Ashok lavasa
-
ఎన్నికల కమిషనర్‌గా వైదొలగిన అశోక్ లావాస
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా సెప్టెంబర్‌లో నూతన బాధ్యతలు చేపట్టనుండటంతో ఆయన ఎన్నికల కమిషనర్‌గా వైదొలిగారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా పదవీవిరమణ చేయనుండటంతో తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అశోక్ లావాస కీలక బాధ్యతలను చేపట్టాల్సి ఉంది. అయితే పూర్తి పదవీకాలం ముగియకుండానే పదవి నుంచి వైదొలగిన రెండవ ఎన్నికల కమిషనర్‌గా అశోక్ లావాస నిలిచారు. ఏడీబీ వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ నియామకంపై గత వారం ప్రకటన వెలువడింది. ప్రైవేట్ రంగ కార్యకలాపాలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలకు సంబంధించి అశోక్ లావాస ను ఉపాధ్యక్షుడిగా నియమించామని, ఆగస్ట్ 31న పదవీవిరమణ చేయనున్న దివాకర్ గుప్తా స్తానంలో ఆయన నూతన బాధ్యతలు చేపడతారని ఏడీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, అశోక్ లావాస హరియాణ క్యాడర్‌కు చెందిన పదవీవిరమణ చేసిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2018 జనవరిలో ఆయన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అశోక్ లావాస 2016 జూన్ నుంచి అక్టోబర్ 2017 వరకూ భారత ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. పర్యావరణ, పౌరవిమానయాన కార్యదర్శిగా కూడా ఆయన వ్యవహరించారు. చదవండి : ఏడీబీ ఉపాధ్యక్షుడిగా అశోక్ లావాస -
ఏడీబీ ఉపాధ్యక్షుడిగా అశోక్ లావాస
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస(62) ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషనర్‌గా రెండేళ్ల పదవి కాలం మిగిలుండాగానే ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆయన దానిని తిరస్కరించి ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో సుశీల్ చంద్రగత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ నియమావళిని ఉల్లఘించిన కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల పట్ల అశోక్ లావాస నిక్కచ్చిగా వ్యవహరించారు. దీంతో ఆయన కుటుంబీకులపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని అశోక్ లావాస నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. -
అది ఎన్నికల కమిషనర్‌పై కక్షేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా భార్య నావెల్ సింఘాల్ లావాసా దాఖలు చేసిన పన్ను రిటర్న్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆదాయం పన్ను శాఖ సోమవారం నాడు నోటీసులు జారీ చేయడం కొన్ని వర్గాల్లో అనుమానాలకు దారి తీసింది. పలు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నందున ఆమె చూపిన పన్ను రిటర్న్స్‌పై సహజంగానే అనుమానాలు రావచ్చు. పైగా నోటీసులు జారీ చేసినంత మాత్రాన అందుకున్న వాళ్లు అవినీతికి పాల్పడినట్లు అర్థమూ కాదు. ‘ర్యాండమ్’ తనిఖీల కింద ఆదాయం పన్ను శాఖ పలువురికి ఇలాంటి నోటీసులు జారీ చేయడం కూడా సర్వ సాధారణమే. అయితే అశోక్ లావాసా కుటుంబ సభ్యుల్లో ఆయన సోదరి శకుంతలా లావాసాకు, ఆయన కుమారుడు అభిర్ లావాసా వాటాదారుడిగా ఉన్న ఓ పుస్తకాల కంపెనీకి, అందులోనూ 2008 నుంచి 2010 మధ్య చోటు చేసుకున్న లావాదేవీలకు సంబంధించి ఆదాయం పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం సాధారణము కాదు, యాధశ్చికమూ అంతకంటే కాదు. మరి ఎందకు ఈ నోటీసులు జారీ అయినట్లు ? దీని వెనక కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉన్నాయా? ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, భార్య నావెల్ సింఘాల్ లావాసా గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో ఐదింటిలో మిగితా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఇచ్చిన ‘క్లీన్చిట్’లను ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తీవ్రంగా వ్యతిరేకించారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వాదనను లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. తన అభ్యంతరాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిందిగా డిమాండ్ కూడా చేశారు. తన డిమాండ్‌ను నెరవేర్చే వరకు ఆ తదుపరి ఎన్నికల కమిషన్ సమావేశాలకు హాజరుకానంటూ సవాల్ చేసి, హాజరుకాలేదు. అయినప్పటకీ ఆయన డిమాండ్ ‘సమాచార హక్కు’ పరిధిలోకి రాదంటూ మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు త్రోసిపుచ్చారు. లావాసా ఇప్పటికీ సిట్టింగ్ ఎన్నికల కమిషనర్ అవడం వల్ల అక్టోబర్‌లో జరుగనున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ రెండు రాష్ట్రాల్లోను బీజేపీయే అధికారంలో ఉన్న విషయం తెల్సిందే. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ పట్ల పక్షపాత వైఖరిని కనబర్చకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాలి. ఆదాయం పన్ను శాఖ లావాసా కుటుంబ సభ్యులకు జారీ చేసిన నోటీసులు సబబేనని, వారు అవినీతికి పాల్పడ్డారని సకాలంలో నిరూపించాలి. అలాకాని పక్షంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన పెద్దలు, నిష్పక్షపాతంగా పనిచేసిన అధికారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడినట్లే! అప్పుడు అది కచ్చితంగా ఎన్కికల కమిషన్ ‘అటానమి’ని దెబ్బతీయడమే అవుతుంది. -
ఎలక్షన్ కమిషనర్ భార్యకు ఐటీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావసా కుటుంబానికి ఐటీ శాఖ ద్వారా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన భార్య నోవల్ సింఘాల్. కమార్తె, కుమారుడి ఆదాయంపై ఐటీ విభాగం దృష్టి సారించింది. ఆదాయ లెక్కల్లో తేడా ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా అశోక్ లవాసా తనయుడు నిర్వహిస్తున్న నౌరిష్ ఫుడ్స్ ఖాతాలలో అవకతవకలపై దృష్టి సారించిన ఐటీ విభాగం ఈ నోటీసులిచ్చింది. వారి ఆదాయ, వ్యయాలను గత కొన్నిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తోంది. 2005 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన నుంచి నోవల్ సింఘాల్ లావాసా ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. అప్పటివరకు నోవాల్ రిటర్నులపై ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. కానీ గత కొన్ని నెలలుగా మాత్రం భారీ తేడాను ఐటీ అధికారులు గుర్తించారు. ఆదాయ, వ్యయాల్లో తేడాకు గల కారణాలపై ఇటీవల నోటీసులు కూడా జారీ అయ్యాయి. 2015 నుంచి 2017 వరకు వివిధ కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆదాయం కూడబెట్టారా అని ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు. మరోవైపు దీనిపై నోవల్ సింఘాల్ స్పందించారు. తాను ఎలాంటి పన్నుల ఎగవేతకు, ఆదాయ అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. 28 సంవత్సరాల పాటుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లాస్ వన్ ఆఫీసర్‌గా పనిచేసిన తనకు బ్యాంకింగ్ సంబంధిత వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా సహా వివిధ వృత్తిపరమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, 2019న అందుకున్న అన్ని ఐటీ నోటీసులకు తాను సమాధానం ఇచ్చాననీ, ప్రస్తుత ప్రక్రియకు కూడా సహకరిస్తున్నానని ఆమె వివరణ ఇచ్చారు. కాగా అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసి అశోక్ గతేడాది జనవరి 23న కేంద్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ చంద్రతో అశోక్ విభేదించిన సంగతి తెలిసిందే. -
ఎలక్షన్ కమిషనర్ భార్యకు ఐటీ నోటీసు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాస భార్య నావెల్ సింఘాల్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. ఎలక్షన్ కమిషనర్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పలు కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె 2005లో ఎస్బీఐ నుంచి వైదొలిగింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన 11 నిర్ణయాల్లో లావాస తన అసమ్మతిని తెలియజేయగా కమిషన్ క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అసమ్మతిని రికార్డు చేయని ఈసీ సమావేశానికి అర్థంలేదని లావాస పేర్కొన్నారు. -
రాష్ట్రపతికి నూతన ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ంపీల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసింది. 17వ లోక్‌సభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ ఆరోరా, ఇద్దరు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రలు.. శనివారం కోవింద్‌ను రాష్ట్రపతి భవన్లో కలిశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్‌సభ ఏర్పాటుకు ఫలితాల్లో వెల్లడైన ఎంపీల పేర్లను రాష్ట్రపతికి అందజేశారు. ఇది లోక్‌సభ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్రపతికి ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల ప్రధానాధికారి, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి కోవింద్ అభినందించారు. -
అసమ్మతిని ప్రస్తావించం
న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కేసులకు సంబంధించిన తీర్పుల ఉత్తర్వుల్లో అసమ్మతి వివరాలను కూడా చేర్చాలంటూ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా చేసిన డిమాండ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం 2–1 మెజారిటీ ఓటుతో తిరస్కరించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు సుశీల్ చంద్ర, లావాసాలతో కూడిన ఈసీ కమిటీ ఈ వివాదాస్పద విషయంపై చర్చించింది. అనంతరం ఈసీ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘ఎన్నికల నిబంధనావళి అంశంపై ఈసీ సమావేశం మంగళవారం జరిగింది. కమిషనర్లందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటాం. అసమ్మతి, మైనారిటీ అభిప్రాయాలను రికార్డు చేసినప్పటికీ ఉత్తర్వుల్లో వాటిని పేర్కొనం’ అని తెలిపింది. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై వచ్చిన ఫిర్యాదులపై చర్యల సమయంలో తన అసమ్మతిని పరిగణనలోనికి తీసుకోవడం లేదనీ, కాబట్టి ఇకపై తాను ఈ తరహా సమావేశాలకు వెళ్లదలచుకోవడం లేదని అశోక్ లావాసా ఇటీవల ప్రకటించడం తెలిసిందే. తాజా సమావేశంలోనూ లావాసా తన వాదనకు కట్టుబడగా, ప్రధాన కమిషనర్, మరో కమిషనర్ ఆయన వాదనను తోసిపుచ్చారు. ఈ సమావేశం అనంతరం లావాసా మాట్లాడుతూ పారదర్శకతే ప్రధానమని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని అన్నారు. నిబంధనావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే ప్రక్రియ నిర్దిష్ట గడువులోగా పూర్తయ్యేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. -
ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై ఈసీ సమావేశం..!
సాక్షి, న్యూడిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్చిట్ ఇవ్వడంతో ఈసీలో అసమ్మతి రేగిన సంగతి తెలిసిందే. ఈసీ పనితీరుపై కమిషనర్ అశోక్ లావాసా అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదులపై మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయడం లేదని పేర్కొంటూ ఆయన సీఈసీ సునీల్ అరోరాకు లేఖ కూడా రాశారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్రమంలో మైనారిటీ అభిప్రాయాల్ని కూడా గౌరవించాలని, చర్యలు తీసుకునే విషయంలో పారదర్శకత పాటించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. (చదవండి : ఈసీలో అసమ్మతి ‘లావా’సా) కాగా, లవాస వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. ఎన్నికల కోడ్‌కు సంబంధించిన అంశాలపై మైనారిటీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదని సీఈసీ సునీల్ అరోరా అభిప్రాయపడినట్టు తెలిసింది. కేవలం క్వాసీ-జ్యూడిషియల్ వ్యవహారాల్లో మాత్రమే మైనారిటీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని సీఈసీ అభిప్రాయపడినట్టు సమాచారం. ముగ్గురు ఈసీ కమినర్ల బృందంలో లావాసా ఒకరు కాగా, సీఈసీ సునీల్ అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్ర ప్రధాని మోదీకి క్లీన్చిట్ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండగా.. లావాసా వ్యతిరేకించారు. -
ఈసీలో అసమ్మతి ‘లావా’సా
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు పూర్తయి, ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)లో విభేదాలు బయటపడ్డాయి. నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తీసుకునే నిర్ణయాల్లో తన అసమ్మతిని రికార్డు చేయనందుకు నిరసనగా ఈసీ సమావేశాలకు దూరంగా ఉంటానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరాకు లావాసా లేఖ రాయడం కలకలం రేపింది. మరోమార్గం లేకనే దూరంగా ఉంటున్నా ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎన్నికల ప్రచారం సందర్భంగా నియమావళిని ఉల్లంఘించడంపై వచ్చిన ఫిర్యాదులపై చర్యల విషయంలో తన అభిప్రాయాన్ని రికార్డు చేయనందుకు కమిషనర్ అశోక్ లావాసా అసంతృప్తి వ్యక్తం చేశారు. 16న సీఈసీ అరోరా లేఖ రాశారు. అందులో ‘ఈసీలో పారదర్శకత ఉండాలన్న తన నోట్‌పై స్పందించనందుకు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై దూరంగా ఉండటం మినహా మరోమార్గం లేదని భావిస్తున్నా. మైనారిటీ అభిప్రాయాలను రికార్డు చేసేదాకా కమిషన్ సమావేశాలకు గైర్హాజరు కావాల్సిన పరిస్థితిని కల్పించారు. అసమ్మతిని రికార్డు చేయనప్పుడు సమావేశాల్లో పాల్గొనడంలో అర్థంలేదు’ అని లేఖలో పేర్కొన్నారు. ‘చాలా సందర్భాల్లో నేను వ్యక్తం చేసిన మైనారిటీ అభిప్రాయం బహుళ సభ్యుల చట్టబద్ధ సంస్థలు పాటించే సంప్రదాయాలకు భిన్నంగా అణచివేతకు గురైంది’ అని పేర్కొన్నారు. న్యాయ నిపుణులు ఏమన్నారంటే.. నిబంధనల ప్రకారం.. ఎన్నికల సంఘం ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అది సాధ్యం కానప్పుడు మెజారిటీ అభిప్రాయమే అంతిమం అవుతుంది. నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునే సమయంలో ట్రిబ్యునల్‌లో మాదిరిగా విచారణ ఉండదని, ఈసీ నిర్ణయాలపై సీఈసీతోపాటు మిగతా ఇద్దరు సంతకాలు చేస్తున్నందున మైనారిటీ అభిప్రాయాన్ని రికార్డు చేయాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెప్పారు. మెజారిటీ అభిప్రాయాన్నే ఈసీ నిర్ణయంగా వెలువరిస్తారని, అసమ్మతి అభిప్రాయాన్ని రికార్డు చేస్తారే తప్ప బహిర్గతం చేయబోరని అంటున్నారు. మోదీ, అమిత్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన 11 ఫిర్యాదులపై లావాసా అసమ్మతిని తెలపగా కమిషన్‌లోని సీఈసీ, మరో సభ్యుడు సుశీల్‌చంద్ర అన్ని ఫిర్యాదులపై క్లీన్చిట్ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ: కాంగ్రెస్ ఈసీపై మోదీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందన్న లావాసా ఆరోపణలపై విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా.. ‘మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను ‘ఎలక్షన్ ఒమిషన్’గా మార్చేసింది. లావాసా అసమ్మతిని రికార్డు చేసి ఉన్నట్లయితే ఈసీని ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు పెట్టి ఉండేది’ అని అన్నారు. మోదీ– అమిత్ షా ద్వయం ఉల్లంఘనలపై కమిషనర్ లావాసా పలు పర్యాయాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎన్నికల సంఘం వారికి క్లీన్చిట్ ఇవ్వడమే పనిగా పెట్టుకుందని ఆరపించారు. లేఖలో పేర్కొన్న అంశాలను తీవ్రమైనవిగా పరిగణించాలన్నారు. సుప్రీంకోర్టులో తీర్పుల సందర్భంగా జడ్జీలు వ్యక్తం చేసిన మెజారిటీతోపాటు మైనారిటీ అభిప్రాయాన్ని వెల్లడిస్తుండగా ఈసీలో అసమ్మతి అభిప్రాయాన్ని ఎందుకు బహిర్గతం చేయరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఎన్నికల సంఘంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఈసీ నిష్పాక్షికతపై అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది ఈసీ అంతర్గత విషయం: సీఈసీ అరోరా ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా లేఖ ఎన్నికల సంఘం అంతర్గత విషయమని సీఈసీ అరోరా అన్నారు. ఉల్లంఘన ఫిర్యాదులపై చర్యల విషయంలో ఈసీ పనితీరుపై మీడియాలో వచ్చిన కథనాలు ‘అభ్యంతరకరం. ఇది ఈసీ అంతర్గత విషయం’ అని అన్నారు. ‘కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు కూడా ఒకే వైఖరితో ఉండాలని ఏమీ లేదు. గతంలో ఎన్నోసార్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అది సహజం. కానీ, అదంతా ఎన్నికల సంఘం పరిధికి లోబడి జరిగింది. ఇటీవల మే 14వ తేదీన జరిగిన సమావేశంలోనూ ప్రవర్తనా నియమావళిసహా 13 అంశాలను పరిష్కరించేందుకు గ్రూపుల ఏర్పాటుపై ఏకాభిప్రాయం వ్యక్తమయింది. అవసరమైన సందర్భాల్లో బహిరంగ చర్చకు నేను వెనుకాడలేదు. ఆఖరి దశ ఓటింగ్,23న లెక్కింపు వేళ లావాసా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మిగతా విషయాలపై చర్చించేందుకు 21న ఈసీ పూర్తిస్థాయి సమావేశం ఉంటుంది’ అని అరోరా వెల్లడించారు. -
ఎన్నికల కమిషన్‌లో అసమ్మతి..!
సాక్షి, న్యూడిల్లీ : ఎన్నికల కమిషన్‌లో అసమ్మతి రేగింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఈసీ క్లీన్చిట్ ఇవ్వడంపై ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా అసహనం వ్యక్తం చేశారు. కమిషన్‌లో మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం లేనప్పుడు ఫిర్యాదులపై కమిషన్ నిర్వహించే సమావేశాలకు హాజరవడమెందుకని ప్రశ్నించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. మోదీ ఎన్నికల కోడ్ ఉల్లఘించారని అందిన ఆరు ఫిర్యాదులపై మే 4న విచారించిన ఈసీ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్రమంలో మైనారిటీ అభిప్రాయాల్ని కూడా గౌరవించాలని, చర్యలు తీసుకుని విషయంలో పారదర్శకత పాటించాలని లేఖలో పేర్కొన్నారు. ముగ్గురు ఈసీ కమినర్ల బృందంలో లావాసా ఒకరు. సీఈసీ సునీల్ అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్ర ప్రధాని మోదీకి క్లీన్చిట్ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండగా.. లావాసా వ్యతిరేకించారు. కాగా, లావాసా లెటర్‌పై స్పందించిన సీఈసీ అరోరా.. ఖ్వాసీ-జ్యూడిషియల్ వ్యవహారాల్లో మాదిరిగా మైనారిటీల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు. -
ఎన్నికలకు ఈసీ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పుంజుకుంటున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి సమకూర్చడంపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వేగం పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లవసా బుధవారం రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై ముఖ్య ఎన్నికల అధికారులు రజత్‌కుమార్, ఆర్.పి.సిసోడియాలతో చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)కు వెళ్లి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), ఓటింగ్ రసీదు యంత్రాల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ సుదీప్‌జైన్, రాష్ట్ర అధికారులతో ఈ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల అలవెన్స్‌లపై క్లారిటీ?
న్యూఢిల్లీ : ఉద్యోగులకు చెల్లించే భత్యాల విషయంలో ఈ వారంలో క్లారిటీ రానుంది. ఆర్థికకార్యదర్శి అశోక్ లావాసా నేతత్వంలో ఏర్పాటైన కమిటీ తన తుది నివేదికను ఆర్థికమంత్రిత్వ శాఖకు ఈ వారంలోనే సమర్పించేందుకు సిద్ధమైంది. భత్యాల విషయంలో లావాసా కమిటీ నివేదించే ప్రతిపాదనలతో మొత్తం 47 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 196 భత్యాలలో 53 తీసివేయాలని, మరో 36 భత్యాలను కలపాలన్న 7వ వేతన సంఘం సిఫారసుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేయడంతో ప్రభుత్వం గత ఏడాది లావాసా కమిటీని ఏర్పాటు చేసింది. క్లాస్ ఎక్స్, వై, జడ్ సిటీల బేసిక్ వేతనం ప్రకారం 24 శాతం, 16 శాతం, 8 శాతం, హెచ్ఆర్ఏ ఇవ్వాలని అంతకముందు 7వ వేతన సంఘం ప్రతిపాదించింది. అదేవిధంగా డీఏ 50 శాతాన్ని దాటితే హెచ్ఆర్ఏ 27 శాతం, 18 శాతం, 9 శాతం ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం హెచ్ఆర్ఏ రేటు బేసిక్ వేతనంపై 30 శాతం, 20 శాతం, 10 శాతంగా ఉంది. దాని మరింత తగ్గించి, 7వ వేతన సంఘం తమ సిపారసులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీంతో ఈ రేట్లపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయాలపై నెలకొన్న ప్రతిష్టంభనపై ఏర్పాటైన లావాసా కమిటీ తమ తుది నివేదికను ఈ వారంలో ప్రభుత్వానికి సమర్పించనుంది. బేసిక వేతనం, పెన్షన్ పెంచాలంటూ సిపారసు చేసిన ఏడవ వేతన సంఘ ప్రతిపాదనలను ప్రభుత్వం గతేడాది ఆమోదించిన సంగతి తెలిసిందే. -
త్వరలో రేషన్ నగదు రహితం!
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఆధార్ ద్వారా చెల్లింపులకు అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లు, ఎరువుల దుకాణాల్లో త్వరలో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 1.7 లక్షల పీఓఎస్‌లు పీడీఎస్‌ల్లో అమర్చామని, కొద్ది నెలల్లో మిగిలిన అన్ని దుకాణాల్లో అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లవసా తెలిపారు. ‘ఆహార– ప్రజా పంపిణీ, ఎరువుల విభాగాల వద్ద పీఓఎస్‌లను ఇన్స్టాల్ చేయడానికి అవసరమైన ప్రోగ్రామ్ ఉంది. వాటిల్లో ఆధార్ ద్వారా కూడా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకొంటాం. లక్ష గ్రామాల్లో రెండేసి మిషన్ల చొప్పున ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది’ అని అశోక్ చెప్పారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా లాభమెంతన్నది అంచనాకు రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. -
త్వరలో రేషన్ నగదు రహితం!
కార్డు, ఆధార్ ద్వారా చెల్లింపులు న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఆధార్ ద్వారా చెల్లింపులకు అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లు, ఎరువుల దుకాణాల్లో త్వరలో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 1.7 లక్షల పీఓఎస్‌లు పీడీఎస్‌ల్లో అమర్చామని, కొద్ది నెలల్లో మిగిలిన అన్ని దుకాణాల్లో అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లవసా తెలిపారు. ‘ఆహార– ప్రజా పంపిణీ, ఎరువుల విభాగాల వద్ద పీఓఎస్‌లను ఇన్ స్టాల్ చేయడానికి అవసరమైన ప్రోగ్రామ్ ఉంది. వాటిల్లో ఆధార్ ద్వారా కూడా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకొంటాం. లక్ష గ్రామాల్లో రెండేసి మిషన్ల చొప్పున ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది’ అని అశోక్ చెప్పారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా లాభమెంతన్నది అంచనాకు రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. -
ఫిబ్రవరి 2న సాధారణ బడ్జెట్!
వీలుంటే అంతకంటే ముందే.. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను జనవరి మూడో వారంలో ఏర్పాటు చేసి సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 2న లేదా అంతకుముందే పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. సాధారణ బడ్జెట్‌ను ముందుగానే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం వంటి ప్రభుత్వ నిర్ణయాలను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఆర్ధిక శాఖ వివరించింది. గురువారం జరిగిన పార్లమెంటరీ స్ధాయీ సంఘం సమావేశంలో బడ్జెట్ సంస్కరణల లక్ష్యాలు, సంస్కరణల ప్రక్రియలోని వివిధ అంశాలను ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా వివరించారని తెలుస్తోంది. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడం వల్ల కలిగే లాభ, నష్టాలపై స్ధాయీ సంఘం సభ్యులు పలు సందేహాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాగా, జనవరి 30, ఫిబ్రవరి 2 మధ్యలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, మార్చి 31 నాటికల్లా ఆర్ధిక బిల్లును పార్లమెంటు ఆమోదించే ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ 1, 2017 నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను అమలు చేసేందుకు వీలుగా కేంద్రం బడ్జెట్‌ను ముందుగా ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు పార్లమెంట్ సమావేశాలకు విరామం ఇవ్వొచ్చని, తర్వాత సమావేశమైనప్పుడు బడ్జెట్‌పై చర్చించి మార్చి 31కల్లా ఆమోదించడానికి పార్లమెంట్‌కు సమయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అతి తక్కువ క్యాడ్.. శుభసూచకం: కేంద్రం
న్యూఢిల్లీ: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) అతితక్కువగా నమోదు కావడం ఆర్థిక వ్యవస్థకు శుభసూచకమని కేంద్ర ఆర్థిక కార్యదర్శి అశోక్ లవాసా పేర్కొన్నారు. దేశంలోకి వచ్చీపోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా) మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్. తొమ్మిది సంవత్సరాల్లో మొట్టమొదటిసారి గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) క్యాడ్... మిగులు సమీపానికి చేరింది. 2015-16 క్యూ4లో 2014-15 ఇదే కాలంతో పోల్చితే క్యాడ్ 7.1 బిలియన్ డాలర్ల నుంచి 0.3 బిలియన్ డాలర్లకు త గ్గింది. 2007 మార్చి త్రైమాసికంలో భారత్ 4.2 బిలియన్ డాలర్ల విదేశీ నిధుల మిగులును (సీఏఎస్) సాధించింది. కాగా గతేడాది క్యాడ్ 22.1 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.1%). అంతక్రితం ఏడాది ఈ పరిమాణం 26.8 బిలియన్ డాలర్లు. జీడీపీలో 1.3%. -
గతవారం బిజినెస్
నియామకాలు ఆర్థిక మంత్రిత్వ శాఖలో వ్యయ విభాగపు కార్యదర్శిగా ఉన్న అశోక్ లవాసా తాజాగా ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. సేవలపై మరో అరశాతం పన్ను బాదుడు రెస్టారెంట్లు, ఇంటర్నెట్, ఫోన్ బిల్లులు, ప్రయాణ చార్జీలు, బ్యాంకింగ్ ఇతరత్రా అనేక సేవలపై మరింత భారం పడింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన 0.5 శాతం కృషి కళ్యాణ్ సెస్ జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పన్నుల పరిధిలో ఉన్న అన్ని సేవలపై అదనంగా ఈ అర శాతం పన్నును వడ్డిస్తారు. దీంతో ప్రస్తుతం 14.5 శాతంగా ఉన్న సేవల పన్ను 15 శాతానికి చేరింది. పీఎఫ్ చందాదారులకు ఊరట ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి చందాదారులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఇకపై రూ. 50 వేల వరకూ పీఎఫ్ విత్‌డ్రాయెల్స్ విషయంలో మూలం వద్ద పన్ను (టీడీఎస్) ఉండదు. జూన్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకూ రూ. 30,000 విత్‌డ్రాయెల్స్ వరకూ మాత్రమే టీడీఎస్ మినహాయింపు ఉండేది. ఆఫ్రికా ఆయిల్ రిటైల్ బిజినెస్‌కు రిలయన్స్ గుడ్‌బై దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఆఫ్రికాలోని పెట్రో ఉత్పత్తుల రిటైల్ వ్యాపారానికి గుడ్‌బై చెప్పింది. గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్(గ్యాప్కో)లో తనకున్న 76 శాతం పూర్తి వాటాను ఫ్రాన్స్ దిగ్గజం టోటల్‌కు విక్రయించినట్లు ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఆర్థికాభివృద్ధి మెరుపులు భారత్ ఆర్థిక రంగం గడచిన ఆర్థిక సంవత్సరం (2015 ఏప్రిల్-2016 మార్చి) సాధించిన వృద్ధి అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలకు సంతోషాన్ని ఇచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చిచూస్తే... 2015-16లో ఈ విలువ 7.6 శాతం ఎగసింది. ఈ వృద్ధి శాతం ఐదేళ్ల గరిష్ట స్థాయి. గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2 శాతం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) ఈ గణాంకాలను విడుదల చేసింది. పీవీఆర్ చేతికి డీఎల్ఎఫ్ 32 స్క్రీన్లు రియల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్కు చెందిన డీటీ సినిమాస్ తన 32 స్క్రీన్లను మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్‌కు విక్రయించనున్నది. ఈ డీల్ విలువ రూ.433 కోట్లు. డీఎల్ఎఫ్కు చెందిన డీఎల్ఎఫ్ యుటిలిటిస్ సంస్థ డిటీ సినిమాస్‌ను నిర్వహిస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్, చండీగఢ్‌ల్లో ఉన్న 32 స్క్రీన్లు.. డిటీ సినిమాస్ నుంచి పీవీఆర్‌కు చేతులు మారతాయి. షావోమి ఫోన్లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి 1,500 పేటెంట్లను కొనుగోలు చేసింది. ఈ పేటెంట్లు వీడియో, క్లౌడ్, మల్టీమీడియా టెక్నాలజీలకు సంబంధించినవి. ఈ ఒప్పందంలో భాగంగా షావోమి.. తన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్‌లలో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ (ఆఫీస్, స్కైప్‌తోపాటు)ను అప్లోడ్ చేసి, వాటిని ఇండియా, చైనాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నది. అలీబాబాలోని వాటా విక్రయ దిశగా సాఫ్ట్‌బ్యాంక్ చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలో ఉన్న తనకున్న వాటాలో కొంత భాగాన్ని విక్రయించనున్నది సాఫ్ట్‌బ్యాంక్. రుణ భారం తగ్గించుకోవడం కోసం అలీబాబాలో ఉన్న వాటాలో దాదాపు 7.9 బిలియన్ డాలర్లకు సమానమైన భాగాన్ని విక్రయిస్తామని సాఫ్ట్‌బ్యాంక్ పేర్కొంది. వాటా విక్రయం జరిగితే అలీబాబాలో 32.2%గా ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ వాటా 28%కి తగ్గనున్నది. బ్యాంక్ రుణ భారం మార్చి చివరికి 106 బిలియన్ డాలర్లుకు చేరినట్లు తెలుస్తోంది. ఫోర్బ్స్ అమెరికా సంపన్న మహిళల్లో మన వారు ఫోర్బ్స్ రూపొందించిన ‘అమెరికా సంపన్న మహిళల’ వార్షిక జాబితాలో భారతీయ సంతతికి చెందిన ఇద్దరు మహిళలు స్థానం పొందారు. ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్సోర్సింగ్ సంస్థ సింథెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథి 16వ స్థానంలో నిలిచారు. ఈమె నికర సంపద 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉలాల్ 30వ ర్యాంక్‌ను పొందారు. ఈమె నికర సంపద 470 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక జాబితా అగ్రస్థానంలో ఏబీసీ సప్లై అధినేత్రి డయాన్ హెన్డ్రి క్స్ ఉన్నారు. ఈమె నికర సంపద 4.9 బిలియన్ డాలర్లుగా ఉంది. కీలక పరిశ్రమల వృద్ధి పరుగు ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో మంచి పనితనాన్ని ప్రదర్శించింది. ఉత్పత్తి వృద్ధి రేటు 2015 ఏప్రిల్‌తో పోల్చితే 2016 ఏప్రిల్‌లో 8.5 శాతంగా నమోదయ్యింది. రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాల మంచి పనితీరు దీనికి కారణం. ఇంకా ఈ గ్రూప్‌లో బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజవాయువు రంగాలు ఉన్నాయి. 2015 ఏప్రిల్‌లో ఈ గ్రూప్ ఉత్పత్తి (2014 ఏప్రిల్‌లో పోల్చితే) అసలు లేకపోగా -0.2 శాతం క్షీణించింది. గడచిన ఆర్థిక సంవత్సరం మొత్తంగా వృద్ధి రేటు 2.7 శాతంగా ఉంది. స్మార్ట్‌ఫోన్స్ తయారీ యోచన లేదు: పిచాయ్ ఇప్పటికిప్పుడు సొంతంగా స్మార్ట్‌ఫోన్స్‌ను తయారు చేయాలనే ఉద్దేశం తమకు లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పష్టంచేశారు. మొబైల్స్ తయారీకి ఇతర భాగస్వాములతో పనిచేయాలనే ప్రణాళికనే అవలంబిస్తామని చెప్పారు. తగ్గిన పీ-నోట్ల పెట్టుబడులు భారత క్యాపిటల్ మార్కెట్లోకి పీ-నోట్ల ద్వారా వచ్చే పెట్టుబడులు గత నెల నాటికి 20 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. పీ-నోట్ల సంబంధిత నియమనిబంధనలను సెబీ పటిష్టం చేయడంతో వాటి పెట్టుబడులు గత నెలలో 2.11 లక్షల కోట్లకు పడిపోయాయి. పీ-నోట్ల పెట్టుబడులకు భారత్‌కు చెందిన మనీ లాండరింగ్ నిరోధక చట్టాలు వర్తిస్తాయని, ఏమైనా అనుమానాస్పద లావాదేవీలుంటే తమ దృష్టికి తీసుకురావాలంటూ పీ-నోట్ల నిబంధనలను సెబీ కఠినతరం చేసిన విషయం తెలిసిందే. డీల్స్.. రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో 15 శాతం వాటా కొనుగోలును ఓఎన్జీసీ విదేశ్ పూర్తి చేసింది. వాంకోర్ చమురు క్షేత్రాన్ని నిర్వహించే జేఎస్సీ వాంకోర్‌నెఫ్ట్ కంపెనీలో ఈ 15 శాతం వాటాను ఓఎన్జీసీ విదేశ్ 126.8 కోట్ల డాలర్లకు రష్యా జాతీయ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఓఎన్జీసీ విదేశ్కు ఇది నాలుగో అతి పెద్ద కొనుగోలు లావాదేవీ. ♦ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ)కు చెందిన సాధారణ బీమా సంస్థ విభాగం హెచ్డీఎఫ్సీ ఎర్గో... ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయనున్నది. డీల్ విలువ రూ.551 కోట్లు. ♦ ఐడియా సెల్యులర్ కంపెనీలో 3.47 శాతం వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ప్రావిడెన్స్ ఈక్విటీ పార్ట్‌నర్స్‌రూ.1,388 కోట్లకు విక్రయించింది. -
ఆర్థిక కార్యదర్శిగా అశోక్ లవాసా
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖలో వ్యయ విభాగపు కార్యదర్శిగా ఉన్న అశోక్ లవాసా తాజాగా ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. లవాసా.. 1980 బ్యాచ్‌కు చెందిన హరియాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది. ఈయన బ్యాచ్‌మేట్ అయిన శక్తికాంత దాస్.. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యద ర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రెవెన్యూ కార్యదర్శిగా హస్ముఖ్ అధియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా అంజులీ చిబ్ దుగ్గల్, ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా నీరజ్ కుమార్ గుప్తా ఉన్నారు.