిన దానికన్నా చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్ అకౌంట్ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్ అకౌంట్ మిగులు. ఇక 2019-20లో 0.9 శాతం కరెంట్ అకౌంట్ లోటును నమోదుచేసుకుంది. విలువలో ఇది 157.5 బిలియన్ డాలర్లు. గణాంకాల ప్రకారం.. దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 44 బిలియన్ డాలర్లు. 2019-20లో ఈ పరిమాణం 43 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం. నికర విదేశీ ఫోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా ఇదే కాలంలో 1.4 బిలియన్ డాలర్ల నుంచి 36.1 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మహమ్మారి ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ కార్పొరేట్ల విదేశీ వాణిజ్య రుణాలు మాత్రం 21.7 బిలియన్ డాలర్ల నుంచి 0.2 బిలియన్ డాలర్లకు తగ్గాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలకు అదనంగా మరో 87.3 బిలియన్ డాలర్లు తోడయ్యాయి. ప్రస్తుత విలువ దాదాపు 600 బిలియన్డాలర్ల పైన రికార్డు స్థాయిల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్న నేపథ్యంలో 2020-21లో కరెంట్ అకౌంట్ ‘లోటు’లోనే ఉంటుందని అంచనా. చదవండి: ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు -
దిగుమతి సుంకాల పెంపు
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును నియంత్రించడం, రూపాయి విలువ క్షీణతకు చెక్‌పెట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 19 రకాల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో విమాన ఇంధనం, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ దిగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్ల మేర ఉంటుందని తెలిపింది. సుంకాల పెంపుతో వీటి ధరలు మరింత పెరిగిపోతాయి. తద్వారా వాటి దిగుమతులకు ఆదరణ తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘కొన్ని రకాల దిగుమతులను నిరోధించేందుకుగాను ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం టారిఫ్ చర్యలు తీసుకుంది. కరెంటు ఖాతా లోటును కుదించడమే ఈ చర్యల ఉద్దేశం’’ అని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు, రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు అనవసర దిగుమతులను నిరోధించనున్నట్టు కేంద్రం ఈ నెల 14నే ప్రకటించింది. -
బంగారం దిగుమతులపై ఆంక్షలు!
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి విలువ కరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో దిగుమతుల పెరుగుదల, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటివి కొన్ని. ఈ పరిస్థితుల్లో దిగుమతులను తగ్గించే చర్యల్లో భాగంగా క్రూడ్‌కు సంబంధించి ఏమీ చేయలేని పరిస్థితి. దీనితో సమీప కాలంలో పసిడి దిగుమతులపైనే కేంద్రం కీలక చర్యలు తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే సుంకాలను పెంచడం కాకుండా, దిగుమతుల తగ్గింపునకు ఇతర చర్యలు తీసుకునే వీలుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. స్మగ్లింగ్ భయాలు... ప్రస్తుతం పసిడిపై దేశీయంగా 10 శాతం సుంకం అమలవుతోంది. సుంకాలు పెంపు అంశాన్ని కేంద్రం ఎందుకు పక్కన పెట్టవచ్చన్న అంశాలను పరిశీలిస్తే, ఇలా చేస్తే పసిడి స్మగ్లింగ్ సమస్య మరింత తీవ్రం అవుతుందని కేంద్రం భావిస్తోందని సమాచారం. క్యాడ్‌ను అరికట్టడానికి తీసుకోవాలని భావిస్తున్న అంశాల్లో అప్రధాన ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించడం ఒకటి. ఇదే జరిగితే ఇందులో పసిడి తొలి వరుసలో ఉంటుందని భావిస్తున్నారు. తదుపరి అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు, రిఫ్రిజిరేటర్లు, వాచ్‌లు, విలువైన పాదరక్షలు, దుస్తులు ఉంటాయన్నది వారి విశ్వాసం. పసిడి దిగుమతులు జూలైలో 41%, ఆగస్టులో 93% పెరిగిన సంగతి తెలిసిందే. -
రుపీ దెబ్బ: బంగారం ధరలకు రెక్కలు?
సాక్షి,న్యూఢిల్లీ: త్వరలోనే బంగారం ధరలకు రెక్కలు రానున్నాయా? తాజా అంచనాల ప్రకారం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పసిడిపై వసూలు చేస్తున 10 శాతం దిగుమతి సుంకానికి అదనంగా మరో రెండు నుండి మూడు శాతం పెంచే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా దేశీయ కరెన్సీ రోజురోజుకీ చారిత్రక కనిష్టానికి పడిపోతున్న తరుణంలో బంగారం ధరలపై ప్రభావ పడనుందని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. తద్వారా కరెంట్ అకౌంట్ లోటు (CAD) నియంత్రణకు ఉంచడానికి కేంద్రం యోచిస్తోందని భావిస్తున్నాయి. కాగా ఆగస్టు నెలలో బంగారం దిగుమతి బిల్లు దాదాపు రెట్టింపై 3.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా భారత ఆర్థిక మంత్రిత్వశాఖ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు మార్చి 2018 నాటి 1.9 శాతం నుంచి 2.4 శాతానికి పెరిగింది. అలాగే రూపాయి విలువ క్షీణత, అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా విలావస్తువులపై దిగుమతి సుంకం పెంచేందుకు ప్రభుత్వ మొగ్గు చూపవచ్చు. దిగుమతి సుంకాన్ని 2 శాతానికి పెంచుకోవడమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉత్తమ మార్గమని సుశీంద్ర మెహతా, ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) అభిప్రాయపడింది. 2013 లో, రూపాయి విలువ క్షీణించిన నేపథ్యంలో బంగారంపై ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. -
క్యాడ్‌కు కళ్లెం.. రూపీకి జోష్!
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటు (క్యాడ్) పెరిగిపోకుండా చూడడం, పడిపోతున్న రూపాయి విలువకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర సర్కారు శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ రుణ నిబంధనలను సరళీకరించడంతోపాటు, అనవసర ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించడం ఇందులో కీలకమైనవి. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక రంగ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్పటేల్, ఆర్థిక శాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు వెల్లడించారు. క్యాడ్ పెరగకుండా చూడడం, విదేశీ మారకం నిధుల ప్రవాహాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ‘‘పెరిగిపోతున్న క్యాడ్‌కు పరిష్కారంగా అనవసర దిగుమతులను తగ్గించేందుకు, ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎటువంటి దిగుమతులను నియంత్రించాలన్నది సంబంధిత మంత్రిత్వశాఖలను సంప్రదించిన అనంతరం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగా నిర్ణయిస్తాం’’అని జైట్లీ వివరించారు. ప్రభుత్వం ద్రవ్యలోటు కట్టడికి కట్టుబడి ఉందన్న జైట్లీ, బడ్జెట్లో పేర్కొన్న అంచనాలను చేరుకుంటామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఆర్థిక రంగంపై 5–10 బిలియన్ డాలర్ల మేర ప్రభావం చూపిస్తాయని చెప్పారు. ఇవే కాకుండా మరిన్ని చర్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. రూపాయి తన చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి పడిపోవడం, డాలర్‌తో 72.91 స్థాయికి పడిపోయి కాస్తంత కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి దేశ ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ప్రభుత్వం బడ్జెట్లో అంచనాలు పేర్కొనగా... మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్–జూలై) రూ.5.40 లక్షల కోట్లుగా నమోదై, నిర్ధేశిత లక్ష్యంలో 86.5%కి ద్రవ్యలోటు చేరింది. పడిపోతున్న రూపాయి విలువ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటిపోకుండా చూసేందుకు, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు కూడా సమావేశం ప్రధాని మోదీ శనివారం కూడా ఆర్థిక రంగంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనూ స్థూల ఆర్థిక రంగ పరిస్థితులకు ఎదురైన సవాళ్లు, రూపాయి విలువను కాపాడడంపై ప్రభుత్వం ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. కీలక నిర్ణయాలు ఇవీ... ♦ 2018–19లో జారీ చేసే మసాలా బాండ్లను విత్‌హోల్డింగ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ♦మనకు ముఖ్యం కాని ఉత్పత్తుల దిగుమతుల నిషేధం. ఎగుమతులకు ప్రోత్సాహకాలు. ♦ 20 శాతంగా ఉన్న ఎఫ్‌పీఐల కార్పొరేట్ బాండ్ పోర్ట్‌ఫోలియో పరిమితిని ఒకే కార్పొరేట్ గ్రూపునకు పరిమితం చేయడం, ఏ కార్పొరేట్ బాండ్ ఇష్యూలో అయినా 50 శాతానికి సవరించడం. ♦ ఇన్ఫ్రా రుణాలకు తప్పనిసరి హెడ్జింగ్ షరతును సరళించడం. ♦ తయారీ కంపెనీలు 50 మిలియన్ డాలర్ల వరకు రుణాలను ఏడాది కాల పరిమితితో తీసుకునేందుకు చాన్స్. వీటిలో కొన్నింటిపై నిర్ణయం తీ సుకోగా, మరికొన్నింటిపై స్పష్టత రావాల్సి ఉంది. -
20 ఏళ్ల తర్వాత ‘క్యాడ్’ గుప్పిట్లోకి చైనా!
బీజింగ్: ఇరవై సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– సీఏడీ) సమస్యలోకి జారింది. 2018 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) 28.3 బిలియన్ డాలర్ల క్యాడ్‌ను నమోదు చేసింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, చైనా నుంచి దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు ఈ పరిణామానికి నేపథ్యం. ఆరు నెలల కాలాన్ని చూస్తే 20 సంవత్సరాల తర్వాత క్యాడ్ నమోదయితే, త్రైమాసికం పరంగా పదిహేడేళ్లలో ఈ సమస్యను ఎదుర్కొనడం ఇదే తొలిసారి. దీనితో ఏళ్ల తరబడి భారీ ఎగుమతులతో వాణిజ్య మిగులు దేశంగా ఉన్న చైనా, ఆ ప్రతిష్టను కోల్పోయినట్లయ్యింది. 2008 నుంచే దిగువమెట్టు... నిజానికి 2008 ఆర్థిక సంక్షోభం నుంచీ చైనా వాణిజ్య మిగులు పరిస్థితి దిగజారుతూ వస్తోంది. 2007 చైనా స్థూల దేశీయోత్పత్తిలో ఆ దేశ వాణిజ్య మిగులు 9.9 శాతం అయితే 2017లో ఇది 1.3 శాతానికి పడిపోయింది. -
భారత్‌పై క్యాడ్ భారం
ముంబై: భారత్‌పై రెండవ త్రైమాసికంలో (2017–18 జూలై–సెప్టెంబర్) కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) భారం పడింది. ఇది ఏకంగా 7.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇదే త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 1.2 శాతం. 2016–17 ఇదే త్రైమాసికంలో క్యాడ్ విలువ 3.4 బిలియన్లు మాత్రమే. అప్పటి త్రైమాసిక జీడీపీ విలువలో ఇది 0.6 శాతం. అయితే 2017–18 ఏప్రిల్–జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఆ తదుపరి త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) క్యాడ్ పరిస్థితి మెరుగుపడటం గమనార్హం. జూన్ త్రైమాసికంలో క్యాడ్ విలువ 15 బిలియన్ డాలర్లుకాగా, జీడీపీతో ఇది 2.5 శాతంగా నమోదయ్యింది. క్యాడ్ అంటే...: దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం నుంచి దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్యాన్ని తీసేస్తే మిగిలే నికర విలువే క్యాడ్. అంటే కరెంట్ ఖాతా లోటన్న మాట. కాకపోతే వీటి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి వచ్చే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు (ఎఫ్ఐఐ), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) మాత్రం మినహాయిస్తారు. ఒకదేశ ఎగుమతుల విలువ కన్నా– దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడమే (వాణిజ్యలోటు) సహజంగా ఆ దేశ క్యాడ్ పెరుగుదలకు కారణమవుతుంది. 2017–18 మొదటి 6 నెలల కాలంలో భారత్ క్యాడ్ జీడీపీలో 1.8 శాతం. 2016–17 ఇదే కాలంలో ఈ రేటు కేవలం 0.4 శాతం. ఇదే కాలంలో భారత్ వాణిజ్యలోటు 49.4 బిలియన్ డాలర్ల నుంచి 74.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ముడి చమురే ప్రస్తుత సమస్య...: భారత్ ప్రధాన దిగుమతి కమోడిటీ అయిన క్రూడ్ ధరలు పెరుగుతుండడం ఇప్పుడు ప్రధానంగా ఆందోళనకు కారణమవుతోంది. క్యాడ్ పెరిగితే మారకపు విలువ బలహీన పడటం, ధరల పెరుగుదల తత్సబంధ ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రి తం ఇదే విధమైన సమస్యను భారత్ ఎదుర్కొంది. -
తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు
2016–17లో 0.7 శాతం ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ, క్యాడ్) 2016–17 ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే క్యాడ్ 0.7 శాతంగా నమోదయ్యింది. 2015–16లో ఈ రేటు 1.1 శాతంగా ఉంది. విలువ రూపంలో ఇది 130 బిలియన్ డాలర్ల నుంచి 112 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఏ, ఈసీబీ మినహా ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకనిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. జీడీపీలో పోల్చిచూసి, ఎంత తక్కువ ఉంటే, అంత ఆర్థిక వ్యవస్థకు సానుకూలమైనదిగా దీనిని పరిగణిస్తారు. భారత్ ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసమైన వాణిజ్య లోటు తగ్గడం– మొత్తంగా 2016–17లో క్యాడ్ తగ్గడానికి కారణమని ఆర్బీఐ గురువారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. కాగా గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో మాత్రం క్యాడ్ 0.6% పెరిగింది. -
సెప్టెంబర్ క్వార్టర్లో తగ్గిన క్యాడ్
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో 0.6 శాతానికి తగ్గింది. వాణిజ్య లోటు తగ్గడంతో క్యాడ్ జీడీపీలో 0.6 శాతంగా (340 కోట్ల డాలర్లు) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ క్యాడ్ జీడీపీలో 1.7 శాతంగా (850 కోట్ల డాలర్లు) ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో క్యాడ్(జీడీపీలో 0.1 శాతం–30 కోట్ల డాలర్లు)తో పోల్చితే క్యూ2లో కరెంట్ అకౌంట్ లోటు అధికంగా ఉంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం... విదేశాల్లోని భారతీయులు భారత్‌కు పంపించే రెమిటెన్సెస్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రైవేట్ బదిలీ వసూళ్లు 11 శాతం తగ్గి 1,520 కోట్ల డాలర్లకు తగ్గాయి. వాణిజ్య దిగుమతులు భారీగా తగ్గడంతో వాణిజ్య లోటు తగ్గింది(2,560 కోట్ల డాలర్లు) దీంతో క్యాడ్ కూడా తగ్గింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే కరంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.3 శాతానికి తగ్గింది. గత క్యూ2లో ఇది 1.5 శాతంగా నమోదైంది. -
లోటు 2,000 కోట్ల డాలర్లలోపే
• గత ఏడాది కంటే తక్కువ ఉండొచ్చు • క్యాడ్‌పై రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా ముంబై: భారత కరంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్ల డాలర్లలోపే ఉండొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా (2,200 కోట్ల డాలర్ల) తక్కువగానే ఉండగలదని పేర్కొంది. ఈ ఏడాది మిగిలిన కాలంలో పుత్తడికి ఉండే డిమాండ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థబాగం క్యాడ్‌పై ప్రభావం చూపుతాయని వివరించింది. అంతర్జాతీయ పోకడలను పరిగణనలోకి తీసుకుంటే ఔన్స బంగారం 1,150-1,250 (ప్రస్తుతం 1,165 డాలర్లుగా ఉంది) డాలర్ల రేంజ్లో ఉండగలదని అంచనా వేస్తోంది. ఇక్రా వెల్లడించిన వివరాల ప్రకారం.., ⇔ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ కాలానికి పుత్తడి దిగుమతి బిల్లు అంతకు ముందటి ఆరు నెలల కంటే అధికంగా ఉండొచ్చు. ⇔ {పస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల క్యాడ్ కన్నా రెండో అర్థభాగం క్యాడ్ అధికంగా ఉండే అవకాశాలున్నారుు. ⇔ ఆదాయపన్ను చట్టానికి ఇటీవల చేసిన సవరణలు పుత్తడికి డిమాండ్‌ను తగ్గిస్తారుు. దీంతో రానున్న నెలల్లో పుత్తడి దిగుమతులు తగ్గవచ్చు. ⇔ ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలానికి పుత్తడి దిగుమతులు నెలకు సగటున 45 టన్నులుగా ఉన్నారుు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ బంగారం దిగుమతులు ఇదే స్థారుులో ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు 1,500 కోట్ల డాలర్లలోపే ఉండొచ్చు. ⇔ గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి 2,310 కోట్ల డాలర్లుగా ఉన్న రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈ ఏడాది ఇదే కాలానికి 2,640 కోట్ల డాలర్లకు పెరిగారుు. ⇔ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, పెళ్లిళ్లు, పండగుల సీజన్ తదితర కారణాల వల్ల గత నెలలో పుత్తడి దిగుమతులు పెరిగారుు. ⇔ గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 610 కోట్ల డాలర్లుగా ఉన్న కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 30 కోట్ల డాలర్లకు తగ్గింది. ⇔ గత క్యూ2లో 850 కోట్ల డాలర్లుగా ఉన్న క్యాడ్ ఈ క్యూ2లో సగానికి పైగా తగ్గి 250-350 కోట్ల డాలర్లకు తగ్గవచ్చు. -
ఆర్థిక వ్యవస్థకు మంచిరోజులే!
• 2016 టోకు ద్రవ్యోల్బణం సగటు 1.5%: నొమురా • క్యాడ్ జీడీపీలో 1 శాతం లోపేనని డీబీఎస్ అంచనా న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు సంబంధించి దేశ స్థూల ఆర్థిక అంశాలు ఈ ఏడాది పటిష్టంగానే ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. 2016లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం స్పీడ్ సగటున 1.5 శాతంగా ఉంటుందని జపాన్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- నొమురా అంచనావేసింది. ఇక 2016లో కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్- ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే, 1.5 శాతంగా గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ- డీబీఎస్ అంచనావేసింది. ఆయా సంస్థల అంచనాలు ఇలా... ఆహారోత్పత్తుల ధరలు తగ్గుతాయి: నొమురా ఆహారోత్పత్తుల ధరలు తక్కువగా ఉండడమే టోకు ద్రవ్యోల్బణం 1.5 శాతం వార్షిక సగటుకు కారణం. దీనితోపాటు సంస్థల బలహీన ‘ప్రైసింగ్ పవర్’ కూడా దీనికి ఒక కారణమే. తగిన వర్షపాతంతో పంటలు బాగుండడం, ప్రభుత్వ చక్కటి సరఫరా నిర్వహణ కూడా కనిష్ట ద్రవ్యోల్బణానికి దోహదపడుతుంది. డీబీఎస్ అంచనాలు ఇవీ... ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు తగ్గడం మొత్తం కరెంట్ అకౌంట్‌లోటుపై సానుకూల ప్రభావం చూపుతుంది. 2015-16లో ఇది - 1.1 శాతం. ఎగుమతులతో పాటు దేశ దిగుమతులు కూడా మందగమనం కొనసాగుతుండడం గమనార్హం. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధాన చర్యలకు ప్రధానంగా రిటైల్ ద్రవ్యోల్బణం ధోరణే ప్రాతిపదికగా ఉంటుంది. రేటు కోతకు తగిన విధంగానే వచ్చే కొద్ది నెలల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఉండే వీలుంది. అయితే దీనితోపాటు రేటు కోతకు విధాన నిర్ణేతలు డిమాండ్ పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేటు పరిస్థితులు, పెట్టుబడుల వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకునే వీలుంది. -
అతి తక్కువ క్యాడ్.. శుభసూచకం: కేంద్రం
న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) అతితక్కువగా నమోదు కావడం ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమని కేంద్ర ఆర్థిక కార్యదర్శి అశోక్ లవాసా పేర్కొన్నారు. దేశంలోకి వచ్చీపోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. తొమ్మిది సంవత్సరాల్లో మొట్టమొదటిసారి గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) క్యాడ్... మిగులు సమీపానికి చేరింది. 2015-16 క్యూ4లో 2014-15 ఇదే కాలంతో పోల్చితే క్యాడ్ 7.1 బిలియన్ డాలర్ల నుంచి 0.3 బిలియన్ డాలర్లకు త గ్గింది. 2007 మార్చి త్రైమాసికంలో భారత్ 4.2 బిలియన్ డాలర్ల విదేశీ నిధుల మిగులును (సీఏఎస్) సాధించింది. కాగా గతేడాది క్యాడ్ 22.1 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.1%). అంతక్రితం ఏడాది ఈ పరిమాణం 26.8 బిలియన్ డాలర్లు. జీడీపీలో 1.3%. -
డిసెంబర్ త్రైమాసికం క్యాడ్ 1.3%
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్- డిసెంబర్) 1.3 శాతంగా నమోదయ్యింది. 2014-15లో ఈ రేటు 1.5%. ఇటీవలి నెలల్లో దిగుమతులు తగ్గి వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం) తక్కువగా నమోదవుతుండడం కరెంట్ అకౌంట్ లోటు తగ్గడానికి ప్రధాన కారణం. దేశంలోకి వచ్చే మొత్తం విదేశీ మారక నిధులు, దేశం నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకపు నిధుల మధ్య నికర వ్యత్యాసమే(ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) కరెంట్ అకౌంట్ లోటు. ఈ పరిమాణాన్ని స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. డిసెంబర్లో ఈ విలువ 7.1 బిలియన్ డాలర్లని (జీడీపీలో 1.3%) గణాంకాలు వెల్లడించాయి. 2014-15 ఇదే కాలంలో ఈ విలువ 7.7 బిలియన్ డాలర్లు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జీడీపీలో ఇది 1.7%.కాగా ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో కరెంట్ అకౌంట్ 1.7% నుంచి 1.4 శాతానికి తగ్గింది. -
ఆరుగురి చేతిలో 40% పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న పసిడిలో 40% పరిమాణాన్ని కేవలం ఆరుగురు ట్రేడర్లు నియంత్రిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి ఆరు నెలల(ఏప్రిల్-సెప్టెంబర్) కాలంలో వీరి ద్వారానే 40% పసిడి దిగుమతులు జరిగాయని ప్రభుత్వ వర్గాలు విశ్లేషించాయి. వీరిలో ముగ్గురు ముంబైకి చెందిన పసిడి ట్రేడర్లుకాగా, మిగిలినవారు ముంబై, బెంగళూరు, హర్యానాలకు చెందిన వర్తకులు. అయితే ఈ ఆరుగురు ట్రేడర్లు నిర్వహించే వర్తకంలో చట్టవిరుద్ధమైన అంశాలేవీ లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల పసిడి దిగుమతులు పుంజుకోవడంతో ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. -
9వ రోజూ మార్కెట్ దూకుడు
ఇటీవల జోరుమీదున్న స్టాక్ మార్కెట్లలో నవవసంతం వెల్లివిరిసింది. సెన్సెక్స్ వరుసగా తొమ్మిదో రోజు లాభపడింది. 120 పాయింట్లు పెరిగి 27,140 వద్ద ముగిసింది. తద్వారా 9 రోజుల్లో 825 పాయింట్లు జమ చేసుకుంది. ఇక నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని 8,115 వద్ద నిలిచింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ కొత్త గరిష్టాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ 27,226వద్ద, నిఫ్టీ 8,142 వద్ద కొత్త రికార్డును నెలకొల్పాయి. ప్రధానంగా ఐటీ ఇండెక్స్ 2.5% పుంజుకోవడం ద్వారా మార్కెట్లకు అండగా నిలిచింది. సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3.5-2.5% మధ్య పురోగమించాయి. దీంతో నెల రోజుల తరువాత మళ్లీ టీసీఎస్ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అందుకుంది. అమెరికాలో జూలై నెలకు కన్స్ట్రక్షన్ రంగ గణాంకాలు మెరుగుపడగా, ఆగస్ట్ నెలకు తయారీ రంగ వృద్ధి మూడున్నరేళ్ల గరిష్టానికి చేరడంతో ఐటీ షేర్లకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. జీడీపీ పురోగమనం, కరెంట్ ఖాతా లోటు భారీగా తగ్గడం, విదేశీ పెట్టుబడులు కొనసాగుతుండటం వంటి అంశాలు పటిష్టర్యాలీకి కారణ మవుతున్నట్లు వివరించారు. వీటికితోడు రష్యా-ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ముడిచమురు ధరలు 16 నెలల కనిష్టానికి చేరాయి. దీంతో సెంటిమెంట్ మరింత మెరుగుపడిందని నిపుణులు చెప్పారు. రియల్టీ దూకుడు బుధవారం ట్రేడింగ్‌లో రియల్టీ ఇండెక్స్ సైతం 2% లాభపడింది. రియల్టీ షేర్లలో ఒబెరాయ్ 15% జంప్‌చేయగా, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఫీనిక్స్, హెచ్‌డీఐఎల్, శోభా 6-3% మధ్య ఎగశాయి. ఇక మరోవైపు సెన్సెక్స్‌లో కోల్ ఇండియా, భారతీ 3% స్థాయిలో పుంజుకోగా, గెయిల్, ఐటీసీ, ఓఎన్జీసీ 2-1.5% మధ్య తిరోగమించాయి. -
కొంచెం ఊరట !
ముంబై: గతానికి భిన్నంగా... మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడ్డాయి. పాలసీరేట్లలో ఎటువంటి మార్పులూ జరగలేదు. దీనితో గృహ, కారు వంటి వాటిపై బ్యాంకింగ్ రుణ వినియోగదారుడిపై నెలసరి వాయిదా చెల్లింపు(ఈఎంఐ)ల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. మార్కెట్ అంచనాలకు భిన్నమైన నిర్ణయాలను గత రెండు పాలసీ సమీక్షల్లో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. ఈ దఫా ద్రవ్యోల్బణం పెరుగుదల వాతావరణం నెలకొని ఉండడమే రేట్లు తగ్గించకపోవడానికి కారణమని ఆర్బీఐ సూచించింది. అయితే తగ్గుదల ధోరణి కొనసాగినంతకాలం రేట్ల పెంపునకు కూడా అవకాశం ఉండదని పేర్కొంది. వెరసి మొదటి ద్వైమాసిక పరపతి సమీక్ష సందర్భంగా రెపో రేటు ప్రస్తుత 8% వద్ద, సీఆర్ఆర్ 4% వద్ద యథాతథంగా కొనసాగనున్నాయి. పరపతి విధాన సమీక్షలో ముఖ్యాంశాలు... స్వల్పకాలిక రుణ(రెపో-బ్యాంకులకిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ) రేటు యథాతథం. రెపో ప్రస్తుతం 8%గా ఉంది. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిర్దిష్ట మొత్తానికి సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్)లో సైతం మార్పు లేదు. ఇది 4 శాతంగా కొనసాగనుంది. {దవ్యోల్బణం తగ్గుదల ధోరణి కొనసాగుతున్నంతకాలం రేటులో ఎటువంటి పెంపూ ఉండబోదు. 2014-15లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు అంచనా స్వల్పంగా 5.6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గింపు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ అంటే ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న నికర వ్యత్యాసం) సైతం జీడీపీలో 2 శాతంగా ఉండే అవకాశం ఉంది. 2014లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉంటుందని అంచనా. బ్యాంకింగ్ విలీనాలకు ద్వారాలు. అయితే ఈ విషయంలో పోటీ, స్థిరత్వం అంశాల్లో రాజీ ప్రశ్నే ఉండబోదు. బ్యాంకుల విలీనం వల్ల మరింత విలువ సృష్టి జరిగే అవకాశం ఉంది. 7 రోజులు, 14 రోజుల రెపో పరిమితులను 0.50 శాతం నుంచి 0.75 శాతానికి పెంచడం జరిగింది. ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) పెరుగుదల అవసరాలకు ఈ అంశాలు దోహదపడతాయి. తదుపరి పాలసీ 0సమీక్ష జూన్3న జరుగుతుంది. కనీస బ్యాలెన్స్ లేకుంటే జరిమానాలొద్దు.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిబంధనలను పాటించని కస్టమర్లపై జరిమానానాలు విధించరాదని బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ఏదైనా సమస్యల వల్ల ఖాతాదారులు ఈ నిబంధన పాటించ లేకపోతుండవచ్చని, అంతమాత్రం చేత బ్యాంకులు దీన్నుంచి అనుచిత లబ్ది పొందాలని చూడకూడదని ఆయన పేర్కొన్నారు. కనీస బ్యాలెన్స్ పాటించని బేసిక్ సేవింగ్స్ ఖాతాలపై జరిమానాలు విధించడం కాకుండా...అవసరమైతే కొన్ని సర్వీసులను కుదించాలని రాజన్ సూచించారు. మళ్లీ ఖాతాలో బ్యాలెన్స్ నిర్దేశిత స్థాయికి వచ్చిన తర్వాత ఆయా సేవలను పునరుద్ధరించవచ్చని తెలిపారు. అలాగే, నిర్వహణలో లేని ఖాతాల విషయంలో కూడా మినిమం బ్యాలెన్స్ లేని వాటిపై పెనాల్టీ విధించొద్దని రాజన్ చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్బీఐ.. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాలపై ఎటువంటి పెనాల్టీలూ విధించడం లేదు. అయితే, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటివి మాత్రం త్రైమాసికానికి రూ. 750 మేర చార్జీలు విధిస్తున్నాయి. ఈ తరహా బ్యాంకులకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో మూణ్నెల్లకు రూ. 10,000, ఓ మాదిరి పట్టణ ప్రాంతాల్లో రూ. 5,000 కనీస బ్యాలెన్స్ పాటించాల్సి ఉంటోంది. మరోవైపు, చలన వడ్డీ రేటుపై రుణాలను ముందస్తుగా చెల్లించాలనుకునే వారిపై కూడా ఎలాంటి పెనాల్టీ విధించకుండా ఉండేలా చూసే అంశాన్ని కూడా బ్యాంకులు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు. వడ్డీరేట్లు తగ్గిస్తేనే వృద్ధికి చేయూత: పరిశ్రమలు వృద్ధి రేటు పెరగడానికి వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించాల్సిందేనని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ద్రవ్యోల్బణం దిగివస్తున్న ధోరణిని పాలసీ రేట్లను తగ్గించడానికి అవకాశంగా ఆర్బీఐ తీసుకుంటే బాగుండేదని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. ఇలాంటి నిర్ణయం వల్ల పెట్టుబడుల పునరుత్తేజానికి అవకాశం ఉంటుందని అన్నారు. కేవలం పరపతి విధానంపై ఆధారపడి ద్రవ్యోల్బణం కట్టడి అసాధ్యమన్నది తమ అభిప్రాయమని ఫిక్కీ అధ్యక్షుడు సిద్దార్థ్ బిర్లా అన్నారు. దీనికి పాలనా పరమైన చర్యలు కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. పాలసీ రేటు తగ్గితే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెరుగుపడే అవకాశం ఉంటుందని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ యథాతథ విధానం పారిశ్రామిక వృద్ధికి నిరుత్సాహకరమేనని, నిధుల కోసం అధికంగా వ్యయపర్చాల్సివుంటుందని పీహెచ్డీ చాంబర్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. వడ్డీరేట్లలో మార్పుండదు: బ్యాంకర్లు ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో వడ్డీరేట్లలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని బ్యాంకర్లు పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారు నెలవారీ చెల్లింపులపై(ఈఎంఐలు) తక్షణం ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్ల విషయంలో మరికొంతకాలం ప్రస్తుత పరిస్థితే కొనసాగే అవకాశం ఉందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కేఆర్ కామత్ వ్యాఖ్యానించారు .రియల్టీ హర్షం... కాగా వడ్డీరేట్లు తగ్గించకపోయినా, పెంచకపోవడమూ ఒక సానుకూల అంశమేనని రియల్టర్ల సంస్థ క్రెడాయ్ పేర్కొంది. వడ్డీరేట్లు అధిక స్థాయిలో ఉన్నాయని, భవిష్యత్తులో ఇవి తగ్గడానికే అవకాశం ఉందని పాలసీ సంకేతాలు ఇస్తోందని భారత రియల్డీ డెవలపర్ల సంఘం (క్రెడాయ్) చైర్మన్ లలిత్ కుమార్ జైన్ అన్నారు. యథాతథం... తప్పదు: రాజన్ ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించక తప్పదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. గత యేడాది సెప్టెంబర్, అలాగే 2014 జనవరి మధ్య రేట్ల పెంపు నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో తన లక్ష్యాలను నెరవేరుస్తోందని రాజన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆహారం, ఇంధనాలను మినహాయిస్తే, రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 8 శాతంగానే కొనసాగుతోందని ఆయన అన్నారు. డిమాండ్ ఇంకా అధిక స్థాయి వద్దే వున్న అంశాన్ని ఈ పరిస్థితి ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం 2015 జనవరి నాటికి 8 శాతం, అటుపై యేడాది 6 శాతం దిశగా కొనసాగుతుంటే మాత్రం రెపోరేటును పెంచబోమని గవర్నర్ స్పష్టం చేశారు. వృద్ధి సామర్థ ్యం 6 శాతం కంటే తక్కువే... పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్బీఐ స్థూల ఆర్థిక వ్యవస్థ, పరపతి పరిణామాలపై ఒక నివేదికను సైతం ఆవిష్కరించింది. భారత్ వృద్ధి సామర్థ్యం ప్రస్తుత పరిస్థితుల్లో 6 శాతంకన్నా తక్కువేనని ఈ నివేదికలో పేర్కొంది. ఈ మేరకు ఇంతక్రితం 8 శాతం అంచనాలను సవరించింది. ఫైనాన్షియల్ పొదుపులు, పెట్టుబడులు తగ్గుతుండడం, అధిక ద్రవ్యోల్బణం, దిగువ స్థాయిలో వాణిజ్య విశ్వాసం వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. -
మంచి కాలం కనబడుతోంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. మంచి పంట దిగుబడులకు అవకాశం, ఎగుమతులు పెరిగే సంకేతాలు, బంగారం దిగుమతులు తగ్గుతున్న వైనం... తద్వారా కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత అంచనా 70 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు తగ్గే అవకాశం వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ద్రవ్యోల్బణం, పెట్టుబడుల పునరుద్ధరణ వంటి అంశాలు మాత్రం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని విలేకరులతో అన్నారు. -
ద్వితీయార్థంలో ఎకానమీ రికవరీ
సాక్షి, బెంగళూరు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎకానమీ ఒత్తిళ్ల నుంచి మళ్లీ కోలుకోగలదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కరెంటు ఖాతా లోటును (క్యాడ్) 70 బిలియన్ డాలర్ల లోపే కట్టడి చేసి.. ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అంచనాలను తప్పని నిరూపిస్తామని స్పష్టం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు అయిన ఒక కార్యక్రమంలో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 101 శాఖలను ఏకకాలంలో ప్రారంభించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. మన పేదలు నిజాయితీపరులు .. భారత్‌లో సంపన్నులతో పోలిస్తే పేదలు విశ్వసనీయమైన వారని, నిజాయితీగా రుణాలు తిరిగి చెల్లించేవారని ఆయన కితాబిచ్చారు. ఆధార్ కార్డులు తప్పనిసరి కాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. తాము వీటి ప్రయోజనాన్ని అత్యున్నత న్యాయస్థానానికి నివేదిస్తున్నామని చిదంబరం వివరించారు. ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల కుంభకోణంలో ఎంసీఎక్స్, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్‌లతో పాటు ప్రమోటర్ ఎఫ్‌టీఐఎల్‌పై కూడా నియంత్రణ సంస్థలు సెబీ, ఎఫ్ఎంసీ నిఘా ఉంచాయని చెప్పారు. కొత్తగా రాబోయే ప్రైవేట్ బ్యాంకులు ఇప్పుడున్న బ్యాంకులకు నకళ్లుగా ఉండరాదని, పేదలకు సైతం సేవలు విస్తరించగలగాలని సూచించారు. -
క్యాడ్ డేటా కీలకం!
న్యూఢిల్లీ: ఈ వారంలో మార్కెట్ కదలికలను ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు గణాంకాలు నిర్ధేశించనున్నాయి. ముఖ్యంగా జూన్ క్వార్టర్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) డేటాతోపాటు సెప్టెంబర్ నెల ఆటోమొబైల్, సిమెంట్ కంపెనీల విక్రయాల గణాంకాలు కూడా వెలువడనున్నాయి. దీంతోపాటు వ్యాపార కార్యలాపాలపై పలు ప్రైవేటు సర్వేలు కూడా రానున్నాయి. ఇవన్నీ స్టాక్‌మార్కెట్ల గమనాన్ని ప్రభావితం చేయనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, ఈ వారంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండటంతో.. నాలుగు ట్రేడింగ్ రోజులు మాత్రమే ఉండటం కూడా గమనార్హం. ఇక ఈ ఏడాది(2013-14) సెప్టెంబర్‌తో ముగిసే రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు అక్టోబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. కార్పొరేట్ ఫలితాలు మొదలయ్యేవరకూ స్టాక్ సూచీలు నిస్తేజంగానే కదలాడే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. అమెరికా రుణ పరిమితి అంశం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లపై నిర్ణయం(అక్టోబర్ 2న) వంటి అంతర్జాతీయ పరిణామాలను కూడా ఇన్వెస్టర్లు నిశితంగానే గమనించనున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. సోమవారం(30న) ఆర్బీఐ జూన్ క్వార్టర్(క్యూ1) క్యాడ్ గణాంకాలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు గురై చివరకు నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే. గతవారం మొత్తంమీద 537 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 17,727 వద్ద ముగిసింది. క్యాడ్ మళ్లీ పైకి... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ1)లో క్యాడ్(మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారక నిధుల మధ్య వ్యత్యాసం) మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీడీపీతో పోలిస్తే క్యాడ్ 4 శాతంగా నమోదుకావచ్చని డీబీఎస్ పేర్కొంది. ముఖ్యంగా ఈ మూడు నెలల్లో బంగారం దిగుమతులు పెరగడం, ఎగుమతుల తగ్గుదలే దీనికి కారణమని తెలిపింది. గతేడాది(2012-13)లో రికార్డు స్థాయిలో 4.8 శాతానికి(88.8 బిలియన్ డాలర్లు) దూసుకెళ్లిన క్యాడ్... ఆఖరిదైన మార్చి క్వార్టర్లో మాత్రం కాస్త శాంతించి 3.6 శాతానికి(18.1 బిలియన్ డాలర్లు) పరిమితమైన సంగతి తెలిసిందే. మరోపక్క, క్యూ1లో క్యాడ్ 5%గా ఉండవచ్చునని ఆర్థిక శాఖ అంచనా వేసింది. క్యాడ్ పెరుగుదల ప్రభావంతోనే రూపాయి పతనమవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి(68.80) పడిపోయి.. ప్రస్తుతం 63 స్థాయిలో ఉంది. గణాంకాల వరుస... అక్టోబర్ 1న ఆటోమొబైల్ కంపెనీలు, సిమెంట్ అమ్మకాల గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో మంగళవారం నాడు ఈ రెండు రంగాల స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారించనున్నారు. తయారీ రంగానికి సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు కూడా రానున్నాయి. అక్టోబర్ 4న దేశీ సేవా రంగ పనితీరుపై సర్వే నివేదిక వెలువడనుంది. కాగా, దేశీయంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి భారీ పరిణామాలేవీ ప్రస్తుతానికి లేవని, అక్టోబర్ 2వ వారంలో క్యూ2 కార్పొరేట్ ఫలితాలు ప్రారంభమైన తర్వాతే మార్కెట్ ట్రెండ్‌ను అంచనావేయడానికి వీలవుతుందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్) దీపేన్ షా వ్యాఖ్యానించారు. దేశీ కంపెనీల ఆర్థిక ఫలితాలు మందకొడిగానే ఉండొచ్చని కూడా ఆయన అంచనా వేశారు. ఎన్ఎస్ఈ నిఫ్టీలో స్వల్పకాలానికి బేరిష్ ధోరణి ఉండొచ్చని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. రానున్న ట్రేడింగ్ సెషన్లలో 5,800 పాయింట్లు.. నిఫ్టీకి కీలక నిర్ణాయక స్థాయి అని పేర్కొన్నారు. రూపాయి కదలికలు, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి కూడా మార్కెట్ దిశను నిర్ధేశించడంలో ప్రధాన పాత్ర పోషించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికాలో ప్రభుత్వ రుణ పరిమితి విషయంపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారు. అమెరికాలో వ్యయాల కోతపై చర్చిం చేందుకు మరికొంత గడువును కోరే అవకాశం ఉందని షా చెబుతున్నారు. కొనసాగుతున్న ఎఫ్ఐఐల జోరు... దేశీ స్టాక్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా పడిపోతున్న రూపాయి, మందగమనంలో చిక్కుకున్న వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ తీసుకున్న పలు చర్యలు విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపుతున్నాయి. దీంతో సెప్టెంబర్ నెలలో 27వ తేదీ నాటికి 2.09 బిలియన్ డాలర్ల(సుమారు రూ.13,228 కోట్లు) నిధులను స్టాక్ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా కుమ్మరించారు. ఆగస్టులో నికరంగా రూ.16,000 కోట్లను వెనక్కితీసుకున్న విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ సెప్టెంబర్‌లో కొనుగోళ్ల బాటపట్టడం గమనార్హం. కాగా, ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలోకి నికరంగా రూ. 73,400 కోట్ల నిధులను పెట్టుబడిగా పెట్టగా.. డెట్ మార్కెట్ నుంచి రూ.36,914 కోట్లను నికరంగా ఉపసంహరించుకున్నారు. -
70 బిలియన్ డాలర్లకు క్యాడ్ పరిమితం
న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) 70 బిలియన్ డాలర్లకు (జీడీపీలో 3.7 శాతం) పరిమితం అవుతుందన్న ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ సోమవారం ఈ అంశంపై మాట్లాడారు. ప్రభుత్వ చర్యలు క్యాడ్ కట్టడికి దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాడ్‌గా పరిగణిస్తారు. 2012-13లో ఈ లోటు 88 బిలియన్ డాలర్లు. సంబంధిత ఆర్థిక సంవత్సరం జీడీపీలో ఇది 4.8 శాతానికి సమానం. బంగారం దిగుమతుల విలువ 10 నుంచి 12 బిలియన్ల వరకూ తగ్గడం కూడా క్యాడ్ కట్టడికి సంబంధించి సానుకూల అంశమని అన్నారు. 2013-14లో జీడీపీ వృద్ధి రేటు 5.5 శాతం స్థాయిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని సైతం ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.