PIB
-
బ్యాంక్ చెక్కుపై బ్లాక్ ఇంక్ నిషేధమా?: ఇదిగో క్లారిటీ..
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ''బ్యాంక్ చెక్కులను బ్లాక్ ఇంక్ (Black Ink)తో రాయకూడదు'' అని. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత? 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) నిజంగా ఈ ఆదేశాలను జారీ చేసిందా అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.బ్యాంక్ చెక్కులపై బ్లాక్ ఇంక్ ఉపయోగించకూడదని వస్తున్న వదంతుల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి ఎలాంటి ఆదేశాలను జారీచేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) పేర్కొంది. అంతే కాకుండా.. ఎలాంటి ఇంక్ వాడాలి అనేదానికి సంబంధించి తాజాగా ఎలాంటి ఆదేశాలు వెల్లడికాలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్నవి కేవలం పుకార్లు మాత్రమే. కాబట్టి బ్యాంకులు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ సంస్థలు కూడా బ్లాక్ ఇంక్ ఉపయోగించవచ్చని పీఐబీ వివరించింది.సాధారణంగా బ్లూ లేదా బ్లాక్ వాడొచ్చని చెబుతారు. ఎందుకంటే ఇవి రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. చదవడానికి కూడా బాగుంటుంది. చెక్కులపై, బ్యాంక్ సంబంధిత డాక్యుమెంట్లను రాయడానికి బ్లాక్ లేదా బ్లూ వాడొచ్చు. అయితే రెడ్ కలర్ లేదా ఎరుపు రంగు ఇంక్ వాడకం నిషేధం. ఎందుకంటే దీనిని అనధికారికంగా గుర్తిస్తారు. అంతే కాకుండా పెన్సిల్ లేదా తుడిచిపెట్టగలిగే వాటిని కూడా ఉపయోగించడం నిషేధం. ఎందుకంటే వీటిని చెరిపేసి.. మార్చేసే అవకాశం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్యాంక్ చెక్‌పై 'ఓన్లీ' అని ఎందుకు రాస్తారో తెలుసా?బ్యాంక్ చెక్ రాయడానికి బ్లాక్ ఇంక్ నిషేధం అనే వార్తను ఎవరూ నమ్మకండి. ఎందుకంటే ఆ వార్తలో నిజం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పీఐబీ వెల్లడించింది. ఏదైనా ఒక వార్తకు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా.. సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా మంచి పద్దతి కాదని పేర్కొంది.It is being claimed in social media posts that @RBI has issued new rules prohibiting the use of black ink on cheques.#PIBFactCheck▶️This claim is #FAKE▶️Reserve Bank of India has not prescribed specific ink colors to be used for writing cheques🔗https://t.co/KTZIk0dawz pic.twitter.com/vbL3LbBtFs— PIB Fact Check (@PIBFactCheck) January 17, 2025 -
సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్లలో ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.అయితే ఇది ఫేక్ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck✔️This message is #fake pic.twitter.com/kFVbGje5FB— PIB Fact Check (@PIBFactCheck) December 29, 2024 -
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఇన్స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.స్కామర్లు పంపించిన మెసేజ్‌లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/2J05G5jJZ8— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2024ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. -
ప్రతి పేద కుటుంబానికీ రూ.46,715.. నిజమేనా?
‘దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ ఇదీ వాట్సాప్‌లో విస్తృతంగా చలామణి అవుతోన్న ఓ సందేశం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. నిజమా.. ఫేకా అన్నది తేల్చేసింది.దేశంలో రోజుకో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చిన వార్తలను కొందరు అవగాహనలేని వాళ్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వార్త ఒకటి వాట్సాప్‌లో హల్ చల్ చేస్తోంది. దేశంలోని ప్రతి పేద కుంటుంబానికీ కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,715 ఆర్థికసాయం అందిస్తోందనేది దాని సారాంశం. అంతటితో ఆగకుండా వ్యక్తిగత వివరాలను కోరుతూ ఓ లింక్ సైతం అందులో ఉంది.ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనేది చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికార లింక్‌లలో వ్యక్తగత వివరాలను అందిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.A #WhatsApp message with a link claims to offer financial aid of ₹46, 715 to the poor class in the name of the Ministry of Finance and, is further seeking the recipient's personal details#PIBFactCheck✔️This message is #FAKE✔️@FinMinIndia has announced no such aid! pic.twitter.com/rFrYeBsbfd— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2024 -
ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ పెనాల్టీ! నిజమేనా?
ప్రస్తుతం దేశంలో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ న్యూస్‌కు సంబంధించిన అసలు నిజాన్ని చెప్పింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేసింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారంటూ కొన్ని వార్తల ద్వారా అపోహ వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్న పీఐబీ ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా తప్పుదారి పట్టించే వార్తలు మీ దృష్టికి వస్తే నిజం తెలుసుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. అటాంటి వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్బుక్ పోస్ట్ లేదా URLని వాట్సాప్ నంబర్ 8799711259లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి మెయిల్ చేయవచ్చు. -
ఓటేయకుంటే బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.350 కట్! నిజమేనా?
ఎన్నికల్లో ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 పెనాల్టీ కింద భారత ఎన్నికల సంఘం (ECI) కట్ చేస్తుందంటూ ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి హిందీ వార్తపత్రికలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఓటు వేయడాన్ని విస్మరించినవారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ అవుతుందని, సదురు వ్యక్తికి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తం కట్ చేస్తారని ఆ న్యూస్ క్లిప్పింగ్‌లో ఉంది. దీన్ని కొంత మంది విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయంటూ హెచ్చరిస్తున్నారు. (అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!) దీనిపై ప్రభుత్వ వార్తాసంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్‌చెక్ (pib fact check) విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ (fake news) అని తేల్చింది. గతంలోనే సర్కులేట్ అయిన ఈ ఫేక్ న్యూస్ మరోసారి ప్రచారంలోకి వచ్చిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్’(ట్విటర్) ద్వారా పేర్కొంది. కాగా ఈ వార్త ఓ హిందీ వార్తాపత్రికలో 2019లో ప్రచురితమైంది. హోలీ ప్రాంక్‌గా దీన్ని ప్రచురించారు. అయితే ఇది అప్పటి నుంచి అసలైన వార్తగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ 2021లోనే క్లారిటీ ఇచ్చింది. क्या लोकसभा चुनाव में मतदान नहीं किए जाने पर बैंक अकाउंट से कटेंगे 350 रुपए❓ जानें वायरल ख़बर की सच्चाई❕#PIBFactCheck: 🔶 यह ख़बर #फ़र्ज़ी है। 🔶 @ECISVEEP ने ऐसा कोई निर्णय नहीं लिया है। 🔶 जिम्मेदार नागरिक बनें, मतदान अवश्य करें!! 🔗 https://t.co/8EwXdkIPlF pic.twitter.com/ikFLUndfCh — PIB Fact Check (@PIBFactCheck) September 15, 2023 -
G20 Summit 2023: అంబానీ, అదానీలకు అందని ఆహ్వానం.. ఏం జరిగింది?
భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న ఏర్పాటు చేసిన డిన్నర్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మంది ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ డిన్నర్‌కు భారత్‌కు చెందిన బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారని, వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రముఖంగా ఉన్నారని ఆయా వార్తా కథనాల్లో పేర్కొన్నారు. అయితే జీ20 డిన్నర్‌కు వ్యాపారవేత్తలకు ఆహ్వానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయా వార్తల్లో నిజం లేదని, ఈ డిన్నర్‌కు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలే కాదు.. ఏ వ్యాపారవేత్తలూ హాజరుకావడం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసింది. ‘జీ20 స్పెషల్ డిన్నర్‌కు ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు ప్రచురించిన రాయిటర్స్ వార్తా కథనం ఆధారంగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇవన్నీ అవాస్తవం. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఏ బిజినెస్ లీడర్‌ను డిన్నర్‌కు ఆహ్వానించలేదు’ అంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ ఏడాది జూలై 26న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాంప్లెక్స్‌ని ప్రారంభించారు. సమ్మిట్ మొదటి రోజు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత మండపంలో గొప్ప విందును ఏర్పాటు చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సహా ప్రపంచ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. Media reports based on an article by @Reuters have claimed that prominent business leaders have been invited at #G20India Special Dinner being hosted at Bharat Mandapam on 9th Sep#PIBFactCheck ✔️This claim is Misleading ✔️No business leaders have been invited to the dinner pic.twitter.com/xmP7D8dWrL — PIB Fact Check (@PIBFactCheck) September 8, 2023 -
IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!
IT Refund Scam: ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు ఒక ఎత్తయితే.. రిఫండ్ రావడం మరో ఎత్తు. రిటర్న్స్ దాఖలు యుగియడంతో రీఫండ్ ప్రక్రియ కూడా షురూ అయింది. దీంతో తమ ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయిన రీఫండ్ ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. దీన్నే అవకాశంగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతారు. ఫేక్ మెసేజ్‌లతో పన్ను చెల్లింపుదారులు మభ్యపెట్టి, వారి ఖాతాలను ఖాళీ చేస్తున్న కొత్త స్కామ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐటీ రీఫండ్ మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని పీఐబీ హెచ్చరించింది. ఏమిటీ మెసేజ్ దీనిక థ కమామిష్ష ఏమిటో ఒకసారి చూద్దాం. ఇదీ స్కాం ఇటీవల కాలంలో చాలా మందికి ఈ తరహా మెసేజ్ లు వచ్చాయి “Dear Sir, You have been approved for an income tax refund of ₹15,490/-, the amount will be credited to your account shortly. Please verify your account number 5XXXXX6755. If this is not correct, please update your bank account information by visiting the link below’’ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? ఐటీ విభాగం నుంచి వచ్చిందని బావించి వెంటనే తప్పులో కాలేసారో, భారీ నష్టాల్ని మూటగట్టుకోవాల్సి ఉంది. (లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్: ప్రియురాలి కోసమేనా?) ఆదాయ పన్ను రీఫండ్ కు అనుమతి లభించింది. ఈ రీఫండ్ డైరెక్టుగా రావాలంటే.. బ్యాంక్ ఖాతాను అప్ డేట్ చేసుకోవాలి అంటే మనల్ని బురిడీ కొట్టిస్తారు. ఆ మెసేజ్ ను నమ్మి, వారు అడిగిన వివరాలను ఇవ్వకండి.ఎందుకంటే ఇది సైబర్ నేరస్తులకొత్త ఎత్తుగడ.వాస్తవానికి ఇలాంటి సందేశాలేవీ ఐటీ విభాగం పంపదు. ఇది నకిలీ మెసేజ్ అని, సైబర్ నేరస్తుల కొత్త తరహా మోసమని గుర్తించాలని పీఐబీ ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (గుడ్ న్యూస్: అమెరికా షాక్, దిగొస్తున్న పసిడి) A viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck ✔️ This claim is 𝐅𝐚𝐤𝐞. ✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message. ✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3gg — PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023 రీఫండ్ ఎలా వస్తుంది? ఐటీ రీఫండ్ అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులకు, సంబంధిత (వాలిడేషన్ సమయంలో ఇచ్చిన) బ్యాంక్ ఖాతాకు ఆ రీఫండ్ మొత్తం జమ అవుతుంది. బ్యాంక్ వివరాలను అప్ డేట్ చేయమని కానీ, బ్యాంక్ ఖాతా వివరాలను తెలపమని కానీ, ఓటీపీ, పిన్, పాస్ వర్డ్ వంటి రహస్య, వ్యక్తిగత వివరాలను వెల్లడించమని కానీ కోరుతూ ఐటీ విభాగం ఎలాంటి సందేశాలను పంపించదు అనేది గమనించాలి. రీఫండ్ ఎపుడు వస్తుంది? ఆదాయపు పన్ను వాపసు స్వీకరించడానికి పట్టే సమయం పూర్తిగా ఆదాయపు పన్ను శాఖ అంతర్గత ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, మీరు మీ రిటర్న్‌ను ఇ-ధృవీకరించిన తర్వాత 90 రోజులు. కానీ 7 నుండి 120 రోజులు పడుతుంది. రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేసేలి ఆదాయపు పన్ను శాఖ ఫిబ్రవరి 2021న కొత్త రీఫండ్ ప్రాసెసింగ్ సిస్టమ్‌ను అమలు చేసింది. ఎలా చెక్ చేసుకోవాలి? యూజర్ ID, పాస్వర్డ్, పుట్టిన తేదీ / ఇన్కార్పొరేషన్ తేదీ , క్యాప్చాతో ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి, రీఫండ్ స్టాటస్‌ను చెక్ చేసుకోవచ్చు. -
ఆ గుర్తు ఉన్న రూ. 500 నోట్లు ఫేక్? ఇదిగో క్లారిటీ..
సోషల్ మీడియాలో నిత్యం రకరకాల మెసేజ్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతి సందేశం నిజమైనది కాదు. అందులో చాలామటుకు ఫేక్ సందేశాలే ఉంటాయి. ఒక్కోసారి ఫేక్ మెసేజ్‌లతో చాలా మంది మోసపోతుంటారు. ప్రస్తుతం రూ. 500 నోట్ల గురించి అలాంటి ఫేక్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది. రూ. 500 నోటుపై ఉన్న సీరియల్ నంబర్లో స్టార్ (*) గుర్తు ఉంటే అలాంటి నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో - పీఐబీ (PIB) ఫాక్ట్ చెక్ ప్రకారం.. రూ. 500 నోటు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పు. అందులో ఉన్నట్లుగా స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి కావు. ఇదీ చదవండి ➤ Bank Holidays in August 2023: ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకుల మూత! సెలవుల జాబితా ఇదిగో.. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్బీఐ స్టార్ (*) గుర్తుతో ఉన్న నంబర్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టింది. కాబట్టి అలాంటి నోట్లు నకిలీవని వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దు. భారతీయ కరెన్సీకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. -
Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా?
బ్యాంక్ అకౌంట్లో నగదు బ్యాలెన్స్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ జారీ చేసిన రూల్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. బ్యాంకు ఖాతాలలో రూ. 30 వేల కంటే ఎక్కువ ఉంటే అటువంటి అకౌంట్లను క్లోజ్ చేస్తారన్నది దాని సారాంశం. అయితే ఆ వార్త ఫేక్ అని తేలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వార్త నిజం కాదని, ఆర్బీఐ అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని నిర్ధారించింది. హిందీలో ఉన్న ఆ వార్తను ట్విటర్లో షేర్ చేస్తూ అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: Rs 500 Notes: రూ.88 వేల కోట్లు మిస్సింగ్! ఏమయ్యాయి? ఇంటర్నెట్లో తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్ లో ఈ ఫ్యాక్ట్-చెకింగ్ విభాగాన్ని ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించి సర్క్యులేట్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు పీఐబీ పేర్కొంటోంది. एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck ▪️ यह ख़बर #फ़र्ज़ी है। ▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9 — PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023 -
Fact Check: కన్యా సుమంగళ యోజన, అమ్మాయిలకు నెలకు రూ.4500?
సాక్షి,ముంబై: కేంద్ర ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులకు ప్రయోజనాలు అంటూ పలు పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్‌గా మారి పోయింది. నిజా నిజాలతో సంబంధం లేకుండా యూజర్లు వీటిని షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పోస్ట్ ఒకటి హల్చల్ చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త పథకం ‘కన్యా సుమంగళ యోజన’ కింద ఆడబిడ్డలున్న కుటుంబాలకు నెలకు రూ.4,500 అందజేస్తుందనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. (లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సమంత! ధర ఎంతంటే?) కన్యా సుమంగళ యోజన కింద కుటుంబంలో కుమార్తె ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.4,500 స్టైఫండ్‌ను అందజేస్తోందని సర్కారీ వ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్ వీడియో అప్లోడ్ చేసింది. దీనిపై స్పందించిన పీఐబీ ఫాక్ట్ చెక్ టీమ్ అసలు విషయాన్ని ప్రకటించింది. ఇది నకిలీ వార్త అని కొట్టిపారేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకం దేన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీం తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. కాగా ప్రధానమంత్రి కన్యా సుమంగళ యోజన అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. రాష్ట్రంలోని బాలికల విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం 25 అక్టోబర్ 2019న లక్నోలో ప్రారంభించింది. 'Sarkari Vlog' नामक यूट्यूब चैनल के एक वीडियो में दावा किया गया है कि जिनके परिवार में बेटियां हैं उन्हें 'कन्या सुमंगला योजना' के तहत केंद्र सरकार हर महीने ₹4,500 दे रही है #PIBFactCheck ➡️ यह दावा फर्जी है ➡️ केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है | pic.twitter.com/D724QS7byI — PIB Fact Check (@PIBFactCheck) May 2, 2023 -
ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్!
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. మార్చి 31 సమీపిస్తుండటంతో పన్ను చెల్లింపుదారులు హడావుడి పడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 41,104 రీఫండ్ చేస్తున్నట్లు కొందరికి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ రీఫండ్ పొందడానికి వ్యక్తిగత వివరాలను సమర్పించాలని ఆ మెయిల్ ద్వారా కోరారు. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్‌బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! ‘ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఖాతా-ఆడిట్‌ను పూర్తి చేసింది. మీకు రూ. 41,101.22 రీఫండ్‌కు అర్హత ఉంది.. కానీ మీ వివరాలు కొన్ని తప్పుగా ఉన్నాయి. పరిశీలించి సరిచేసుకోండి’ అంటూ ఓ లింక్ ట్యాబ్‌ను అందులో ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, బెంగళూరు నుంచి ఆ ఈమెయిల్‌ను పంపుతున్నట్లు పేర్కొన్నారు. అది పూర్తిగా ఫేక్.. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చిన ఆ ఈమెయిల్ పూర్తిగా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( పీఐబీ) నిర్ధారించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ నుంచి అటువంటి ఈమెయిల్‌లను పంపలేదని తేల్చింది. An E-mail claims that the recipient is entitled to a refund of ₹41, 104, and is seeking his/her personal details in the name of @IncomeTaxIndia#PIBFactCheck ✔️This claim is fake ✔️Report such suspicious emails at 'webmanager@incometax.gov.in' pic.twitter.com/bWgJT7iNbo — PIB Fact Check (@PIBFactCheck) March 20, 2023 ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇలాంటి అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినప్పుడు webmanager@incometax.gov.in లో తెలియజేయవచ్చు. ఐటీ శాఖ ఇలా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగదు. అలాగే క్రెడిట్ కార్డ్‌లు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక ఖాతాల కోసం పిన్ నంబర్లు, పాస్వర్డ్లు వంటివి కోరుతూ మెయిల్ పంపదు. ఇలాంటి ఈమెయిల్ వచ్చినప్పుడు ఏమి చేయాలి? వాటికి స్పందించవద్దు. అటాచ్మెంట్లు మీ కంప్యూటర్‌కు హాని కలిగించే హానికరమైన కోడ్‌ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాటిని తెరవవద్దు. ఎలాంటి లింక్‌లపైనా క్లిక్ చేయవద్దు. ఒక వేళ మీరు లింక్‌లపై అనుకోకుండా క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్‌కు సంబంధించిన వివరాలను షేర్ చేయవద్దు. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ -
దేశంలోని నిరుద్యోగులకు మోదీ రూ.6,000 భృతి.. నిజమెంత?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి బేరోజ్గారి భత్తా యోజన కింద దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్రం ప్రతి నెల రూ.6,000 భృతిగా ఇస్తోందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన సందేశాలు వాట్సాప్‌లో చక్కర్లుకొడుతున్నాయి. కొందరైతే అప్లై చేసుకోవడానికి ఫేక్ లింకులు కూడా పెడుతున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా దీన్నే అదునుగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని ఆశజూపి అమాయకుల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తున్నారు. వెబ్సైట్ లింకులు పంపి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని వాటిని ఖాళీ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఈ వ్యవహారంపై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అసలు ఈ ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని ఇప్పటివరకు తీసుకురాలేదని చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిరోద్యగ భృతి సందేశాలు మొత్తం ఫేక్ అని తేల్చింది. వీటిని ఎవరూ నమ్మొద్దని, మోసపోవద్దని సూచించింది. एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा है कि प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत सरकार बेरोजगार युवाओं को हर महीने ₹6,000 का भत्ता दे रही है। #PIBFactCheck ▶️यह मैसेज फर्जी है। ▶️भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही। ▶️कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें। pic.twitter.com/w0mfOyEAMI — PIB Fact Check (@PIBFactCheck) February 20, 2023 చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే? -
పీఎం ముద్రా లోన్ కింద లక్ష రూపాయల రుణమా? నిజమా?
సాక్షి, ముంబై: సోషల్‌మీడియా వచ్చిన తరువాత అబద్దాలు, తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్ విస్తరణ బాగా పెరిగింది. వీటి పట్ల అప్రమత్తంగా ఉంటూ నిజానిజాలను ఫ్యాక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తాజాగా ముద్రా లోన్ స్కీం కింద లక్ష రూపాయల రుణం వస్తోందంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది.దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్‌ను ట్వీట్ చేసింది. ప్రధాన మంత్రి ముద్రా లోన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గురించిన లేఖ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. దీని ప్రకారం లోన్ అగ్రిమెంట్ ఫీజులో రూ. 1,750కి బదులుగా రూ. 1,00,000 రుణం అందింస్తోంది. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి వచ్చినదని, ఎన్ఆర్ఐ ఫండింగ్ స్కీమ్ కింద వడ్డీ రేటు 5 శాతం ఉంటుందని పేర్కొంది. అంతేకాదు పాక్షిక చెల్లింపులకు ఎటువంటి రుసుము ఉండదంటూ ఒక నకిలీ లేఖ వైరల్ అయింది. An approval letter claims to grant a loan of ₹1,00,000 under the 𝐏𝐌 𝐌𝐮𝐝𝐫𝐚 𝐘𝐨𝐣𝐚𝐧𝐚 on payment of ₹1,750 as loan agreement charges #PIBFactCheck ◾️This letter is #Fake. ◾️@FinMinIndia has not issued this letter. Read more: 🔗https://t.co/cQ5DW69qkT pic.twitter.com/jKXEKbYupe — PIB Fact Check (@PIBFactCheck) January 30, 2023 అయితే ఈ లేఖను ఫ్యాక్ట్ చెక్ చేసి, పూర్తిగా నకిలీదని పీఐబీ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అటువంటి సాయాన్ని దేన్నీ ప్రకటించలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి లేఖను జారీ చేయ లేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ నకీలీదంటూ ట్వీట్ చేసింది. -
రూ.2000, 500 నోట్లపై ఏమైనా రాస్తే చెల్లవా? ఇదిగో క్లారిటీ..
రూ.2000, 500, 200, 100 కరెన్సీ నోట్లపై పెన్నుతో లేదా పెన్సిల్‌తో ఏమైనా రాస్తే అవి చెల్లవని, ఆర్బీఐ మార్గదర్శకాల్లో ఇది ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది ఇదే నిజమే అని నమ్ముతున్నారు. అయితే ఈ విషయంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. 2000, 500 సహా అన్ని కరెన్సీ నోట్లపై ఏమైనా రాసినా అవి అన్ని బ్యాంకుల్లో చెల్లుతాయని చెప్పింది. దీన్ని ఎవరూ నమ్మవద్దని సూచించింది. అయితే పెన్ను లేదా పెన్సిల్‌తో నోట్లపై రాయడం వల్ల వాటి మన్నిక కాలం తగ్గే అవకాశం ఉందని, అందుకే సాధ్యమైనంత వరకు ఏమీ రాయవద్దని సూచించింది. కరెన్సీ నోట్లపై ఏమైనా రాసి ఉన్నా వాటిని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా 2020లోనే జారీ చేసింది. అయితే కొంతమంది ఈ విషయంపై అవగాహన లేక కరెన్సీ నోట్లపై ఏమైనా రాసి ఉంటే అవి చెల్లవేమో అని భయపడి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇవన్నీ అవాస్తవమని ట్విట్టర్లో పోస్టు చేసింది. Does writing anything on the bank note make it invalid❓#PIBFactCheck ✔️ NO, Bank notes with scribbling are not invalid & continue to be legal tender ✔️Under the Clean Note Policy, people are requested not to write on the currency notes as it defaces them & reduces their life pic.twitter.com/V8Lwk9TN8C — PIB Fact Check (@PIBFactCheck) January 8, 2023 ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం కరెన్సీ నోట్లపై పెన్ను, పెన్సిల్‌తో ఏమైనా రాసి ఉన్నా, సిరా మరకలు కన్పించినా అవి చెల్లుతాయి. వినియోగదారులు అవసరమైతే వీటీని తీసుకెళ్లి బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అలాగే నాణేలను కూడా ఇచ్చి కరెన్సీ నోట్లుగా తీసుకోవచ్చు. చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్ -
భారత్‌లో కోవిడ్ భయాలు: స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసిన కారణంగా త్వరలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ కూడా విధించే అవకాశం ఉందని వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వీటిపై స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఇదంతా నిరాధారమైన ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. స్కూళ్లు, కాలేజీలకు 15 రోజులు సెలవులు ప్రకటిస్తారనే బోగస్ వార్తలను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. వాస్తవాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ చేసి ట్విట్టర్లో పోస్టు చేసింది. మరోవైపు చలి తీవ్రత బాగా పెరగడంతో కాన్పూర్, నోయిడా లక్నో, బిహార్, జార్ఖండ్, పంజాబ్, ఢిల్లీలోని పలు పాఠశాలలను మూసివేశారు. పొగమంచు కారణంగా కొన్ని చోట్ల స్కూళ్ల సమయాన్ని మార్చారు. అంతేగానీ కరోనా కారణంగా సెలవులు ప్రకటించలేదు. చదవండి: భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా? सोशल मीडिया पर कई खबरों को शेयर करते हुए दावा किया जा रहा है कि #Covid19 के कारण देश में लॉकडाउन लगेगा और स्कूल/कॉलेज बंद रहेंगे। #PIBFactCheck ✅ ये सभी दावे फ़र्ज़ी हैं। ✅ कोविड से जुड़ी ऐसी किसी भी जानकारी को शेयर करने से पहले #FactCheck अवश्य करें। pic.twitter.com/jLcIeI9pBn — PIB Fact Check (@PIBFactCheck) January 4, 2023 -
వ్యాక్సిన్ తీసుకుంటే రూ.5 వేల రివార్డు! నిజమెంత..
ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది కేంద్రం. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్, రాష్ట్రాన్ని బట్టి కొంత మేర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశంలో 199.12 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇదిలా ఉంటే.. వాట్సాప్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 'కోవిడ్-19 టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం రూ.5వేలు రివార్డ్ అందిస్తోంది' అంటూ ఓ సందేశం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఆ మెసేజ్ హిందీలో ఉంది. అది 'ముఖ్యమైన సమాచారం.. ఎవరైతే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటారో వారికి ప్రధానమంత్రి సంక్షేమ నిధి నుంచి రూ.5వేలు అందుతాయి. ఈ అవకాశం జులై 30 వరకే. ' అని ఉంది. మరోవైపు.. తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలంటూ ఓ లింక్ సైతం ఏర్పాటు చేశారు. एक वायरल मैसेज में दावा किया जा रहा है कि जिन लोगों ने कोविड वैक्सीन लगवा ली है उन्हें एक ऑनलाइन फॉर्म भरने के बाद प्रधानमंत्री जन कल्याण विभाग द्वारा ₹5,000 प्रदान किए जा रहे हैं #PIBFactcheck: ▶️ इस मैसेज का दावा फर्जी है ▶️ कृपया इस फर्जी मैसेज को फॉरवर्ड न करें pic.twitter.com/AV8asQzexu — PIB Fact Check (@PIBFactCheck) July 12, 2022 ఫేక్‌న్యూస్‌ను వ్యాప్తి చేయొద్దు.. కరోనా వ్యాక్సిన్‌పై వాట్సప్‌లో వైరల్‌గా మారిన నేపథ్యంలో అది ఫేక్‌న్యూస్‌గా పీఐబీ ఫాక్ట్ చెక్ ద్వారా స్పష్టం చేసింది ప్రభుత్వం. అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని సూచించింది.' ఈ మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేసే ముందు అది పూర్తిగా ఫేక్‌న్యూస్‌గా మీరు గుర్తుంచుకోవాలి. కరోనా టీకా తీసుకున్నవారికి రూ.5వేలు రివార్డ్ అందుతుందనే వార్త పూర్తిగా తప్పు.' అని పీఐబీ ఫాక్ట్ చెక్ తెలిపింది. అందులో ఉండే లింక్‌పైన ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని, అలాంటి వాటితో సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది. ఇదీ చదవండి: మంత్రి మహిళను కొట్టాడని వీడియో షేర్ చేసిన బీజేపీ.. 48 గంటలు డెడ్‌లైన్ -
Fact Check: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..?
డిసెంబర్ 31 వరకు కేంద్ర ప్రభుత్వం భారత్ బంద్ ప్రకటించినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొందరు నిజమో కాదో అని తెలుసుకోకుండా ఇతరులకు ఈ పోస్టుని షేర్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఈ పోస్ట్ నకిలీదని స్పష్టం చేసింది. "సోషల్ మీడియాలో వైరల్ చిత్రంలో డిసెంబర్ 31 వరకు భారత్ బంద్ ప్రకటించినట్లు పేర్కొన్నారు! కానీ, ఏ లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదు. దయచేసి అటువంటి తప్పుదోవ పట్టించే చిత్రాలు లేదా సందేశాలను షేర్ చేయవద్దు" అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ ట్వీట్ చేసింది. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవతున్న సమయంలో ఈ నకిలీ సందేశం ప్రసారం అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కోరింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్సైట్. నిజనిర్ధారణ విషయాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది. सोशल मीडिया पर वायरल एक #फर्जी तस्वीर में दावा किया जा रहा है कि 31 दिसंबर तक भारत बंद का ऐलान कर दिया गया है! #PIBFactCheck ▶️ केंद्र सरकार द्वारा #लॉकडाउन के संबंध में ऐसी कोई घोषणा नहीं की गई है। ▶️ कृपया ऐसी भ्रामक तस्वीरों या संदेशों को साझा न करें। pic.twitter.com/BT1Tfxoebr — PIB Fact Check (@PIBFactCheck) December 23, 2021 (చదవండి: జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!) -
కోవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 కోట్లు
న్యూఢిల్లీ: కోవిడ్-19తో మృతి చెందిన 101 మంది జర్నలిస్టుల కుటుంబాలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5.05 కోట్లను సాయంగా మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూ ర్వకంగా సమాధానమిచ్చారు. కోవిడ్ బాధిత జర్నలిస్టుల కుటుంబాలను గుర్తించి, సాయం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా మన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖకు అందిన దరఖాస్తులకు జర్నలిస్ట్ సంక్షేమ పథకం(జేడబ్ల్యూఎస్) నిబంధనలకు లోబడి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశామన్నారు. చదవండి: Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ -
Fact Check: కేంద్రం మన ఫోన్ కాల్స్ రికార్డు చేస్తుందా?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ ఐటీ నిబంధనలకు సంబంధించి వాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ వాట్సాప్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. నూతన డిజిటల్ ఐటీ నిబంధనల వల్ల వాట్సాప్‌లో పంపే సందేశాలు, సంభాషణలు బయటివారికి తెలిసే అవకాశం ఉందని, తద్వారా తమ యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని వాట్సాప్ వాదిస్తుంది. అటు కేంద్రం మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. కొత్త డిజిటల్ ఐటీ నిబంధనలతో వినియోగదారుడి సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదని.. దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన యూజర్ల డేటాను అధికారులు అడిగితే తప్పకుండా ఇవ్వాల్సిందేనని పేర్కొంది. అయితే, ఇలా చేస్తే తమ యూజర్ల డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, కొత్త ఐటీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఒక పక్క ఇది ఇలా కొనసాగుతుంటే.. మరో పక్క ట్విటర్ మధ్య కూడా యుద్దం జరుగుతుంది. కొత్త ఐటీ చట్టంలో కొన్ని నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతుంది. సోషల్ మీడియా విషయంలో మాత్రం ఒక సందేశం తెగ వైరల్ అవుతుంది. వాట్సాప్ లో రెండు బ్లూ టిక్ లు, ఒక రెడ్ టిక్ వస్తే మీ మెసేజ్‌ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మీ కాల్స్, సందేశాలను రికార్డు చేస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. అలాగే, కేంద్రం మన ఫోన్ కాల్స్, మెసేజ్ లు రికార్డు చేస్తుందని. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్ యూజర్ల డేటాపై నిఘా ఉంచినట్లు మెసేజ్ లు వస్తున్నాయి. ప్రతి కదిలకను దేశం రికార్డు చేస్తుందని ఆ మెసేజ్ లో ఉంది. Do not fall for such #Whatsapp messages being circulated. No such thing is being done by the Government. However, everyone is advised to not share any false news/misinformation concerning #CoronavirusInIndia For authentic information follow @MoHFW_INDIA and @pib_India pic.twitter.com/XBErXb1CSP — PIB Fact Check (@PIBFactCheck) March 24, 2020 పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ వివరణ.. కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెసేజ్ చేయడం నేరం. అలా షేర్ చేసిన వారిని ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చని మెసేజ్‌లో పేర్కొన్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ స్పష్టతనిచ్చింది. ‘‘ఈ వార్తలు పూర్తిగా అబద్దం. అయితే, ఇతరులకు సందేశాలు పంపే క్రమంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. ఆ వార్త నిజమా? కాదా? చెక్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం” అని ట్వీట్ చేసింది. చదవండి: భారీగా వేలానికి బంగారం -
Fact Check: 5జీ టెస్టింగ్ వల్లే కోవిడ్ సెకండ్ వేవ్..!
న్యూఢిల్లీ: గతేడాది మొదలైన కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొద్ది రోజుల పాటు తెరపిచ్చినట్లు కనిపించినప్పటికి.. ఆ తర్వాత ప్రారంభమైన సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల బయట రోగులు బెడ్స్ కోసం నిరీక్షిస్తూ.. అలానే కళ్లు మూస్తున్నారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమయ్యి ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికి ఇంతవరకు కోవిడ్ వ్యాప్తి ఎక్కడి నుంచి మొదలైంది అనే దాని గురించి సరైన సమాచారం లేదు. మనతో సహా ప్రపంచ దేశాలన్ని చైనానే వైరస్‌ని భూమ్మీదకు వదిలిందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా సెకండ్ వేవ్‌కు సంబంధించి ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఏంటంటే.. 5జీ టెస్టింగ్ వల్లనే వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రారంభం అయ్యిందని.. పైగా దీన్ని టెస్ట్ చేసిన రాష్ట్రాలు యూపీ, బిహార్, మహారాష్ట్రలో భారీ సంఖ్యలో జనాలు మరణించారని ఆడియోక్లిప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై నిగ్గు తేల్చేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) రంగంలోకి దిగింది. వీటిలో వాస్తవమెంతో తేల్చేందుకు టెలికామ్ అధికారులను కలిసింది. ఈ వార్తలపై టెలికామ్ అధికారులు ఆదోళన వ్యక్తం చేశారు. ఇవన్ని పుకార్లని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తికి, 5జీ టెక్నాలజీకి సంబంధించిన పుకార్లపై టెలికాం పరిశ్రమ సంస్థ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఓఏఐ, టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (టీఏఐపీఏ) శుక్రవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కోవిడ్ కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణం అంటూ కొన్ని ప్రాంతీయా మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చక్కర్లు కొడుతున్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా స్పందించిందని.. 5 జీ టెక్నాలజీకి, కోవిడ్ -19 కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిందని సిఐఐఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. చదవండి: శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?! -
కరోనాతో చనిపోతే రూ.2లక్షలు వస్తాయా?
కరోనాతో ఎవరైనా మీ బందుమిత్రులలో మరణిస్తే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజెజెబీవై), ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన(పీఎంఎస్ బీవై) పథకాల కింద వారికి రెండు లక్షలు పరిహారం కేంద్రం ఇస్తున్నట్లు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో ఇలా ఉంది.. “కోవిడ్ -19 కారణంగా లేదా ఏదైనా కారణం చేత మీ దగ్గరి బంధువు/స్నేహితుల సర్కిల్లో ఎవరైనా మరణించినట్లయితే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఖాతా స్టేట్మెంట్ లేదా పాస్‌బుక్ ఎంట్రీని బ్యాంకులో అడగండి. ఖాతా స్టేట్మెంట్ లో ఈ మధ్యలో రూ.12 లేదా రూ.330 కట్ అయిందేమో గుర్తించండి, ఒకవేల కట్ అయితే వారు బ్యాంకుకు వెళ్లి రూ.2లక్షల కోసం బీమా క్లెయిమ్ చేసుకోండి". ప్రస్తుతం కోవిడ్ సంక్షోభంతో దేశం పోరాడుతున్న సమయంలో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ వార్తలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇది ఒకటి. దేశవ్యాప్తంగా పొదుపు బ్యాంకు ఖాతాలు గల పౌరులకు సరసమైన ప్రీమియంతో సామాజిక భద్రత కల్పించడానికి 2015లో ప్రభుత్వం ఈ రెండు పథకాలను జన ధన్ - జన్ సురక్ష యోజన కింద ప్రారంభించింది. కోవిడ్ మరణాలకు(కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే) పీఎంజెజెబీవై పథకం వర్తిస్తుందనేది నిజమే కానీ, పీఎంఎస్ బీవై కింద ప్రమాదవశాత్తు మరణం పొందిన లేదా 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి ప్రమాదంలో శాశ్వత వైకల్యం చెందితే రూ.2 లక్షల బీమా అందిస్తుంది. కోవిడ్ -19 మరణాలను ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ప్రమాదవశాత్తు మరణం కింద పరిగణించరు. ఇందులో చెప్పినట్టు పీఎంజెజెబీవై కింద ఉన్నవారు ఎవరైనా మరణిస్తే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే లభిస్తాయని, పీఎంఎస్ బీవై కింద లభించవు అని పీఐబి ఫాక్ట్ చెక్ పేర్కొంది. Claim: Kins of those who died of COVID-19 can claim insurance under Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) and Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)#PIBFactCheck: PMSBY doesn't cover COVID related deaths, while PMJJBY covers COVID deaths with certain conditions. pic.twitter.com/3g9AS4dVTe — PIB Fact Check (@PIBFactCheck) September 25, 2020 చదవండి: ఏటీఎం కార్డు పోతే ఇలా చేయండి..! -
పాత రూ.100 నోట్ల రద్దు: కేంద్రం క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: మార్చి-ఏప్రిల్ నాటికి పాత కరెన్సీ నోట్ల రూ.100, రూ.10, రూ.5ను చలామణి నుంచి శాశ్వతంగా తొలగిపోనున్నాయనే వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత వంద, పది, ఐదు రూపాయల నోట్లు రద్దు ఊహాగానాలను తప్పుడు నివేదికలుగా కొట్టిపారేసింది. మార్చి లేదా ఏప్రిల్ నాటికి రూ.100, రూ.10, రూ.5ల పాత సిరీస్ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోందని ఇటీవల కొన్ని నివేదికలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన చేయలేదని ట్వీట్ చేసింది. మరోవైపు ఆర్బీఐ ప్రతినిధి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. ఈ నోట్లను ఉపసంహరించుకునే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. (రూ.100 నోటు షాకింగ్ న్యూస్!) కాగా, ఒక సమావేశంలో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం) మహేష్ మాట్లాడుతూ ఆర్బీఐ త్వరలోనే పాత కరెన్సీ నోట్లు రూ.100, రూ.10, రూ.5 రద్దు చేయనుందని, ఈ నేపథ్యంలో 2021 మార్చి నుంచి ఈ నోట్లు చలామణిలో ఉండవని ప్రకటించారన్న వార్తలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. తాజా వివరణతో ఊరట లభించింది. एक खबर में दावा किया जा रहा है कि आरबीआई द्वारा दी गई जानकारी के अनुसार मार्च 2021 के बाद 5, 10 और 100 रुपए के पुराने नोट नहीं चलेंगे।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/WiuRd2q9V3 — PIB Fact Check (@PIBFactCheck) January 24, 2021 -
ఫ్యాక్ట్ చెక్: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా భారతీయ రైల్వే అన్ని సాధారణ పాసెంజర్ రైళ్లను ఆపివేసిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది మార్చి నుంచి కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే భారతీయ రైల్వే నడుపుతోంది. ఇదిలావుండగా, 2021 ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్యాసింజర్ రైళ్లు, లోకల్ రైళ్లు, స్పెషల్ రైళ్లు పనిచేయబోతున్నాయని ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై పీఐబీ ఫాక్ట్ చెక్ స్పందించింది.(చదవండి: ఇంట్లో నుంచే ఓటరు ఐడీ డౌన్లోడ్) ఈ సందేశం పూర్తిగా అబద్ధమని భారతీయ రైల్వే అటువంటి ప్రకటన చేయలేదని రైల్వే అధికారులతో పాటు పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫాక్ట్ చెక్ ట్వీట్ చేసింది. దేశంలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తున్నామని ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలతో చర్చించిన తర్వాతే సాధారణ రైళ్లపై నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ దేశ వ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. ప్రస్తుతం రైల్వే మొత్తం మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 65 శాతం రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. -
ప్రియాంక వీడియో: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా షేర్ చేసిన రైల్వే వీడియోపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇండియన్ రైల్వేకు చెందిన ఓ రైలుపై అదానీ గ్రూపుకు చెందిన స్టాంప్ ఉండటంపై వివరణ ఇచ్చింది. ‘‘ భారత ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్టాంపును ఇండియన్ రైల్వేకు చెందిన ఓ రైలుపై అంటించిందన్న వాదన తప్పుదారి పట్టించేదిలా ఉంది. ఆ స్టాంప్ రైల్వే శాఖ ఆదాయం పెంచడానికి వేసిన వ్యాపార ప్రకటన మాత్రమే’’ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబి) పేర్కొంది. కాగా, ప్రియాంక గాంధీ ఈ నెల 14న ఈ వీడియోను తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘భారత ప్రజల కష్టంతో నిర్మించబడ్డ ఇండియన్ రైల్వేలపై ప్రధాని మోదీ తన డబ్బున్న మిత్రుడు అదానీ స్టాంపులు వేస్తున్నారు. రేపటి రోజు ఇండియన్ రైల్వేలోని అధిక భాగం మోదీ డబ్బున్న స్నేహితులకు వెళ్లిపోతుంది. తాము మోదీ మిత్రుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు దేశ రైతులు వ్యవసాయాన్ని మానుకుని మరీ పోరాడుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియో పది వేల లైకులతో, దాదాపు 7 వేల షేర్లతో వైరల్‌గా మారింది. दावा: #फेसबुक पर एक वीडियो के साथ यह दावा किया जा रहा है कि सरकार ने भारतीय रेल पर एक निजी कंपनी का ठप्पा लगवा दिया है। #PIBFactCheck: यह दावा भ्रामक है। यह केवल एक वाणिज्यिक विज्ञापन है जिसका उद्देश्य केवल 'गैर किराया राजस्व' को बेहतर बनाना है। pic.twitter.com/vSmK8Xgdis — PIB Fact Check (@PIBFactCheck) December 16, 2020