కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో తీసుకొచ్చిన కొత్త డిజిటల్ ఐటీ నిబంధనలకు సంబంధించి వాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ వాట్సాప్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. నూతన డిజిటల్ ఐటీ నిబంధనల వల్ల వాట్సాప్‌లో పంపే సందేశాలు, సంభాషణలు బయటివారికి తెలిసే అవకాశం ఉందని, తద్వారా తమ యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని వాట్సాప్ వాదిస్తుంది. అటు కేంద్రం మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది.
కొత్త డిజిటల్ ఐటీ నిబంధనలతో వినియోగదారుడి సమాచారానికి ఎలాంటి ప్రమాదం ఉండదని.. దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన యూజర్ల డేటాను అధికారులు అడిగితే తప్పకుండా ఇవ్వాల్సిందేనని పేర్కొంది. అయితే, ఇలా చేస్తే తమ యూజర్ల డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, కొత్త ఐటీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఒక పక్క ఇది ఇలా కొనసాగుతుంటే.. మరో పక్క ట్విటర్ మధ్య కూడా యుద్దం జరుగుతుంది. కొత్త ఐటీ చట్టంలో కొన్ని నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతుంది.
సోషల్ మీడియా విషయంలో మాత్రం ఒక సందేశం తెగ వైరల్ అవుతుంది. వాట్సాప్ లో రెండు బ్లూ టిక్ లు, ఒక రెడ్ టిక్ వస్తే మీ మెసేజ్‌ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ మీ కాల్స్, సందేశాలను రికార్డు చేస్తున్నట్లు అర్ధం చేసుకోవాలని ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. అలాగే, కేంద్రం మన ఫోన్ కాల్స్, మెసేజ్ లు రికార్డు చేస్తుందని. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్ యూజర్ల డేటాపై నిఘా ఉంచినట్లు మెసేజ్ లు వస్తున్నాయి. ప్రతి కదిలకను దేశం రికార్డు చేస్తుందని ఆ మెసేజ్ లో ఉంది.
Do not fall for such #Whatsapp messages being circulated.
— PIB Fact Check (@PIBFactCheck) March 24, 2020
No such thing is being done by the Government.
However, everyone is advised to not share any false news/misinformation concerning #CoronavirusInIndia
For authentic information follow @MoHFW_INDIA and @pib_India pic.twitter.com/XBErXb1CSP
పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ వివరణ..
కొత్తగా అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెసేజ్ చేయడం నేరం. అలా షేర్ చేసిన వారిని ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చని మెసేజ్‌లో పేర్కొన్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ స్పష్టతనిచ్చింది. ‘‘ఈ వార్తలు పూర్తిగా అబద్దం. అయితే, ఇతరులకు సందేశాలు పంపే క్రమంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. ఆ వార్త నిజమా? కాదా? చెక్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం” అని ట్వీట్ చేసింది.
చదవండి: భారీగా వేలానికి బంగారం
Comments
Please login to add a commentAdd a comment