న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) అతితక్కువగా నమోదు కావడం ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమని కేంద్ర ఆర్థిక కార్యదర్శి అశోక్ లవాసా పేర్కొన్నారు. దేశంలోకి వచ్చీపోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. తొమ్మిది సంవత్సరాల్లో మొట్టమొదటిసారి గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) క్యాడ్... మిగులు సమీపానికి చేరింది. 2015-16 క్యూ4లో 2014-15 ఇదే కాలంతో పోల్చితే క్యాడ్ 7.1 బిలియన్ డాలర్ల నుంచి 0.3 బిలియన్ డాలర్లకు త గ్గింది. 2007 మార్చి త్రైమాసికంలో భారత్ 4.2 బిలియన్ డాలర్ల విదేశీ నిధుల మిగులును (సీఏఎస్) సాధించింది. కాగా గతేడాది క్యాడ్ 22.1 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.1%). అంతక్రితం ఏడాది ఈ పరిమాణం 26.8 బిలియన్ డాలర్లు. జీడీపీలో 1.3%.