భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న ఏర్పాటు చేసిన డిన్నర్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మంది ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ డిన్నర్‌కు భారత్‌కు చెందిన బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారని, వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రముఖంగా ఉన్నారని ఆయా వార్తా కథనాల్లో పేర్కొన్నారు.
అయితే జీ20 డిన్నర్‌కు వ్యాపారవేత్తలకు ఆహ్వానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయా వార్తల్లో నిజం లేదని, ఈ డిన్నర్‌కు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలే కాదు.. ఏ వ్యాపారవేత్తలూ హాజరుకావడం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసింది.
‘జీ20 స్పెషల్ డిన్నర్‌కు ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు ప్రచురించిన రాయిటర్స్ వార్తా కథనం ఆధారంగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇవన్నీ అవాస్తవం. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఏ బిజినెస్ లీడర్‌ను డిన్నర్‌కు ఆహ్వానించలేదు’ అంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.
జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ ఏడాది జూలై 26న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాంప్లెక్స్‌ని ప్రారంభించారు.
సమ్మిట్ మొదటి రోజు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత మండపంలో గొప్ప విందును ఏర్పాటు చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సహా ప్రపంచ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు.
Media reports based on an article by @Reuters have claimed that prominent business leaders have been invited at #G20India Special Dinner being hosted at Bharat Mandapam on 9th Sep#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) September 8, 2023
✔️This claim is Misleading
✔️No business leaders have been invited to the dinner pic.twitter.com/xmP7D8dWrL
Comments
Please login to add a commentAdd a comment