ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబయి : బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ రూ 11,400 కోట్ల కుంభకోణంతో నిండా మునిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) సమస్యలను అధిగమించేందుకు వనరులను సమీకరించే పనిలో పడింది. ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలకు సరిపడా ఆస్తులున్నాయని ప్రభుత్వరంగ పీఎన్‌బీ పేర్కొంది. తమ బకాయిలను రాబట్టుకునేందుకు చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. కుంభకోణాన్ని బహిర్గతం చేయడం ద్వారా బకాయిల వసూలుకు ఉన్న మార్గాలను పీఎన్‌బీ మూసివేసిందన్న మోదీ వ్యాఖ్యలపై స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లు బ్యాంక్‌ను వివరణ కోరాయి. ఫిబ్రవరి 14న రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా పీఎన్‌బీ నీరవ్ కుంభకోణం గురించి సమాచారం అందించిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ స్కామ్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన అంశాన్ని స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లకు ఎందుకు సమాచారం అందించలేదనే ప్రశ్నలపై పీఎన్‌బీ వివరణ ఇచ్చింది. ఈ అంశాన్ని విచారించేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన క్రమంలో స్కామ్‌స్టర్ల పేర్లు బహిర్గతమైతే రికవరీ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని బ్యాంకు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment