ఎన్నికల కమిషన్‌లో అసమ్మతి..! | Top Polling Officer Dissented With EC Over Clean Chit To PM Modi | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌లో అసమ్మతి..!

Published Sat, May 18 2019 10:46 AM | Last Updated on Tue, May 21 2019 3:42 PM

Top Polling Officer Dissented With EC Over Clean Chit To PM Modi - Sakshi

సాక్షి, న్యూడిల్లీ : ఎన్నికల కమిషన్‌లో అసమ్మతి రేగింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఈసీ క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై  ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా అసహనం వ్యక్తం చేశారు. కమిషన్‌లో మైనారిటీ నిర్ణయాలకు ప్రాధాన్యం లేనప్పుడు ఫిర్యాదులపై కమిషన్‌ నిర్వహించే సమావేశాలకు హాజరవడమెందుకని ప్రశ్నించారు. ఈ మేరకు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరాకు లేఖ రాశారు. మోదీ ఎన్నికల కోడ్‌ ఉల్లఘించారని అందిన ఆరు ఫిర్యాదులపై మే 4న విచారించిన ఈసీ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.  

ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్రమంలో మైనారిటీ అభిప్రాయాల్ని కూడా గౌరవించాలని, చర్యలు తీసుకుని విషయంలో పారదర్శకత పాటించాలని లేఖలో పేర్కొన్నారు. ముగ్గురు ఈసీ కమినర్ల బృందంలో లావాసా ఒకరు. సీఈసీ సునీల్‌ అరోరా, మరో కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ప్రధాని మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు అనుకూలంగా ఉండగా.. లావాసా వ్యతిరేకించారు. కాగా, లావాసా లెటర్‌పై స్పందించిన సీఈసీ అరోరా.. ఖ్వాసీ-జ్యూడిషియల్‌ వ్యవహారాల్లో మాదిరిగా మైనారిటీల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement