ఎలక్షన్‌ కమిషనర్‌ భార్యకు ఐటీ నోటీసు | Election Commissioner Ashok Lavasa's Wife Gets I-T Notice | Sakshi
Sakshi News home page

ఎలక్షన్‌ కమిషనర్‌ భార్యకు ఐటీ నోటీసు

Published Tue, Sep 24 2019 5:27 AM | Last Updated on Tue, Sep 24 2019 5:27 AM

Election Commissioner Ashok Lavasa's Wife Gets I-T Notice - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ అశోక్‌ లావాస భార్య నావెల్‌ సింఘాల్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. ఎలక్షన్‌ కమిషనర్‌ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పలు కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె 2005లో ఎస్‌బీఐ నుంచి వైదొలిగింది.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన 11 నిర్ణయాల్లో లావాస తన అసమ్మతిని తెలియజేయగా కమిషన్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అసమ్మతిని రికార్డు చేయని ఈసీ సమావేశానికి అర్థంలేదని లావాస పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement