Inoperative PAN And Inactive PAN Not Same, Clarifies IT Dept Amid Concerns On ITR Filing - Sakshi
Sakshi News home page

IT Dept Clarification On PAN: పనిచేయని పాన్‌ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్‌

Published Wed, Jul 19 2023 9:56 AM | Last Updated on Wed, Jul 19 2023 11:38 AM

Inoperative PAN inactive PAN not same clarifies IT Dept amid concerns on ITR filing - Sakshi

ఆధార్ కార్డ్‌తో లింక్‌ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్‌) పాన్‌ కార్డులు, ఇతర కారణాలతో ఇన్‌యాక్టివ్‌గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్‌ సందర్భంగా ఇనాపరేటివ్‌, ఇనాక్టివ్‌ పాన్‌ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న  ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్‌ ఇచ్చింది.

‘పనిచేయని (ఇనాపరేటివ్‌) పాన్ కార్డు, ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్‌లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్‌లకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి  Inoperative PAN: పాన్‌ కార్డ్‌ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు!

అలాగే ఇనాపరేటివ్‌ పాన్‌ ఉన్నవారికి టీడీస్‌ (ట్యాక్స్‌ డిడక్టెడ్‌ అట్‌ సోర్స్‌), టీసీఎస్‌ (ట్యాక్స్‌ కలెక్టెడ్‌ అట్‌ సోర్స్‌) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్‌ కార్డుతో పాన్ కార్డ్‌  లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది.

ఎన్‌ఆర్‌ఐ పాన్‌లపై స్పష్టత
ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్‌ ఇన్‌ఆపరేటివ్‌గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్‌ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్‌లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. 

గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్‌ దాఖలు చేసిన వారి స్టేటస్‌ వివరాలను తామే జురిస్‌డిక్షనల్‌ అసెసింగ్‌ ఆఫీసర్‌లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్‌డేట్‌ చేయని వారి పాన్‌లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement