Clarification
-
జో బైడెన్‌కు పార్కిన్సన్స్.? క్లారిటీ ఇచ్చిన డాక్టర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పార్కిన్సన్స్(వణుకు) వ్యాధి ఉందా.. వైట్‌హౌజ్‌కు న్యూరాలజీ డాక్టర్ పదే పదే ఎందుకు వస్తున్నాడు.. బైడెన్ పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స చేయడం కోసమేనా.. ఇలాంటి ప్రశ్నలు ఇటీవల అమెరికాలో చర్చనీయంశమయ్యాయి. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వైట్‌హౌజ్‌కు తరచుగా న్యూరాలజిస్ట్ రావడంపై సోమవారం(జులై 8) ఒక అధికారిక లేఖ విడుదల చేశారు. ‘అధ్యకక్షుడు బైడెన్‌కు పార్కిన్సన్స్ వ్యాధి లేదు. ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు. వైట్‌హౌజ్‌లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొనే న్యూరలాజికల్ సమస్యలకు చికిత్స చేయడానికి న్యూరాలజిస్ట్ ఇటీవల వైట్‌హౌజ్‌కు ఎక్కువగా వస్తున్నారు. కరోనా తర్వాత వైట్‌హౌజ్ సిబ్బందిలో న్యూరాలజీ సమస్యలు పెరిగాయి’అని లేఖలో తెలిపారు. కాగా, వృద్ధాప్యం రీత్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్ ఇటీవల ఎక్కువయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బైడెన్‌కు పార్కిన్సన్ లేదని ఆయన ఫిజీషియన్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. డెమొక్రాట్ల తరపున బైడెన్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్ ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. -
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత
గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది. -
‘ఆధార్’పై రూమర్లు .. క్లారిటీ ఇచ్చిన ‘ఉడాయ్’
న్యూఢిల్లీ: ఆధార్‌పై సోషల్ మీడియాలో ఇటీవల ఒక చర్చ విస్తృతంగా జరుగుతోంది. జూన్ 14 లోపు పౌరులు తమ వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేయకపోతే ఆధార్ పని చేయదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(ఉడాయ్) కొట్టిపారేసింది.ఆధార్‌లో కేవలం ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే జూన్14 గడువని తెలిపింది. వివరాలు అప్డేట్ చేసుకోకపోయినా ఆధార్‌కార్డు పనిచేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత ఆధార్ కేంద్రాలకు వెళ్లి ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. కాగా, ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ తొలుత 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత ఈ గడువును రెండుసార్లు జూన్ 14 వరకు పొడిగించింది. ఈలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ గతంలో సూచించింది. -
అభివృద్ధి, సుస్థిర పాలనకే మా మద్దతు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సీమాంధ్రులమని చెప్పుకుంటూ కొందరు తెలంగాణలో కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆరోపించింది. తెలంగాణలో స్థిరపడిన సుమారు 15 లక్షల మంది సీమాంధ్రులు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరంటూ తమ పేరుతో కొందరు స్వార్థ రాజకీయాల కోసం వివిధ పార్టీలను 15 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని దుయ్యబట్టింది. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, సుస్థిర పాలనకే తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి తాము పూర్తి వ్యతిరేకమని తేలి్చచెప్పారు. సెటిలర్స్ అనే పదమే లేదని.. తామంతా తెలంగాణావాసులమేనన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసమే తెలంగాణకు.. గ్రేటర్ రాయలసీమ ప్రాంతం (నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) నుంచి తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది స్థిరపడ్డారని హనుమంతరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చ ల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఉప్పల్, అంబర్పేట్, ముషీరాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్ నియోజకవర్గాలతోపాటు మహ బూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ చాలా మంది వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన వివరించారు. రాష్ట్రం విడిపోయాక అన్నదమ్ముల్లా కలసిమె లసి ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ఇక్కడ ఎ లాంటి ఇబ్బందులు లేవన్నారు. దేశంలోనే అ త్యంత వెనుకబడిన, కరువుపీడిన ప్రాంతమైన రా యలసీమ నుంచి విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు హైదరాబాద్ సహా తెలంగాణకు వస్తుంటారన్నారు. మాకూ ఓ భవన్ కట్టివ్వాలి... గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ అఫ్ తెలంగాణ సంస్థ స్థాపించి పదేళ్లు అయ్యిందని... ఇందులో 40 వేల మంది సభ్యులు ఉన్నారని హనుమంతరెడ్డి చెప్పారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వీలుగా ఇతర ప్రాంతవాసులకు కేటాయించినట్లుగా తమ అసోసియేషన్‌కు సైతం ఒక భవనం తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధా న కార్యదర్శి రాఘవ్, బద్రీనాథ్, నిరంజన్ దేశాయ్, చంద్రశేఖర్‌రెడ్డి, కులేశ్వర్‌రెడ్డి, రాజే‹Ù, రాజశేఖర్‌రెడ్డి, రామకృరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖలిస్తానీ భావజాలానికి ఆ సింగర్ మద్దతు? ఇప్పుడు పశ్చాత్తాపంతో ఏమంటున్నారు??
భారత్- కెనడా సంబంధాలు బీటలువారుతున్న వేళ.. కెనడియన్ పంజాబీ గాయకుడు శుభనీత్ సింగ్ అలియాస్ శుభ్ పేరు ముఖ్యాంశాలలో కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం శుభ్ సోషల్ మీడియాలో వివాదాస్పద భారతదేశ మ్యాప్ షేర్ చేశారు. అది మొదలు అతనికి భారత్‌లో వ్యతిరేకత మొదలయ్యింది. ఖలిస్తానీ భావజాలానికి మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హర్జీత్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేయడంతో ముంబైలో జరగాల్సిన శుభ్ సంగీత కచేరీ రద్దయ్యింది. శుభ్‌నీత్ అలియాస్ శుభ్‌ను ఫాలో చేసే వారిలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. అయితే శుభ్.. ఖలిస్తాన్ భావజాలానికి మద్దతు ఇస్తున్నాడనే ఆరోపణలు వస్తుండటంతో తాజాగా విరాట్.. శుభ్‌ను అన్‌ఫాలో చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్‌లో శుభ్.. భారతదేశ మ్యాప్ నుండి పంజాబ్, జమ్మూ, కాశ్మీర్లను విడిగా చూపించాడు. ఇది తీవ్ర వివాదాస్పదం కావడంతో శుభ్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. అతను ఒక పోస్ట్‌లో.. ‘భారతదేశంలోని పంజాబ్‌కు చెందిన యువగాయకునిగా, నేను ఆలపించే సంగీతాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించాలనేది నా కల. అయితే ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు నన్ను ఇబ్బందుల్లోకి నెట్టివేశాయి. అందుకే నా నిరుత్సాహాన్ని, బాధను వ్యక్తపరచడానికి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. భారత పర్యటన రద్దుతో నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. భారతదేశం నా దేశం. నేను ఇక్కడే పుట్టాను. ఇది నా గురువుల, పూర్వీకుల భూమి. పంజాబ్ నా ఆత్మ, పంజాబ్ నా రక్తంలో ఉంది. నేను పంజాబీ కావడం వల్లనే ఈ స్థాయిలో ఉన్నాను. పంజాబీలు తమ దేశభక్తికి రుజువులు చూపాల్సిన అవసరం లేదు’ అంటూ తనలోని ఆవేదనను ఈ పోస్ట్ ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేశాడు శుభ్. ఇది కూడా చదవండి: గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? భారత్- కెనడాల మధ్య ఎలా చిచ్చుపెడుతున్నాడు? -
G20 Summit 2023: అంబానీ, అదానీలకు అందని ఆహ్వానం.. ఏం జరిగింది?
భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న ఏర్పాటు చేసిన డిన్నర్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మంది ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ డిన్నర్‌కు భారత్‌కు చెందిన బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారని, వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రముఖంగా ఉన్నారని ఆయా వార్తా కథనాల్లో పేర్కొన్నారు. అయితే జీ20 డిన్నర్‌కు వ్యాపారవేత్తలకు ఆహ్వానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయా వార్తల్లో నిజం లేదని, ఈ డిన్నర్‌కు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలే కాదు.. ఏ వ్యాపారవేత్తలూ హాజరుకావడం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసింది. ‘జీ20 స్పెషల్ డిన్నర్‌కు ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు ప్రచురించిన రాయిటర్స్ వార్తా కథనం ఆధారంగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇవన్నీ అవాస్తవం. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఏ బిజినెస్ లీడర్‌ను డిన్నర్‌కు ఆహ్వానించలేదు’ అంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ ఏడాది జూలై 26న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాంప్లెక్స్‌ని ప్రారంభించారు. సమ్మిట్ మొదటి రోజు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత మండపంలో గొప్ప విందును ఏర్పాటు చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సహా ప్రపంచ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. Media reports based on an article by @Reuters have claimed that prominent business leaders have been invited at #G20India Special Dinner being hosted at Bharat Mandapam on 9th Sep#PIBFactCheck ✔️This claim is Misleading ✔️No business leaders have been invited to the dinner pic.twitter.com/xmP7D8dWrL — PIB Fact Check (@PIBFactCheck) September 8, 2023 -
పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్) పాన్ కార్డులు, ఇతర కారణాలతో ఇన్‌యాక్టివ్‌గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సందర్భంగా ఇనాపరేటివ్, ఇనాక్టివ్ పాన్ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్ ఇచ్చింది. ‘పనిచేయని (ఇనాపరేటివ్) పాన్ కార్డు, ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్లకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇదీ చదవండి ➤ Inoperative PAN: పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! అలాగే ఇనాపరేటివ్ పాన్ ఉన్నవారికి టీడీస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది. ఎన్ఆర్ఐ పాన్లపై స్పష్టత ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్ ఇన్ఆపరేటివ్గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేసిన వారి స్టేటస్ వివరాలను తామే జురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్డేట్ చేయని వారి పాన్లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. Dear Taxpayers, Concerns have been raised by certain NRIs/ OCIs regarding their PANs becoming inoperative, although they are exempted from linking their PAN with Aadhaar. Further, PAN holders, whose PANs have been rendered inoperative due to non-linking of PAN with Aadhaar,… — Income Tax India (@IncomeTaxIndia) July 18, 2023 -
రెస్టారెంట్లలో సర్వీస్ చార్జ్ చెల్లిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటి వాటికి వెళ్లినప్పుడు కొన్నింటిలో అక్కడ తిన్నవాటికి, తాగినవాటికి బిల్‌తో పాటు అదనంగా సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంటారు. చాలా మంది ఇది తప్పనిసరేమో అనుకుని మారు మాట్లాడకుండా కట్టేసి వస్తుంటారు. అయితే ఈ సర్వీస్ చార్జ్ అన్నది తప్పసరా.. కాదా.. అని మరోసారి చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తాజా స్పష్టత ఇచ్చింది. గత వారం నోయిడాలోని ప్రముఖ స్పెక్ట్రమ్ మాల్లోని ఒక రెస్టారెంట్లో హింసాత్మక ఘటన జరిగింది. అక్కడికి వచ్చిన ఓ కుటుంబానికి, రెస్టారెంట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రెస్టారెంట్ వేసిన సర్వీస్ ఛార్జీని చెల్లించడానికి నిరాకరించడంతో రెస్టారెంట్ సిబ్బంది కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించారు. మాల్ లోపల జరిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి దేశంలో ఉన్న చట్టాలు, రెస్టారెంట్లు, బార్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలు చెల్లించడం తప్పనిసరి కాదా అనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాల్లో జరిగిన ఘర్షణను దృష్టిలో ఉంచుకుని రెస్టారెంట్, బార్లలో సర్వీస్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ముఖ్యమైన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదా? డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ జారీ చేసిన నోటీసు ప్రకారం.. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలు చెల్లించాలని కస్టమర్లను బలవంతం చేయకూడదు. ఎందుకంటే దీనిని విచక్షణా ఛార్జ్ అని పిలుస్తారు. అంటే తన విచక్షణ మేరకు రెస్టారెంట్ లేదా బార్లలో అందించిన సేవతో సంతృప్తి చెందితేనే దీన్ని చెల్లిస్తారు. వారి సేవతో సంతృప్తి చెందకపోతే బలవంతంగా విధించకూడదు. దీనర్థం రెస్టారెంట్, బార్ బిల్లుల్లో సర్వీస్ ఛార్జ్ తప్పనిసరి కాదు. ఇదీ చదవండి: Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా? -
కొవిన్ పోర్టల్‌లో డేటా లీక్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిన్ పోర్టర్‌లోని డేటా లీక్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేటా లీక్ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. ఈ క్రమంలనే డేటా లీక్ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. కాగా, డేటా లీక్ అంశంపై కేంద్రం స్పందించింది. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కొవిన్ పోర్టర్‌లోని డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది. ఇదే సమయంలో కొవిన్ పోర్టల్ పూర్తిగా సేఫ్. ఇందులోని డేటాను సీక్రెట్‌గా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్, యాంటీ-డీడీఓఎస్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో పోర్టల్‌ను రూపొందించినట్టు స్పష్టం చేసింది. ఇక, ఓటీపీ అథెంటికేషన్‌తో మాత్రమే కొవిన్ పోర్టల్‌లోని డేటాను చూడగలమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓటీపీ లేకుండా కొవిన్ పోర్టల్‌లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్ చేయలేమని కేంద్రం పేర్కొంది. డేటా లీక్ వార్తలపై తాము దర్యాప్తు చేపటినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్‌ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లో భారతీయులు టీకా తీసుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారు వంటి సమాచారం ఉంటుంది. ఇది కూడా చదవండి: టీకా వేయించుకున్నారా? డాటా లీక్ -
రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్ స్పష్టత
భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మొట్టమొదటిగా స్పందించారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక చర్యగా అభివర్ణించారు. కేంద్ర బ్యాంకులకు సంబంధించిన ఓ అంతర్గత కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంతదాస్ మీడియాతో మాట్లాడారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్మెంట్ చర్యల్లో భాగమేనని, క్లీన్ నోట్ పాలసీ అన్నది ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు. వివిధ డినామినేషన్ నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్‌లను విడుదల చేస్తుందని చెప్పారు. అలాగే రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించినట్లు తెలిపారు. అయితే అవి చెల్లుబాటు అవుతాయని వివరించారు. మరోవైపు రూ.2 నోటును ఎందుకు తీసుకొచ్చారో వెల్లడించారు. గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు ఏర్పడిన నగదు కొరతను నివారించడానికి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని వివరించారు. రూ.2 వేల నోట్ల జారీని చాలా రోజుల క్రితమే ఆపేసినట్లు స్పష్టం చేశారు. రూ.2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్ కోసం తగినంత సమయం ఇచ్చామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. సెప్టెంబర్ 30 వరకూ రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చన్నారు. కాగా డిపాజిట్ మొత్తం రూ.50 వేలకు మించితే పాన్ కార్డ్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. నగదు డిపాజిట్‌కు సంబంధించి ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు. #WATCH | #Rs2000CurrencyNote | RBI Governor Shaktikanta Das says, "Let me clarify and re-emphasise that it is a part of the currency management operations of the Reserve Bank...For a long time, the Reserve Bank has been following a clean note policy. From time to time, RBI… pic.twitter.com/Rkae1jG0rU — ANI (@ANI) May 22, 2023 ఇదీ చదవండి: Rs 2,000 Notes: బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా? జువెలరీ షాపులకు వెల్లువెత్తిన ఎంక్వైరీలు! -
Inzamam Ul Haq: గుండెపోటు రాలేదు.. కడుపు నొప్పితో వెళితే..!
లాహోర్: గుండెపోటుకు గురయ్యాడంటూ నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న వార్తలను పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఖండించాడు. తనకెటువంటి గుండెపోటు రాలేదని, కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే గుండెలో సమస్య విషయం బయటపడిందని తెలిపాడు. చికిత్సలో భాగంగా స్టంట్ వేసి సమస్యను పరిష్కరించారని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశాడు. ఈ మేరకు బుధవారం తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. కాగా, కడుపులో కాస్త అసౌకర్యంగా ఉండడంతో ఇంజమామ్ సోమవారం రాత్రి లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా యాంజియోగ్రఫీ నిర్వహించగా.. రక్త నాళం ఒకటి కాస్త మూసుకుపోయి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో స్టంట్ అమర్చి సమస్యను పరిష్కరించారు. 12 గంటల వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఇంజీ ఇంటికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే, పాక్ తరఫున 120 టెస్ట్‌లు, 378 వన్డేలు ఆడిన ఇంజీ.. ఇరవై వేలకు పైగా పరుగులు సాధించాడు. 2001-2007 మధ్యలో అతను పాక్ సారథిగా వ్యవహరించాడు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో ఇంజమామ్ సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: కేకేఆర్ బౌలర్‌కు గాయం.. సర్జరీ సక్సెస్ -
బాయ్‌కాట్ బింగో.. ఐటీసీ వివరణ
రణ్వీర్ సింగ్ తాజాగా నటించిన బింగో మ్యాడ్‌యాంగిల్స్ యాడ్‌పై నెటిజనులు తీవ్రంగా విరుకుచపడిన సంగతి తెలిసిందే. ఈ యాడ్‌లో రణవీర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ని కించపరిచారని నెటిజనలు ఆరోపించారు. దాంతో బాయ్‌కాంట్ బింగో అంటూ రణ్‌వీర్‌ని ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో ఐటీసీ ఈ వివాదంపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. "బింగో మ్యాడ్ యాంగిల్స్ తాజా ప్రకటన దివంగత బాలీవుడ్ ప్రముఖుడిని ఎగతాళి చేసేలా రూపొందించారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.ఇలాంటి తప్పుడు సందేశాలు, పోస్టులకు బలైపోవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇటీవలి ప్రసారం అవుతోన్న బింగో మ్యాడ్‌యాంగిల్స్ యాడ్‌ని ఒక సంవత్సరం క్రితం అక్టోబర్ 2019 లో షూట్ చేశాం. బింగో ప్రయోగం ఆలస్యం కావడంతో ఈ ప్రకటన ఈ ఏడాది ప్రసారం అవుతోంది. కోవిడ్ కారణంగా ‘మ్యాడ్ యాంగిల్స్ చీజ్ నాచోస్ అండ్ బింగో!’ ‘మ్యాడ్ యాంగిల్స్ పిజ్జా’ లాంచ్ చేయడంలో ఆలస్యం జరిగింది" అంటూ ఐటీసీ ఫుడ్స్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. (బాయ్‌కాట్ బింగో: రణ్‌వీర్‌పై ట్రోలింగ్) ఇక బింగో మ్యాడ్ యాంగ్సిల్ ప్రకటనలో రణ్వీర్ తన తదుపరి ప్లాన్ గురించి బంధువులకు వివరిస్తూ.. పారడాక్సికల్ ఫొటాన్స్, అల్గారిథమ్స్, ఏలియన్స్.. అంటూ చెప్తూ ఇదే తన నెక్స్ట్ ప్లాన్ అని జవాబివ్వడంతో అందరూ షాక్ అవుతారు. అయితే ఈ యాడ్‌లో ఎక్కడా సుశాంత్ పేరును ప్రస్తావించలేదు. కానీ దివంగత నటుడి అభిమానులు మాత్రం సుశాంత్ మాత్రమే ఫొటాన్స్, ఏలియన్స్ అంటూ సైన్స్ గురించి ఎప్పుడూ మాట్లాడేవారని, కావాలనే ఈ యాడ్‌లో అతన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ యాడ్‌ని వెంటలనే తొలగించాలని డిమాండ్ చేశారు. -
వ్యాజ్యాలపై హెచ్డీఎఫ్సీ వివరణ
సాక్షి,ముంబై: ప్రైవేటురంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ అమెరికాకు చెందిన న్యాయ సంస్థల వ్యాజ్యాలపై వివరణ ఇచ్చింది. అమెరికాకు చెందిన న్యాయ సంస్థ రోసన్ లా కంపెనీ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ వ్యాజ్యంతోపాటు, తమ బ్యాంకు ఉద్యోగులపై దాఖలైన ఫిర్యాదుపై స్పందించింది. వీటిపై తాము న్యాయ పోరాటం చేయనున్నామని స్పష్టం చేసింది. నిజాలను దాచిపెట్టి, తప్పుడు ప్రకటనలతో వాటాదారుల నష్టాలకు కారణమైందన్న ఆరోపణలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది. దీనిపై 2021 ప్రారంభంలో తమ స్పందన తెలియజేయాలని భావిస్తున్నట్టు రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం ఇంతకుమించి వివరాలను అందించలేమని పేర్కొంది. (హెచ్‌డీఎఫ్‌సీకు భారీ షాక్) కాగా పొటెన్షియల్ సెక్యూరిటీ క్లెయిమ్స్‌పై షేరు హోల్డర్స్ తరపున విచారణ ప్రారంభించినట్లు రోసన్ లా గత నెలలో తెలిపింది. వాహన రుణాల టార్గెట్‌ను రీచ్ అయ్యేందుకు తప్పుడు విధానాలు అవలంబించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. 2015 నుండి 2019 బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న లక్షల మంది కస్టమర్ల వివరాలతో పాటు వారి పేమెంట్ హిస్టరీ కూడా ఆలస్యంగా ఇస్తుందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఈనేపథ్యంలో బ్యాంకు సెక్యూరిటీలను కొనుగోలు చేసిన వాటాదారులు దీనికి మద్దతు పలకాలని కోరింది. మరోవైపు న్యూయార్క్ లోని మరో లా సంస్థ పోమెరాంట్జ్ కూడా హెచ్డీఎఫ్సీ అవుట్గోయింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి, సీఈఓగా బాధ్యతలను చేపట్టనున్న శశిధర్ జగదీషన్, కంపెనీ కార్యదర్శి సంతోష్ హల్దంకర్పై లా సూట్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. -
గంభీర్ కెరీర్‌పై వ్యాఖ్యలు : పాక్ బౌలర్ వివరణ
ఇస్లామాబాద్ : టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కెరీర్ తన వల్లే ముగిసిందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న పాకిస్తాన్ పేస్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. 2012లో పాకిస్తాన్లో భారత పర్యటన సందర్భంగా గంభీర్ వైట్ బాల్ కెరీర్‌కు తానే తెరిదించానని ఆయన ఇర్ఫాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గంభీర్‌ను టీమిండియా నుంచి తప్పించకమునుపు తాను అతడిని షార్ట్ బంతులు, బౌన్సర్లతో ఇబ్బందులు పెట్టానని చెప్పారు. ఈ టూర్లో ఇర్ఫాన్ రెండు సార్లు గంభీర్‌ను అవుట్ చేశాడు. గంభీర్ తన చివరి టీ20ని ఆ సిరీస్‌లోనే ఆడి ఆ తర్వాత టీ20లో ఎన్నడూ తిరిగి అడుగుపెట్టలేదు ఇక గంభీర్ 2013 జనవరిలో ఇంగ్లండ్‌పై తన చివరి వన్డే ఆడాడు. కాగా పాకిస్తాన్ స్పోర్ట్స్ ప్రెజంటర్ సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ గంభీర్‌పై చేసిన ప్రకటన గురించి వివరణ ఇచ్చారు. తన బౌన్సర్లను ఆడేందుకు గౌతం గంభీర్ చాలా ఇబ్బంది పడ్డాడని, తన సహజ సిద్ధమైన ఆటను ఆడలేకపోయాడని చెప్పాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో బాగా ఆడేవారిని హీరోలుగా చూస్తే..ఆడని వారిని జీరోలుగా చూస్తారని అన్నాడు. తన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో గంభీర్ తడబడ్డాడని, గంభీర్ సహజసిద్ధంగా ఆడలేకపోతున్నాడని ప్రతిఒక్కరూ అన్నారని క్రిక్ కాస్ట్ చాట్ షోలో ఇర్ఫాన్ వివరణ ఇచ్చారు. గంభీర్ పేలవ ప్రదర్శనతో అతడిని జట్టునుంచి తప్పించారని, ఆ తర్వాత ఆయన ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లో కూడా సరైన సామర్ధ్యం కనబర్చలేదని, అందుకే తాను అలా వ్యాఖ్యానించానని చెప్పారు. చదవండి : ‘ఆ తరహా క్రికెటర్ భారత్‌లో లేడు’ -
కూల్చివేతకు అనుమతి అవసరమా.. కాదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘భూమిని సిద్ధం చేయడం (ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్)’అన్న పదానికి స్పష్టమైన అర్థం చెప్పాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న నిర్మాణాలకు అనుమతి అవసరమా.. కాదా.. భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణాలు భూమిని సిద్ధం చేయడం అన్న అర్థానికి లోబడి ఉంటాయా లేదా అన్నది కూడా తెలపాలని సూచించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ లేదా ఇతర హైకోర్టులు భూమిని సిద్ధం చేయడం అన్న పదానికి ఏమైనా నిర్వచనం చెప్పాయా అన్నది కూడా పరిశీలించి చెప్పాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేతను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు ధర్మాసనం పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సచివాలయం కూల్చివేతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందలేదని, ఈ నేపథ్యంలో కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కూల్చివేతలకు అనుమతులు తీసుకోవాల్సిందేనని పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పలు సుప్రీంకోర్టు తీర్పులను, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనలను సమర్పించారు. నూతన భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉందని, కూల్చివేయడానికి అనుమతి అవసరం లేదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అసెస్మెంట్ అథారిటీ ఇచ్చిన నివేదికలను, పలు సుప్రీంకోర్టు తీర్పులను ధర్మాసనానికి సమర్పించారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం... గతంలో తాము లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఈ నివేదికలో స్పష్టమైన వివరణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ధర్మాసనం లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర పర్యావరణ విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారని, శుక్రవారంలోగా స్పష్టమైన వివరణ ఇస్తామని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు ధర్మాసనానికి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎన్జీటీ నోటీసులు... సచివాలయం భవనాల కూల్చివేత వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సచివాలయం భవనాల కూల్చివేతను సవాల్ చేస్తూ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హరిత ట్రిబ్యునల్ చెన్నై విభాగం జ్యుడీషియల్æ మెంబర్ జస్టిస్ కె.రామక్రిష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారించి ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రభావ అసెస్మెంట్ కమిటీలకు నోటీసులు జారీ చేసింది. -
‘వరల్డ్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహణపై...
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ నిర్వహణపై చైనా నుంచి మరింత స్పష్టత కోరినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో జరగాల్సిన ఈ టోర్నీకి చైనా ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 2022 వింటర్ ఒలింపిక్స్ (బీజింగ్) ట్రయల్స్ మినహా... షెడ్యూల్ చేసిన ఏ అంతర్జాతీయ టోర్నీకీ ఆతిథ్యమివ్వబోమని శుక్రవారం చైనా క్రీడా పరిపాలక మండలి ప్రకటించింది. దీంతో గ్వాంగ్జౌ వేదికగా డిసెంబర్ 16–20 వరకు జరగాల్సిన వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీపై సందిగ్ధత నెలకొంది. చైనా తాజా నిర్ణయంతో ఈ ఏడాది బ్యాడ్మింటన్ క్యాలెండర్‌పై ఎలాంటి ప్రభావం పడనుందనే అంశంపై చైనీస్ బ్యాడ్మింటన్ సంఘం (సీబీఏ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. వరల్డ్ ఫైనల్స్‌తో పాటు చైనా ఓపెన్ సూపర్–1000 ఈవెంట్ (సెప్టెంబర్ 15–20, చాంగ్జౌ), ఫుజు చైనా ఓపెన్ సూపర్–750 (నవంబర్ 3–8) టోర్నీలు కూడా చైనాలోనే జరుగనున్న నేపథ్యంలో వీటి భవిష్యత్‌పై కూడా బీడబ్ల్యూఎఫ్ వివరణ కోరింది. -
కరోనాకు ఆరోగ్యబీమా వర్తిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వైద్య పరీక్షలు ఉచితంగా అందించే అంశంపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలకు అనుసరిస్తున్న విధానాన్ని తెలపాలని కోరింది. కరోనా వైద్యానికి బీమా అమలుకు ఐఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసిందో లేదో స్పష్టత ఇవ్వాలని కూడా కోరింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ నివారణ వైద్యం ఉచితంగా అందజేయాలంటూ న్యాయవాది పి.తిరుమలరావు రాసిన లేఖను హై కోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి గురువా రం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణలోనూ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం అందజేయాలని కోరారు. వాదనల అనంత రం ధర్మాసనం పై విధంగా ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. -
కార్గో బస్సులపై నా ఫొటో వద్దు
సాక్షి, హైదరాబాద్: ‘సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై సీఎం కేసీఆర్ ఫొటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ యత్నాలను కేసీఆర్ తప్పుపట్టారు’అని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు వాడటం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అని సీఎం అన్నారు. బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు’ అని సీఎంవో పేర్కొంది. -
హస్తినకు ఎక్స్అఫీషియో పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తలెత్తిన ఎక్స్ అఫీషియో ఓటు వివాదం హస్తినకు చేరింది. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు ఎక్కడ ఓటు వేయాలనే విషయం పై దుమారం రేగింది. తమకు తెలంగాణ లో ఎక్స్ అఫీషియో ఓటు ఉందని ఇద్దరూ గట్టిగా వాదిస్తుండటంతో స్పష్టత కో రుతూ ఎస్ఈసీ రాజ్యసభ సెక్రటేరియట్ కు అధికారిక లేఖ రాసింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం ఏపీకి కేటాయించిన ఎంపీ కేకే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ పురపాలికలో ఎక్స్ అఫీషియో ఓటేయడం సరికాదంటూ కాంగ్రెస్, బీజేపీ అభ్యంతరం తెలిపాయి. సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మున్సిపాలిటీలో ఏపీకి చెందిన ఎంపీ కేవీపీని ఎక్స్అ ఫీషియో సభ్యుడిగా నమోదుచేశాక, దా నిని మొదట నేరెడుచర్ల మున్సిపల్ కమిష నర్ తిరస్కరించారు. ఈ అంశాన్ని కాంగ్రె స్ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో పా టు ఎస్ఈసీని ఆశ్రయించగా ఆయనకు అ క్కడ ఓటు హక్కు కల్పిస్తూ ఎస్ఈసీ ని ర్ణయం తీసుకుంది. మధ్యలో జాప్యంతో చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక మరుసటిరోజుకు వాయిదా పడింది. దీనిపై ఎస్ఈసీ అసంతృప్తి తెలపడంతో సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ బదిలీ, నేరెడుచర్ల ఇన్చార్జీ మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. నేరెడుచర్ల చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ మొదలయ్యాక కొత్తగా ఎమ్మెల్సీ శేరీ సుభాష్‌రెడ్డిని ఎక్స్ అఫీషియోసభ్యుడిగా చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. చివరకు ఈ ఎన్నికను ఆ పార్టీ బహిష్కరించడంతో కేవీపీ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. తెలంగాణకు కేవీపీ.. ఏపీకి కేకే కేవీపీని తెలంగాణకు, కేకేను ఏపీకి కేటాయించారని, తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన 2020 డైరీలోనూ, కేవీపీ తెలంగాణకు చెందుతారని రాజ్యసభ వెబ్సైట్లో ఉందని ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. తుక్కుగూడలో కేకే తమ ఓటుహక్కును వినియోగించుకోగా, కేవీపీ కూడా నేరెడుచర్లలో ఓటేసి ఉంటే వివాదం సంక్లిష్టంగా తయారై ఉండే దని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మున్సిపోల్స్ నిర్వహణ సరిగా లేదని అధికారపక్షానికి అనుకూలంగా ఎస్ ఈసీ వ్యవహరిస్తోందని కాంగ్రెస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌పార్టీ ఏకంగా కమిషనర్‌ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి కేవీపీ, కేకే ఎక్స్అఫీషియో సభ్యత్వాలపై ఎలాంటి వివరణ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
నా కూతురు హీరోయిన్ ఏంటి : వాణి విశ్వనాథ్
చెన్నై : ‘నా కుమార్తె హీరోయిన్’గా మారుతోందా..అబ్బే లేదండీ.. అది ఇంకా చిన్నపిల్ల.. అలాంటిది ఏదైనా ఉంటే నేనే చెబుతాగా అంటున్నారు ప్రముఖ సినీ నటి వాణీ విశ్వనాథ్. పిల్లల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా తల్లిదండ్రులు నడుచుకోవాలనేది నా సిద్ధాంతం. నా కుమార్తె ఆర్చా ప్రస్తుతం ప్లస్‌వన్ చదువుతూ డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ మధ్యలో తన మనసు మార్చుకుని నటిగా మారాలని భావిస్తే ఆ సంగతి నేనే సగర్వంగా ప్రకటిస్తాను కదా. అయితే వాణి విశ్వనాథ్ కుమార్తె నటిగా రంగప్రవేశం చేస్తోదంటూ ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వర్ష...వాస్తవానికి స్వయానా నా సోదరి శ్రీప్రియ కూతురు. వర్ష నా కుమార్తే అనుకుని అభిమానంతో ఎందరో నాకు ఫోన్లు చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. వర్ష కూడా నా కుమార్తెతో సమానమే. అందుకే నటిగా ఆమె ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవాలని, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని చెప్పారు వాణి విశ్వనాథ్. -
మురళి ఆత్మహత్యతో సంబంధం లేదు:ఎస్ఐ
సాక్షి, గన్నవరం: ఆత్మహత్యకు పాల్పడ్డ డిగ్రీ విద్యార్థి మురళిపై ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, అతడి ఆత్మహత్యతో ఎటువంటి సంబంధం లేదని గన్నవరం ఎస్ఐ నారాయణమ్మ తెలిపారు. మురళి ఆత్మహత్యపై ఎస్ఐ వివరణ ఇచ్చారు. మురళి ఓవర్ స్పీడ్‌తో రాంగ్ రూట్లో బైక్ నడపడంతోనే స్టేషన్‌కు పిలిచి మాట్లాడనని, ఎస్ఐ అయితే నాకేంటి అంటూ దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. ఇదే విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్ళానని చెప్పారు. చదువుకుంటూ టీ దుకాణం నడిపే మురళి తమకు ముందు నుంచి పరిచయస్తుడేనని, స్టేషన్‌కు పిలిచాం కానీ, ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదని ఎస్ఐ నారాయణమ్మ స్పష్టం చేశారు. తన భర్త కూడా ఎలాంటి హెచ్చరికలు కానీ, బెదిరించడం కానీ చేయలేదని ఆమె తెలిపారు. కాగా ఎస్ఐ నారాయణమ్మ వేధింపుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డిగ్రీ విద్యార్థి మురళి గన్నవరంలోని కోనాయిచెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి:నా చావుకు ఎస్ఐ వేధింపులే కారణం) -
గోల్డ్ స్కీమ్‌పై కేంద్రం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : నల్లధనం వెలికితీసేందుకు గతంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్) స్కీమ్ తరహాలో వ్యక్తుల వద్ద పరిమితికి మించి పోగుపడిన బంగారాన్ని కూడా స్వచ్ఛందంగా వెల్లడించే పథకాన్ని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెడుతుందని వచ్చిన వార్తలపై కేంద్రం వివరణ ఇచ్చింది. వ్యక్తులు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను స్వచ్ఛందంగా ప్రకటించే ఆమ్నెస్టీ స్కీమ్ వంటిదేమీ తమ ప్రతిపాదనలో లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ సన్నాహక ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో ఇలాంటి వార్తలు రావడం సాధారణమేనని కొట్టిపారేసింది. కాగా బంగారంపై నియంత్రణలు విధిస్తూ పరిమితికి మించిన బంగారం ఉంటే స్వచ్ఛందంగా వెల్లడించే పథకం త్వరలో ఖరారు కానుందని, గోల్డ్ బోర్డ్ ఏర్పాటవుతుందని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. రసీదులు లేకుండా కొనుగోలు చేసిన బంగారం విలువ మొత్తంపై పన్ను విధింపుపై కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. చదవండి : బంగారం ఎక్కువైతే... ఇత్తడైపోద్ది!! -
నార్త్ ఇండియన్స్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : నార్త్ ఇండియన్స్‌కు సరైన నైపుణ్యాలు లేవని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించడంతో తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల సందర్భం వేరని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రజల నైపుణ్యాలను పెంచేందుకు చేపడుతున్న చర్యలను వివరించే ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చారు. నైపుణ్యాలు లేనివారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు తగిన అర్హతలను వారికి అందించేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందనే కోణంలో తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఉపాధి అవకాశాలు కొరవడిన తీరుపై కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుతీరి వంద రోజులైన నేపథ్యంలో రాయ్‌బరేలిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉద్యోగాలు పెద్దసంఖ్యలో అందుబాటులో ఉన్నాయని అయితే నార్త్ ఇండియన్స్‌లో నైపుణ్యాలు లోపించడమే సమస్యని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చదవండి : నార్త్ ఇండియన్స్‌కు ఆ సత్తా లేదా..? -
‘ఆ వార్తలకు.. మాకు సంబంధం లేదు’
మణికర్ణిక చిత్రాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ వస్తున్న వార్తలకు, తమకు సంబంధం లేదంటున్నారు రాజ్‌పుత్ కర్ణిసేన సభ్యులు. ఝాన్సీ లక్ష్మీబాయ్ బయోపిక్‌గా తెరకెక్కిన మణికర్ణికలో కొన్ని సన్నివేశాలపై హిందూ సంస్థ కర్ణిసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై కర్ణిసేన సభ్యులు స్పందించారు. మనికర్ణిక సినిమాను తాము అడ్డుకోబోవడం లేదని స్పష్టం చేశారు కర్ణిసేన సభ్యుడు హిమాన్షు. ఈ సినిమా పట్ల తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపారు. కర్ణిసేన పేరును కొందరు స్వంత ప్రయోజనాలకు వాడుతున్నారన్నారు. ఇలాంటి పనికి మాలిన చర్యల ద్వారా.. కర్ణిసేన పేరును, దాని చరిత్రను చెడగొడుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కర్ణిసేన అభ్యంతరాల పట్ల కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజ్పుత్నేనంటూ.. అనవసరంగా తనను రెచ్చగొట్టవద్దంటూ హెచ్చరించారు. అయితే గతంలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన పద్మావత్‌ను కూడా కర్ణిసేన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకుల మధ్య విడుదలైన పద్మావత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. -
ఆస్తులమ్మి రుణాలు తీర్చేస్తాం : పీఎన్బీ
సాక్షి, ముంబయి : బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ రూ 11,400 కోట్ల కుంభకోణంతో నిండా మునిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సమస్యలను అధిగమించేందుకు వనరులను సమీకరించే పనిలో పడింది. ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలకు సరిపడా ఆస్తులున్నాయని ప్రభుత్వరంగ పీఎన్బీ పేర్కొంది. తమ బకాయిలను రాబట్టుకునేందుకు చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. కుంభకోణాన్ని బహిర్గతం చేయడం ద్వారా బకాయిల వసూలుకు ఉన్న మార్గాలను పీఎన్బీ మూసివేసిందన్న మోదీ వ్యాఖ్యలపై స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు బ్యాంక్‌ను వివరణ కోరాయి. ఫిబ్రవరి 14న రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా పీఎన్బీ నీరవ్ కుంభకోణం గురించి సమాచారం అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ స్కామ్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన అంశాన్ని స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లకు ఎందుకు సమాచారం అందించలేదనే ప్రశ్నలపై పీఎన్బీ వివరణ ఇచ్చింది. ఈ అంశాన్ని విచారించేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన క్రమంలో స్కామ్స్టర్ల పేర్లు బహిర్గతమైతే రికవరీ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని బ్యాంకు పేర్కొంది.