
మూలధన లాభం విషయంలో స్వల్ప మార్పు
ఆదాయపన్ను శాఖ మొత్తం ఏడు ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) పత్రాలను నోటిఫై చేసింది. తద్వారా రిటర్నుల దాఖలుకు ఇవి అందుబాటులోకి వచ్చినట్టయింది. గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి ఆదాయపన్ను రిటర్నులను జులై 31లోగా దాఖలు చేయాల్సి ఉంది. వ్యక్తులు, ఖాతాల ఆడిటింగ్ లేని వారికి ఈ గడువు వర్తించనుంది.
ఐటీఆర్ 2, 3, 5, 6, 7లో మూలధన లాభాల స్థిరీకరణకు సంబంధించి మార్పు చోటుచేసుకుంది. దీనికింద పన్ను చెల్లింపుదారులు తమ మూలధన లాభాలను 2024 జులై 23కు ముందు, ఆ తర్వాత అని రెండు భాగాలుగా చూపించాల్సి ఉంటుంది. అలాగే, ఐటీఆర్ 1, 4కు సంబంధించి కూడా మరో మార్పు జరిగింది. వేతన జీవులు రూ.1.25 లక్షలు మించని దీర్ఘకాల మూలధన లాభం కలిగినప్పుడు ఐటీఆర్ 1 లేదా 4 ఎంపిక చేసుకోవచ్చు. గతంలో వీరు ఐటీఆర్ 2 దాఖలు చేయాల్సి వచ్చేది. వేతనంతోపాటు దీర్ఘకాల మూలధన లాభాలు రూ.1.25 లక్షలకు మించితే అప్పుడు ఐటీఆర్ 2ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ చివరి తేదీలు
వ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025
ఆడిట్ అవసరమయ్యే వ్యక్తులు, వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025
కంపెనీలు: అక్టోబర్ 31, 2025