వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పార్కిన్‌సన్స్(వణుకు) వ్యాధి ఉందా.. వైట్‌హౌజ్‌కు న్యూరాలజీ డాక్టర్ పదే పదే ఎందుకు వస్తున్నాడు.. బైడెన్ పార్కిన్‌సన్స్ వ్యాధికి చికిత్స చేయడం కోసమేనా.. ఇలాంటి ప్రశ్నలు ఇటీవల అమెరికాలో చర్చనీయంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో జో బైడెన్ ఫిజీషియన్ డాక్టర్ కెవిన్ ఓ కానర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. వైట్‌హౌజ్‌కు తరచుగా న్యూరాలజిస్ట్ రావడంపై సోమవారం(జులై 8) ఒక అధికారిక లేఖ విడుదల చేశారు. ‘అధ్యకక్షుడు బైడెన్‌కు పార్కిన్‌సన్స్ వ్యాధి లేదు. ఆయన ఈ వ్యాధి కోసం ఎలాంటి చికిత్స తీసుకోవడం లేదు.
వైట్‌హౌజ్‌లో ఉండే వందలాది మంది సిబ్బంది ఎదుర్కొనే న్యూరలాజికల్ సమస్యలకు చికిత్స చేయడానికి న్యూరాలజిస్ట్ ఇటీవల వైట్‌హౌజ్‌కు ఎక్కువగా వస్తున్నారు. కరోనా తర్వాత వైట్‌హౌజ్ సిబ్బందిలో న్యూరాలజీ సమస్యలు పెరిగాయి’అని లేఖలో తెలిపారు.
కాగా, వృద్ధాప్యం రీత్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్ ఇటీవల ఎక్కువయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బైడెన్‌కు పార్కిన్‌సన్ లేదని ఆయన ఫిజీషియన్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. డెమొక్రాట్ల తరపున బైడెన్, రిపబ్లికన్ల నుంచి ట్రంప్ ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment